11-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మిమ్మల్ని సుఖ-శాంతుల ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, ప్రశాంతత అనేది శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంది’’

ప్రశ్న:-
ఈ యుద్ధ మైదానములో మాయ అన్నింటికంటే ముందుగా ఏ విషయముపై దాడి చేస్తుంది?

జవాబు:-
నిశ్చయముపై. నడుస్తూ-నడుస్తూ ఉండగా నిశ్చయాన్ని తెంచేస్తుంది, అందుకే ఓడిపోతారు. సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే తండ్రియే స్వయముగా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారని, వారే ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ఒకవేళ పక్కా నిశ్చయము ఉన్నట్లయితే ఇక ఎప్పుడూ మాయతో ఓడిపోలేరు.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని ఎవరి కోసము అంటారు? ఎలా తీసుకువెళ్తారు? ఇది ప్రపంచములోని వారికెవరికీ తెలియదు. బ్రాహ్మణ కుల భూషణులైన మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. వీరిలో ఎవరైతే ప్రవేశించారో వారు మనకు తన గురించి జ్ఞానాన్ని మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, వారు అందరి దుఃఖాన్ని హరించి అందరినీ సుఖమిచ్చేవారిగా తయారుచేస్తున్నారు. ఇది కొత్త విషయమేమీ కాదు. తండ్రి కల్ప-కల్పమూ వస్తారు, అందరికీ శ్రీమతాన్ని ఇస్తున్నారు. బాబా కూడా కల్పపూర్వము వారేనని, మనము కూడా కల్పపూర్వము వారిమేనని పిల్లలకు తెలుసు. పిల్లలైన మీకు ఈ నిశ్చయము ఉండాలి. తండ్రి అంటారు, నేను పిల్లలను సుఖధామానికి, శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. కానీ మాయ నిశ్చయము కూర్చోబెట్టనివ్వదు. సుఖధామానికి వెళ్తూ-వెళ్తూ ఉండగా మళ్ళీ ఓడించేస్తుంది. ఇది యుద్ధ మైదానము కదా. ఆ యుద్ధము బాహుబలముతో కూడినది, ఇది యోగబలము యొక్క యుద్ధము. యోగబలము చాలా ప్రసిద్ధి చెందినది, అందుకే అందరూ యోగము-యోగము అని అంటూ ఉంటారు. మీరు ఈ యోగాన్ని ఒకేసారి నేర్చుకుంటారు. ఇకపోతే వారంతా అనేక రకాల హఠయోగాలను నేర్పిస్తారు. తండ్రి ఏ విధంగా వచ్చి యోగాన్ని నేర్పిస్తారు అనేది వారికి తెలియదు. వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఓ పతిత-పావనా రండి, ప్రశాంతత ఉండే స్థానానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని ఏ తండ్రినైతే తలచుకుంటారో, ఆ తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశాంతత అనేది శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంటుంది. దుఃఖధామములో ప్రశాంతత ఎక్కడ నుండి వచ్చింది? ప్రశాంతత లేదు కాబట్టే కదా డ్రామానుసారముగా తండ్రి ఇక్కడికి వస్తారు, ఇది దుఃఖధామము. ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖము. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. ఎంత ధనవంతులైనా లేక ఇంకెవరైనా సరే, ఏదో ఒక దుఃఖము తప్పకుండా కలుగుతుంది. మనము మధురమైన తండ్రితోపాటు కూర్చుని ఉన్నామని, ఆ తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా రహస్యము కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు, మనల్ని వారితోపాటు తీసుకువెళ్తారు. తండ్రి ఆత్మలైన మనకు చెప్తున్నారు ఎందుకంటే వారు ఆత్మలైన మన తండ్రి కదా. దీని గురించే - ఆత్మలు మరియు పరమాత్మ బహుకాలము దూరముగా ఉన్నారు అన్న గాయనము ఉంది. శాంతిధామములో ఆత్మలందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు తండ్రి అయితే వచ్చారు, ఇంకా కొద్దిమంది ఆత్మలు ఎవరైతే పైన మిగిలి ఉన్నారో, వారు కూడా పై నుండి కిందకు వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇంటికి వెళ్ళడముతో మీరు మర్చిపోతారు. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయము. తండ్రి సర్వుల సుఖదాత, శాంతిదాత, వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు. మీకు తండ్రి పట్ల గుప్తమైన ప్రేమ ఉంది. మీరు ఎక్కడ ఉన్నా, బాబా మధుబన్ లో కూర్చున్నారు అని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటారు, నన్ను అక్కడ (మూలవతనములో) స్మృతి చేయండి. మీ నివాస స్థానము కూడా అదే, కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేస్తారు, వారిని - నీవే తల్లివి, తండ్రివి అని అంటారు. వారు తప్పకుండా ఇప్పుడు మీ వద్దకు వచ్చారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. రావణుడు మిమ్మల్ని పతితముగా, తమోప్రధానముగా తయారుచేశాడు, ఇప్పుడు సతోప్రధానముగా, పావనముగా అవ్వాలి. అక్కడికి పతితులు ఎలా వెళ్ళగలరు. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. ఇప్పుడు మనుష్యులు ఒక్కరు కూడా సతోప్రధానముగా లేరు. ఇది తమోప్రధాన ప్రపంచము. ఇది మనుష్యుల విషయమే. మనుష్యుల విషయములోనే సతోప్రధానము, సతో, రజో, తమో యొక్క రహస్యము అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజము. ఆత్మలైన మీరు మీ ఇంటిలో ఉండేవారు. అక్కడైతే అంతా పావన ఆత్మలే ఉంటారు. అపవిత్రమైనవారు అక్కడ ఉండలేరు. దాని పేరే ముక్తిధామము. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పావనముగా తయారుచేసి పంపిస్తారు. అప్పుడు మీరు పాత్రను అభినయించడానికి సుఖధామములోకి వస్తారు. సతో, రజో, తమోలలోకి మీరు వస్తారు.

బాబా, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా. సాధు-సన్యాసులు మొదలైనవారికెవరికీ ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది అనేది తెలియదు. సుఖ-శాంతుల యొక్క ప్రశాంతత మనకు ఎక్కడ లభిస్తుంది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా ఇప్పుడు మనకు 21 జన్మల కొరకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇకపోతే ఎవరైతే తర్వాతర్వాత వస్తారో, వారందరికీ ముక్తిని ఇవ్వడానికి వచ్చారు. ఎవరైతే ఆలస్యముగా వస్తారో వారి పాత్ర తక్కువగా ఉంటుంది. మీ పాత్ర అందరికన్నా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు, మనము 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు పూర్తి చేసాము. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. మొత్తము పాత వృక్షమంతా పూర్తి అవ్వనున్నది. ఇప్పుడు మీ ఈ గుప్తమైన ప్రభుత్వము, దైవీ వృక్షము యొక్క అంటు కడుతోంది. వాళ్ళు అడవి వృక్షాలకు అంట్లు కడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి ముళ్ళను మార్చి దైవీ పుష్పాల వృక్షాన్ని తయారుచేస్తున్నారు. అది కూడా ప్రభుత్వమే, అలాగే ఇది కూడా గుప్తమైన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వము వారు ఏమి చేస్తారు మరియు ఈ ప్రభుత్వము వారు ఏమి చేస్తారు! ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. వృక్షాల అంట్లు కడుతూ ఉంటారు, ఆ అడివి వృక్షాలు అయితే ఎన్నో రకాలవి ఉన్నాయి. కొందరు ఒక రకము వాటి అంటు కడతారు, కొందరు మరో రకము వాటి అంటు కడతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి మళ్ళీ దేవతలుగా తయారుచేస్తున్నారు. మీరు సతోప్రధాన దేవతలుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి తమోప్రధానముగా అయ్యారు. ఎవరైనా సదా సతోప్రధానముగా ఉండడమనేది జరగనే జరగదు. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్ళీ పాతదిగా అవుతుంది. మీరు 24 క్యారట్ల బంగారములా ఉండేవారు, ఇప్పుడు 9 క్యారట్ల బంగారము కల నగలా అయిపోయారు, మళ్ళీ 24 క్యారెట్ల బంగారములా తయారవ్వాలి. ఆత్మలు ఇలా తయారయ్యాయి కదా. బంగారము ఎలా ఉంటుందో నగ అలాగే ఉంటుంది. ఇప్పుడు అందరూ నల్లగా, నీలముగా అయిపోయారు. గౌరవాన్ని కాపాడేందుకు నలుపు అన్న పదానికి బదులుగా నీలము అని అంటారు. ఆత్మ సతోప్రధానముగా, పవిత్రముగా ఉండేది, ఆ తర్వాత ఎంత మాలిన్యము చేరింది. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అయ్యేందుకు బాబా యుక్తిని కూడా తెలియజేస్తున్నారు. ఇది యోగాగ్ని, దీని ద్వారానే మీలో కలిసిన మాలిన్యము తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేయాలి. నన్ను ఈ విధముగా స్మృతి చేయండి అని తండ్రి స్వయం చెప్తున్నారు. పతిత-పావనుడిని నేను. మిమ్మల్ని అనేక సార్లు నేను పతితము నుండి పావనముగా తయారుచేసాను. ఇది కూడా మీకు ఇంతకుముందు తెలియదు. ఈ రోజు మేము పతితముగా ఉన్నాము, రేపు మళ్ళీ పావనముగా అవుతాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. వాళ్ళు అయితే కల్పము ఆయువును లక్షల సంవత్సరాలు అని వ్రాసి మనుష్యులను ఘోర అంధకారములో పడేసారు. తండ్రి వచ్చి మంచి రీతిలో అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు - జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అయిన తండ్రి చదివిస్తున్నారు. మనుష్యులు భక్తి మార్గములో ఎంతగా మహిమను పాడుతారు కానీ దాని అర్థము వారికి ఏ మాత్రమూ తెలియదు. మహిమ పాడినప్పుడు అందరినీ కలిపి మహిమ చేస్తారు. కలగాపులగం చేసినట్లు చేసేస్తారు, ఎవరు ఏది నేర్పిస్తే అది కంఠస్థము చేసారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇప్పటివరకూ ఏదైతే నేర్చుకున్నారో, ఆ విషయాలన్నింటినీ ఇక మర్చిపోండి. జీవిస్తూ నాకు చెందినవారిగా అవ్వండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా యుక్తిగా నడుచుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారందరిది హఠయోగము. మీరు రాజయోగులు. ఇంటివారికి కూడా ఇటువంటి శిక్షణను ఇవ్వాలి. మీ నడవడికను చూసి ఫాలో చేసేలా ఉండాలి. ఎప్పుడూ పరస్పరము గొడవపడడము, కొట్లాడడము చేయకూడదు. ఒకవేళ మీరు గొడవపడితే మిగిలినవారంతా ఏమనుకుంటారు, వీరిలో చాలా క్రోధము ఉంది అని భావిస్తారు. మీలో ఏ వికారమూ ఉండకూడదు. మనుష్యుల బుద్ధిని భ్రష్టము చేసేది సినిమా, ఇది ఒక నరకము వంటిది. అక్కడికి వెళ్ళడముతోనే బుద్ధి భ్రష్టమైపోతుంది. ప్రపంచములో ఎంత అశుద్ధత ఉంది. ఒకవైపు ప్రభుత్వము చట్టాలు జారీ చేస్తూ ఉంటుంది - 18 సంవత్సరాల లోపు ఎవరూ వివాహము చేసుకోకూడదు అని, అయినా కానీ ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఒడిలో పిల్లలను కూర్చోబెట్టుకుని వివాహాలు చేయిస్తూ ఉంటారు. బాబా మనల్ని ఛీ-ఛీ ప్రపంచము నుండి తీసుకువెళ్తారని, మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నష్టోమోహులుగా అవ్వండి, కేవలము నన్ను స్మృతి చేయండి. కుటుంబ పరివారములో ఉంటూ నన్ను స్మృతి చేయండి. ఎంతోకొంత కష్టపడితేనే కదా విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు ఆసురీ గుణాలను వదిలేయండి. రోజూ రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఇది మీ వ్యాపారము. ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. ఒక్క సెకండులో పేదవారిని కిరీటధారులుగా తయారుచేస్తారు, ఇది ఇంద్రజాలము వంటిది కదా. ఇటువంటి ఇంద్రజాలికుడి చేతిని పట్టుకోవాలి కదా. వారు మనల్ని యోగబలము ద్వారా పతితము నుండి పావనముగా తయారుచేస్తారు. ఇంకెవ్వరూ అలా తయారుచేయలేరు. గంగా నది ద్వారా ఎవరూ పావనముగా అవ్వలేరు. పిల్లలైన మీలో ఇప్పుడు ఎంత జ్ఞానము ఉంది. బాబా మళ్ళీ వచ్చారు అని మీ లోపల సంతోషము ఉండాలి. దేవీలవి కూడా చిత్రాలు మొదలైనవి ఎన్ని తయారుచేస్తూ ఉంటారు, వారి చేతిలో ఆయుధాలను చూపించి వారిని భయంకరముగా తయారుచేస్తారు. బ్రహ్మాకు కూడా ఎన్ని భుజాలను చూపిస్తారు. బ్రహ్మాకు అయితే లక్షల భుజాలు ఉంటాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతమంది బ్రహ్మాకుమార, కుమారీలందరూ బాబా యొక్క ఉత్పత్తి కదా, కావున ప్రజాపిత బ్రహ్మాకు ఇన్ని భుజాలు ఉన్నాయి.

ఇప్పుడు మీరు రూప్ (యోగ స్వరూపులు) మరియు బసంత్ (జ్ఞాన స్వరూపులు). మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. జ్ఞాన రత్నాలు తప్ప వేరే ఏ మాట ఉండకూడదు. ఈ రత్నాలను ఎవరూ వెల కట్టలేరు. తండ్రి మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే దేవతలుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాసు -11-03-68

మీ వద్దకు ప్రదర్శనీ యొక్క ప్రారంభోత్సవాన్ని చేయడానికి పెద్ద-పెద్ద వారు వస్తారు. వారు ఏమనుకుంటారంటే - భగవంతుడిని పొందేందుకు వీరు ఈ మంచి మార్గాన్ని కనుగొన్నారు, ఏ విధంగా భగవంతుడిని ప్రాప్తి చేసుకునేందుకు సత్సంగాలు మొదలైనవి చేస్తారో, వేదాలను చదువుతారో, అలాగే వీరు కూడా ఈ మార్గాన్ని చేపట్టారు అని కేవలము ఈ మాత్రమే అర్థం చేసుకుంటారు. కానీ వీరిని భగవంతుడు చదివిస్తున్నారు అన్నది అర్థం చేసుకోరు. కేవలము మంచి కర్మలు చేస్తున్నారు, పవిత్రత ఉంది మరియు భగవంతునితో కలిపిస్తారు, ఈ దేవీలు మంచి మార్గాన్ని కనుగొన్నారు అని ఈ మాత్రమే అనుకుంటారు. ఎవరితోనైతే ప్రారంభోత్సవము చేయించడం జరుగుతుందో వారు తమను తాము చాలా ఉన్నతమైనవారిగా భావిస్తారు. కొందరు పెద్ద-పెద్దవారు బాబా గురించి ఏమనుకుంటారంటే - వీరు ఎవరో మహా పురుషుడు, వెళ్ళి వీరిని కలుసుకోవాలి అని. బాబా అంటారు - ముందు ఫార్మ్ ను నింపి పంపించండి. మొదటైతే పిల్లలైన మీరు వారికి తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వండి. పరిచయము లేకుండా వచ్చి ఏం చేస్తారు! మొదట ఎప్పుడైతే పూర్తి నిశ్చయము ఏర్పడుతుందో అప్పుడే శివబాబాను కలుసుకోగలరు. పరిచయము లేకుండా కలుసుకుని ఏం చేస్తారు! కొందరు షావుకార్లు వస్తారు, వారు - మేము వీరికి ఏదైనా ఇవ్వాలి అని భావిస్తారు. పేదవారు ఒక రూపాయి ఇస్తారు, షావుకారులు 100 రూపాయలు ఇస్తారు, పేదవారి ఒక్క రూపాయి విలువైనది అవుతుంది. ఆ షావుకారులైతే ఎప్పుడూ స్మృతి యాత్రలో యథార్థ రీతిలో ఉండలేరు, వారు ఆత్మాభిమానిగా అవ్వలేరు. మొదటైతే పతితము నుండి పావనముగా ఎలా అవ్వాలి, అది వ్రాసి ఇవ్వాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఇందులో ప్రేరణ మొదలైనవాటికి సంబంధించిన విషయమేదీ లేదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే తుప్పు వదిలిపోతుంది. ప్రదర్శనీ మొదలైనవి చూడడానికి వస్తారు, కానీ మళ్ళీ రెండు-మూడు సార్లు వచ్చి అర్థం చేసుకుంటే, అప్పుడు - వీరికి బాణము తగిలింది, వీరు దేవతా ధర్మానికి చెందినవారు, వీరు భక్తిని బాగా చేసారు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మంచిగా అనిపించినా కానీ లక్ష్యాన్ని పట్టుకోకపోతే వారు దేనికి పనికొస్తారు. డ్రామా నడుస్తూ ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఏదైతే నడుస్తూ ఉందో అందులో ఏం జరుగుతోంది అన్నది బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు! మీ బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరు ఏది చేసి ఉంటే అదే చేస్తారు. తండ్రి ఎవరి నుండైనా తీసుకోవటము లేక తీసుకోకపోవటము అనేది వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు సెంటర్లు మొదలైనవి తెరుచుకుంటాయి, ధనము ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీ ప్రభావము వెలువడుతుందో, అప్పుడిక ధనము ఏం చేసుకుంటారు! ముఖ్యమైన విషయము పతితము నుండి పావనముగా అవ్వడము. అది చాలా కష్టము, అందులో నిమగ్నమైపోవాలి. మనమైతే తండ్రిని స్మృతి చేయాలి. రోటీ తినాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. మొదట మేము తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తీసుకోవాలి అని భావిస్తారు. నేను ఆత్మను - మొదటైతే ఇది పక్కా చేసుకోవాలి. ఇటువంటివారు వెలువడినప్పుడు వేగవంతమైన పరుగును తియ్యగలరు. వాస్తవానికి పిల్లలైన మీరు మొత్తము విశ్వాన్ని యోగబలము ద్వారా పవిత్రముగా తయారుచేస్తారు కావున పిల్లలకు ఎంతగా నషా ఉండాలి. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. ఇక్కడ చదివించడము కూడా జరుగుతుంది మరియు పవిత్రముగా కూడా అవ్వవలసి ఉంటుంది, స్వచ్ఛముగా కూడా ఉండాలి. లోపల ఇంకే ఇతర విషయము గుర్తు ఉండకూడదు. అశరీరి భవ అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడకు మీరు పాత్రను అభినయించడానికి వచ్చారు. అందరూ తమ-తమ పాత్రను అభినయించవలసిందే. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మెట్లు వరుస చిత్రము గురించి కూడా మీరు అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యము ఉన్నదే పతితముగా, రామ రాజ్యము పావనమైనది. మళ్ళీ పతితము నుండి పావనముగా ఎలా అవ్వాలి, ఇటువంటి విషయాలలో రమిస్తూ ఉండాలి, దీనినే విచార సాగర మంథనము అని అంటారు. 84 జన్మల చక్రము స్మృతిలోకి రావాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. ఇది ఆత్మిక యాత్ర. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. ఆ దైహిక యాత్రల వలన ఇంకా వికర్మలు తయారవుతాయి. ఇదే తాయెత్తు, దీనిని అర్థం చేసుకున్నట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అని చెప్పండి. తాయెత్తును ధరించేదే దుఃఖము దూరమవ్వాలని.

అచ్ఛా! మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నష్టోమోహులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. కుటుంబ పరివారములో ఉంటూ విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. అవగుణాలను విడిచిపెడుతూ వెళ్ళాలి.

2. మీ నడవడికను ఏ విధంగా ఉంచుకోవాలంటే అది చూసి అందరూ ఫాలో చేయాలి. ఏ వికారము లోపల ఉండకూడదు, ఇది చెక్ చేసుకోవాలి.

వరదానము:-
డబుల్ సేవ ద్వారా అలౌకిక శక్తిని సాక్షాత్కారము చేయించే విశ్వ సేవాధారీ భవ

ఏ విధంగా తండ్రి స్వరూపమే విశ్వ సేవకుని స్వరూపమో, అలా మీరు కూడా తండ్రి సమానముగా విశ్వ సేవాధారులు. శరీరము ద్వారా స్థూల సేవ చేస్తూ మనసుతో విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండండి. ఒకే సమయములో తనువు మరియు మనసుతో కలిపి సేవ జరగాలి. ఎవరైతే మనసా మరియు కర్మణా, రెండు సేవలను కలిపి-కలిపి చేస్తారో, వారిని చూసేవారికి - వీరు ఒక అలౌకిక శక్తి అని అనుభవమవుతుంది లేక సాక్షాత్కారమవుతుంది. అందుకే ఈ అభ్యాసాన్ని నిరంతరం మరియు నేచురల్ చేసుకోండి. మనసా సేవ కొరకు విశేషముగా ఏకాగ్రతా అభ్యాసాన్ని పెంచండి.

స్లోగన్:-
సర్వుల విషయములో గుణ గ్రాహకులుగా అవ్వండి కానీ ఫాలో చేసే విషయములో బ్రహ్మా తండ్రిని ఫాలో చేయండి.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఇప్పుడు స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారముతో సత్యత ద్వారా ప్రత్యక్షతను చెయ్యండి. నోటి ద్వారా సత్యత యొక్క అథారిటీ స్వతహాగానే తండ్రి ప్రత్యక్షతను చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ బాంబు (సత్య జ్ఞానము) ద్వారా ధరణిని పరివర్తన చెయ్యండి. ఇందుకు సహజ సాధనము - సదా నోటిలో మరియు సంకల్పాలలో నిరంతర మాల సమానముగా పరమాత్మ స్మృతి ఉండాలి. అందరి లోపల ఒకటే ధ్వని ఉండాలి ‘‘నా బాబా’’. సంకల్పాలు, కర్మలు మరియు మాటలలో ఇదే అఖండమైన ధ్వని ఉండాలి, ఇదే నిరంతర జపము ఉండాలి. ఎప్పుడైతే ఇది నిరంతర జపముగా అవుతుందో అప్పుడు ఇతర విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి.