11-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు సంపూర్ణముగా అవ్వాలి ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి మరియు మళ్ళీ పావన ప్రపంచములోకి రావాలి’’

ప్రశ్న:-
సంపూర్ణ పావనముగా అయ్యేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
సంపూర్ణ పావనముగా అవ్వాలంటే పూర్తి బికారులుగా అవ్వండి, దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చిపోండి మరియు నన్ను స్మృతి చేయండి, అప్పుడు పావనముగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనమవ్వనున్నది, అందుకే ధనము, సంపద, వైభవాలు మొదలైనవన్నీ మరచి బికారులుగా అవ్వండి. ఇటువంటి బికారులే యువరాజులుగా అవుతారు.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట్లో ఆత్మలన్నీ పవిత్రంగా ఉండేవి అని పిల్లలు ఈ విషయాన్ని అయితే మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. మనమే పావనముగా ఉండేవారము, పతితము మరియు పావనము అని ఆత్మను గురించే అనడం జరుగుతుంది. ఆత్మ పావనముగా ఉన్నప్పుడు సుఖము ఉంటుంది. మేము పావనముగా అయినట్లయితే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతామని బుద్ధిలోకి వస్తుంది, దీని కోసమే పురుషార్థము చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచము ఉండేది, అందులో అర్ధకల్పం మీరు పావనముగా ఉండేవారు, ఇక మిగిలిన అర్ధకల్పం ఉంటుంది. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. పతితము మరియు పావనము, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రి సగం-సగం ఉంటాయని మీకు తెలుసు. ఎవరైతే మంచి వివేకవంతులు ఉంటారో, చాలా భక్తి చేసి ఉంటారో, వారే బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీరు పావనముగా ఉండేవారు, కొత్త ప్రపంచములో కేవలం మీరు మాత్రమే ఉండేవారు. ఇక మిగిలిన వారెవరైతే ఉన్నారో వారంతా శాంతిధామంలో ఉండేవారు. మొట్టమొదట మనం పావనముగా ఉండేవారము మరియు చాలా కొద్దిమందే ఉండేవారము, మళ్ళీ నంబరువారుగా మనుష్య సృష్టి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలైన మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తారు. దీనిని సంగమము అని అంటారు, దీనినే కుంభము అని అంటారు. మనుష్యులు ఈ సంగమయుగాన్ని మర్చిపోయారు. నాలుగు యుగాలు ఉంటాయని, ఐదవది ఈ చిన్నని లీప్ యుగమైన సంగమయుగమని బాబా అర్థం చేయించారు. దీని ఆయువు తక్కువ. తండ్రి అంటారు - నేను వీరి వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను, అది కూడా అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమములో ప్రవేశిస్తాను, ఇది పిల్లలకు ఇచ్చే పాలన కదా. తండ్రి వీరిలోకి ప్రవేశించారు, వీరి చరిత్రను కూడా వినిపించారు. తండ్రి అంటారు - నేను ఆత్మలతోనే మాట్లాడతాను. ఆత్మకు మరియు శరీరానికి, రెండింటికీ కలిపి పాత్ర ఉంటుంది. వీరినే జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ. సత్యయుగములో చాలా కొద్దిమంది దేవీ-దేవతలే ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలమైన మేము సత్యయుగములో పావనముగా ఉండేవారము, మేమే మళ్ళీ 84 జన్మల తర్వాత పతితముగా అయ్యామని స్వయం గురించి కూడా చెప్పుకుంటారు. పతితము నుండి పావనము, పావనము నుండి పతితము - ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్మృతి కూడా ఆ పతిత-పావనుడైన తండ్రినే చేస్తారు. కావున ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా ఒక్క సారే వస్తారు, వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే, తప్పకుండా వారే పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేస్తారు. మళ్ళీ కొత్తదానిని పాతదిగా ఎవరు తయారుచేస్తారు? రావణుడు, ఎందుకంటే రావణుడే దేహాభిమానులుగా చేస్తాడు. శత్రువును కాలుస్తారే కానీ మిత్రుడిని కాల్చరు. సర్వులకూ మిత్రుడు ఒక్క తండ్రియే, వారు సర్వులకు సద్గతిని ఇస్తారు. వారిని అందరూ స్మృతి చేస్తారు, ఎందుకంటే వారే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. మరి అలాంటప్పుడు తప్పకుండా దుఃఖాన్ని ఇచ్చేవారు కూడా ఎవరో ఉంటారు, అతడే పంచ వికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము. స్వస్తికను గీస్తారు కదా. దీని అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో పూర్తిగా 4 భాగాలుంటాయి. కొద్దిగా కూడా ఎక్కువ, తక్కువ ఉండదు. ఈ డ్రామా చాలా ఏక్యురేట్. కొందరు - మేము ఈ డ్రామా నుండి బయటకు వెళ్ళిపోవాలి, చాలా దుఃఖముతో ఉన్నాము, దీని కన్నా వెళ్ళి జ్యోతి జ్యోతిలో కలిసిపోవడమో లేక బ్రహ్మములో లీనమవ్వడమో మంచిది అని భావిస్తారు. కానీ, ఎవ్వరూ అలా వెళ్ళలేరు. ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. భక్తి మార్గములో రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సన్యాసులు శరీరాన్ని వదిలినప్పుడు, వారు స్వర్గములోకి లేక వైకుంఠములోకి వెళ్ళారని ఎప్పుడూ చెప్పరు. ప్రవృత్తి మార్గము వారు, ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని చెప్తారు. ఆత్మలకు స్వర్గము గుర్తుంది కదా. మీకైతే అందరికన్నా ఎక్కువగా గుర్తుంది. మీకు రెండింటి చరిత్ర-భౌగోళికముల గురించి తెలుసు, అది ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు, తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని రహస్యాలనూ అర్థం చేయిస్తారు.

ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. వృక్షానికి తప్పకుండా బీజము కూడా ఉండాలి. పావన ప్రపంచము ఎలా పతితముగా అవుతుంది, మళ్ళీ వారు వచ్చి ఎలా పావనముగా తయారుచేస్తారు అన్నది తండ్రే అర్థం చేయిస్తారు. పావన ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. స్వర్గము గతించిపోయింది, అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవ్వనున్నది, అందుకే ప్రపంచము యొక్క చరిత్ర రిపీట్ అవుతుంది అని అంటారు అనగా ప్రపంచమే పాతది నుండి కొత్తదిగా, కొత్తది నుండి పాతదిగా అవుతుంది. రిపీట్ అవ్వడము అంటేనే డ్రామా. ‘డ్రామా’ అన్న పదము చాలా బాగుంటుంది, శోభిస్తుంది. చక్రము అచ్చంగా అలాగే తిరుగుతూ ఉంటుంది. నాటకమును అచ్చంగా అలాగే రిపీట్ అవుతుంది అని అనరు. పాత్రధారులెవరైనా అనారోగ్యంపాలు అయితే వారు సెలవు తీసుకుంటారు. కావున పిల్లలైన మీ బుద్ధిలో ఉంది - మనమే పూజ్య దేవతలుగా ఉండేవారము, మళ్ళీ పూజారులుగా అయ్యాము. తండ్రి వచ్చి పతితము నుండి పావనముగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు, ఇది 5000 సంవత్సరాల క్రితం కూడా తెలియజేసారు. వారు కేవలం - పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని మాత్రమే చెప్తారు. తండ్రి మొట్టమొదట మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. మొట్టమొదట ఈ పాఠాన్ని ఇస్తారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా మీకు స్మృతిని కలిగిస్తాను, అయినా మీరు మర్చిపోతారు! ఎప్పటివరకైతే డ్రామా అంతిమానికి రాదో అప్పటివరకూ మర్చిపోతూనే ఉంటారు. అంతిమములో ఎప్పుడైతే వినాశన సమయం వస్తుందో అప్పుడు చదువు పూర్తవుతుంది, అప్పుడు మీరు శరీరాన్ని వదిలేస్తారు. సర్పం కూడా తన పాత కుబుసాన్ని వదిలేస్తుంది కదా. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు - మీరు ఎప్పుడైతే కూర్చుంటారో, లేక నడుస్తూ-తిరుగుతూ ఉంటారో, అప్పుడు దేహీ-అభిమానులుగా అయి ఉండండి. ఇంతకుముందు మీకు దేహాభిమానం ఉండేది. ఇప్పుడు తండ్రి అంటారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానంలోకి రావడం వలన మిమ్మల్ని పంచ వికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన ఏ వికారాలు పట్టుకోవు. దేహీ-అభిమానులుగా అయి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మలకు ఈ సంగమయుగములో పరమాత్మ అయిన తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది. దీనిని కళ్యాణకారీ సంగమము అని అంటారు, ఈ సమయములోనే తండ్రి మరియు పిల్లలు వచ్చి కలుసుకుంటారు. ఆత్మలైన మీరు కూడా శరీరములో ఉన్నారు. తండ్రి కూడా శరీరములోకి వచ్చి మీకు ఆత్మ అన్న నిశ్చయాన్ని కలిగిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు, అప్పుడే అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళాలి. నేను మిమ్మల్ని ఎలా తిరిగి తీసుకువెళ్తాను అన్నది కూడా అర్థం చేయిస్తాను. మేమందరమూ పతితులము, మీరు పావనులు, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరు అంటారు కూడా. బాబా ఎలా పావనంగా తయారుచేస్తారు అన్నది పిల్లలైన మీకు తెలియనే తెలియదు. ఎప్పటివరకైతే వారు అలా తయారుచేయరో, అప్పటివరకూ ఎలా తెలుసుకోగలరు. ఆత్మ చిన్నని నక్షత్రము వంటిది అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి కూడా చిన్నని నక్షత్రము వంటివారు. కానీ వారు జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. వారు మిమ్మల్ని కూడా తన సమానముగా తయారుచేస్తారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఉంది, దీనిని మీరు అందరికీ అర్థం చేయిస్తారు. మీరు సత్యయుగములో ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారా? లేదు. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే, వారు మిమ్మల్ని ఇప్పుడే చదివిస్తారు. జీవిత గాథ అయితే అందరిదీ తెలియాలి కదా. దానిని తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు ఘడియ-ఘడియ మర్చిపోతారు, మీకు మాయతో యుద్ధము జరుగుతుంది. బాబాను మేము స్మృతి చేస్తున్నాము, మళ్ళీ మర్చిపోతున్నాము అని మీరు ఫీల్ అవుతారు. తండ్రి అంటారు, మాయనే మీ శత్రువు, అది మిమ్మల్ని మరిపింపజేస్తుంది అనగా తండ్రి నుండి విముఖులుగా చేస్తుంది. పిల్లలైన మీరు ఒక్కసారి మాత్రమే తండ్రి సమ్ముఖములోకి వస్తారు. తండ్రి ఒక్కసారే వారసత్వాన్ని ఇస్తారు. ఇక ఆ తర్వాత తండ్రి సమ్ముఖముగా రావలసిన అవసరమే ఉండదు. పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా, స్వర్గానికి అధిపతులుగా తయారుచేస్తారు, అంతే, ఇక ఆ తర్వాత వారు వచ్చి ఏమి చేస్తారు. మీరు పిలిచారు మరియు నేను ఖచ్చితంగా సరైన సమయానికి వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను నా సమయానికి వస్తాను, ఇది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు, వారు ఏమి చేసారు? అది ఎవ్వరికీ తెలియదు, అందుకే శివరాత్రికి సెలవు మొదలైనవేవీ ఇవ్వరు. మిగిలినవాటన్నింటికీ సెలవు ఇస్తారు, కానీ శివబాబా వస్తారు, ఇంతటి పాత్రను అభినయిస్తారు, కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. దాని అర్థమే తెలియదు. భారత్ లో ఎంతటి అజ్ఞానం ఉంది.

శివబాబాయే ఉన్నతోన్నతమైనవారని, కావున తప్పకుండా మనుష్యులను ఉన్నతోన్నతంగా తయారుచేస్తారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు - నేను వీరికి జ్ఞానము ఇచ్చాను, యోగము నేర్పించాను, ఆ తర్వాత వారు నరుడి నుండి నారాయణుడిగా అయ్యారు. వారు ఈ జ్ఞానాన్ని విన్నారు. ఈ జ్ఞానము మీ కోసమే ఉంది, ఇంకెవ్వరికీ ఇది శోభించదు. మీరు మళ్ళీ అలా తయారవ్వాలి, ఇంకెవ్వరూ అలా తయారవ్వరు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. ఎవరైతే ఇతర ధర్మాలను స్థాపించారో, వారంతా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు, మళ్ళీ వారంతా సతోప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారంగానే మళ్ళీ రిపీట్ చేయాలి. ఉన్నతమైన పాత్రధారులుగా అయ్యేందుకు మీరు ఎంత పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం ఎవరు చేయిస్తున్నారు? బాబా. మీరు ఉన్నతంగా అవుతారు, ఇక తర్వాత ఎప్పుడూ స్మృతి కూడా చేయరు. స్వర్గములో ఏమైనా స్మృతి చేస్తారా. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, వారు తయారుచేయడం కూడా ఉన్నతంగానే తయారుచేస్తారు. నారాయణుడి కన్నా ముందు శ్రీకృష్ణుడు ఉన్నారు, మరి మీరు నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అని ఎందుకు అంటారు? నరుని నుండి కృష్ణునిగా అవ్వాలి అని ఎందుకు అనరు? మొదటే నారాయణుడిగా ఏమైనా తయారవుతారా? మొదటైతే యువరాజైన శ్రీకృష్ణుడిగానే అవుతారు కదా. బాల్యములోనైతే పుష్పము వలె ఉంటారు, వారే తర్వాత యుగళ్ గా అవుతారు. మహిమ బ్రహ్మచారికే ఉంటుంది. చిన్న పిల్లలను సతోప్రధానమైనవారని అంటారు. మేము మొట్టమొదట తప్పకుండా యువరాజులుగా అవుతాము అని పిల్లలైన మీకు ఆలోచన రావాలి. బికారి నుండి యువరాజు అన్న గాయనము కూడా ఉంది. బికారి అని ఎవరిని అంటారు? ఆత్మనే శరీరముతోపాటు బికారి లేదా షావుకారు అని అంటారు. ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు, అందరూ అంతమైపోతారు. మీరు ఈ సమయంలోనే శరీరం సహితంగా బికారులుగా అవ్వాలి. డబ్బు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మ బికారిగా అవ్వాలి, అన్నింటినీ విడిచిపెట్టాలి. మళ్ళీ యువరాజుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవాటన్నింటినీ వదిలి, బికారులుగా అయి మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. మళ్ళీ కొత్త ప్రపంచములోకి యువరాజులుగా అయి వస్తాము. ఏదైతే ఉందో, దానినంతటినీ వదిలేయాలి. ఈ పాత వస్తువులు ఎందుకూ పనికి రావు. ఆత్మ పవిత్రముగా అవుతుంది, మళ్ళీ కల్పపూర్వము వలె పాత్రను అభినయించడానికి ఇక్కడకు వస్తుంది. ఎంతెంతగా మీరు ధారణ చేస్తారో, అంతటి ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయములో ఎవరి వద్దనైనా 5 కోట్లు ఉన్నా, అదంతా సమాప్తమైపోతుంది. మనం మళ్ళీ మన కొత్త ప్రపంచములోకి వెళ్తాము. ఇక్కడకు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళడానికి వచ్చారు. మేము కొత్త ప్రపంచము కోసం చదువుకుంటున్నాము అని భావించే సత్సంగాలు ఇంకేవీ లేవు. బాబా మమ్మల్ని మొదట బికారులుగా తయారుచేసి, ఆ తర్వాత యువరాజులుగా తయారుచేస్తారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దేహపు సర్వ సంబంధాలను విడిచిపెట్టినట్లయితే బికారులుగా అయినట్లే కదా. అసలు ఏమీ లేనే లేదు. ఇప్పుడు భారత్ లో ఏమీ లేదు. భారత్ ఇప్పుడు బికారిగా, దివాలాకోరుగా ఉంది, మళ్ళీ సుసంపన్నంగా అవుతుంది. అలా ఎవరు తయారవుతారు? ఆత్మయే శరీరము ద్వారా తయారవుతుంది. ఇప్పుడు రాజు-రాణి కూడా లేరు. వారు కూడా దివాలా తీసారు, రాజు-రాణి యొక్క కిరీటము కూడా లేదు. పవిత్రతా కిరీటమూ లేదు, రత్నజడిత కిరీటమూ లేదు, ఇది అంధకార నగరంగా ఉంది, సర్వవ్యాపి అని అంటారు, అనగా అందరిలోనూ భగవంతుడు ఉన్నారని, అందరూ సమానమేనని, కుక్క-పిల్లి అన్నింటిలోనూ వారు ఉన్నారని అంటారు... దీనినే అంధకార నగరమని అంటారు... బ్రాహ్మణులైన మీ రాత్రి ఉండేది. జ్ఞానమనే పగలు వస్తుందని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో అందరూ వెలిగే జ్యోతులుగా ఉంటారు. ఇప్పుడు దీపము పూర్తిగా ప్రకాశము లేకుండా అయిపోయింది. భారత్ లోనే దీపాన్ని వెలిగించే ఆచారము ఉంది, ఇంకెవ్వరూ దీపాన్ని వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోయి ఉంది. సతోప్రధానముగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఆ శక్తి తగ్గిపోతూ-తగ్గిపోతూ ఇప్పుడు ఎటువంటి శక్తి లేనే లేదు. మళ్ళీ మీకు శక్తిని ఇవ్వడానికి తండ్రి వచ్చారు. ఇప్పుడు బ్యాటరీ నిండుతుంది. ఆత్మకు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉండడంతోనే బ్యాటరీ నిండుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనం తిరిగి వెళ్ళాలి, అందుకే ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానముగా, పావనముగా తప్పకుండా తయారుచేసుకోవాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగరునిగా, శాంతిసాగరునిగా ఇప్పుడే అవ్వాలి.

2. ఈ దేహము నుండి కూడా పూర్తి బికారులుగా అయ్యేందుకు బుద్ధిలో ఏముండాలంటే - ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది. మనము బికారుల నుండి యువరాజులుగా అవ్వాలి. మన చదువు కొత్త ప్రపంచం కొరకే ఉంది.

వరదానము:-

చమత్కారాన్ని చూపించేందుకు బదులుగా అవినాశీ భాగ్యము యొక్క మెరుస్తున్న సితారగా తయారుచేసే సిద్ధి స్వరూప భవ

ఈ రోజుల్లో అల్పకాలిక సిద్ధి కలిగినవారు ఎవరైతే ఉన్నారో, వారు చివరిలో పై నుండి వచ్చిన కారణంగా సతోప్రధాన స్థితి ప్రమాణంగా, పవిత్రత యొక్క ఫల స్వరూపంగా అల్పకాలిక చమత్కారాన్ని చూపిస్తారు, కానీ ఆ సిద్ధి సదాకాలికముగా ఉండదు ఎందుకంటే కొద్ది సమయములోనే సతో, రజో, తమో, ఈ మూడు స్థితులను దాటుతారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, మీరు చమత్కారాన్ని చూపించేందుకు బదులుగా మెరుస్తున్న జ్యోతి స్వరూపులుగా తయారుచేసేవారు, అవినాశీ భాగ్యము యొక్క మెరుస్తున్న సితారలుగా తయారుచేసేవారు, అందుకే అందరూ మీ వద్దకే అంచలిని తీసుకోవడానికి వస్తారు.

స్లోగన్:-

అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలము ఉన్నట్లయితే సహయోగులుగా ఉన్నవారు సహజయోగులుగా అయిపోతారు.