11-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి కాదు, ఎందుకంటే డ్రామానుసారంగా ఎవరు చేస్తారో వారు పొందుతారు’’

ప్రశ్న:-
త్రికాలదర్శీగా అవ్వడము వలన ఆత్మకు ఏ స్మృతి కలిగింది?

జవాబు:-
వాస్తవానికి నేను మూలవతన నివాసిని, ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చాను, నేను ముఖ్యమైన ఏక్టర్ గా అయి 84 జన్మల పాత్రను అభినయించాను అని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి సమ్ముఖములో ఉన్నాము, తర్వాత వారితో కలిసి ఇంటికి వెళ్తాము. పావనముగా అయి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సుఖధామములోకి రావాలి. ఈ ఆట అంతా భారత్ పైనే తయారుచేయబడి ఉంది. త్రికాలదర్శులుగా అవ్వడము వలన ఇదంతా స్మృతి కలిగింది.

పాట:-
నీ దారిలోనే మరణించాలి...

ఓంశాంతి
ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు. పిల్లలు ఏమంటున్నారు! బాబా, మేము ఇప్పుడు మీ కంఠహారముగానే అవ్వాలి. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి. శాంతిధామములో లేక నిర్వాణధామములో తండ్రి మరియు పిల్లలైన మేము (ఆత్మలము) ఉంటాము - అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని ఇప్పుడు తండ్రి పదే-పదే చెప్తారు. ఆత్మలమైన మేము తండ్రితో పాటు నిర్వాణధామములో ఉండేవారమని, తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రములో తిరిగామని మీకు తెలుసు. మనము వాస్తవానికి పరంధామ నివాసులమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు. మీరు కూర్చుని ఉన్నారు, బాబా ఎదురుగా కూర్చుని ఉండటాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఉన్నవి లౌకిక శారీరానికి సంబంధించిన సంబంధాలు. వాస్తవానికి మనము ఆత్మలము, తర్వాత లౌకిక సంబంధాలలో సుఖ-దుఃఖాల జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆత్మలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. తండ్రి కూడా మూడు లోకాలు, మూడు కాలాలు గురించి తెలిసినవారు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. చదువు అయితే గుర్తుండాలి కదా. ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు మూలవతన నివాసులని, ఇప్పుడు బాప్ దాదా ద్వారా త్రికాలదర్శులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. మనము ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారులమని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా జ్ఞానము అంతా ఉంది. అర్ధకల్పము మేము సుఖధామములో ఉంటామని స్మృతి కలిగింది. అక్కడ రావణుడు ఉండడు. ఆత్మలమైన మనము పూర్తి 84 జన్మల చక్రములో తిరుగుతాము. ఇప్పుడు తండ్రి సమ్ముఖముగా కూర్చుని ఉన్నారు. మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ మేము మీతో పాటు వస్తాము. ఎంత వీలైతే అంత మిమ్మల్ని స్మృతి చేస్తాము. త్రికాలదర్శులుగా అయ్యారు కనుక పిల్లలైన మీరు మొత్తం రోజంతా ఇదే ఆలోచనలో ఉండాలి. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. వారితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన స్థానములో నివసించేవారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇంటి స్మృతి కలిగింది. మనము పవిత్రముగా అయి మన ఇల్లు అయిన పరంధామానికి వెళ్తాము. తండ్రి అయిన శివునికి పూజ జరిగేటప్పుడు సాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. తండ్రియే వచ్చి ఆత్మలను పావనముగా తయారుచేస్తారు. ఆత్మలను పవిత్రముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, ఇంకెవ్వరూ అలా తయారుచేయలేరు.

ఇప్పుడు మీరు మొత్తం డ్రామా ఆటను తెలుసుకున్నారు. భారత్ పైనే ఆట తయారుచేయబడిందని మీరు అర్థం చేసుకున్నారు. కనుక తండ్రి సమ్ముఖముగా కూర్చుని పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగరుడని ప్రతి జీవాత్మకు తెలుసు. వారినే భక్తి మార్గములో పిలుస్తూ వచ్చారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము తప్పకుండా మీ మతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఇది లౌకిక సంబంధానికి చెందిన విషయమేమీ కాదు. మీరు దేహీ-అభిమానులుగా అయి, మేము ఒక్క అనంతమైన తండ్రి శ్రీమతమనుసారముగా నడుచుకోవాలనే ఆలోచన పెట్టుకోవాలి. వారు చెప్పినదే వినాలి. వారైతే చాలా సహజముగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ జ్ఞానమనే మూడవ నేత్రము తెరుచుకుంది. ఈ జ్ఞానము మీకు ఇక్కడే ఉంది. మూలవతనములో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అక్కడ ఈ జ్ఞానము ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తమ గురించి పూర్తిగా తెలియజేస్తారు. వారే జ్ఞానసాగరుడు. బాబా ఆత్మలైన మమ్మల్ని చదివిస్తున్నారని ఇతర ఏ సత్సంగాలలోనూ చెప్పరు. ఈ విషయము మీకు తెలుసు. దేహీ-అభిమానులుగా అవ్వండి అని మీకు పదే-పదే చెప్పవలసి ఉంటుంది. ఆత్మ ఈ డ్రామాలో పాత్రధారి. పాత్రను అభినయిస్తుంది. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించాను. ఆ పాత్రధారులు వస్త్రాలు మారుస్తూ ఉంటారు.

ఆత్మలైన మీరు నిరాకారీ ప్రపంచము నుండి ఇక్కడకు వచ్చి ఈ శరీరము రూపీ వస్త్రాలను తీసుకుంటారు. ఆ నాటకములో వారు కేవలం ఆ వస్త్రాలు మార్చుకుంటారు. ఆత్మలైన మనకు బాబా మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా వచ్చి ఉన్నారు కనుక మేము తప్పకుండా బాబాకు సహాయకులుగా అవుతామని, పవిత్రముగా అయ్యి మొత్తం భారత్ ను పవిత్రముగా తయారుచేస్తామని పిల్లలైన మీరు అనుకుంటారు. మనము శ్రీమతమనుసారముగానే నడుచుకోవాలి. బాబాను స్మృతి చేయాలని శ్రీమతము చెప్తుంది. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. అందరూ వచ్చి పురుషార్థము చేయరు. ఎవరైతే కల్పక్రితం పురుషార్థము చేసారో, వారే చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అందుకే పురుషార్థము చేసి తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. మనము పైన మూలవతనములో నివసించేవారము. మొట్టమొదట మనము స్వర్గములోకి వచ్చాము, తర్వాత మెట్లు కిందకు దిగుతూ వచ్చాము. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు, భారత్ లోనే వస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి, శరీరాన్ని ధరించి మాకు శ్రేష్ఠ కర్మలను నేర్పించండి అని భారత్ లోనే గుర్తు చేసుకుంటారు. వారు ధరించే శరీరము పేరుకు కూడా గాయనముంది. ఇది భాగ్యశాలి రథము. తండ్రి కూడా అంటారు - నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇంతకుముందు కూడా ఈ విషయము చెప్పాను. తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం కూడా బాబా ఈ విషయము చెప్పారని పిల్లలైన మీకు స్మృతి కలిగింది. ఇంకెవ్వరూ ఈ విషయాన్ని చెప్పలేరు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా, నేను ఈ శరీరములోకి వచ్చి మీకు అర్థం చేయించానని తండ్రియే అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు మళ్ళీ పిల్లలైన మీకు చెప్తాను. మేము ఏ వస్త్రాలను ధరించి, ఏయే పాత్రలను అభినయిస్తాము అనేది నాటకము వేసేవారికి తెలుస్తుంది కదా. కానీ వారు దేహాభిమానులుగా ఉంటారు. ఇది అనంతమైన విషయము. దేహీ-అభిమానులుగా అవ్వాలి. వాస్తవానికి మనము ఆత్మలమే. ఇప్పుడు మన పాత్ర పూర్తవుతుంది. తండ్రి సమ్ముఖముగా కూర్చుని మీకు అంతా అర్థం చేయిస్తారు, ఇది మర్చిపోకూడదు. మాయ ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలూ, మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదని తండ్రి అర్థం చేయిస్తారు. మనసులో తుఫానులు అయితే చాలా వస్తాయి కానీ తమను తాము పరీక్షించుకోవాలి - నా కర్మేంద్రియాలు చంచలమవ్వడము లేదు కదా? నేను కామాన్ని జయించగలనా? మీకైతే ఇది చాలా సహజము. మనము ఆత్మలము, ఒక్క తండ్రి పిల్లలము. తండ్రితోనే యోగము జోడించాలి. కర్మేంద్రియాలు చంచలమవ్వడమనేది కూడా దేహాభిమానమే కదా.

మీరు ఎవ్వరికీ భయపడకూడదు, నిర్భయులుగా అవ్వాలి. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినా సరే, సాక్షీగా అయి చూడాలి. మనము ఆత్మలము. మీరు ఈ ఆటను పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి ఉన్నతోన్నతమైనవారని మీ బుద్ధిలోకి వచ్చింది. వారిని బిందువు అని అంటారు. నిరాకారీ ప్రపంచములో ఆత్మల వృక్షముంటుంది. బీజము నుండి వృక్షము వెలువడుతుంది, తర్వాత నంబరువారుగా ఆకులు వస్తాయి, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పై నుండి నంబరువారుగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, బయటకు ఎలా వస్తుంది అనేది ఎవరూ చూడలేరు. మీ ఆత్మ పతితముగా అయిపోయిందని, దానిని పావనముగా చేసుకోండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చుని వీరి ద్వారా అర్థం చేయిస్తారు. మాట్లాడడమనేది కర్మేంద్రియాలతోనే చేస్తారు కదా. బిందువైన ఆత్మ శరీరములో లేకపోతే కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు. ఇంత చిన్నని బిందువు ఎంత శక్తిశాలిగా ఉంటుంది, దానిలో జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి జ్ఞానసాగరుడు, వారు కూర్చుని మీకు అర్థం చేయిస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. వారి ఈ పాత్ర కూడా నిశ్చితమై ఉంది. మీ ఆత్మలో కూడా 84 జన్మల పాత్ర ఉంది. మీరు సుఖ-దుఃఖాల పాత్రను అభినయిస్తారు. దుఃఖములో చాలా కష్టాలు అనుభవిస్తారు. తండ్రి అంటారు - నేనైతే పునర్జన్మలలోకి రాను, మీరు 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారని నేను వచ్చి పిల్లలైన మీకు సహజమైన యుక్తిని తెలియజేస్తాను. అర్ధకల్పము మీరు కామచితిపై కూర్చుని తమోప్రధానముగా అయ్యారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మ యొక్క కర్మేంద్రియాలు ముందు చిన్నవిగా ఉంటాయి, తర్వాత పెద్దవిగా అవుతాయి. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఓ పతిత-పావనా! రండి అని ఆత్మయే అంటుంది. ఆత్మ తండ్రిని పిలుస్తుంది. పతితులైన మిమ్మల్ని పావనముగా చేసేందుకు, నేను కల్ప-కల్పము వస్తానని తండ్రి అంటారు. ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ బయటకు ఎలా వెళ్తుంది అనేది చూడడానికి మనుష్యులు చాలా కష్టపడతారు కానీ ఎవరూ తెలుసుకోలేరు, ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. చిన్నని ఆత్మలో ఎంత పాత్ర ఉంది. బీజములో పూర్తి జ్ఞానముంటుంది, ఆ బీజము జడమైనది. మర్రి వృక్షము యొక్క బీజము ఎంత చిన్నది, దాని నుండి ఎంత పెద్ద పొడవైన వృక్షము వెలువడుతుంది. కలకత్తాలోని మర్రి వృక్షాన్ని చాలామంది చూసి ఉంటారు. అది చాలా పెద్ద వృక్షము. ఇప్పుడు దాని పునాది అంతా కుళ్ళిపోయింది, వృక్షము మాత్రమే నిలిచి ఉంది. ఇది కూడా అటువంటిదే. దేవతా ధర్మము అనే పునాది లేదు. వృక్షము కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ విషయము కూడా మీకు తెలుసు, అందుకే, మేము ఇంత సమయములో ప్రపంచాన్ని పావనముగా చేసి చూపిస్తామని గవర్నమెంట్ కు కూడా చెప్తారు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మేము ఈ భారత్ ను తప్పకుండా శ్రేష్ఠాచారిగా చేస్తామని, అప్పుడే భ్రష్ఠాచారీ ప్రపంచ వినాశనము జరుగుతుందని మీకు నిశ్చయముంది. శాంతి కావాలని వారు కోరుకుంటారు. ఆత్మ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అలసిపోయింది, అందుకే - ఓ శాంతిదేవా, అని పిలుస్తుంది. ఆత్మ శాంతి స్వరూపమని అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలనైతే తప్పకుండా చేయాల్సిందే. శాంతిని ఇవ్వండి అని అంటారు. శాంతిధామము వేరు, సుఖధామము వేరు అని ఎవరికీ తెలియదు. సుఖధామములో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. అది పవిత్ర ప్రపంచము. అక్కడ ఎవరూ శాంతిని అడగరు. కర్మలనైతే అక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ అశాంతి ఉండదు. జీవన్ముక్తిధామము మరియు శాంతిధామము, రెండూ వేర్వేరు. సత్యయుగములో జీవాత్మలకు సుఖము కూడా ఉంటుంది మరియు శాంతి కూడా ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు.

స్వర్గమని దేనినంటారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గమంటే ఏమిటి అనేది కూడా ప్రపంచములో ఎవరికీ తెలియదు. వీరు (లక్ష్మీ-నారాయణులు) నా పిల్లలు కదా. ఈ పిల్లలకు కూడా సుఖాన్ని ఎవరు ఇచ్చారు? సుఖాన్ని ఇచ్చేవారు ఎవరో అయితే ఉంటారు కదా. వీరి రాజ్యము మళ్ళీ రానున్నదా? స్వర్గము తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. స్వర్గములో ఉన్నప్పుడు, నరకము మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనరు. పవిత్రత, సుఖ-శాంతుల కొత్త ప్రపంచము మళ్ళీ రిపీట్ అవుతుందని ఇప్పుడు అంటారు. ఇది పాత ప్రపంచము, దుఃఖధామము. దీనిని ఇనుప యుగమని అంటారు. కొత్త ప్రపంచము కూడా ఉండేది కదా! దానిని స్వర్గమని అంటారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో నిలిచి ఉంది. తప్పకుండా మనము మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతున్నాము. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. మనము మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని పొందుతాము. ఇది మంచి రీతిలో గుర్తుంచుకోవాలి. ఆత్మలమైన మనము అక్కడ ఉంటాము, తర్వాత మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది ఇప్పుడు స్మృతి కలిగింది. తండ్రి అర్థం చేయించడము కూడా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకే అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా అవ్వకుండా, శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? ప్రజాపిత బ్రహ్మా అయితే ప్రసిద్ధమైనవారు కదా. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కావున కొత్త ప్రపంచము యొక్క రాజ్యము కూడా వారికి తప్పకుండా లభించి ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేసారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దాని కోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది పిల్లలు - డ్రామా గొప్పది అని భావించాలా లేక పురుషార్థము గొప్పది అని భావించాలా అని అడుగుతారు. పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సిందేనని అర్థం చేయించడము జరుగుతుంది. పురుషార్థము లేకుండా ప్రారబ్ధము ఎలా లభిస్తుంది. పూర్తి పురుషార్థము చేయాలి. ఎవరైనా మంచి రీతిలో పురుషార్థము చేస్తే, డ్రామానుసారముగా వీరి పురుషార్థము బాగా నడుస్తుందని, మంచి పదవిని కూడా పొందుతారని అర్థం చేయించడము జరుగుతుంది. అటువంటివారి పురుషార్థము చాలా తీవ్రముగా నడుస్తుంది. తర్వాత నడుస్తూ-నడుస్తూ కొందరి పదవి తగ్గిపోతుంది కూడా. ఫలానావారు చాలా బాగా నడిచేవారని, ఈ రోజుల్లో రావడము లేదని బ్రాహ్మణీలకు తెలుస్తుంది, బ్రాహ్మణీల వద్దకు వచ్చేవారికి కూడా తెలుస్తుంది. మా బుద్ధిలో ఎందుకు కూర్చోవడము లేదో తెలియడము లేదు, మేము అసలు బాబాను స్మృతి చేయలేకపోతున్నాము, ఇక మేము నడవలేము, ఈ గమ్యము చాలా గొప్పది అని అంటారు. ఇలా వ్రాస్తూ ఉంటారు. నిర్వికారులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. వికారాలను వదలడము చాలా కష్టము. డ్రామానుసారముగా కల్పక్రితం వలె వీరి అవస్థ ఇలాగే ఉంటూ వచ్చిందని మీకు తెలుసు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అనంతమైన ఆటను సాక్షీగా అయి చూడాలి. ఎవరికీ భయపడకూడదు. నిర్భయులుగా అయ్యేందుకు ‘‘నేను ఆత్మను’’ అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి.

2. తమను తాము చెక్ చేసుకుని స్వయాన్ని పరీక్షించుకోవాలి - ఏ కర్మేంద్రియము చంచలమవ్వడము లేదు కదా? కామ వికారముపై విజయము పొందానా? దేహీ-అభిమానిగా ఎంతవరకు అయ్యాను?

వరదానము:-
ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవము చేసే భాగ్యవాన్ ఆత్మా భవ

ఎవరైతే ఇతర ఆత్మల మాటలను వింటూ కూడా వినరో, ఇతర ఆత్మల స్మృతిని సంకల్పములోకి మరియు స్వప్నములోకి కూడా తీసుకురారో అనగా ఏ దేహధారి ప్రభావములోకి రారో, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న స్మృతిలో ఉంటారో, వారికి అవినాశీ సౌభాగ్యమనే తిలకము దిద్దబడుతుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యశాలురే భాగ్యవంతులు.

స్లోగన్:-
మీ శ్రేష్ఠ స్థితిని తయారుచేసుకోవాలంటే అంతర్ముఖులుగా అయ్యి, ఆ తర్వాత బాహ్యముఖతలోకి రండి.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

ఏ విధముగా అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అదే విధముగా బాబా స్మృతి అనే తపన యొక్క అగ్నిలో పడినట్లయితే పరివర్తన అయిపోతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు, మళ్ళీ బ్రాహ్మణుల నుండి ఫరిశ్తాలుగా, ఫరిశ్తాల నుండి దేవతలుగా అవుతారు. లగనమనే అగ్ని ద్వారా ఎలా మారిపోతారంటే నాది అన్న భావము కొంచెము కూడా ఉండదు, కావుననే స్మృతిని జ్వాలా రూపము అని అంటారు.