11-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీపై మీరు పూర్తి దృష్టిని పెట్టుకోండి, ఎటువంటి నియమ విరుద్ధమైన నడవడికనూ నడవకండి, శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లయితే పడిపోతారు’’

ప్రశ్న:-
పదమాపదమపతులుగా అయ్యేందుకు ఏ జాగ్రత్త ఉండాలి?

జవాబు:-
సదా అటెన్షన్ ఉండాలి - ఎటువంటి కర్మలు నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేయడం మొదలుపెడతారు. ఏ విషయములోనూ అసత్యమైన అహంకారము రాకూడదు. మురళి ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. మనసా-వాచా-కర్మణా స్వయాన్ని సంభాళించుకోండి. ఈ కళ్ళు మోసం చేయకుండా ఉన్నట్లయితే పదమాల సంపాదనను జమ చేసుకోగలుగుతారు. దీని కొరకు అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయండి మరియు వికర్మల నుండి సురక్షితముగా ఉండండి.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు తండ్రి ఏం అర్థం చేయించారంటే, ఇక్కడ పిల్లలైన మీరు - వీరు తండ్రి కూడా, టీచర్ మరియు సద్గురువు కూడా అన్న ఈ ఆలోచనతో తప్పకుండా కూర్చోవలసి ఉంటుంది. అంతేకాక బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రముగా అయి పవిత్రధామానికి వెళ్ళి చేరుకుంటారు అన్నది కూడా మీరు అనుభవం చేస్తారు. పవిత్రధామము నుండే మీరు కిందకు దిగుతారు అని తండ్రి అర్థం చేయించారు. దాని పేరే పవిత్రధామము. సతోప్రధానము నుండి మళ్ళీ సతో, రజో, తమో... మనము కింద పడిపోయాము అనగా వేశ్యాలయములో ఉన్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమయుగములో ఉన్నారు కానీ - మేము ఈ ప్రపంచము నుండి పక్కకు వచ్చేసాము అని మీరు జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు. అయినా ఒకవేళ మనము శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే శివాలయము దూరంగా ఏమీ లేదు. శివబాబాను స్మృతి చేయకపోతే శివాలయము ఎంతో దూరంగా ఉంది. శిక్షలు అనుభవించవలసి వస్తే అది చాలా దూరమైపోతుంది. తండ్రి పిల్లలకు పెద్ద కష్టమేమీ ఇవ్వరు. ఒకే మాటను పదే-పదే చెప్తారు - మనసా, వాచా, కర్మణా పవిత్రముగా అవ్వాలి. ఈ కళ్ళు కూడా చాలా మోసగిస్తాయి, వీటి విషయములో చాలా జాగ్రత్తగా నడచుకోవాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు - ధ్యానము మరియు యోగము పూర్తిగా వేరు. యోగము అనగా స్మృతి. కళ్ళు తెరచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయవచ్చు. ధ్యానమును యోగము అనేమీ అనరు. భోగ్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా డైరెక్షన్ అనుసారముగానే వెళ్ళాలి. ఇందులో మాయ కూడా ఎంతగానో వస్తుంది. మాయ ఎటువంటిదంటే అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఏ విధముగా తండ్రి శక్తివంతమైనవారో, అలాగే మాయ కూడా చాలా శక్తివంతమైనది. అది ఎంత శక్తివంతమైనదంటే, మొత్తం ప్రపంచమంతటినీ వేశ్యాలయములోకి తోసేసింది, అందుకే ఇందులో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తండ్రి స్మృతి నియమానుసారముగా ఉండాలి. ఏ పనినైనా నియమవిరుద్ధముగా చేసినట్లయితే అది ఒక్కసారిగా పడేస్తుంది. ఎప్పుడూ ధ్యానము మొదలైనవాటి కోరికను పెట్టుకోకూడదు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) అవ్వాలి. ఒకవేళ మీరు తండ్రి ఆజ్ఞపై నడుచుకున్నట్లయితే తండ్రి మీ మనోకామనలన్నింటినీ మీరు అడగకుండానే తీరుస్తారు. ఒకవేళ తండ్రి ఆజ్ఞను పాటించకుండా తప్పు దారి పట్టినట్లయితే స్వర్గానికి బదులుగా నరకములోనే పడిపోయే అవకాశము ఉంది. ఏనుగును మొసలి తినేసినట్లుగా గాయనము కూడా ఉంది. అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చేవారు, భోగ్ నివేదించేవారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే నియమవిరుద్ధమైన నడవడిక కారణముగా పూర్తిగా మాయావీగా అయిపోతారు. దేవతలుగా అవుతూ-అవుతూ అసురులుగా అయిపోతారు. చాలా మంచి పురుషార్థులెవరైతే దేవతలుగా అవ్వబోయారో వారు అసురులుగా అయి అసురులతోపాటు ఉంటారని తండ్రికి తెలుసు. వారు ద్రోహులుగా అయిపోతారు. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ మాయకు చెందినవారిగా అయిపోతారు, అటువంటివారిని ద్రోహులు అని అంటారు. తమపై తాము దృష్టి పెట్టుకోవలసి ఉంటుంది. శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే పడిపోయినట్లే, అది తెలియను కూడా తెలియదు. తండ్రి అయితే పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు - రసాతలములోకి పడిపోయేలాంటి నడవడిక ఏదీ నడుచుకోకండి.

నిన్న కూడా బాబా అర్థం చేయించారు - చాలామంది గోపులు పరస్పరం కమిటీలు మొదలైనవి తయారుచేసుకుంటారు, అలా ఏది చేసినా శ్రీమతము యొక్క ఆధారము లేకుండా చేసినట్లయితే వారు డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతము లేకుండా చేసినట్లయితే పడిపోతూనే ఉంటారు. బాబా ప్రారంభములో కమిటీ తయారుచేసినప్పుడు మాతలది తయారుచేసారు ఎందుకంటే కలశమైతే మాతలకే లభిస్తుంది. వందేమాతరం అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ గోపులు కమిటీని తయారుచేసినా వందే గోపులు అన్న గాయనమైతే లేదు. శ్రీమతముపై లేకపోతే మాయ వలలో చిక్కుకుపోతారు. బాబా మాతల కమిటీని తయారుచేసారు, అంతటినీ వారికి అప్పజెప్పేసారు. పురుషులు చాలావరకు దివాలా తీస్తారు, స్త్రీలు దివాలా తీయరు. కావున తండ్రి కూడా కలశాన్ని మాతలపైనే పెడతారు. ఈ జ్ఞాన మార్గములో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదమ భాగ్యశాలులుగా ఎవరైతే అవ్వనున్నారో వారు మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇందులో స్త్రీ, పురుషులిరువురూ దివాలా తీయవచ్చు మరియు దివాలా తీస్తారు కూడా. ఎంతోమంది ఓడిపోయి వెళ్ళిపోయారు అనగా దివాలా తీసేసారు కదా. తండ్రి అర్థం చేయిస్తూరు - భారతవాసులైతే పూర్తిగా దివాలా తీసేసారు. మాయ ఎంత శక్తివంతమైనది. దాని వల్ల - మేము ఎలా ఉండేవారము, ఎక్కడ నుండి పూర్తిగా కిందకు వచ్చి పడిపోయాము అన్నది అర్థం చేసుకోలేకపోతారు. ఇక్కడ కూడా పైకి ఎక్కుతూ, ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని మర్చిపోయి తమ మతమనుసారముగా నడుచుకున్నట్లయితే దివాలా తీసేస్తారు. అక్కడి వారైతే దివాలా తీస్తారు కానీ 5-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలబడిపోతారు. ఇక్కడైతే 84 జన్మల కొరకు దివాలా తీస్తారు, ఉన్నత పదవిని పొందలేకపోతారు, దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వద్ద ఫోటోలు ఉంటే చెప్పగలిగేవారు. బాబా అయితే ఖచ్చితముగా నిజమే చెప్తున్నారు అని మీరు అంటారు. ఫలానావారు ఎంత గొప్ప మహారథిగా ఉండేవారు, ఎంతోమందిని పైకి లేపేవారు, కానీ ఈ రోజు లేరు, దివాలా తీసారు. బాబా ఘడియ, ఘడియ పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. తమ సొంత మతముపై కమిటీలు మొదలైనవాటిని తయారుచేయడములో ఏమీ వచ్చేది లేదు. పరస్పరం కలిసి పరచింతన చేయడము, వీరు ఇలా చేస్తున్నారు, ఫలానావారు అలా చేస్తున్నారు... అంటూ రోజంతా ఇదే పని చేస్తూ ఉంటారు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడము ద్వారానే సతోప్రధానులుగా అవుతారు. తండ్రికి చెందినవారిగా అయి తండ్రితో యోగము లేకపోతే ఘడియ-ఘడియ పడిపోతూ ఉంటారు, కనక్షనే తెగిపోతుంది. లింక్ తెగిపోతే - మాయ మమ్మల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తోంది అని భయపడిపోకూడదు. ప్రయత్నించి తండ్రితో మళ్ళీ లింక్ ను జోడించాలి. లేకపోతే బ్యాటరీ ఎలా చార్జ్ అవుతుంది? వికర్మలు జరగడం వలన బ్యాటరీ డిస్చార్జ్ అయిపోతుంది. ప్రారంభములో ఎంతమంది వచ్చి బాబాకు చెందినవారిగా అయ్యారు. వారు భట్టీలోకి వచ్చారు కానీ ఈ రోజు ఎక్కడ ఉన్నారు. కింద పడిపోయారు, ఎందుకంటే వారికి పాత ప్రపంచము గుర్తుకొచ్చింది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని కలిగిస్తాను, ఈ పాత ప్రపంచముపై మీరు మనస్సు పెట్టుకోకండి. మనస్సును స్వర్గముతో జోడించాలి. ఒకవేళ ఈ విధంగా లక్ష్మీ-నారాయణుల్లా అవ్వాలనుకుంటే కష్టపడవలసి ఉంటుంది. బుద్ధియోగము ఒక్క తండ్రితో జోడించబడి ఉండాలి. పాత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి. సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఎంత వీలైతే అంత లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సహజము. మీరు ఇక్కడకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే వచ్చారు. ఇప్పుడు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలి అని అందరికీ చెప్పాలి, ఎందుకంటే, ఇప్పుడిక తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము రిపీట్ అవుతుంది అనగా నరకము నుండి స్వర్గముగా, మళ్ళీ స్వర్గము నుండి నరకముగా అవుతుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.

తండ్రి అంటారు, ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి. మేము ఎన్ని సార్లు చక్రములో తిరిగాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలుగా అవుతున్నాము. ప్రపంచములో ఎవ్వరూ ఈ రహస్యాన్ని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానము దేవతలకు లేదు, వారు ఎలాగూ పవిత్రముగానే ఉన్నారు. శంఖాన్ని ఊదేందుకు అసలు వారిలో జ్ఞానమే లేదు. వారు పవిత్రముగా ఉన్నారు, వారికి ఈ గుర్తులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇరువురూ కలిసి ఉంటారో, అప్పుడే ఈ అలంకారాలు ఉంటాయి. మీకు కూడా ఆ అలంకారాలు లేవు ఎందుకంటే మీరు ఈ రోజు దేవతలుగా అవుతూ, అవుతూ రేపు అసురులుగా అయిపోతారు. తండ్రి దేవతలుగా తయారుచేస్తారు, మాయ అసురులుగా చేసేస్తుంది. తండ్రి ఎప్పుడైతే అర్థం చేయిస్తారో, అప్పుడు నిజంగానే నా అవస్థ పడిపోయింది అని తెలుస్తుంది. ఎంతమంది పాపం శివబాబా ఖజానాలో జమ చేయించుకుంటారు, దానిని మళ్ళీ తిరిగి ఇచ్చేయమని అడిగి అసురులుగా అయిపోతారు. ఇదంతా యోగములో లోపము వల్లనే. యోగముతోనే పవిత్రముగా అవ్వాలి. బాబా, రండి, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయండి, తద్వారా మేము స్వర్గములోకి వెళ్ళగలుగుతాము అని పిలుస్తారు కూడా. స్మృతియాత్ర ఉన్నదే పావనులుగా అయి ఉన్నత పదవిని పొందేందుకు. ఎవరైతే మరణిస్తారో, వారు ఎంతోకొంత విన్నారు కావున శివాలయములోకి తప్పకుండా వస్తారు, కాకపోతే పదవి ఏదైనా పొందవచ్చు. ఒక్కసారి స్మృతి చేసారంటే స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కాకపోతే ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గము అన్న మాట విని సంతోషించాలి. ఫెయిల్ అయి ఏదో పైసకు విలువచేసే పదవిని పొందడములో సంతోషపడిపోకూడదు. నేను నౌకరును అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. చివరిలో మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి - మేము ఎలా అవ్వబోతున్నాము, మా ద్వారా ఏ వికర్మలు జరిగిన కారణముగా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మహారాణిగా ఎందుకు అవ్వకూడదు? అడుగడుగునా అప్రమత్తముగా నడుచుకున్నట్లయితే మీరు పదమాపదమపతులుగా అవ్వగలరు. మందిరాలలో దేవతలకు పదమములను గుర్తుగా చూపిస్తారు. పదవిలో తేడా వచ్చేస్తుంది. ఈ నాటి రాజరికాలలో ఎంత అట్టహాసం ఉంటుంది! కానీ అది కేవలం అల్పకాలికమైనది, వారు సదాకాలికమైన రాజులుగా అయితే అవ్వలేరు. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు లక్ష్మీ-నారాయణుల్లా అవ్వాలంటే పురుషార్థము కూడా ఆ విధముగా ఉండాలి. ఎంతగా నేను ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నాను? అంతర్ముఖీగా అయి ఎంత సమయము బాబా స్మృతిలో ఉంటున్నాను? ఇప్పుడు మనము మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము, మళ్ళీ సుఖధామములోకి వస్తాము. ఈ జ్ఞాన మంథనము అంతా లోలోపల జరుగుతూ ఉండాలి. తండ్రిలో జ్ఞానము మరియు యోగము, రెండూ ఉన్నాయి. మీలో కూడా అవి ఉండాలి. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని మీకు తెలుసు కావున అది జ్ఞానము కూడా మరియు స్మృతి కూడా. జ్ఞానము మరియు యోగము, రెండూ కలిసి నడుస్తాయి. అంతేకానీ యోగములో కూర్చుని బాబాను స్మృతి చేస్తూ, చేస్తూ జ్ఞానాన్ని మర్చిపోవడము కాదు. తండ్రి యోగాన్ని నేర్పించేటప్పుడు వారేమైనా జ్ఞానాన్ని మర్చిపోతారా? వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. పిల్లలైన మీలో కూడా జ్ఞానము ఉండాలి. మీరు చదువుకోవాలి. నేను ఎటువంటి కర్మలు చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళిని చదవకపోతే ఇతరులు కూడా చదవరు. అసత్యమైన అహంకారము వస్తే మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగునా తండ్రి నుండి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏదో ఒక వికర్మ జరిగిపోతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తూ తండ్రికి తెలియజేయరు, అటువంటివారు తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. నిర్లక్ష్యము చేసినట్లయితే మాయ చెంపదెబ్బ వేసేస్తుంది, పైసకు కొరగానివారిగా చేసేస్తుంది. అహంకారములోకి రావడం వల్ల మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఇలా, ఇలా పురుషుల కమిటీలను తయారుచేయండి అని బాబా ఎప్పుడూ అనలేదు కదా. కమిటీలో ఒకరిద్దరు అర్థం చేసుకునే తెలివైన కుమార్తెలు తప్పకుండా ఉండాలి. వారి సలహా అనుసారముగానే పని నడవాలి. కలశమైతే లక్ష్మిపైనే పెట్టడం జరుగుతుంది కదా. అమృతాన్ని తాగించేవారు, మళ్ళీ ఎక్కడో అక్కడ యజ్ఞములో విఘ్నాలను కలిగించేవారు అన్న గాయనము కూడా ఉంది. అనేక రకాల విఘ్నాలు వేసేవారు ఉన్నారు. మొత్తం రోజంతా ఇటువంటి పరచింతనా విషయాలనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ విషయము. ఏదైనా జరిగితే తండ్రికి రిపోర్ట్ చేయాలి. తీర్చిదిద్దేవారు అయితే ఒక్క తండ్రే. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి, అప్పుడు ఈ విధంగా తయారవ్వగలుగుతారు. మాయ చాలా కఠినమైనది. అది ఎవ్వరినీ వదలదు. సదా తండ్రికి సమాచారాన్ని వ్రాస్తూ ఉండాలి. డైరెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. మామూలుగా అయితే డైరెక్షన్లు సదా లభిస్తూనే ఉంటాయి. బాబా అయితే తమంతట తామే ఈ విషయముపై అర్థం చేయించారు, బాబా అయితే అంతర్యామి అని పిల్లలు భావిస్తారు కానీ బాబా అంటారు, అలా కాదు, నేను అయితే జ్ఞానాన్ని చదివిస్తాను, ఇందులో అంతర్యామి విషయమేమీ లేదు. అయితే, వీరంతా నా పిల్లలే అన్నది మాత్రం నాకు తెలుసు. ప్రతి శరీరము లోపలా నా పిల్లలు ఉన్నారు. అంతేకానీ తండ్రి అందరిలోపలా విరాజమానమై ఉన్నారని కాదు. మనుష్యులైతే తలక్రిందులుగానే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, అందరి భృకుటి ఆసనముపై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయము. చైతన్య ఆత్మలందరూ తమ-తమ భృకుటి ఆసనాలపై కూర్చున్నారు, అయినా కానీ పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు, ఇది ఏకైక పొరపాటు. ఈ కారణముగానే భారత్ ఇంతగా దిగజారిపోయింది. తండ్రి అంటారు, మీరు నన్ను ఎంతగానో గ్లాని చేసారు. విశ్వాధిపతులుగా తయారుచేసేవారిని మీరు నిందించారు, అందుకే తండ్రి అంటారు, యదా యదాహి... విదేశీయులు ఈ సర్వవ్యాపి జ్ఞానాన్ని భారతవాసుల నుండే నేర్చుకుంటారు. ఏ విధంగా భారతవాసులు వారి నుండి కళను నేర్చుకుంటారో, అలా వారేమో తలక్రిందుల విషయాలను నేర్చుకుంటారు. మీరైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి మరియు తండ్రి పరిచయాన్ని కూడా అందరికీ ఇవ్వాలి. మీరు అంధులకు చేతికర్ర వంటివారు. చేతికర్రతో దారిని చూపిస్తారు కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఆజ్ఞానుసారముగా ప్రతి కార్యాన్ని చేయాలి. ఎప్పుడూ కూడా శ్రీమతము యొక్క ఉల్లంఘన జరగకూడదు, అప్పుడే అడగకుండానే సర్వ మనోకామనలు తీరుతాయి. ధ్యానము, సాక్షాత్కారాల కోరికను పెట్టుకోకూడదు, ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) అవ్వాలి.

2. పరస్పరం కలుసుకుని ఇతరుల పరచింతనను చేయకూడదు. అంతర్ముఖీగా అయి స్వయాన్ని చెక్ చేసుకోవాలి - మేము బాబా స్మృతిలో ఎంత సమయము ఉంటున్నాము, జ్ఞాన మంథన లోలోపల జరుగుతోందా?

వరదానము:-
ప్రతి ఆత్మ సంబంధ-సంపర్కములోకి వస్తూ అందరికీ దానమును ఇచ్చే మహాదానీ, వరదానీ భవ

మొత్తము రోజంతటిలో సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా, వారికి ఏదో ఒక శక్తిని, జ్ఞానాన్ని, గుణాన్ని దానముగా ఇవ్వండి. మీ వద్ద జ్ఞాన ఖజానా కూడా ఉంది, అలాగే శక్తులు మరియు గుణాల ఖజానా కూడా ఉంది. కావున ఏ ఒక్క రోజు కూడా దానము ఇవ్వకుండా ఖాళీగా గడచిపోకూడదు, అప్పుడే మహాదానీ అని అంటారు. 2. దానము అన్న మాటకు గల ఆత్మిక అర్థము - సహయోగాన్ని ఇవ్వటము. కావున మీ శ్రేష్ఠ స్థితి యొక్క వాయుమండలము ద్వారా మరియు మీ వృత్తి యొక్క వైబ్రేషన్ల ద్వారా ప్రతి ఆత్మకు సహయోగాన్ని ఇవ్వండి, అప్పుడు వరదాని అని అంటారు.

స్లోగన్:-
ఎవరైతే బాప్ దాదాకు మరియు పరివారానికి సమీపముగా ఉంటారో, వారి ముఖముపై సంతుష్టత, ఆత్మికత మరియు ప్రసన్నతతో కూడిన చిరునవ్వు ఉంటుంది.