ఓంశాంతి
భోళానాథ్ శివ భగవానువాచ - బ్రహ్మా ముఖ కమలము ద్వారా తండ్రి చెప్తున్నారు - ఇది
భిన్న-భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపీ వెరైటీ వృక్షము కదా. ఈ కల్పవృక్షము మరియు
సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తున్నాను. పాటలో కూడా వీరి
మహిమ ఉంది. శివబాబా జన్మ ఇక్కడే జరుగుతుంది. తండ్రి అంటారు, నేను భారత్ లో వచ్చాను.
శివబాబా ఎప్పుడు అవతరించారు అనేది మనుష్యులకు తెలియదు, ఎందుకంటే గీతలో శ్రీకృష్ణుని
పేరు వేసేశారు. వారు ద్వాపరములో వచ్చే మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ,
5000 సంవత్సరాల క్రితము కూడా నేను వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ వృక్షము ద్వారా
అందరికీ తెలిసిపోతుంది. వృక్షాన్ని బాగా చూడండి. సత్యయుగములో తప్పకుండా దేవీ-దేవతల
రాజ్యము ఉండేది, త్రేతాలో సీతా-రాముల రాజ్యము ఉండేది. బాబా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని
తెలియజేస్తారు. పిల్లలు అడుగుతారు - బాబా, మేము మాయ వలలో ఎప్పుడు చిక్కుకున్నాము?
బాబా అంటారు - ద్వాపరము నుండి. తర్వాత నంబరువారుగా ఇతర ధర్మాలు వస్తాయి. లెక్క
వేయడము ద్వారా ఈ ప్రపంచములోకి మనం మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్నది అర్థం
చేసుకోగలుగుతారు. శివబాబా అంటారు, నేను 5000 సంవత్సరాల తరువాత వచ్చాను, సంగమములో నా
కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో వారందరూ
దుఃఖితులుగా ఉన్నారు, అందులోనూ ముఖ్యముగా భారతవాసులు. డ్రామా అనుసారముగా భారత్ నే
నేను సుఖమయము చేస్తాను. పిల్లలు అనారోగ్యము పాలైతే వారికి మందులు ఇవ్వడము మొదలైనవి
తండ్రి కర్తవ్యము. ఇది చాలా పెద్ద రోగము. అన్ని రోగాలకూ మూలము ఈ పంచ వికారాలు. ఇవి
ఎప్పటినుండి ప్రారంభమయ్యాయి? అని పిల్లలు అడుగుతారు. ద్వాపరము నుండి. రావణుని
విషయాన్ని అర్థం చేయించాలి. రావణుడిని ఎవ్వరూ చూడలేరు. బుద్ధి ద్వారా అర్థం
చేసుకోవడం జరుగుతుంది. తండ్రిని కూడా బుద్ధి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ
మనస్సు, బుద్ధి సహితముగా ఉంది. మా తండ్రి పరమాత్మ అని ఆత్మకు తెలుసు. సుఖ-దుఃఖాలలోకి,
కర్మల ప్రభావములోకి ఆత్మ వస్తుంది. శరీరమున్నప్పుడు ఆత్మకు దుఃఖము అనుభవమవుతుంది.
పరమాత్మనైన నన్ను దుఃఖ పెట్టకండి అని ఎప్పుడూ అనరు. తండ్రి కూడా అర్థం
చేయిస్తున్నారు - నాకు కూడా పాత్ర ఉంది, కల్ప-కల్పము సంగమములో వచ్చి నేను పాత్రను
అభినయిస్తాను. ఏ పిల్లలనైతే నేను సుఖములోకి పంపించానో, వారు దుఃఖితులయ్యారు, అందుకే
మళ్ళీ డ్రామా అనుసారముగా నేను రావలసి ఉంటుంది. అంతేకానీ కూర్మ, మత్స్య అవతారాలు ఏమీ
లేవు. పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను వధించాడని అంటారు. అవన్నీ కట్టు కథలు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చెయ్యండి.
వీరు జగదంబ మరియు జగత్పిత. మాతృదేశము మరియు పితృదేశము అని అంటారు కదా. భారతవాసులు
- నీవే తల్లివి, తండ్రివి... నీ కృపతో అమితమైన సుఖము తప్పకుండా లభిస్తూ ఉంది అని
తలచుకుంటారు కూడా. ఇక ఆపై ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత. ఎలాగైతే సినిమాకు
వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ లో రిజర్వు చేసుకుంటారు కదా, అలాగే తండ్రి కూడా అంటారు,
కావాలంటే సూర్యవంశములో లేక చంద్రవంశములో సీట్ రిజర్వు చేసుకోండి. ఎవరు ఎంత
పురుషార్థము చేస్తే అంత పదవిని పొందగలరు. కావున అన్ని రోగాలను, దుఃఖాలను
తొలగించడానికి తండ్రి వచ్చారు. రావణుడు అందరికీ చాలా దుఃఖాన్నిచ్చాడు.
మనుష్యులెవ్వరూ ఇతర మనుష్యులకు గతి-సద్గతిని ఇవ్వలేరు. ఇది కలియుగ అంతిమము. గురువులు
శరీరాన్ని వదులుతారు, మళ్ళీ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటారు, అటువంటప్పుడు వారు
ఇతరులకు సద్గతినేమిస్తారు! ఇంతమంది గురువులందరూ కలిసి ఈ పతిత సృష్టిని పావనముగా
తయారుచేస్తారా? గోవర్ధన పర్వతము అని అంటారు కదా. ఈ మాతలు ఈ ఇనుపయుగ పర్వతాన్ని
స్వర్ణిమముగా తయారుచేస్తారు. గోవర్ధనాన్ని పూజ కూడా చేస్తారు, అది తత్వపూజ.
సన్యాసులు కూడా బ్రహ్మమును లేక తత్వమును స్మృతి చేస్తారు. దానినే పరమాత్మగా
భావిస్తారు, బ్రహ్మ తత్వమే భగవంతుడు అని అనుకుంటారు. ఇది భ్రమ అని తండ్రి అంటారు.
బ్రహ్మాండములోనైతే ఆత్మలు అండాకారములో ఉంటాయి, నిరాకారీ వృక్షము కూడా చూపించబడింది.
ప్రతి ఒక్కరికీ తమ-తమ సెక్షన్లు ఉన్నాయి. ఈ వృక్షానికి పునాది భారత్ యొక్క సూర్యవంశీ,
చంద్రవంశీ పరివారాలు, ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఏయే
ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది లెక్క వెయ్యాలి. ఉదాహరణకు గురునానక్ 500
సంవత్సరాల క్రితము వచ్చారు. సిక్కులు 84 జన్మల పాత్రను అభినయిస్తారని కాదు. తండ్రి
అంటారు, 84 జన్మలు కేవలం ఆల్ రౌండర్ బ్రాహ్మణులైన మీవే. బాబా అర్థం చేయించారు - మీదే
ఆల్ రౌండ్ పాత్ర. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా మీరే
అవుతారు. ఎవరైతే మొదట దేవీ-దేవతలుగా అవుతారో, వారే మొత్తం చక్రమంతా తిరుగుతారు.
తండ్రి అంటారు, మీరు వేద-శాస్త్రాలనైతే చాలా విన్నారు. ఇప్పుడు ఇది వినండి మరియు
జడ్జ్ చెయ్యండి - శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి ఏదైతే
వినిపిస్తున్నారో అది రైటా? తండ్రిని సత్యము అనే అంటారు. నేను సత్యాన్ని
వినిపిస్తాను, దానితో సత్యయుగము తయారవుతుంది మరియు ద్వాపరము నుండి మొదలుకుని మీరు
అసత్యాన్నే వింటూ వచ్చారు, దాని వలన నరకముగా తయారయ్యింది.
తండ్రి అంటారు - నేను మీకు సేవకుడిని. భక్తి మార్గములో మీరు - నేను సేవకుడిని,
నేను మీ సేవకుడిని అని గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవలో వచ్చాను.
తండ్రిని నిరాకారీ, నిరహంకారి అని మహిమ చేస్తారు. తండ్రి అంటారు, నా కర్తవ్యము
పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చెయ్యడము. ఆగమ నిగమాల (వేదాల అంతర్భాగాలు)
భేదాలు తెలియజేశారు, ఆది అంత్యముల రహస్యాన్ని తెలియజేశారు అని పాటలో ఉంది. ఇకపోతే
డమరుకము మొదలైనవి మ్రోగించే విషయమేమీ లేదు. వీరైతే ఆది మధ్యాంతాల పూర్తి సమాచారాన్ని
వినిపిస్తారు. బాబా అంటారు, పిల్లలైన మీరందరూ పాత్రధారులు, నేను ఈ సమయములో కరన్
కరావన్ హార్ (చేసేవాడిని, చేయించేవాడిని). నేను వీరి (బ్రహ్మా) ద్వారా స్థాపన
చేయిస్తాను. ఇకపోతే గీతలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో, వాస్తవానికి అవేమీ లేవు.
ఇప్పుడైతే ఇది ప్రత్యక్ష విషయము కదా. పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని మరియు సహజ యోగాన్ని
నేర్పిస్తాను, యోగము జోడింపజేయిస్తాను. యోగాన్ని జోడింపజేయించేవారు, జోలెని
నింపేవారు, రోగాలను, దుఃఖాలను తొలగించేవారు... అని అన్నారు కదా. గీత యొక్క పూర్తి
అర్థాన్ని కూడా తెలియజేస్తారు. యోగాన్ని నేర్పిస్తాను మరియు నేర్పించేలా కూడా
చేస్తాను. పిల్లలు యోగము నేర్చుకుని మళ్ళీ ఇతరులకు కూడా నేర్పిస్తారు కదా. యోగముతో
మా జ్యోతిని వెలిగించేవారు... అని అంటారు. ఇలాంటి పాటలను కూడా ఎవరైనా ఇంట్లో
కూర్చుని వింటే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. తండ్రి స్మృతితో
వారసత్వపు నషా కూడా ఎక్కుతుంది. కేవలం పరమాత్మ లేక భగవంతుడా అని అనడం వలన నోరు తీపి
అవ్వదు. బాబా అంటేనే వారసత్వము.
ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని విని ఇతరులకు
వినిపిస్తారు, దీనినే శంఖ ధ్వని అని అంటారు. మీకు పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో లేవు.
పిల్లలు కేవలం ధారణ చేయవలసి ఉంటుంది. మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు, ఆత్మిక
తండ్రికి పిల్లలు. సత్యమైన గీతతో భారత్ స్వర్గముగా అవుతుంది. అక్కడైతే కేవలం
కూర్చుని కథలను తయారుచేస్తారు. మీరందరూ పార్వతులు, మీకు ఈ అమరకథను వినిపిస్తున్నాను.
మీరందరూ ద్రౌపదులు. అక్కడ ఎవ్వరూ వివస్త్రగా అవ్వరు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు?
అని అడుగుతారు. వారికి ఇలా చెప్పండి - అరే, అందరూ నిర్వికారులే అయినప్పుడు ఇక
వికారాల విషయము ఎలా ఉండగలదు, యోగబలముతో పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారు అన్నది మీరు
అర్థం చేసుకోలేరు, మీరు వాదిస్తారు. కానీ ఇవి శాస్త్రాల విషయాలు కదా. ఆ ప్రపంచమే
సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. డ్రామా అనుసారముగా మాయ మిమ్మల్ని
మళ్ళీ దుఃఖితులుగా చేస్తుందని నాకు తెలుసు. నేను కల్ప-కల్పము నా కర్తవ్యాన్ని
నిర్వర్తించడానికి వస్తాను. కల్పపూర్వము వారు, చాలా కాలం క్రితం విడిపోయిన వారే
వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారు అని తెలుసు. వారు ఆ లక్షణాలను కూడా చూపిస్తారు.
ఇది ఆ మహాభారత యుద్ధమే. మీరు మళ్ళీ దేవీ-దేవతలుగా అనగా స్వర్గాధిపతులుగా అయ్యేందుకు
పురుషార్థము చెయ్యాలి. ఇందులో స్థూల యుద్ధము యొక్క విషయమేమీ లేదు. అసురులు, దేవతల
యొక్క యుద్ధము కూడా జరగలేదు. అక్కడ యుద్ధము చేయించడానికి మాయే ఉండదు. అర్ధకల్పము
యుద్ధము కానీ, రోగము కానీ, దుఃఖము-అశాంతి కానీ ఉండవు. అరే, అక్కడైతే సదా సుఖము,
వసంతమే వసంతము ఉంటుంది. హాస్పిటల్ ఉండదు, కానీ స్కూల్లో చదవడమైతే ఉంటుంది. ఇప్పుడు
మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వారసత్వాన్ని తీసుకువెళ్తారు. మనుష్యులు చదువు
ద్వారా తమ కాళ్ళపై నిలబడతారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది - నీవు ఎవరిది
తింటున్నావు అని ఎవరో అడిగితే, అప్పుడు నేను నా భాగ్యము నుండి తింటున్నాను అని ఆమె
చెప్పింది. అది హద్దు భాగ్యము. ఇప్పుడు మీరు మీ అనంతమైన భాగ్యాన్ని
తయారుచేసుకుంటున్నారు. మీరు ఎటువంటి భాగ్యాన్ని తయారుచేసుకుంటున్నారంటే, ఇక 21
జన్మలు మీరు మీ రాజ్య భాగ్యాన్నే అనుభవిస్తారు. ఇది అనంతమైన సుఖము యొక్క వారసత్వము.
ఇప్పుడు పిల్లలైన మీకు తేడా గురించి చాలా బాగా తెలుసు. భారత్ ఎంత సుఖమయముగా ఉండేది,
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది! ఎవరైతే కల్ప క్రితము రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారో
వారే ఇప్పుడు తీసుకుంటారు. అలాగని డ్రామాలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని కాదు, అలా
అయితే ఆకలితో చనిపోతారు. ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి.
శాస్త్రాలలో కొందరు ఒక ఆయువును, మరికొందరు మరొక ఆయువును చూపించారు. అనేకానేక
మత-మతాంతరాలు ఉన్నాయి. కొందరైతే - మేము సదా సుఖముగానే ఉంటున్నాము అని అంటారు. అరే,
నీవెప్పుడూ అనారోగ్యము పాలవ్వవా? వారు అంటారు - రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి,
ఆత్మ నిర్లేపి అని. అరే, ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖము ఆత్మకు కలుగుతుంది కదా - ఇవి
బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది స్కూల్, ఒకే టీచర్ చదివిస్తారు. జ్ఞానము ఒక్కటే,
లక్ష్యము ఒక్కటే, నరుని నుండి నారాయణునిగా అవ్వడము. ఎవరైతే పాస్ అవ్వరో వారు
చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులు లేరు, క్షత్రియులు
ఉన్నప్పుడు వైశ్యులు లేరు, వైశ్యులు ఉన్నప్పుడు శూద్రులు లేరు. ఇవన్నీ అర్థం
చేసుకోవలసిన విషయాలు. మాతల కొరకు కూడా చాలా సహజము. ఒకే పరీక్ష ఉంటుంది. ఆలస్యముగా
వచ్చేవారు ఎలా చదువుతారు అని అనుకోకండి. ఇప్పుడు కొత్తవారు చురుకుగా ముందుకు
వెళ్తున్నారు. ప్రాక్టికల్ గా అలా ఉన్నారు. ఇకపోతే మాయా రావణుడికి ఎటువంటి రూపము
లేదు. వీరిలో కామము యొక్క భూతము ఉంది అని అంటారు, అంతేకానీ రావణుడి యొక్క బొమ్మ కానీ,
శరీరము కానీ ఏమీ లేదు.
అచ్ఛా! అన్ని విషయాల సాక్కిరిన్ (మధురమైన సారము) మన్మనాభవ. నన్ను స్మృతి
చేసినట్లయితే ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి అని అంటారు. తండ్రి గైడ్ గా అయి
వస్తారు. బాబా అంటారు - పిల్లలూ, నేను అయితే సమ్ముఖముగా పిల్లలైన మిమ్మల్ని
చదివిస్తాను. కల్ప-కల్పమూ నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. పారలౌకిక తండ్రి అంటారు
- పిల్లలైన మీ సహాయముతో నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. సహాయము
చేస్తారు కావుననే మీరు కూడా పదవిని పొందుతారు. నేను ఎంత గొప్ప తండ్రిని, ఎంత పెద్ద
యజ్ఞాన్ని రచించాను. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మీరందరూ
సోదరీ-సోదరులు. సోదరీ, సోదరులుగా అయిన తర్వాత ఇక పతి-పత్ని అన్న దృష్టి మారిపోవాలి.
తండ్రి అంటారు, ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితము చేయకండి, పవిత్రముగా ఉండేందుకు ఇవి
యుక్తులు. మనుష్యులు - ఇది ఎలా సాధ్యమవుతుంది, కలిసి ఉంటూ నిప్పు అంటుకోకుండా
ఉండడమనేది సాధ్యము కాదు అని అంటారు. బాబా అంటారు, మధ్యలో జ్ఞాన ఖడ్గము ఉన్నందుకు
ఎప్పుడూ నిప్పు అంటుకోదు, కానీ అది కూడా - ఇద్దరూ మన్మనాభవగా ఉంటే, శివబాబాను స్మృతి
చేస్తూ ఉంటే, స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తే అప్పుడు అది సాధ్యమవుతుంది.
మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోని కారణముగా గొడవ చేస్తారు, నిందలు కూడా పడవలసి
వస్తుంది. శ్రీకృష్ణుడిని ఏమైనా నిందించగలరా? శ్రీకృష్ణుడు అలా వచ్చేస్తే విదేశాల
నుండి ఒకేసారి అందరూ విమానాల ద్వారా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, చాలా గుంపు
ఏర్పడిపోతుంది, ఇక భారత్ లో అయితే ఏమైపోతుందో తెలియదు!
అచ్ఛా, ఈ రోజు భోగ్ - ఇది పుట్టినిల్లు మరియు అది అత్తవారిల్లు. సంగమములో
కలుసుకుంటారు. కొందరు దీనిని ఇంద్రజాలము అనుకుంటారు. ఈ సాక్షాత్కారాలు ఏమిటి అనేది
బాబా అర్థం చేయించారు. భక్తి మార్గములో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయి, ఇందులో
సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. ఇది ఒక ఆచారము. ఇది శివబాబా భండారా కావున వారిని
స్మృతి చేసి భోగ్ పెట్టాలి. యోగములో ఉండటమైతే మంచిదే కదా, బాబా స్మృతి ఉంటుంది.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.