12-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా పెద్ద రత్నాల వ్యాపారులు, మీరు అవినాశీ జ్ఞాన రత్నాల రూపీ ఆభరణాలను ఇచ్చి అందరినీ షావుకారులుగా తయారుచేయాలి’’

ప్రశ్న:-
మీ జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేసుకునేందుకు ఏ విషయములో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి?

జవాబు:-
సాంగత్యము విషయములో. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారితో సాంగత్యము చేయాలి. ఎవరైతే వర్షించరో వారితో సాంగత్యము చేయడము వలన లాభమేముంది! సాంగత్య దోషము చాలా ఉంటుంది, కొందరు కొందరి సాంగత్యము వలన వజ్రతుల్యముగా తయారవుతారు, మరికొందరు కొందరి సాంగత్యము వలన రాయి వలె తయారవుతారు. ఎవరైతే జ్ఞానవంతులో వారు తమ సమానముగా తప్పకుండా తయారుచేస్తారు, సాంగత్యము విషయములో స్వయం జాగ్రత్త వహిస్తారు.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మొత్తం సృష్టి అంతా, మొత్తం డ్రామా అంతా చక్కగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసము కూడా బుద్ధిలో ఉంది. సత్యయుగములో అందరూ శ్రేష్ఠాచారులుగా, నిర్వికారులుగా, పావనులుగా మరియు సంపన్నులుగా ఉండేవారని, ఇప్పుడేమో ప్రపంచమంతా భ్రష్టాచారిగా, వికారీగా, పతితముగా, దివాలా తీసి ఉందని, ఈ విషయమంతా బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగములో ఉన్నారు. మీరు అటు వైపుకు వెళ్తున్నారు. నది మరియు సాగరము కలిసే చోటును సంగమము అని అంటారు. ఒకవైపు తియ్యని నీరు, ఇంకొకవైపు ఉప్పు నీరు ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సంగమము. సత్యయుగములో తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేదని, మళ్ళీ చక్రము ఇలా తిరిగిందని మీకు తెలుసు. ఇప్పుడు ఇది సంగమము. కలియుగ అంతిమములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు, దీనిని అడవి అని అంటారు. సత్యయుగాన్ని పుష్పాలతోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. 84 జన్మల కథ అయితే చాలా సామాన్యమైనది. 84 జన్మలు పూర్తయ్యాయని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మేము ఇప్పుడు సత్యయుగీ పుష్పాలతోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు ఇక మన జన్మ ఈ మృత్యులోకములో ఉండదు. మన జన్మ అమరలోకములో ఉంటుంది. శివబాబాను అమరనాథుడు అని కూడా అంటారు. వారు మనకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు, అక్కడ మనము శరీరములో ఉంటూ కూడా అమరులుగా ఉంటాము. మన సమయము వచ్చినప్పుడు సంతోషముగా శరీరాన్ని వదిలేస్తాము, దానిని మృత్యులోకము అని అనరు. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే, వారు - నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానము ఉంది అని భావిస్తారు. సృష్టికి ఆది మరియు అంతిమము ఉన్నాయి కదా. చిన్న పిల్లవాడు కూడా యువకునిగా మరియు వృద్ధునిగా అవుతాడు, ఆ తర్వాత ఇక అంతము వచ్చేస్తుంది. మళ్ళీ చిన్న పిల్లవాడిలా అవుతాడు. సృష్టి కూడా కొత్తగా అవుతుంది, ఆ తర్వాత పావు వంతు పాతగా అవుతుంది, ఆ తర్వాత సగం పాతగా అవుతుంది, ఆ తర్వాత మొత్తమంతా పాతగా అవుతుంది, మళ్ళీ కొత్తగా తయారవుతుంది. ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ ఇతరులకు వినిపించలేరు. ఈ విధమైన చర్చను ఎవ్వరూ చేయలేరు. కేవలం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ఆత్మిక జ్ఞానము లభించదు. బ్రాహ్మణ వర్ణములోకి వస్తే ఈ విషయాలను వినగలుగుతారు. ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుస్తాయి. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా వినిపించగలుగుతారు. కొందరు వినిపించలేకపోతారు కావున వారికి ఏమీ లభించదు. రత్నాల వ్యాపారులలో కూడా చూస్తే, కొందరి వద్ద కోట్లు విలువ చేసే మాలు ఉంటుంది, కొందరి వద్దనైతే పదివేలు విలువ చేసే మాలు కూడా ఉండదు. మీలో కూడా ఇలా ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఈ జనక్ ఉన్నారు, వీరు మంచి రత్నాల వ్యాపారి. వీరి వద్ద విలువైన రత్నాలు ఉన్నాయి. ఎవరికన్నా ఇచ్చి వారిని మంచి షావుకారుగా తయారుచేయగలరు. కొందరు చిన్న రత్నాల వ్యాపారులు ఉన్నారు, వారు ఎక్కువగా ఇవ్వలేరు కావున వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ రత్నాల వ్యాపారులు, ఇవి అవినాశీ జ్ఞాన రత్నాల ఆభరణాలు. ఎవరి వద్దనైతే మంచి రత్నాలు ఉన్నాయో వారు షావుకారులుగా తయారవుతారు, ఇతరులను కూడా అలా తయారుచేస్తారు. అందరూ మంచి రత్నాల వ్యాపారులుగా ఉంటారని కూడా కాదు. మంచి-మంచి రత్నాల వ్యాపారులను పెద్ద-పెద్ద సెంటర్లకు పంపిస్తారు. పెద్ద వ్యక్తులకు మంచి రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద-పెద్ద దుకాణాలలో నైపుణ్యము కలిగినవారు ఉంటారు. బాబాను కూడా వ్యాపారి, రత్నాకరుడు అని అంటారు. వారు రత్నాల వ్యాపారము చేస్తారు, అంతేకాక వారు ఇంద్రజాలికుడు కూడా ఎందుకంటే వారి వద్దే దివ్యదృష్టి యొక్క తాళంచెవి ఉంది. ఎవరన్నా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడ ఆ విషయము లేదు. ఇక్కడైతే కష్టపడకుండానే ఇంట్లో కూర్చుని ఉండగా కూడా అనేకులకు సాక్షాత్కారమవుతుంది. రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. కొందరికి బ్రహ్మా మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారము కూడా కలుగుతుంది. బ్రహ్మా వద్దకు వెళ్ళమని, వెళ్ళి వారి వద్ద రాకుమారునిగా అయ్యే చదువును చదవమని సాక్షాత్కారములో వారికి చెప్తారు. పవిత్రమైన రాకుమారులు మరియు రాకుమార్తెలు ఉంటారు కదా. రాకుమారుడిని పవిత్రమైనవారు అని కూడా అనవచ్చు. పవిత్రతతో జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్టాచారులు అని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి, ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా. వీరు చాలా వివేకవంతులుగా ఉన్నారని మనుష్యులు భావిస్తారు కూడా. మీరు ఇలా చెప్పండి - మా వద్ద శాస్త్రాలు మొదలైనవాటి జ్ఞానమేమీ లేదు, ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు త్రిమూర్తులు. వీరు కూడా రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారంతా హద్దులోని రచయితలు, వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. తండ్రి కూర్చుని చదివిస్తారు, ఇందులో కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పుష్పాల వలె తయారుచేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు, మిమ్మల్ని తండ్రి పవిత్రముగా తయారుచేస్తారు. అయినా ఒకవేళ అపవిత్రముగా అయితే కుల కళంకితులుగా అవుతారు. తండ్రికైతే తెలుసు కదా. ఇక ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇప్పిస్తారు. తండ్రితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు డ్యూటీ కూడా ఇప్పుడు పూర్తవుతుంది. సత్యయుగములోనైతే ఈ డ్యూటీ ఉండనే ఉండదు. మళ్ళీ ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తారు. ఇతను ముందు జన్మలో అలాంటి కర్మలు చేసారు కావున ఈ విధంగా అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యయుగములో ఇలా అనరు. అక్కడ చెడు కర్మల మాటే ఉండదు. ఇక్కడైతే మంచి-చెడు రెండూ ఉన్నాయి. సుఖము-దుఃఖము రెండూ ఉన్నాయి. కానీ సుఖము చాలా తక్కువుగా ఉంది. అక్కడేమో దుఃఖము అనే మాటే ఉండదు. సత్యయుగములో దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది! మీరు తండ్రి నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖము ఎప్పటినుండి ప్రారంభమవుతుంది, ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాలలోనైతే కల్పము యొక్క ఆయువునే చాలా ఎక్కువగా వ్రాసేసారు. అర్ధకల్పము కొరకు మన దుఃఖాలన్నీ హరించుకుపోతాయి మరియు మనము సుఖము పొందుతాము అని మీకు తెలుసు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, దీనిపై అర్థం చేయించడం చాలా సహజము. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలు అని అనడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి.

ఈ చక్రము 5 వేల సంవత్సరాలది అని ఇప్పుడు మీకు తెలుసు. సూర్యవంశీ, చంద్రవంశీయుల రాజ్యము ఉండేది అన్నది నిన్నటి విషయమే. బ్రాహ్మణుల యొక్క పగలు అని కూడా అంటారు, అంతేకానీ శివబాబా యొక్క పగలు అని అనరు. బ్రాహ్మణుల యొక్క పగలు, ఆ తర్వాత బ్రాహ్మణుల యొక్క రాత్రి. బ్రాహ్మణులు మళ్ళీ భక్తి మార్గములో కూడా ఉంటారు. ఇప్పుడు ఇది సంగమము. ఇది పగలూ కాదు, రాత్రీ కాదు. బ్రాహ్మణులైన మనము మళ్ళీ దేవతలుగా అవుతాము, మళ్ళీ త్రేతాలో క్షత్రియులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇది బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. వాళ్ళు అంటారు - శాస్త్రాలలో ఇంత ఆయువు అని వ్రాసి ఉంది కదా, మరి మీరు ఈ కొత్త లెక్కను ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఈ అనాది డ్రామా తయారై, తయారుచేయబడినది, ఇది ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పము సత్య, త్రేతాయుగాలని, ఆ అర్ధకల్పము తర్వాత నుండి భక్తి ప్రారంభమవుతుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అది త్రేతా మరియు ద్వాపరయుగముల సంగమము. ద్వాపరములో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి మెల్లమెల్లగా తయారవుతాయి. భక్తి మార్గపు సామాగ్రి చాలా విస్తారముగా ఉంటుంది. ఏ విధంగా వృక్షము ఎంత విస్తారముగా ఉంటుంది, దీని బీజము బాబా. ఇది తలకిందులుగా ఉన్న వృక్షము. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంది. తండ్రి వినిపించే ఈ విషయాలు పూర్తిగా కొత్త విషయాలు. ఈ దేవీ-దేవతా ధర్మ స్థాపకుడు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడైతే చిన్న పిల్లవాడు. జ్ఞానాన్ని వినిపించేవారు తండ్రి. వారు తండ్రిని తీసేసి బిడ్డ పేరు వేసేసారు. శ్రీకృష్ణుని విషయములోనే చరిత్ర మొదలైనవి చూపించారు. తండ్రి అంటారు, లీల శ్రీకృష్ణుడిదేమీ కాదు. ఓ ప్రభూ, నీ లీల అపారమైనది అని పాడుతారు కూడా. లీల ఒక్కరిదే ఉంటుంది. శివబాబా మహిమ చాలా అతీతమైనది. వారు సదా పావనముగా ఉంటారు, కానీ వారు పావన శరీరములోకైతే రాలేరు. మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయండి అనే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను కూడా పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుంది. వీరి అనేక జన్మల అంతిమములో వచ్చి ప్రవేశిస్తాను. తండ్రి అంటారు, ముఖ్యమైన విషయమేమిటంటే, భగవంతుడిని స్మృతి చేయండి, మిగతా ఇదంతా విస్తారము. వారంతా ధారణ చేయలేరు. ఎవరైతే ధారణ చేయగలుగుతారో వారికి అర్థం చేయిస్తాను. ఇకపోతే మన్మనాభవ అని చెప్తాను. బుద్ధి అయితే నంబరువారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, మరికొన్ని కాస్త వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాలు కదా. కొందరైతే ఏ మాత్రమూ వర్షించరు. జ్ఞానాన్ని ఆకర్షించే (నింపుకునే) శక్తి వారిలో లేదు. మమ్మా, బాబా మంచి మేఘాలు కదా. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యమే చేయాలి. ఎవరైతే వర్షించనే వర్షించరో వారితో సాంగత్యము చేయడం వలన ఏం జరుగుతుంది? సాంగత్య దోషము కూడా చాలా ఉంటుంది. కొందరైతే కొందరి సాంగత్యము వలన వజ్రతుల్యముగా అవుతారు, మరికొందరు కొందరి సాంగత్యము వలన రాయిలా తయారవుతారు. మంచివారిని పట్టుకోవాలి. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో, వారు తమ సమానముగా పుష్పాల వలె తయారుచేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా మరియు యోగీలుగా అయ్యారో వారి సాంగత్యము చేయాలి. నేను ఫలానావారి తోక పట్టుకుని దాటేస్తాను అని అనుకోకండి. అలా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే అటువంటి విషయము లేదు. విద్యార్థులు ఎవరి తోకనైనా పట్టుకుని పాస్ అయిపోతారా ఏమిటి! చదవవలసి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. నేను జ్ఞానము ఇవ్వాలి అని ఈ సమయములో వారికి తెలుసు. భక్తి మార్గములో - నేను వెళ్ళి జ్ఞానము ఇవ్వాలి అన్న విషయాలు వారి బుద్ధిలో ఉండవు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే వారికి సాక్షాత్కారము జరుగుతుంది. తండ్రి అంటారు, నేను కూర్చుని సాక్షాత్కారము చేయిస్తాను అని కాదు, అది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఒకవేళ ఎవరైనా దేవి సాక్షాత్కారము కోరుకుంటే, ఆ దేవి సాక్షాత్కారము చేయించరు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారాన్ని కలిగించండి అని అంటారు. తండ్రి అంటారు, డ్రామాలో నిశ్చితమై ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను.

బాబా అంటారు, నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను. వీరి నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, వీరి నేత్రాల ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరము లేనట్లయితే ఎలా చూడగలుగుతాను? పతిత ప్రపంచములోకే నేను రావలసి ఉంటుంది. స్వర్గములోకైతే నన్ను పిలవనే పిలవరు. నన్ను పిలిచేదే సంగమములో. ఎప్పుడైతే సంగమయుగములో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూడగలుగుతాను. నిరాకార రూపములోనైతే ఏమీ చూడలేను. ఇంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. బాబా అంటారు, శరీరము లేకుండా నేను ఎలా చూడగలను, కదలికలు ఎలా చేయగలను. ఈశ్వరుడు అంతా చూస్తారని, అంతా వారే చేస్తారని అనడం అంధవిశ్వాసము. మరి వారు ఎలా చూస్తారు? ఎప్పుడైతే ఇంద్రియాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. తండ్రి అంటారు, మంచి లేక చెడు పనులనేవి డ్రామానుసారముగా ప్రతి ఒక్కరూ చేస్తారు. అది నిశ్చితమై ఉంది. నేను ఏమైనా కూర్చుని ఇన్ని కోట్లాదిమంది మానవులు లెక్కను చూస్తానా, నాకు శరీరము ఉన్నప్పుడు అంతా చేస్తాను. చేసేవాడు, చేయించేవాడు అని అప్పుడే అంటారు. లేకపోతే నన్ను అలా అనలేరు. నేను ఎప్పుడైతే వీరిలోకి వస్తానో, అప్పుడే పావనముగా తయారుచేస్తాను. పైన ఆత్మ ఏం చేయగలుగుతుంది? శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తుంది కదా. నేను కూడా ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యయుగములో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది, అప్పుడు ఆత్మ కూడా శరీరములోకి వచ్చి మాట్లాడుతుంది కదా. ఇంద్రియాలు లేకుండా ఏమీ చేయలేదు. ఇది విస్తారమైన వివరణ. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రి ఇంత ఉన్నతమైనవారు, వారి నుండి వారసత్వము ఎప్పుడు లభిస్తుంది - ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అడుగుతారు కానీ అది ఎప్పుడు? ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు కొత్త విషయాలను వింటున్నారు. మనము అమరులుగా అవుతున్నామని, అమరలోకములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. మీరు అమరలోకములోకి ఎన్ని సార్లు వెళ్ళారు? అనేక సార్లు. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. మోక్షము లభించే అవకాశము లేదా అని చాలామంది అడుగుతారు. వారికి చెప్పండి - లేదు, ఇది అనాది అవినాశీ డ్రామా, ఇది ఎన్నటికీ వినాశనమవ్వదు. ఈ అనాది చక్రము తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీకు ఈ సమయములో సత్యమైన ప్రభువు గురించి తెలుసు. మీరు సన్యాసులు కదా. మీరు ఆ ఫకీరులు కాదు. సన్యాసులను కూడా ఫకీరులు అని అంటారు. మీరు రాజఋషులు. ఋషులను సన్యాసులు అని అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ సంపన్నులుగా అవుతారు. భారత్ ఎంత సంపన్నముగా ఉండేది, ఇప్పుడు ఎలాంటి ఫకీరులా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా, మీరు ఏదైతే ఇస్తారో అది ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని పాట కూడా ఉంది. మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు, దానిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి పాటలను తయారుచేసేవారు వాటి అర్థము గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవేవీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడైతే ఎన్ని విభజనలు ఉన్నాయి. అక్కడ ఆకాశము, భూమి అన్నీ మీవే. కావున అంతటి సంతోషము పిల్లలకు ఉండాలి కదా. ఎల్లప్పుడూ శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి ఎందుకంటే వారు ఎప్పుడూ సెలవు తీసుకోరు, ఎప్పుడూ అనారోగ్యంపాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారి అని అంటారు. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అన్న అహంకారము రాకూడదు. సేవ చేయడమనేది మన కర్తవ్యము, ఇందులో అహంకారము రాకూడదు. అహంకారము వచ్చిందంటే పడిపోతారు. సేవ చేస్తూ ఉండండి, ఇది ఆత్మిక సేవ. మిగిలినవన్నీ దైహికమైనవి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే చదివిస్తారో, దానికి రిటర్నులో పుష్పాల వలె తయారై చూపించాలి. కృషి చేయాలి. ఎప్పుడూ కూడా ఈశ్వరీయ కులము యొక్క పేరును అప్రతిష్టపాలు చేయకూడదు. ఎవరైతే జ్ఞానవంతులో మరియు యోగీలో, వారి సాంగత్యమే చేయాలి.

2. నేను అన్న భావనను త్యాగము చేసి నిరహంకారిగా అయి ఆత్మిక సేవను చేయాలి, దీనిని మీ కర్తవ్యముగా భావించాలి. అహంకారములోకి రాకూడదు.

వరదానము:-
వ్యర్థాన్ని కూడా శుభ భావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవా భవ

బాప్ దాదా శ్రీమతము ఏమిటంటే - పిల్లలూ, వ్యర్థ విషయాలను వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభ భావనతో ఆలోచించండి, శుభమైన మాటలు మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభ భావముతో వినండి. శుభ చింతకులుగా అయి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావమును మరియు భావనను శ్రేష్ఠముగా ఉంచుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోండి అంతేకానీ ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం యొక్క పరివర్తనయే ఇతరుల పరివర్తన, ఇందులో ముందు నేను - ఇలా మరజీవాగా అవ్వడములోనే ఆనందము ఉంది, దీనినే మహాబలి అంటారు. ఇందులో సంతోషముగా మరణించండి - ఈ మరణించడమే జీవించడము, ఇదే సత్యమైన ప్రాణదానము.

స్లోగన్:-
సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకువస్తుంది.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

సంగఠన శక్తి ఏది కావాలంటే అది చేస్తుంది. సంగఠనకు స్మృతిచిహ్నము పంచ పాండవులు. ఏకతా శక్తి, హాజీ, హాజీ అనడము, అభిప్రాయాన్ని ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ఏకత అనే బంధనములో బంధింపబడిపోవాలి. ఈ ఏకతయే సఫలతకు సాధనము.