12-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది వినాశన సమయము, రావణుడు అందరినీ శ్మశానగ్రస్థులుగా చేసేశాడు, తండ్రి అమృత వర్షాన్ని కురిపించి తమతోపాటు తీసుకువెళ్ళేందుకు వచ్చారు’’

ప్రశ్న:-
శివబాబాను భోళా భండారీ అని కూడా అంటారు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే శివ భోళానాథుడు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు వేశ్యలు, అహల్యలు, కుబ్జల యొక్క కళ్యాణాన్ని కూడా చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. వారు రావడము కూడా చూడండి, పతిత ప్రపంచము మరియు పతిత శరీరములోకి వస్తారు, అంటే భోళా అన్నట్లే కదా. భోళా తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటంటే - మధురమైన పిల్లలూ, ఇప్పుడు అమృతము తాగండి, వికారాల రూపీ విషాన్ని వదిలేయండి.

పాట:-
దూరదేశ నివాసి...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు పాట విన్నారు అనగా ఆత్మలు ఈ శరీరములోని చెవులు అనే కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. దూరదేశము యొక్క ప్రయాణికుడు వస్తారు, మీరు కూడా ప్రయాణికులే కదా. మనుష్యాత్మలెవరైతే ఉన్నారో, వారందరూ ప్రయాణికులే. ఆత్మలకు ఇల్లు అంటూ ఏదీ లేదు. ఆత్మ నిరాకారీ. నిరాకారీ ప్రపంచములో నివసించేది నిరాకారీ ఆత్మలు. దానిని నిరాకారీ ఆత్మల ఇల్లు, దేశము లేక లోకము అని అంటారు, దీనిని జీవాత్మల దేశమని అంటారు. అది ఆత్మల దేశము, తర్వాత ఆత్మలు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి శరీరములో ప్రవేశిస్తారో, అప్పుడు నిరాకారి నుండి సాకారిగా అవుతారు. ఆత్మకు ఎటువంటి రూపము లేదని కాదు, ఆత్మకు రూపము కూడా తప్పకుండా ఉంది, పేరు కూడా ఉంది. ఇంత చిన్నని ఆత్మ ఈ శరీరము ద్వారా ఎంతటి పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మలోనూ పాత్రను అభినయించేందుకు ఎంత రికార్డ్ నిండి ఉంది. రికార్డ్ ఒక్కసారి నిండిన తర్వాత ఇక ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే, అదే నడుస్తుంది. అదే విధముగా, ఆత్మ కూడా ఈ శరీరము లోపల ఒక రికార్డ్ వంటిది, ఇందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఏ విధముగా తండ్రి నిరాకారుడో, అదే విధముగా ఆత్మ కూడా నిరాకారియే. శాస్త్రాలలో అక్కడక్కడా ఆత్మ నామ-రూపాలకు అతీతమైనది అని వ్రాశారు, కానీ నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆకాశము కూడా అంతరిక్ష స్థానము కదా, దానికి ‘‘ఆకాశము’’ అనే పేరు అయితే ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువూ ఉండదు. మనుష్యులు పరమపిత పరమాత్మ అని అంటారు. ఇప్పుడు దూరదేశములోనైతే ఆత్మలందరూ ఉంటారు. ఇది సాకార దేశము, ఇందులో కూడా ఇద్దరి రాజ్యము నడుస్తుంది - రామ రాజ్యము మరియు రావణ రాజ్యము. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. తండ్రి ఎప్పుడూ పిల్లల కోసం దుఃఖము యొక్క రాజ్యాన్ని తయారుచేయరు. ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేనెప్పుడూ పిల్లలకు దుఃఖమునివ్వను. నా పేరే దుఃఖహర్త, సుఖకర్త. ఇది మనుష్యుల పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖమునివ్వరు. ఈ సమయములో ఉన్నదే దుఃఖధామము. అర్ధకల్పము రావణ రాజ్యములో దుఃఖమే దుఃఖము లభిస్తుంది. సుఖము ఇసుమంత కూడా ఉండదు. మళ్ళీ సుఖధామములో దుఃఖమనేదే ఉండదు. తండ్రి స్వర్గము యొక్క రచనను రచిస్తారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. దీనిని ఎవ్వరూ కొత్త ప్రపంచమని అనరు. కొత్త ప్రపంచము పేరే సత్యయుగము. అదే మళ్ళీ పాతదిగా అవుతుంది, అప్పుడు దానిని కలియుగమని అంటారు. కొత్త వస్తువు బాగుంటుంది మరియు పాత వస్తువు పాడైనదిగా కనిపిస్తుంది కావున పాత వస్తువును సమాప్తము చేయడము జరుగుతుంది. మనుష్యులు విషాన్నే సుఖమని భావిస్తారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తినాలి అని అంటూ ఉంటారు కూడా. భగవంతుని విషయములో ఏమంటూ ఉంటారంటే - మీ కారణముగా సర్వులకు మేలు జరుగుతుంది, మీరు వచ్చి ఏదైతే చేస్తారో దాని వలన మేలే జరుగుతుంది అని. లేదంటే రావణ రాజ్యములో మనుష్యులు చెడు కర్మలే చేస్తారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు అయ్యిందని ఇప్పుడు పిల్లలకు తెలిసింది. వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? నానక్ ఆత్మ జ్యోతి, జ్యోతిలో కలిసిపోయింది అని వారు అంటారు. మరి అటువంటప్పుడు మళ్ళీ ఎలా వస్తారు. మీరంటారు, నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురునానక్ మళ్ళీ వస్తారు. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సమయములో అందరూ తమోప్రధానముగా ఉన్నారు, దీనిని వినాశన సమయము అని అంటారు. మనుష్యులందరూ మరణించినవారి వలె ఉన్నారు. అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నట్లు ఉన్నాయి. తండ్రి అందరినీ మేలుకొలిపేందుకు వస్తారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చుని భస్మమైపోయారో, వారిని అమృత వర్షముతో మేలుకొలిపి తమతోపాటు తీసుకువెళ్తారు. మాయా రావణుడు కామ చితిపై కూర్చోబెట్టి శ్మశానగ్రస్థులుగా చేసేశాడు. అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి జ్ఞానామృతాన్ని తాగిస్తారు. ఇప్పుడు జ్ఞానామృతము ఎక్కడ మరియు ఆ నీరు ఎక్కడ. సిక్కుల యొక్క ముఖ్యమైన రోజుల్లో, వారు చాలా ఘనముగా సరోవరాన్ని శుభ్రము చేస్తారు, మట్టిని తీస్తారు, అందుకే దానికి అమృత్సర్ అన్న పేరు పెట్టారు. అమృతము యొక్క సరోవరము. గురునానక్ కూడా తండ్రి మహిమను చేసారు. ఏక్ ఓంకార్, సత్ నామ్... వారు సదా సత్యము చెప్పేవారు అని గురునానక్ స్వయముగా అంటారు. సత్యనారాయణుని కథ ఉంది కదా. మనుష్యులు భక్తి మార్గములో ఎన్ని కథలను వింటూ వచ్చారు. అమరకథ, మూడవ నేత్రము కథ... శంకరుడు పార్వతికి కథను వినిపించారని అంటారు. వారు సూక్ష్మవతన నివాసి, మరి అక్కడ ఏ కథను వినిపించారు? ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - వాస్తవానికి మీకు అమరకథను వినిపించి అమరలోకానికి తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను. మృత్యులోకము నుండి అమరలోకములోకి తీసుకువెళ్తాను. ఇకపోతే సూక్ష్మవతనములో పార్వతి ఏం తప్పు చేసారని ఆమెకు అమరకథను వినిపిస్తారు. శాస్త్రాల్లోనైతే అనేక కథలను వ్రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ అయితే లేదు. మీరు ఎన్ని సత్యనారాయణుని కథలు విని ఉంటారు. కానీ ఎవరైనా సత్యనారాయణునిగా అయ్యారా, ఇంకా దిగజారుతూనే వచ్చారు. మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అమరలోకములోకి వెళ్ళేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, మూడవ నేత్రము కథ. ఆత్మలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరే పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారు, అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు - నేనైతే సదా పూజ్యుడను. నేను వచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఇది పతిత ప్రపంచము. సత్యయుగములో పూజ్యులైన పావన మనుష్యులు ఉంటారు, ఈ సమయములో పూజారులైన పతిత మనుష్యులు ఉన్నారు. సాధు-సత్పురుషులు పతిత-పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. ఈ పదాలు సరైనవే... సీతలందరూ వధువులు. ఓ రామా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని అంటారు. భక్తురాళ్ళందరూ పిలుస్తారు, ఓ రామా అని ఆత్మ పిలుస్తుంది. గాంధీజీ కూడా గీతను వినిపించి పూర్తి చేసేటప్పుడు, ఓ పతిత-పావన సీతారామా అని అనేవారు. గీతను శ్రీకృష్ణుడేమీ వినిపించలేదని ఇప్పుడు మీకు తెలుసు. బాబా అంటారు - ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని ఒపీనియన్ (అభిప్రాయము) వ్రాయిస్తూ ఉండండి. గీతా భగవానుడు శివుడు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. ముందుగా అడగండి - గీతా భగవానుడు అని ఎవరిని అంటారు? భగవంతుడు అని నిరాకారుడిని అంటారా లేక సాకారుడిని అంటారా? శ్రీకృష్ణుడు సాకారుడు. శివుడు నిరాకారుడు. వారు కేవలం ఈ తనువును అప్పుగా తీసుకుంటారు. అంతేకానీ తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోరు. శివునికి శరీరము లేదు. ఇక్కడ ఈ మనుష్య లోకములో స్థూల శరీరము ఉంటుంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణుడి కథను వినిపిస్తారు. తండ్రి మహిమ ఏమిటంటే - పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, సర్వుల ముక్తిదాత, దుఃఖహర్త-సుఖకర్త. అచ్ఛా, సుఖము ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు. సుఖము మరుసటి జన్మలో లభిస్తుంది, పాత ప్రపంచము సమాప్తమై స్వర్గ స్థాపన జరిగినప్పుడు లభిస్తుంది. అచ్ఛా, వారు దేని నుండి విముక్తులుగా చేస్తారు? రావణుడి దుఃఖము నుండి. ఇది దుఃఖధామము కదా. అచ్ఛా, ఇంకా మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. ఇకపోతే, ఆత్మలను తీసుకువెళ్తారు. మొదట ప్రియుడు, ఆ తర్వాత ప్రేయసులు వెళ్తారు. వారు అవినాశీ, సుందరమైన ప్రియుడు. అందరినీ దుఃఖము నుండి విడిపించి, పవిత్రముగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్తారు. వివాహము చేసుకుని వచ్చినప్పుడు ముందు పతి ఉంటారు, అతని వెనుక వధువు (పత్ని) ఉంటుంది, ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంటుంది. పైన పుష్పమైన శివబాబా, వారికి నమస్కరిస్తారు. ఆ తర్వాత జంట పూసలైన బ్రహ్మా-సరస్వతులు. ఆ తర్వాత బాబాకు సహాయకులైన మీరు ఉంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశీ, విష్ణుమాలగా అయ్యారు. బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులే బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. వీరు కృషి చేసారు, అందుకే పూజింపబడతారు. మాల అంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. మాలను ఊరికే అలా తిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంటుంది. ఇది పెద్ద-పెద్ద మందిరాలలో ఉంటుంది, అప్పుడు కొందరు ఒక చోట నుండి, కొందరు ఇంకొక చోట నుండి పట్టుకుని తిప్పుతూ ఉంటారు. బాబా బొంబాయిలో లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళేవారు, అక్కడికి వెళ్ళి మాలను తిప్పేవారు, రామ-రామ అని జపించేవారు, ఎందుకంటే పుష్పము ఒక్క తండ్రియే కదా. పుష్పాన్నే రామ-రామ అని అంటారు. ఆ తర్వాత మొత్తము మాలకు తల వంచి నమస్కరిస్తారు. కానీ దానికి సంబంధించిన జ్ఞానమేమీ లేదు. ఫాదర్లు కూడా చేతితో మాలను తిప్పుతూ ఉంటారు. ఎవరి మాలను తిప్పుతున్నారు అని అడగండి. వారికైతే తెలియదు. క్రైస్ట్ స్మృతిలో తిప్పుతున్నామని అంటారు. క్రైస్ట్ ఆత్మ స్వయము ఎక్కడ ఉంది అనేది వారికి తెలియదు. క్రైస్ట్ ఆత్మ ఇప్పుడు తమోప్రధానముగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమోప్రధానముగా, బికారులుగా ఉండేవారు. ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. భారత్ రాకుమారుని వలె ఉండేది, ఇప్పుడు బికారిగా ఉంది, మళ్ళీ రాకుమారునిగా అవుతుంది. అలా తయారుచేసేవారు తండ్రి. మీరు మనుష్యుల నుండి రాకుమారులుగా అవుతారు. ప్రిన్స్ కాలేజ్ (రాకుమారుల కాలేజ్) కూడా ఒకటి ఉండేది, అక్కడకు రాకుమారులు, రాకుమార్తెలు వెళ్ళి చదువుకునేవారు.

మీరు ఇక్కడ చదువుకుని 21 జన్మల కొరకు స్వర్గములో రాకుమారులుగా, రాకుమార్తెలుగా అవుతారు. ఈ శ్రీకృష్ణుడు రాకుమారుడు కదా. వారి 84 జన్మల కథ వ్రాయబడి ఉంది. మనుష్యులకేమి తెలుసు. ఈ విషయాలు కేవలం మీకే తెలుసు. ‘‘భగవానువాచ’’, వారు అందరికీ తండ్రి. మీరు గాడ్ ఫాదర్ నుండి వింటున్నారు, వారు స్వర్గ స్థాపన చేస్తారు. దానిని సత్య ఖండమని అంటారు. ఇది అసత్య ఖండము. సత్య ఖండాన్ని అయితే తండ్రి స్థాపన చేస్తారు. అసత్య ఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుడి రూపాన్ని తయారుచేస్తారు కానీ దాని అర్థమేమీ తెలియదు. హతమారుస్తున్నా సరే, మళ్ళీ బతికిపోతున్న ఆ రావణుడు ఎవరు అనేది ఆఖరుకి ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు... వీటినే రావణుడు అని అంటారు. అతడిని హతమారుస్తారు. రావణుడిని హతమార్చి బంగారాన్ని దోచుకుంటారు.

ఇది ముళ్ళ అడవి అని పిల్లలైన మీకు తెలుసు. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరము కూడా ఉంది. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు అనగా కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు, ఆ పుష్పాలే ముళ్ళగా అవుతారు, మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇప్పుడు మీరు 5 వికారాలపై విజయము పొందుతారు. ఈ రావణ రాజ్యము యొక్క వినాశనమైతే జరిగేదే ఉంది. చివరికి పెద్ద యుద్ధము కూడా జరుగుతుంది. సత్యాతి-సత్యమైన దసరా కూడా జరగనున్నది. రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది, అప్పుడు మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు మహళ్ళు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణుడిపై విజయము ప్రాప్తి చేసుకుని స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా మొత్తం విశ్వము యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తారు, అందుకే వారిని శివ భోళా భండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలు... అందరినీ తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారు ఎంతటి భోళా అయినవారు. వారు రావడము కూడా పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తారు. ఇకపోతే, ఎవరైతే స్వర్గానికి యోగ్యులు కారో, వారు విషాన్ని తాగడము అసలు విడిచిపెట్టరు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఈ అంతిమ జన్మ పావనముగా అవ్వండి. ఈ వికారాలు మిమ్మల్ని ఆదిమధ్యాంతాలు దుఃఖితులుగా చేస్తాయి. మీరు ఈ ఒక్క జన్మ కోసం విషాన్ని తాగడము వదిలిపెట్టలేరా? నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా చేస్తాను, అయినా మీరు పవిత్రముగా అవ్వరు. విషము లేకుండా, సిగరెట్టు, మద్యం లేకుండా ఉండలేరు. అనంతమైన తండ్రినైన నేను మీకు చెప్తున్నాను - పిల్లలూ, ఈ ఒక్క జన్మ కోసం పావనముగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనము చేయడము మరియు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడము - ఇది తండ్రి పనియే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖము నుండి విడిపించి సుఖధామానికి, శాంతిధామానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మళ్ళీ స్థాపనవుతుంది. గురు గ్రంథ్ సాహెబ్ లో (సిక్కుల ధర్మ గ్రంథము) కూడా పరమపిత పరమాత్మను అకాల మూర్తి అని అంటారు. తండ్రి మహాకాలుడు, కాలుడికే కాలుడు. ఆ కాలుడు అయితే ఒకరిద్దరిని తీసుకువెళ్తాడు. నేను అయితే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను, అందుకే మహాకాలుడు అని అంటారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ జన్మలో విషాన్ని త్యజించి అమృతాన్ని తాగాలి మరియు తాగించాలి. పావనముగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేయాలి.

2. విష్ణువు మెడలోని మాల యొక్క మణిగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి, పూర్తి సహాయకులుగా అయ్యి తండ్రి సమానముగా దుఃఖహర్తలుగా అవ్వాలి.

వరదానము:-
తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వాత్మలపై తమ ప్రభావాన్ని చూపే మాస్టర్ జ్ఞానసూర్య భవ

ఏ విధముగా ఏదైనా ఆకర్షణ కలిగించే వస్తువు చుట్టుపక్కల వారిని తనవైపుకు ఆకర్షిస్తుందో, అందరి అటెన్షన్ దాని వైపుకు వెళ్తుందో, అలాగే ఎప్పుడైతే మీ వృత్తి అలౌకికముగా, ఆత్మికత కలదిగా ఉంటుందో, అప్పుడు మీ ప్రభావము అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. అలౌకిక వృత్తి అనగా అతీతమైన మరియు ప్రియమైన స్థితి, ఇది స్వతహాగా అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇటువంటి అలౌకిక శక్తిశాలీ ఆత్మలు మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి తమ ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపజేస్తారు.

స్లోగన్:-
సదా స్వమానమనే సీటుపై స్థితులై ఉన్నట్లయితే సర్వ శక్తులూ మీ ఆర్డర్ ను పాటిస్తూ ఉంటాయి.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

జ్ఞానీగా అవ్వడముతో పాటుగా స్నేహీగా అవ్వండి. స్వ సేవ విశ్వ సేవకు ఆధారము. సేవలో కేవలము రెండు పదాలను గుర్తుంచుకోండి, ఒకటి - నేను నిమిత్తుడను, రెండవది - నమ్రచిత్తులుగా అవ్వాల్సిందే. దీని వలన ఏకతతో కూడిన వాతావరణము తయారవుతుంది. ఒకరికొకరు సహయోగులుగా అవుతారు. నీది-నాది అనే భావన, కీర్తి-ప్రతిష్ఠల భావన మరియు ఘర్షణ యొక్క భావన సమాప్తమైపోతాయి.