12-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఇప్పుడు మిమ్మల్ని పాలన చేస్తున్నారు, చదివిస్తున్నారు, ఇంటిలో కూర్చుని ఉంటుండగానే సలహా ఇస్తున్నారు, కావున అడుగు అడుగులో సలహా తీసుకుంటూ ఉండండి, అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది’’

ప్రశ్న:-
శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఏ పురుషార్థము చాలా కాలముగా ఉండాలి?

జవాబు:-
నష్టోమోహులుగా అయ్యే పురుషార్థము. ఎవరి పట్ల మమకారము ఉండకూడదు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నాకు ఎవరి పట్ల మోహమైతే లేదు కదా? ఏ పాత సంబంధమూ అంతిమములో గుర్తుకు రాకూడదు. యోగబలముతో అన్ని లెక్కాచారాలను సమాప్తము చేసుకోవాలి. అప్పుడే ఏ శిక్షలూ లేకుండా ఉన్నత పదవి లభిస్తుంది.

ఓంశాంతి
ఇప్పుడు మీరు ఎవరి సమ్ముఖములో కూర్చున్నారు? బాప్ దాదా సమ్ముఖములో. వారిని తండ్రి అని కూడా అనవలసి ఉంటుంది, దాదా అని కూడా అనవలసి ఉంటుంది. తండ్రి కూడా ఈ దాదా ద్వారా మీ సమ్ముఖములో కూర్చున్నారు. మీరు బయట ఉన్నప్పుడు అక్కడ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది, ఉత్తరము వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు సమ్ముఖములో ఉన్నారు. మీరు సంభాషణ చేస్తూ ఉంటారు - ఎవరితో? బాప్ దాదాతో. వీరిరువురూ ఉన్నతోన్నతమైన అథారిటీలు. బ్రహ్మా సాకారుడు మరియు శివుడు నిరాకారుడు. ఉన్నతోన్నతమైన అథారిటీ అయిన తండ్రిని ఏ విధంగా కలుసుకోవాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు! అనంతమైన తండ్రినెవరినైతే పతిత-పావనా అంటూ పిలుస్తారో, ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు వారి సమ్ముఖములో కూర్చున్నారు. తండ్రి పిల్లలను పాలన చేస్తున్నారు, చదివిస్తున్నారు. ఇంటిలో ఈ-ఈ విధంగా నడుచుకోండి అని ఇంటిలో కూర్చుని ఉంటుండగానే పిల్లలకు సలహా లభిస్తుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడిచినట్లయితే శ్రేష్టాతి శ్రేష్టముగా తయారవుతారు. మనము ఉన్నతోన్నతమైన తండ్రి మతము ద్వారా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతామని పిల్లలకు తెలుసు. మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైనది ఈ లక్ష్మీ-నారాయణుల పదవి. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. మనుష్యులు వెళ్ళి ఈ ఉన్నతమైనవారికి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. మనుష్యులు ఎలాగూ మనుష్యులే. కానీ విశ్వానికి యజమాని అయిన వారు ఎక్కడ, నేటి ఈ మనుష్యులెక్కడ! భారత్ తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉండేదని, మనమే విశ్వానికి యజమానులుగా ఉండేవారమని మీ బుద్ధిలోనే ఉంది. ఇంకెవరి బుద్ధిలోనూ ఇది లేదు. వీరికి కూడా ఇంతకుముందు తెలియదు. పూర్తిగా ఘోర అంధకారములో ఉండేవారు. బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా ఎలా అవుతారు అనేది ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయించారు. ఇవి చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు, వీటిని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవరూ చదివించలేరు. నిరాకారుడైన తండ్రి వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణ భగవానువాచ అనేది లేదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని చదివించి సుఖవంతులుగా చేస్తాను. ఆ తర్వాత నేను నా నిర్వాణధామములోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు పిల్లలైన మీరు సతోప్రధానముగా తయారవుతున్నారు, ఇందులో ఖర్చు ఏమీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. చిల్లి గవ్వ ఖర్చు లేకుండా 21 జన్మల కొరకు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొంత ధనాన్ని పంపిస్తారు కానీ అది కూడా మీ భవిష్యత్తును తయారుచేసుకునేందుకే. కల్పపూర్వము ఎవరు ఎంత ఖజానాలో వేసారో ఇప్పుడు కూడా అంతే వేస్తారు. అంతకంటే ఎక్కువ వేయలేరు లేక తక్కువ వేయలేరు. బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది, అందుకే చింతించవలసిన విషయమేమీ లేదు. ఏ చింతా లేకుండా మనము మన గుప్త రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని బుద్ధిలో స్మరణ చేయాలి. పిల్లలైన మీరు చాలా సంతోషముగా ఉండాలి, అలాగే నష్టోమోహులుగా అవ్వాలి. ఇక్కడ నష్టోమోహులుగా అయినట్లయితే మీరు అక్కడ మోహజీతులైన రాజు-రాణులుగా అవుతారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు వినాశనమవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, కావున ఇక దీనిపై మమకారము ఎందుకు పెట్టుకోవాలి. ఎవరైనా అనారోగ్యముపాలైతే, డాక్టరు ఇది హోప్ లేస్ కేస్ అని చెప్తే, ఇక వారి నుండి మమకారము తొలగిపోతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది అని భావిస్తారు. ఆత్మ అయితే అవినాశీ అయినది కదా. ఆత్మ వెళ్ళిపోతే శరీరము అంతమైపోతుంది, మరి ఇక వారిని స్మృతి చేయడం వలన లాభమేముంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నష్టోమోహులుగా అవ్వండి. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నాకు ఎవరి పట్ల మోహము లేదు కదా? లేదంటే వారు చివరిలో తప్పకుండా గుర్తుకువస్తారు. నష్టోమోహులుగా అయితేనే ఈ పదవిని పొందుతారు. స్వర్గములోకైతే అందరూ వస్తారు - అది ఏమంత గొప్ప విషయము కాదు. గొప్ప విషయమేమిటంటే - శిక్షలు తినకుండా ఉన్నత పదవిని పొందడము. యోగబలము ద్వారా లెక్కాచారాలన్నింటినీ సమాప్తము చేసుకుంటే ఇక శిక్షలు పొందరు. పాత సంబంధీకులు కూడా గుర్తుకు రాకూడదు. ఇప్పుడైతే మనకు బ్రాహ్మణులతో సంబంధము ఉంది, ఆ తర్వాత మనకు దేవతలతో సంబంధము ఉంటుంది. ఇప్పటి ఈ సంబంధము అన్నింటికన్నా ఉన్నతమైనది.

ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుడైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తము జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనే విషయము మీకు ఇంతకుముందు తెలుసా? ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, అందుకే తండ్రి పట్ల ప్రేమ ఉంది కదా. తండ్రి ద్వారా స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. వారికి ఈ రథము నిశ్చితమై ఉంది. భారత్ లోనే భగీరథుడు అని గాయనము చేయబడింది. తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు 84 జన్మల మెట్ల వరస యొక్క జ్ఞానము ఉంది. ఈ 84 జన్మల చక్రములో మీరు తిరగవలసిందే అని మీరు తెలుసుకున్నారు. 84 జన్మల చక్రము నుండి విముక్తులవ్వలేరు. మీకు తెలుసు, మెట్లు దిగడానికి చాలా సమయము పడుతుంది, ఎక్కడానికి కేవలం ఈ అంతిమ జన్మయే పడుతుంది, అందుకే - మీరు త్రిలోకనాథులుగా, త్రికాలదర్శులుగా అవుతారు అని అంటారు. మేము త్రిలోకనాథులుగా అవ్వనున్నాము అన్న విషయము మీకు ఇంతకుముందు ఏమైనా తెలుసా? ఇప్పుడు తండ్రి లభించారు, శిక్షణను ఇస్తున్నారు కావుననే మీరు అర్థం చేసుకుంటారు. బాబా వద్దకు ఎవరైనా వస్తే బాబా అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా ఈ డ్రస్ లో, ఈ ఇంటిలోనే నన్ను కలుసుకున్నారా? అవును బాబా, కల్ప-కల్పము కలుసుకుంటాము అని అంటారు. అప్పుడు, బ్రహ్మాకుమారీ వీరికి సరిగ్గా అర్థం చేయించారు అని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గము యొక్క వృక్షాలను ఎదురుగా చూస్తున్నారు. దగ్గరగా ఉన్నారు కదా. మనుష్యులు తండ్రి విషయములో - వీరు నామ-రూపాలకు అతీతుడు అని అంటారు, మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తారు! అటువంటప్పుడు వారు కూడా నామ-రూపాలకు అతీతము అయిపోతారు! వారు ఉపయోగించే పదాలు పూర్తిగా తప్పు. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకుని ఉంటారో, వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. ప్రదర్శనీలో ఎలాంటి, ఎలాంటివారు వస్తారో చూడండి. కొందరైతే చెప్పుడు మాటలను విని ఇదంతా ఒక ఊహ అని వ్రాసేస్తారు. అప్పుడు వారు మన కులానికి చెందినవారు కాదు అని భావించడం జరుగుతుంది. అనేక రకాల మనుష్యులు ఉన్నారు. మీ బుద్ధిలో మొత్తము వృక్షము, డ్రామా మరియు 84 జన్మల చక్రము ఉంది. ఇప్పుడు పురుషార్థము చేయాలి. అది కూడా డ్రామానుసారముగానే జరుగుతుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది. అలాగని డ్రామాలో పురుషార్థము చేయాలని ఉంటే చేస్తాములే అని అనుకోవడం కూడా కాదు, ఇలా అనటం తప్పు. అటువంటివారు డ్రామాను పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఇక వారిని నాస్తికులు అని అంటారు. వారు తండ్రి పట్ల ప్రేమను పెట్టుకోలేరు. డ్రామా రహస్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే కింద పడిపోతారు. అప్పుడిక వారి భాగ్యములో లేదు అని భావించడం జరుగుతుంది. విఘ్నాలైతే అనేక రకాలవి వస్తాయి. వాటిని లెక్క చేయకూడదు. తండ్రి అంటారు, మీకు ఏవైతే మంచి మాటలు వినిపిస్తామో వాటిని వినండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఎంతో సంతోషముగా ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. పతితముగా ఉన్న మీరు వెళ్ళలేరు. మొదట తప్పకుండా ప్రియుడు ఉండాలి, వారి వెనుక ఊరేగింపు. భోళానాథుడి ఊరేగింపు అని అంటూ ఉంటారు కూడా. అందరూ నంబరువారుగా వెళ్ళవలసే ఉంటుంది. ఇంతమంది ఆత్మల గుంపు నంబరువారుగా ఎలా వెళ్తూ ఉండవచ్చు! మనుష్యులు పృథ్విపై ఎంత స్థలాన్ని ఉపయోగిస్తారు, ఎంత ఫర్నీచర్, ఆస్తి మొదలైనవి కావాలి. వాస్తవానికి ఆత్మ ఒక బిందువు. ఆత్మకు ఏమి కావాలి? ఏమీ అవసరము లేదు. ఆత్మ ఎంత తక్కువ స్థానాన్ని తీసుకుంటుంది. ఈ సాకారీ వృక్షానికి మరియు ఆ నిరాకారీ వృక్షానికి ఎంత తేడా ఉంది! అది బిందువుల వృక్షము. ఈ విషయాలన్నీ తండ్రి బుద్ధిలో కూర్చోబెడతారు. మీరు తప్ప ఈ విషయాలను ప్రపంచములో ఇంకెవరూ వినలేరు. తండ్రి ఇప్పుడు మీ ఇల్లు మరియు రాజధాని యొక్క స్మృతిని కలిగిస్తున్నారు. పిల్లలైన మీరు రచయితను తెలుసుకోవడం ద్వారా సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. మీరు త్రికాలదర్శులుగా, ఆస్తికులుగా అయ్యారు. మొత్తము ప్రపంచమంతటిలో ఆస్తికులు అంటూ ఎవరూ లేరు. అది హద్దులోని చదువు, ఇది అనంతమైన చదువు. అక్కడ అనేకమంది టీచర్లు చదివిస్తారు, ఇక్కడ ఒక్కరే టీచరు చదివిస్తారు. వీరు అద్భుతమైనవారు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, అలాగే గురువు కూడా. వీరు మొత్తం ప్రపంచమంతటికీ టీచర్. కానీ అందరూ చదివేది లేదు. తండ్రిని అందరూ తెలుసుకుంటే, ఇక బాప్ దాదాను చూసేందుకు అందరూ పరుగెడతారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆడమ్ లోకి తండ్రి వచ్చారు అని తెలిసిందంటే ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందంటే యుద్ధము ప్రారంభమైనప్పుడు, ఇక అప్పుడు ఎవరూ రాలేరు కూడా. ఈ అనేక ధర్మాల వినాశనము కూడా జరగనున్నదని మీకు తెలుసు. మొట్టమొదట ఒక్క భారత్ యే ఉండేది, అప్పుడు ఇతర ఏ ఖండమూ ఉండేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలో భక్తి మార్గపు విషయాలు కూడా ఉన్నాయి. బుద్ధి ద్వారా వాటినేమీ మర్చిపోరు కదా. కానీ అవన్నీ గుర్తున్నప్పటికీ ఈ జ్ఞానము ఉంది - భక్తి పాత్ర ఇక పూర్తయింది, ఇప్పుడిక మేము ఇంటికి వెళ్ళాలి, ఇక ఈ ప్రపంచములో ఉండేది లేదు. ఇంటికి వెళ్ళేందుకు సంతోషము ఉండాలి కదా. మీది ఇప్పుడు వానప్రస్థ అవస్థ అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. మీరు రెండు పైసలను రాజధాని స్థాపన చేయడములో ఉపయోగిస్తారు, అది కూడా కల్పపూర్వము ఏ విధంగా చేసారో ఖచ్చితముగా అలాగే చేస్తారు. మీరు కూడా ఖచ్చితముగా కల్పపూర్వము వారే. బాబా, మీరు కూడా కల్ప పూర్వము వారే అని మీరు అంటారు. మనము కల్ప-కల్పము బాబా ద్వారా చదువుకుంటాము. శ్రీమతముపై నడుస్తూ శ్రేష్టముగా తయారవ్వాలి. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. మేము శ్రీమతము ఆధారముగా మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము అని మీకు సంతోషము ఉంది. తండ్రి కేవలం - పవిత్రముగా అవ్వండి అని చెప్తున్నారు. మీరు పవిత్రముగా అయినట్లయితే మొత్తము ప్రపంచమంతా పవిత్రముగా అవుతుంది. అందరూ తిరిగి వెళ్ళిపోతారు. మిగిలిన ఇతర విషయాలను గురించి అసలు మనము ఎందుకు చింతించాలి. ఎలా శిక్షలు పొందుతారు, ఏమవుతుంది అన్నదానిలో మనదేమి పోతుంది. మనము మన గురించి చింతించాలి. ఇతర ధర్మాల వారి విషయాలలోకి మనమెందుకు వెళ్ళాలి. మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము. వాస్తవానికి దీని పేరు భరత్, ఆ తర్వాత హిందూస్థాన్ అన్న పేరు పెట్టారు. హిందూ ధర్మము అంటూ ఏదీ లేదు. మేము దేవతా ధర్మానికి చెందినవారము అని మనము వ్రాస్తాము, అయినా కానీ వారు మనల్ని హిందువులుగా వ్రాసుకుంటారు ఎందుకంటే దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది వారికి తెలియనే తెలియదు. ఎవరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఇంతమంది బి.కె.లు ఉన్నారు, మరి ఇది ఒక కుటుంబమైంది కదా! ఒక ఇల్లు అయింది కదా! బ్రహ్మా అయితే ప్రజాపిత, వారు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మొట్టమొదట మీరు బ్రాహ్మణులుగా అవుతారు, ఆ తర్వాత వర్ణాలలోకి వస్తారు.

మీకు ఇది కాలేజ్ మరియు యూనివర్శిటీ కూడా, అలాగే ఇది ఒక హాస్పిటల్ కూడా. జ్ఞానము అనే అంజనమును సద్గురువు ఇచ్చారు, అజ్ఞానము అనే అంధకారము తొలగిపోయింది... అని అంటూ ఉంటారు. యోగబలముతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యము) చేయించుకుంటారు కదా. ఇప్పుడు మీ ఆత్మ నయమవ్వడముతో ఇక శరీరము కూడా నయమవుతుంది. ఇది ఆధ్యాత్మిక నేచర్ క్యూర్. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము 21 జన్మల కొరకు లభిస్తాయి. ఆత్మిక నేచర్ క్యూర్ అన్న పేరు పైన వ్రాయండి. మనుష్యులను పవిత్రముగా తయారుచేసే యుక్తులను వ్రాయడములో తప్పేమీ లేదు. ఆత్మయే పతితముగా అయ్యింది, అందుకే పిలుస్తారు కదా. ఆత్మ మొదట సతోప్రధానముగా, పవిత్రముగా ఉండేది, తర్వాత అపవిత్రమయ్యింది, మళ్ళీ పవిత్రముగా ఎలా అవ్వాలి? భగవానువాచ - మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను - మీరు పవిత్రముగా అయిపోతారు. ఇలాంటి, ఇలాంటి బోర్డులు పెట్టండి అని బాబా ఎన్ని యుక్తులను తెలియజేస్తారు. కానీ ఎవరూ ఈ విధమైన బోర్డులు పెట్టలేదు. ముఖ్యమైన చిత్రాలు పెట్టి ఉండాలి. ఎవరైనా లోపలికి వస్తే మీరు ఇలా చెప్పండి - ఆత్మ అయిన మీరు పరంధామ నివాసి. ఇక్కడ ఈ ఇంద్రియాలు పాత్రను అభినయించడానికి లభించాయి. ఈ శరీరమైతే వినాశీ అయినది కదా. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీ ఆత్మ అపవిత్రముగా ఉంది, మళ్ళీ పవిత్రముగా అయినట్లయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇది అర్థం చేయించడము చాలా సహజమే. ఎవరైతే కల్పపూర్వము వారు ఉంటారో, వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. ఇందులో భయపడవలసిన అవసరమేమీ లేదు. మీరు మంచి విషయాలను వ్రాస్తారు కదా. ఆ గురువులు కూడా మంత్రాన్ని ఇస్తారు కదా. తండ్రి కూడా మన్మనాభవ మంత్రాన్ని ఇచ్చి, రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కూడా పరిచయాన్ని ఇవ్వండి, లైట్ హౌస్ గా కూడా అవ్వండి.

పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అయ్యేందుకు చాలా గుప్తమైన పురుషార్థము చేయాలి. ఏ విధంగా తండ్రికి, నేను ఆత్మలను చదివిస్తున్నాను అన్నది తెలుసో, అలా పిల్లలైన మీరు కూడా ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయండి. నోటితో శివ-శివ అని కూడా అనకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తలపై పాపాల భారము ఎంతో ఉంది. స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు. కల్పపూర్వము ఎవరు ఎలా, ఎలా వారసత్వాన్ని తీసుకుని ఉంటారో, వారే తమ-తమ సమయాలలో వచ్చి తీసుకుంటారు. ఇందులో ఎలాంటి మార్పులు జరగవు. దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. అప్పుడిక మాయ చెంపదెబ్బలు తినరు. దేహాభిమానములోకి రావడం వలన ఏదో ఒక వికర్మ జరుగుతుంది, ఇక దాని వలన 100 రెట్లు పాపం అవుతుంది. మెట్లు దిగడానికి 84 జన్మలు పట్టాయి, ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ ఒక్క జన్మలోనే జరుగుతుంది. బాబా వచ్చేటప్పటికి లిఫ్ట్ యొక్క ఇన్వెన్షన్ కూడా జరిగింది. పూర్వము అయితే నడుమకు చేయి ఆన్చుకుని మెట్లు ఎక్కేవారు. ఇప్పుడు సహజమైన లిఫ్టు వెలువడింది. ఇది కూడా లిఫ్ట్ వంటిదే, దీని ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తిలోకి ఒక్క సెకండులో వెళ్తారు. జీవన బంధనములోకి రావడానికి 5000 సంవత్సరాలు, 84 జన్మలు పడుతుంది. జీవన్ముక్తిలోకి వెళ్ళేందుకు ఒక్క జన్మ పడుతుంది. ఇది ఎంత సహజము. మీ కంటే వెనుక ఎవరైతే వస్తారో వారు వెంటనే పైకి ఎక్కుతారు. మేము పోగొట్టుకున్న వస్తువును ఇవ్వడానికి తండ్రి వచ్చారు అని భావిస్తారు కావున వారి మతముపై తప్పకుండా నడుస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ చింతా లేకుండా మీ గుప్తమైన రాజధానిని శ్రీమతము ఆధారముగా స్థాపన చేయాలి. విఘ్నాలను లెక్క చేయకూడదు. కల్పక్రితము ఎవరైతే సహాయము చేసారో వారు ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారు అని బుద్ధిలో ఉండాలి, ఇందులో చింతించవలసిన విషయమేమీ లేదు.

2. సదా సంతోషము ఉండాలి - ఇప్పుడు ఇది మా వానప్రస్థావస్థ, మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా గుప్తమైన కృషి చేయాలి. ఏ వికర్మలు చేయకూడదు.

వరదానము:-
ఎటువంటి భయంకరమైన సమస్యనైనా శీతలముగా చేసే సంపూర్ణ నిశ్చయబుద్ధి భవ

ఏ విధంగా తండ్రిపై నిశ్చయము ఉందో, అలా స్వయముపై మరియు డ్రామాపై కూడా సంపూర్ణ నిశ్చయము ఉండాలి. స్వయములో ఒకవేళ బలహీన సంకల్పము ఉత్పన్నమైతే బలహీన సంస్కారాలు ఏర్పడతాయి, అందుకే వ్యర్థ సంకల్పాల రూపీ బలహీనత యొక్క క్రిములను స్వయములోకి ప్రవేశించనివ్వకండి. అలాగే డ్రామా యొక్క దృశ్యాలేవైతే చూస్తారో, అందులో అలజడి యొక్క దృశ్యాలలో కూడా కళ్యాణము అనుభవమవ్వాలి. వాతావరణము చలింపజేసే విధంగా ఉన్నా, సమస్య భయంకరముగా ఉన్నా, మీరు సదా నిశ్చయబుద్ధి విజయులుగా అవ్వండి, అప్పుడు భయంకరమైన సమస్య కూడా శీతలముగా అవుతుంది.

స్లోగన్:-
ఎవరికైతే తండ్రి పట్ల మరియు సేవ పట్ల ప్రేమ ఉంటుందో, వారికి పరివారము యొక్క ప్రేమ స్వతహాగా లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

ఏ విధంగానైతే పరమాత్మ ఒక్కరే అన్నది భిన్న-భిన్న ధర్మాలవారి నమ్మకమో, అదే విధంగా యథార్థ సత్య జ్ఞానము ఒక్క తండ్రిది మాత్రమే అనగా ఒకటే మార్గము ఉంది అన్న ఈ శబ్దము ఎప్పుడైతే ప్రఖ్యాతమవుతుందో అప్పుడు ఆత్మలు అనేక చిన్న-చిన్న ఆధారాల కోసం భ్రమించటము సమాప్తమవుతుంది. ప్రస్తుతము - ఇది కూడా ఒక మార్గము, మంచి మార్గము అని భావిస్తున్నారు. కానీ చివరికి ఆ ఒక్క తండ్రి యొక్క పరిచయము ఒకటే, మార్గము ఒకటే - ఈ సత్యత యొక్క పరిచయము మరియు సత్య జ్ఞానానికి సంబంధించి శక్తి యొక్క అలను వ్యాపింపజేయండి, అప్పుడు ప్రత్యక్షతా జెండా క్రింద ఆత్మలందరూ ఆధారాన్ని పొందగలుగుతారు.