‘‘పాత సంవత్సరానికి వీడ్కోలును ఇవ్వడముతో పాటు పాత
సంస్కారాలకు వీడ్కోలును ఇచ్చి నిర్విఘ్నముగా ఉండే దృఢ
సంకల్పాన్ని తీసుకోండి మరియు దయార్ద్ర హృదయులుగా, మాస్టర్
దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము, అశాంతితో ఉన్న ఆత్మలకు
ఆధారాన్ని అందించండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరము
మరియు కొత్త ప్రపంచము కొరకు అభినందనలను తెలపడానికి,
సూక్ష్మవతనము నుండి స్థూలవతనములోకి అభినందనలను తెలపడానికి
వచ్చారు. పిల్లలందరూ కూడా స్నేహము మరియు ప్రేమతో తమ మధుబన్
ఇంటికి చేరుకున్నారు. ప్రపంచములోని వారైతే కేవలం కొత్త
సంవత్సరాన్ని జరుపుకుంటారు, అది కేవలం ఒక్క రోజు మాత్రమే
ఉంటుంది. మీరు కొత్త ప్రపంచ సంగమములో సదా జరుపుకుంటూనే ఉంటారు.
మీ ఎదురుగా కొత్త ప్రపంచము నయనాలలో సదా ఇమిడి ఉంది. దానిని
తలచుకోండి మరియు అక్కడకు చేరుకోండి. అది మీ నయనాలలోనే ఇమిడి
ఉంది కదా! ఇప్పుడిప్పుడే సంగమములో ఉన్నట్లుగా, ఈ రోజు సంగమములో
ఉన్నట్లు మరియు రేపు తమ రాజ్యములోకి వెళ్ళిపోయినట్లే అని
అనుభవమవుతుందా! ఇలా నయనాలలో స్పష్టముగా కనిపిస్తుంది.
ప్రపంచములోని వారైతే ఒకరికొకరు ఒక్క రోజుకు మాత్రమే అభినందనలను
తెలుపుకుంటారు కానీ మీకు బాప్ దాదా కానుకగా బంగారు ప్రపంచాన్ని
ఇచ్చారు, అది ఎంతోకాలం కొనసాగనున్నది. అది నయనాలలో ఏ విధముగా
ఇమిడి ఉందంటే, అక్కడికి ఒక్క సెకండులో చేరుకోగలరు. అందరి
ఎదురుగా తమ బంగారు ప్రపంచము నయనాలలో ఇమిడి ఉంది. ఒక్క సెకెండులో
చేరుకోగలరు కదా! ఈ రోజు సంగమములో ఉన్నారు, రేపు
రాజ్యాధికారులుగా అయి రాజ్యము చేస్తారు.
పూర్వజులైన మీ భక్తులు దుఃఖము మరియు అశాంతిలో ఉన్న కారణముగా
పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని ఎంతగా పిలుస్తున్నారు అనేది ఇప్పుడు
సమయమనుసారముగా మీకు తెలుసు. దుఃఖము మరియు అశాంతితో ఏ విధముగా
పిలుస్తున్నారు అన్న పిలుపులు వినిపిస్తున్నాయా? మాకు శాంతిని
ఇవ్వండి, సుఖము ఇవ్వండి, సంతోషము ఇవ్వండి... ఇలా ఇవ్వండి,
ఇవ్వండి... అన్న పిలుపులు వినిపిస్తున్నాయా? కావున ఇప్పుడు
ఆత్మలైన మీరు దయార్ద్ర హృదయుడైన, కళ్యాణకారి అయిన, దాత
పిల్లలుగా ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యాన్ని
చేయాలి. బాప్ దాదాకు అయితే ఈ దుఃఖము, అశాంతిలో ఉన్న ఆత్మల పట్ల
చాలా దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా! (దగ్గు
వచ్చింది) (ఈ రోజు బ్రహ్మాబాబా యొక్క దగ్గు వచ్చింది) మీకు కూడా
ఆత్మలపై దయ కలుగుతుంది కదా! ఇప్పుడు ఈ సంవత్సరములో, ఎందుకంటే ఈ
రోజున కొత్త సంవత్సరము కూడా వస్తూ ఉంది మరియు పాత సంవత్సరము
వెళ్ళిపోతూ ఉంది కూడా, కావున వెళ్ళిపోతూ ఉన్న ఈ సంవత్సరములో
మీరు ఏ ప్లాన్ ను తయారుచేసుకున్నారు? సంవత్సరమైతే వెళ్తుంది,
కానీ మీ అందరూ మీ కోసం సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడముతో పాటుగా
ఇంకా దేనికి వీడ్కోలు చెప్తారు? ఎలా అయితే సంవత్సరము వీడ్కోలు
తీసుకుంటుందో, అలా మీరు మీ జీవితములో దేనికి వీడ్కోలు ఇస్తారు?
మరియు దానికి బదులుగా కొత్తగా ఏమి నింపుకుంటారు? సదా కోసం
వీడ్కోలు ఇస్తారా లేక కొద్ది సమయము కోసమేనా? ఎందుకంటే బాప్ దాదా
ఏమని సూచన ఇచ్చారంటే - ఇప్పటివరకు ఏవైతే పాత సంస్కారాలు ఇంకా
మిగిలి ఉన్నాయో, ఆ సంస్కారాలను మనసు ద్వారా చూసి, తెలుసుకుని
సమాప్తము చెయ్యాల్సిందే. బాప్ దాదాకు ఈ పాత సంస్కారాలు
పురుషార్థములో విఘ్నరూపముగా కనిపిస్తుంటాయి. పిల్లలు ఒక వైపు -
బాబాయే నా ప్రపంచము అని అంటూ ఉంటారు, మరి పాత సంస్కారాలు ఎక్కడి
నుండి వచ్చాయి? ప్రపంచమే బాబా అయినప్పుడు ఇక పాత సంస్కారాలు
ఏవైతే పురుషార్థములో విఘ్నాలు కలిగిస్తాయో, అవి సమాప్తమవ్వాలి
కదా! అమృతవేళ అందరూ ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు తమ
లెక్కాపత్రాన్ని బాబాకు ఇస్తారు. అప్పుడు బాబా ఏమి చూసారంటే,
ఇప్పటివరకు కూడా పాత సంస్కారాలే పురుషార్థాన్ని ఢీలా
చేస్తున్నాయి అని పిల్లలు చెప్తారు.
కావున ఈ రోజున పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడముతో పాటు ఈ
సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇవ్వగలరా? ఇవ్వగలరా? చేతులెత్తండి.
ఇవ్వవలసి ఉంటుంది. చేతులెత్తడమైతే చాలా సహజము, కానీ మనసు యొక్క
చేతిని ఎత్తాలి. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలకు సదా కోసం
వీడ్కోలు ఇస్తారు, అందుకని చేతులెత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి.
అచ్ఛా! మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాప్ దాదాను సంతోషపరిచారు.
పిల్లలు ధైర్యము కలిగినవారు అని బాప్ దాదాకు సంతోషముగా ఉంది.
ఎక్కడైతే ధైర్యము ఉంటుందో, అక్కడ బాప్ దాదా సహయోగము సదా ఉంటుంది.
మరి ఇప్పుడు చేతులెత్తారు కనుక బాబా యొక్క చిన్న-పెద్ద
స్థానాలన్నీ నిర్విఘ్నముగా అయినట్లే కదా! ఎందుకంటే బాప్ దాదా
వద్దకు ఏదైతే రిజల్టు వస్తుందో, దానికి కారణము పాత సంస్కారాలే.
మరి ఈ రోజు సంస్కారాలను సంకల్పము ద్వారా సమాప్తము చేసారు అనగా
నిర్విఘ్న భవ అన్న వరదానాన్ని తీసుకున్నారు. తీసుకున్నారా?
వరదానము తీసుకున్నారా? ధైర్యానికి ఫలితమైతే లభిస్తుంది కదా!
బాప్ దాదా యొక్క వరదానమైతే లభించే ఉంది, అదేమిటంటే - ఒక్క అడుగు
పిల్లల ధైర్యము మరియు అనేక అడుగుల బాబా సహాయము ఉండనే ఉంది. ఈ
సంకల్పాన్ని ఈ రోజు నుండి గుర్తుంచుకోండి - నేను పాత
సంస్కారాలను ఇచ్చేసాను అని. ఒకవేళ అది మీ వద్దకు మళ్ళీ తిరిగి
వచ్చిందనుకోండి, ఏమి చేస్తారు? ఏమి చేస్తారు? ఇచ్చేసిన
వస్తువును మళ్ళీ తిరిగి తమ వద్ద పెట్టుకోవడము జరగదు ఎందుకంటే
ఇచ్చేసారు అంటే ఇక అది తమది కాదు. మరి తమది కానప్పుడు తమ వద్ద
ఎలా పెట్టుకుంటారు? బాబాకు ఇచ్చేసారు కనుక, తిరిగి బాబాకే
ఇచ్చేస్తారు కదా. పక్కా కదా, ఇచ్చేసారు కదా! పక్కానా? ఇప్పుడు
రెండు-రెండు చేతులు ఎత్తండి. పక్కా. వెనుక ఉన్నవారు కూడా
చేతులెత్తుతున్నారు.
బాప్ దాదాకు సంతోషము ఏమిటంటే, కలియుగములో ఉంటూ కూడా బాబా
ద్వారా ఏదైతే ప్రాప్తి లభించిందో, దాని అనుభవాన్ని ఇప్పుడు
సంగమములో చేస్తారు. ప్రపంచానికి ఇది కలియుగము కానీ మీ కొరకు ఇది
సంగమయుగము అనగా సర్వ ప్రాప్తుల యుగము. పరమాత్మ ప్రాప్తులు,
సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు ఏవైతే
ప్రాప్తించాయో, వాటిని ప్రాక్టికల్ గా అనుభవం చేస్తారు. మరి ఈ
రోజున ఎవరెవరైతే చేతులెత్తారో, ఆ పిల్లలందరికీ, సమ్ముఖముగా
కూర్చుని ఉన్నవారికైనా, లేక దూరంగా కూర్చుని దేశ-విదేశాలలో
వింటున్నవారికైనా, ఆ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా బాప్ దాదా ఏమి
ఇస్తున్నారు? అభినందనలనైతే ఇస్తున్నారు, కానీ అభినందనలతో పాటు
అందరి మస్తకముపై చేయి ఉంచుతున్నారు. మీరు కూడా మరియు బాప్ దాదా
కూడా మనసులో డ్యాన్స్ చేస్తున్నారు, ‘‘వాహ్ పిల్లలూ వాహ్!’’
ఇప్పుడు మీరు కూడా మనసులో డ్యాన్స్ చేస్తున్నారు కదా! హా జీ అని
చెప్పండి.
ఇప్పుడు టీచర్లు చూడండి. టీచర్లు ఎవరైతే ఉన్నారో, వారు
చేతులెత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా! బాప్ దాదాకు
అయితే ప్రతి బిడ్డ యొక్క ఈ దృఢ సంకల్పము విని సంతోషముగా ఉంది.
బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాలి అని
పిల్లలు ఏదైతే లక్ష్యము పెట్టుకున్నారో, అందులో ‘నిర్విఘ్నముగా
ఉండాలి’ అన్న ఈ దృఢ సంకల్పము సంపన్న సమయాన్ని కూడా సమీపముగా
తీసుకువస్తుంది. బాప్ దాదాకు ఈ సంతోషము కూడా ఉంది - పిల్లలందరూ
ఏదైతే సంకల్పము చేసారో, దానిని సంపన్నము చేస్తారు, మరియు
ప్రపంచములో దుఃఖిత, అశాంత ఆత్మలెవరైతే ఉన్నారో, వారికి మనసా
సేవ చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉంటారు, ఎందుకంటే
పిల్లలు పిలవడాన్ని, మొర పెట్టుకోవడాన్ని బాప్ దాదా సహించలేరు.
ఎంతైనా వారు మీ పరివారమే కదా! దుఃఖము, అశాంతి ఎంతో
పెరుగుతున్నాయి, ఇప్పుడు దయార్ద్ర హృదయులుగా అవ్వండి. దానితో
పాటు ఈ సంకల్పము కూడా చేయండి - నడుస్తూ తిరుగుతూ మరియు
విశేషముగా అమృతవేళ ఆత్మలకు మనసా సేవను తప్పకుండా చేస్తాను అని,
ఈ సంకల్పాన్ని తీసుకోగలరా? సదా కోసం పాత సంస్కారాలను సమాప్తము
చేస్తాము అన్న సంకల్పము తీసుకున్నారు కదా, సదా కోసం
తీసుకున్నారు కదా! కొద్ది సమయము కోసమైతే కాదు కదా! మరి ఎలా
అయితే సంస్కారాలను సమాప్తము చేసి బాబా సమానముగా అవుతారో, అలా
దాత పిల్లలుగా అయ్యి మాస్టర్ దాత స్వరూపముతో మనసా సేవను కూడా
చేయాలి. దాని కోసం సిద్ధముగా ఉన్నారా? మనసా సేవను చెయ్యడానికి
సిద్ధముగా ఉన్నారా? చేతులెత్తండి, మనసా సేవను కూడా చేస్తారా?
మొత్తము రోజంతటిలో ఏదైతే సమయము లభిస్తుందో, అప్పుడు మనసా సేవను
తప్పకుండా చేయండి. ఎందుకంటే పిల్లలైన మీరే సుఖమయ ప్రపంచాన్ని
తీసుకురావాలి. బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కోసమే తమ కుడి
భుజాలుగా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వడము జరుగుతుంది కదా.
మరి మీరు బాబాకు కుడి భుజాలు. మరి బాప్ దాదా కుడి భుజాలైన మీ
ద్వారా అనగా చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలని
అనుకుంటున్నారు, ఈ సేవను అందించాలని అనుకుంటున్నారు. వారు
ఇవ్వండి, ఇవ్వండి అని మొర పెట్టుకుంటున్నారు మరియు మీరు
దుఃఖములో ఉన్నవారికి సుఖాన్ని ఇచ్చి, ఆందోళనలో ఉన్నవారికి
శక్తిని ఇచ్చి పుణ్య కార్యము చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ
గురించి తెలుసుకున్నారు, బాబాను తెలుసుకున్నారు, వారసత్వానికి
అధికారులుగా అయ్యారు. అలా ఇప్పుడు ఇతరులను కూడా తయారుచేయండి
ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ
ముక్తిలోకి పంపించి మీరు బాబా వరదానముతో రాజ్య అధికారులుగా
అవుతారు, అందుకే బాబా ప్రతి బిడ్డకు ఈ సంకల్పాన్నే ఇస్తున్నారు
- నిర్విఘ్న భవ, సేవాధారి భవ. ఏ పిల్లలైతే బాబాకు చెందినవారిగా
అయ్యారో, ఆ పిల్లలకు సంగమయుగీ బ్రాహ్మణ జీవితపు ఆనందము అనుభవం
అవుతుంది మరియు అవుతూనే ఉంటుంది. కొత్తవారు వచ్చినా లేక
పాతవారైనా కానీ, ఎవరైతే స్వయాన్ని బాబా వారసత్వానికి
అధికారులుగా భావిస్తున్నారో, అతీంద్రియ సుఖము అనే ఊయలలో ఊగుతూ
ఉన్నట్లుగా భావిస్తున్నారో, మరియు భవిష్యత్తు కోసం కూడా
సంస్కారాలపై విజయులుగా అవ్వాలన్న సంకల్పము తీసుకున్నారో, ఆ
ఆత్మలందరూ కోట్లలో కొద్దిమందిగా అయ్యారా, లేక కొద్దిమందిలో కూడా
కొద్దిమందిగా అయ్యారా? జనక్ బిడ్డ ఏమన్నారంటే - 108 మాలలోకి,
16000 మాలలోకి వచ్చేవారి యొక్క మిలనము ప్రత్యేకముగా ఏర్పాటు
చేయండి అని. మరి ఎవరైతే - మేము 16000 మాలలోకి లేక 108 మాలలోకి
తప్పకుండా వస్తాము అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి.
కొత్త కొత్తవారు కూడా చేతులెత్తుతున్నారు. అభినందనలు.
నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతారు. నిశ్చయబుద్ధితో
ఉండేవారు ముందుకు వెళ్ళగలరు, వెళ్తారు అని బాప్ దాదాకు కూడా
తెలుసు. అచ్ఛా. ఎవరైతే మొదటిసారి వచ్చారో, వారు చేతులెత్తండి.
అందరి తరఫున బాప్ దాదా మీకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఎవరైతే నిశ్చయము కలిగి ఉన్నారో, వారు అమృతవేళ సదా ఈ విషయాన్ని
రివైజ్ చేస్తూ ఉండండి. అచ్ఛా. టూ లేట్ సమయము కంటే ముందు తమ
వారసత్వానికి అధికారులుగా అయినందుకు బాప్ దాదాకు పిల్లలను చూసి
సంతోషము కలుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చి ఉన్న పరివారమందరి
తరఫున మరియు తమ-తమ సెంటర్లలో ఉన్న పిల్లలందరి తరఫున కూడా బాప్
దాదా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక
అద్భుతము చేయండి, ధైర్యముందా? చెప్పండి, ధైర్యముందా? మీరు ముందు
నుండే నిర్విఘ్నముగా ఉండండి. నిశ్చయము మరియు నషాలో నంబరువన్ లో
ఉండండి. పాతవారైతే పాతవారే, కానీ కొత్తవారు కొద్ది సమయములోనే
అద్భుతాన్ని చేసి చూపిస్తారు అని బాప్ దాదాకు సంతోషము
కలుగుతుంది. అచ్ఛా.
ఇప్పుడు బాప్ దాదా కొత్తవారికైనా, పాతవారికైనా, అందరికీ
ఒక్క సెకండు యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. అందరూ ఇప్పుడిప్పుడే
ఒక్క సెకండులో తమను తాము ఇతర సంకల్పాలన్నింటి నుండి దూరం
చేసుకుని, ఒక్క సెకండులో స్వయాన్ని బిందువు రూపములో స్థితి
చేసుకోగలరా? చేస్తారా? ఒక్క సెకండులో - నేను బిందువును, మరే
ఇతర సంకల్పాలు వద్దు, నేను బిందువును. (డ్రిల్ చేయించారు)
ఎవరైతే ఒక్క సెకండులో స్వయాన్ని బిందు స్థితిలో స్థితి
చేసుకున్నారో, వారు చేతులెత్తండి. సెకండులో చేయాలి. అచ్ఛా.
ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజులు, రోజంతటిలో ప్రతి గంటలో ఒక్క
సెకండులో బిందువు పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయండి.
అక్కడ వాతావరణములో ఉంటూ, తమ కార్యాలలో ఉంటూ చెక్ చేసుకోండి,
ఒక్క సెకండులో బిందు రూపములో సఫలత లభించిందా? ఎందుకంటే ఇక్కడైతే
వాయుమండలము కూడా ఉంది కానీ తమ-తమ స్థానాలలో ఉంటూ సెకండులో బిందు
స్వరూపములో స్థితులవ్వగలరా, ఈ అభ్యాసము చేయండి, ఎందుకంటే బాప్
దాదా ఇంతకుముందు చెప్పి ఉన్నారు, ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో
అంతగా ఒక్క సెకండులో బిందు స్థితిలో స్థితి అయ్యే అవసరము
వస్తుంది, అందుకే తమను తామే చెక్ చేసుకోండి మరియు తమ-తమ
స్థానాలలోని టీచర్లకు రిపోర్టు వ్రాసి ఇవ్వండి. అప్పుడు టీచర్ల
ద్వారా, ఇక్కడ ఉన్నా లేకున్నా, అన్ని క్లాసులు వారికి ఇది హోమ్
వర్క్, తర్వాత దాని రిజల్టు బాప్ దాదా వద్దకు వస్తుంది, అప్పుడు
చూద్దాము. దాని ద్వారా - మీరు 108 మాలకు లేక 16000 మాలకు
అధికారులా అన్నది తెలుస్తుంది. సెకండులో రోజు యొక్క దినచర్యలో
ఎంత సఫలత పొందారు అన్నదాని బట్టి - మీరు దేనికి యోగ్యులు అన్నది
తెలుస్తుంది. ఎందుకంటే - ప్రాక్టికల్ ధారణ ఆధారముగా మేము 108
మాలలోకి లేక 16000 మాలలోకి వస్తాము అని భావించేవారు
చేతులెత్తండి అని ఇప్పుడు ఎత్తిస్తే అందరూ ఎత్తుతారు. అందుకే
మీరు కేవలం రిజల్టును వ్రాసి పంపండి, దాని ద్వారా అర్థమైపోతుంది,
ఎందుకంటే ఒకవేళ దాదీలు పేర్లు వ్రాసి ఇస్తే - మేము కూడా అందులో
రాగలము కదా అని కొందరు భావించవచ్చు. కావున ఈ రిపోర్టు ద్వారా
తెలుస్తుంది.
బాప్ దాదా అడుగుతున్నారు, సదా సెకండులో ఏ రూపాన్ని అనుభవం
చేయాలనుకుంటే దానిని చేయగలుగుతున్నారా? సెకండులో? 5 స్వరూపాలు
ఏవైతే వినిపించామో, అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండులో
ఆ స్వరూపములోకి రాగలరా? నేను ఏ స్థితిని కోరుకుంటే, ఆ స్థితిలో
సెకండులో స్థితి కాగలుగుతున్నానా లేక సమయము పడుతుందా అని ఈ
అభ్యాసముతో అర్థమవుతుంది. ఇకపోతే బాప్ దాదా సంతోషిస్తున్నారు,
చేతులెత్తే విషయములో మెజారిటీ చేతులెత్తుతారు. ఇప్పుడు ఈ చేతిని
ఎత్తారు, కానీ అభ్యాసము చేస్తూ-చేస్తూ ఇది ఎలా అయిపోతుందంటే
ద్వాపర-కలియుగాలలో దేహ అభిమానములోకి రావడము ఎంత నేచురల్
అయిపోయిందో, అలాగే ఏ స్వరూపములో స్థితి కావాలనుకుంటే అది కూడా
అంతే సహజము అవుతుంది ఎందుకంటే ఎటువంటి సమయము రాబోతుందంటే, మీకు
ఇటువంటి అభ్యాసము అవసరమవుతుంది. కావున ఈ అభ్యాసాన్ని ప్రతి
ఒక్కరూ తమ-తమ కార్యాలలో ఉంటూ కూడా చేస్తూ ఉండండి మరియు
రిజల్టును తమ నిమిత్త టీచర్లకు ఇస్తూ ఉండండి. మరి ఈ సంవత్సర
సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి, మీరే
మీకు టీచరుగా అవ్వండి కానీ రిజల్టు చూపించడానికి మాత్రం తమ
చార్టును ఇస్తూ ఉంటే అటెన్షన్ ఉంటుంది. ఎలా అనుభవం చేయండి అంటే,
ఎలా అయితే ఈ స్థూల చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలరు కదా,
అలాగే మనసును ఏ స్థితిలో పెట్టాలనుకుంటే అది ఆ స్థితిలో ఉండాలి.
స్మృతిచిహ్నములో కూడా మన్మనాభవయే మహామంత్రము. మనసు యొక్క డ్రిల్
లో ఎంత సఫలత లభించింది అనేది స్వయానికి స్వయమే అనుభవం చేయండి.
ఒక్కొక్క బిడ్డ ఇప్పుడు సంగమయుగ సుఖాన్ని, సంగమయుగ
ప్రాప్తులను అనుభవం చేయాలి, ప్రతి ప్రాప్తి యొక్క అనుభవీగా
అవ్వాలి అని బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. తమను తాము చెక్
చేసుకోండి - ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానము యొక్క ప్రతి
రహస్యములో, యోగము యొక్క ప్రతి విధిలో, ధారణలో కూడా ప్రతి ధారణలో
అనుభవీగా అయ్యానా. స్వయము యొక్క పూర్తి చెకింగ్ ను చేసుకుంటూ
ఉండండి మరియు ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ రోజు బాప్
దాదా - చెకింగ్ మరియు ప్రాప్తి, వీటిని చెక్ చేసుకోమని
చెప్తున్నారు. ఏ ప్రాప్తిలోనైనా తక్కువగా ఉన్నట్లయితే
డ్రామానుసారముగా పరీక్షలు కూడా సమయమనుసారముగా అవే వస్తాయి,
అందుకే అన్ని సబ్జెక్టులలోనూ సంపన్నత మరియు సంపూర్ణత యొక్క
చెకింగ్ ను చేసుకోండి మరియు ఛేంజ్ అవ్వండి.
ఈ రోజున బాప్ దాదా మీ అందరి సాధారణ స్వరూపాలలో కూడా మీ
భవిష్య రూపాన్ని, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. అచ్ఛా.
అన్ని వైపులా ఉన్న సికీలధే పిల్లలకు, బాప్ దాదా హృదయ
సింహాసనాధికారులకు, బాప్ దాదా చెప్పిన మాటను వినే పిల్లలకు,
ఆజ్ఞాకారీ పిల్లలకు, తీవ్ర పురుషార్థీ పిల్లలకు బాప్ దాదా నుండి
చాలా-చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు బాప్ దాదా యొక్క అభినందనలు,
అభినందనలు, అభినందనలు. బాప్ దాదాకు కూడా పిల్లలను చూసి సంతోషము
కలుగుతుంది. వాహ్, వాహ్! వాహ్ నా పిల్లలు వాహ్!
పూర్తి సంవత్సరమంతా నిర్విఘ్నముగా మరియు సంతోషముగా ఉండండి.
తమ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ సంతోషముగా ఉండటాన్ని
మరియు చిరునవ్వును నేర్పించండి. సదా ఎగరండి మరియు ఎగిరించండి.
నడవకండి, ఎగరండి. ఎగిరే కళ సర్వులకు ప్రియమైనది. కావున ఎగురుతూ
ఎగురుతూ సందేశాన్ని ఇవ్వండి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషమనే
ఊయలలో ఊగాలి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అచ్ఛా - ఓం శాంతి.