12-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ చదువునేదైతే తండ్రి చదివిస్తారో, ఇందులో అపారమైన సంపాదన ఉంది, అందుకే ఈ చదువును బాగా చదువుకుంటూ ఉండండి, లింక్ ఎప్పుడూ తెగిపోకూడదు’’

ప్రశ్న:-
ఎవరైతే వినాశన కాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో, వారికి మీకు చెప్పే ఏ విషయముపై నవ్వు వస్తుంది?

జవాబు:-
ఇప్పుడు వినాశన కాలము సమీపముగా ఉంది అని మీరు అన్నప్పుడు వారికి నవ్వు వస్తుంది. మీకు తెలుసు, తండ్రి అయితే ఇక్కడే కూర్చుని ఉండిపోరు, తండ్రి డ్యూటీ పావనముగా తయారుచేయడము. ఎప్పుడైతే పావనముగా అయిపోతారో అప్పుడిక ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది, కొత్తది వస్తుంది. ఈ యుద్ధము ఉన్నదే వినాశనము కొరకు. మీరు దేవతలుగా తయారైతే ఇక ఈ కలియుగ ఛీ-ఛీ సృష్టి పైకి రాలేరు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మేము చాలా అవివేకులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు. మాయా రావణుడు అవివేకులుగా చేసేశాడు. కొత్త సృష్టి స్థాపన జరగవలసినప్పుడు తండ్రి తప్పకుండా రావలసిందేనని కూడా పిల్లలు భావిస్తారు. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది - బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము. ఎందుకంటే కరన్ కరావన్ హార్ (చేసేవారు మరియు చేయించేవారు) అయితే తండ్రే కదా. స్వయం చేస్తూ మరియు చేయించేవారు వారొక్కరే. మొదట ఎవరి పేరు వస్తుంది? ఎవరైతే చేస్తారో వారి పేరు మొదట వస్తుంది, ఆ తర్వాత ఎవరి ద్వారానైతే చేయిస్తారో, వారి పేరు వస్తుంది. వారిని చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తారు. ఇది కూడా పిల్లలకు తెలుసు, మన కొత్త ప్రపంచము ఏదైతే ఉందో, దేనినైతే మనం స్థాపన చేస్తున్నామో, దాని పేరు దేవీ-దేవతల ప్రపంచము. సత్యయుగములోనే దేవీ-దేవతలు ఉంటారు. ఇంకెవరినీ ఇలా దేవీ-దేవతలు అని అనరు. అక్కడ అసలు మనుష్యులు ఉండనే ఉండరు. కేవలం ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది, ఇంకే ధర్మమూ ఉండనే ఉండదు. తప్పకుండా మనము దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. ఆ గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారందరికీ తమ-తమ గుర్తులున్నాయి. మన రాజ్యమున్నప్పుడు ఇంకెవరూ ఉండేవారు కారు. ఇప్పుడు మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కానీ మన దేవతా ధర్మమే లేదు. గీతలో చాలా మంచి-మంచి పదాలున్నాయి కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, వినాశన కాలములో విపరీత బుద్ధి మరియు వినాశన కాలములో ప్రీతి బుద్ధి. వినాశనమైతే ఈ సమయములోనే జరగాలి. తండ్రి రావడము కూడా సంగమయుగములోనే వస్తారు, పరివర్తన జరిగే సమయములో వస్తారు. తండ్రి మీకు దీనికి బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలి కూడా, చాకలి కూడా, గొప్ప వ్యాపారి కూడా. ఏ ఒక్కరో మాత్రమే తండ్రితో వ్యాపారము చేస్తారు. ఈ వ్యాపారములో అయితే అపారమైన లాభము ఉంది. చదువులో ఎంతో లాభము ఉంటుంది. చదువు అనేది సంపాదన అని మహిమ కూడా చేయడం జరుగుతుంది, అది కూడా జన్మ-జన్మాంతరాల కొరకు సంపాదన. కావున ఇటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా, అది కూడా నేను చాలా సహజముగానే చదివిస్తాను. కేవలం ఒక వారం అర్థం చేసుకుని ఆ తర్వాత ఇక ఎక్కడికైనా వెళ్ళిపోండి, మీ వద్దకు చదువు వస్తూనే ఉంటుంది అనగా మురళి లభిస్తూనే ఉంటుంది, తద్వారా ఇక ఎప్పుడూ లింక్ తెగిపోదు. ఇది ఆత్మలకు పరమాత్మతో లింక్. గీతలో కూడా ఈ మాటలు ఉన్నాయి - వినాశన కాలములో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతి బుద్ధి విజయంతి. ఈ సమయములో మనుష్యులు ఒకరినొకరు ఖండించుకుంటూ, హతమార్చుకుంటూ ఉంటారని మీకు తెలుసు. వీరిలో ఉన్నంత క్రోధము లేక వికారము ఇంకెవరిలోనూ ఉండదు. ద్రౌపది పిలిచింది అన్న గాయనము కూడా ఉంది. మీరందరూ ద్రౌపదులేనని తండ్రి అర్థం చేయించారు. భగవానువాచ, తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు వికారాలలోకి వెళ్ళకండి. నేను మిమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్తాను, మీరు కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు ఇది వినాశన కాలము కదా, ఎవరి మాటనూ వినరు, కొట్లాడుకుంటూనే ఉంటారు. శాంతిగా ఉండండి అని వారికి ఎంత చెప్పినా కానీ శాంతిగా ఉండనే ఉండరు. తమ పిల్లలు మొదలైనవారితో విడిపోయి యుద్ధ మైదానములోకి వెళ్తారు. ఎంతమంది మనుష్యులు మరణిస్తూనే ఉంటారు. మనుష్యులకు ఏ విలువ లేదు. ఏదైనా విలువ ఉంది అంటే, మహిమ ఉంది ఉంటే, అది ఈ దేవీ-దేవతలదే. ఇప్పుడు మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. మీ మహిమ వాస్తవానికి ఈ దేవతలకన్నా ఎక్కువ ఉంది. మిమ్మల్ని ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. చదువుకునేవారు అనేక జన్మల అంతిమములో పూర్తిగా తమోప్రధానముగా ఉన్నారు. నేనైతే సదా సతోప్రధానముగానే ఉంటాను.

తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు విధేయుడైన సేవకునిగా అయి వచ్చాను. మీరు ఎంత ఛీ-ఛీగా అయిపోయారో ఒక్కసారి ఆలోచించండి. తండ్రే మనల్ని వాహ్-వాహ్ గా తయారుచేస్తారు. భగవంతుడు కూర్చుని మనుష్యులను చదివించి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. స్వయం తండ్రి అంటారు - నేను అనేక జన్మల అంతిమములో మిమ్మల్నందరినీ తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారుచేయడానికి వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నాను. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేసాను, మరి మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు, ఎవరు తయారుచేసారు? వినాశన కాలములో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతి బుద్ధి విజయంతి అన్న గాయనము కూడా ఉంది. ఇక ఎంతెంతగా ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో అనగా చాలా స్మృతి చేస్తారో అంతగా మీకే లాభము. ఇది యుద్ధ మైదానము కదా. గీతలో ఏ యుద్ధము గురించి చెప్పారు అన్నది ఎవరికీ తెలియదు. వారైతే కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు. కౌరవ సాంప్రదాయము మరియు పాండవ సాంప్రదాయము కూడా ఉన్నాయి కానీ యుద్ధమంటూ ఏదీ లేదు. ఎవరికైతే తండ్రి గురించి తెలుసో, వారిని పాండవులు అని అంటారు. వారికి తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంటుంది. ఎవరికైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉందో, వారిని కౌరవులు అని అంటారు. ఈ పదాలైతే చాలా మంచి-మంచివి ఉన్నాయి, అర్థం చేసుకోదగినవిగా ఉన్నాయి.

ఇప్పుడు ఇది సంగమయుగము. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు ప్రపంచము ఎంత పెద్దగా ఉంది. సత్యయుగములో ఎంత కొద్దిమంది మనుష్యులు ఉంటారు. చిన్న వృక్షము ఉంటుంది కదా, అదే వృక్షము మళ్ళీ పెద్దగా అవుతుంది. మనుష్య సృష్టి రూపీ ఈ తలక్రిందుల వృక్షము ఎలా ఉంటుంది, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని కల్పవృక్షము అని అంటారు. వృక్షము యొక్క జ్ఞానము కూడా కావాలి కదా? ఇతర వృక్షాల జ్ఞానమైతే చాలా, చాలా సులభము, వెంటనే చెప్పేస్తారు. ఈ వృక్షము యొక్క జ్ఞానము కూడా అంతే సులభము కానీ ఇది మానవ వృక్షము. మనుష్యులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు. భగవంతుడు రచయిత అని కూడా అంటారు, అంటే తప్పకుండా వారు చైతన్యమైనవారనే కదా. తండ్రి సత్యము, చైతన్యము, జ్ఞానసాగరుడు. వారిలో ఏ జ్ఞానము ఉంది, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రే బీజరూపుడు, చైతన్యుడు. వారి ద్వారానే మొత్తం రచన అంతా జరుగుతుంది. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, మనుష్యులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు. ఇతర వృక్షాల గురించైతే బాగా తెలుసు. వృక్షము యొక్క బీజము ఒకవేళ చైతన్యముగా ఉన్నట్లయితే అది చెప్పగలదు కానీ అది జడమైనది. కావున ఇప్పుడు పిల్లలైన మీకే రచయిత మరియు రచన యొక్క రహస్యము గురించి తెలుసు. వీరు సత్యము, చైతన్యము, జ్ఞానసాగరుడు. చైతన్యమైనవారు కావున మాట్లాడగలరు కదా. మనుష్య తనువు అన్నిటికంటే ఉన్నతమైనదిగా మరియు అమూల్యమైనదిగా మహిమ చేయబడింది. దాని విలువను వర్ణించలేరు. తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు.

మీరు రూప్ కూడా, బసంత్ కూడా (యోగి, జ్ఞాని). తండ్రి జ్ఞానసాగరుడు. వారి ద్వారా మీకు రత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞాన రత్నాలు, ఈ రత్నాల ద్వారా మీకు ఆ రత్నాలు కూడా లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీ-నారాయణుల వద్ద ఎన్ని రత్నాలు ఉన్నాయో చూడండి. వారు వజ్ర-వైఢూర్యాల మహళ్ళలో ఉంటారు. దాని పేరే స్వర్గము, దానికి మీరు యజమానులుగా అవ్వనున్నారు. ఎవరైనా పేదవానికి అకస్మాత్తుగా పెద్ద లాటరీ లభిస్తే పిచ్చివాడైపోతాడు కదా. తండ్రి కూడా అంటారు, మీకు విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది కావున మాయ ఎంతగా ఎదుర్కొంటూ ఉంటుంది. మాయ ఎంత మంచి-మంచి పిల్లలను కూడా మింగేస్తుంది, ఇది మున్ముందు మీకు తెలుస్తుంది. పూర్తిగా తినేస్తుంది. మీరు పామును చూసారు, అది కప్పను ఎలా పట్టుకుంటుంది, ఏనుగును మొసలి మింగేసినట్లుగా ఉంటుంది. పాము కప్పను పూర్తిగా మొత్తానికి మింగేస్తుంది. మాయ కూడా అటువంటిదే, పిల్లలు జీవిస్తూ ఉండగానే వారిని పట్టుకుని పూర్తిగా అంతం చేసేస్తుంది, దానితో ఇక ఎప్పుడూ తండ్రి పేరును కూడా తలచుకోరు. యోగబలము యొక్క శక్తి మీలో చాలా తక్కువగా ఉంది. మొత్తం ఆధారమంతా యోగబలముపైనే ఉంది. ఏ విధముగా పాము కప్పను మింగేస్తుందో, అలా పిల్లలైన మీరు కూడా మొత్తం రాజ్యాధికారమంతటినీ మింగేస్తారు. మొత్తం విశ్వ రాజ్యాధికారాన్ని మీరు క్షణములో తీసేసుకుంటారు. తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇందులో మారణాయుధాలు మొదలైనవేవీ లేవు. తండ్రి జ్ఞాన-యోగాల అస్త్ర-శస్త్రాలను ఇస్తారు. వారేమో స్థూలమైన మారణాయుధాలు మొదలైనవాటిని చూపించారు.

పిల్లలైన మీరు ఈ సమయములో అంటారు - మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము! మీరు ఎలా కావాలనుకుంటే అలా అనండి, మేమైతే అలా తప్పకుండా ఉండేవారము. వారు కూడా మనుష్యులే కానీ గుణాలు మరియు అవగుణాలైతే ఉంటాయి కదా. దేవతలలో దైవీ గుణాలు ఉన్నాయి, అందుకే - మీరు సర్వ గుణ సంపన్నులు... నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు అని అంటూ వారి మహిమను చేస్తారు. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది అనగా దైవీ గుణము ఒక్కటి కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి ఎవరైతే ఉన్నారో, వారి గురించే తెలియదు, అందుకే వినాశన కాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు సంగమయుగములో వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది. ఇప్పుడు పాత ప్రపంచము వినాశనమవుతుంది మరియు కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. దీనిని వినాశన కాలము అని అంటారు. ఇది అంతిమ వినాశనము. మళ్ళీ అర్ధకల్పము ఎటువంటి యుద్ధము మొదలైనవి జరగనే జరగవు. మనుష్యులకు ఏమీ తెలియదు. వినాశన కాలే విపరీత బుద్ధి ఉంది కావున తప్పకుండా పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది కదా. ఈ పాత ప్రపంచములో ఎన్ని ఆపదలు ఉన్నాయి. మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయములోని పరిస్థితి గురించి చెప్తున్నారు. తేడా అయితే ఎంతో ఉంది కదా. ఈ రోజు భారత్ పరిస్థితి ఇలా ఉంది, రేపు భారత్ ఎలా ఉంటుంది? ఈ రోజు ఇలా ఉన్నారు, రేపు మీరు ఎక్కడ ఉంటారు. మొదట కొత్త ప్రపంచము ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడైతే మహళ్ళలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు మొదలైనవి ఉంటాయి. భక్తి మార్గములో కూడా మీ మందిరాలు తక్కువగా ఏమీ ఉండవు. కేవలం ఒక్క సోమనాథ మందిరము మాత్రమే ఉండదు కదా. ఎవరైనా ఒకరు తయారుచేస్తే వారిని చూసి ఇతరులు కూడా తయారుచేస్తారు. ఒక్క సోమనాథ మందిరము నుండే ఎంతగా దోచుకున్నారు. ఇక తర్వాత కూర్చుని తమ స్మృతిచిహ్నాలను తయారుచేసుకున్నారు. గోడలలో రాళ్ళు మొదలైనవి పొదుగుతారు. ఈ రాళ్ళకు విలువ ఎంత ఉంటుంది? ఇంత చిన్న వజ్రానికి కూడా ఎంత ధర ఉంది. బాబా రత్నాకరుడు, ఒక రత్తి అంత బరువు చేసే వజ్రము ఉండేది (ఒక రత్తి = 0.12 గ్రాములు), అది 90 రూపాయల విలువ చేసేది. ఇప్పుడు దాని విలువ వేల రూపాయలలో ఉంది, అవి దొరకవు కూడా. విలువ ఎంతో పెరిగిపోయింది. ఈ సమయములో విదేశాలు మొదలైన చోట్ల ధనము ఎంతో ఉంది, కానీ సత్యయుగముతో పోలిస్తే ఇవి అసలేమీ కాదు.

ఇప్పుడు తండ్రి అంటారు, వినాశన కాలములో విపరీత బుద్ధి. వినాశనము సమీపముగా ఉంది అని మీరు అంటే మనుష్యులు నవ్వుతారు. తండ్రి అంటారు, నేను ఎంత సమయము కూర్చుని ఉంటాను, నాకు ఇక్కడ ఏమైనా ఆనందం కలుగుతుందా? నేనైతే సుఖవంతునిగానూ అవ్వను, అలాగే దుఃఖితునిగానూ అవ్వను. నాపై పావనముగా తయారుచేసే డ్యూటీ ఉంది. మీరు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా తయారయ్యారు, మళ్ళీ మిమ్మల్ని ఇలా ఉన్నతముగా తయారుచేస్తాను. మనము మళ్ళీ అలా తయారవ్వనున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ తెలివి వచ్చింది, మనం ఈ దైవీ వంశానికి చెందిన సభ్యులుగా ఉండేవారము. రాజ్యము ఉండేది. మళ్ళీ ఇలాగే మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాము. ఆ తర్వాత ఇతరులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడిక ఈ చక్రము పూర్తి అవుతుంది. లక్షల సంవత్సరాల విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ యుద్ధము ఉన్నదే వినాశనపు యుద్ధము, అటువైపు అయితే చాలా ప్రశాంతముగా మరణిస్తారు. ఎటువంటి కష్టమూ ఉండదు. హాస్పిటళ్ళు మొదలైనవే ఉండవు. ఎవరు కూర్చుని సేవ చేస్తారు మరియు ఏడుస్తారు. అక్కడైతే ఈ ఆచారమే ఉండదు. వారి మృత్యువు చాలా సహజముగా అవుతుంది. ఇక్కడైతే దుఃఖితులుగా అయి మరణిస్తారు ఎందుకంటే మీరు ఎంతో సుఖాన్ని పొందారు కావున దుఃఖాన్ని కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. వారు ఈ యుద్ధము మళ్ళీ శాంతిస్తుంది అని భావిస్తారు కానీ ఇది శాంతించదు. వేటగానికి వేట, వేటకు మృత్యువు. మీరు దేవతలుగా అవుతారు, ఇక కలియుగ ఛీ-ఛీ సృష్టిపైకి అయితే మీరు రాలేరు. గీతలో కూడా ఉంది - భగవానువాచ, వినాశనాన్ని కూడా చూడు మరియు స్థాపనను కూడా చూడు. సాక్షాత్కారము జరిగింది కదా! ఫలానా, ఫలానావారు ఇలా అవుతారు అని ఈ సాక్షాత్కారాలన్నీ అంతిమములో జరుగుతాయి, అప్పుడు ఆ సమయములో ఏడుస్తారు, చాలా పశ్చాత్తాపపడతారు, శిక్షలు అనుభవిస్తారు, తమ భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపపడతారు. కానీ వారేమి చేయగలరు? ఇదైతే 21 జన్మల లాటరీ. స్మృతి అయితే కలుగుతుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా ఎవరికీ శిక్షలు లభించవు. న్యాయసభ కూర్చుంటుంది కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయములో జ్ఞాన రత్నాలను ధారణ చేసి రూప్ మరియు బసంత్ గా (జ్ఞాని, యోగి) అవ్వాలి. జ్ఞాన రత్నాల ద్వారా విశ్వ రాజ్యాధికారము యొక్క లాటరీని తీసుకోవాలి.

2. ఈ వినాశన కాలములో తండ్రిపై ప్రీతిని ఉంచి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయములో పశ్చాత్తాపపడవలసి వచ్చే విధమైన లేక భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపపడవలసి వచ్చే కర్మలేవీ చేయకూడదు.

వరదానము:-

సదా స్నేహీలుగా అయ్యి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నిశ్చిత విజయీ, నిశ్చింత భవ

స్నేహీ పిల్లలకు బాప్ దాదా ద్వారా ఎగిరే కళ యొక్క వరదానము లభిస్తుంది. ఎగిరే కళ ద్వారా క్షణములో బాప్ దాదా వద్దకు చేరుకున్నట్లయితే ఏ రూపములో వచ్చిన మాయ అయినా సరే, అది మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. పరమాత్ముని ఛత్రఛాయ లోపలకు మాయ నీడ కూడా రాలేదు. స్నేహము శ్రమను మనోరంజనములోకి పరివర్తన చేసేస్తుంది. స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవము చేయిస్తుంది, స్నేహీ పిల్లలు అన్నివేళలా నిశ్చింతులుగా ఉంటారు.

స్లోగన్:-

నథింగ్ న్యూ స్మృతి ద్వారా సదా అచలముగా ఉన్నట్లయితే సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు.