13-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పతితుల నుండి పావనులుగా తయారుచేసే
తండ్రిపై మీకు చాలా-చాలా ప్రేమ ఉండాలి, ఉదయముదయమే లేచి మొట్టమొదటగా - శివబాబా, గుడ్
మార్నింగ్ అని చెప్పండి’’
ప్రశ్న:-
ఏక్యురేట్
స్మృతి కొరకు ఏ ధారణలు కావాలి? ఏక్యురేట్ స్మృతి కలిగినవారి లక్షణాలు ఏముంటాయి?
జవాబు:-
ఏక్యురేట్
స్మృతి కొరకు ఓర్పు, గంభీరత మరియు వివేకము కావాలి. ఈ ధారణల ఆధారముతో ఎవరైతే స్మృతి
చేస్తారో వారి స్మృతి, స్మృతితో కలుస్తుంది మరియు తండ్రి నుండి కరెంట్ రావటము
మొదలవుతుంది. ఆ కరెంట్ తో ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు. హృదయము
పూర్తిగా శీతలమైపోతుంది, ఆత్మ సతోప్రధానముగా అవుతూ ఉంటుంది.
ఓంశాంతి
తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, తతత్వమ్ అనగా ఆత్మలైన మీరు కూడా శాంత స్వరూపులే.
ఆత్మలైన మీ అందరి స్వధర్మమే శాంతి. శాంతిధామము నుండి మళ్ళీ ఇక్కడకు వచ్చి టాకీగా
అవుతారు (వాచాలోకి వస్తారు). ఈ కర్మేంద్రియాలు మీకు పాత్రను అభినయించేందుకు
లభిస్తాయి. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరము చిన్నగా, పెద్దగా అవుతుంది. తండ్రి
అంటారు, నేనైతే శరీరధారిని కాను. నేను పిల్లలను సమ్ముఖముగా కలుసుకునేందుకు రావలసి
ఉంటుంది. ఎవరైనా తండ్రికి బిడ్డ పుడితే, ఆ బిడ్డ - నేను పరంధామము నుండి జన్మ
తీసుకుని మాతా-పితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనడు కదా. ఎవరి శరీరములోకైనా
కొత్త ఆత్మ వచ్చినా, లేక పాత ఆత్మ ఎవరి శరీరములోకైనా ప్రవేశించినా, నేను మాతా-పితలను
కలుసుకునేందుకు వచ్చాను అని అనదు. వారికి ఆటోమేటిక్ గా మాతా-పితలు లభిస్తారు. ఇక్కడ
ఇది కొత్త విషయము. తండ్రి అంటారు, నేను పరంధామము నుండి వచ్చి పిల్లలైన మీ సమ్ముఖములో
ఉన్నాను. పిల్లలకు మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తాను ఎందుకంటే నేను నాలెడ్జ్ ఫుల్, జ్ఞాన
సాగరుడను... నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు
వస్తాను. రాజయోగాన్ని నేర్పించేవారు భగవంతుడే. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పాత్ర లేదు.
ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే. ఈశ్వరుని పాత్ర ఈశ్వరునిది. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా స్వయాన్ని
భావించటం ఎంత మధురముగా అనిపిస్తుంది. మనము ఎలా ఉండేవారము! ఇప్పుడు ఎలా
తయారవుతున్నాము!
ఈ డ్రామా ఎంత అద్భుతముగా తయారై ఉంది, ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది
పురుషోత్తమ సంగమయుగము అని ఈ మాత్రము గుర్తు ఉన్నా కూడా మేము సత్యయుగములోకి
వెళ్ళనున్నాము అన్నది పక్కా అయిపోతుంది. ఇప్పుడు సంగమములో ఉన్నాము, మళ్ళీ మన ఇంటికి
వెళ్ళాలి, అందుకే పావనముగా అయితే తప్పకుండా అవ్వాలి. లోపల చాలా సంతోషము ఉండాలి. ఓహో!
అనంతమైన తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు
సతోప్రధానముగా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి ఎంతగా పిల్లలను
ప్రేమిస్తారు. కేవలం టీచరు రూపములో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు. వీరు
తండ్రి కూడా, టీచరు కూడా. మిమ్మల్ని చదివిస్తారు కూడా. స్మృతియాత్రను కూడా
నేర్పిస్తారు.
ఇలా విశ్వానికి యజమానిగా తయారుచేసే, పతితము నుండి పావనముగా తయారుచేసే తండ్రిపై చాలా
ప్రేమ ఉండాలి. ఉదయముదయమే లేవటముతోనే మొట్టమొదటగా శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి.
గుడ్ మార్నింగ్ చెప్పినట్లయితే అనగా స్మృతి చేసినట్లయితే చాలా సంతోషములో ఉంటారు.
పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత
స్మృతి చేస్తున్నాము? మనుష్యులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా! భక్తిని ఎంత ప్రేమతో
చేస్తారు. కానీ బాబాకు తెలుసు, చాలామంది పిల్లలు హృదయపూర్వకముగా, ప్రాణముగా, ప్రేమతో
స్మృతి చెయ్యరు. ఉదయమే లేచి తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి, జ్ఞాన చింతనలో
ఉన్నట్లయితే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే
పాపాల భారము ఎలా దిగుతుంది. ముఖ్యమైనది స్మృతియే, దీని ద్వారా భవిష్యత్తు కొరకు మీకు
చాలా భారీ సంపాదన జరుగుతుంది. కల్ప-కల్పాంతరాలు ఈ సంపాదన పనికొస్తుంది. చాలా ఓర్పుతో,
గంభీరతతో, వివేకముతో స్మృతి చేయవలసి ఉంటుంది. మేము బాబాను చాలా స్మృతి చేస్తున్నాము
అని పైపైన అయితే అంటుంటారు కానీ ఏక్యురేట్ గా స్మృతి చెయ్యటములో శ్రమ ఉంటుంది.
ఎవరైతే తండ్రిని ఎక్కువ స్మృతి చేస్తారో, వారికి కరెంట్ ఎక్కువ లభిస్తుంది ఎందుకంటే
స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యోగము మరియు జ్ఞానము అనేవి రెండు విషయాలు. యోగమనే
సబ్జెక్ట్ వేరు, అది చాలా భారీ సబ్జెక్ట్. యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానముగా
అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానముగా అవ్వటము అసంభవము. మంచి రీతితో ప్రేమగా
తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్ గా కరెంట్ లభిస్తుంది, ఆరోగ్యవంతులుగా
అవుతారు. కరెంట్ ద్వారా ఆయుష్షు కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా
సర్చ్ లైట్ ఇస్తారు. తండ్రి పిల్లలైన మీకు ఎంతటి భారీ ఖజానాను ఇస్తారు.
మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి - శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు.
శివబాబా పతిత-పావనుడు కూడా, సద్గతిదాత కూడా. సద్గతిని ఇవ్వటము అనగా స్వర్గ
రాజ్యాన్ని ఇస్తారు. బాబా ఎంత మధురమైనవారు. వారు ఎంత ప్రేమగా కూర్చుని పిల్లలను
చదివిస్తారు. తండ్రి, దాదా ద్వారా మనల్ని చదివిస్తారు. బాబా ఎంత మధురమైనవారు. వారు
ఎంతగా ప్రేమిస్తారు. ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం - నన్ను గుర్తు చెయ్యండి మరియు
చక్రాన్ని గుర్తు చెయ్యండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో హృదయము పూర్తిగా
శీతలమైపోవాలి. ఒక్క తండ్రి స్మృతే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంతటి భారీ
వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని చూసుకోవాలి - మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది,
ఎంతవరకు మాలో దైవీ గుణాలు ఉన్నాయి? ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి
పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంతగా యోగములో ఉంటారో, అంతగా ముళ్ళ నుండి పుష్పాలుగా,
సతోప్రధానముగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా తయారైనా తర్వాత ఇక ఇక్కడ ఉండలేరు. పుష్పాల
తోటగా ఉన్నదే స్వర్గము. ఎవరైతే ఎంతోమందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారో,
వారినే సత్యమైన సుగంధభరితమైన పుష్పము అని అంటారు. వారు ఎప్పుడూ ఎవరికీ ముల్లు
గుచ్చరు. క్రోధము కూడా చాలా పెద్ద ముల్లు, అది చాలామందికి దుఃఖము ఇస్తుంది. ఇప్పుడు
పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచము నుండి తీరానికి వచ్చేసారు, మీరు సంగమములో ఉన్నారు. ఏ
విధముగా తోటమాలి పూలను వేరు చేసి పూలకుండీలో పెడతారో, అలాగే పుష్పాలైన మిమ్మల్ని
కూడా సంగమయుగమనే పూలకుండీలో విడిగా ఉంచటం జరిగింది. తర్వాత పుష్పాలైన మీరు
స్వర్గములోకి వెళ్ళిపోతారు, కలియుగీ ముళ్ళు భస్మమైపోతాయి.
పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశీ వారసత్వము లభిస్తుంది అని మధురమైన పిల్లలకు
తెలుసు. సత్యాతి సత్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే బాప్ దాదాపై పూర్తి
ప్రేమ ఉందో, వారికి - మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అని చాలా సంతోషము ఉంటుంది.
అయితే, పురుషార్థము ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు, కేవలం అలా అనటం ద్వారా
కాదు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారికి సదా గుర్తుంటుంది - మేము మా కొరకు
మళ్ళీ అదే సూర్యవంశ, చంద్రవంశ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని. తండ్రి అంటారు,
మధురమైన పిల్లలూ, ఎంతగా మీరు అనేకలు కళ్యాణము చేస్తారో అంతగా మీకు ప్రతిఫలము
లభిస్తుంది. అనేకులకు మార్గాన్ని తెలియజేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి.
జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకొని మళ్ళీ దానము చెయ్యాలి. జ్ఞానసాగరుడు మీకు జ్ఞాన
రత్నాలతో పళ్ళెములను నింపి నింపి ఇస్తారు. ఎవరైతే తిరిగి దానము చేస్తారో, వారే
అందరికీ ప్రియమనిపిస్తారు. పిల్లలకు లోపల ఎంత సంతోషము ఉండాలి. వివేకవంతులైన పిల్లలు
ఎవరైతే ఉంటారో, వారు అంటారు - మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము,
వారికి పూర్తిగా అతుక్కుని ఉంటాము. తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణదానము
ఇచ్చే తండ్రి లభించారు అన్నది వారికి తెలుసు. జ్ఞానము అనే వరదానాన్ని ఎలా ఇస్తారంటే
ఇక దాని ద్వారా ఎలా ఉన్న మనము ఎలా తయారవుతాము. దివాలా నుండి సంపన్నులుగా అవుతారు,
భండారమును అంతగా నింపేస్తారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ప్రేమ ఉంటుంది,
ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రముగా ఉంటే అయస్కాంతము వైపుకు ఆకర్షింపబడుతుంది కదా.
తండ్రి స్మృతి ద్వారా తుప్పు తొలగిపోతూ ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ
గుర్తుకు రాకూడదు. స్త్రీకి తన పతిపై ఎంత ప్రేమ ఉంటుంది. మీకు కూడా నిశ్చితార్థము
అయింది కదా. నిశ్చితార్థపు సంతోషము ఏమైనా తక్కువ ఉంటుందా ఏమిటి? శివబాబా అంటారు -
మధురమైన పిల్లలూ, మీకు నాతో నిశ్చితార్థమైంది, బ్రహ్మాతో నిశ్చితార్థమవ్వలేదు.
నిశ్చితార్థము పక్కా అయినట్లయితే ఇక వారి స్మృతియే సతాయిస్తూ ఉండాలి.
తండ్రి అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, నిర్లక్ష్యము చేయకండి. స్వదర్శన
చక్రధారులుగా అవ్వండి, లైట్ హౌస్ లుగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అయ్యే
అభ్యాసము బాగా అయినట్లయితే ఇక మీరు జ్ఞాన సాగరులుగా అయిపోతారు. ఏ విధంగా విద్యార్థి
చదువుకుని టీచరుగా అయిపోతారు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా
తయారుచెయ్యండి, అప్పుడే చక్రవర్తి రాజు-రాణులుగా అవుతారు. అందుకే బాబా సదా పిల్లలను
అడుగుతారు - మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి కూర్చున్నారా? తండ్రి కూడా స్వదర్శన
చక్రధారి కదా. తండ్రి మధురమైన పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు.
పిల్లలైన మీరు లేకపోతే నాకు కూడా విశ్రాంతి లేనట్లు అనిపిస్తుంది. ఆ సమయము
వచ్చినప్పుడు నాకు కూడా అవిశ్రాంతముగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక నేను వెళ్తాను,
పిల్లలు చాలా పిలుస్తున్నారు, చాలా దుఃఖితులుగా ఉన్నారు అని అనిపిస్తుంది. దయ
కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి నడవాలి. మళ్ళీ అక్కడి నుండి మీ అంతట మీరే
సుఖధామములోకి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీకు సహచరునిగా అవ్వను. మీ అవస్థ అనుసారముగా
మీ ఆత్మ వెళ్ళిపోతుంది.
పిల్లలైన మీకు ఈ నషా ఉండాలి - మేము ఆత్మిక విశ్వవిద్యాలయములో చదువుతున్నాము, మేము
ఈశ్వరీయ విద్యార్థులము, మేము మనుష్యుల నుండి దేవతలుగా మరియు విశ్వానికి యజమానులుగా
అయ్యేందుకు చదువుతున్నాము. దీని ద్వారా మేము మొత్తము మినిస్ట్రీలన్నింటిలో పాస్
అయిపోతాము. ఆరోగ్యము గురించిన చదువును కూడా చదువుతాము, క్యారెక్టర్ ను
తీర్చిదిద్దుకునే జ్ఞానాన్ని కూడా చదువుతాము. హెల్త్ మినిస్ట్రీ, ఫుడ్ మినిస్ట్రీ,
ల్యాండ్ మినిస్ట్రీ, బిల్డింగ్ మినిస్ట్రీ, అన్నీ ఇందులో వచ్చేస్తాయి.
మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చుని ఇలా అర్థం చేయిస్తారు - ఏదైనా సభలో భాషణ
చేసేటప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు, ఘడియ-ఘడియ వారికి ఇలా చెప్పండి -
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మను స్మృతి చెయ్యండి. ఈ స్మృతి ద్వారానే మీ
వికర్మలు వినాశనమవుతాయి, మీరు పావనముగా అయిపోతారు. ఘడియ-ఘడియ దీనిని గుర్తు
చేసుకోవాలి. కానీ మీరు స్వయము ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో అప్పుడే ఇలా చెప్పగలరు. ఈ
విషయములో పిల్లలు చాలా బలహీనముగా ఉన్నారు. పిల్లలు ఆంతరికముగా సంతోషముగా ఉంటే,
స్మృతిలో ఉంటే, అప్పుడు ఇతరులకు అర్థం చేయించటములో ప్రభావము ఉంటుంది. మీరు ఎక్కువేమీ
మాట్లాడకూడదు. ఆత్మ-అభిమానులై కొంచెము అర్థం చేయించినా గురి కూడా తగులుతుంది. తండ్రి
అంటారు, పిల్లలూ - గతం గతః. ఇప్పుడు మొదటగా స్వయాన్ని తీర్చిదిద్దుకోండి. స్వయము
స్మృతి చేయకుండా, ఇతరులకు చెప్తూ ఉన్నట్లయితే, ఈ మోసము నడవదు. లోపల మనసు తప్పకుండా
తింటూ ఉంటుంది. తండ్రిపై పూర్తి ప్రేమ లేకపోతే శ్రీమతముపై నడవరు. అనంతమైన తండ్రి
ఇచ్చేటటువంటి శిక్షణను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఈ పాత
ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. చివరిలోనైతే ఇవన్నీ మర్చిపోవలసే ఉంటుంది. బుద్ధి
తన శాంతిధామము మరియు సుఖధామములో నిమగ్నమైపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ, చేస్తూ
తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు. అది ఉన్నదే పావన ఆత్మల
ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో తయారై ఉంది. కనుక పంచ తత్వాలు ఇక్కడ ఉండేందుకు
లాగుతాయి ఎందుకంటే ఆత్మ దీనిని తన ఆస్తిలా తీసుకుంది, అందుకే శరీరముపై మమకారము
ఏర్పడింది. ఇప్పుడు దీని నుండి మమకారాన్ని తొలగించి తమ ఇంటికి వెళ్ళాలి. అక్కడైతే ఈ
పంచ తత్వాలు ఉండవు. సత్యయుగములో కూడా శరీరము యోగబలము ద్వారా తయారవుతుంది. సతోప్రధాన
ప్రకృతి ఉంటుంది, అందుకే అది లాగదు. దుఃఖము ఉండదు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా
సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ పంచ తత్వాల బలము ఆత్మను లాగుతుంది, అందుకే శరీరము
వదలడానికి మనసు ఒప్పుకోదు. లేదంటే ఇందులో ఇంకా ఎక్కువ సంతోషించాలి. పావనముగా అయ్యి
శరీరాన్ని ఎలా వదులుతారంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభముగా వదులుతారు.
కనుక శరీరము నుండి, అన్ని విషయాల నుండి మమకారాన్ని పూర్తిగా తొలగించాలి. దీనితో మనకే
కనెక్షన్ లేదు. మనము బాబా వద్దకు వెళ్తాము, అంతే. ఈ ప్రపంచము నుండి మన
బ్యాగ్-బ్యాగేజీ అంతా తయారుచేసి ముందుగానే పంపేసాము. అది మనతో పాటు అయితే రాదు.
ఇకపోతే, ఆత్మలు వెళ్ళవలసి ఉంటుంది. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేస్తాము. బాబా కొత్త
శరీరము యొక్క సాక్షాత్కారము చేయించారు. వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళు లభిస్తాయి.
అటువంటి సుఖధామములోకి వెళ్ళేందుకు ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. అలసిపోకూడదు.
రాత్రింబవళ్ళు చాలా సంపాదన చేసుకోవాలి, అందుకే తండ్రి అంటారు - నిద్రను జయించే
పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు విచార సాగర మంథనము చెయ్యండి. డ్రామా
రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలముగా అయిపోతుంది. మహారథి
పిల్లలెవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే వారు
సంభాళిస్తారు కూడా.
తండ్రి పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుండి విడిపించి శాంతి దానమును ఇస్తారు. మీరు కూడా
శాంతి దానమును ఇవ్వాలి. మీ ఈ అనంతమైన శాంతి అనగా యోగబలము ఇతరులను కూడా పూర్తిగా
శాంతిమయముగా చేస్తుంది. వీరు మన ఇంటివారా, కాదా అన్నది వెంటనే తెలిసిపోతుంది. వీరు
మా బాబా అని ఆత్మకు వెంటనే ఆకర్షణ కలుగుతుంది. నాడిని కూడా చూడవలసి ఉంటుంది. ఈ ఆత్మ
మన కులానికి చెందినదా కాదా అని తండ్రి స్మృతిలో ఉండి చూడండి. ఒకవేళ మన కులానికి
చెందినది అయినట్లయితే ఒక్కసారిగా శాంతిగా అయిపోతుంది. ఎవరైతే ఈ కులానికి చెందినవారు
ఉంటారో, వారికే ఈ విషయాలలో రసము అనుభవమవుతుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా
ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమించటం జరుగుతుంది. ఎవరైతే చాలా భక్తి చేసారో, వారే
ఎక్కువగా చదువుకుంటారు అన్నది కూడా తెలుసు. తండ్రిపై ఎంత ప్రేమ ఉంది అన్నది వారి
ముఖము ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనల్ని
చదివిస్తున్నారు. నేను ఇంత చిన్న బిందువులా ఉన్న ఆత్మకు చదివిస్తున్నాను అని తండ్రి
కూడా అనుకుంటారు. మున్ముందు మీకు ఇటువంటి అవస్థ ఏర్పడుతుంది. మేము సోదరులకు
చదివిస్తున్నాము అని అర్థం చేసుకుంటారు. ముఖము సోదరిదైనా కానీ దృష్టి ఆత్మవైపుకు
వెళ్ళాలి. శరీరము వైపుకు దృష్టి అస్సలు వెళ్ళకూడదు, ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా
సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. దీనిని తూకం వేసినట్లయితే ఈ చదువు
వైపు చాలా బరువు అయిపోతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకుని తిరిగి దానము కూడా చెయ్యాలి. ఎవరైతే దానము
చేస్తారో, వారు అందరికీ ప్రియమనిపిస్తారు, వారికి అపారమైన సంతోషము ఉంటుంది.
2. ప్రాణదానమును ఇచ్చే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతి
దానమును ఇవ్వాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ జ్ఞానసాగరులుగా అవ్వాలి.
వరదానము:-
అంతః వాహక శరీరము (సూక్ష్మ శరీరము) ద్వారా సేవ చేసే కర్మబంధన
ముక్త డబుల్ లైట్ భవ
ఏ విధముగా స్థూల శరీరము ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా
ఉంటారో, అలా మీ ఆకారీ శరీరము ద్వారా అంతః వాహక సేవను కూడా తోడుతోడుగా చేస్తూ ఉండాలి.
ఏ విధముగా బ్రహ్మా ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో, అలా ఇప్పుడు మీ సూక్ష్మ
శరీరాల ద్వారా, శివశక్తి కంబైండ్ రూపము యొక్క సాక్షాత్కారము ద్వారా సాక్షాత్కారము
మరియు సందేశము లభించే కార్యము జరగాలి. కానీ ఈ సేవ కొరకు - కర్మలు చేస్తూ కూడా ఏ
కర్మల బంధనము నుండైనా ముక్తులుగా, సదా డబుల్ లైట్ రూపములో ఉండండి.
స్లోగన్:-
మననము
చేయడము ద్వారా సంతోషము రూపీ వెన్న ఏదైతే వెలువడుతుందో - అదే జీవితాన్ని శక్తిశాలిగా
చేస్తుంది.
మీ శక్తిశాలీ మనసా
ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి
మాకైతే సేవా అవకాశము
లేదు అని ఎవ్వరూ అనటానికి అవకాశము లేదు. ఎవరైనా మాట్లాడలేకపోతే మనసా వాయుమండలము
ద్వారా సుఖపు వృత్తి, సుఖమయ స్థితి ద్వారా సేవ చెయ్యండి. ఆరోగ్యము బాగాలేకపోతే
ఇంట్లో కూర్చుని కూడా సహయోగులుగా అవ్వండి, కేవలం మనసాలో శుద్ధ సంకల్పాల స్టాక్ ను
జమ చేసుకోండి, శుభ భావనలతో సంపన్నముగా అవ్వండి.
| | |