13-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పదవికి ఆధారము చదువు, పాత భక్తులు
ఎవరైతే ఉంటారో వారు బాగా చదువుకుంటారు మరియు పదవి కూడా మంచిది పొందుతారు’’
ప్రశ్న:-
ఎవరైతే తండ్రి
స్మృతిలో ఉంటారో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
స్మృతిలో
ఉండేవారిలో మంచి గుణాలు ఉంటాయి. వారు పవిత్రముగా అవుతూ ఉంటారు. రాయల్టీ పెరుగుతూ
ఉంటుంది. పరస్పరములో మధురముగా క్షీరఖండములా (పాలు-పంచదార వలె కలిసి మెలిసి) ఉంటారు,
ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటారు. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు అని వారి
బుద్ధిలో ఉంటుంది.
ఓంశాంతి
భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఏదైతే ఉందో, దాని శాస్త్రము గీత అని
పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఈ గీతను ఎవరు గానము చేసారు, ఇది ఎవరికీ తెలియదు.
ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఇకపోతే ఈ హోలీ మొదలైనవేవీ మన పండుగలు కావు,
ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన పండుగలు. పండుగనేది కేవలం ఒక్క త్రిమూర్తి
శివజయంతి మాత్రమే. అంతే. కేవలము శివజయంతి అని ఎప్పుడూ అనకూడదు. త్రిమూర్తి అన్న పదము
ఉపయోగించకపోతే మనుష్యులు అర్థం చేసుకోరు. ఏ విధంగా త్రిమూర్తి చిత్రము ఉంది, దాని
కింద - దైవీ స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారము అని వ్రాసి ఉండాలి. శివ భగవానుడు
తండ్రి కూడా కదా. వారు తప్పకుండా వస్తారు, వచ్చి స్వర్గానికి యజమానులుగా
తయారుచేస్తారు. స్వర్గానికి యజమానులుగా అయ్యిందే రాజయోగాన్ని నేర్చుకోవడము ద్వారా.
లోపల చిత్రాలలోనైతే ఎంతో జ్ఞానము ఉంది. చిత్రాలను ఏ విధంగా తయారుచేయాలంటే వాటిని
చూసి మనుష్యులు ఆశ్చర్యపోవాలి. అది కూడా ఎవరైతే చాలా ఎక్కువ భక్తి చేసి ఉంటారో, వారే
చాలా బాగా జ్ఞానాన్ని తీసుకుంటారు. తక్కువ భక్తిని చేసేవారు జ్ఞానాన్ని కూడా
తక్కువగానే తీసుకుంటారు కావున పదవిని కూడా తక్కువగానే పొందుతారు. దాస-దాసీలలో కూడా
నంబరువారుగా ఉంటారు కదా. మొత్తము ఆధారమంతా చదువు పైనే ఉంది. మీలో కూడా మంచి రీతిలో
యుక్తిగా మాట్లాడగలిగేవారు చాలా తక్కువమంది ఉన్నారు. మంచి పిల్లల నడవడిక కూడా మంచిగా
ఉంటుంది. గుణాలు కూడా సుందరముగా ఉండాలి. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా
పవిత్రముగా అవుతూ ఉంటారు మరియు రాయల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని-కొన్ని చోట్ల
అయితే శూద్రుల నడవడిక చాలా బాగుంటుంది మరియు ఇక్కడ బ్రాహ్మణ పిల్లల యొక్క నడవడిక ఎలా
ఉందంటే, ఇక అడగకండి, అందుకే వాళ్ళు కూడా అంటారు - ఏమిటి వీరిని ఈశ్వరుడు
చదివిస్తున్నారా! కావున పిల్లల యొక్క నడవడిక ఈ విధంగా ఉండకూడదు. చాలా మధురముగా
క్షీరఖండము వలె ఉండాలి. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు, చేయకపోతే పొందరు. తండ్రి
అయితే బాగా అర్థము చేయిస్తూ ఉంటారు. మొట్టమొదటైతే అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని
ఇస్తూ ఉండండి. త్రిమూర్తి చిత్రమైతే చాలా బాగుంది - అందులో స్వర్గము మరియు నరకము
కూడా రెండూ వైపులా ఉన్నాయి. సృష్టి చక్రములో కూడా స్పష్టముగా ఉంది. ఏ ధర్మము
వారికైనా ఈ సృష్టి చక్రము చిత్రముపై మరియు కల్పవృక్షము చిత్రముపై మీరు ఇలా అర్థం
చేయించవచ్చు - ఈ లెక్కన మీరు కొత్త ప్రపంచమైన స్వర్గములోకి రాలేరు. ఎవరైతే
అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మానికి చెందినవారిగా ఉండేవారో, అందరికన్నా ధనవంతులుగా
ఉండేవారో, వారే అందరికన్నా పేదవారిగా అయ్యారు. ఎవరైతే అందరికన్నా మొట్టమొదటగా
ఉండేవారో, సంఖ్య కూడా వారిదే అధికముగా ఉండాలి కానీ హిందువులు అనేకమంది ఇతర
ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. తమ ధర్మము గురించి తెలియని కారణముగా ఇతర ధర్మాలలోకి
వెళ్ళిపోయారు లేదా హిందు ధర్మము అని చెప్పుకుంటారు. తమ ధర్మము గురించి కూడా అర్థం
చేసుకోరు. ఈశ్వరుడిని శాంతి దేవా అని ఎంతగానో పిలుస్తారు, కానీ శాంతి యొక్క
అర్థాన్ని అర్థం చేసుకోరు. ఒకరికొకరు శాంతి బహుమతులను ఇచ్చుకుంటూ ఉంటారు. విశ్వములో
శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తమైన పిల్లలైన మీకు ఇక్కడ తండ్రి విశ్వ రాజ్యాన్ని
బహుమతిగా ఇస్తారు. ఈ బహుమతి కూడా నంబరువారు పురుషార్థానుసారముగా లభిస్తుంది.
ఇచ్చేవారు భగవంతుడైన తండ్రి. బహుమతి ఎంత గొప్పది - సూర్యవంశీ విశ్వ రాజ్యాధికారము!
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తము విశ్వము యొక్క చరిత్ర-భూగోళము, వర్ణాలు
మొదలైనవన్నీ ఉన్నాయి. విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే కొంత శ్రమ కూడా చేయవలసి
ఉంటుంది. పాయింట్లు అయితే చాలా సహజమైనవి. టీచరు ఏ పనిని అప్పచెప్తారో దానిని చేసి
చూపించాలి. అప్పుడు ఎవరిలో పూర్తి జ్ఞానముంది అనేది బాబా చూస్తారు. కొందరు పిల్లలైతే
మురళిపై కూడా శ్రద్ధ పెట్టరు. మురళిని ప్రతి రోజు చదవరు. ఎవరైతే మురళి చదవరో వారు
ఎవరి కళ్యాణమునైనా ఏం చేయగలరు! ఏ మాత్రమూ కళ్యాణము చేయని పిల్లలు ఎంతోమంది ఉన్నారు.
వారు తమ కళ్యాణము చేసుకోరు, ఇతరుల కళ్యాణము చేయరు, అందుకే వారిని గుర్రపు స్వారీవారు,
పాదచారులు అని అంటారు. ఎవరో కొద్దిమందే మహారథులు ఉన్నారు, ఎవరెవరు మహారథులు అనేది
స్వయం కూడా అర్థం చేసుకోగలరు. బాబా, గుల్జార్ ను, కుమారకా ను, మనోహర్ ను పంపించండి...
అని అంటారు, ఎందుకంటే స్వయం గుర్రపు స్వారీవారి వలె ఉన్నారు. వాళ్ళు మహారథులు.
తండ్రి అయితే పిల్లలందరినీ బాగా తెలుసుకోగలరు. కొందరిపై గ్రహచారము కూడా కూర్చుంటుంది
కదా. కొన్నిసార్లు మంచి-మంచి పిల్లలకు కూడా మాయ తుఫానులు రావడముతో వారు వెర్రివారి
వలె అయిపోతారు. జ్ఞానము వైపుకు అటెన్షన్ వెళ్ళదు. బాబాకు ప్రతి ఒక్కరి సేవ ద్వారా
తెలుస్తుంది కదా. సేవ చేసేవారు తమ పూర్తి సమాచారాన్ని బాబాకు ఇస్తూ ఉంటారు.
గీతా భగవానుడు మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు అని పిల్లలైన మీకు
తెలుసు. ఆ గీతను కూడా కంఠస్థము చేసేవారు ఎంతోమంది ఉన్నారు, వారు వేలాది రూపాయలను
సంపాదిస్తారు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు, తర్వాత దైవీ సాంప్రదాయానికి
చెందినవారిగా అవుతారు. అందరూ తమను తాము ఈశ్వరుని సంతానముగా కూడా చెప్పుకుంటారు,
మళ్ళీ మనమందరము ఈశ్వరులమే అని అంటారు, ఎవరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. భక్తి
మార్గములో మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోయింది. ఈ ప్రపంచమే ఇనుప యుగముగా, పతితముగా
ఉంది. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించగలరు. దానితోపాటు దైవీ గుణాలు కూడా
కావాలి. లోపల-బయట సత్యత ఉండాలి. ఆత్మయే అసత్యముగా అయిపోయింది, దానిని మళ్ళీ సత్యమైన
తండ్రి సత్యముగా తయారుచేస్తారు. తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా
తయారుచేస్తారు. దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. మనము ఈ విధంగా (లక్ష్మీ-నారాయణుల వలె)
గుణవంతులుగా అవుతూ ఉన్నాము అని పిల్లలైన మీకు తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకుంటూ
ఉండండి - నాలో ఎటువంటి ఆసురీ గుణాలైతే లేవు కదా? నడుస్తూ-నడుస్తూ మాయ చెంపదెబ్బ ఎలా
తగులుతుందంటే ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతారు.
మీ కొరకు ఈ జ్ఞానము మరియు విజ్ఞానమే హోలీ-ధురియా వంటివి. వాళ్ళు కూడా హోలీని
మరియు ధురియాను జరుపుకుంటారు కానీ వాటి అర్థమేమిటి, ఇది కూడా ఎవరికీ తెలియదు.
వాస్తవానికి ఇవి జ్ఞానము మరియు విజ్ఞానము, వీటి ద్వారా మీరు స్వయాన్ని చాలా
ఉన్నతమైనవారిగా తయారుచేసుకుంటారు. వాళ్ళు అయితే ఏమేమి చేస్తూ ఉంటారు, ఒకరిపై ఒకరు
ధూళి వేసుకుంటారు ఎందుకంటే ఇది రౌరవ నరకము. కొత్త ప్రపంచపు స్థాపన మరియు పాత
ప్రపంచపు వినాశనము యొక్క కర్తవ్యము నడుస్తూ ఉంది. ఈశ్వరీయ సంతానమైన మిమ్మల్ని కూడా
మాయ ఒక్కసారిగా పిడికిలితో ఎలా కొడుతుందంటే ఇక మీరు జోరుగా వెళ్ళి ఊబిలో పడిపోతారు.
ఇక తర్వాత అందులో నుండి బయటపడడము చాలా కష్టమవుతుంది, ఇందులో ఆశీర్వాదము మొదలైనవాటి
విషయమేదీ ఉండదు. ఇక మళ్ళీ ఇటువైపు పైకి ఎక్కడము చాలా కష్టమవుతుంది, అందుకే చాలా
జాగ్రత్తగా ఉండాలి. మాయ దాడి నుండి రక్షించుకునేందుకు ఎప్పుడూ కూడా దేహాభిమానములో
చిక్కుకోకండి. సదా అప్రమత్తముగా ఉండాలి, అందరూ సోదరీ-సోదరులే. బాబా ఏదైతే
నేర్పించారో దానినే అక్కయ్యలు నేర్పిస్తారు. ఇందులో బలిహారము తండ్రిదే (గొప్పతనము
తండ్రిదే), అంతేకానీ అక్కయ్యలది కాదు. బ్రహ్మా యొక్క గొప్పతనము కూడా ఏమీ లేదు. వీరు
కూడా పురుషార్థము ద్వారా నేర్చుకున్నారు. పురుషార్థము బాగా చేసారు అనగా తమ
కళ్యాణమును చేసుకున్నారు. వారు మనకు కూడా నేర్పిస్తున్నారు, తద్వారా మనము మన
కళ్యాణము చేసుకుంటాము.
ఈ రోజు హోలీ, ఇప్పుడు హోలీ గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు. జ్ఞానము
మరియు విజ్ఞానము. చదువును నాలెడ్జ్ అని అంటారు. విజ్ఞానము అంటే ఏమిటి, ఇది ఎవరికీ
తెలియదు. విజ్ఞానము అనేది జ్ఞానము కంటే కూడా అతీతమైనది. జ్ఞానము మీకు ఇక్కడ
లభిస్తుంది, దీని ద్వారా మీరు ప్రారబ్ధాన్ని పొందుతారు. ఇకపోతే అది శాంతిధామము.
ఇక్కడ పాత్రను అభినయించి అలసిపోతారు కావున మళ్ళీ శాంతిలోకి వెళ్ళాలని కోరుకుంటారు.
ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చక్రము యొక్క జ్ఞానము ఉంది. ఇప్పుడు మనము స్వర్గములోకి
వెళ్తాము, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నరకములోకి వస్తాము. మళ్ళీ అదే పరిస్థితి
ఏర్పడుతుంది, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. దీని నుండి ఎవరూ విముక్తులవ్వలేరు. అసలు ఈ
డ్రామా ఎందుకు తయారయ్యింది అని కొందరు అడుగుతారు. అరే, ఇది కొత్త ప్రపంచము మరియు
పాత ప్రపంచముల ఆట. ఇది అనాదిగా తయారై ఉంది. వారికి వృక్షముపై అర్థం చేయించడము చాలా
మంచిది. అన్నింటికన్నా మొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - తండ్రిని స్మృతి
చేసినట్లయితే పావనముగా అయిపోతారు. ఈ కులానికి చెందినవారిలో ఎవరెవరు ఇతర ధర్మాలలోకి
బదిలీ అయిపోయారు అనేది మున్ముందు తెలుస్తూ ఉంటుంది, వారందరూ కూడా ఆయా ధర్మాల నుండి
బయటకు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు.
దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి అని అందరికీ ఇదే చెప్పాలి. మీ
కొరకైతే ఈ చదువే పెద్ద పండుగ, దీని ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది. వారైతే ఈ
పండుగలను జరుపుకోవడములో ఎంత ధనము మొదలైనవాటిని వృధా చేస్తారు, ఎంతగా గొడవలు మొదలైనవి
జరుగుతాయి. పంచాయితీ రాజ్యములో ఎన్నో గొడవలే గొడవలు జరుగుతాయి, ఎవరికైనా లంచము ఇచ్చి
అయినా సరే చంపించడానికి ప్రయత్నము చేస్తారు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉంటూనే ఉంటాయి.
సత్యయుగములో ఉపద్రవాలేవీ ఉండవని పిల్లలకు తెలుసు. రావణ రాజ్యములో ఎన్నో ఉపద్రవాలు
ఉన్నాయి. ఇప్పుడైతే తమోప్రధానముగా ఉన్నారు కదా. ఒకరి అభిప్రాయము మరొకరితో కలవని
కారణముగా ఎన్ని గొడవలు ఉన్నాయి, అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఈ పాత
ప్రపంచాన్ని మరచి ఒంటరిగా అయిపోండి, ఇంటిని స్మృతి చేయండి, మీ సుఖధామాన్ని గుర్తు
చేయండి. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకండి కూడా, లేకపోతే నష్టము కలుగుతుంది. చాలా
మధురముగా, శాంతిగా, ప్రేమగా మాట్లాడటము మంచిది. ఎక్కువగా మాట్లాడకపోవడము మంచిది.
శాంతిగా ఉండడము అన్నింటికన్నా మంచిది. పిల్లలైన మీరైతే శాంతితో విజయాన్ని పొందుతారు.
ఒక్క తండ్రి పట్ల తప్ప ఇంకెవరి పట్ల ప్రీతిని పెట్టుకోకూడదు. తండ్రి నుండి ఎంత ఆస్తి
తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. లేదంటే లౌకిక తండ్రి యొక్క ఆస్తిపై ఎన్ని గొడవలు
జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏ గొడవలు ఉండవు. ఎంత కావాలనుకుంటే అంత తమ చదువు ద్వారా
తీసుకోవచ్చు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సత్యమైన తండ్రి సత్యముగా తయారుచేయడానికి వచ్చారు, అందుకే సత్యతతో నడుచుకోవాలి.
స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నాలో ఆసురీ గుణములేవీ లేవు కదా? నేను ఎక్కువగా
మాట్లాడటము లేదు కదా? చాలా మధురముగా ఉంటూ శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి.
2. మురళిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మురళిని ప్రతిరోజూ చదువుకోవాలి. తమ మరియు
ఇతరుల కళ్యాణము చేయాలి. టీచరు ఏ పనిని అప్పచెప్తారో అది చేసి చూపించాలి.
వరదానము:-
హోలీ అనే పదము యొక్క అర్థాన్ని జీవితములోకి తీసుకువచ్చి
పురుషార్థము యొక్క వేగాన్ని తీవ్రతరము చేసే తీవ్ర పురుషార్థీ భవ
హోలీ అనగా అర్థము - ఏ విషయమైతే అయిపోయిందో, గడిచిపోయిందో
దానిని పూర్తిగా సమాప్తము చేయాలి. గతం గతః చేసి ముందుకు వెళ్ళడము, ఇదే హోలీని
జరుపుకోవటము. గడిచిపోయిన విషయము ఎలా అనిపించాలంటే అది ఏదో జన్మకు సంబంధించిన చాలా
పాత విషయముగా అనిపించాలి, ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు పురుషార్థము
యొక్క వేగము తీవ్రతరము అవుతుంది. కావున స్వయం లేక ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాలను
ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి, మనసులో పెట్టుకోకండి మరియు వర్ణన అయితే అసలు
ఎప్పుడూ చెయ్యకండి, అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు.
స్లోగన్:-
స్నేహమే
సహజ స్మృతికి సాధనము, అందుకే సదా స్నేహీగా ఉండండి మరియు స్నేహీగా తయారుచేయండి.
మాతేశ్వరిగారి అమూల్య
మహావాక్యాలు
‘‘బంధనాలలో ఉన్న
గుప్తమైన గోపికలకు గాయనము ఉంది’’
పాట -
బిన్ దేఖే ప్యార్ కరూ,
ఘర్ బైఠే యాద్ కరూ... (నిన్ను చూడకుండానే ప్రేమిస్తాను, ఇంట్లో కూర్చునే స్మృతి
చేస్తాను)
ఈ పాట అమితానందాన్ని
అనుభవం చేస్తున్న బంధనములో ఉన్న ఒక గోపిక పాడినది, ఇది కల్ప-కల్పము యొక్క
విచిత్రమైన ఆట. చూడకుండానే ప్రేమిస్తారు! పాపం ప్రపంచానికి ఏం తెలుసు. కల్పక్రితము
యొక్క పాత్ర అదే విధంగా రిపీట్ అవుతుంది. ఆ గోపిక ఇల్లు-వాకిలిని వదలకపోయినా సరే
స్మృతితో కర్మబంధనాలను సమాప్తము చేసుకుంటుంది, కనుక ఎంతగా సంతోషములో ఊగుతూ
అమితానందములో పాడుతుంది. వాస్తవానికి ఇంటిని వదిలే విషయమేమీ లేదు. ఇంట్లో కూర్చునే,
చూడకుండానే ఆ సుఖములో ఉంటూ సేవ చెయ్యాలి. ఏ సేవ చెయ్యాలి? పవిత్రముగా అయ్యి
పవిత్రముగా తయారుచేసే సేవ. మీకు ఇప్పుడు మూడవ నేత్రము లభించింది. ఆది నుండి
మొదలుకుని అంతిమము వరకు, బీజము మరియు వృక్షము యొక్క రహస్యము మీ దృష్టిలో ఉంది. కనుక
గొప్పతనము ఈ జీవితానిదే, ఈ జ్ఞానము ద్వారా 21 జన్మల కొరకు సౌభాగ్యాన్ని
తయారుచేసుకుంటున్నారు, ఇందులో ఒకవేళ ఏవైనా లోకమర్యాదలు, వికారీ కులమర్యాదలు
ఉన్నట్లయితే వారు సేవ చేయలేకపోతారు, ఇది మీలోని లోపమే. ఈ బ్రహ్మాకుమారీలు ఇంటిలో
గొడవలు సృష్టించడానికి వచ్చారు అని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో ఇంటిలో గొడవలు
సృష్టించే విషయమేమీ లేదు. ఇంటిలో కూర్చునే పవిత్రముగా ఉండాలి మరియు సేవ చేయాలి,
ఇందులో ఎటువంటి కష్టము లేదు. పవిత్రముగా అయినప్పుడే పవిత్ర ప్రపంచములోకి వెళ్ళేందుకు
అధికారులుగా అవుతారు. ఇకపోతే ఎవరైతే పవిత్ర ప్రపంచములోకి వెళ్ళేది లేదో, వారు
కల్పపూర్వము వలె శత్రుత్వపు పాత్రను పోషిస్తారు, ఇందులో ఎవరి దోషమూ లేదు. ఏ విధంగా
మనము పరమాత్మ కార్యము గురించి తెలుసుకుంటామో అదే విధంగా డ్రామాలోని ప్రతి ఒక్కరి
పాత్రను గురించి తెలుసుకున్నాము కనుక ఇందులో ద్వేషము కలగదు. ఇటువంటి తీవ్ర
పురుషార్థీ గోపికలు రేస్ చేసి విజయమాలలోకి కూడా రాగలరు. అచ్ఛా! ఓం శాంతి!
అవ్యక్త ప్రేరణలు -
సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను అలవరుచుకోండి
జ్ఞానానికి
సంబంధించిన గుహ్యమైన విషయాలేవైతే ఉన్నాయో, వాటిని స్పష్టము చేసే విధి మీ వద్ద చాలా
బాగుంది మరియు స్పష్టీకరణ ఉంది. ఒక్కొక్క పాయింటును లాజికల్ గా స్పష్టము చెయ్యగలరు.
మీరు మీ అథారిటీ కలవారు. ఇవి ఏవో మనోకల్పితమైన లేక ఊహించుకున్న విషయాలైతే కావు. ఇవి
యథార్థమైనవి. అనుభవము ఉంది. అనుభవము యొక్క అథారిటీ, జ్ఞానము యొక్క అథారిటీ, సత్యత
యొక్క అథారిటీ... ఎన్ని అథారిటీలు ఉన్నాయి! కావున అథారిటీ మరియు స్నేహము - కార్యములో
ఈ రెండింటినీ కలిపి ఉపయోగించండి.