‘‘ఈ సంవత్సరము ప్రారంభము నుండి అనంతమైన వైరాగ్య
వృత్తిని ఇమర్జ్ చేసుకోండి, ఇదే ముక్తిధామము యొక్క గేట్ కు
తాళంచెవి’’
ఈ రోజు నవయుగ రచయిత అయిన బాప్ దాదా తమ పిల్లలతో కొత్త
సంవత్సరాన్ని జరుపుకునేందుకు, పరమాత్మ మిలనము జరిపేందుకు,
పిల్లల స్నేహములో తమ దూరదేశము నుండి సాకార వతనములో మిలనము
జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచములోనైతే నూతన సంవత్సర
శుభాకాంక్షలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. కానీ బాప్ దాదా
పిల్లలైన మీకు నూతన యుగానికి మరియు నూతన సంవత్సరానికి,
రెండింటికీ శుభాకాంక్షలను ఇస్తున్నారు. నూతన సంవత్సరమునైతే
ఒక్క రోజు జరుపుకుంటారు. నూతన యుగాన్ని అయితే మీరు సంగమయుగములో
సదా జరుపుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా పరమాత్ముని ప్రేమ యొక్క
ఆకర్షణలో ఆకర్షించబడి ఇక్కడకు చేరుకున్నారు. కానీ అందరికంటే
దూరదేశము నుండి వచ్చేవారు ఎవరు? డబుల్ విదేశీయులా? వారు ఎంతైనా
ఈ సాకార దేశములోనే ఉన్నారు. కానీ దూరదేశి అయిన బాప్ దాదా ఎంత
దూరము నుండి వచ్చారు? ఎన్ని మైళ్ళ నుండి వచ్చారో లెక్క
వెయ్యగలరా? దూరదేశి అయిన బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు,
వారు ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చుని ఉన్నా, మధుబన్ లో కూర్చుని
ఉన్నా, జ్ఞాన సరోవరములో కూర్చుని ఉన్నా, గ్యాలరీలో కూర్చుని
ఉన్నా, మీ అందరితోపాటుగా దూరములో కూర్చుని దేశ, విదేశాలలో బాప్
దాదాతో మిలనము జరుపుకుంటూ ఉన్నా, బాప్ దాదా చూస్తున్నారు,
వారందరూ ఎంత ప్రేమతో దూరము నుండి చూస్తూ కూడా ఉన్నారు, వింటూ
కూడా ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు నూతన యుగానికి మరియు
నూతన సంవత్సరానికి పదమాల రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు,
శుభాకాంక్షలు. పిల్లలకైతే నవయుగము కళ్ళ ముందే ఉంది కదా! ఈ రోజు
సంగమయుగములో ఉన్నారు, రేపు తమ నవయుగములో రాజ్య అధికారులై
రాజ్యము చేస్తారు, అంతే. అంత సమీపముగా ఉన్నట్లు అనుభవమవుతుందా?
ఈ రోజు మరియు రేపటి విషయమే. నిన్న ఉంది, రేపు మళ్ళీ రాబోతుంది.
మీ నవ యుగము యొక్క, స్వర్ణిమ యుగము యొక్క స్వర్ణిమ డ్రెస్
ఎదురుగా కనిపిస్తూ ఉందా? ఎంత సుందరముగా ఉంది! స్పష్టముగా
కనిపిస్తూ ఉంది కదా! ఈ రోజు సాధారణ డ్రెస్ లో ఉన్నారు మరియు
రేపు నవ యుగము యొక్క సుందరమైన డ్రెస్ లో మెరుస్తూ కనిపిస్తారు.
నూతన సంవత్సరములోనైతే ఒక్క రోజు కోసం ఒకరికొకరు కానుకలను
ఇచ్చుకుంటారు. కానీ నవయుగ రచయిత అయిన బాప్ దాదా మీ అందరికీ
స్వర్ణిమ ప్రపంచము అనే కానుకను ఇచ్చారు, ఇది అనేక జన్మలకు
మీతోనే ఉంటుంది. ఇది వినాశీ కానుక కాదు. అవినాశీ కానుకను బాబా
పిల్లలైన మీకు ఇచ్చారు. గుర్తుంది కదా! మర్చిపోలేదు కదా!
క్షణములో వెళ్ళడం, రావడం చేయగలరు. ఇప్పుడిప్పుడే సంగమయుగములోకి,
ఇప్పుడిప్పుడే మీ స్వర్ణిమ ప్రపంచములోకి చేరుకుంటారా లేక
ఆలస్యము అవుతుందా? మీ రాజ్యము స్మృతిలోకి వస్తుంది కదా!
ఈ రోజును వీడ్కోలు రోజు అని అంటారు మరియు 12 గంటల తర్వాత
శుభాకాంక్షల రోజు అని అంటారు. ఈ వీడ్కోలు రోజున, సంవత్సరానికి
వీడ్కోలు ఇవ్వడముతోపాటుగా మీరందరూ సంవత్సరముతో పాటుగా ఇంకా
వేటికి వీడ్కోలు ఇచ్చారు? సదా కొరకు వీడ్కోలు ఇచ్చారా లేక
కొద్ది సమయము కొరకు వీడ్కోలు ఇచ్చారా అన్నదానిని చెక్
చేసుకున్నారా? సమయము యొక్క వేగము తీవ్రగతితో వెళ్తూ ఉంది అని
బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, మరి నా పురుషార్థము యొక్క
వేగము తీవ్రముగా ఉందా అని మొత్తము సంవత్సరము యొక్క రిజల్టును
చెక్ చేసుకున్నారా? లేక ఒకసారి ఒకరకంగా, మరోసారి మరోరకంగా ఉందా?
ప్రపంచ పరిస్థితులను చూస్తూ ఇప్పుడు విశేషముగా మీ రెండు
స్వరూపాలను ఇమర్జ్ చేసుకోండి, ఆ రెండు స్వరూపాలు ఏమిటంటే - ఒకటి
సర్వుల పట దయార్ద్ర హృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉండటము,
మరియు రెండవది ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలు మాస్టర్ దాతలుగా
ఉండటము. విశ్వములోని ఆత్మలు పూర్తిగా శక్తిహీనులై, దుఃఖముతో,
అశాంతితో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. బాబా ఎదురుగా మరియు పూజ్య
ఆత్మలైన మీ ఎదురుగా బాధతో పిలుస్తూ ఉన్నారు - కొన్ని ఘడియల
కొరకైనా కూడా సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని
ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని,
వ్యాకులతను చూడలేరు, వినలేరు. మరి పూజ్య ఆత్మలైన మీ అందరికీ దయ
కలగటం లేదా! వారు - ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి... అని అడుగుతూ
ఉన్నారు. కనుక దాత పిల్లలైన మీరు వారికి కొంత దోసిలి అంత అయినా
ఇవ్వండి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని సహచరులుగా చేసుకుని,
మాస్టర్ దాతలుగా చేసి, తమ రైట్ హ్యాండ్స్ గా చేసుకుని ఇదే
సూచననిస్తున్నారు - విశ్వములోని ఇంతమంది ఆత్మలందరికీ ముక్తిని
ఇప్పించాలి. ముక్తిధామానికి వెళ్ళాలి. కనుక ఓ దాత పిల్లలూ, మీ
శ్రేష్ఠ సంకల్పాల ద్వారా, మనసా శక్తి ద్వారా, వాణి ద్వారానైనా,
సంబంధ-సంపర్కాల ద్వారానైనా, శుభ భావన - శుభ కామన ద్వారానైనా,
వైబ్రేషన్లు-వాయుమండలము ద్వారానైనా, ఏ యుక్తితోనైనా ముక్తిని
ఇప్పించండి. ముక్తిని ఇవ్వండి అని వారు బాధతో ఆర్తనాదాలు చేస్తూ
ఉన్నారు. బాప్ దాదా తమ రైట్ హ్యాండ్స్ కు చెప్తున్నారు - వారిపై
దయ చూపించండి.
ఇప్పటివరకు ఉన్న లెక్క తియ్యండి. మెగా ప్రోగ్రాములు చేసి
ఉండవచ్చు, కాన్ఫరెన్సులు చేసి ఉండవచ్చు, భారత్ లోనైనా,
విదేశాలలోనైనా సెంటర్లు తెరిచి ఉండవచ్చు, కానీ మొత్తము
విశ్వములో ఉన్న ఆత్మల సంఖ్యతో లెక్క చూస్తే ఎంత శాతము ఆత్మలకు
ముక్తి మార్గము తెలియజేసారు? కేవలం భారత్ కళ్యాణకారులేనా లేక
అయిదు ఖండాలలో ఉన్న విదేశాలలో ఎక్కడెక్కడైతే సేవాకేంద్రాలు
తెరిచారో అక్కడి కళ్యాణకారులేనా లేక విశ్వ కళ్యాణకారులా? విశ్వ
కళ్యాణము చేయడానికి పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు హ్యాండ్స్ గా
అవ్వాలి, రైట్ హ్యాండ్స్ గా అవ్వాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి
వచ్చినప్పుడు దేనితో ఇవ్వటం జరుగుతుంది? చేతులతోనే ఇవ్వటం
జరుగుతుంది కదా. మరి బాప్ దాదాకు మీరు హ్యాండ్స్ కదా, చేతులు
కదా. మరి బాప్ దాదా రైట్ హ్యాండ్స్ ను అడుగుతున్నారు - ఎంత
శాతము మందికి కళ్యాణము చేసారు? ఎంత శాతము మందికి చేసారు?
వినిపించండి, లెక్క తియ్యండి. పాండవులు లెక్కలు వెయ్యటములో
తెలివైనవారు కదా? అందుకే బాప్ దాదా అంటున్నారు, ఇప్పుడు స్వ
పురుషార్థము మరియు సేవల యొక్క భిన్న-భిన్న విధుల ద్వారా
పురుషార్థాన్ని తీవ్రము చెయ్యండి. స్వ స్థితిలో కూడా నాలుగు
విషయాలను విశేషముగా చెక్ చేసుకోండి - దీనినే తీవ్ర పురుషార్థము
అని అంటారు.
మొదటి విషయము - ముందుగా చెక్ చేసుకోండి - నిమిత్త భావము ఉందా?
ఎటువంటి రాయల్ రూపములోనైనా నేను అన్న భావము లేదు కదా? నాది
అన్న భావము లేదు కదా? సాధారణమైనవారికి నేను మరియు నాది అనేవి
కూడా సాధారణమైనవి, స్థూల రూపములో ఉంటాయి, కానీ బ్రాహ్మణ
జీవితములోని నాది మరియు నేను అన్న భావాలు సూక్ష్మమైనవి మరియు
రాయల్ గా ఉంటాయి. ఆ భాష ఎలా ఉంటుందో తెలుసా? ఇది ఇలా జరుగుతూనే
ఉంటుంది, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవ్వాల్సిందే,
నడుస్తున్నాము, చేస్తున్నాము... కనుక ఒకటి నిమిత్త భావము, ప్రతి
విషయములోనూ నిమిత్తము. సేవలోనైనా, స్థితిలోనైనా,
సంబంధ-సంపర్కములో ముఖము మరియు నడవడిక నిమిత్త భావము కలవిగా
ఉండాలి. అటువంటివారిలో ఉండే రెండవ విశేషత ఏమిటంటే - నిర్మాన
భావము. నిమిత్త మరియు నిర్మాన భావముతో నిర్మాణము చెయ్యడము. మూడు
విషయాలను విన్నారు - నిమిత్తము, నిర్మానము మరియు నిర్మాణము
మరియు నాల్గవ విషయము - నిర్వాణము. ఎప్పుడు కావాలంటే అప్పుడు
నిర్వాణధామానికి చేరుకోవాలి. నిర్వాణ స్థితిలో స్థితులవ్వాలి
ఎందుకంటే స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులను
నిర్వాణధామానికి చేర్చగలరు. ఇప్పుడు అందరూ ముక్తిని
కోరుకుంటున్నారు, విముక్తులుగా చెయ్యండి, విముక్తులుగా చెయ్యండి
అని బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నాలుగు విషయాలు
మంచి శాతములో ప్రాక్టికల్ జీవితములో ఉండటము అనగా తీవ్ర
పురుషార్థీ. అప్పుడు బాప్ దాదా - వాహ్! వాహ్ పిల్లలూ వాహ్! అని
అంటారు. మీరు కూడా వాహ్ బాబా వాహ్! వాహ్ డ్రామా వాహ్! వాహ్
పురుషార్థము వాహ్! అని అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో
తెలుసా? తెలుసా? ఒక్కోసారి వాహ్ అని అంటే ఒక్కోసారి వై (ఎందుకు)
అని అంటారు. వాహ్ కు బదులుగా వై (ఎందుకు) అని అంటారు మరియు ఆ
ఎందుకు అనేది అయ్యోగా మారిపోతుంది. కనుక ఎందుకు అని అనకండి,
వాహ్ అని అనండి. మీకు కూడా ఏది బాగా అనిపిస్తుంది, వాహ్ బాగా
అనిపిస్తుందా లేక ఎందుకు అనేది బాగా అనిపిస్తుందా? ఏది బాగా
అనిపిస్తుంది? వాహ్! ఎప్పుడూ వై (ఎందుకు) అని అనరు కదా?
పొరపాటున వచ్చేస్తుంది.
డబుల్ విదేశీయులు వై-వై (ఎందుకు, ఎందుకు) అని అంటారా?
అప్పుడప్పుడు అంటారా? డబుల్ విదేశీయులు ఎవరైతే ఎప్పుడూ కూడా
‘ఎందుకు’ అని అనరో వారు చేతులెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు.
అచ్ఛా - భారతవాసులు ఎవరైతే వాహ్-వాహ్ అనేందుకు బదులుగా
‘ఎందుకు, ఏమిటి’ అని అంటారో, వారు చేతులెత్తండి. ‘ఎందుకు, ఏమిటి’
అని అంటారా? మీకు అలా అనడానికి ఎవరు అనుమతినిచ్చారు? సంస్కారాలా?
పాత సంస్కారాలు మీకు ‘ఎందుకు’ అని అనేందుకు అనుమతినిచ్చాయి.
కానీ బాబా అంటారు, వాహ్ వాహ్! అని అనండి, వై-వై (ఎందుకు-ఎందుకు)
అని అనకండి. మరి ఇప్పుడు నూతన సంవత్సరములో ఏం చేస్తారు? వాహ్!
వాహ్! అంటారా? లేదా అప్పుడప్పుడు ‘ఎందుకు’ అనేదానికి అనుమతి
ఇవ్వమంటారా? ‘ఎందుకు’ అనేది మంచిది కాదు. కడుపులో గ్యాస్
ఏర్పడినప్పుడు ఆరోగ్యము పాడవుతుంది కదా. మరి ‘ఎందుకు’ అనేది
కడుపులో గ్యాస్ లాంటిది, అలా అనకండి. వాహ్! వాహ్! ఇది ఎంత బాగా
అనిపిస్తుంది. ఆ మరి చెప్పండి - వాహ్! వాహ్! వాహ్!
అచ్ఛా - దూరదేశము నుండి వింటున్నారు, చూస్తున్నారు, భారత్
నుండి కూడా, విదేశాల నుండి కూడా, మరి ఆ పిల్లలను కూడా
అడుగుతున్నారు - వాహ్! వాహ్! అని అంటారా లేక వై వై (ఎందుకు,
ఎందుకు) అని అంటారా? ఇప్పుడు ఇది వీడ్కోలు ఇచ్చే రోజు కదా! ఈ
రోజు వీడ్కోలు ఇచ్చేందుకు ఇది సంవత్సరములోని చివరి రోజు. కనుక
అందరూ సంకల్పము చెయ్యండి - ‘ఎందుకు’ అని అనము, దాని గురించి
ఆలోచించను కూడా ఆలోచించము. ప్రశ్నార్థకము వద్దు, ఆశ్చర్యార్థకము
వద్దు, బిందువు మాత్రమే. ప్రశ్నార్థకము వ్రాయండి, ఎంత వంకరగా
ఉంటుంది కానీ బిందువు ఎంత సహజమైనది. కేవలము నయనాలలో బిందువైన
బాబాను ఇముడ్చుకోండి. నయనాలలో చూడటము కోసమని బిందువు ఉంది కదా!
అలాగే సదా నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకోండి. ఇముడ్చుకోవటము
వస్తుందా? వస్తుందా లేక సరిగ్గా ఫిట్ అవ్వటము లేదా? కింద మీద
అయిపోతుందా? మరి ఏం చేస్తారు? దేనికి వీడ్కోలు ఇస్తారు?
‘ఎందుకు’ అనేదానికి వీడ్కోలు ఇస్తారా? ఎప్పుడూ ఆశ్చర్యార్థకము
కూడా రాకూడదు - ఇది ఎలా అవుతుంది! ఇలా కూడా జరుగుతుందా! అసలు
ఇలా జరగకూడదు, ఎందుకు జరిగింది! ఇలా ప్రశ్నార్థకము కూడా
ఉండకూడదు, ఆశ్చర్యార్థకము కూడా ఉండకూడదు. కేవలము బాబా మరియు
నేను, అంతే. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - ఇది ఇలా జరుగుతూనే
ఉంటుంది కదా! బాప్ దాదాకు ఆత్మిక సంభాషణలో చాలా రమణీకమైన
విషయాలను వినిపిస్తారు, ఎదురుగా చెప్పలేరు కదా, అందుకని ఆత్మిక
సంభాషణలో అన్నీ చెప్పేస్తారు. అచ్ఛా, ఏది ఎలా నడిచినా కానీ,
మీరు నడవకూడదు. మీరు ఎగరాలి అన్నప్పుడు నడిచే విషయాలను ఎందుకు
చూస్తారు? ఎగరండి మరియు ఎగిరేలా చెయ్యండి. శుభ భావన, శుభ కామన
అనేవి ఎంతో శక్తిశాలిగా అయినవి. కేవలము శుభ భావన, శుభ కామన
తప్ప మధ్యలో ‘ఎందుకు’ అనేది రాకూడదు. అవి ఎంతటి శక్తిశాలి
అయినవి అంటే, ఎటువంటి అశుభ భావన కలవారినైనా కూడా శుభ భావనలోకి
మార్చగలరు. రెండవది ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ వారిని
మార్చలేకపోయినా కానీ మీ శుభ భావన, శుభ కామన అవినాశీ అయినవి కదా,
అప్పుడప్పుడు ఉండేవి కావు కదా, కావున మీపై అశుభ భావన యొక్క
ప్రభావము పడదు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, ఇలా ఎంతవరకు
నడుస్తుంది, ఎలా నడుస్తుంది - అనే ప్రశ్నలలోకి వెళ్ళిపోతారు.
వీటి వలన శుభ భావన యొక్క శక్తి తగ్గిపోతుంది. లేదంటే శుభ భావన,
శుభ కామనల యొక్క సంకల్ప శక్తిలో చాలా శక్తి ఉంది. చూడండి,
మీరందరూ బాప్ దాదా వద్దకు వచ్చారు. మొదటి రోజును గుర్తు
చేసుకోండి, బాప్ దాదా ఏం చేసారు? పతితులు వచ్చినా, పాపులు
వచ్చినా, సాధారణమైనవారు వచ్చినా, రకరకాల వృత్తుల వారు, రకరకాల
భావనల వారు వచ్చినా, బాప్ దాదా ఏం చేసారు? శుభ భావన ఉంచారు కదా!
వీరు నా వారు, మాస్టర్ సర్వశక్తివంతులు, హృదయ సింహాసనాధికారులు,
అన్న ఇటువంటి శుభ భావనను ఉంచారు కదా, శుభ కామనను ఉంచారు కదా,
దాని వలనే బాబాకు చెందినవారిగా అయ్యారు కదా. బాబా ఏమైనా - ఓ
పాపి, ఎందుకు వచ్చావు అని అన్నారా? నా పిల్లలు, మాస్టర్
సర్వశక్తివంతులైన పిల్లలు అని శుభ భావనను ఉంచారు. మరి బాబా మీ
అందరిపై శుభ భావనను ఉంచినప్పుడు, శుభ కామనను ఉంచినప్పుడు, మీ
మనసు ఏమన్నాది? మేరా బాబా (నా బాబా). బాబా ఏమన్నారు? మేరే బచ్చే
(నా పిల్లలు). అలాగే మీరు కూడా ఒకవేళ శుభ భావనను, శుభ కామనను
పెట్టుకున్నట్లయితే అందరూ ఎలా కనిపిస్తారు? నా కల్పపూర్వపు
మధురమైన సోదరుడు, చాలా కాలము దూరమైన తర్వాత కలిసిన నా సోదరి.
ఇక పరివర్తన అయిపోతుంది.
మరి ఈ సంవత్సరములో ఏదైనా చేసి చూపించండి. కేవలము చెయ్యి
ఎత్తటము కాదు. చెయ్యి ఎత్తటమైతే చాలా సహజము. మనసు యొక్క చేతిని
ఎత్తండి ఎందుకంటే చాలా పని ఇంకా మిగిలిపోయి ఉంది. బాప్ దాదా
చుట్టూ చూసినప్పుడు విశ్వాత్మలపై చాలా దయ కలుగుతుంది. ఇప్పుడు
ప్రకృతి కూడా విసిగిపోయింది. ప్రకృతి స్వయమే విసిగిపోతే అది ఏం
చేయగలదు? ఆత్మలను విసిగిస్తుంది. మరియు బాబాకు పిల్లలను చూసి
దయ కలుగుతుంది. మీ అందరికీ దయ కలగటం లేదా? ఇంతమంది ఆత్మలు
పోయారు అని కేవలము ఆ వార్త విని మౌనముగా ఉండిపోతారా. ఆ ఆత్మలు
సందేశము నుండైతే వంచితులు అయిపోయారు. ఇప్పుడు ఇక దాతగా అవ్వండి,
దయార్ద్ర హృదయులుగా అవ్వండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దయ
ఎప్పుడు కలుగుతుందంటే, ఈ సంవత్సరము ప్రారంభము నుండీ మీలో
అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. అనంతమైన వైరాగ్య
వృత్తి. ఈ దేహ స్మృతి, దేహ భానపు స్మృతి ఉందంటే అది కూడా
అనంతమైన వైరాగ్యములో లోపము ఉన్నట్లు. చిన్న-చిన్న హద్దులోని
విషయాలు స్థితిని అలజడిలోకి తీసుకువస్తాయి. కారణమేమిటి?
అనంతమైన వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది, ఇంకా ఆకర్షణ ఉంది.
వైరాగ్యము లేదు, ఆకర్షణ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా అనంతమైన
వైరాగిగా అవుతారో, వృత్తిలో కూడా వైరాగి, దృష్టిలో కూడా
అనంతమైన వైరాగి, సంబంధ-సంపర్కాలలో, సేవలో అన్నింటిలోనూ అనంతమైన
వైరాగి... అప్పుడే ముక్తిధామము యొక్క ద్వారము తెరుచుకుంటుంది.
ఇప్పుడు ఏ ఆత్మలైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో,
వారు మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ దుఃఖితులు అవుతారు. ఇప్పుడు
ముక్తిధామము యొక్క గేటును తెరిచేందుకు నిమిత్తులు మీరే కదా?
మీరు బ్రాహ్మాబాబాకు సహచరులు కదా! కనుక అనంతమైన వైరాగ్య
వృత్తియే గేటును తెరిచేందుకు తాళంచెవి. ఇప్పుడు ఇంకా తాళంచెవి
పెట్టలేదు, అసలు తాళంచెవిని తయారే చెయ్యలేదు. బ్రహ్మాబాబా కూడా
ఎదురుచూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తుంది,
ప్రకృతి కూడా ఎదురుచూస్తుంది. చాలా విసిగిపోయి ఉంది. మాయ కూడా
తన రోజులను లెక్కపెట్టుకుంటూ ఉంది. మరి ఇప్పుడు చెప్పండి - ఓ
మాస్టర్ సర్వశక్తివంతులారా, ఏం చెయ్యాలో చెప్పండి?
ఈ సంవత్సరములో ఏదైనా నవీనతను చేస్తారు కదా! నూతన సంవత్సరము
అని అన్నప్పుడు నవీనతనైతే చేస్తారు కదా! ఇప్పుడు అనంతమైన
వైరాగ్యానికి, ముక్తిధామానికి వెళ్ళేందుకు తాళంచెవిని
తయారుచెయ్యండి. మీరందరూ కూడా ముందు ముక్తిధామానికి వెళ్ళాలి కదా.
బ్రహ్మాబాబాతో ప్రతిజ్ఞ చేసారు - తోడుగా నడుస్తాము, తోడుగా
వస్తాము, తోడుగా రాజ్యము చేస్తాము, తోడుగా భక్తి చేస్తాము...
అని. మరి ఇప్పుడు ఏర్పాట్లు చెయ్యండి. ఈ సంవత్సరములో చేస్తారా
లేక మరో సంవత్సరము కావాలా? ఈ సంవత్సరములో అటెన్షన్ ప్లీజ్
అన్నది పదే-పదే పెట్టుకుంటాము అని అనేవారు చేతులెత్తండి.
చేస్తారా? అప్పుడు ఇక అడ్వాన్స్ పార్టీవారు మీకు చాలా
అభినందనలను ఇస్తారు. వారు కూడా అలసిపోయారు. అచ్ఛా - టీచర్లు
ఏమంటారు? మొదటి లైనులో ఉన్నవారు ఏమంటారు? ముందైతే, మొదటి లైనులో
ఉన్న పాండవులు మరియు మొదటి లైనులో ఉన్న శక్తులు ఎవరైతే చేస్తారో,
వారు చేతులెత్తండి. చేతిని సగం పైకి ఎత్తటము కాదు, సగం పైకి
ఎత్తారంటే సగమే చేస్తారని అంటారు. చేతిని బాగా పైకి ఎత్తండి.
అచ్ఛా. అభినందనలు, అభినందనలు. అచ్ఛా - డబుల్ విదేశీయులు
చేతులెత్తండి. ఎవరు చేతులెత్తలేదో పరస్పరం చూసుకోండి. అచ్ఛా, ఈ
సింధీ గ్రూపువారు కూడా చేతులెత్తుతున్నారు, అద్భుతము. మీరు కూడా
చేస్తారా? సింధీ గ్రూపువారు చేస్తారా? అలా అయితే డబుల్
అభినందనలు. చాలా మంచిది. ఒకరికొకరు తోడుగా ఉంటూ, శుభ భావనలతో
సూచనలను ఇచ్చుకుంటూ, చేయి చేయి కలుపుకుని చెయ్యాల్సిందే. అచ్ఛా.
(సభలో ఎవరో గట్టిగా శబ్దము చేసారు). అందరూ కూర్చోండి, నథింగ్
న్యూ (కొత్తేమీ కాదు).
ఇప్పుడిప్పుడే ఒక్క క్షణములో బిందువుగా అయ్యి బిందువైన
బాబాను గుర్తు చెయ్యండి మరియు ఏయే విషయాలైతే ఉన్నాయో వాటికి
బిందువు పెట్టండి. పెట్టగలరా? ఒక్క క్షణములో ‘‘నేను బాబా వాడిని,
బాబా నా వారు’’, అంతే. అచ్ఛా.
ఇప్పుడు నలువైపులా ఉన్న నవయుగ యజమానులైన పిల్లలందరికీ,
నలువైపులా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉల్లాస-ఉత్సాహాలు
ఉన్న పిల్లలకు, సదా ఎగురుతూ ఉండే మరియు ఎగిరేలా చేస్తూ ఉండే
ఎగిరే కళ కల పిల్లలకు, సదా తీవ్ర పురుషార్థము ద్వారా విజయమాలలో
మణులుగా అయ్యే విజయీ రత్నాలకు, నూతన సంవత్సరానికి మరియు నవ
యుగానికి బాప్ దాదా యొక్క ఆశీర్వాదాలతోపాటుగా పదమాల రెట్ల
శుభాకాంక్షలను పళ్ళాలతో నింపి-నింపి ఇస్తున్నారు, శుభాకాంక్షలు,
శుభాకాంక్షలు. ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అచ్ఛా!