13-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - రక్షాబంధనము యొక్క పండుగ ప్రతిజ్ఞ యొక్క పండుగ, అది సంగమయుగము నుండే ప్రారంభమవుతుంది, ఇప్పుడు మీరు పవిత్రముగా తయారయ్యే మరియు తయారుచేసే ప్రతిజ్ఞను చేస్తారు’’

ప్రశ్న:-
మీ కార్యాలన్నీ దేని ఆధారముగా సఫలమవ్వగలవు? పేరు ఏ విధముగా ప్రఖ్యాతమవుతుంది?

జవాబు:-
జ్ఞానబలముతో పాటు యోగబలము కూడా ఉన్నట్లయితే అన్ని కార్యాలూ చేసేందుకు తమంతట తామే సిద్ధమైపోతారు. యోగము చాలా గుప్తమైనది, దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగములో ఉంటూ అర్థం చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తమంతట తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవ్వనున్నది, దీని ద్వారానే అనేకులకు సందేశం లభిస్తుంది.

ఓంశాంతి
ఈ రోజు పిల్లలకు రక్షాబంధనమును గురించి అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడది సమీపముగా ఉంది. పిల్లలు రాఖీ కట్టడానికి వెళ్తారు. ఏదైతే ఒకప్పుడు జరిగి ఉంటుందో, దాని పండుగను జరుపుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రతిజ్ఞా పత్రాన్ని వ్రాయించారని, దానికి ఎన్నో పేర్లు పెట్టారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పవిత్రతకు గుర్తు. పవిత్రులుగా అయ్యే రాఖీని కట్టుకోండి అని అందరికీ చెప్పవలసి ఉంటుంది. పవిత్ర ప్రపంచము సత్యయుగ ఆదిలోనే ఉంటుంది అని కూడా మీకు తెలుసు. ఈ పురుషోత్తమ సంగమయుగములోనే రాఖీ పండుగ ప్రారంభమవుతుంది, ఇది మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు జరుపుకోబడుతుంది, దీనిని అనాది పండుగ అని అంటారు. అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భక్తి మార్గము నుండి, ఎందుకంటే సత్యయుగములోనైతే ఈ పండుగలు మొదలైనవేవీ ఉండవు. అవి ఇక్కడే ఉంటాయి. ఈ పండుగలు మొదలైనవి సంగమయుగములో జరుగుతాయి, అవే మళ్ళీ భక్తి మార్గములో ప్రారంభమవుతాయి. సత్యయుగములో ఎటువంటి పండుగలూ ఉండవు. దీపావళి ఉంటుందా? అని మీరు అడుగుతారు. అది ఉండదు. అది కూడా ఇక్కడే జరుపుకుంటారు, అక్కడ అది ఉండకూడదు. ఇక్కడ ఏదైతే జరుపుకుంటారో దానిని అక్కడ జరుపుకోలేరు. ఇవన్నీ కలియుగ పండుగలు. రక్షాబంధనమును జరుపుకుంటారు, కానీ ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకోబడుతుంది అన్నది ఎలా తెలుస్తుంది? మీరు అందరికీ రాఖీ కడతారు, వారికి ఏం చెప్తారంటే - పావనంగా అవ్వండి ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. త్రిమూర్తి చిత్రములో కూడా - బ్రహ్మా ద్వారా పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది అని వ్రాయబడి ఉంది, అందుకే పవిత్రముగా తయారుచేసేందుకు రాఖీ బంధనము జరుపుకోబడుతుంది. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గపు సమయము. ఎవరైనా భక్తి విషయమేదైనా మీకు వినిపిస్తే - ఇప్పుడు మేము జ్ఞాన మార్గములో ఉన్నాము అని వారికి అర్థం చేయించాలి అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే, వారు మొత్తం ప్రపంచమంతటినీ నిర్వికారిగా తయారుచేస్తారు. భారత్ నిర్వికారిగా ఉండేది, అప్పుడు మొత్తం ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది. భారత్ ను నిర్వికారిగా తయారుచేయడం ద్వారా మొత్తం ప్రపంచమంతా నిర్వికారిగా తయారవుతుంది. భారత్ ను ప్రపంచము అని అనరు. మొత్తం ప్రపంచములో భారత్ ఒక ఖండము మాత్రమే. కొత్త ప్రపంచములో కేవలం ఒక్క భారతఖండమే ఉంటుందని పిల్లలకు తెలుసు. భారతఖండములో తప్పకుండా మనుష్యులు కూడా ఉంటారు. భారత్ సత్యఖండముగా ఉండేది, సృష్టి ఆదిలో దేవతా ధర్మమే ఉండేది, దానినే నిర్వికారీ పవిత్ర ధర్మము అని అనడం జరుగుతుంది, అది ఉండి 5000 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. నిర్వికారులుగా అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సమయమైతే పడుతుంది. ఇక్కడ కూడా పవిత్రముగా అయ్యే పురుషార్థాన్ని చేస్తారు. అన్నింటి కన్నా పెద్ద పండుగ ఇదే. బాబా, మేము పవిత్రముగానైతే తప్పకుండా అవుతాము అని ప్రతిజ్ఞను చేయాలి. ఈ ఉత్సవాన్ని అన్నింటికన్నా పెద్దదిగా భావించాలి. ఓ పరమపిత పరమాత్మా, అని అందరూ పిలుస్తూ ఉంటారు కూడా, ఇలా అంటున్నా కూడా ఆ పరమపిత బుద్ధిలోకి రారు. పరమపిత పరమాత్మ జీవాత్మలకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తారని మీకు తెలుసు. ఆత్మ, పరమాత్మ ఎంతోకాలం దూరంగా ఉన్నారు... అని అంటారు. ఈ మేళా ఈ సంగమయుగములోనే జరుగుతుంది. కుంభమేళా అని కూడా దీనినే అంటారు, ఇది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి జరుగుతుంది. ఆ నీటిలో స్నానం చేసే మేళానైతే అనేక సార్లు జరుపుకుంటూ వచ్చారు. అది భక్తి మార్గము. ఇది జ్ఞాన మార్గము. సంగమమును కూడా కుంభము అని అంటారు. వాస్తవానికి అక్కడ మూడు నదులు లేవు. నీటి యొక్క గుప్త నది ఎలా ఉండగలదు! మీ ఈ గీత గుప్తమైనది అని తండ్రి అంటారు. కావున ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే - మీరు యోగబలము ద్వారా విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, ఇందులో నాట్యాలు, తమాషాలు మొదలైనవేవీ లేవు. ఆ భక్తి మార్గం పూర్తిగా అర్ధకల్పం నడుస్తుంది మరియు ఈ జ్ఞానం ఒక్క జన్మ నడుస్తుంది. ఆ తర్వాత రెండు యుగాలు జ్ఞాన ప్రారబ్ధము ఉంటుంది, అక్కడ జ్ఞానం నడవదు. భక్తి అయితే ద్వాపర-కలియుగాల నుండీ నడుస్తూ వచ్చింది. జ్ఞానము కేవలం ఒక్క సారే లభిస్తుంది మరియు దాని ప్రారబ్ధము 21 జన్మలు నడుస్తుంది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఇంతకుముందు మీరు అజ్ఞాన నిద్రలో ఉండేవారు. ఇప్పుడు రక్షాబంధనం నాడు బ్రాహ్మణులు రాఖీని కడతారు. మీరు కూడా బ్రాహ్మణులే. వారు కుఖవంశావళి, మీరు ముఖవంశావళి. భక్తి మార్గములో ఎంత అంధశ్రద్ధ ఉంది. ఊబిలో చిక్కుకొని ఉన్నారు. ఊబిలో కాళ్ళు చిక్కుకుపోతాయి కదా. అలా భక్తి అనే ఊబిలో మనుష్యులు చిక్కుకుపోతారు మరియు పూర్తిగా గొంతు వరకూ చిక్కుకుపోతారు, అప్పుడు తండ్రి మళ్ళీ రక్షించడానికి వస్తారు. ఎప్పుడైతే ఇక చివరిలో పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు, పట్టుకునేందుకైతే అది కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు ఎంతగానో కష్టపడతారు. కోట్లాదిమంది మనుష్యులు ఉన్నారు, ఒక్కొక్కరి వద్దకు వెళ్ళడం కష్టమవుతుంది. వీరు ఎత్తుకుపోతారని, ఇళ్ళు-వాకిళ్ళను వదిలింపజేస్తారని, సోదరీ-సోదరులుగా చేస్తారని వార్తాపత్రికల ద్వారా మీ పేరు అప్రతిష్ఠపాలు అయ్యింది. ప్రారంభములో జరిగిన విషయం ఎంతగా వ్యాపించిపోయింది. వార్తాపత్రికల్లో ఎంతో కోలాహలం వ్యాపించింది. మరి ఇప్పుడు ఒక్కొక్కరికైతే అర్థం చేయించలేరు. మళ్ళీ మీకు ఆ వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. వారు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడిక ఏమి చేయాలి? అని ఆలోచించాలి. రక్షాబంధనము యొక్క అర్థము ఏమిటి? తండ్రి పావనంగా తయారుచేయడానికి వచ్చారు కావున వారు పిల్లల నుండి పవిత్రతా ప్రతిజ్ఞను తీసుకున్నారు. పతితులను పావనులుగా తయారుచేసేవారే ఆ రాఖీని కట్టారు.

శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకుంటారు, మరి ఆ తర్వాత వారు తప్పకుండా సింహాసనంపై కూర్చొని ఉంటారు. పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు. సత్యయుగ ఆదిలో లక్ష్మీ-నారాయణులు ఉండేవారు. వారి పట్టాభిషేకము జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు, మరి పట్టాభిషేకము ఏది? దీపావళినాడు పట్టాభిషేకము జరుగుతుంది. ఎంతో ఆర్భాటముగా ఉంటుంది, అది సత్యయుగానికి చెందినది. సంగమయుగపు విషయమేదైతే ఉంటుందో అది అక్కడ ఉండదు. ఇంటింటిలోనూ ప్రకాశం ఇక్కడే రానున్నది. అక్కడ దీపావళి మొదలైనవాటిని జరుపుకోరు. అక్కడైతే ఆత్మల జ్యోతి వెలిగే ఉంటుంది. అక్కడ పట్టాభిషేకాన్ని జరుపుకుంటారే కానీ దీపావళిని కాదు. ఎప్పటివరకైతే ఆత్మల జ్యోతి వెలగదో అప్పటివరకూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు వీరందరూ పతితులే, వీరిని పావనంగా తయారుచేయడానికి ఆలోచించాలి. పిల్లలు పెద్ద-పెద్ద వ్యక్తుల వద్దకు ఆలోచించి వెళ్తారు. వార్తాపత్రికల ద్వారా పిల్లల పేరు అప్రతిష్ఠపాలు అయ్యింది, మళ్ళీ వాటి ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది కూడా. కొంత డబ్బు ఇస్తే బాగా వేస్తారు. కానీ మీరు డబ్బు ఎంతవరకని ఇస్తారు. డబ్బు ఇవ్వడం కూడా లంచమివ్వడమే, అది నియమవిరుద్ధమవుతుంది. ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే అవ్వవు. మీరు కూడా లంచం ఇచ్చి, వారు కూడా లంచం ఇస్తే, ఇద్దరూ ఒకటే అయిపోతారు. మీది యోగబలము యొక్క విషయము. యోగబలం ఎంత ఉండాలంటే, దాని ద్వారా మీరు ఎవరితోనైనా పని చేయించగలగాలి. భూ-భూ చేస్తూ ఉండాలి. జ్ఞానబలమైతే మీలో కూడా ఉంది. ఈ చిత్రాలు మొదలైనవాటిలో జ్ఞానముంది, యోగము గుప్తమైనది. అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. వారు గుప్తమైనవారు, వారి ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీరు ఎక్కడైనా కూర్చొని స్మృతి చేయవచ్చు. కేవలం ఇక్కడ కూర్చొనే యోగము చేయడం కాదు. జ్ఞానము మరియు స్మృతి, రెండూ సహజమైనవే. కేవలం ఏడు రోజుల కోర్సును తీసుకున్నా చాలు, ఎక్కువ అవసరం లేదు. అప్పుడు మీరు వెళ్ళి ఇతరులను మీ సమానముగా తయారుచేయండి. తండ్రి జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా మీరు శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది.

పిల్లలైన మీరు బయట విహరించినా కానీ తండ్రిని స్మృతి చేయండి. పవిత్రముగా అవ్వాలి, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అవగుణమూ ఉండకూడదు. కామము కూడా చాలా భారీ అవగుణమే. తండ్రి అంటున్నారు, ఇప్పుడిక మీరు పతితులుగా అవ్వకండి. స్త్రీ ఎదురుగా ఉన్నా కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చూస్తూ కూడా చూడకండి. నేనైతే నా తండ్రిని స్మృతి చేస్తాను, వారు జ్ఞానసాగరుడు. వారు మిమ్మల్ని తమ సమానముగా తయారుచేస్తారు కావున మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. ఇందులో తికమకపడకూడదు. వారు పరమాత్మ. వారు పరంధామములో ఉంటారు కావున వారిని పరమ అని అనడం జరుగుతుంది. అక్కడైతే మీరు కూడా ఉంటారు. ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారముగా మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఎవరైతే పాస్ విత్ ఆనర్లుగా అవుతారో వారిని పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారు అని అనడం జరుగుతుంది. తండ్రి కూడా జ్ఞానసాగరుడు, అలాగే మీరు కూడా జ్ఞానసాగరులు. ఆత్మ ఏమీ చిన్నగా, పెద్దగా అవ్వదు. పరమపిత కూడా పెద్దగా ఏమీ ఉండరు. వారు వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని ఏదైతే అంటారో, అవన్నీ ప్రగల్భాలే. బుద్ధిలో ఏ రూపముతో స్మృతి చేస్తారో, అది సాక్షాత్కారమవుతుంది. ఇందులో వివేకము కావాలి. ఆత్మ సాక్షాత్కారమైనా లేక పరమాత్మ సాక్షాత్కారమైనా ఒకే విధంగా ఉంటుంది. నేనే పతిత-పావనుడను, జ్ఞానసాగరుడను, సమయం వచ్చినప్పుడు వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను అని తండ్రి రియలైజ్ చేయించారు. అందరికన్నా ఎక్కువ భక్తిని మీరే చేసారు కావున తండ్రి మిమ్మల్నే చదివిస్తారు. రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది, ఆ తర్వాత దసరా. వాస్తవానికి దసరా కన్నా ముందైతే కృష్ణుడు రాలేడు. ముందు దసరా జరగాలి, ఆ తర్వాత కృష్ణుడు రావాలి. ఈ లెక్కను కూడా మీరు తీస్తారు. మొదట మీరు ఏమీ అర్థం చేసుకునేవారు కారు. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారుచేస్తారు. టీచర్ వివేకవంతులుగా తయారుచేస్తారు కదా. భగవంతుడు బిందుస్వరూపుడని ఇప్పుడు మీకు తెలుసు. వృక్షము ఎంత పెద్దది. ఆత్మలు పైన బిందు రూపములో ఉంటాయి. మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది, వాస్తవానికి ఒక్క క్షణములో వివేకవంతులుగా అవ్వాలి. కానీ ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు అర్థమే చేసుకోరు. వాస్తవానికి ఇది ఒక్క క్షణపు విషయమే. హద్దులోని తండ్రి అయితే జన్మ-జన్మకూ కొత్తగా లభిస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే ఒకేసారి వచ్చి 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీ ఆయువు కూడా పెద్దదిగా అవుతుంది. 21 జన్మలూ ఒకే తండ్రి ఉంటారని కూడా కాదు. అలా కాదు. మీ ఆయువు పెరుగుతుంది. మీరు ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు. చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానము నిలుస్తుంది. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. అంతే, పిల్లలు జన్మించగానే వారసులవుతారు. తండ్రిని తెలుసుకున్నారు కావున ఇక తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. దైవీ గుణాలను ధారణ చేయండి. తండ్రి మరియు వారసత్వము, ఇది ఎంత సహజము. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది.

మేము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి. త్రిమూర్తి చిత్రాన్ని కూడా ఇవ్వాలి ఎందుకంటే బ్రహ్మా ద్వారా స్థాపన అని అర్థం చేయించడం జరుగుతుంది. బ్రాహ్మణులను పావనంగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు, అందుకే రాఖీ కట్టించుకుంటారు. పతిత-పావనుడు భారత్ ను పావనముగా తయారుచేస్తున్నారు, ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడిక పావన ప్రపంచము స్థాపన అవుతుంది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఎవరైతే అనేక జన్మలు తీసుకొని ఉంటారో, వారు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చివరిలో వచ్చేవారికి అంతటి సంతోషము ఉండదు ఎందుకంటే వారు భక్తి తక్కువగా చేసారు. భక్తి ఫలాన్ని ఇవ్వడానికి తండ్రి వస్తారు. భక్తిని ఎవరు ఎక్కువ చేసారు అన్నది కూడా ఇప్పుడు మీకు తెలుసు. మొదటి నంబరులో మీరే వచ్చారు, మీరే అవ్యభిచారీ భక్తిని చేసారు. మేము ఎక్కువ భక్తిని చేసామా లేక వీరు ఎక్కువ భక్తిని చేసారా? అని మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే సేవ చేస్తారో, తప్పకుండా వారు భక్తిని కూడా ఎక్కువగానే చేసి ఉంటారు. బాబా పేర్లు అయితే వ్రాస్తారు - కుమారకా ఉన్నారు, జనక్ ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గుల్జార్ ఉన్నారు, నంబరువారుగా అయితే ఉంటారు. ఇక్కడ నంబరువారుగా కూర్చోబెట్టలేరు. రక్షాబంధనము గురించి వార్తాపత్రికల్లో ఎలా వేయాలి అని ఆలోచించాలి. మినిస్టర్లు మొదలైనవారి వద్దకు రాఖీ కట్టడానికి వెళ్తారు, అది సరే, కానీ వారు పవిత్రముగానైతే అవ్వరు. పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచము స్థాపన అవుతోంది అని మీరు అంటారు. 63 జన్మలు వికారులుగా అయ్యారు, ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. ఖుదాను స్మృతి చేసినట్లయితే మీ శిరస్సుపై పాపాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాస్ విత్ ఆనర్లుగా అయ్యేందుకు తండ్రి సమానముగా జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఏదైనా అవగుణము లోపల ఉన్నట్లయితే దానిని చెక్ చేసుకుని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా, ఆత్మగా నిశ్చయం చేసుకొని ఆత్మతో మాట్లాడాలి.

2. మీ ప్రతి పనీ సహజముగా అయ్యే విధంగా యోగబలాన్ని జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి. తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి.

వరదానము:-

దేహభానాన్ని దేహీ-అభిమానీ స్థితిలోకి పరివర్తన చేసే అనంతమైన వైరాగీ భవ

నడుస్తూ-నడుస్తూ ఒకవేళ వైరాగ్యం ఖండితమైందంటే దానికి ముఖ్య కారణము - దేహభానము. ఎప్పటివరకైతే దేహభానము యొక్క వైరాగ్యము ఉండదో, అప్పటివరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యమూ సదాకాలికముగా ఉండదు. సంబంధాల పట్ల వైరాగ్యము - ఇదేమంత పెద్ద విషయము కాదు, అలా అయితే ప్రపంచములో కూడా చాలామందికి వైరాగ్యము కలుగుతుంది, కానీ ఇక్కడ దేహభానము యొక్క భిన్న-భిన్న రూపాలేవైతే ఉన్నాయో, వాటిని తెలుసుకొని, దేహభానాన్ని దేహీ-అభిమానీ స్థితిలోకి పరివర్తన చేయటము - ఇది అనంతమైన వైరాగిగా అయ్యేందుకు విధి.

స్లోగన్:-

సంకల్పము రూపీ పాదము దృఢంగా ఉన్నట్లయితే కారు మబ్బులలాంటి విషయాలు కూడా పరివర్తన అవుతాయి.