13-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 03.02.2006


‘‘పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క ఎటువంటి స్థితిని తయారుచేసుకోండంటే అందులో వ్యర్థము యొక్క నామ-రూపాలు ఉండకూడదు’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ ప్రభు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తము విశ్వములోని కోట్లలో ఎన్నుకోబడిన కొద్దిమంది ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమనే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను మొత్తము కల్పములో ఈ సమయములోనే అనుభవము చేస్తారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహానాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవము చేసారు కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయ్యారు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమంటారు? తండ్రి అయిన పరమాత్మ అయితే మాతోనే ఉన్నారు, మేము వారితోనే ఉంటాము. పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు మరియు మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము. ఇంతటి ప్రేమను అనుభవము చేస్తున్నారు. వారు మా మనసులో ఉంటారు మరియు మేము వారి మనసులో ఉంటాము అని నషాతో కూడిన గర్వముతో అంటారు. ఇటువంటి అనుభవీలే కదా! అనుభవీలేనా? మనసులో ఏమనిపిస్తుంది? మేము అనుభవీలము కాకపోతే ఇంకెవరు అవుతారు! తండ్రి కూడా ప్రేమకు అధికారులైన ఇటువంటి పిల్లలను చూసి హర్షిస్తారు.

పరమాత్మపై ప్రేమకు గుర్తు ఏమిటంటే - ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి కోసం అంతా బలిహారము చేయడానికి సహజముగా తయారైపోతారు. అలాగే మీరందరూ కూడా ఏదైతే తండ్రి కోరుకుంటున్నారో - పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా అవ్వాలని, ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి ప్రత్యక్షముగా కనిపించాలని, ఆ విధంగా తయారయ్యారు కదా? బాప్ దాదా మనసుకు ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసు కదా! బాబా మనసుకు ఇష్టమైన స్థితియే సంపూర్ణ పవిత్రత. ఈ బ్రాహ్మణ జన్మ యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రతయే. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పము మరియు స్వప్నములో కూడా ఏ మాత్రమూ అపవిత్రత యొక్క నామ-రూపాలు ఉండకపోవడము. బాప్ దాదా నేటి సమయము యొక్క సమీపత అనుసారముగా పదే-పదే అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు - సంపూర్ణ పవిత్రత లెక్కలో చూస్తే వ్యర్థ సంకల్పాలు ఉండటము కూడా సంపూర్ణత కాదు. కనుక చెక్ చేసుకోండి, వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా? ఏ రకమైన వ్యర్థ సంకల్పమైనా సంపూర్ణత నుండి దూరమైతే చెయ్యటం లేదు కదా? ఎంతెంతగా పురుషార్థములో ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగా రాయల్ రూపములోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వృథాగా సమాప్తము చెయ్యటం లేదు కదా? రాయల్ రూపములోని అభిమానము మరియు అవమానము అనేవి వ్యర్థ సంకల్పాల రూపములో దాడి అయితే చెయ్యటము లేదు కదా? ఒకవేళ పరమాత్మ యొక్క ఏ కానుకనైనా అభిమానములోకి వచ్చి తమ విశేషతగా భావించినట్లయితే ఆ విశేషతకు చెందిన అభిమానము కూడా కిందకు తీసుకువచ్చేస్తుంది, అది విఘ్న రూపముగా అవుతుంది. అభిమానము అనేది కూడా సూక్ష్మ రూపములో ఏ విధముగా వస్తుందో అది తెలుసు కూడా - నాది అన్న భావము వస్తుంది, నాకు పేరు, గౌరవము, ప్రతిష్ట ఉండాలి, ఈ నాది అన్న భావము అభిమానము రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి ఎందుకంటే బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - స్వమానములో ఉండాలి, అభిమానము ఉండకూడదు, అవమానము కలగకూడదు. వ్యర్థ సంకల్పాలు రావడానికి ఇవే కారణాలు అవుతాయి.

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ డబల్ యజమానత్వము యొక్క నిశ్చయము మరియు నషాలో చూడాలనుకుంటారు. డబల్ యజమానత్వము అంటే ఏమిటి? ఒకటేమో, తండ్రి యొక్క ఖజానాలకు యజమానులు మరియు రెండవది, స్వరాజ్యానికి యజమానులు. రెండింటికీ యజమానులే ఎందుకంటే అందరూ బాలకులు కూడా మరియు యజమానులు కూడా. కానీ బాప్ దాదా ఏం గమనించారంటే, అందరూ అయితే బాలకులే ఎందుకంటే అందరూ ‘నా బాబా’ అని అంటారు. మరి ‘నా బాబా’ అంటే బాలకులే. కానీ బాలకులుగా అవ్వటముతోపాటు రెండు రకాల యజమానులుగా ఉండాలి. ఆ యజమానత్వములో నంబరువారుగా అయిపోతారు. నేను బాలకుడిని మరియు యజమానిని కూడా. వారసత్వపు ఖజానా ప్రాప్తించింది కనుక బాలకతనము యొక్క నిశ్చయము మరియు నషా ఉంటుంది, కానీ యజమానత్వములో ప్రాక్టికల్ గా నిశ్చయము యొక్క నషా ఉండటములో నంబరువారుగా అయిపోతారు. స్వరాజ్యాధికారి యజమానిగా అవ్వడములో విశేషముగా విఘ్నము కలిగించేది మనసు. మనసుకు యజమానిగా అయ్యి ఎప్పుడూ కూడా మనసుకు పరవశమవ్వకూడదు. స్వరాజ్యాధికారులము అని అంటారు, మరి స్వరాజ్యాధికారి అనగా రాజా, ఏ విధంగా బ్రహ్మాబాబా ప్రతి రోజు చెకింగ్ చేసుకుని మనసుకు యజమానిగా అయ్యి విశ్వ ఆధిపత్యము యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. అదే విధంగా ఈ మనస్సు, బుద్ధి అనేవి రాజు లెక్కలో చూసినట్లయితే ఇవి మంత్రులు, ఈ వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులో ఉత్పన్నమవుతాయి, అప్పుడు మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. ఒకవేళ ఆర్డరు అనుసారముగా నడిపించకపోతే మనస్సు చంచలముగా అయిన కారణముగా పరవశం చేసేస్తుంది. కనుక చెక్ చేసుకోండి. మామూలుగా కూడా మనస్సును గుర్రం అని అంటారు, ఎందుకంటే అది చంచలమైనది కదా! కానీ మీ వద్ద శ్రీమతమనే కళ్ళెము ఉంది. ఒకవేళ శ్రీమతమనే కళ్ళెము ఏ కొంచెమైనా ఢీలా (లూజ్) అయినట్లయితే మనస్సు చంచలమైపోతుంది. కళ్ళెము ఎందుకని ఢీలా అవుతుంది? ఎందుకంటే ఎక్కడో ఒక చోట సైడ్ సీన్స్ ను (మార్గమధ్యములో వచ్చే దృశ్యాలను) చూడటములో నిమగ్నమైపోతారు. మరియు కళ్ళెము ఢీలా అయినట్లయితే మనస్సుకు అవకాశము లభిస్తుంది. కనుక నేను బాలకుడిని మరియు యజమానిని అనే ఈ స్మృతిలో సదా ఉండండి. చెక్ చేసుకోండి, ఖజానాలకు కూడా యజమానిగా, అలాగే స్వరాజ్యానికి కూడా యజమానిగా, డబల్ యజమానిగా ఉన్నారా? ఒకవేళ యజమానత్వము తక్కువైతే బలహీన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. మరియు సంస్కారాన్ని ఏమంటారు? నా సంస్కారమే అటువంటిది, నా స్వభావమే అటువంటిది, కానీ నిజానికి ఇవి నావా? అనటానికైతే నా సంస్కారము అనే అంటారు కానీ ఇది నాదా? నా సంస్కారము అని అనటము రైటా? రైటా? అది నాదా లేక రావణుడి ఆస్తినా? బలహీన సంస్కారము రావణుడి ఆస్తి, దానిని నాది అని ఎలా అనగలను. నా సంస్కారము ఏది? తండ్రి సంస్కారము ఏదైతే ఉందో అదే నా సంస్కారము. మరి తండ్రి సంస్కారము ఏమిటి? విశ్వ కళ్యాణము. శుభ భావన, శుభ కామన. కనుక ఏ బలహీన సంస్కారమునైనా నా సంస్కారము అని అనడమే తప్పు. మరియు నా సంస్కారము అని ఒకవేళ మనస్సులో కూర్చోబెట్టారు అంటే అశుద్ధమైన వస్తువును మనసులో కూర్చోబెట్టినట్లు. నా వస్తువు అన్నదానిపై అయితే ప్రేమ ఉంటుంది కదా! కనుక నాది అని అనుకున్నట్లయితే మీ మనస్సులో దానికి స్థానము ఇచ్చినట్లు, అందుకే చాలాసార్లు పిల్లలు చాలా యుద్ధము చెయ్యవలసి వస్తుంది ఎందుకంటే అశుభము మరియు శుభము, రెండింటినీ మనస్సులో కూర్చోబెట్టారు, ఇక ఆ రెండూ ఏమి చేస్తాయి? యుద్ధమే చేస్తాయి కదా! నా సంస్కారము అన్నది సంకల్పములో కూడా వస్తుంది, వాణిలో కూడా వస్తుంది. కనుక చెక్ చేసుకోండి - ఈ అశుభ సంస్కారము నా సంస్కారము కాదు. సంస్కార పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ నడవడిక మరియు ముఖము ద్వారా పదమాల, పదమాల రెట్ల భాగ్యవంతులుగా చూడాలనుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అంటారు, భాగ్యవంతులుగా అయితే అయ్యాము కానీ నడుస్తూ-తిరుగుతూ భాగ్యము ఇమర్జ్ అయి ఉండాలి, అది మర్జ్ అయిపోతుంది. బాప్ దాదా ప్రతి సమయము, ప్రతి బిడ్డ మస్తకముపై మెరుస్తూ ఉన్న భాగ్య సితారను చూడాలనుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని చూసినా సరే మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా మీరు భాగ్యవంతులుగా కనిపించాలి, అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది, ఎందుకంటే వర్తమాన సమయములో మెజారిటీ అనుభవం చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా ఈ రోజుల్లోని సైన్స్ప్రత్యక్ష రూపములో చూపిస్తుంది కదా! అనుభవము చేయిస్తుంది కదా! వేడిని కూడా అనుభవము చేయిస్తుంది, చల్లదనాన్ని కూడా అనుభవము చేయిస్తుంది, అలాగే సైలెన్స్శక్తి ద్వారా కూడా అనుభవము చేయాలని కోరుకుంటారు. ఎంతెంతగా స్వయం అనుభవములో ఉంటారో, అంతగా ఇతరులకు కూడా అనుభవము చేయించగలరు. ఇప్పుడు కంబైండ్ సేవ చెయ్యండి అని బాప్ దాదా సూచించారు కూడా. కేవలం వాచా ద్వారానే కాదు, కానీ వాచాతో పాటు అనుభవీ మూర్తులుగా అయి అనుభవము చేయించే సేవను కూడా చేయండి. ఏదో ఒక అనుభవము, శాంతి యొక్క అనుభవము, సంతోషం యొక్క అనుభవము, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవము..., అనుభవము ఎటువంటిదంటే ఒక్కసారి అనుభవమైనా సరే ఇక వదలలేరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవము చెందిన విషయాన్ని మర్చిపోరు. అది అనుభవము చేయించినవారికి సమీపముగా తీసుకువస్తుంది.

ఇప్పుడు భవిష్యత్తులో ఏ నవీనతను చెయ్యాలి? అని అందరూ అడుగుతుంటారు. బాప్ దాదా చూసారు, సేవనైతే అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారు, ప్రతి ఒక్క వర్గమువారు కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా చాలా వర్గాలవారు వచ్చారు కదా! మెగా ప్రోగ్రాములు కూడా చేసేసారు, సందేశాన్ని అయితే ఇచ్చేసారు, మీపై ఉన్న ఫిర్యాదును తొలగించుకున్నారు, ఇందుకు అభినందనలు. కానీ ఇప్పటివరకు - ఇది పరమాత్మ జ్ఞానము అన్న శబ్దం వ్యాపించలేదు. బ్రహ్మాకుమారీలు మంచి కార్యము చేస్తున్నారు, బ్రహ్మాకుమారీల జ్ఞానము చాలా బాగుంది అని అంటారే కానీ ఇదే పరమాత్ముని జ్ఞానము, పరమాత్ముని కార్యము నడుస్తూ ఉంది అన్న ఈ ధ్వని వ్యాపించాలి. మెడిటేషన్ కోర్స్ ను కూడా చేయిస్తారు, ఆత్మకు పరమాత్మతో కనెక్షన్ ను కూడా జోడిస్తారు, కానీ ఇప్పుడు పరమాత్ముని కార్యమును స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అన్నదానిని చాలా తక్కువమంది అనుభవము చేస్తున్నారు. ఆత్మ మరియు ధారణలు, ఇవి ప్రత్యక్షమవుతున్నాయి, మంచి కార్యము చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతారు, మంచిని నేర్పిస్తారు అని అంటారు, ఇంతవరకు బాగుంది. జ్ఞానము బాగుంది అని కూడా అంటారు కానీ ఇది పరమాత్ముని జ్ఞానము... అన్న ఈ ధ్వని తండ్రికి సమీపముగా తీసుకువస్తుంది మరియు ఎంతగా తండ్రికి సమీపముగా వస్తారో అంతగా అనుభవము స్వతహాగానే చేస్తూ ఉంటారు. కనుక ఎటువంటి ప్లాన్ ను తయారుచెయ్యండంటే మరియు భాషణలలో ఎటువంటి పదునును లేక శక్తిని నింపండంటే, దానితో పరమాత్మకు సమీపముగా వచ్చేయాలి. దివ్యగుణాల ధారణ పట్ల అటెన్షన్ వెళ్ళింది, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు, పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తారు అని ఈ మాట అంటారు, కానీ పరమాత్మ వచ్చేసారు, పరమాత్ముని కార్యాన్ని స్వయం పరమాత్మ నడిపిస్తున్నారు, ఈ ప్రత్యక్షత ఆయస్కాంతములా సమీపముగా తీసుకువస్తుంది. మీరు కూడా - తండ్రి లభించారు మరియు తండ్రిని కలవాలి అని ఎప్పుడైతే భావించారో అప్పుడే సమీపముగా వచ్చారు. స్నేహీలుగా మెజారిటీ అవుతారు, వాళ్ళు ఏమని భావించి అలా అవుతారు? వాళ్ళు ఏమనుకుంటారంటే - కార్యము చాలా బాగుంది, ఏ కార్యమునైతే బ్రహ్మాకుమారీలు చేస్తున్నారో, ఆ కార్యాన్ని ఇంకెవ్వరూ చెయ్యలేరు, వీరు పరివర్తన చేయిస్తారు అని అనుకుంటారు. కానీ పరమాత్మ మాట్లాడుతున్నారు, పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని ఇంత సమీపముగా రావటము లేదు, ఎందుకంటే బ్రహ్మాకుమారీలు ఏం చేస్తున్నారు, వీరి జ్ఞానము ఏమిటి అన్నది ఇంతకుముందు అర్థం చేసుకోలేదు కాదు కానీ అది ఇప్పుడు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. కానీ పరమాత్ముని ప్రత్యక్షత జరగాలి. ఇది పరమాత్ముని జ్ఞానము అని ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే వారు ఆగగలరా! ఏ విధంగా మీరు పరుగెత్తుకుని వచ్చేసారు కదా, అదే విధంగా వారు పరుగెత్తుకుని వస్తారు. కనుక ఇప్పుడు అటువంటి ప్లాన్ ను తయారుచెయ్యండి, అటువంటి భాషణను తయారుచెయ్యండి, పరమాత్మ అనుభూతి యొక్క అటువంటి ప్రాక్టికల్ ఋజువుగా అవ్వండి, అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతము ‘బాగుంది’ అన్నంతవరకు చేరుకున్నారు కానీ ‘బాగా తయారవ్వాలి’ అన్న ఈ అల పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతితో జరుగుతుంది. కనుక అనుభవీమూర్తులుగా అయ్యి అనుభవము చేయించండి. ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారుచెయ్యండి. అచ్ఛా.

సేవా టర్న్పంజాబ్ జోన్ వారిది:- చేతులు ఊపండి. మంచిది, ఏ జోన్ కు టర్న్లభిస్తే వారు చాలా పెద్ద మనసుతో వస్తారు. (పంజాబ్ జోన్ నుండి 4000 మంది వచ్చారు) ప్రతి జోన్ వారు సేవా ఛాన్స్ ను మంచిగా తీసుకుంటారు అని బాప్ దాదాకు కూడా సంతోషము కలుగుతుంది. పంజాబ్ ను అందరూ మామూలుగా కూడా సింహము అని అంటారు, పంజాబ్ సింహము మరియు బాప్ దాదా అంటారు, సింహము అంటే విజయీ. కనుక సదా పంజాబ్ వారు తమ మస్తకము మధ్యలో విజయ తిలకాన్ని అనుభవము చెయ్యాలి. విజయ తిలకము లభించి ఉంది. మేమే కల్పకల్పపు విజయులము అన్నది సదా స్మృతిలో ఉండాలి. విజయులుగా ఉండేవారము, ఇప్పుడూ ఉన్నాము మరియు కల్ప-కల్పము అలా తయారవుతాము. మంచిది. పంజాబ్ వారు కూడా వారస క్వాలిటీ వారిని బాబా ఎదురుగా తీసుకువచ్చేందుకు ప్రోగ్రామ్ ను తయారుచేస్తున్నారు కదా! ఇప్పుడు బాప్ దాదా ఎదురుగా వారస క్వాలిటీ వారిని తీసుకురాలేదు. స్నేహీ క్వాలిటీ వారిని తీసుకువచ్చారు, అన్ని జోన్లవారు స్నేహీ, సహయోగీ క్వాలిటీ వారిని తీసుకువచ్చారు, కానీ వారస క్వాలిటీ వారిని తీసుకురాలేదు. ఏర్పాట్లు చేస్తున్నారు కదా! అన్ని రకాలవారు కావాలి కదా! వారసులు కూడా కావాలి, స్నేహీలు కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి, మైకులు కూడా కావాలి, మైట్ కూడా కావాలి. అన్ని రకాలవారు కావాలి. మంచిది, సెంటర్లలో వృద్ధి అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉల్లాస-ఉత్సాహాలతో సేవలో వృద్ధి చేస్తున్నారు కూడా. అయితే, పరమాత్మ వచ్చేసారు అన్న ఈ ప్రత్యక్షత ఏ జోన్ లో జరుగుతుందో ఇప్పుడు చూస్తాము. తండ్రి యొక్క ప్రత్యక్షతను ఏ జోన్ చేస్తుంది అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. విదేశాలవారు చేస్తారా? విదేశీయులు కూడా చెయ్యగలరు. పంజాబ్ వారు నంబర్ ను తీసుకోండి. తీసుకోండి, మంచిదే. అందరూ మీకు సహయోగము ఇస్తారు. ‘ఇదే, ఇదే, ఇదే’... అన్న ఈ ధ్వనిని వ్యాపింపజేసేందుకు చాలా సమయము నుండి ప్రయత్నము చేస్తున్నారు. ప్రస్తుతమైతే - ‘ఇది కూడా ఒకటి’ అన్నట్లు ఉంది, కానీ ‘కేవలం ఇదే’ అన్నది లేదు. మరి పంజాబ్ వారు ఏం చేస్తారు? ‘ఇదే, ఇదే’...అన్న ఈ ధ్వని వ్యాపించాలి. టీచర్లు సరేనా? ఎప్పటికల్లా చేస్తారు? ఈ సంవత్సరములో చేస్తారా? కొత్త సంవత్సరము ప్రారంభమైంది కదా! మరి కొత్త సంవత్సరములో ఏదైనా నవీనత ఉండాలి కదా! ‘ఇది కూడా ఒకటి’ అన్న మాటనైతే చాలానే విన్నాము. ఏ విధంగా మీ మనసులో కేవలం ‘బాబా, బాబా, బాబా’ అన్నది స్వతహాగా గుర్తుంటుందో, అదే విధంగా వారి నోటి నుండి ‘మా బాబా వచ్చేసారు’ అన్నది రావాలి. వారు కూడా, ‘నా బాబా, నా బాబా’ అని అనాలి - ఈ ధ్వని నలుమూలల నుండి వెలువడాలి, కానీ మొదలైతే ఒక మూల నుండి అవుతుంది కదా. మరి పంజాబువారు అద్భుతము చేస్తారా? ఎందుకు చెయ్యరు! చెయ్యాల్సిందే. చాలా మంచిది, ముందుగానే అభినందనలు. అచ్ఛా.

అన్నివైపులా ఉన్న ఆత్మిక గులాబీలైన పిల్లలందరికీ, సదా తండ్రికి అతి ప్రియమైనవారు మరియు దేహ భానము నుండి అతి అతీతమైనవారికి, బాప్ దాదా హృదయములోని ప్రియమైన పిల్లలకు, సదా ఒక్క తండ్రే అంటూ ఏకాగ్రమైన మనస్సుతో మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న-భిన్న సమయాలలో, భిన్న-భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్సు యొక్క సాధనాల ద్వారా మధుబన్ కు చేరుకున్నవారికి, సమ్ముఖముగా చూస్తున్నవారికి, ప్రియమైనవారందరికీ, సికీలధే అయినవారికి, కల్ప-కల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమాల రెట్లు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి మరియు దానితో పాటు డబల్ యజమాని పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే.

దాదీజీతో:- మీరు మధుబన్ యొక్క హీరో యాక్టర్, సదా జీరో స్మృతి ఉంటుంది. శరీరము నడవకపోయినా కానీ, కొంచెం నెమ్మది-నెమ్మదిగా నడిచినా కానీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి. తండ్రి యొక్క ఆశీర్వాదాలైతే ఎలాగూ ఉన్నాయి కానీ అందరివీ ఉన్నాయి. అందరూ దాదీని చాలా ప్రేమిస్తారు కదా! చూడండి, అందరూ - దాదీలు కావాలి, దాదీలు కావాలి, దాదీలు కావాలి... అని ఈ మాటే అంటారు. మరి దాదీల విశేషత ఏమిటి? దాదీల విశేషత ఏమిటంటే - తండ్రి శ్రీమతమనుసారముగా ప్రతి అడుగు వేయడము. మనసును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పణ చేయడము. మీరందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు కదా! మనసును సమర్పణ చేయండి. బాప్ దాదా చూసారు, మనసు చాలా అద్భుతము చేసి చూపిస్తుంది. అద్భుతము ఏం చేస్తుంది? చంచలత చేస్తుంది. మనసు ఏకాగ్రమవ్వాలి, ఏ విధంగా జెండా ఎగురవేస్తారు కదా, అదే విధంగా మనసు యొక్క జెండా శివబాబా, శివబాబా అన్నదానిపై ఏకాగ్రమవ్వాలి. వస్తూ ఉంది, ఆ సమయము సమీపముగా వస్తూ ఉంది. అప్పుడప్పుడు బాప్ దాదా పిల్లల యొక్క చాలా మంచి-మంచి సంకల్పాలను వింటారు. అందరి లక్ష్యము చాలా బాగుంది. అచ్ఛా. చూడండి, హాల్ యొక్క శోభ ఎంత బాగుంది. మాలలా అనిపిస్తుంది కదా! మరియు మాల మధ్యలో మణులు కూర్చున్నారు. అచ్ఛా. ఓం శాంతి.

వరదానము:-
సైలెన్స్ శక్తి ద్వారా సెకండులో ముక్తి మరియు జీవన్ముక్తిని అనుభవము చేయించే విశేష ఆత్మ భవ

విశేష ఆత్మల చివరి విశేషత ఏమిటంటే - సెకండులో ఏ ఆత్మనైనా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవీలుగా చేస్తారు. కేవలం మార్గాన్ని తెలియజేయడమే కాదు, కానీ ఒక్క సెకండులో శాంతి మరియు అతీంద్రియ సుఖము యొక్క అనుభవాన్ని చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవం సుఖము మరియు ముక్తి యొక్క అనుభవం శాంతి. కావున ఎవరు ఎదురుగా వచ్చినా సరే వారు సెకండులో దీనిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే అటువంటి స్పీడ్ ఉంటుందో అప్పుడు సైన్సు పై సైలెన్సు యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్-వాహ్ అనే శబ్దం వెలువడుతుంది మరియు ప్రత్యక్షత యొక్క దృశ్యము ఎదురుగా వస్తుంది.

స్లోగన్:-
తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని బలిహారము చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా కండి

ఇప్పుడు ఎలాగైతే వాచా ద్వారా డైరెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందో, అలా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తము కార్య వ్యవహారాలన్నీ నడవగలవు. సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు డైరెక్షన్లు తీసుకుంటూ ఉంటారు, మరి మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా మొత్తము కార్య వ్యవహారాలను నడిపించలేరా! ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టము చేస్తారో, అలా మున్ముందు సంకల్పాల ద్వారా మొత్తము కార్య వ్యవహారాలన్నీ నడుస్తాయి, దీని కొరకు శ్రేష్ఠ సంకల్పాల స్టాక్ ను జమ చేసుకోండి.