13-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ జీవితాన్ని వజ్ర సమానముగా
తయారుచేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు, తండ్రి స్మృతితోనే ఇటువంటి జీవితము
తయారవుతుంది’’
ప్రశ్న:-
కొత్త
ప్రపంచములో ఉన్నత పదవిని పొందడానికి ఏ ఒక్క ముఖ్యమైన పురుషార్థాన్ని చేయాలి?
జవాబు:-
బాబా అంటారు -
మధురమైన పిల్లలూ, ఏ పాత సంబంధీకులైతే ఇంత దుఃఖితులుగా చేసారో, ఇప్పుడు వారి మోహజాలము
నుండి బుద్ధిని తొలగించి, ఒక్క నన్నే స్మృతి చేయండి. వారితోపాటు ఉంటూ కూడా, మనసును
నాతోనే జోడించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా గుర్తుంచుకున్నట్లయితే, మీరు కొత్త
ప్రపంచములో ఉన్నత పదవిని పొందుతారు.
పాట:-
నీవు నిద్రించి
రాత్రిని పోగొట్టుకున్నావు...
ఓంశాంతి
ఎలాగైతే పిల్లలకు అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారో, అలా ఈ పాటల సారాన్ని
కూడా మీకు అర్థం చేయిస్తారు. వారే అందరికీ ఆత్మిక తండ్రి, వారు కూర్చుని బ్రహ్మా
తనువు ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు -
ఓ పిల్లలూ, మా జన్మ వజ్ర సమానముగా అవుతూ ఉందని మీకు తెలుసు. వజ్ర సమానమైన జన్మను
తయారుచేసుకునేందుకే తండ్రి వద్దకు వస్తారు. వజ్ర సమానమైన జన్మ అని స్వర్గవాసుల
జన్మను అంటారు. నరకవాసులది గవ్వ సమానమైన జన్మ. మీరు సంగమయుగము గురించి కూడా
తెలుసుకున్నారు. మనము ఇప్పుడు సంగమయుగవాసులము. ఈ సంగమయుగము అందరి కొరకు కళ్యాణకారీ
యుగము. ఈ సంగమయుగములోనే సర్వులకు గతి-సద్గతి లభిస్తాయి. అవి ఎవరు ఇస్తారు? పరంధామము
నుండి వచ్చే బాటసారి ఇస్తారు. వారు బాటసారి కదా. మీరు బాటసారులు కాదు. మీరు వచ్చిన
తర్వాత తిరిగి వెళ్ళరు కదా. తండ్రి అంటారు, నేను పాత ప్రపంచములోకి వచ్చి, మళ్ళీ
తిరిగి వెళ్ళిపోతాను. ఈ సేవను చేసేవారు కేవలం ఆ బాటసారి ఒక్కరేనని పిల్లలకు తెలుసు,
వారు వచ్చి పిల్లలైన మనకు చాలా సేవ చేస్తారు. ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చేయలేరు. మీరు
వచ్చి పతితులుగా ఉన్న మా సేవను చేయండి అని సేవ చేయడము కోసమే వారిని పిలుస్తారు.
తండ్రి కూడా అంటారు - నేను పిల్లల సేవ చేయడము కోసమే వచ్చాను ఎందుకంటే పిల్లలు చాలా
దుఃఖితులుగా ఉన్నారు. మా దుఃఖాన్ని హరించండి మరియు శాంతినివ్వండి అని పిలుస్తారు
కూడా. రెండు విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి - సుఖము మరియు శాంతి. ఇక్కడ దుఃఖము
మరియు అశాంతి ఉన్నాయి, అందుకే పిలుస్తారు. తండ్రియే వచ్చి మొత్తం సృష్టి చక్రము
యొక్క రహస్యమంతటినీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గము
సమాప్తమవుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కలియుగాంతము అనగా భక్తి కిందకు దిగిపోతూ
వస్తుంది. జ్ఞానముతో మీరు ఎక్కే కళలోకి వెళ్తారు, మీరు ఉన్నతోన్నతమైన పదవిని
పొందుతారు, తర్వాత ఆ ప్రారబ్ధము యొక్క సుఖము తగ్గిపోతూ ఉంటుంది. భారత్ లో ఎంతైతే
భక్తి జరుగుతుందో, అంతగా మరెక్కడా జరగదు. అర్ధకల్పము భక్తి నడుస్తుంది.
ఎప్పటినుండైతే ద్వాపరము మొదలవుతుందో మరియు ఇతర ధర్మాలు స్థాపనవ్వడము మొదలవుతుందో,
అప్పటినుండి భక్తి ప్రారంభమవుతుంది. భక్తి కూడా ముందు చాలా బాగుంటుంది. ఎలాగైతే
స్వర్గము మొదటిలో చాలా బాగుంటుంది, తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి.
భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటగా శివుని పూజారులుగా అవుతారు. మొదటి అర్ధకల్పము
ఎటువంటి పూజలూ జరగవు. తర్వాత భక్తి మార్గము ప్రారంభమవుతుంది మరియు ఇతర ధర్మాలు కూడా
ప్రారంభమవుతాయి. ఇంతటి భక్తిని ఇంకెవ్వరూ చేయలేరు, పూర్తిగా అర్ధకల్పము భక్తి
నడుస్తుంది. ఏ తండ్రి అయితే సర్వులకు, విశేషముగా భారత్ కు సద్గతిని ఇస్తారో,
స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, ఆ దూరదేశపు బాటసారి పిల్లలైన మనకు మళ్ళీ
స్వర్గ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఈ
వారసత్వము కూడా ఎంత గొప్పగా ఉంది. కానీ ఒక్క విషయము కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు.
భారత్ లో ఎంత భక్తి చేస్తారు. ఎన్ని మందిరాలు ఉన్నాయి. భారత ఖండములోనైతే ఎన్నో
మందిరాలు ఉన్నాయి. ఇవి ఎవరి మందిరాలు అనేది ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదటైతే
శివబాబా మందిరము తయారవుతుంది, తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. ఆ మందిరాలు కూడా
మీ ఎదురుగా నిలిచి ఉన్నాయి. ఒకవైపు శివబాబాను పూజిస్తూ ఉంటారు, మరొక వైపు శివబాబా
మిమ్మల్ని పూజ్యులుగా చేస్తున్నారు. మీరు ఇక్కడకు పూజ్య దేవతలుగా అయ్యేందుకు వచ్చారు.
దేవతల పూజారులు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి వారు కూడా ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా
అవుతారు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. అందరూ ఒకేసారి కలిసి
చదువుకోలేరు. సమయము పడుతుంది. ఎవరైతే కల్పక్రితం కూడా చదువుకుని ఉంటారో, వారే మళ్ళీ
చదువుకుంటారు. ఒకరినొకరు చదివించుకుంటూ ఉండాలి. అందరికీ తండ్రి మరియు సృష్టి
ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తాము, దానితో మనుష్యులు స్వర్గానికి యజమానులుగా
అవ్వగలరు, కనుక వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పండి. ఈ నాటకము ఎలా తిరుగుతుంది అనేది
పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. లక్షల సంవత్సరాల కథనైతే ఎవరూ వినిపించలేరు. 5 వేల
సంవత్సరాల క్రితం ఏముండేది, ఎవరి రాజ్యముండేది అనేది మీకు తెలుసు! భారత్ లో పూజ్య
దేవీ-దేవతలైన మన రాజ్యము ఉండేది. మేము పూజ్యులుగా ఉండేవారము, తర్వాత పూజారులుగా
అయ్యాము అనే విషయము గుర్తుకువచ్చింది కదా. మనమే పూజ్య దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ
మనమే 84 జన్మలు తీసుకున్నామని ఇంతకుముందు తెలియదు. 84 జన్మల కథ లక్ష్మీ-నారాయణులది.
మీరు మీ 84 జన్మల కథను వినిపిస్తారు. మనుష్యులకైతే, తమ కథను తాము కూర్చుని
వ్రాసుకోవడానికి చాలా సమయము పడుతుంది. మీరు ఒక్క నిమిషములో 84 జన్మల కథను
తెలియజేయగలరు. మనుష్యులైతే, బాల్యము నుండి ఏమేమి చేసారు అని తమ జన్మ కథను
వ్రాసుకుంటారు. నేను 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతాను అని వీరు (బ్రహ్మా) కూడా తన
కథను వినిపిస్తారు. ఇది ఒక్కరి విషయమైతే కాదు, చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ
చక్రము గురించి మీకే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడముతో మీరు రాజా-రాణులుగా అవుతారు
మరియు ఇతరులను కూడా తయారుచేస్తారు. భక్తి కూడా భారతవాసుల వలె ఎవరూ చేయరు. ఇక మిగతా
మఠాలు, మార్గాలు, ధర్మాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవి మన భక్తి సమయములో
స్థాపనవుతాయి. మొట్టమొదట మన పుష్పాల వృక్షము ఎంత చిన్నదిగా ఉండేది, ఆత్మిక పుష్పాలు
తోట వలె ఉండేది. మీరు చైతన్యమైన పుష్పాలుగా ఉండేవారు. దీనినే పుష్పాల తోట అని అంటారు,
తర్వాత ఇదే ముళ్ళ తోటగా అవుతూ ఉంటుంది. ఈ సమయములో అందరూ ముళ్ళులా అయిపోయారు. మళ్ళీ
ముళ్ళు నుండి పుష్పాలుగా ఎలా అవ్వాలి, అది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడమంటే ముళ్ళు గుచ్చుకోవడమే. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్
(విద్యార్థి జీవితము అత్యుత్తమమైనది) అని అంటారు. అది చాలా బాగుంటుంది.
కుమారులు-కుమారీలు చాలా సంతోషముగా చదువుకుంటూ ఉంటారు. వివాహము చేసుకున్నారంటే, ఇక
ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడము ప్రారంభిస్తారు. సత్యయుగములో ఎవరూ ముళ్ళు గుచ్చరు.
ఇప్పుడు మీరు మళ్ళీ పుష్పాలుగా అవుతారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు అపారమైన
సుఖముండేదని, బంగారు గనులు ఉండేవని మీకు తెలుసు. ఇప్పుడు అవి ఖాళీ అయిపోయాయి. మళ్ళీ
మీకు బంగారము నిండుగా లభిస్తుంది. భారత్ లోనే బంగారము, వజ్ర-వైఢూర్యాల గనులు ఉండేవి.
ఆ సమయములో అమెరికా మొదలైనవేవీ ఉండవు. బొంబాయి కూడా ఉండదు. విచిత్రము కదా.
కలియుగాంతములో, చూడడానికి కూడా బంగారము ఏ మాత్రం కనిపించదు, కానీ తర్వాత సత్యయుగము
ఆదిలో ఈ బంగారు గనులన్నీ నిండిపోతాయి. బంగారు మహళ్ళు తయారవుతాయి. విచిత్రము కదా!
అక్కడ గనుల నుండి ఎంత ఎక్కువ బంగారాన్ని తీస్తారు. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు
తయారవుతాయో, అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. మాయా మశ్చీంద్రుని ఆటను చూపిస్తారు
కదా. ధ్యానములో - ఇక్కడైతే బంగారమే బంగారముంది అన్నట్లు చూస్తాడు. నిజంగానే
సత్యయుగములో బంగారముంటుంది. ఇక్కడైతే చూడండి, మట్టి ఇటుకలు కూడా లభించటము లేదు.
ఇక్కడ డబ్బుకు ఎన్ని ఇటుకలైతే లభిస్తాయో, అక్కడ అన్ని బంగారు ఇటుకలు ఉచితముగా
లభిస్తాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మరి కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని
పొందే పురుషార్థము ఎందుకు చేయకూడదు! ఇక్కడ మోహజాలములో ఎందుకు చిక్కుకోవాలి!
తండ్రి అంటారు, పాత సంబంధాలలో మీరు ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తారు! బాబా వాటిని
వదిలేయమని చెప్పడము లేదు. కేవలం బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించినట్లయితే, మీరు
విశ్వానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేయండి మరియు చతుర్భుజుడైన విష్ణువును
అనగా విష్ణుపురిని స్మృతి చేయండి - ఇదే మన్మనాభవ అర్థం. ఈ ఒక్క పదమే ముఖ్యమైనది.
భక్తి మార్గములోనైతే ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా ప్రియుడైన
ఒక్క పరమపిత పరమాత్మునికి ప్రేయసులు. వారు మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా
చేస్తారు. ఆత్మలందరూ వారిని స్మృతి చేస్తారు. ఆత్మిక ప్రేయసులైన మీరు, ఒక్కసారి
మాత్రమే ఆత్మిక ప్రియునికి చెందినవారిగా అవుతారు. మిగిలిన మనుష్యులందరూ దైహిక
ప్రేయసి-ప్రియులు. ఇప్పుడు అనంతమైన ప్రేయసులను, అనంతమైన ప్రియుడు వచ్చి
కలుసుకున్నారు. మీరు రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనముగా చేయండి అని వారితో
అంటారు కూడా. ఆ ఒక్కరినే పిలుస్తారు. మన ఆత్మ పతితముగా అయిందని మీకు తెలుసు. అందుకే,
పతిత-పావనా రండి అని పిలుస్తారు. కుంభ మేళా జరుగుతుంది, ఎంతమంది వెళ్ళి గంగా
స్నానాలు చేస్తారు. కానీ లాభమేమీ ఉండదు. ఎవరూ పావనముగా అవ్వరు. ఇప్పుడు తండ్రి వచ్చి
జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. మీపై జ్ఞాన వర్షము కురుస్తూ ఉంది. దీనితో ముళ్ళ అడవి
మళ్ళీ పుష్పాల తోటగా తయారవుతుంది.
మన రాజ్యము ఉన్నప్పుడు అక్కడ పతితులెవ్వరూ ఉండనే ఉండరని మీకు తెలుసు. మొత్తము
విశ్వముపై జ్ఞాన వర్షము కురుస్తుంది, అంతా సస్యశ్యామలముగా అయిపోతుంది.
వజ్ర-వైఢూర్యాల గనులు కూడా కొత్తగా తయారవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషముగా
ఉండాలి. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయని అనంతమైన తండ్రి
కూర్చుని అర్థం చేయించడాన్ని మీరు సమ్ముఖముగా చూస్తారు. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా
సరే, స్నానము చేస్తున్నా సరే, బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. అక్కడైతే స్మృతి
చేయడానికి సమయముంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంత సంపాదన జరుగుతుంది.
స్మృతితోనే సంపాదన జరుగుతుంది. స్మృతితో సంపాదన జరుగుతుంది అని ఎప్పుడైనా విన్నారా!
ఇది ఎంత గొప్ప సంపాదన, మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఆత్మలమైన మన తండ్రి
నిరాకారుడని మీకు తెలుసు. వారు ఈ శరీరాన్ని ఆధారముగా తీసుకున్నారు. భగీరథుని గురించి
కూడా వర్ణన ఉంది కదా. వీరిది భాగ్యశాలి రథము, ఈ రథముపై పరమపిత యొక్క పరమ ఆత్మ యొక్క
స్వారీ జరుగుతుంది. ఆత్మకు రథము తయారైనప్పుడు, ఆత్మ వెంటనే వచ్చి అందులో
ప్రవేశిస్తుంది. తండ్రి అయితే ఈ రథములోకి వచ్చి కేవలం జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
వీరి అనేక జన్మల అంతిమ జన్మలో, వానప్రస్థ అవస్థ ఏర్పడినప్పుడు, తండ్రి అంటారు, నేను
వచ్చి వీరిలో ప్రవేశిస్తాను లేక ఈ రథములో విరాజమానమవుతాను. అంతేకానీ, గుర్రపు రథము
యొక్క విషయమేమీ లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభించింది. తండ్రి కూర్చుని పిల్లలైన
మీకు సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. మీకైతే చాలా సంతోషముండాలి. ఐ.సి.యస్ పరీక్షకు
చదువుతున్నప్పుడు చాలా నషా ఉంటుంది. అది అన్నింటికన్నా పెద్ద పరీక్ష. ఇది కూడా మీ
చదువు. ఇది భగవంతుని పాఠశాల. భగవంతుడు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది,
శ్రీకృష్ణుడా లేక శివబాబానా? అందరికీ భగవంతుడు ఎవరు? ఒక్క నిరాకారుడిని తప్ప
శ్రీకృష్ణుడినైతే అందరూ ఒప్పుకోరు. ఆత్మలందరి తండ్రి ఆ నిరాకార పరమపిత పరమాత్మ. వారు
సదా పరంధామములో ఉంటారు. పిల్లలను స్వర్గానికి యజమానులుగా చేయడానికి ఒక్కసారి మాత్రమే
వస్తారు. ఆ తండ్రే కల్ప-కల్పము వచ్చి, మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా చేస్తారని
మీకు తెలుసు. భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది కదా. తర్వాత జన్మలో ఏమి అవ్వనున్నారు
అనేది మీకు అంతా సాక్షాత్కారము జరిగింది. వినాశనము యొక్క సాక్షాత్కారము కూడా
జరిగింది, స్థాపన యొక్క సాక్షాత్కారము కూడా జరిగింది. భగవానువాచ - నేను మిమ్మల్ని
రాజులకే రాజుగా చేస్తాను. చాలా దాన-పుణ్యాలు చేస్తే, కొందరికి అల్పకాలిక సుఖము
లభిస్తుంది. రాజుల వద్ద జన్మ తీసుకుని, మళ్ళీ వెంటనే మరణిస్తారు. కొందరు గర్భములో
కూడా మరణిస్తారు. కొందరు కుంటివారిగా, చెవిటివారిగా అయిపోతారు. ఎలాంటి కర్మలు
చేస్తారో, అలాంటి పదవిని పొందుతారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే రాజులకే రాజుగా
చేస్తారు. బాబా, మేము బలిహారమవుతామని మీరంటారు. కనుక రాజ్యము కూడా తప్పకుండా మీరే
పొందుతారు. భారత్ ను మహాదాని ఖండమని అంటారు. ఇక్కడ దాన-పుణ్యాలను బాగా చేస్తారు. అవి
మళ్ళీ భక్తి మార్గములో ప్రారంభమవుతాయి. ఇప్పుడు తండ్రి మీకు 21 జన్మల కోసం దానము
ఇస్తారు. ఇప్పుడు మీరు బాబాపై బలిహారమవుతారు. తనువు, మనసు, ధనము అన్నింటినీ
ఇచ్చేసారు. ఇప్పుడు తండ్రి అంటారు, ట్రస్టీగా అయి ఉండండి, మీ ఇళ్ళు-వాకిళ్ళను
సంభాళించండి. అంతా శివబాబాదే, నేను మీ వాడిని, మిమ్మల్నే స్మృతి చేస్తానని
మనస్ఫూర్తిగా సరెండర్ చేస్తారు. తండ్రి అంటారు - మహళ్ళలో ఉండండి, తిరగండి,
విహరించండి, ఆనందముగా గడపండి, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు చాలా సంతోషముగా
ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు పురుషార్థము చేసి
అలా తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఈ యోగబలము
ద్వారానే మీరు వికర్మాజీతులుగా అవుతారు. తండ్రి స్మృతితో మీరు విశ్వానికి యజమానులుగా
అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. తనువు, మనసు, ధనము
అన్నింటినీ సమర్పణ చేసి ట్రస్టీగా అయి ఉండాలి. వికర్మాజీతులుగా అయ్యే పురుషార్థము
చేయాలి.
2. స్మృతిలోనే సంపాదన ఉంటుంది, అందుకే, నిరంతరము స్మృతిలో ఉండే పురుషార్థము
చేయాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే విధముగా ఆత్మిక పుష్పముగా అవ్వాలి.
లోపల ఎటువంటి ముళ్ళు ఉండకూడదు.
వరదానము:-
ఒక్క తండ్రిలో మొత్తము ప్రపంచాన్ని అనుభవము చేసే అనంతమైన
వైరాగీ భవ
ఎవరైతే తండ్రినే తమ ప్రపంచముగా భావిస్తారో, వారే అనంతమైన
వైరాగులుగా అవ్వగలరు. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తమ ప్రపంచములోనే ఉంటారు, ఇతర
ప్రపంచములోకి వెళ్ళనే వెళ్ళరు, కావున స్వతహాగానే పక్కకు వచ్చేస్తారు. ప్రపంచము అనగా
వ్యక్తులు, వైభవాలు అన్నీ వస్తాయి. తండ్రి సంపత్తియే మన సంపత్తి - ఈ స్మృతిలోనే
ఉండటము ద్వారా అనంతమైన వైరాగులుగా అయిపోతారు. ఎవరినైనా చూస్తూ కూడా చూడనట్లుగానే
ఉంటారు. అసలు ఎవరూ కనిపించనే కనిపించరు.
స్లోగన్:-
శక్తిశాలి
స్థితిని అనుభవము చేసేందుకు ఏకాంతము మరియు రమణీకత యొక్క బ్యాలెన్స్ ను పెట్టండి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
ఏ విధముగా కోటను
కట్టినప్పుడు అందులో ప్రజలు సురక్షితముగా ఉండాలని అనుకుంటారు. ఒక రాజు కోసం గదిని
నిర్మించరు, కోటను నిర్మిస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, సహచరుల కొరకు, ఇతర
ఆత్మల కొరకు జ్వాలా రూపపు స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి శక్తి అనే జ్వాల
ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవము చేస్తుంది.