ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు వీరిని (లక్ష్మీ-నారాయణులను)
అయితే బాగా చూస్తున్నారు. వీరు మీ లక్ష్యము-ఉద్దేశ్యము అనగా మీరు ఈ వంశానికి
చెందినవారిగా ఉండేవారు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది, అందుకే పదే-పదే
వీరిని చూస్తూ ఉండాలి. మేము ఈ విధంగా తయారవ్వాలి అని భావించాలి. వీరి మహిమను గురించి
అయితే మీకు బాగా తెలుసు. వీరి చిత్రాన్ని జేబులో పెట్టుకోవడముతోనే సంతోషము ఉంటుంది.
లోలోపల సందిగ్ధత ఏదైతే ఉంటుందో, అది ఉండకూడదు, దానిని దేహాభిమానము అని అంటారు.
దేహీ-అభిమానులుగా అయి ఈ లక్ష్మీ-నారాయణులను చూసినట్లయితే, మేము ఇలా అవుతున్నాము అని
భావిస్తారు, కావున తప్పకుండా వీరిని చూడవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
మీరు వీరిలా తయారవ్వాలి. మధ్యాజీభవ, వీరిని చూడండి, స్మృతి చేయండి. ఉదాహరణ చెప్తారు
కదా - ఒక వ్యక్తి, నేను ఎద్దును అని అనుకోవడము వలన ఇక అతను స్వయాన్ని ఎద్దుగానే
భావించడం మొదలుపెట్టాడు. ఇది మన లక్ష్యము-ఉద్దేశ్యము అని మీకు తెలుసు. మనం ఈ విధంగా
అవ్వాలి. ఎలా అవుతాము? తండ్రి స్మృతి ద్వారా. ప్రతి ఒక్కరూ స్వయాన్ని
ప్రశ్నించుకోండి - మేము నిజంగా వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా? బాబా
మనల్ని దేవతలుగా తయారుచేస్తారు అని అయితే మీరు అర్థం చేసుకున్నారు. ఎంత వీలైతే అంత
స్మృతి చేయాలి. కానీ తండ్రి అంటారు, నిరంతరమూ స్మృతి నిలవదు కానీ పురుషార్థము చేయాలి.
గృహస్థ వ్యవహారాల కార్యము చేస్తూ వీరిని (లక్ష్మీ-నారాయణులను) స్మృతి చేసినట్లయితే
తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వీరు తప్పకుండా
గుర్తుకు వస్తారు. మనము ఈ విధంగా తయారవ్వాలి. రోజంతా ఇదే ధ్యాసలో నిమగ్నమై ఉండాలి.
అప్పుడిక వీరు ఇలా ఉన్నారు, ఫలానావారు అలా ఉన్నారు... అంటూ ఒకరినొకరు ఎప్పుడూ గ్లాని
చేసుకోరు. ఎవరైతే ఈ విషయాలలో నిమగ్నమవుతారో, వారు ఉన్నత పదవిని పొందలేరు. అలాగే
ఉండిపోతారు. ఎంతగా సహజతరం చేసి అర్థం చేయించడం జరుగుతుంది. వీరిని స్మృతి చేయండి,
తండ్రిని స్మృతి చేయండి, అప్పుడిక మీరు ఇలా తప్పకుండా తయారైపోతారు. ఇక్కడైతే మీరు
ఎదురుగా కూర్చున్నారు. అందరి ఇళ్ళలో ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము తప్పకుండా ఉండాలి.
ఇది ఎంత ఏక్యురేట్ చిత్రము. వీరిని స్మృతి చేసినట్లయితే బాబా గుర్తుకు వస్తారు.
మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇదే వినిపిస్తూ ఉండండి. ఫలానా వారు ఇలా ఉన్నారు,
వారు ఇది, అది అంటూ... ఎవరినైనా నిందించడము అంటే దానిని సందిగ్ధత అని అంటారు. మీరు
మీ దైవీ బుద్ధిని తయారుచేసుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడము, గ్లాని చేయడము,
చంచలత్వముగా వ్యవహరించడము - ఈ స్వభావము ఉండకూడదు. ఇందులోనైతే అర్ధకల్పము ఉన్నారు.
ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి మధురమైన శిక్షణ లభిస్తుంది, దీని కన్నా ఉన్నతమైన ప్రేమ
ఇంకేదీ ఉండదు. శ్రీమతము లేకుండా ఎటువంటి తప్పుడు పనులనూ చేయకూడదు. తండ్రి ధ్యానము
గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు - కేవలం భోగ్ పెట్టి వచ్చేయండి. బాబా ఏమీ
వైకుంఠములోకి వెళ్ళండి, రాసవిలాసాలు మొదలైనవి చేయండి అని అనరు. వేరే స్థానానికి
వెళ్ళారంటే ఇక మాయ ప్రవేశము జరిగినట్లేనని భావించండి. మాయ యొక్క నంబర్ వన్ కర్తవ్యము,
పతితులుగా చేయడము. నియమ విరుద్ధమైన నడవడికతో నష్టము ఎంతో కలుగుతుంది. ఒకవేళ
స్వయాన్ని సంభాళించుకోకపోతే కఠినమైన శిక్షలను కూడా అనుభవించవలసి రావచ్చు.
తండ్రితోపాటుగా ధర్మరాజు కూడా ఉన్నారు. వారి వద్ద అనంతమైన లెక్కాచారాలు ఉంటాయి.
రావణుని జైలులో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించారు. ఈ ప్రపంచములో ఎంతటి అపారమైన
దుఃఖము ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, ఇతర విషయాలన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి
చేయండి మరియు అన్ని సందిగ్ధతలను లోపలి నుండి తొలగించి వేయండి. వికారాలలోకి ఎవరు
తీసుకువెళ్తారు? మాయ భూతాలు. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. ఇది రాజయోగము కదా.
తండ్రిని స్మృతి చేయడము ద్వారా ఈ వారసత్వము లభిస్తుంది. కావున ఈ వ్యాపారములో
నిమగ్నమైపోవాలి. చెత్తనంతటినీ లోపలి నుండి తొలగించివేయాలి. మాయ యొక్క పరాకాష్ట కూడా
చాలా కఠినముగా ఉంటుంది. కానీ దానిని ఎగరగొట్టేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత
స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడైతే నిరంతరమూ స్మృతి ఉండదు. చివరి సమయానికల్లా నిరంతర
స్మృతి వరకు కూడా చేరుకుంటారు, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఒకవేళ లోపల ఏదైనా
సందిగ్ధత, చెడు ఆలోచనలు ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించదు. మాయకు వశమై ఓడిపోతారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి. నింద
మొదలైనవి చేస్తూ మీరు చాలా చెడు గతిని పొందారు. ఇప్పుడిక సద్గతి లభిస్తుంది కావున
చెడు కర్మలను చేయకండి. మాయ గొంతు వరకూ మింగేసిందని, కానీ వారికి తెలియను కూడా
తెలియడం లేదని తండ్రి గమనిస్తారు. మేము చాలా బాగా నడుస్తున్నాము అని స్వయం
భావిస్తారు కానీ అలా కాదు. తండ్రి అర్థం చేయిస్తారు - మనసా, వాచా, కర్మణా నోటి నుండి
రత్నాలే వెలువడాలి. అశుద్ధముగా మాట్లాడటము రాళ్ళు వేయడమే. ఇప్పుడు మీరు రాయి నుండి
పారసముగా అవుతారు కావున మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. బాబా అయితే అర్థం
చేయించవలసి ఉంటుంది. పిల్లలకు అర్థం చేయించడము తండ్రి హక్కు. అంతేకానీ సోదరులు
సోదరులను అప్రమత్తం చేయడము కాదు. శిక్షణను ఇవ్వడము టీచర్ పని. వారేమైనా అనవచ్చు కానీ
విద్యార్థులు తమ చేతిలోకి ‘లా’ ను తీసుకోకూడదు. మీరు విద్యార్థులు కదా. తండ్రి అర్థం
చేయించగలరు కానీ పిల్లలకు తండ్రి ఇచ్చే డైరెక్షన్ ఏమిటంటే - ఒక్క తండ్రినే స్మృతి
చేయండి. మీ భాగ్యము ఇప్పుడు తెరుచుకుంది. శ్రీమతముపై నడవకపోవడం వల్ల మీ భాగ్యము
పాడైపోతుంది, ఇక ఎంతగానో పశ్చాత్తాపపడవలసి వస్తుంది. తండ్రి శ్రీమతముపై నడవకపోవడం
వల్ల ఒకటేమో శిక్షలు అనుభవించవలసి వస్తుంది, ఇంకొకటి పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇది
జన్మ-జన్మాంతరాల, కల్ప-కల్పాంతరాల ఆట. తండ్రి వచ్చి చదివిస్తున్నారు కావున బుద్ధిలో
ఉండాలి - బాబా మాకు టీచర్, వీరి ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న కొత్త
జ్ఞానము లభిస్తుంది. ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా అని అనడం జరుగుతుంది కదా.
5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు, ఇందులో ఎంత వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే అంత
తీసుకోవచ్చు. లేదంటే చాలా-చాలా పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు. అంతా
సాక్షాత్కారమవుతుంది. స్కూల్లో పిల్లలు క్లాస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు చివరిలో
కూర్చునేవారిని అందరూ చూస్తారు. ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ శరీరాన్ని
వదిలి వెళ్ళి సత్యయుగములో యువరాజుల కాలేజీలో భాషను నేర్చుకుంటారు అని మీకు తెలుసు.
అక్కడి భాషను అయితే అందరూ చదువుకోవలసి ఉంటుంది, అది మాతృభాష. చాలామందిలో పూర్తి
జ్ఞానము లేదు, ఇక రెగ్యులర్ గా చదవరు కూడా. ఒకటి, రెండు సార్లు మిస్ చేసారంటే, ఇక
మిస్ చేయడమనేది అలవాటైపోతుంది. మాయకు బానిసలైపోయిన వారి సాంగత్యము ఉంటుంది.
శివబాబాకు అనుచరులు కొద్దిమందే ఉన్నారు, మిగిలినవారంతా మాయకు అనుచరులే. మీరు
శివబాబాకు అనుచరులుగా అయితే మాయ సహించలేదు, అందుకే చాలా సంభాళించుకోవలసి ఉంటుంది.
అశుద్ధమైన ఛీ-ఛీ మనుష్యుల నుండి సంభాళించుకోవాలి. హంసలు మరియు కొంగలు ఉన్నాయి కదా.
బాబా రాత్రి కూడా శిక్షణను ఇచ్చారు. రోజంతా ఎవరో ఒకరిని నిందించడము, పరచింతన చేయడము,
వీటిని దైవీ గుణాలు అని అనరు. దేవతలు ఇటువంటి పనులు చేయరు. తండ్రిని మరియు
వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటారు, అయినా కానీ నిందిస్తూనే ఉంటారు.
నిందించడము అయితే జన్మ-జన్మాంతరాలూ చేస్తూనే వచ్చారు. సందిగ్ధత లోలోపల ఉంటూనే
ఉంటుంది. ఇది కూడా లోలోపల యుద్ధము చేసుకుంటున్నట్లే. అనవసరముగా తమను తాము
హతమార్చుకుంటారు. అనేకులను నష్టపరుస్తారు. ఫలానావారు ఇలా ఉన్నారు, అందులో మీకు
పోయేది ఏముంది. అందరికీ సహాయకులు ఒక్క తండ్రే. ఇప్పుడు అయితే శ్రీమతముపై నడవాలి.
మనుష్య మతము అయితే చాలా అశుద్ధముగా చేసేస్తుంది. ఒకరినొకరు గ్లాని చేసుకుంటూ ఉంటారు.
గ్లాని చేయడము అనేది మాయ భూతము. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. మేము ఇప్పుడు పతితుల
నుండి పావనులుగా అవుతున్నాము అని మీరు భావిస్తారు. ఇవన్నీ చాలా చెడు విషయాలు. మేము
ఇంకెప్పుడూ ఇటువంటి పనులు చేయము అని ఈ రోజు నుండి మీ చెవులు పట్టుకోవాలి అని అర్థం
చేయించడం జరుగుతుంది. ఏదైనా చూస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. అందులో మీకు పోయేది
ఏముంది! మీరు ఒకరినొకరు ఎందుకు గ్లాని చేసుకుంటారు! తండ్రి అయితే అన్నీ వింటారు కదా.
తండ్రి ఈ చెవులు మరియు కళ్ళను అప్పుగా తీసుకున్నారు కదా. తండ్రి కూడా చూస్తారు,
అలాగే ఈ దాదా కూడా చూస్తారు. నడవడిక, వాతావరణము అయితే కొందరిది పూర్తిగా
నియమవిరుద్ధముగా నడుస్తుంది. ఎవరికైతే తండ్రి ఉండరో, వారిని అనాథలు అని అంటారు.
వారికి తమ తండ్రి గురించి కూడా తెలియదు, అలాగే వారిని స్మృతి కూడా చేయరు.
బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడవుతూ ఉంటారు, అందుకే తమ పదవినే పోగొట్టుకుంటారు.
శ్రీమతముపై నడవకపోతే వారు అనాథలే. మాత, పితల శ్రీమతముపై నడవరు. త్వమేవ మాతాశ్చ పితా...
బంధువు మొదలైనవారిగా కూడా అవుతారు.
కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యే లేకపోతే మరి మదర్ ఎక్కడి నుండి వస్తారు, ఈ
మాత్రము బుద్ధి కూడా లేదు. మాయ బుద్ధిని పూర్తిగా తిప్పేస్తుంది. అనంతమైన తండ్రి
ఆజ్ఞను పాటించకపోతే దండన లభిస్తుంది. కొద్దిగా కూడా సద్గతి లభించదు. బాబా చూస్తే -
వీరు ఎంతటి చెడు గతిని పొందుతారు అని అంటారు కదా. వీరు సువాసన లేని విష పుష్పము,
జిల్లేడు వంటివారు. వారిని ఎవరూ ఇష్టపడరు. కావున బాగుపడాలి కదా. లేకపోతే
పదభ్రష్టులుగా అయిపోతారు. జన్మ-జన్మాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది. కానీ
దేహాభిమానుల బుద్ధిలో ఇది కూర్చోనే కూర్చోదు. ఆత్మాభిమానులే తండ్రిని
ప్రేమించగలుగుతారు. బలిహారము అవ్వడము అనేది అంత సులువైన విషయమేమీ కాదు. పెద్ద-పెద్ద
వ్యక్తులు బలిహారమవ్వలేరు. వారు బలిహారమవ్వడము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు.
హృదయము విదీర్ణమైపోతుంది. చాలామంది బంధనముక్తులుగా కూడా ఉన్నారు. పిల్లలు మొదలైనవారు
ఎవ్వరూ లేరు. బాబా, మీరే మా సర్వస్వము అని అంటారు. ఇలా నోటితో అంటారు కానీ అది నిజం
కాదు. తండ్రితో కూడా అబద్ధం చెప్పేస్తారు. బలిహారమైనట్లయితే తమ మమకారము
తొలగించివేయాలి. ఇప్పుడు ఇది చివరి సమయము కావున శ్రీమతముపై నడవవలసి ఉంటుంది.
ఆస్తిపాస్తులు మొదలైనవాటి నుండి కూడా మమకారము తొలగిపోవాలి. ఇటువంటి బంధనముక్తులు
ఎందరో ఉన్నారు. శివబాబాను తమవారిగా చేసుకున్నారు, దత్తత తీసుకుంటారు కదా. వీరు మన
తండ్రి, టీచర్, సద్గురువు. వీరి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వీరిని మనవారిగా
చేసుకుంటాము. ఎవరైతే పిల్లలుగా అయిపోయారో వారు ఆ వంశములోకి తప్పకుండా వస్తారు. కానీ
అందులో పదవులు ఎన్ని ఉన్నాయి. దాస-దాసీలు ఎంతమంది ఉన్నారు. ఒకరినొకరు
ఆజ్ఞాపించుకుంటారు. దాసీలలో కూడా నంబరువారుగా అవుతారు. రాయల్ వంశములోకి బయటి
దాస-దాసీలైతే రారు కదా. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో వారే అలా అవుతారు.
కొందరు ఎటువంటి పిల్లలు ఉన్నారంటే, వారిలో పైసకు విలువ చేసే తెలివి కూడా లేదు.
బాబా ఏమీ మమ్మాను స్మృతి చేయండి లేక నా రథాన్ని స్మృతి చేయండి అని అనరు. తండ్రి
అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహపు సర్వ బంధనాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా
భావించండి. తండ్రి అర్థం చేయిస్తారు - ప్రీతి ఉంచాలనుకుంటే ఒక్కరితోనే ఉంచండి.
అప్పుడు నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి డైరెక్షన్ అనుసారముగా నడుచుకోండి.
మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా! మొదటి నంబరులో కొడుకులు ఉంటారు. కొడుకు అయితే
ఆస్తికి యజమాని అవుతాడు. భార్య అయితే హాఫ్ పార్టనర్ గా ఉంటుంది కానీ కొడుకైతే పూర్తి
యజమానిగా అవుతాడు. కావున బుద్ధి వారి వైపుకు వెళ్తుంది, బాబాను పూర్తి యజమానిగా
చేసుకున్నట్లయితే ఈ సర్వస్వాన్నీ మీకు ఇచ్చేస్తారు. ఇది ఇచ్చి-పుచ్చుకునే విషయము
కాదు, ఇది అర్థం చేసుకోవలసిన విషయము. మీరు ఇది వింటారు కానీ, మళ్ళీ మరుసటి రోజు అంతా
మర్చిపోతారు. బుద్ధిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. తండ్రిని
స్మృతి చేయడము ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. నోటితో
చెప్తూ ఉండండి. లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ ఉండండి. విశాలబుద్ధి కలవారు
వెంటనే అర్థం చేసుకుంటారు. చివరిలో ఈ చిత్రాలు మొదలైనవే ఉపయోగపడతాయి. ఇందులో మొత్తము
జ్ఞానమంతా నిండి ఉంది. లక్ష్మీ-నారాయణులు మరియు రాధ-కృష్ణులకు పరస్పరం ఏం సంబంధముంది,
ఇది ఎవరికీ తెలియదు. లక్ష్మీ-నారాయణులు అయితే తప్పకుండా మొదట రాకుమారునిగా అవుతారు.
బికారి నుండి రాకుమారుడు అని అంటారు కదా! బికారి నుండి రాజు అని అనరు. రాకుమారునిగా
అయిన తర్వాతనే రాజుగా అవుతారు. ఇది అయితే చాలా సహజము కానీ మాయ ఎవరినో ఒకరిని
పట్టుకుంటుంది. ఎవరినైనా నిందించము, గ్లాని చేయటము, ఈ అలవాటు అనేకులకు ఉంది. ఇంకే
పనీ లేనే లేదు. వారు తండ్రిని ఎప్పుడూ స్మృతే చేయరు. ఒకరినొకరు నిందించుకునే పనే
చేస్తూ ఉంటారు. ఇది మాయ పాఠము. తండ్రి పాఠమైతే చాలా నేరుగా ఉంటుంది. చివరిలో ఈ
సన్యాసులు మొదలైనవారంతా మేల్కుంటారు, జ్ఞానము ఉంది అంటే అది ఈ బి.కే.లలోనే ఉంది అని
అంటారు. కుమార-కుమారీలైతే పవిత్రముగా ఉంటారు. వారు ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు. మనకు
ఎటువంటి చెడు ఆలోచన కూడా రాకూడదు. చాలామందికి ఇప్పటికీ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి,
ఇక దాని శిక్ష కూడా చాలా కఠినముగా ఉంటుంది. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు.
ఒకవేళ మీ నడవడిక ఏదైనా బాగోలేకపోవడము చూస్తే, ఇక ఇక్కడ నిలవలేరు. మీరు యోగ్యులుగా
లేరు, తండ్రిని మోసగిస్తున్నారు, మీరు తండ్రిని స్మృతి చేయలేరు అని కొద్దిగా శిక్ష
కూడా వేయవలసి వస్తుంది. అవస్థ అంతా పడిపోతుంది. అవస్థ పడిపోవడమే శిక్ష. శ్రీమతముపై
నడవకపోవడం వల్ల తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు. తండ్రి డైరెక్షన్ అనుసారముగా
నడవకపోవడం వలన ఇంకా భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి. పెద్ద-పెద్ద కఠినమైన శిక్షలు ఇప్పుడే
ప్రారంభమైపోతాయేమోనని బాబాకు అప్పుడప్పుడూ ఆలోచన వస్తూ ఉంటుంది. శిక్షలు కూడా చాలా
గుప్తముగా ఉంటాయి కదా. ఎక్కడా కఠినమైన బాధ రాకూడదు. చాలామంది పడిపోతారు, శిక్షలు
అనుభవిస్తారు. తండ్రి అయితే అన్నీ సూచనల ద్వారా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంతోమంది తమ
భాగ్యానికి అడ్డుగీతను గీసుకుంటూ ఉంటారు, అందుకే తండ్రి అప్రమత్తము చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇది నిర్లక్ష్యము చేసే సమయము కాదు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి.
అంతిమ ఘడియ వచ్చేందుకు పెద్ద ఆలస్యమేమీ లేదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.