ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు. ఇతర ఏ సత్సంగాలలోనూ ఎప్పుడూ పాటలపై అర్థం చేయించరు. అక్కడ
శాస్త్రాలను వినిపిస్తారు. ఉదాహరణకు గురుద్వార్ లో గ్రంథ్ నుండి రెండు వచనాలను
తీసుకుని కథ వినిపించేవారు కూర్చుని వాటిని విస్తారము చేసి వినిపిస్తారు. అంతేకానీ
పాటలపై అర్థం చేయించడమనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ
పాటలన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞానము వేరని, అది ఒక్క నిరాకారుడైన శివుడి
నుండే లభించగలదని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. దీనిని ఆత్మిక జ్ఞానము అని
అంటారు. జ్ఞానమైతే అనేక రకాలుగా ఉంటుంది కదా. ఉదాహరణకు ఈ తివాచీ ఎలా తయారవుతుంది అనే
జ్ఞానము మీకు ఉందా అని అడగడం జరుగుతుంది. ప్రతి వస్తువు గురించిన జ్ఞానము ఉంటుంది.
అవన్నీ దైహికమైన విషయాలు. ఆత్మలైన మన ఆత్మిక తండ్రి వారొక్కరేనని, వారి రూపము
కనిపించదని పిల్లలకు తెలుసు. ఆ నిరాకారుని చిత్రము కూడా సాలిగ్రామము వలె ఉంటుంది.
వారినే పరమాత్మ అని అంటారు. వారిని నిరాకారుడు అనే అంటారు. వారికి మనుష్యుల వంటి
ఆకారము ఉండదు. ప్రతి వస్తువుకు ఆకారము తప్పకుండా ఉంటుంది. వాటన్నింటి కన్నా అతి
చిన్న ఆకారము ఆత్మది. దానిని సృష్టి అద్భుతము అని అంటారు. ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది,
అది ఈ కనులకు కనిపించదు. పిల్లలైన మీకు దివ్యదృష్టి లభిస్తుంది, దానితో అంతా
సాక్షాత్కారము చేసుకుంటారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారిని దివ్యదృష్టితో
చూడడం జరుగుతుంది. మొదటి నంబరులోనైతే వీరు ఉండి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ వచ్చారు,
కావున వీరి సాక్షాత్కారము కూడా జరుగుతుంది. చాలా సూక్ష్మముగా ఉంటారు. కేవలం పరమపిత
పరమాత్మ తప్ప ఆత్మ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మనుష్యులకు ఆత్మను గురించి యథార్థముగా తెలియదు, అలాగే పరమాత్మను గురించి కూడా
యథార్థముగా తెలుసుకోలేరు. ప్రపంచములో మనుష్యులవి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు,
ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుందని అంటారు, కొందరు ఇంకేదో అంటారు. ఇప్పుడు
పిల్లలైన మీరు తెలుసుకున్నారు, అది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా
తెలుసుకున్నారు, అందరి బుద్ధిలో ఒకే విధముగానైతే కూర్చోదు. ఘడియ-ఘడియ బుద్ధిలో కూడా
కూర్చోబెట్టవలసి ఉంటుంది. మనము ఆత్మ, ఆత్మయే 84 జన్మల పాత్రను అభినయించాలి. ఇప్పుడు
తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మనైన నన్ను తెలుసుకోండి
మరియు స్మృతి చేయండి. తండ్రి అంటారు, నేను వీరిలోకి ప్రవేశించి పిల్లలైన మీకు
జ్ఞానాన్ని ఇస్తాను. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించడం లేదు, అందుకే మీ
దృష్టి ఈ శరీరము వైపుకు వెళ్ళిపోతుంది. వాస్తవానికి మీకు ఇతనితో పని ఏమీ లేదు.
సర్వుల సద్గతిదాత అయితే ఆ శివబాబాయే, వారి మతముపై మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము.
ఇతనికి కూడా, నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను కదా అని అహంకారమేమీ రాదు. ఎవరైతే
తండ్రిని పూర్తిగా స్మృతి చేయరో, వారి నుండి అవగుణాలు తొలగిపోవు. స్వయాన్ని ఆత్మగా
నిశ్చయము చేసుకోరు. మనుష్యులకైతే ఆత్మను గురించి తెలియదు, అలాగే పరమాత్మను గురించి
కూడా తెలియదు. సర్వవ్యాపి జ్ఞానాన్ని కూడా భారతవాసులే వ్యాపింపజేసారు. మీలో కూడా
సేవాధారి పిల్లలెవరైతే ఉన్నారో, వారు అర్థం చేసుకుంటారు, మిగిలినవారందరూ అంతగా అర్థం
చేసుకోరు. ఒకవేళ తండ్రి యొక్క పూర్తి పరిచయము పిల్లలకు ఉన్నట్లయితే, మరి తండ్రిని
స్మృతి చేయాలి, తమలో దైవీ గుణాలను ధారణ చేయాలి.
శివబాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇవి కొత్త విషయాలు. బ్రాహ్మణులు కూడా
తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మా సంతానము ఎప్పుడు ఉంటారు, ఇది ప్రపంచములో
ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైతే అనేకానేకమంది ఉన్నారు. కానీ వారు కుఖవంశావళి.
వారేమీ బ్రహ్మా ముఖవంశావళి సంతానము కారు. బ్రహ్మా సంతానానికైతే ఈశ్వరుడైన తండ్రి
నుండి వారసత్వము లభిస్తుంది. మీకు ఇప్పుడు వారసత్వము లభిస్తోంది కదా. బ్రాహ్మణులైన
మీరు వేరు, ఆ బ్రాహ్మణులు వేరు. బ్రాహ్మణులైన మీరు సంగమములోనే ఉంటారు, వారు
ద్వాపర-కలియుగాలలో ఉంటారు. ఈ సంగమయుగీ బ్రాహ్మణులే వేరు. ప్రజాపిత బ్రహ్మాకు
ఎంతోమంది పిల్లలు ఉన్నారు. హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మా అని అంటారు ఎందుకంటే
పిల్లలకు జన్మనిస్తారు. కానీ అది దైహికమైన విషయము. ఈ తండ్రి అంటారు, ఆత్మలందరూ నా
పిల్లలే. మీరు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు. ఇది ఎవరికైనా అర్థం చేయించడము సహజము.
శివబాబాకు తమ శరీరము లేదు. శివజయంతిని జరుపుకుంటారు, కానీ వారి శరీరము కనిపించదు.
మిగిలినవారందరికీ శరీరాలు ఉన్నాయి. ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. శరీరానికి
పేరు ఉంటుంది, పరమాత్మకు తన శరీరమే లేదు, అందుకే వారిని పరమాత్మ అని అంటారు. శివ
అనేది వారి ఆత్మ పేరు. అది ఎప్పుడూ మారదు. శరీరము మారితే పేరు కూడా మారిపోతుంది.
శివబాబా అంటారు, నేను అయితే సదా నిరాకారుడినైన పరమాత్మనే. డ్రామా ప్లాన్ అనుసారముగా
ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను. సన్యాసుల పేర్లు కూడా మారుతాయి. గురువుకు
చెందినవారిగా అయితే పేరు మారుతుంది. ఒకప్పుడు మీ పేర్లు కూడా మార్చాము. కానీ
ఎంతవరకని పేర్లు మారుస్తూ ఉంటాము. వారిలో ఎంతోమంది పారిపోయారు. ఎవరైతే ఆ సమయములో
ఉన్నారో, వారికి పేర్లు పెట్టాము. ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు. ఎవరిపైనా నమ్మకము
లేదు. మాయ ఎంతోమందిని ఓడించే సరికి వారు పారిపోతారు, అందుకే బాబా ఎవ్వరికీ పేరు
పెట్టరు. కొందరికి పెట్టి, కొందరికి పెట్టకపోవడం కూడా సరి కాదు. బాబా, మేము మీ
వారిగా అయిపోయామని అనడమైతే అందరూ అంటారు, కానీ యథార్థముగా నా వారిగా అవ్వరు.
వారసులయ్యే రహస్యము కూడా తెలియనివారు ఎంతోమంది ఉన్నారు. బాబా వద్దకు కలుసుకోడానికి
వస్తారు కానీ వారు వారసులు కారు. వారు విజయమాలలోకి రాలేరు. కొంతమంది మంచి-మంచి
పిల్లలు - మేమైతే వారసులమని భావిస్తారు. కానీ వారు వారసులు కారు అని బాబాకు తెలుసు.
వారసులుగా అయ్యేందుకు భగవంతుడిని తమ వారసునిగా చేసుకోవలసి ఉంటుంది, ఈ రహస్యాన్ని
అర్థం చేయించడం కూడా కష్టమే. వారసుడని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తున్నారు.
భగవంతుడిని ఎవరైనా వారసునిగా చేసుకుంటే మరి తమ ఆస్తిని ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు
తండ్రి వారిని వారసులుగా చేసుకుంటారు. ఆస్తినైతే పేదవారు తప్ప షావుకారులెవ్వరూ
ఇవ్వలేరు. మాల ఎంత తక్కువమందిది తయారవుతుంది. మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులా,
కాదా అనేది కూడా బాబాను ఎవరైనా అడిగితే బాబా చెప్పగలరు. ఈ బాబా కూడా చెప్పగలరు. ఇది
అర్థం చేసుకునేందుకు ఒక సామాన్యమైన విషయమే. వారసునిగా అవ్వడానికి కూడా చాలా తెలివి
కావాలి. లక్ష్మీ-నారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారన్నది చూస్తారు, కానీ వారు
ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు - ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీ
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మీరు ఇలా తయారవ్వాలి. మేమైతే సూర్యవంశీయులైన
లక్ష్మీ-నారాణులుగానే అవుతాము, అంతేకానీ చంద్రవంశీయులైన సీతా-రాములుగా అవ్వమని
పిల్లలు కూడా అంటారు. సీతా-రాములను కూడా శాస్త్రాలలో నిందించారు. లక్ష్మీ-నారాయణుల
నిందను ఎప్పుడూ వినరు. శివబాబాకు, శ్రీకృష్ణుడికి కూడా నిందలు ఉన్నాయి. తండ్రి
అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఎంతో ఉన్నతోన్నతముగా తయారుచేస్తాను. నా కన్నా
పిల్లలు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. లక్ష్మీ-నారాయణులను కూడా ఎవ్వరూ నిందించరు.
వాస్తవానికి శ్రీకృష్ణుని ఆత్మ అదే అయినా, వారికి ఆ విషయము తెలియని కారణముగా వారిని
నిందించారు. లక్ష్మీ-నారాయణుల మందిరాలను కూడా ఎంతో సంతోషముగా నిర్మిస్తారు.
వాస్తవానికి రాధా-కృష్ణుల మందిరాలను నిర్మించాలి, ఎందుకంటే వారు సతోప్రధానులు.
లక్ష్మీ-నారాయణులు వారి యువ అవస్థ, కావున వీరిని సతో అని అంటారు. వారు బాల్యములో
ఉన్నారు కావున సతోప్రధానులు అని అంటారు. చిన్న పిల్లలు మహాత్ములతో సమానమైనవారు.
చిన్న పిల్లలకు వికారాలు మొదలైనవాటి గురించి ఏమీ తెలియనట్లుగానే అక్కడ పెద్దవారికి
కూడా వికారాలు అంటే ఏమిటి అనేది ఏమీ తెలియదు. ఈ ఐదు భూతాలు అక్కడ ఉండనే ఉండవు.
వికారాల గురించి తెలియనే తెలియదు అన్నట్లు ఉంటారు. ఈ సమయము రాత్రి వంటిది. కామ
చేష్టలు కూడా రాత్రి సమయములోనే జరుగుతాయి. దేవతలు పగలులో ఉంటారు కావున కామ చేష్టలు
ఉండవు. వికారాలేవీ ఉండవు. ఇప్పుడు రాత్రివేళలో అందరూ వికారులుగా ఉన్నారు. పగలు
అవ్వగానే మన వికారాలన్నీ వెళ్ళిపోతాయని మీకు తెలుసు. వికారాలు అంటే ఏమిటో కూడా
వారికి తెలియదు. ఇవి రావణుడి వికారీ గుణాలు. ఇది వికారీ ప్రపంచము. నిర్వికారీ
ప్రపంచములో వికారాల మాటే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఇప్పుడు ఇది
ఆసురీ రాజ్యము. ఇది ఎవ్వరికీ తెలియదు. మీకు అంతా తెలుసు, నంబరువారు
పురుషార్థానుసారముగా. ఎంతోమంది పిల్లలున్నారు. ఈ బి.కె.లందరూ ఎవరి పిల్లలు అనేది
మనుష్యులెవ్వరూ అర్థం చేసుకోలేరు.
అందరూ శివబాబానే స్మృతి చేస్తారు, బ్రహ్మాను కూడా స్మృతి చేయరు. ఇతను స్వయం కూడా
అంటారు - శివబాబాను స్మృతి చేయండి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి, ఇంకెవరిని
స్మృతి చేసినా వికర్మలు వినాశనమవ్వవు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని
అన్నారు. శ్రీకృష్ణుడైతే అలా అనలేడు. వారసత్వమైతే నిరాకారుడైన తండ్రి నుండే
లభిస్తుంది. స్వయాన్ని ఎప్పుడైతే ఆత్మగా భావిస్తారో, అప్పుడే నిరాకారుడైన తండ్రిని
స్మృతి చేయగలుగుతారు. నేను ఆత్మను, మొదట ఇది పక్కాగా నిశ్చయము చేసుకోవాలి. నా తండ్రి
పరమాత్మ, వారు అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు వారసత్వాన్ని ఇస్తాను.
నేను అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడిని. నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను.
ఎవరైతే కల్పపూర్వము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో, వారే వచ్చి
వారసత్వాన్ని తీసుకుంటారు, బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులలో కూడా కొంతమంది
పిల్లలు పక్కాగా ఉన్నారు. కొందరు సొంత పిల్లలుగా కూడా అవుతారు, కొందరు సవతి
పిల్లలుగా కూడా అవుతారు. మనము నిరాకారుడైన శివబాబా వంశావళి. వంశావళి ఎలా పెరుగుతూ
ఉంటుందనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయిన తర్వాత మనము తిరిగి
వెళ్ళాలి. ఆత్మలందరూ శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళాలి. పాండవులు మరియు కౌరవులు,
ఇరువురూ శరీరాలు వదలాలి. మీరు ఈ జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు, మళ్ళీ దాని
అనుసారముగా ప్రారబ్ధము లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆ తర్వాత
జ్ఞానము యొక్క పాత్ర సమాప్తమైపోతుంది. మీకు 84 జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానము లభించింది.
ఆ తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ ఇతర
ధర్మాలవారి చిత్రాలు మొదలైనవి ఉండవు. భక్తిమార్గములో కూడా మీ చిత్రాలు ఉంటాయి.
సత్యయుగములో ఎవరి చిత్రాలు మొదలైనవి ఉండవు. మీ చిత్రాలు భక్తిమార్గమంతా ఉంటాయి. మీ
రాజ్యములో ఇంకెవ్వరి చిత్రాలు ఉండవు, కేవలం దేవీ-దేవతలే ఉంటారు. వీటి ఆధారముగానే ఆది
సనాతనమైనవారు దేవీ-దేవతలే అని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ
ఉంటుంది. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ అతీంద్రియ సుఖములో ఉండాలి.
ఎన్నో పాయింట్లు ఉన్నాయి. కానీ మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తూ ఉంటుంది అని బాబా అర్థం
చేసుకుంటారు. కావున శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది గుర్తుండాలి. వారు
ఉన్నతోన్నతమైనవారు. మనము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇవి ఎంత సహజమైన విషయాలు.
మొత్తము ఆధారమంతా యోగముపై ఉంది. మనము దేవతలుగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ
చెయ్యాలి. పంచ వికారాలు భూతాలవంటివి. కామ భూతము, క్రోధ భూతము, దేహాభిమానపు భూతము
కూడా ఉంటుంది. అయితే, కొందరిలో ఈ భూతాలు ఎక్కువగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి.
ఈ ఐదూ పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మొదటిది కామ భూతము, రెండవది
క్రోధ భూతము. ఎవరైనా కఠినముగా మాట్లాడితే అతడు క్రోధి అని తండ్రి అంటారు. ఆ భూతము
తొలగిపోవాలి. కానీ ఈ భూతాలు తొలగడము చాలా కష్టము. క్రోధము ఇతరులకు దుఃఖాన్ని
ఇస్తుంది. మోహము వల్ల ఎక్కువమందికి దుఃఖము కలగదు. ఎవరికైతే మోహము ఉంటుందో, వారికే
దుఃఖము కలుగుతుంది, అందుకే తండ్రి ఈ భూతాలను పారద్రోలండి అని అర్థం చేయిస్తారు.
పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషముగా చదువుపై మరియు దైవీ గుణాలపై అటెన్షన్ పెట్టాలి.
కొందరు పిల్లలలోనైతే క్రోధము యొక్క అంశము కూడా లేదు. కొందరైతే క్రోధములోకి వచ్చి
బాగా కొట్లాడుతూ ఉంటారు. నేను దైవీ గుణాలను ధారణ చేసి దేవతగా అవ్వాలి అని పిల్లలు
అనుకోవాలి. ఎప్పుడూ కోపముతో మాట్లాడకూడదు. ఎవరైనా కోపము చేస్తుంటే, వీరిలో క్రోధమనే
భూతము ఉంది అని అర్థం చేసుకోండి. వారు భూతనాథులుగా, భూతనాథినీలుగా అవుతారు. ఇటువంటి
భూతాలు ఉన్నవారితో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఒకరు క్రోధములోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే
అప్పుడు రెండవవారిలోకి కూడా భూతము వచ్చేస్తే, ఇక ఆ భూతాలు పరస్పరం కొట్లాడుకోవడం
మొదలుపెడతాయి. భూతనాథిని అనే పదము చాలా ఛీ-ఛీ అయినది. భూతాలు ప్రవేశించకూడదు అని
మనుష్యులు వాటి నుండి దూరముగా ఉంటారు. భూతాల ముందు అసలు నిలబడకూడదు కూడా, లేకపోతే
అవి మీలోకి ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి ఆసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ
చేయిస్తారు. తండ్రి అంటారు, నేను దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా తయారుచేయడానికి
వచ్చాను. మేము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకు తెలుసు. దేవతల చిత్రాలు
కూడా ఎదురుగా ఉన్నాయి. బాబా అర్థం చేయించారు, క్రోధము ఉన్నవారి నుండి వెంటనే దూరముగా
వెళ్ళిపోండి. స్వయాన్ని రక్షించుకునేందుకు యుక్తి కావాలి. మనలోకి క్రోధము రాకూడదు,
లేకపోతే వంద రెట్లు పాపము అయిపోతుంది. తండ్రి పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు.
బాబా కల్పపూర్వము వలె అర్థం చేయిస్తున్నారని పిల్లలు కూడా భావిస్తారు, నంబరువారు
పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటూనే ఉంటారు. స్వయముపై కూడా దయ చూపించుకోవాలి,
ఇతరులపై కూడా దయ చూపించాలి. కొందరు స్వయముపై దయ చూపించుకోరు, ఇతరులపై చూపిస్తారు,
ఇకదానితో వాళ్ళు ఉన్నతంలోకి వెళ్తారు, వీరు అలాగే ఉండిపోతారు. స్వయం వికారాలపై
విజయాన్ని పొందరు కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు, ఇకదానితో వీరు విజయము పొందుతారు.
ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.