ఓంశాంతి
పిల్లలను జ్ఞాన స్వరూప ఆత్మలుగా తయారుచేసేందుకు ఇటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని
వినిపించి, తర్వాత వాటి అర్థాన్ని అర్థం చేయించాలి, అప్పుడు వాచా తెరుచుకుంటుంది.
సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము బుద్ధిలో ఎంతవరకు ఉంది అన్నది తెలుస్తుంది.
పిల్లలైన మీ బుద్ధిలోనైతే పై నుండి మొదలుకుని మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము
యొక్క ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యమంతా ప్రకాశిస్తునట్లుగా ఉంటుంది. తండ్రి వద్ద కూడా
ఈ జ్ఞానము ఉంది, దానిని వారు మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా కొత్త జ్ఞానము.
శాస్త్రాలు మొదలైనవాటిలో పేర్లు ఉన్నాయి కానీ ఆ పేర్లు తీసుకుంటే అక్కడ ఆగిపోతారు,
వాదించడం మొదలుపెడతారు. ఇక్కడైతే చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తారు - భగవానువాచ,
నన్ను స్మృతి చేయండి, నేనే పతిత-పావనుడిని. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడిని లేక బ్రహ్మా,
విష్ణువు, శంకరులు మొదలైనవారిని పతిత-పావనా అని అనరు. సూక్ష్మవతనవాసులను కూడా మీరు
పతిత-పావనా అని అన్నప్పుడు మరి స్థూలవతనములోని మనుష్యులు పతిత-పావనులుగా ఎలా
అవ్వగలరు? ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలోనే ఉంది. శాస్త్రాల విషయములో ఎక్కువగా వాదించడం
మంచిది కాదు. చాలా వాద-వివాదము జరుగుతుంది. ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం కూడా
మొదలుపెడతారు. మీకైతే చాలా సహజముగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాల విషయాలలోకి
మరీ ఎక్కువగా వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయము - ఆత్మాభిమానిగా అవ్వడమే. స్వయాన్ని
ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. ఈ శ్రీమతము ముఖ్యమైనది. మిగిలినదంతా
విస్తారము. బీజము ఎంత చిన్ననిది, ఇకపోతే వృక్షము విస్తారముగా ఉంటుంది. ఏ విధముగా
బీజములో మొత్తము జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో, అదే విధముగా ఈ జ్ఞానమంతా కూడా బీజములో
ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజము మరియు వృక్షము వచ్చాయి. మీకు ఏ విధంగా తెలుసో, అలా
ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. వృక్షము యొక్క ఆయువునే ఎక్కువగా వ్రాసేసారు. తండ్రి
కూర్చుని బీజము మరియు వృక్షము, అలాగే డ్రామా చక్రము యొక్క రహస్యమును అర్థం
చేయిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా కొత్తవారు వస్తే, బాబా - స్వదర్శన
చక్రధారీ పిల్లలు అని మహిమ చేస్తే, ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారైతే తమను తాము
పిల్లలుగానే భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమైనవారు, అలాగే జ్ఞానము కూడా గుప్తమైనది,
వారసత్వము కూడా గుప్తమైనది. కొత్తవారు ఎవరైనా వింటే తికమకపడతారు, అందుకే 7 రోజుల
భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ 7 రోజుల భాగవతము మరియు రామాయణము మొదలైనవి ఏవైతే
పెడతారో, వాస్తవానికి అలా ఈ సమయములో 7 రోజుల భట్టీలో పెడితే బుద్ధిలో చెత్తంతా ఏదైతే
ఉందో అది తొలగుతుంది మరియు తండ్రితో బుద్ధియోగము జోడింపబడుతుంది. ఇక్కడ అందరూ రోగులు.
సత్యయుగములో ఈ రోగాలు ఉండవు. ఇది అర్ధకల్పపు రోగము, 5 వికారాల రోగము చాలా పెద్దది.
అక్కడైతే దేహీ-అభిమానులుగా ఉంటారు, ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి
తీసుకుంటాను అని మీకు తెలుసు. ముందు నుండే సాక్షాత్కారము జరుగుతుంది. అకాల మృత్యువు
ఎప్పుడూ సంభవించదు. మీకు కాలుడిపై విజయాన్ని ప్రాప్తింపజేయడం జరుగుతుంది. కాలుడికే
కాలుడు మహాకాలుడు అని అంటారు. మహాకాలుడి మందిరము కూడా ఉంటుంది. సిక్కు ధర్మము వారికి
అకాల సింహాసనము ఉంటుంది. వాస్తవానికి అకాల సింహాసనము ఈ భృకుటి, ఇక్కడ ఆత్మ
విరాజమానమై ఉంటుంది. ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనముపై కూర్చుని ఉన్నాయి. ఇది తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రికి తమదంటూ సింహాసనమైతే లేదు. వారు వచ్చి వీరి ఈ
సింహాసనాన్ని తీసుకుంటారు. ఈ సింహాసనముపై కూర్చుని పిల్లలైన మిమ్మల్ని నెమలి
సింహాసనాధికారులుగా తయారుచేస్తారు. లక్ష్మీ-నారాయణులు విరాజమానమయ్యే ఆ నెమలి
సింహాసనము ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. నెమలి సింహాసనము మహిమ చేయబడింది కదా.
వారిని భోళానాథుడైన భగవంతుడు అని ఎందుకు అంటారో ఆలోచించాలి. భోళానాథుడైన భగవంతుడు
అని అనడంతో బుద్ధి పైకి వెళ్తుంది. సాధు-సన్యాసులు మొదలైనవారు - వారిని స్మృతి
చేయండి అని తమ వేలుతో ఈ విధంగా సైగ కూడా చేస్తారు కదా. యథార్థ రీతిలోనైతే ఎవ్వరూ
తెలుసుకోలేరు. ఇప్పుడు పతిత-పావనుడైన తండ్రి సమ్ముఖముగా వచ్చి చెప్తున్నారు - నన్ను
స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఇది గ్యారంటీ. గీతలో కూడా ఇది
వ్రాసి ఉంది కానీ మీరు గీతలోని ఒక ఉదాహరణను తీస్తే వారు 10 తీస్తారు, అందుకే అవసరము
లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు మేము వాదించగలము అని
భావిస్తారు. పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైనవాటి గురించి తెలియనే
తెలియదో, మీరు వాటి పేరును కూడా ఎప్పుడూ తీసుకోకూడదు. మీ తండ్రినైన నన్ను స్మృతి
చేయండి అని భగవంతుడు చెప్తున్నారు అని కేవలం ఈ మాట మాత్రము చెప్పండి, వారినే
పతిత-పావనుడు అని అంటారు. పతిత-పావన సీతారామ్... అని పాడుతారు కూడా. సన్యాసులు కూడా
ప్రతి చోట ఈ విధముగా పాడుతూ ఉంటారు. ఇటువంటి మత-మతాంతరాలైతే అనేకమున్నాయి కదా. ఈ
పాట ఎంత సుందరముగా ఉంది, డ్రామా ప్లాన్ అనుసారముగా కల్ప-కల్పమూ ఇటువంటి పాటలు
తయారవుతాయి, ఇవి పిల్లలైన మీ కోసమే తయారుచేసినట్లుగా ఉంది. ఇటువంటి మంచి-మంచి పాటలు
ఉన్నాయి. ఉదాహరణకు, నయనహీనులకు దారి చూపించండి ప్రభు... ప్రభు అని శ్రీకృష్ణుడిని
ఏమీ అనరు. ప్రభువు లేక ఈశ్వరుడు అని నిరాకారుడినే అంటారు. ఇక్కడ మీరు బాబా, పరమపిత
పరమాత్మ అని అంటారు. వాస్తవానికి వారు కూడా ఆత్మయే కదా. భక్తి మార్గములోకి చాలా
ఎక్కువగా వెళ్ళిపోయారు. ఇక్కడైతే చాలా సహజమైన విషయము. అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము).
అల్ఫ్ అనగా అల్లా, బే అనగా రాజ్యాధికారము - ఇంతటి సహజమైన విషయము. తండ్రిని స్మృతి
చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. తప్పకుండా ఈ లక్ష్మీ-నారాయణులు
స్వర్గానికి యజమానులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. తండ్రిని స్మృతి చేయడము
ద్వారానే మీరు ఈ విధంగా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు
సేవ చేస్తారో అంతగా వారు ఉన్నత పదవిని పొందుతారు. అది అర్థమవుతుంది కూడా. స్కూల్లో
విద్యార్థులకు మేము తక్కువగా చదువుతున్నాము అన్నది అర్థమవ్వదా ఏమిటి! ఎవరైతే పూర్తి
శ్రద్ధ పెట్టరో, వారు వెనుకే కూర్చుని ఉంటారు, కావున తప్పకుండా ఫెయిల్ అయిపోతారు.
మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానానికి సంబంధించిన మంచి-మంచి పాటలు
ఏవైతే తయారై ఉన్నాయో వాటిని వినాలి. ఇటువంటి పాటలను మీ ఇంటిలో పెట్టుకోవాలి.
ఎవరికైనా వీటిపై అర్థం చేయించవచ్చు కూడా. మాయ నీడ ఏ విధంగా మళ్ళీ పడుతుంది. కల్పము
యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలని, బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి సగం-సగం
ఉంటాయని శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. ఈ పాటలు కూడా ఎవరో అయితే తయారుచేయించారు.
తండ్రి వివేకవంతులకే వివేకము వంటివారు కావున ఎవరో ఒకరి బుద్ధిలోకి వచ్చాయి, ఇక వారు
కూర్చుని తయారుచేసారు. ఈ పాటలు మొదలైనవాటి ఆధారముగా కూడా మీ వద్ద ఎంతమంది
ధ్యానములోకి వెళ్ళేవారు. ఈ జ్ఞానము యొక్క పాటలను పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు
ఒకటి వస్తుంది. వాళ్ళు తండ్రి మహిమలో ఎటువంటి పాటలను పాడుతారంటే ఇక అవి
కదిలించివేస్తాయి. అటువంటివారు వస్తారు. ట్యూన్ పై (రాగముపై) కూడా ఆధారపడి ఉంటుంది.
సంగీత విద్యకు కూడా చాలా పేరు ఉంది. ఇప్పుడైతే అటువంటివారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక్క
పాటను తయారు చేసారు - ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు... తండ్రి చాలా మధురమైనవారు,
చాలా ప్రియమైనవారు, అందుకే వారిని అందరూ తలచుకుంటారు. అలాగని దేవతలు వారిని
తలచుకుంటారని కాదు. చిత్రాలలో రాముని ఎదురుగా కూడా శివుడిని చూపించారు, రాముడు పూజ
చేస్తున్నారు. ఇది తప్పు. దేవతలు ఏమైనా ఎవరినైనా స్మృతి చేస్తారా. స్మృతి మనుష్యులు
చేస్తారు. మీరు కూడా ఇప్పుడు మనుష్యులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా అవుతారు. దేవతలకు
మరియు మనుష్యులకు మధ్యన రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆ దేవతలే మళ్ళీ
మనుష్యులుగా అవుతారు. చక్రము ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు.
మనము నిజంగా దేవతలుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనము
బ్రాహ్మణులము, కొత్త ప్రపంచములో దేవతలుగా పిలవబడతాము. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు.
ఈ బ్రహ్మా స్వయమే ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవారు, వారు శ్రీ నారాయణుడి మహిమను
పాడేవారు, నారాయణుడిపై చాలా ప్రేమ ఉండేది. నేనే ఆ విధంగా తయారవుతున్నాను అని ఇప్పుడు
ఆశ్చర్యమనిపిస్తుంది. కావున సంతోషపు పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి. మీరు గుప్త యోధులు,
అహింసకులు. నిజంగానే మీరు డబుల్ అహింసకులు. కామ ఖడ్గమూ ఉపయోగించరు, ఆ యుద్ధమూ చేయరు.
కామము వేరు, క్రోధము వేరు. కావున మీరు డబుల్ అహింసకులు. అహింసాయుతమైన సైన్యము.
సైన్యము అన్న పదము పట్టుకుని వారు ఆ సైన్యాలను తయారుచేసారు. మహాభారత యుద్ధములో
పురుషుల పేర్లను చూపించారు. స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటీ
మీదైన కారణముగా శివ శక్తి సేన అని పిలవడం జరుగుతుంది. ఈ విషయాలు తండ్రే కూర్చుని
అర్థం చేయిస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీరు నవయుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచములో ఎవరికీ కూడా
నవయుగము గురించి తెలియదు. నవయుగము 40 వేల సంవత్సరాల తర్వాత వస్తుంది అని వారు
భావిస్తారు. సత్యయుగము నవయుగము, ఇది చాలా స్పష్టముగా ఉంది. బాబా సలహా ఇస్తున్నారు,
ఇటువంటి మంచి-మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అవుతారు మరియు ఎవరికైనా అర్థం
చేయిస్తారు కూడా. ఇవన్నీ యుక్తులు. వీటి అర్థాన్ని కూడా కేవలం మీరే అర్థం చేసుకోగలరు.
మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి-మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటలు చాలా
సహాయము చేస్తాయి. అర్థాన్ని వివరించాలి, అప్పుడు నోరు కూడా తెరుచుకుంటుంది, సంతోషము
కూడా కలుగుతుంది. ఇకపోతే ఎవరైతే ఎక్కువ ధారణ చేయలేరో వారి కొరకు తండ్రి అంటారు,
ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం ఈ
మంత్రాన్ని గుర్తు పెట్టుకోండి - తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి.
పూర్వము పురుషులు తమ భార్యతో అనేవారు - భగవంతుడినైతే ఇంట్లో కూడా స్మృతి చేసుకోవచ్చు
కదా, ఇక మందిరాలు మొదలైన చోట్లకు తిరగవలసిన అవసరమేముంది? నేను నీకు ఇంటిలో
పెట్టుకునేందుకు మూర్తిని ఇస్తాను, ఇక్కడే కూర్చొని తలుచుకో, ఎందుకు వెళ్ళి కష్టాలు
పడతావు? ఈ విధంగా చాలామంది పురుషులు భార్యలను వెళ్ళనిచ్చేవారు కాదు. విషయము ఒకటే కదా,
పూజ చేయాలి మరియు స్మృతి చేయాలి, ఒక్కసారి చూసిన తర్వాత ఇక మామూలుగా కూడా స్మృతి
చేసుకోవచ్చు. శ్రీకృష్ణుని చిత్రమైతే సాధారణముగా నెమలి పింఛ కిరీటము కలవారిగా
ఉంటుంది. అక్కడ జన్మ ఏ విధంగా జరుగుతుంది అనేది పిల్లలైన మీరు సాక్షాత్కారము
చేసుకున్నారు, అది కూడా సాక్షాత్కారము చేసుకున్నారు, కానీ మీరు ఆ ఫోటోను
తయారుచేయగలరా? ఏక్యురేట్ గా ఎవ్వరూ తయారుచేయలేరు. దివ్యదృష్టితో కేవలం చూడగలుగుతారు,
తయారుచేయలేరు, అయితే చూసి వర్ణన చేయగలుగుతారు, కానీ పెయింట్ మొదలైనవేవీ చేయలేరు.
తెలివైన పెయింటర్ అయి ఉండవచ్చు, సాక్షాత్కారము కూడా చూసి ఉండవచ్చు, అయినా కానీ
ఏక్యురేట్ ముఖకవళికలను చిత్రీంకరించలేరు. బాబా అర్థం చేయించారు, ఎవరితోనూ ఎక్కువగా
వాదించకూడదు. మీరు ఇలా చెప్పండి - మీకు కావాల్సింది పావనముగా అవ్వడము, మరియు శాంతిని
కోరుకుంటున్నారు, కావున తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. పవిత్ర
ఆత్మ ఇక్కడ ఉండలేదు. అది తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మలను పావనముగా తయారుచేసే శక్తి
ఒక్క తండ్రిలోనే ఉంది, ఇంకెవ్వరూ పావనముగా తయారుచేయలేరు. పిల్లలైన మీకు తెలుసు,
ఇదంతా రంగస్థలము, దీనిపై నాటకము జరుగుతుంది. ఈ సమయములో మొత్తం రంగస్థలముపై రావణ
రాజ్యము ఉంది. మొత్తం సముద్రముపై సృష్టి నిలబడి ఉంది. ఇది అనంతమైన ద్వీపము. అవి
హద్దులోనివి. ఇది అనంతమైన విషయము. దీనిపై అర్ధకల్పము దైవీ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ
రాజ్యము ఉంటుంది. నిజానికి ఖండాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఇది పూర్తిగా అనంతమైన
విషయము. మనము గంగా, యమునా నదుల యొక్క తియ్యటి నీటి తీరాల వద్ద ఉంటామని మీకు తెలుసు.
సముద్రము మొదలైనవాటి వద్దకు వెళ్ళవలసిన అవసరము ఉండదు. ద్వారక అని దేనినైతే అంటారో,
అదేమీ సముద్రము మధ్యలో ఉండదు. ద్వారక అనేది వేరే ఏదో స్థానము కాదు. పిల్లలైన మీరు
అంతా సాక్షాత్కారము చేసుకున్నారు. ప్రారంభములో ఈ సందేశీ మరియు గుల్జార్ చాలా
సాక్షాత్కారాలు చూసేవారు. వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు ఎందుకంటే భట్టీలో
పిల్లలను ఆహ్లాదపరిచేది ఉంది, కావున సాక్షాత్కారాల ద్వారా చాలా ఆహ్లాదాన్ని పొందారు.
తండ్రి అంటారు, మళ్ళీ చివరిలో చాలా ఆహ్లాదాన్ని పొందుతారు. ఆ పాత్రయే వేరు. పాట కూడా
ఉంది కదా - మేము ఏదైతే చూసామో అది మీరు చూడలేదు అని. మీరు త్వరత్వరగా సాక్షాత్కారాలు
పొందుతూ ఉంటారు. ఏ విధంగా పరీక్షల రోజులు దగ్గరకు వచ్చే కొలది, మేము ఎన్ని మార్కులతో
పాస్ అవుతాము అనేది తెలిసిపోతుంది. మీది కూడా ఇది చదువు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ ఫుల్
అయి కూర్చున్నారు. అందరూ ఫుల్ ఏమీ అవ్వరు. స్కూల్ లో ఎల్లప్పుడూ నంబరువారుగా ఉంటారు.
ఇది కూడా జ్ఞానము - మూలవతనము, సూక్ష్మవతనము, ఈ మూడు లోకాల గురించి మీకు జ్ఞానము ఉంది.
ఈ సృష్టి చక్రము గురించి మీకు తెలుసు, ఇది తిరుగుతూనే ఉంటుంది. తండ్రి అంటారు - మీకు
ఏ జ్ఞానమునైతే ఇచ్చానో, దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీపై అనంతమైన దశ ఉంది.
కొందరిపై బృహస్పతి దశ ఉంటుంది. కొందరిపై రాహువు దశ ఉంటుంది, వారు వెళ్ళి చండాలురు
మొదలైనవారిగా అవుతారు. ఇది అనంతమైన దశ, అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన
విషయాలను వినిపిస్తారు, అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీకు ఎంతటి సంతోషము
ఉండాలి. మీరు అనేక సార్లు రాజ్యాధికారాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు,
ఇది పూర్తిగా పక్కా విషయము. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు), అప్పుడు మీరు సదా
హర్షితముగా ఉండగలుగుతారు. లేకపోతే మాయ ఊపిరాడకుండా చేసేస్తుంది.
మీరందరూ ఒక్క ప్రియునికి ప్రేయసులు. ప్రేయసులందరూ ఆ ఒక్క ప్రియుడినే స్మృతి
చేస్తారు. వారు వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. అర్ధకల్పము వారిని స్మృతి చేసారు,
ఇప్పుడు వారు లభించారు కావున ఎంతటి సంతోషము ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.