14-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 25.11.20


‘‘సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి’’

ఈ రోజు బాప్ దాదా తమ ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దానిని చూస్తున్నారు. ఈ చిన్నని ప్రపంచము ఎంతో అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా. ఎందుకు ప్రియమైనది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచము యొక్క ప్రతి ఆత్మ విశేష ఆత్మ. చూడటానికైతే అతి సాధారణ ఆత్మలుగా అనిపిస్తారు కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఉన్న అన్నింటికన్నా అతి పెద్ద విశేషత ఏమిటంటే - పరమ ఆత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. 90 సంవత్సరాల వృద్ధులైనా, అనారోగ్యంతో ఉన్నా కానీ పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి, దివ్య నేత్రము బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధులైన వి.వి.ఐ.పి. లకు కూడా లేవు. ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడకు చేరుకున్నారు? నడవగలిగినా, నడవలేకపోయినా కానీ చేరుకోవటమైతే చేరుకున్నారు. బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు కదా! బాబాను గుర్తించే ఈ నేత్రము, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేవు. మేము చూసాము, మేము తెలుసుకున్నాము... అని మాతలందరూ ఈ పాటను పాడుతారు కదా! మాతలకు ఈ నషా ఉందా? చేతులూపుతున్నారు, చాలా మంచిది. పాండవులకు నషా ఉందా? ఒకరికంటే మరొకరు ముందున్నారు. శక్తులలోనూ లోపము లేదు, పాండవులలోనూ లోపము లేదు. కానీ బాప్ దాదాకైతే ఈ చిన్నపాటి ప్రపంచము ఎంత ప్రియమైనది అని ఇదే సంతోషము ఉంది. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు!

బాప్ దాదా దేశ-విదేశాలలోని సర్వాత్మల నుండి ఈ రోజు మనసులోని ఈ పాటనే వింటున్నారు - బాబా, మధురమైన బాబా, మేము తెలుసుకున్నాము, మేము చూసాము. ఈ పాటను పాడుతూ-పాడుతూ నలువైపులా ఉన్న పిల్లలు ఒకవైపు సంతోషములో, మరొకవైపు స్నేహ సాగరములో ఇమిడిపోయి ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఇక్కడ సాకారములో లేకపోయినా కానీ మనసు ద్వారా, దృష్టి ద్వారా బాప్ దాదా ఎదురుగా ఉన్నారు మరియు బాప్ దాదా కూడా సాకారములో దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా సమ్ముఖంగానే చూస్తున్నారు. దేశములోకైనా, విదేశాలకైనా బాప్ దాదా ఎంత సమయములో చేరుకోగలరు? ఎంత సమయములో అంతా తిరిగి రాగలరు? బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు రిటర్న్ లో కోటానుకోట్ల కంటే కూడా ఎక్కువగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ-చూస్తూ అందరి మనసులలో ఒకటే సంకల్పము ఉండటాన్ని చూస్తున్నారు, అందరూ నయనాల ద్వారా ఇదే చెప్తున్నారు - మాకు పరమాత్మ ఇచ్చిన 6 నెలల హోమ్ వర్క్ గుర్తుంది అని. మీ అందరికీ కూడా గుర్తుంది కదా? మర్చిపోలేదు కదా? పాండవులకు గుర్తుందా? బాగా గుర్తుందా? బాప్ దాదా పదే-పదే ఎందుకు గుర్తు తెప్పిస్తున్నారు? కారణమేమిటి? సమయాన్ని చూస్తున్నారు, బ్రాహ్మణ ఆత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు. మనసు యవ్వనంగా అవుతూ ఉంటుంది, తనువు వృద్ధాప్యం వైపుకు వెళ్తుంది. సమయము మరియు ఆత్మల పిలుపు బాగా వినిపిస్తుందా! బాప్ దాదా చూస్తున్నారు - ఆత్మల మనసులో పిలుపు పెరిగిపోతూ ఉంది - ఓ సుఖదేవా, ఓ శాంతిదేవా, ఓ సత్యమైన సంతోషాన్ని ఇచ్చే దేవా, మాకు కూడా కాస్త అంచలిని ఇవ్వండి అని అంటున్నారు. ఆలోచించండి, పిలిచేవారి లైన్ ఎంత పెద్దదిగా ఉంది! బాబా ప్రత్యక్షత త్వరత్వరగా జరిగిపోవాలి అని మీరందరూ ఆలోచిస్తారు కానీ ఏ కారణంగా ప్రత్యక్షత ఆగి ఉంది? మేము బాబా సమానంగా అవ్వాలి అని మీరందరూ కూడా ఇదే సంకల్పము చేస్తారు, మనసులో కూడా ఇదే కోరికను పెట్టుకుంటారు, నోటితో కూడా అంటారు. తయారవ్వాలి కదా? తయారవ్వాలా? అచ్ఛా, మరెందుకు తయారవ్వరు? బాబా సమానంగా తయారవ్వమని బాప్ దాదా చెప్పారు. సమానంగా తయారవ్వాలి అని అన్నప్పుడు ఇక మళ్ళీ - ఏం తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి అనే ఈ రెండు ప్రశ్నలు తలెత్తవు. ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానం ఉంది కదా - బాబా సమానంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి?

తండ్రిని ఫాలో చేయండి - తల్లి, తండ్రి యొక్క అడుగుజాడలలో నడవండి. నిరాకార తండ్రిని, సాకార బ్రహ్మా తల్లిని. ఫాలో చేయడం కూడా రాదా? ఫాలో చేయడమైతే ఈ రోజుల్లోని అంధులు కూడా చేస్తారు. వారిని చూసారా, కర్ర పట్టుకుని ఆ శబ్దం ఆధారంగా కర్రని అనుసరిస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి చేరుకుంటారు. మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు, ఫాలో చేయడమనేది మీకేమంత పెద్ద విషయము! పెద్ద విషయమా? చెప్పండి, పెద్ద విషయమా? పెద్ద విషయం కాదు, కానీ పెద్దదైపోతుంది. బాప్ దాదా అన్ని చోట్లకూ తిరుగుతారు, సెంటర్లకు కూడా, ప్రవృత్తిలోని వారి ఇంటికి కూడా. అప్పుడు బాప్ దాదా ఏం చూసారంటే, ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ వద్ద, ప్రతి ఒక్క సెంటరులో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానములో అన్నిచోట్లా బ్రహ్మాబాబా చిత్రాలు ఎన్నో పెట్టి ఉన్నాయి. అవ్యక్త బాబావైనా, బ్రహ్మాబాబావైనా అన్నిచోట్లా చిత్రాలే చిత్రాలు కనిపిస్తాయి. ఇది మంచి విషయము. కానీ బాప్ దాదా ఏం ఆలోచిస్తున్నారంటే - చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తుంది కదా! లేక కేవలం చిత్రాన్నే చూస్తారా? చిత్రాన్ని చూస్తుంటే ప్రేరణ అయితే లభిస్తుంది కదా! బాప్ దాదా వేరే ఇంకేమీ చెప్పటం లేదు, కేవలం ఈ ఒక్క మాటే చెప్తున్నారు - ఫాలో చేయండి, అంతే. ఆలోచించకండి, ఎక్కువ ప్లాన్లు ఏమీ తయారుచెయ్యకండి, ఇది కాదు అది చెయ్యాలి, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా - ఇవేమీ వద్దు. బాబా ఏదైతే చేసారో, అది కాపీ చెయ్యాలి, అంతే. కాపీ చెయ్యటము రాదా? ఈ రోజుల్లో సైన్సు ఫోటోకాపీలు తీసే మెషీన్లను కూడా కనుగొంది. కనుగొంది కదా! ఇక్కడ ఫోటోకాపీ మెషీన్ ఉంది కదా? బ్రహ్మాబాబా చిత్రాలు పెట్టుకుంటారు, పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, పెద్ద-పెద్దవి పెట్టుకోండి, కానీ ఫోటోకాపీ అయితే చెయ్యండి కదా!

బాప్ దాదా ఈ రోజు నలువైపులా సంచరిస్తూ ఏమి చూస్తున్నారంటే - చిత్రముపై ప్రేమ ఉందా లేక చరిత్రపై ప్రేమ ఉందా? సంకల్పము కూడా ఉంది, ఉల్లాసము కూడా ఉంది, లక్ష్యము కూడా ఉంది, ఇంకేం కావాలి? బాప్ దాదా చూసారు, ఏదైనా వస్తువును బాగా దృఢంగా చేయడానికి నాలుగు మూలల నుండి దానిని పక్కా చెయ్యటం జరుగుతుంది. బాప్ దాదా ఏం చూసారంటే - మూడు మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక్క మూల మాత్రం ఇంకా పక్కాగా అవ్వాలి. సంకల్పము కూడా ఉంది, ఉల్లాసము కూడా ఉంది, లక్ష్యము కూడా ఉంది. ఏమవ్వాలని అనుకుంటున్నారు అని ఎవరిని అడిగినా కూడా బాబా సమానంగా అవ్వాలి అనే ప్రతి ఒక్కరూ అంటారు. ఎవ్వరూ కూడా - బాబా కంటే తక్కువవారిగా అవ్వాలి అని అనరు, సమానంగా అవ్వాలి అనే అంటారు. ఇది మంచి విషయము. ఒక మూలను పక్కాగా చేసుకుంటారు కానీ నడుస్తూ-నడుస్తూ అది ఢీలా అయిపోతుంది, అదే దృఢత. సంకల్పము ఉంది, లక్ష్యము ఉంది కానీ ఏదైనా పర-స్థితి వచ్చిందంటే, సాధారణ మాటలలో మీరి దానిని - విషయాలు వస్తుంటాయి అని అంటారు కదా, అది దృఢతను ఢీలా చేసేస్తుంది. దృఢత అని దేనిని అంటారంటే - మరణించాల్సి వచ్చినా, తొలగిపోవాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని వదలకూడదు. ఒంగవలసి వచ్చినా, జీవిస్తూ మరణించాల్సి వచ్చినా, స్వయాన్ని మలచుకోవలసి వచ్చినా, సహించవలసి వచ్చినా, వినవలసి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు. దీనినే దృఢత అని అంటారు. చిన్న-చిన్న పిల్లలు ఓం నివాస్ కు వచ్చినప్పుడు బ్రహ్మాబాబా వారితో నవ్వుతూ-నవ్వుతూ స్మృతిని కలిగిస్తూ వారిని పక్కా చేసేవారు - ఇన్నిన్ని నీళ్ళు త్రాగుతారా, ఇన్ని మిరపకాయలు తింటారా, భయపడరు కదా... అని అంటూ, ఆ తర్వాత చేతితో కళ్ళ ముందు ఇలా అనేవారు... ఇలా బ్రహ్మాబాబా చిన్న-చిన్న పిల్లలను పక్కా చేసేవారు, ఎంతటి సమస్య వచ్చినా కానీ, సంకల్పమనే నేత్రం చలించకూడదు. అప్పుడైతే చిన్న పిల్లలు కదా, అందుకని ఎండు మిరపకాయలు, నీటి కుండ ఉండేవి. ఇప్పుడైతే మీరందరూ పెద్దవారైపోయారు, కనుక బాప్ దాదా ఈ రోజు కూడా పిల్లలను అడుగుతున్నారు - మీకు దృఢ సంకల్పము ఉందా? బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని సంకల్పములో దృఢత ఉందా? తయారవ్వాలి అని కాదు, తయారవ్వాల్సిందే. అచ్ఛా, ఇందులో చేతులూపండి. టి.వి. వారు వీడియో తియ్యండి. టి.వి. ఉపయోగపడాలి కదా! చేతులు బాగా పైకి ఎత్తండి. అచ్ఛా, మాతలు కూడా చేతులెత్తుతున్నారు. వెనుక ఉన్నవారు ఇంకా బాగా పైకి చేతులెత్తండి. చాలా మంచిది. క్యాబిన్ లో ఉన్నవారు చేతులెత్తడం లేదు, క్యాబిన్ వారైతే నిమిత్తులు. అచ్ఛా, కాసేపటి కోసం చేతులెత్తి బాప్ దాదాను సంతోషపెట్టారు.

ఇప్పుడు బాప్ దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్నే చేయించాలనుకుంటున్నారు. చెప్పాలి అనుకోవటం లేదు, చేయించాలి అనుకుంటున్నారు. కేవలం మీ మనసులో దృఢతను తీసుకురండి. చిన్న విషయానికే సంకల్పాన్ని ఢీలా చేసుకోకండి. ఎవరైనా అగౌరవపరచినా, ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా అవమానించినా, నిందించినా, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు. మేము మాయను, ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులము అని మీరు ఛాలెంజ్ చేస్తారు. మీ వృత్తి అయితే గుర్తుంది కదా? మీరు విశ్వ పరివర్తకులే కదా. ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమై మీకు దుఃఖాన్ని ఇచ్చినా, దెబ్బ వేసినా, చలింపజేసినా, మీరు దుఃఖపు విషయాన్ని సుఖములోకి పరివర్తన చెయ్యలేరా? అగౌరవపరిస్తే సహించలేరా? నిందను గులాబీగా చెయ్యలేరా? సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పములోకి పరివర్తన చెయ్యలేరా? మీ అందరికీ ఇది గుర్తుందా - ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారో మరియు నిశ్చయము చేసుకున్నారో, దానికోసం మీకు ఒక్క క్షణము పట్టినా లేక ఒక్క నెల పట్టినా కానీ ఎప్పటి నుండైతే మీరు నిశ్చయము చేసుకున్నారో, అప్పుడు మనసుతో ఇలా అన్నారు, ‘‘నేను బాబా వాడిని, బాబా నా వారు’’. సంకల్పం చేసారు కదా, అనుభవం చేసారు కదా! అప్పటి నుండి మీరు - నేను మాయాజీత్ గా అవుతాను అని మాయకు ఛాలెంజ్ చేసారు. మాయతో ఈ ఛాలెంజ్ చేసారా? మాయాజీతులుగా అవ్వాలా, లేదా? మాయాజీతులు మీరే కదా లేక ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చేది ఉందా? మాయను ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే కదా. మాయ వేరే ఏదో రూపంలో రాదు. ఈ రూపాలలోనే మాయాజీతులుగా అవ్వాలి. విషయం మారదు, సెంటరు మారదు, స్థానం మారదు, ఆత్మలు మారరు, మనమే మారాలి. మీ ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది - మారి చూపించాలి, ప్రతీకారం తీర్చుకోకూడదు, మారాలి. ఇదైతే పాత స్లోగన్. కొత్త-కొత్త రూపాలలో, రాయల్ రూపాలతో మాయ ఇంకా వచ్చేది ఉంది, గాభరా పడకండి. బాప్ దాదా అండర్ లైన్ చేయిస్తున్నారు - మాయ ఈ-ఈ రూపాలలో రానున్నది మరియు వస్తున్నది కూడా. అది మాయ అని రియలైజ్ అవ్వనే అవ్వరు. ఏమంటారంటే - దాదీ, మీకు అర్థం కావటం లేదు, ఇది మాయ కాదు, ఇదైతే నిజమైన విషయము. ఇంకా రాయల్ రూపాలలో రానున్నది. భయపడకండి. ఎందుకు? చూడండి - ఏ శత్రువైనా సరే, వారు ఓడిపోయినా లేక గెలిచినా కానీ, వారి వద్ద చిన్న-పెద్ద శస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఉపయోగిస్తారా లేదా ఉపయోగించరా? ఉపయోగిస్తారు కదా? మరి మాయ కూడా అంతమయ్యేదే ఉంది. కానీ ఎంతగా అంతిమము సమీపంగా వస్తూ ఉందో, అంతగానే అది కొత్త-కొత్త రూపాలతో తన అస్త్ర-శస్త్రాలను ఉపయోగిస్తూ ఉంది, ఉపయోగిస్తుంది కూడా. ఆ తరువాత మీ కాళ్ళపై పడుతుంది. మొదటగా మిమ్మల్ని ఒంగేలా చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ తరువాత తనే స్వయం ఒంగిపోతుంది. ఇందులో బాప్ దాదా ఈ రోజు కేవలం ఒకటే మాటను పదే-పదే అండర్ లైన్ చేయిస్తున్నారు. ‘‘బాబా సమానంగా అవ్వాలి’’ - మీ ఈ లక్ష్యము యొక్క స్వమానములో ఉండండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. గౌరవాన్ని ఇవ్వటము అంటే గౌరవాన్ని తీసుకోవటము. ఇవ్వటము అనగా తీసుకోవటము. ఇతరులు గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు, గౌరవాన్ని ఇవ్వటము అంటేనే తీసుకోవటము. స్వమానము అనగా దేహాభిమానానికి చెందిన స్వమానము కాదు. బ్రాహ్మణ జీవితము యొక్క స్వమానము, శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానము, సంపన్నతా స్వమానము. కనుక స్వమానములో ఉండాలి మరియు గౌరవాన్ని తీసుకోకూడదు, ఇవ్వటమే తీసుకోవటము - ఈ రెండు విషయాలలో దృఢత్వాన్ని పెట్టుకోండి. మీ దృఢతను ఎవరు ఎంతగా కదిలించినా కానీ, దృఢతను ఢీలాగా చేసుకోవద్దు. దృఢం చేసుకోండి, అచలంగా అవ్వండి. బాప్ దాదాతో 6 నెలల గురించి ప్రతిజ్ఞ చేసారు కదా! ప్రతిజ్ఞ గుర్తుంది కదా! ఇప్పుడైతే 15 రోజులు పూర్తయ్యాయి, ఐదున్నర నెలలు ఇంకా ఉన్నాయి అని ఇది చూస్తూ ఉండకండి. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, అమృతవేళ ఆత్మిక సంభాషణనైతే చేస్తారు. అప్పుడు బాప్ దాదాకు చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. మీరు వినిపించే విషయాలైతే మీకు తెలుసు కదా? కనుక ఇప్పుడు దృఢతను ధారణ చెయ్యండి. చెడు విషయాలలో దృఢతను పెట్టుకోకూడదు. క్రోధం చెయ్యాల్సిందే అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయము ఉంది అని అనడం కాదు. ఎందుకు? ఈ రోజుల్లో బాప్ దాదా వద్దకు రికార్డులోకి మెజారిటీ క్రోధం యొక్క రకరకాల రిపోర్ట్ లు చేరుతున్నాయి. మహారూపంలో తక్కువగా ఉంది కానీ అంశరూపంలోనైతే రకరకాల క్రోధ రూపాలు ఎక్కువగా ఉన్నాయి. క్రోధానికి ఎన్ని రూపాలు ఉన్నాయి అని దీనిపై క్లాస్ చేయించండి. మళ్ళీ ఏమంటారంటే - నాకు అలాంటి భావము లేదు, భావన లేదు, ఊరికే అలా అనేసాను. దీనిపై క్లాస్ చేయించండి.

టీచర్లు చాలా మంది వచ్చారు కదా? (1200 మంది టీచర్లు ఉన్నారు) 1200 మంది దృఢ సంకల్పాన్ని చేసినట్లయితే రేపే పరివర్తన అయిపోగలదు. అప్పుడు ఇన్ని ప్రమాదాలు జరగవు, అందరూ రక్షింపబడతారు. టీచర్లు చేతులెత్తండి. చాలా మంది ఉన్నారు. టీచరు అనగా నిమిత్త ఫౌండేషన్ (పునాది). ఒకవేళ పునాది పక్కాగా అనగా దృఢంగా ఉన్నట్లయితే వృక్షము దానంతటదే సెట్ అయిపోతుంది (సరైపోతుంది). ఈ రోజుల్లో ప్రపంచంలోనైనా, బ్రాహ్మణ ప్రపంచంలోనైనా ప్రతి ఒక్కరికీ ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి. ఏదో ఉద్దేశ్యంతో ప్రేమించడం కాదు, స్వార్థముతో ఉన్న ప్రేమ కాదు. ఒకటేమో సత్యమైన ప్రేమ మరియు రెండవది ధైర్యము. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశమై, పరవశమై 95 శాతం కింద-మీద చేసినా కానీ, 5 శాతం మంచిగా చేస్తే మీరు ఆ 5 శాతం మంచిని తీసుకుని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి, ఇది చాలా బాగా చేసారు అని చెప్పండి, ఆ తరువాత మిగిలినదానిని సరిచేసుకోమని చెప్పండి, అప్పుడు వారు ఫీల్ అవ్వరు. ఒకవేళ మీరు - ఇది ఎందుకు చేసారు, ఇలా చేస్తారా ఏమిటి, మీరిలా చెయ్యకూడదు అని అన్నట్లయితే పాపం అప్పటికే వారు సంస్కారానికి వశమై ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, అప్పుడు ఇంకా భయపడిపోతారు, గాభరా పడిపోతారు, ఉన్నతి సాధించలేకపోతారు. ముందు ఆ 5 శాతం మంచిగా చేసినదానికి ధైర్యాన్ని ఇవ్వండి - మీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది, మీరు ఇది చాలా బాగా చెయ్యగలరు అని చెప్పండి, ఆ తరువాత సమయాన్ని మరియు వారి స్వరూపాన్ని అర్థం చేసుకుని విషయం చెప్పినట్లయితే వారు పరివర్తన అవుతారు. ధైర్యాన్ని ఇవ్వండి, పరవశ ఆత్మలో ధైర్యము ఉండదు. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేసారు? మీలోని లోపాలను వినిపించారా, మీరు వికారులు, మీరు అశుద్ధమైనవారు అని అన్నారా? మీరు ఆత్మ అని మీకు స్మృతిని కలిగించారు మరియు ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చింది, పరివర్తన అయ్యారు. కనుక ధైర్యాన్ని ఇస్తూ స్మృతిని కలిగించండి. ఆ స్మృతి స్వతహాగానే సమర్థతను తీసుకువస్తుంది. అర్థమైందా! మరైతే ఇప్పుడిక సమానులుగా అయిపోతారు కదా? కేవలం ఒక్క మాటను గుర్తు పెట్టుకోండి - తండ్రిని, తల్లిని ఫాలో చేయండి. బాబా ఏదైతే చేసారో దానిని చెయ్యాలి, అంతే. అడుగులో అడుగు వెయ్యాలి. అప్పుడు సమానముగా అవ్వటము సహజము అన్నట్లు అనుభవమవుతుంది.

డ్రామా చిన్న-చిన్న ఆటలను చూపిస్తుంటుంది. ఆశ్చర్యార్థకాన్ని అయితే పెట్టరు కదా? అచ్ఛా.

చాలామంది పిల్లల కార్డులు, ఉత్తరాలు, మనస్సు యొక్క పాటలు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. అందరూ మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి, మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి అని అంటారు. కనుక బాబా కూడా అంటున్నారు - మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి. స్మృతినైతే బాబా కూడా చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాప్ దాదా మరియు పిల్లలు, వేరే విస్తారమైతే లేనే లేదు. కావున ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలకు బాబా, బాబాకు పిల్లలు. దేశ-విదేశములలోని పిల్లలకు బాప్ దాదా చాలా-చాలా-చాలా-చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా.

నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచములోని విశేష ఆత్మలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకుని ఆత్మల పిలుపులను పూర్తి చేసే సంపన్న ఆత్మలకు, సదా బలహీనంగా మరియు పరవశమై ఉన్న ఆత్మలకు తమ ధైర్యము అనే వరదానం ద్వారా ధైర్యాన్ని ఇచ్చేవారికి, బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులుగా అయ్యి స్వ పరివర్తన ద్వారా మాయను, ప్రకృతిని మరియు బలహీన ఆత్మలను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు, బాప్ దాదా యొక్క నలువైపుల ఉన్న చిన్న ప్రపంచములోని సర్వ ఆత్మలకు, సమ్ముఖంగా వచ్చిన శ్రేష్ఠ ఆత్మలకు కోటానుకోట్ల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరము నుండే గుర్తించి పారద్రోలే మాయాజీత్ భవ

మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది కానీ మాయ పని రావటము మరియు మీ పని దానిని దూరము నుండే పారద్రోలటము. మాయ రావటము మరియు మిమ్మల్ని కదిలించటము, అప్పుడు మీరు పారద్రోలటము, ఇదంతా కూడా టైమ్ వేస్ట్ అయినట్లే. అందుకే సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయ అని మీరు దూరము నుండే గుర్తించండి. దానిని దగ్గరకు రానివ్వకండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇప్పుడైతే పురుషార్థిని... అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇది కూడా మాయకు మర్యాదలు చేస్తున్నట్లు, తర్వాత మళ్ళీ విసిగిపోతారు, అందుకే దూరము నుండే పరిశీలించి పారద్రోలినట్లయితే మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్:-

శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి.