14-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో, దానిని చూస్తూ కూడా చూడకండి, దాని నుండి మమకారాన్ని తొలగించండి ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది’’

ప్రశ్న:-
ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్తమైన కర్తవ్యము ఏమిటి, దాని గురించి ప్రపంచానికి తెలియదు?

జవాబు:-
ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనముగా తయారుచేసి దేవతలుగా తయారుచేస్తుంది - ఇది చాలా గుప్తమైన కర్తవ్యము, దీనిని మనుష్యులు అర్థం చేసుకోలేరు. మనుష్యులు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో, అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వగలుగుతారు. మనుష్యుల క్యారెక్టర్ అంతటినీ వికారాలు పాడు చేసాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ క్యారెక్టర్ కలవారిగా తయారుచేసే సేవను చేస్తారు, ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము.

ఓంశాంతి
ఓంశాంతి అని అన్నప్పుడు మన స్వధర్మము మరియు మన ఇల్లు గుర్తుకువస్తాయి, కానీ అలా ఇంట్లో అయితే కూర్చుండిపోకూడదు కదా. తండ్రి పిల్లలుగా అయ్యారంటే తప్పకుండా స్వర్గ వారసత్వము కూడా గుర్తుకువస్తుంది. ఓంశాంతి అనడం ద్వారా కూడా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతిసాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గ స్థాపనను చేస్తారో, ఆ తండ్రే మనల్ని పవిత్రముగా, శాంతి స్వరూపముగా తయారుచేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచము ఉన్నాయి. పవిత్ర ప్రపంచములో వికారాలు ఒక్కటి కూడా లేవు. అపవిత్ర ప్రపంచములో పంచ వికారాలు ఉన్నాయి, అందుకే దీనిని వికారీ ప్రపంచము అని అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. నిర్వికారీ ప్రపంచము నుండి మెట్లు దిగుతూ-దిగుతూ ఇక కిందకు వికారీ ప్రపంచములోకి వస్తారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము ఉన్నాయి కదా! సమయాన్ని బట్టి పగలు మరియు రాత్రి అనేవి ఉన్నాయి. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి. పగలులో సుఖము, రాత్రిలో దుఃఖము. రాత్రి దారి తప్పి భ్రమించే సమయము. వాస్తవానికి అలా రాత్రివేళలో ఎవరూ భ్రమించరు కానీ భక్తిని భ్రమించడము అనే అంటారు. పిల్లలైన మీరు ఇక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. మీ ఆత్మలో పంచ వికారాల కారణముగా పాపాలు ఉండేవి, అందులోనూ ముఖ్యమైనది కామ వికారము, దాని వల్లే మనుష్యులు పాపాత్ములుగా అవుతారు. తాము పతితులమని, భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక్క కామ వికారము కారణముగా మొత్తం అర్హతలన్నీ పాడైపోతాయి, అందుకే తండ్రి అంటారు, ఈ కామ వికారముపై విజయాన్ని పొందినట్లయితే జగజ్జీతులుగా, కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున లోలోపల అంతటి సంతోషము ఉండాలి. మనుష్యులు పతితులుగా అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు. ఈ కామము విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంతో అశాంతి, హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయములో ప్రపంచములో హాహాకారాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణముగానే అసురులు అని పిలువబడతారు. మేము పూర్తిగా గవ్వతుల్యముగా, పైసకు కొరగానివారిగా ఉండేవారము అని ఇప్పుడు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. ఏ వస్తువైతే పనికిరాదో దానిని అగ్నిలో కాల్చడం జరుగుతుంది. ప్రపంచములో పనికివచ్చే వస్తువేదీ లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యమాత్రులందరికీ నిప్పు అంటుకోనున్నది. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో దానికంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే నిప్పు అంటుకోదు. ఆత్మ అయితే ఇన్ష్యూర్ అయినట్లు ఉంటుంది. ఆత్మనెప్పుడైనా ఇన్ష్యూర్ చేయిస్తారా? ఇన్ష్యూర్ అనేది శరీరాన్ని చేయిస్తారు. ఇది ఒక నాటకము అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ అయితే పంచ తత్వాల కంటే కూడా పైన ఉంటుంది. పంచ తత్వాలతోనే మొత్తం ప్రపంచమంతటి సామాగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు, ఆత్మ అయితే సదా ఉంటుంది. కేవలం పుణ్య ఆత్మ పాప ఆత్మగా అవుతుంది. పంచ వికారాల ద్వారా ఆత్మ ఎంత అశుద్ధముగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి పాపాల నుండి విముక్తులుగా చేయడానికి వచ్చారు. వికారాల వల్ల మొత్తం క్యారెక్టర్లు అన్నీ పాడైపోతాయి. క్యారెక్టర్ అని దేనిని అంటారు - ఇది కూడా ఎవరికీ తెలియదు. పాండవ రాజ్యము, కౌరవ రాజ్యము అని అంటూ ఉంటారు కూడా. మరి ఇప్పుడు పాండవులు ఎవరు, ఇది కూడా ఎవరికీ తెలియదు. మేము ఈశ్వరీయ గవర్నమెంటుకు చెందినవారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి రామ రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. ఈ సమయములో ఈశ్వరీయ గవర్నమెంట్ ఏమి చేస్తుంది? ఆత్మలను పావనముగా తయారుచేసి దేవతలుగా తయారుచేస్తుంది. లేదంటే మరి దేవతలు ఎక్కడి నుండి వచ్చారు - ఇది ఎవరికీ తెలియదు, అందుకే దీనిని గుప్తమైన గవర్నమెంట్ అని అంటారు. వాస్తవానికి వారు కూడా మనుష్యులే కానీ వారు దేవతలుగా ఎలా అయ్యారు, ఎవరు తయారుచేసారు? దేవీ-దేవతలు అయితే స్వర్గములోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారుచేసారు. స్వర్గవాసుల నుండి మళ్ళీ నరకవాసులుగా అవుతారు. మళ్ళీ నరకవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఇది మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మరి ఇతరులు ఎలా తెలుసుకోగలరు. స్వర్గము అని సత్యయుగాన్ని, నరకము అని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ చదువు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఆత్మయే పతితముగా అవుతుంది. పతితుల నుండి పావనులుగా తయారుచేయడము - ఈ వ్యాపారాన్ని తండ్రి మీకు నేర్పించారు. పావనముగా అయినట్లయితే పావన ప్రపంచములోకి వెళ్తారు. ఆత్మయే పావనముగా అవ్వాలి, అప్పుడే స్వర్గానికి యోగ్యముగా అవుతుంది. ఈ జ్ఞానము మీకు ఈ సంగమములోనే లభిస్తుంది. పవిత్రముగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతిత-పావనుడు అని ఒక్క బాబానే అంటారు. మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారు. శ్యామ్ మరియు సుందర్, ఇతనికి పేరు కూడా ఇలా పెట్టడం జరిగింది కానీ మనుష్యులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని గురించి కూడా స్పష్టమైన వివరణ లభిస్తుంది. ప్రపంచాన్ని రెండు ప్రపంచాలుగా చేసేసారు. వాస్తవానికి ప్రపంచమైతే ఒక్కటే. అదే కొత్తగా మరియు పాతగా అవుతుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు, ఆ తర్వాత పెద్దవారిగా అయి, తర్వాత వృద్ధులవుతారు. అలాగే ప్రపంచము కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది. మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడం ద్వారా ఎంత మధురముగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధాలు మొదలైనవాటి విషయమేదీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులుగా మరియు జ్ఞానవంతులుగా తయారుచేస్తారు. శివుని మందిరములోకి వెళ్ళి నమస్కరిస్తారు కానీ వారు ఎవరు, ఏమిటి, ఇది ఎవరికీ తెలియదు. శివ కాశీ విశ్వనాథ గంగ... అని కేవలం నామమాత్రంగా అంటూ ఉంటారు, దాని అర్థాన్ని కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అలాగని అర్థం చేయిస్తే, మీరు మాకు ఏమి అర్థం చేయిస్తారు, మేమైతే వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము అని అంటారు. పిల్లలైన మీలో ఈ విషయాలను ధారణ చేసేవారు నంబరువారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు ఎందుకంటే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. కావున ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారి పని ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారుచేయడము. రాతిబుద్ధి కలవారి నడవడిక కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉంటారు కదా. హంసలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖమునివ్వరు. కొంగలు దుఃఖమునిస్తాయి. వారిని అసురులు అని అంటారు. వారికి పరిచయం ఉండదు. చాలా సెంటర్లలో కూడా ఇటువంటి వికారులు ఎందరో వచ్చేస్తారు. మేము పవిత్రముగా ఉంటాము అని సాకులు చెప్తారు కానీ అది అబద్దము. అసత్య ప్రపంచము... అని కూడా అంటారు. ఇప్పుడు ఇది సంగమము. ఎంత తేడా ఉంటుంది. ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో, వారే థర్డ్ గ్రేడ్ వారిగా అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి కదా. వీరు థర్డ్ గ్రేడ్ వారు అని తండ్రి చెప్పగలరు.

తండ్రి అర్థం చేయిస్తారు, పవిత్రత యొక్క పూర్తి ఋజువును ఇవ్వాలి. మీరు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రముగా ఉండడమనేది అసంభవము అని కొందరు అంటారు. కానీ పిల్లలలో యోగబలము లేని కారణముగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని వారికి ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు. భగవంతుడు అంటారు, పవిత్రముగా అవ్వడముతో మీరు 84 జన్మలు స్వర్గాధిపతులుగా అవుతారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు ఇంకా ఎక్కువ సంతోషము కలుగుతుంది. కొందరు పిల్లలు గంధర్వ వివాహం చేసుకుని పవిత్రముగా ఉండి చూపిస్తారు. దేవీ-దేవతలు పవిత్రముగా ఉన్నారు కదా. అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రే తయారుచేస్తారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అర్థం చేయించడం జరిగింది. జ్ఞానము మరియు భక్తి సగం, సగం ఉంటాయి, మళ్ళీ భక్తి తర్వాత ఉండేది వైరాగ్యము. ఇప్పుడు ఈ పతిత ప్రపంచములో ఇక ఉండేది లేదు, ఈ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యింది. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదటి విషయమైన భగవంతుని విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పాత ప్రపంచము తప్పకుండా అంతమవ్వనున్నదని కూడా పిల్లలు భావిస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేక సార్లు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారు, అప్పుడిక నరకము యొక్క వినాశనం జరుగుతుంది. నరకము ఎంత పెద్దది, స్వర్గము ఎంత చిన్ననిది. కొత్త ప్రపంచములో ఒకే ధర్మము ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. శంకరుని ద్వారా వినాశనం అని వ్రాయబడి కూడా ఉంది. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది, మళ్ళీ బ్రహ్మా ద్వారా ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ ధర్మాలను ఎవరు స్థాపించారు? బ్రహ్మా అయితే చేయలేదు! బ్రహ్మాయే పతితము నుండి మళ్ళీ పావనముగా తయారవుతారు. పతితము నుండి పావనముగా అవుతారు అని నా విషయములోనైతే అనరు. పావనముగా ఉన్నప్పుడు లక్ష్మీ-నారాయణులు అన్న పేరు ఉంటుంది, పతితముగా ఉన్నప్పుడు బ్రహ్మా అన్న పేరు ఉంది. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి. శివబాబాను అనాది రచయిత అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. ఆత్మల రచయిత అని అనరు, అందుకే అనాది అని అంటారు. తండ్రి అనాది కావున ఆత్మలు కూడా అనాదియే. అలాగే నాటకము కూడా అనాదియే. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. స్వయం ఆత్మకు సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాల కాల వ్యవధి యొక్క జ్ఞానము లభిస్తుంది. ఇది ఎవరు ఇచ్చారు? తండ్రి. మీరు 21 జన్మల కొరకు నాథునికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ రావణ రాజ్యములో అనాథలుగా అయిపోతారు. ఆ తర్వాత క్యారెక్టర్లు పాడవ్వడం మొదలవుతాయి. వికారాలు ఉన్నాయి కదా. నరకము, స్వర్గము అన్నీ కలిసే ఉంటాయి అని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టముగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తముగా ఉన్నారు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు. దారమంతా ఎంతగా చిక్కుబడిపోయి ఉంది. మేము ఎందుకూ పనికిరాని వారిగా ఉన్నాము, మీరు వచ్చి పావనముగా తయారుచేసి మా క్యారెక్టర్లను తీర్చిదిద్దండి అని తండ్రినే పిలుస్తారు. మీ క్యారెక్టర్లు ఎంతగా బాగుపడతాయి. కొందరైతే బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈ రోజు హంసగా పిలువబడతారు, రేపు కొంగగా అయిపోతారు. అందుకు పెద్ద సమయం పట్టదు. మాయ కూడా చాలా గుప్తముగా ఉంది. ఇక్కడ చూడటానికి ఏమీ కనిపించదు. బయటకు వెళ్ళడంతో కనిపిస్తుంది, మళ్ళీ ఆశ్చర్యవంతులై వింటారు... పారిపోతారు. ఎంత జోరుగా పడిపోతారంటే, దానితో ఎముకలన్నీ విరిగిపోతాయి. ఇది ఇంద్రప్రస్థము. విషయమైతే తెలిసిపోతుంది. అటువంటివారు ఇక సభలోకి రాకూడదు. ఎంతోకొంత జ్ఞానము వింటే స్వర్గములోకి అయితే వచ్చేస్తారు. జ్ఞానము ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇప్పుడు తండ్రి అంటారు, పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందండి. ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతగా మారుతుంది, అయినా కానీ మాయ తప్పకుండా మోసగిస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా (కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా) అవ్వాలి. ఏదైనా కోరిక పెట్టుకున్నట్లయితే ఇక పోయినట్లే. పైసకు కొరగానివారిగా అయిపోతారు. మంచి-మంచి మహారథులను కూడా మాయ ఏదో ఒక విధంగా మోసగిస్తూనే ఉంటుంది, ఇక వారు హృదయాన్ని అధిరోహించలేరు. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే, వారు తమ తండ్రిని అంతం చేయడానికి కూడా వెనుకాడరు. పరివారాన్ని కూడా అంతం చేసేస్తారు. వారు మహా పాపాత్ములు. రావణుడు ఏమేమి చేయించేస్తాడు. ఎంతో అయిష్టము కలుగుతుంది. ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచము, దీనిపై ఎప్పుడూ మనస్సు పెట్టుకోకూడదు. పవిత్రముగా అయ్యేందుకు చాలా ధైర్యము కావాలి. విశ్వరాజ్యాధికారము యొక్క ప్రైజ్ ను తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది. పవిత్రత విషయములో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. గాంధీ కూడా - ఓ పతిత పావనా రండి అని పిలిచేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, చరిత్ర, భౌగోళికములు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరూ తిరిగి రావలసిందే, అప్పుడే కలిసి వెళ్ళగలుగుతారు. అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేందుకు తండ్రి కూడా వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయ మోసాల నుండి రక్షింపబడేందుకు ఏ రకమైన కోరికనూ పెట్టుకోకూడదు. కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా అవ్వాలి.

2. విశ్వ రాజ్యాధికారపు ప్రైజ్ ను తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత, అందుకే పవిత్రముగా అయ్యే ధైర్యమును ఉంచాలి. తమ క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దుకోవాలి.

వరదానము:-
సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద, మర్యాద రేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీ భవ

తండ్రి స్మృతియే ఛత్రఛాయ, ఛత్రఛాయలో ఉండటము అనగా మాయాజీత్ విజయీగా అవ్వటము. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మరియు మర్యాద రేఖ లోపల ఉన్నట్లయితే ఎవ్వరికీ లోపలకు వచ్చే ధైర్యము ఉండదు. మర్యాద రేఖ నుండి బయటకు వెళ్ళినట్లయితే మాయ కూడా తనవారిగా చేసుకోవటములో తెలివైనది. కానీ మేము అనేక సార్లు విజయులుగా అయ్యాము, విజయమాల మా స్మృతి చిహ్నమే అన్న ఈ స్మృతితో సదా సమర్థులుగా ఉన్నట్లయితే మాయ చేతిలో ఓటమి పొందలేరు.

స్లోగన్:-
సర్వ ఖజానాలను స్వయములో ఇముడ్చుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవము కలుగుతూ ఉంటుంది.