ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఆత్మిక అన్న పదము
ఉపయోగించకుండా కేవలం తండ్రి అన్న పదము ఉపయోగించినా సరిపోతుంది. తండ్రి కూర్చుని
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తమను తాము సోదరులము అనైతే చెప్పుకుంటున్నారు.
కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరికీ అయితే అర్థం చేయించరు.
అందరూ తమను తాము సోదరులము అనే చెప్పుకుంటారు. గీతలో భగవానువాచ అని వ్రాయబడి ఉంది.
ఇప్పుడు భగవానువాచ ఎవరి కోసము? భగవంతునికి అందరూ పిల్లలే. వారు తండ్రి కావున
భగవంతుని పిల్లలందరూ సోదరులు. భగవంతుడే అర్థం చేయించి ఉంటారు, రాజయోగాన్ని నేర్పించి
ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళము తెరుచుకుని ఉంది. ప్రపంచములో ఇంకెవ్వరికీ కూడా
ఇటువంటి ఆలోచనలు నడవవు. ఎవరెవరికైతే సందేశము లభిస్తూ ఉంటుందో, వారు స్కూలుకు వస్తూ
ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనీ అయితే చూసాము, ఇప్పుడు వెళ్ళి ఇంకాస్త
విందామని భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఇది జ్ఞానసాగరుడు,
పతిత-పావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవానువాచ. మొట్టమొదట వారికి తెలియవలసిన
విషయమేమిటంటే - వీరికి నేర్పించేవారు లేక అర్థం చేయించేవారు ఎవరు! వారే ఆ పరమ ఆత్మ,
జ్ఞాన సాగరుడు, నిరాకారుడు. వారు ఉన్నదే సత్యము కావున వారు సత్యమునే తెలియజేస్తారు.
ఇక అందులో ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమవ్వడానికి లేదు. మాకు పరమపిత పరమాత్మ బ్రహ్మా
ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారని మొట్టమొదట ఈ విషయముపై అర్థం చేయించాలి. ఇది రాజ్య
పదవి. అందరికీ తండ్రి అయిన ఆ పారలౌకిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారని,
అందరికన్నా గొప్ప అథారిటీ వారేనని ఎవరికైతే నిశ్చయము ఏర్పడుతుందో, ఇక వారికి వేరే ఏ
ప్రశ్న ఉత్పన్నమవ్వదు. వారు పతిత-పావనుడు కావున వారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో,
తప్పకుండా తమ సమయమనుసారముగానే ఇక్కడకు వస్తూ ఉండవచ్చు. ఇది అదే మహాభారత యుద్ధము
అన్నది మీరు చూస్తున్నారు కూడా. వినాశనము తర్వాత మళ్ళీ నిర్వికారీ ప్రపంచము
రానున్నది. ఇది వికారీ ప్రపంచము. భారత్ యే నిర్వికారిగా ఉండేది అన్నది మనుష్యులకు
తెలియదు. ఏ మాత్రము బుద్ధి నడవదు. గోద్రెజ్ తాళము వేయబడి ఉంది. దాని తాళంచెవి ఒక్క
తండ్రి వద్ద మాత్రమే ఉంది, అందుకే వారినే జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని అంటారు.
వారు జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మల్ని చదివించేవారు ఎవరు అన్నది
ఎవ్వరికీ తెలియదు. దాదా చదివిస్తున్నారని భావిస్తారు, అందుకే విమర్శిస్తూ ఉంటారు,
ఏదో ఒకటి అంటూ ఉంటారు - అందుకే, మొట్టమొదట ఈ విషయాన్నే అర్థం చేయించండి. ఇందులో శివ
భగవానువాచ అని వ్రాయబడి కూడా ఉంది. వారు సత్యము.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను పతిత-పావనుడైన శివుడిని. ఈ సాలిగ్రామాలను
చదివించేందుకు నేను పరంధామము నుండి వచ్చాను. తండ్రి ఉన్నదే నాలెడ్జ్ ఫుల్. వారు
సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ ఇప్పుడు మీకు మాత్రమే
అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది. వారే సృష్టి రచయిత. వారు పతిత సృష్టిని పావనముగా
తయారుచేసేవారు. ఓ పతిత-పావనా రండి అని వారిని పిలుస్తారు కూడా, కావున మొట్టమొదట వారి
పరిచయాన్నే ఇవ్వాలి. ఆ పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధము ఏమిటి? వారు ఉన్నదే సత్యము.
వారు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి
సత్యమని, వారే సత్యఖండాన్ని తయారుచేస్తారని పిల్లలకు తెలుసు. మీరు నరుని నుండి
నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. బ్యారిస్టర్ వద్దకు వెళ్తే, మేము
బ్యారిస్టర్ గా అయ్యేందుకు వచ్చామని భావిస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని
మీకు ఇప్పుడు నిశ్చయముంది. చాలామంది నిశ్చయము కలిగి ఉంటారు కూడా, మళ్ళీ సంశయబుద్ధి
కలవారిగా అయిపోతారు, అప్పుడు వారిని మనుష్యులందరూ అడుగుతారు - నీవు భగవంతుడు
చదివిస్తున్నారని అనేవాడివి కదా, మరి భగవంతుడిని వదిలి ఎందుకు వచ్చావు? సంశయము
రాగానే వదిలి వెళ్ళిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తారు. భగవానువాచ - కామము మహాశత్రువు,
దానిపై విజయము పొందితేనే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఎవరైతే పావనముగా అవుతారో, వారే
పావన ప్రపంచములోకి వెళ్తారు. ఇక్కడ ఉన్నది రాజయోగము యొక్క విషయము. మీరు వెళ్ళి
అక్కడ రాజ్యము చేస్తారు. ఇకపోతే మిగిలిన ఆత్మలెవరైతే ఉన్నారో, వారు తమ లెక్కాచారాలను
తీర్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయము. సత్యయుగ స్థాపన తప్పకుండా
జరుగుతుందని ఇప్పుడు బుద్ధి చెప్తుంది. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు.
మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వారు మళ్ళీ తమ పాత్రను రిపీట్ చేయవలసి
ఉంటుంది. పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు మీరు కూడా మీ
పురుషార్థము చేస్తూ ఉంటారు. యజమాని అని అందరూ తమకు తాము అనుకుంటారు కదా. ప్రజలు కూడా
యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారత్ అని అంటారు కదా. గొప్ప-గొప్ప వ్యక్తులు,
సన్యాసులు మొదలైనవారు కూడా మా భారత్ అని అంటారు. ఈ సమయములో భారత్ లో అందరూ
నరకవాసులుగా ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనము స్వర్గవాసులుగా
అయ్యేందుకు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అందరూ అయితే స్వర్గవాసులుగా అవ్వరు. ఈ
జ్ఞానము ఇప్పుడు లభించింది. ఆ మనుష్యులందరూ ఏదైతే వినిపిస్తారో, శాస్త్రాలను
వినిపిస్తారో, వారు శాస్త్రాల అథారిటీ. తండ్రి అంటారు, ఈ భక్తి మార్గపు
వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ చదవడముతో మెట్లు కిందకు దిగుతూ వెళ్తారు. ఇదంతా భక్తి
మార్గము. తండ్రి అంటారు, ఎప్పుడైతే భక్తి మార్గము పూర్తవుతుందో, అప్పుడే నేను
వస్తాను. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాలి. మెజారిటీ అయితే భక్తులదే.
ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు కదా. భక్తుల నోటి నుండి - ఓ భగవంతుడా, ఓ
గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి మరియు జ్ఞానానికి అయితే
వ్యత్యాసముంది కదా. మీ నోటి నుండి ఎప్పుడూ - ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా అనే పదాలు
వెలువడవు. మనుష్యులకైతే అర్ధకల్పముగా ఇది అలవాటు అయిపోయింది. వారు మన తండ్రి అని
మీకు తెలుసు, మీరు ఓ బాబా అని అనకూడదు. తండ్రి నుండైతే మీరు వారసత్వాన్ని తీసుకోవాలి.
మనము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాము అని మొదటైతే ఈ నిశ్చయము ఉంది. తండ్రి
పిల్లలను వారసత్వము తీసుకునేందుకు అధికారులుగా తయారుచేస్తారు. వీరు సత్యమైన తండ్రి
కదా. వీరు నా పిల్లలని, వీరికి నేను జ్ఞానామృతాన్ని త్రాగించి, జ్ఞానచితిపై
కూర్చోబెట్టి, గాఢమైన నిద్ర నుండి మేలుకొలిపి, స్వర్గములోకి తీసుకువెళ్తానని
తండ్రికి తెలుసు. ఆత్మలు అక్కడ శాంతిధామము మరియు సుఖధామములో ఉంటారని తండ్రి అర్థం
చేయించారు. సుఖధామాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు
కదా. మరియు అది స్వీట్ హోమ్. అది మన ఇల్లు అని, పాత్రధారులమైన మనము ఆ శాంతిధామము
నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తామని మీరు తెలుసుకున్నారు. ఆత్మలమైన మనము
ఇక్కడి నివాసులము కాదు. ఆ పాత్రధారులు ఇక్కడి నివాసులు. వారు కేవలం ఇంటి నుండి వచ్చి
డ్రెస్ మార్చుకుని పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామమని, అక్కడకు మనము తిరిగి
వెళ్తామని మీరు భావిస్తారు. ఎప్పుడైతే పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో,
అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు, అందుకే వారిని లిబరేటర్
(ముక్తిప్రదాత), గైడ్ (మార్గదర్శకుడు) అని కూడా అంటారు. వారు దుఃఖహర్త-సుఖకర్త
కావున ఇంతమంది మనుష్యులు ఎక్కడకు వెళ్తారు? ఆలోచించండి - పతిత-పావనుడిని పిలుస్తారు,
ఎందుకని? తమ మృత్యువు కోసము పిలుస్తారు, దుఃఖపు ప్రపంచములో ఉండాలని అనుకోరు, అందుకే
ఇంటికి తిసుకువెళ్ళండి అని అంటారు. వారంతా కేవలం ముక్తిని మాత్రమే నమ్ముతారు. భారత్
యొక్క ప్రాచీన రాజయోగము కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు
విదేశాలకు కూడా వెళ్తారు. వాస్తవానికి హఠయోగులకు రాజయోగము గురించి తెలియనే తెలియదు.
వారి యోగమే తప్పు, అందుకే మీరు వెళ్ళి సత్యమైన రాజయోగాన్ని నేర్పించాలి. మనుష్యులు
సన్యాసుల కాషాయ వస్త్రాలను చూసి వారికి ఎంత గౌరవాన్ని ఇస్తారు. బౌద్ధ ధర్మములో కూడా
సన్యాసులు కాషాయ వస్త్రాలను ధరించడము చూసి వారిని గౌరవిస్తారు. సన్యాసులైతే తర్వాత
వస్తారు. బౌద్ధ ధర్మములో కూడా ప్రారంభములో సన్యాసులెవ్వరూ ఉండరు. ఎప్పుడైతే పాపము
పెరుగుతుందో, అప్పుడు సన్యాస ధర్మము స్థాపనవుతుంది. మొదటైతే ఆ ఆత్మలు పై నుండి
వస్తారు. వారి సంఖ్య అంతా వస్తుంది. ప్రారంభములోనే సన్యాసాన్ని నేర్పించి ఏం
చేస్తారు, సన్యాసము తర్వాత ప్రారంభమవుతుంది. అది కూడా ఇక్కడి నుండే కాపీ చేస్తారు.
సన్యాసులను గౌరవించేవారు క్రిస్టియన్లలో కూడా చాలామంది ఉన్నారు. కాషాయ వస్త్రాలు
ధరించేది హఠయోగులు. మీరైతే ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు. అలాగే శ్వేత వస్త్రాల బంధనము
కూడా లేదు కానీ శ్వేత వస్త్రాలు మంచివి. మీరు భట్టీలో ఉన్నారు కావున మీ డ్రెస్ కూడా
ఇదే అయిపోయింది. ఈ రోజుల్లో శ్వేత వస్త్రాలను చాలామంది ఇష్టపడతారు. మనుష్యులు
మరణించినప్పుడు కూడా తెల్ల దుప్పటి కప్పుతారు. మీరు కూడా ఇప్పుడు మరజీవులుగా అయ్యారు
కావున శ్వేత వస్త్రాలు మంచివి.
మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఈ
విషయాలు అర్థం చేసుకోవడానికి సమయము పడుతుంది. ప్రదర్శనీలో అంతగా అర్థం చేయించలేరు.
సత్యయుగములో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయములో మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు, ఎందుకంటే
భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా తనువులోకి వస్తారు, వారు కూడా అందరికీ తండ్రే. లౌకిక
తండ్రి కూడా ఉన్నారు. అచ్ఛా, ఇప్పుడు ముగ్గురు తండ్రులలోనూ ఉన్నతమైన వారసత్వము
ఎవరిది? నిరాకారుడైన తండ్రి వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి. వారు బ్రహ్మా ద్వారా ఇస్తారు.
ఈ చిత్రాలపై మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. శివబాబా నిరాకారుడు మరియు వీరు
ప్రజాపిత బ్రహ్మా, ఆదిదేవ్, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తండ్రి అంటారు, శివుడినైన
నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను అందరికీ తండ్రిని. వీరు
ప్రజాపిత బ్రహ్మా. మీరందరూ సోదరీ-సోదరులు. పత్ని-పతి అయినా కానీ బుద్ధి ద్వారా -
మేము సోదరీ-సోదరులము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని తెలుసు.
సోదరీ-సోదరులు పరస్పరములో ఆసురీ కార్యకలాపాలు చేయకూడదు. ఒకవేళ ఇరువురికీ పరస్పరములో
వికారీ దృష్టి ఆకర్షిస్తే ఇక పడిపోతారు. తండ్రిని మర్చిపోతారు. తండ్రి అంటారు, మీరు
నా పిల్లలుగా అయి మళ్ళీ ముఖము నల్లగా చేసుకుంటారా. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు
అర్థం చేయిస్తున్నారు. మీకు ఈ నషా ఎక్కి ఉంది. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలని మీకు
తెలుసు. లౌకిక సంబంధీకులతో పాటు కలిసి ఉండాలి, బాధ్యతలు నెరవేర్చాలి. లౌకిక
తండ్రినైతే మీరు తండ్రి అనే అంటారు కదా. వారినైతే మీరు సోదరుడని అనలేరు. సాధారణ
రీతిలో తండ్రిని తండ్రి అనే అంటారు. వీరు మా లౌకిక తండ్రి అని బుద్ధిలో ఉంటుంది.
జ్ఞానమైతే ఉంది కదా. ఈ జ్ఞానము చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లోనైతే తండ్రిని పేరుతో
కూడా పిలుస్తుంటారు, కానీ ఎవరైనా విజిటర్స్ లేక బయటివారి ముందు తండ్రిని అన్నయ్య అని
పిలిస్తే, వీరి బుద్ధి పోడైపోయింది అని వారు అనుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి.
మీది గుప్త జ్ఞానము, గుప్త సంబంధము. ఇందులో చాలా యుక్తిగా నడుచుకోవాలి. కానీ
ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వడము మంచిదే. లౌకికమువారితో కూడా తోడును నిర్వర్తించాలి.
బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనము బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నాము. అయితే
చిన్నాన్నను చిన్నాన్న అని, తండ్రిని తండ్రి అనే పిలవాలి. ఎవరైతే బి.కె.లుగా
అవ్వలేదో, వారు సోదరీ-సోదరులు అని భావించరు కదా. ఎవరైతే బ్రహ్మాకుమార, కుమారీలుగా
అయ్యారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. బయటివారైతే విని మొదట ఆశ్చర్యపోతారు.
ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. తండ్రి పిల్లలైన మీ బుద్ధిని
విశాల బుద్ధిగా తయారుచేస్తారు. మీరు మొదట హద్దులోని బుద్ధి కలిగి ఉండేవారు. ఇప్పుడు
బుద్ధి అనంతము వైపుకు వెళ్ళిపోతుంది. వారు మన అనంతమైన తండ్రి. వీరంతా మన
సోదరీ-సోదరులు. కానీ సంబంధాలలోనైతే కోడలును కోడలు అని, అత్తను అత్త అనే అంటారు,
అంతేకానీ అక్కయ్య అని అనరు. రావడం ఇద్దరూ వస్తారు, కానీ ఇంటిలో ఉంటూ కూడా చాలా
యుక్తిగా నడుచుకోవాలి. లోకులు ఏమనుకుంటారు అనేది కూడా చూసుకోవలసి ఉంటుంది. లేకపోతే
వారు - వీరు పతిని అన్నయ్య అని, అత్తను అక్కయ్య అని పిలుస్తున్నారు, వీరేమి
నేర్చుకుంటున్నారు అని అనేస్తారు. ఈ జ్ఞానపు విషయాల గురించైతే మీకే తెలుసు,
ఇంకెవ్వరికీ తెలియవు. మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు అని అంటారు కదా.
ఇప్పుడు మీరు వారి పిల్లలుగా అయ్యారు కావున వారు ఇచ్చే గతి, వారు చూపే మార్గము
గురించి మీకే తెలుసు. ఎక్కడా ఎవ్వరూ తికమకపడకుండా ఉండేందుకు చాలా సంభాళించుకుంటూ
నడుచుకోవలసి ఉంటుంది. అందుకే ప్రదర్శనీలో కూడా పిల్లలైన మీరు మొట్టమొదట ఇది అర్థం
చేయించాలి - మమ్మల్ని చదివిస్తున్నవారు భగవంతుడు అని. ఇప్పుడు వారు ఎవరో చెప్పండి?
నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా? శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి వస్తుంది,
ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా.
ఎప్పటివరకైతే శివ పరమాత్మ రారో, అప్పటివరకు శివజయంతిని జరుపుకోలేరు. ఎప్పటివరకైతే
శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చేయరో, అప్పటివరకు శ్రీకృష్ణ జయంతిని కూడా ఎలా
జరుపుకోగలరు. శ్రీకృష్ణుని జన్మను జరుపుకుంటారు కానీ దాని గురించి అర్థం చేసుకోరు.
శ్రీకృష్ణుడు యువరాజుగా ఉండేవారు, అంటే తప్పకుండా సత్యయుగములో యువరాజుగా ఉంటారని కదా.
దేవీ-దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క శ్రీకృష్ణునికి మాత్రమే రాజ్యాధికారము
లభించి ఉండదు కదా. తప్పకుండా కృష్ణపురి ఉంటుంది కదా. దానిని కృష్ణపురి అని అంటారు
మరియు ఇది కంసపురి. కంసపురి సమాప్తమై మళ్ళీ కృష్ణపురి స్థాపన అయ్యింది కదా. అది
భారత్ లోనే ఉంటుంది. కొత్త ప్రపంచములో కంసుడు మొదలైనవారు ఉండరు. కంసపురి అని
కలియుగాన్ని అంటారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉన్నారో చూడండి. సత్యయుగములో
కొద్దిమందే ఉంటారు. దేవతలు ఏ యుద్ధము చేయలేదు. కృష్ణపురి అనండి లేక విష్ణుపురి అనండి,
దైవీ సాంప్రదాయమనండి, ఆసురీ సాంప్రదాయమనండి, అన్నీ ఇక్కడే ఉంటాయి. అంతేకానీ దేవతలకు
మరియు అసురులకు యుద్ధము జరగలేదు, అలాగే పాండవుల-కౌరవుల యుద్ధము జరగలేదు. మీరు
రావణుడిపై విజయము పొందుతారు. తండ్రి అంటారు, ఈ 5 వికారాలపై విజయము పొందినట్లయితే
మీరు జగత్ జీతులుగా అయిపోతారు, ఇందులో యుద్ధము చేసేది ఏమీ లేదు. యుద్ధము అన్నమాట
తీసుకున్నట్లయితే అది హింస అవుతుంది. రావణుడిపై విజయము పొందాలి కానీ అహింసాయుతముగా
పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మన వికర్మలు వినాశనమవుతాయి. యుద్ధము
మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి అంటారు, మీరు తమోప్రధానముగా అయిపోయారు, ఇప్పుడు
మళ్ళీ మీరు సతోప్రధానముగా అవ్వాలి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది.
తండ్రి అంటారు, నాతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. తండ్రి
పతిత-పావనుడు కావున వారితో బుద్ధియోగాన్ని జోడించాలి, అప్పుడే మీరు పతితము నుండి
పావనముగా అవుతారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు వారితో యోగాన్ని జోడిస్తున్నారు,
ఇందులో యుద్ధము యొక్క విషయమేమీ లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో మరియు తండ్రితో యోగము
జోడిస్తారో, వారే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.