15-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఆత్మలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తారు, మీరు తండ్రి వద్దకు 21 జన్మల కొరకు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకునేందుకు వచ్చారు, మీ జీవితము ఏ విధంగా ఇన్ష్యూర్ అవుతుందంటే, ఇక మీరు అమరులుగా అయిపోతారు’’

ప్రశ్న:-
మనుష్యులు కూడా తమ జీవితాన్ని ఇన్ష్యూర్ చేయించుకుంటారు మరియు పిల్లలైన మీరు కూడా, ఈ రెండింటికీ తేడా ఏమిటి?

జవాబు:-
మనుష్యులు తమ జీవితాన్ని ఏ విధంగా ఇన్ష్యూర్ చేయించుకుంటారంటే, వారు చనిపోతే వారి పరివారము వారికి ధనము లభించేలా ఇన్ష్యూర్ చేసుకంటారు. పిల్లలైన మీరు ఏ విధంగా ఇన్ష్యూర్ చేసుకుంటారంటే, 21 జన్మలు అసలు మేము మరణించనే మరణించకూడదు, అమరులుగా అయిపోవాలి అని. సత్యయుగములో ఇన్ష్యూరెన్స్ కంపెనీలేవీ ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటారు, ఇక ఎప్పుడూ మరణించరు, ఈ సంతోషము ఉండాలి.

పాట:-
ఈ రోజు ఉదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. పిల్లలైన మీకు తెలుసు - తండ్రి మనకు ఇప్పుడు కేవలం 21 జన్మల కొరకే కాదు, 40-50 జన్మల కొరకు ఇన్ష్యూర్ చేస్తున్నారు. వాళ్ళు తాము చనిపోతే తమ పరివారానికి ధనము లభించేలా ఇన్ష్యూర్ చేసుకుంటారు. మీరేమో అసలు 21 జన్మలు మరణించనే మరణించకూడదు అని ఇన్ష్యూర్ చేసుకుంటారు. తండ్రి అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనము కూడా అమరలోకమే, అక్కడ మరణించడము, జీవించడము అనే విషయమే ఉండదు. అది ఆత్మల నివాస స్థానము. ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణను తండ్రి తమ పిల్లలతో చేస్తున్నారు, ఇతరులెవ్వరితోనూ ఇలా ఆత్మిక సంభాషణ చేయరు. ఏ ఆత్మలకైతే స్వయం గురించి తెలుసో, వారితోనే మాట్లాడుతారు. ఇంకెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనీకి ఎంతోమంది వస్తారు, వారు మీ భాషను అర్థం చేసుకుంటారా. ఎవరో కష్టము మీద కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీకు కూడా అర్థం చేయిస్తూ, చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా ఎంత కొద్దిమంది అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఇది క్షణములో అర్థం చేసుకునే విషయము. ఒకప్పుడు పావనముగా ఉన్న ఆత్మలమైన మనమే పతితముగా అయ్యాము, మళ్ళీ మనము పావనముగా అవ్వాలి. దాని కొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారికన్నా మధురముగా ఇంకేదీ ఉండదు. ఈ స్మృతి చేయడములోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. బాబా మనల్ని అమరులుగా తయారుచేయడానికి వచ్చారు అని కూడా మీకు తెలుసు. పురుషార్థము చేసి అమరులుగా అయి అమరపురికి యజమానులుగా అవ్వాలి. అమరులుగానైతే అందరూ అవుతారు. సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు. ఇది మృత్యులోకము. ఇదే అమర కథ, అంతేకానీ కేవలం శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని కాదు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. పిల్లలైన మీరు కేవలం నా ఒక్కరి నుండే వినండి, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. జ్ఞానాన్ని నేనే ఇవ్వగలను. డ్రామా ప్లాన్ అనుసారముగా మొత్తము ప్రపంచమంతా తమోప్రధానముగా అయిపోయింది. అమరపురిలో రాజ్యము చేయడము, దానినే అమర పదవి అని అంటారు. అక్కడ ఇన్షూరెన్స్ కంపెనీలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ మరణించరు. బుద్ధిలో ఈ సంతోషము ఉండాలి. మనము అమరపురికి యజమానులుగా అవుతాము, కావున అమరపురిని స్మృతి చేయవలసి ఉంటుంది. వయా మూలవతనమే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది కూడా మన్మనాభవయే అవుతుంది. మూలవతనము మన్మనాభవ, అమరపురి మధ్యాజీభవ. ప్రతి విషయములోనూ రెండు పదాలే వస్తాయి. మీకు ఎన్ని రకాలుగా అర్థము అర్థం చేయించడం జరుగుతుంది, బుద్ధిలో కూర్చోవాలి అని చెప్పి అలా అర్థం చేయించడం జరుగుతుంది. అన్నింటికన్నా ఎక్కువ శ్రమ ఎందులోనే ఉందంటే - స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. ఆత్మ అయిన మనము ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మలలో భిన్న-భిన్న నామ-రూపాలలో, దేశ-కాలాలలో తిరుగుతూ వచ్చాము. సత్యయుగములో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు... ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మధురమైన తండ్రిని స్మృతి చేయడము. లేస్తూ-కూర్చుంటూ ఈ విషయము బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషము ఉంటుంది. బాబా మళ్ళీ వచ్చారు, వారిని మనము అర్ధకల్పము బట్టి - మీరు రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని తలచుకుంటూ వచ్చాము. పావనమైనవారు మూలవతనములో మరియు అమరపురి అయిన సత్యయుగములో ఉంటారు. భక్తిలో మనుష్యులు - ముక్తిలోకి మరియు కృష్ణపురిలోకి వెళ్ళేందుకని పురుషార్థము చేస్తారు. ముక్తి అనండి లేక నిర్వాణధామము అనండి, వాస్తవానికి వానప్రస్థము అనే పదము సరైనది. వానప్రస్థులు పట్టణాలలోనే ఉంటారు. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్తారు. ఈ రోజుల్లోని వానప్రస్థులలో ఎటువంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మ తత్వాన్ని భగవంతుడు అని అంటారు. వారు బ్రహ్మతత్వాన్ని లోకము అని అనరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఎవరి పునర్జన్మలూ ఆగవు, అందరూ తమ-తమ పాత్రను అభినయిస్తారు. ఈ రావడము-వెళ్ళడము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ సమయములో కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు, అలా ఇంకా వస్తూనే ఉంటారు, పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ అవుతుంది. మూలవతనము ఫస్ట్ ఫ్లోర్, సూక్ష్మవతనము సెకండ్ ఫ్లోర్, ఇది థర్ఢ్ ఫ్లోర్, దీనినే గ్రౌండ్ ఫ్లోర్ అని అనవచ్చు. ఇవి కాకుండా ఇంకే ఫ్లోర్లు లేవు. వాళ్ళు నక్షత్రాలలో కూడా ప్రపంచము ఉందని భావిస్తారు. కానీ అలా ఏమీ లేదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆత్మలు ఉంటాయి. ఇకపోతే మనుష్యుల కొరకు ఈ ప్రపంచము ఉంది.

మీరు అనంతమైన వైరాగ్యము కల పిల్లలు, మీరు ఈ పాత ప్రపంచములో ఉంటూ కూడా, ఈ కళ్ళతో అన్నీ చూస్తూ కూడా చూడకూడదు. ఇదే ముఖ్యమైన పురుషార్థము, ఎందుకంటే ఇవన్నీ అంతమైపోతాయి. అంతేకానీ అసలు ప్రపంచము తయారవ్వనే లేదు అని కాదు. ఈ ప్రపంచము తయారై ఉంది కానీ దీని పట్ల వైరాగ్యము కలుగుతుంది అనగా మొత్తము పాత ప్రపంచమంతటి పట్ల వైరాగ్యము. భక్తి, జ్ఞానము మరియు వైరాగ్యము. భక్తి తర్వాత జ్ఞానము, అప్పుడు భక్తి పట్ల వైరాగ్యము కలుగుతుంది. ఇది పాత ప్రపంచమని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. ఇది మన అంతిమ జన్మ, ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి. తప్పుడు భోజన-పానీయాలు మొదలైనవి అలవాటు చేసుకోకూడదు. చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేసుకుంటే అదే అలవాటైపోతుంది. ఈ రోజుల్లో సాంగత్య దోషము చాలా అశుద్ధముగా ఉంది. సత్సాంగత్యము తీరము చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. ఇది విషయ సాగరము, వేశ్యాలయము. సత్యమైనవారు ఒక్క పరమపిత పరమాత్మయే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, ఓ ఆత్మిక పిల్లలూ, మీ తండ్రినైన నేను మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాను. మీరు నన్ను పిలుస్తారు కదా. వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, కొత్త సృష్టి రచయిత. వారు పాత సృష్టిని వినాశనము చేయిస్తారు. ఈ త్రిమూర్తులు ప్రసిద్ధమైనవారు. ఉన్నతోన్నతమైనవారు శివుడు. అచ్ఛా, తర్వాత సూక్ష్మవతనములో ఉన్నది బ్రహ్మా, విష్ణు, శంకరులు. వారి సాక్షాత్కారము కూడా జరుగుతుంది ఎందుకంటే వారు పవిత్రమైనవారు కదా. వారిని చైతన్యముగా ఈ కళ్ళ ద్వారా చూడలేము. ఎంతో నవవిధ భక్తి చేస్తే చూడగలుగుతారు. ఒకవేళ హనుమంతుని భక్తులు ఎవరైనా ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారము కలుగుతుంది. శివుని భక్తులకు - పరమాత్మ ఒక అఖండ జ్యోతి స్వరూపమని అసత్యము చెప్పారు. తండ్రి అంటారు, నేను ఎంతో చిన్నని బిందువును. కానీ వారు అర్జునుడికి అఖండ జ్యోతి స్వరూపాన్ని చూపించినట్లుగా, దానిని చూసి ఇక చాలు, నేను ఈ ప్రకాశాన్ని సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. అతనికి సాక్షాత్కారము జరిగిందని గీతలో వ్రాసి ఉంది. అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారము కలిగింది అని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ భక్తి మార్గపు విషయాలన్నీ మనసును సంతోషపరిచేటువంటివి. నేను అఖండ జ్యోతి స్వరూపుడిని అని నేను అననే అనను. ఏ విధంగా ఆత్మ అయిన మీరు బిందువులా ఉన్నారో, నేను కూడా అలాగే ఉంటాను. ఏ విధంగా మీరు డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ఆత్మలందరికీ తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. పునర్జన్మలనైతే అందరూ తీసుకోవలసిందే. నంబరువారుగా అందరూ రావలసిందే. మొదటి నంబరువారు మళ్ళీ కిందికి వెళ్తారు. తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. సృష్టి రూపీ చక్రము తిరుగుతూనే ఉంటుంది అని అర్థం చేయించారు. పగలు తర్వాత రాత్రి వచ్చినట్లుగా కలియుగము తర్వాత సత్యయుగము, ఆ తర్వాత త్రేతా... మళ్ళీ సంగమయుగము వస్తుంది. సంగమయుగములోనే తండ్రి పరివర్తన చేస్తారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారే ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. వారే మళ్ళీ సతోప్రధానముగా అవుతారు. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా. కావున ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని అంటారు. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని యథార్థ రీతిగా కొందరు కష్టము మీద అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మన తండ్రి ఎంత మధురమైనవారు. ఆత్మయే మధురమైనది కదా. శరీరమైతే అంతమైపోతుంది, అప్పుడు వారి ఆత్మను పిలుస్తారు. ప్రేమ అనేది ఆత్మ పట్లే ఉంటుంది కదా. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మయే చదువుతుంది, వింటుంది, దేహమైతే నశించిపోతుంది. ‘ఆత్మనైన నేను అమరుడిని, మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు?’ ఇది దేహాభిమానము కదా. మీకు దేహము పట్ల ప్రేమ ఉంది, వాస్తవానికి ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి. అవినాశీ వస్తువు పట్ల ప్రేమ ఉండాలి. వినాశీ వస్తువుల పట్ల ప్రేమ ఉన్న కారణముగానే పరస్పరము గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. సత్యయుగములో దేహీ-అభిమానులుగా ఉంటారు, అందుకే సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. అక్కడ ఏడ్వడము, రోదించడము ఏదీ ఉండదు.

పిల్లలైన మీరు మీ ఆత్మాభిమానీ అవస్థను తయారుచేసుకునేందుకు చాలా అభ్యాసము చేయాలి - నేను ఆత్మను, నా ఆత్మా సోదరునికి తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను, నా సోదరుడు ఈ ఇంద్రియాల ద్వారా వింటాడు, ఇటువంటి అవస్థను తయారుచేసుకోండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి, వారిని కూడా ఆత్మగా భావించండి, అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. ఇది గుప్తమైన కృషి. అంతర్ముఖులుగా అయి ఈ అవస్థను పక్కా చేసుకోవాలి. ఎంత సమయము తీయగలిగితే అంత దీని కోసం ఉపయోగించండి. 8 గంటలైతే వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, నిద్రపోండి కూడా, మిగిలిన సమయాన్ని దీని కోసం ఉపయోగించండి. 8 గంటలు వరకు చేరుకోవాలి, అప్పుడు మీకు ఎంతో సంతోషము ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని పతిత-పావనుడైన తండ్రి చెప్తారు. జ్ఞానము మీకు ఇప్పుడు సంగమములోనే లభిస్తుంది. మహిమ అంతా ఈ సంగమయుగానికే ఉంది, ఈ సమయములోనే తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇందులో స్థూలమైన విషయమేమీ లేదు. ఇప్పుడు మీరు ఏదైతే వ్రాసుకుంటారో, అదంతా అంతమైపోతుంది. పాయింట్లు కూడా నోట్ చేసుకోవటం వలన గుర్తుంటాయి అని వాటిని నోట్ చేసుకోవడం జరుగుతుంది. కొందరి బుద్ధి చురుకుగా ఉంటే వారికి బుద్ధిలోనే గుర్తుంటుంది. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడము. ఎటువంటి వికర్మలు చేయకూడదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. అశుద్ధ ఆలోచనలు గల పిల్లలు ఎలా భావిస్తారంటే - నాకు ఫలానా అమ్మాయి చాలా నచ్చింది, ఆమెను నేను గాంధర్వ వివాహము చేసుకుంటాను. కానీ వాస్తవానికి మిత్ర-సంబంధీకులు మొదలైనవారు బాగా విసిగించినప్పుడు ఆమెను రక్షించేందుకని గాంధర్వ వివాహము చేయిస్తారు. అంతేకానీ అందరూ - నేను గాంధర్వ వివాహము చేసుకుంటాను అని అనడం కాదు, అలాంటివారు ఎప్పుడూ పవిత్రముగా ఉండలేరు. వారు మొట్టమొదటి రోజునే వెళ్ళి బురదలో పడతారు. నామ-రూపాలలో మనసు చిక్కుకుపోతుంది. ఇది చాలా చెడ్డ విషయము. గాంధర్వ వివాహము చేసుకోవడము అంత సులువైన విషయమేమీ కాదు. ఒకరిపై ఒకరు మనసుపడితే గాంధర్వ వివాహము చేసుకుంటాము అని అంటారు, ఇందులో సంబంధీకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పిల్లలు ఎందుకూ పనికిరారు అని అర్థం చేసుకోవాలి. ఎవరిపైనైతే మనసు పడ్డారో, వారి నుండి వీరిని వేరు చేయాలి, లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మున్ముందు చాలా నియమానుసారముగా సభ ఏర్పాటు అవుతుంది. ఇటువంటి ఆలోచనలు కలవారిని సభలోకి రానివ్వరు.

ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరైతే యోగములో ఉంటూ సేవ చేస్తారో, వారే సత్యయుగ రాజధానిని స్థాపన చేయడములో సహయోగులుగా అవుతారు. సర్వీసబుల్ పిల్లలకు తండ్రి ఇస్తున్న డైరెక్షన్ ఏమిటంటే - విశ్రాంతి మీకు నిషిద్ధము. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు-రాణులుగా అవుతారు. ఎవరెవరైతే కష్టపడతారో, తమ సమానముగా తయారుచేస్తారో, వారిలో శక్తి కూడా ఉంటుంది. స్థాపన అయితే డ్రామానుసారముగా జరగవలసిందే. అన్ని పాయింట్లను బాగా ధారణ చేసి సేవలో నిమగ్నమైపోవాలి. విశ్రాంతి కూడా నిషిద్ధము. సేవయే సేవ అన్నట్లు ఉండాలి, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయి మళ్ళీ సేవ చేయడానికి వెళ్ళాలి. మీ సేవ చాలా బాగా వృద్ధి పొందుతుంది. రకరకాల చిత్రాలు వెలువడతాయి, వాటి ద్వారా మనుష్యులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అందులో కూడా ఎవరైతే మన బ్రాహ్మణ కులానికి చెందినవారు ఉంటారో, వారు బాగా అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేవారు బాగుంటే ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో, వారి ముఖము ద్వారానే తెలిసిపోతుంది. బాబా, మేమైతే మీ నుండి పూర్తి వారసత్వము తీసుకుంటాము అని అంటారు, వారి లోపల సంతోషము యొక్క డోలు మోగుతూ ఉంటుంది, సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. రిఫ్రెష్ అయి మళ్ళీ వెంటనే సేవ కొరకు పరిగెడతారు. సేవ చేయడానికి ప్రతి సెంటరు నుండి చాలామంది తయారవ్వాలి. మీ సేవ అయితే చాలా వ్యాపిస్తూ ఉంటుంది. అందరూ మీతో కలుస్తూ ఉంటారు. చివరికి ఏదో ఒక రోజు సన్యాసులు కూడా వస్తారు. ఇప్పుడైతే వారి రాజ్యము నడుస్తుంది. అందరూ వారి కాళ్ళపై పడి వారిని పూజిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇది భూత పూజ. నాకైతే కాళ్ళే లేవు, అందుకే నన్ను పూజించనివ్వను కూడా. నేను ఈ తనువును లోన్ గా తీసుకున్నాను, అందుకే వీరిని భాగ్యశాలి రథము అని అంటారు.

ఈ సమయములో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలులు ఎందుకంటే మీరు ఇక్కడ ఈశ్వరీయ సంతానముగా ఉన్నారు. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు... అని అంటారు, కావున ఎవరైతే చాలా కాలము నుండి వేరుగా ఉన్నారో, వారే వస్తారు, నేను వచ్చి వారినే చదివిస్తాను. శ్రీకృష్ణుడిది ఇది అంతిమ జన్మ, అందుకే ఇతనికే శ్యామసుందరుడు అనే పేరు ఉంది. శివుడు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమ ఆత్మను, పరంధామములో ఉంటాను. మీరు కూడా అక్కడ ఉండేవారే. నేను సుప్రీమ్ ను, పతిత-పావనుడిని. మీరు ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అయ్యారు. ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తున్నాను. సత్యయుగములో భక్తి అనే మాటే ఉండదు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తోంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి మీ అవస్థను తయారుచేసుకోవాలి. అభ్యాసము చేయండి - నేను ఆత్మను, నా సోదర ఆత్మకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను... ఈ విధంగా ఆత్మాభిమానిగా తయారయ్యేందుకు గుప్త కృషి చేయాలి.

2. ఆత్మిక సేవ పట్ల అభిరుచిని ఉంచుకోవాలి. మీ సమానముగా తయారుచేసే కృషి చేయాలి. సాంగత్య దోషము చాలా అశుద్ధమైనది, దాని నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి. తప్పుడు భోజన-పానీయాలను అలవాటు చేసుకోకూడదు.

వరదానము:-
విశ్వ కళ్యాణ కార్యములో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్త భవ

విశ్వ కళ్యాణకారీ పిల్లలు స్వప్నములో కూడా ఫ్రీ గా ఉండలేరు. ఎవరైతే పగలు-రాత్రి సేవలో బిజీగా ఉంటారో, వారికి స్వప్నములో కూడా ఎన్నో కొత్త-కొత్త విషయాలు, సేవా ప్లానులు మరియు పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. వారు సేవలో బిజీగా ఉన్న కారణముగా వారు తమ పురుషార్థములోని వ్యర్థము నుండి మరియు ఇతరుల వ్యర్థము నుండి కూడా సురక్షితముగా ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వ ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొద్దిగా కూడా నిర్లక్ష్యము రాదు. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-
సంగమయుగములోని ఒక్కొక్క క్షణము ఎన్నో సంవత్సరాలతో సమానము, అందుకే నిర్లక్ష్యముతో సమయాన్ని పోగొట్టుకోకండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి కంబైండుగా ఉన్నారో, సర్వ శక్తులు స్వతహాగానే వారితోపాటు ఉంటాయి. ఎక్కడైతే సర్వ శక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటమనేది అసంభవము. లౌకికములో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు. వీరైతే అవినాశీ సహచరుడు. ఈ సహచరుడు ఎప్పుడూ మోసము చేయరు. వీరు సదా తోడుగా ఉండే సహచరుడు, అందుకే సదా వీరితో కలిసే ఉండండి.