15-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.11.2005


‘‘సమయము యొక్క సమీపత అనుసారముగా స్వయాన్ని హద్దు బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని సంపన్నముగా మరియు సమానముగా అవ్వండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న సంపూర్ణులైన సమానులైన పిల్లలను చూస్తున్నారు. సమానులైన పిల్లలే బాబా హృదయములో ఇమిడి ఉన్నారు. సమానులైన పిల్లల విశేషత ఏమిటంటే - వారు సదా నిర్విఘ్నముగా, నిర్వికల్పముగా, నిర్మానచిత్తముగా మరియు నిర్మలముగా ఉంటారు. ఇటువంటి ఆత్మలు సదా స్వతంత్రులుగా ఉంటారు, ఏ రకమైన హద్దు బంధనాలలో బంధించబడి ఉండరు. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఇటువంటి అనంతమైన స్వతంత్ర ఆత్మగా అయ్యారా! అన్నింటికన్నా మొదటి స్వతంత్రత - దేహభానము నుండి స్వతంత్రత. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని ఆధారముగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహము నుండి అతీతముగా అవ్వాలి. దేహము యొక్క ఆకర్షణలోకి రాకూడదు. రెండవ విషయమేమిటంటే - స్వతంత్ర ఆత్మ ఎటువంటి పాత స్వభావ, సంస్కారాల బంధనాలలో ఉండరు, వారు పాత స్వభావ-సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు. అంతేకాక ఏ దేహధారీ ఆత్మ యొక్క సంబంధ-సంపర్కములో ఆకర్షితులవ్వరు. సంబంధ-సంపర్కములోకి వస్తూ అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు. కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి - ఏ చిన్న కర్మేంద్రియమైనా బంధనములో బంధించటం లేదు కదా. మీ స్వమానాలను గుర్తు చేసుకోండి - మాస్టర్ సర్వశక్తివంతులు, త్రికాలదర్శి, త్రినేత్రి, స్వదర్శన చక్రధారి... ఈ స్వమానాల ఆధారముగా సర్వశక్తివంతుని పిల్లలను ఏ కర్మేంద్రియమైనా ఆకర్షితము చెయ్యగలదా? ఎందుకంటే సమయము యొక్క సమీపతను చూస్తూ మిమ్మల్ని మీరు చూసుకోండి - క్షణములో సర్వ బంధనాల నుండి ముక్తులవ్వగలరా? ఇటువంటి బంధనము ఏదీ ఉండిపోలేదు కదా? ఎందుకంటే అంతిమ పరీక్షలో నంబర్ వన్ అయ్యేందుకు ప్రత్యక్ష ప్రమాణము - మనసు, బుద్ధిని క్షణములో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పెట్టాలనుకున్నప్పుడు, అక్కడ క్షణములో అవి లగ్నమైపోవాలి, అలజడిలోకి రాకూడదు. ఎలా అయితే స్థూల శరీరము ద్వారా ఎక్కడకు వెళ్ళాలనుకుంటే అక్కడకు వెళ్ళగలరో, అలాగే బుద్ధి ద్వారా ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితులవ్వగలరా? ఏ విధంగా సైన్స్ వారు లైట్ హౌస్, మైట్ హౌస్ ను తయారుచేసారు, ఒక్క క్షణములో స్విచ్ ఆన్ చెయ్యటంతో లైట్ హౌస్ నలువైపులా లైట్ ఇవ్వటం మొదలుపెడుతుంది, మైట్ ఇవ్వటం మొదలుపెడుతుంది. అలాగే మీరు స్మృతి యొక్క సంకల్పము అనే స్విచ్ ను ఆన్ చెయ్యటంతో లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయ్యి ఆత్మలకు లైట్, మైట్ ను ఇవ్వగలరా? ఒక్క క్షణములో అశరీరిగా అవ్వండి అని ఆర్డర్ వస్తే, అప్పుడు అశరీరిగా అయిపోతారు కదా! లేక యుద్ధము చెయ్యాల్సి వస్తుందా? ఈ బహుకాలపు అభ్యాసమే అంతిమములో సహయోగిగా అవుతుంది. ఒకవేళ బహుకాలపు అభ్యాసము లేకపోతే ఆ సమయములో అశరీరిగా అవ్వటానికి కష్టపడాల్సి వస్తుంది, అందుకే బాప్ దాదా ఇదే సూచన ఇస్తున్నారు - మొత్తము రోజంతటిలో పనులు చేస్తూ కూడా పదే-పదే ఈ అభ్యాసము చేస్తూ ఉండండి. దీని కొరకు మనసు యొక్క కంట్రోలింగ్ పవర్ (నియంత్రణ శక్తి) యొక్క అవసరము ఉంది. ఒకవేళ మనసు కంట్రోల్ లోకి వచ్చినట్లయితే ఇక ఏ కర్మేంద్రియము కూడా వశీభూతము చేసుకోలేదు.

ఇప్పుడు సర్వాత్మలకు మీ ద్వారా శక్తి యొక్క వరదానము కావాలి. ఆత్మలకు మాస్టర్ సర్వ శక్తివాన్ ఆత్మలైన మీ పట్ల ఉన్న శుభమైన కోరిక ఇదే - ఏ కష్టము లేకుండా వరదానము ద్వారా, దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా మమ్మల్ని ముక్తులుగా చెయ్యండి. కష్టపడి, కష్టపడి ఇప్పుడు అందరూ అలసిపోయారు. మీరందరూ అయితే శ్రమపడటము నుండి ముక్తులైపోయారు కదా! లేక ఇప్పుడు కూడా శ్రమించాల్సి వస్తుందా? ఇంతకుముందు వినిపించాము కదా - శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సహజ సాధనము ఏమిటంటే - మనస్ఫూర్తిగా బాబాకు అతి స్నేహీలుగా అవ్వటము. బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఈ జన్మ లభించటంతోనే ప్రతిజ్ఞ చేసారు... ప్రతిజ్ఞ గుర్తుందా? బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నప్పుడు, బ్రాహ్మణ జీవితము ఇచ్చినప్పుడు, మరి బ్రాహ్మణ జీవితానికి సంబంధించి మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. గుర్తుందా ప్రతిజ్ఞ? గుర్తుంటే తల ఊపండి. అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. పక్కాగా గుర్తుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా? చూడండి, 63 జన్మలైతే మర్చిపోయేవారిగా అయ్యారు, ఇప్పుడు ఈ ఒక్క జన్మ స్మృతి స్వరూపులుగా అయ్యారు. మరి బాబా పిల్లలను అడుగుతున్నారు - చిన్ననాటి ప్రతిజ్ఞ గుర్తుందా? ఎంత సహజం చేసి ఇచ్చారు - ఒక్క బాబాలోనే ప్రపంచమంతా ఉంది, ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు ఉన్నాయి, ఒక్క బాబా ద్వారానే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. చదివించేవారు కూడా ఒక్కరే మరియు పాలన చేసేవారు కూడా ఒక్కరే. అన్నింటిలోనూ ఒక్కరే. పరివారము ఉన్నా కూడా ఈశ్వరీయ పరివారము, ఈ పరివారము కూడా ఒక్క తండ్రికి చెందిన పరివారమే. వేరు-వేరు తండ్రుల పరివారము కాదు. ఒక్కటే పరివారము. పరివారములో కూడా ఒకరి పట్ల ఒకరికి ఆత్మిక స్నేహము ఉంది, కేవలము స్నేహము కాదు, ఆత్మిక స్నేహము. జన్మ లభించటంతోనే చేసిన ప్రతిజ్ఞలను బాప్ దాదా గుర్తు తెప్పిస్తున్నారు. ఇంకేమి ప్రతిజ్ఞలు చేసారు? అందరూ చాలా ఉల్లాస-ఉత్సాహాలతో బాబా ఎదురుగా మనస్ఫూర్తిగా అన్నారు - సర్వస్వము మీదే, తనువు-మనసు-ధనము అన్నీ మీవే. కనుక బాబాకు ఇచ్చేసిన వస్తువులను కార్యములో ఉపయోగించేందుకని బాబా తాకట్టు రూపములో మీకు ఇచ్చారు. మీరు బాబాకు ఇచ్చేసారు, ఇచ్చేసారు కదా? లేక కొద్ది-కొద్దిగా తిరిగి తీసుకుంటారా? తిరిగి తీసుకుంటే తాకట్టు పెట్టినవాటిలో మోసం జరిగిపోతుంది. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఆ సమయములో కొంతమంది పిల్లలు - నా మనసు ఆందోళనగా ఉంది అని అంటుంటారు. కానీ ‘నా మనసు’ అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది అన్నదానిని నీకు అర్పించేసినప్పుడు, ఇక నా మనసు అనేది ఎక్కడి నుండి వచ్చింది? మీరందరూ అయితే చిల్లిగవ్వ లేకుండా చక్రవర్తులైపోయారు, ఇప్పుడు మీదంటూ ఏమీ లేదు, చిల్లిగవ్వ కూడా లేనివారైపోయారు కానీ చక్రవర్తులైపోయారు. ఎందుకని చక్రవర్తులయ్యారు? బాబా ఖజానా మీ ఖజానాగా అయిపోయింది, కనుక చక్రవర్తులైపోయారు కదా! పరమాత్మ ఖజానా అంటే అది పిల్లల ఖజానా. కనుక బాప్ దాదా ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. ‘నీది’ అన్నదానిని మళ్లీ ‘నాది’ అని అనకండి. బాబా అంటారు, బాబా మిమ్మల్నందరినీ పరమాత్మ ఖజానాలతో సుసంపన్నులుగా చేసారు, ఆ బాధ్యత బాబా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏ మాటలలో చెప్పారు? మీరు నన్ను గుర్తు చెయ్యండి, అప్పుడు సర్వ ప్రాప్తులకు అధికారులుగా అయిపోతారు, కేవలము గుర్తు చెయ్యండి అంతే. మీరు అన్నారు - మేము మీ వారిమి, మీరు మావారు. ఈ ప్రతిజ్ఞ చేసారు కదా! బాబా అంటారు, ఖజానాలను సదా స్వయము కోసము మరియు సర్వాత్మల కోసము కార్యములో వినియోగించండి. ఎంతగా కార్యములో వినియోగిస్తారో, అంతగానే ఖజానా పెరుగుతూ ఉంటుంది. సర్వ శక్తుల ఖజానా ఉంది, సర్వ శక్తులను కార్యములో వినియోగించండి. నేను సర్వశక్తివంతుడిని అన్న జ్ఞానాన్ని కేవలము బుద్ధిలోనే పెట్టుకోవడం కాదు, కానీ సర్వ శక్తులను సమయమనుసారముగా కార్యములో పెట్టండి మరియు సేవలో పెట్టండి.

బాప్ దాదా మెజారిటీ పిల్లల లెక్కాపత్రాన్ని చూసారు. రెండు శక్తులు ఒకవేళ సదా గుర్తున్నట్లయితే మరియు వాటిని అవసరమైన సమయములో కార్యములో వినియోగించినట్లయితే ఇక సదా నిర్విఘ్నముగా ఉంటారు. మీ ఎదురుగా వచ్చేందుకు విఘ్నానికి శక్తే ఉండదు. ఇది బాబా ఇస్తున్న గ్యారంటీ. మామూలుగా అయితే అన్ని శక్తులూ కావాలి, కానీ మెజారిటీ చూసినట్లయితే సహన శక్తి మరియు రియలైజేషన్ శక్తి, వీటిని రియలైజ్ అవుతారు కూడా, కానీ వీటిని ప్రాక్టికల్ లో స్వరూపములోకి తీసుకురావటంలో అటెన్షన్ తక్కువగా ఉంది. అందుకే ఏ సమయములో రియలైజ్ అవుతారో, ఆ సమయములో నడవడిక, ముఖము మారిపోతాయి, చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలలోకి వస్తారు. అవును, రియలైజ్ అయ్యాము అని అనుకుంటారు, కానీ తర్వాత ఏమవుతుంది? అందరూ అనుభవజ్ఞులే కదా! తర్వాత ఏమైపోతుంది? వాటిని ప్రతి సమయము స్వరూపములోకి తీసుకురావటములో లోటు ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ స్వరూపులుగా అవ్వాలి. కేవలం బుద్ధి ద్వారా తెలుసుకోవటము వేరే విషయము, కానీ వాటిని స్వరూపములోకి తీసుకురావటము అవసరము. అప్పుడప్పుడు బాప్ దాదాకు కొంతమంది పిల్లలపై దయ కూడా కలుగుతుంది. పిల్లలు కష్టపడలేకపోతున్నారు కనుక పిల్లలకు బదులుగా నేనే చేసేద్దాము అని బాబా అనుకుంటారు. కానీ డ్రామా రహస్యము ఏమిటంటే - ‘‘ఎవరు చేస్తే వారే పొందుతారు’’, అందుకే బాప్ దాదా సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు, కానీ ఇక పిల్లలే చెయ్యాల్సి వస్తుంది.

బాప్ దాదా చూసారు - పిల్లలు చాలా మంచి-మంచి సంకల్పాలు చేస్తారు. అమృతవేళ బాప్ దాదా వద్దకు - ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము... అని చాలా మంచి-మంచి సంకల్పాలతో కూడిన మాలలు చాలా-చాలా వస్తుంటాయి. వాహ్ పిల్లలూ, వాహ్ అని బాప్ దాదా కూడా సంతోషిస్తారు. మరి ఇవి చెయ్యటంలో ఎందుకని బలహీనులుగా అవుతారు? దీనికి కారణము గమనించటం జరిగింది - బ్రాహ్మణ పరివారములో సంగఠన యొక్క వాయుమండలము. అక్కడక్కడ వాయుమండలము బలహీనముగా కూడా ఉంటుంది, దాని ప్రభావము త్వరగా పడుతుంది. అప్పుడు వారి భాష ఎలా ఉంటుందో చెప్పమంటారా? భాష చాలా మధురముగా ఉంటుంది. ఆ భాష ఎలా ఉంటుందంటే - ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది... అని అంటారు. అటువంటి సమయములో ఏ సంకల్పము చెయ్యాలి! ఇది జరుగుతుంది, ఇది నడుస్తుంది... అనుకుంటే ఈ మాటలు నిర్లక్ష్యాన్ని తీసుకువస్తాయి, అందుకే ఆ సమయములో ఇటువంటి భాషను పరివర్తన చెయ్యండి మరియు ఆలోచించండి - బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? బాబాకు ఏమి ఇష్టము? బాబా ఏ విషయాన్ని ఇష్టపడతారు? బాబా ఇలా అన్నారా? ఇలా చేసారా? ఒకవేళ బాబా గుర్తుకు వచ్చారంటే నిర్లక్ష్యము సమాప్తమై, ఉల్లాస-ఉత్సాహాలు వచ్చేస్తాయి. నిర్లక్ష్యము కూడా అనేక రకాలుగా వస్తుంది. మీరు పరస్పరంలో క్లాస్ చేసుకోండి మరియు లిస్ట్ తయారుచెయ్యండి - ఒకటేమో సాధారణ నిర్లక్ష్యము, ఇంకొకటి రాయల్ నిర్లక్ష్యము. నిర్లక్ష్యము అనేది సంకల్పములో దృఢతను తీసుకురానివ్వదు కానీ దృఢతయే సఫలతకు సాధనము. అందుకే సంకల్పము వరకే ఉండిపోతుంది, స్వరూపములోకి రారు.

మరి ఈ రోజు ఏం విన్నారు? ప్రతిజ్ఞను గుర్తు తెప్పించారు కదా! ప్రతిజ్ఞలు ఎంతో మంచి-మంచివి చేస్తారు, బాప్ దాదా ఆ ప్రతిజ్ఞలను విని సంతోషపడతారు. కానీ ఎన్ని ప్రతిజ్ఞలనైతే చేస్తున్నారో, అంతగా వాటి నుండి లాభాన్ని పొందటం లేదు. కనుక బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. బాబా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని అడుగుతుంటారు కదా? బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయం కంటే ముందే అందరూ ఎవర్రెడీగా అవ్వండి. సమయము మీకు మాస్టర్ గా అవ్వకూడదు. సమయానికి మీరు మాస్టర్లు, అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - సమయము కంటే ముందే సంపన్నముగా అయ్యి విశ్వమనే స్టేజ్ పై బాబాతోపాటు పిల్లలైన మీరు కూడా ప్రత్యక్షమవ్వాలి. అచ్ఛా!

మిలనము చేసుకునేందుకు కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. చేతులు బాగా పైకి ఎత్తండి, పొడవుగా ఎత్తండి. అచ్ఛా - భాగ్యవంతులైన పిల్లలు తమ భాగ్యాన్ని తీసుకునేందుకు చేరుకున్నారు అని బాప్ దాదా కొత్త-కొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు, అందుకే అభినందనలు, అభినందనలు. ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరెవరైతే వచ్చారో, వారిలో ఎవరు అద్భుతము చేసి చూపిస్తారో చూస్తాము. వెనక వచ్చినా కానీ ముందుకు వెళ్ళి చూపించండి. బాప్ దాదా వద్దకైతే రిజల్టు అంతా చేరుకుంటుంది. అచ్ఛా!

డబుల్ విదేశీయులు:- అచ్ఛా, డబుల్ విదేశీయులు స్వయముపై మరియు సేవపై మంచి అటెన్షన్ పెడుతున్నారు. కానీ ఇందులో కేవలము ఒక చిహ్నాన్ని పెట్టాలి, అండర్ లైన్ చెయ్యాలి, పరివర్తనకు సంబంధించి ఏ సంకల్పాన్ని అయితే తీసుకుంటారో, దానిని మంచి ఉల్లాస-ఉత్సాహాలతో మరియు ధైర్యముతో తీసుకుంటారు, కేవలము దానిని అండర్ లైన్ చేస్తూ వెళ్ళండి - చెయ్యాల్సిందే, మారాల్సిందే. మారి విశ్వాన్ని మార్చాలి. ఇలా దృఢతతో పదే-పదే అండర్ లైన్ చేస్తూ వెళ్ళండి. ఇకపోతే బాప్ దాదా సంతోషిస్తున్నారు ఎందుకంటే వృద్ధిని కూడా చేస్తున్నారు మరియు సేవ మరియు స్వయముపై అటెన్షన్ కూడా ఉంది. కానీ పూర్తి టెన్షన్ పోలేదు, అటెన్షన్ ఉంది, మధ్యమధ్యలో కాస్త టెన్షన్ కూడా ఉంటుంది, దానిని సమాప్తము చేయవలసిందే. ఇకపోతే ధైర్యము బాగుంది, ధైర్యము ఉంచినందుకు అభినందనలు, ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో బాబా సహితముగా వారందరూ మీ ధైర్యానికి అభినందనలను ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి. అచ్ఛా!

మీరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారు కానీ బాప్ దాదాకు దూరములో కూర్చుని ఉన్న చాలామంది పిల్లల నుండి ప్రియస్మృతులు లభించాయి మరియు బాప్ దాదా ఒక్కొక్క బిడ్డను తమ నయనాలలో ఇముడ్చుకుని చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. భారత్ నుండి కావచ్చు, విదేశాల నుండి కావచ్చు, చాలామంది పిల్లల స్మృతులు చేరుకుంటున్నాయి. ఉత్తరాలు వస్తాయి, ఈ-మెయిల్స్ వస్తాయి, అవన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. అచ్ఛా!

బాప్ దాదా ఒక్క క్షణములో అశరీరి భవ యొక్క డ్రిల్ ను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ అంతిమములో పాస్ అవ్వాలంటే ఈ డ్రిల్ చాలా అవసరము, అందుకే ఇప్పుడు ఇంత పెద్ద సంగఠనలో కూర్చుని ఒక్క క్షణములో దేహభానము నుండి అతీతమైన స్థితిలో స్థితులవ్వండి. ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు. (డ్రిల్). అచ్ఛా!

నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థీ పిల్లలు, సదా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క సేవలో తత్పరులై ఉండే విశేష ఆత్మలు, సదా బ్రహ్మాబాబా సమానముగా కర్మయోగీలు, కర్మ మరియు కర్మేంద్రియాల ఆకర్షణ నుండి ముక్తులయ్యే ఆత్మలు, సదా దృఢతను ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వరూపములోకి తీసుకువచ్చే బాబాకు సమీపమైన మరియు సమానులైన పిల్లలు, బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు హృదయపూర్వకమైన ప్రియస్మృతులను స్వీకరించండి మరియు నమస్తే.

దాదీజీతో:- ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు అనారోగ్యము దూరమైపోయింది. అనారోగ్యాలు మహారథుల నుండి వీడ్కోలు తీసుకోవటానికి వస్తాయి. లోలోపలే కర్మాతీతముగా అయ్యే రిహార్సల్స్ చేస్తున్నారు. (దాదీజీ నిశ్చింత చక్రవర్తి అని జానకి దాది అన్నారు).

బాబా అంటున్నారు, మీకు ఏమైనా చింత ఉందా? మీరు కూడా నిశ్చింతులే. ఇరువురూ మంచి పాత్రను పోషిస్తున్నారు. చూడండి, అన్నింటికన్నా అతి పెద్దదైన బాధ్యతా కిరీటాన్ని ధరించేందుకు నిమిత్తము అయ్యారు కదా! వీరందరూ సహచరులు. మిమ్మల్ని చూస్తే ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి కదా. (ఇప్పుడు కొత్తగా ఏం చెయ్యాలి? బాబానే ప్రేరణ ఇవ్వాలి). బాప్ దాదా వినిపించారు కదా - ప్రతి వర్గానికి చెందిన పుష్పగుచ్ఛము రావాలి, వారు మైక్ గానూ ఉండాలి మరియు మైట్ గానూ ఉండాలి. కేవలము మైక్ గా ఉంటూ సంపర్కములో ఉండటమే కాదు, సంబంధములో కూడా సమీపముగా ఉండాలి, అటువంటి పుష్పగుచ్ఛాన్ని తయారుచెయ్యండి. అప్పుడు ఆ గ్రూప్ సేవ చేయడానికి నిమిత్తము అవుతారు. వారు మైక్ అవుతారు మరియు మీరు మైట్ అవుతారు. వారి హృదయములో నుండి ఎంతో ప్రేమతో బాబా అని వెలువడాలి, అప్పుడే ప్రభావము పడుతుంది. వారిని సంబంధములో సమీపముగా తీసుకురండి. అప్పుడప్పుడే వస్తుంటారు కదా, అందుకని నషా కాస్త తగ్గిపోతుంటుంది. ఎక్కడ సంబంధ-సంపర్కములోకి వచ్చినా, అక్కడ ఆ సంబంధము మరియు సంపర్కము ఉన్నట్లయితే బాగైపోతారు. అచ్ఛా!

వరదానము:-
సదా శ్రేష్ఠమైన మరియు కొత్త రకమైన సేవల ద్వారా వృద్ధిని చేసే సహజ సేవాధారీ భవ

సంకల్పాల ద్వారా ఈశ్వరీయ సేవను చెయ్యటము, ఇది కూడా సేవ యొక్క శ్రేష్ఠమైన మరియు కొత్తదైన పద్ధతి. ఏ విధంగా వజ్రాల వ్యాపారి ప్రతి రోజూ ఉదయము తన ఒక్కొక్క రత్నాన్ని - స్వచ్ఛముగా ఉందా, మెరుపు సరిగ్గా ఉందా, సరైన స్థానములో ఉందా... అని చెక్ చేస్తారో, అలా ప్రతి రోజూ అమృతవేళ మీ సంపర్కములోకి వచ్చే ఆత్మల వైపుకు సంకల్పము ద్వారా దృష్టిని సారించండి, ఎంతగా మీరు వారిని సంకల్పాల ద్వారా గుర్తు చేస్తారో, అంతగా ఆ సంకల్పము వారి వద్దకు చేరుకుంటుంది... ఈ విధంగా సేవ యొక్క కొత్త పద్ధతులను అలవరచుకుంటూ వృద్ధి చేస్తూ వెళ్ళండి. మీ సహజయోగపు సూక్ష్మ శక్తి ఆత్మలను మీ వైపుకు స్వతహాగానే ఆకర్షితము చేస్తుంది.

స్లోగన్:-
సాకులు చెప్పే ఆటను మర్జ్ చెయ్యండి మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చెయ్యండి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

జ్ఞానాన్ని మననము చేయడముతోపాటు శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలు చేయటానికి, సకాష్ ను ఇచ్చే అభ్యాసము చేయటానికి, ఈ విధంగా మనసు యొక్క మౌనము పెట్టుకోవటానికి మరియు ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యటానికి, మధ్యమధ్యలో ఒక రోజును ఫిక్స్ చేసుకోండి. ఎంతగా అంతర్ముఖత అనే గదిలో కూర్చుని రీసర్చ్ చేస్తారో, అంతగా చాలా మంచి టచింగ్ లభిస్తుంది మరియు ఆ టచింగ్తోనే అనేకాత్మలకు లాభము కలుగుతుంది.

సూచన:- ఈ రోజు అంతర్జాతీయ యోగ దివసము, మూడవ ఆదివారము, సాయంకాలము 6.30 నుండి 7.30 గం. వరకు సోదర-సోదరీలందరూ సంగఠిత రూపములో ఒక చోట కలిసి యోగాభ్యాసములో ఇలా అనుభవము చేయండి - నేను భృకుటి ఆసనముపై విరాజమానమై ఉన్న, పరమాత్మ శక్తులతో సంపన్నముగా ఉన్న సర్వ శ్రేష్ఠ రాజయోగీ ఆత్మను, కర్మేంద్రియజీతుడిని, వికర్మాజీతుడిని. మొత్తము కల్పములో హీరో పాత్రను అభినయించే నేను సర్వ శ్రేష్ఠ మహానాత్మను అని మొత్తము రోజంతా ఈ స్వమానములోనే ఉండండి.