ఓంశాంతి
డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రే వచ్చి రావణుడి
జైలు నుండి విడిపిస్తారు ఎందుకంటే అందరూ క్రిమినల్, పాపాత్ములుగా ఉన్నారు. మొత్తం
ప్రపంచంలోని మనుష్యమాత్రులంతా క్రిమినల్ గా ఉన్న కారణముగా రావణుని జైలులో ఉన్నారు.
మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భ జైలులోకి వెళ్తారు. తండ్రి
వచ్చి రెండు జైళ్ళ నుండి విడిపిస్తారు, అప్పుడిక మీరు అర్ధకల్పం రావణుని జైలులోకి
వెళ్ళరు, అలాగే గర్భ జైలులోకి వెళ్ళరు. తండ్రి మెల్లమెల్లగా, పురుషార్థానుసారముగా
మనల్ని రావణుని జైలు నుండి మరియు గర్భ జైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు.
తండ్రి చెప్తున్నారు - మీరందరూ రావణ రాజ్యంలో క్రిమినల్ గా ఉన్నారు, రామ రాజ్యంలో
అందరూ నిర్వికారిగా, సభ్యత కలవారిగా అవుతారు. అక్కడ ఏ భూతమూ ప్రవేశించదు. దేహ
అహంకారము రావడంతోనే ఇక ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు
పురుషార్థము చేసి దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇలా (లక్ష్మీ-నారాయణులుగా)
తయారవుతారో, అప్పుడే దేవతలుగా పిలవబడతారు. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలవబడతారు.
రావణుడి జైలు నుండి విడిపించడానికి తండ్రి వచ్చి చదివిస్తారు కూడా మరియు అందరి
క్యారెక్టర్లు ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా. అర్ధకల్పం
నుండి క్యారెక్టర్లు పాడవుతూ, పాడవుతూ ఎంతగానో పాడైపోయాయి. ఈ సమయంలో తమోప్రధానమైన
క్యారెక్టర్లు ఉన్నాయి. దైవీ మరియు అసురీ క్యారెక్టర్లలో తప్పకుండా రాత్రికి, పగలుకు
ఉన్నంత తేడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు పురుషార్థము చేసి మీ దైవీ
క్యారెక్టర్లను తయారుచేసుకోవాలి, అప్పుడే ఆసురీ క్యారెక్టర్ల నుండి విముక్తులవుతూ
ఉంటారు. ఆసురీ క్యారెక్టర్లలో దేహాభిమానం మొట్టమొదటిది. దేహీ-అభిమానుల యొక్క
క్యారెక్టర్లు ఎప్పుడూ పాడవ్వవు. మొత్తం ఆధారమంతా క్యారెక్టర్ పైనే ఉంది. దేవతల
క్యారెక్టర్ ఎలా పాడవుతుంది. ఎప్పుడైతే వారు వామమార్గంలోకి వెళ్తారో అనగా వికారులుగా
అవుతారో అప్పుడు క్యారెక్టర్ పాడవుతుంది. జగన్నాథ మందిరంలో ఇటువంటి వామ మార్గపు
చిత్రాలను చూపించారు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరము, వారి వస్త్రాలు
మొదలైనవి దేవతలవే. దేవతలు వామమార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు. మొట్టమొదటి
అశుద్ధత ఇదే. కామచితి పైకి ఎక్కుతారు, మళ్ళీ రంగు మారుతూ, మారుతూ పూర్తిగా నల్లగా
అయిపోతారు. మొట్టమొదట స్వర్ణయుగములో సంపూర్ణముగా తెల్లనివారు ఉంటారు, ఆ తర్వాత రెండు
కళలు తగ్గిపోతాయి. త్రేతాను స్వర్గము అని అనరు, అది సెమీ స్వర్గము. రావణుడు
రావడంతోనే మీపై తుప్పు చేరడం మొదలయ్యింది. పూర్తి క్రిమినల్ గా అంతిమంలో అవుతారు.
ఇప్పుడు 100 శాతం క్రిమినల్ అని అంటారు. 100 శాతం నిర్వికారులుగా ఉండేవారు, మళ్ళీ
100 శాతం వికారులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - బాగవ్వండి, ఈ రావణుడి
జైలు చాలా పెద్దది. అందరినీ క్రిమినల్ అనే అంటారు, ఎందుకంటే రావణరాజ్యంలో ఉన్నారు
కదా. రామరాజ్యం మరియు రావణరాజ్యం గురించి వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు మీరు
రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ
అవ్వలేదు. కొందరు ఫస్ట్, కొందరు సెకండ్, కొందరు థర్డ్ లో ఉన్నారు. ఇప్పుడు తండ్రి
చదివిస్తారు, దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది. ఎంతెంతగా
మీరు సేవలో నిమగ్నమై ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది. సేవ చేయడం ద్వారానే
దేహాభిమానం తగ్గుతుంది. దేహీ-అభిమానులు పెద్ద-పెద్ద సేవలు చేస్తారు. బాబా
దేహీ-అభిమాని, కావున వారు ఎంత మంచి సేవను చేస్తారు. అందరినీ క్రిమినల్ రావణుని
యొక్క జైలు నుండి విడిపించి సద్గతిని ప్రాప్తింపజేయిస్తారు, అక్కడిక రెండు జైళ్ళూ
ఉండవు. ఇక్కడ డబుల్ జైలు ఉంది, సత్యయుగములో కోర్టులూ ఉండవు, పాపాత్ములూ ఉండరు, అలాగే
రావణుని జైలు ఉండదు. రావణునిది అనంతమైన జైలు. అందరూ పంచ వికారాల రూపీ తాళ్ళతో
బంధింపబడి ఉన్నారు. అపారమైన దుఃఖము ఉంది. రోజురోజుకు దుఃఖము వృద్ధి చెందుతూ ఉంటుంది.
సత్యయుగాన్ని స్వర్ణిమయుగము అంటారు, త్రేతాను వెండియుగము అంటారు. సత్యయుగములోని
సుఖము త్రేతాలో ఉండదు ఎందుకంటే ఆత్మలోని రెండు కళలు తగ్గిపోతాయి. ఆత్మలోని కళలు
తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలానే అయిపోతాయి, కావున ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి -
మేము తప్పకుండా రావణుని రాజ్యంలో దేహాభిమానులుగా అయిపోయాము అని. ఇప్పుడు తండ్రి
రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చారు. అర్ధకల్పపు దేహాభిమానం తొలగడానికి
సమయమైతే పడుతుంది. ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి
వెళ్ళిపోయారో వారు మళ్ళీ పెద్దయ్యాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు. ఎంతగా ఆలస్యం
అవుతూ ఉంటుందో అంతగా పురుషార్థాన్ని చేయలేకపోతారు. ఎవరైనా మరణిస్తే, వారు మళ్ళీ
వచ్చి పురుషార్థం చేయాలంటే, ఇంద్రియాలు పెద్దయ్యాక, కాస్త తెలివైనవారిగా అయ్యాకే ఏదో
ఒకటి చేయగలరు. ఆలస్యంగా వెళ్ళేవారైతే ఏమీ నేర్చుకోలేకపోతారు. ఎంతైతే నేర్చుకున్నారో
అంతే నేర్చుకున్నట్లు, అందుకే మరణించడానికి ముందే పురుషార్థము చేయాలి, వారు ఎంత
వీలైతే అంత ఇటువైపుకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇటువంటి పరిస్థితిలో
ఎంతోమంది వస్తారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వివరణ అయితే ఎంతో సహజముగా ఉంది.
బాంబేలో తండ్రి పరిచయాన్ని ఇవ్వడానికి చాలా మంచి అవకాశము ఉంది - వీరు మనందరికీ
తండ్రి, తండ్రి వారసత్వమైతే తప్పకుండా స్వర్గముదే కావాలి. ఇది ఎంత సహజము. మమ్మల్ని
చదివించేవారు వీరు అని హృదయం లోలోపల పులకరించిపోవాలి. ఇది మన లక్ష్యము-ఉద్దేశ్యము.
మనము మొదట సద్గతిలో ఉండేవారము, ఆ తర్వాత దుర్గతిలోకి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ దుర్గతి
నుండి సద్గతిలోకి వెళ్ళాలి. శివబాబా చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి.
ఎప్పుడైతే ద్వాపరములో రావణ రాజ్యం ఉంటుందో అప్పుడు పంచ వికారాల రూపీ రావణుడు
సర్వవ్యాపి అయిపోతాడు అని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపియై
ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మనుష్యులందరూ పాపాత్ములే కదా. తండ్రి
సమ్ముఖముగా ఉన్నారు కావుననే ఈ విధంగా చెప్తున్నారు - నేను అసలు అలా అననే లేదు,
దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా తప్పుగా అర్థం చేసుకుంటూ, వికారాలలోకి
పడిపోతూ-పడిపోతూ, నిందిస్తూ-నిందిస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది. 5000
సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేదని, అందరూ సతోప్రధానముగా ఉండేవారని
క్రిస్టియన్లకు కూడా తెలుసు. భారతవాసులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు ఎందుకంటే
తమోప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. క్రిస్టియన్లు అంత ఉన్నతముగానూ అవ్వరు, అలాగే
అంత నీచముగానూ అవ్వరు. వారు తప్పకుండా స్వర్గము ఉండేది అని భావిస్తారు. తండ్రి
అంటారు - వారు సరిగ్గా చెప్పారు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన
మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ విడిపించడానికి
వచ్చాను. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణరాజ్యము. పిల్లలకు అవకాశం
దొరికినట్లయితే అర్థం చేయించాలి.
బాబా కూడా పిల్లలైన మీకు - పిల్లలూ, ఈ-ఈ విధంగా అర్థం చేయించండి అని అర్థం
చేయిస్తారు. ఇంతటి అపారమైన దుఃఖము ఎందుకు కలిగింది? మొదట ఎప్పుడైతే ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేదో అప్పుడు అపారమైన సుఖము ఉండేది. వీరు సర్వగుణ
సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నదే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు.
ఇది చదువు, దీని ద్వారా దైవీ క్యారెక్టర్లు తయారవుతాయి. ఈ సమయంలో రావణుని రాజ్యంలో
అందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి. అందరి క్యారెక్టర్లను తీర్చిదిద్దేవారు ఒక్క
రాముడే. ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, మనుష్యుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది,
ఇలాగే వృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే ఇక ఆహారం కూడా ఎక్కడి నుండి లభిస్తుంది!
సత్యయుగములోనైతే ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు. అక్కడ దుఃఖానికి సంబంధించిన విషయాలే
ఉండవు. ఈ కలియుగము దుఃఖధామము, అందరూ వికారులుగా ఉన్నారు. అది సుఖధామము, అందరూ
సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఘడియ-ఘడియ వారికి ఇది తెలియజేయాలి, అప్పుడు ఏమైనా
అర్థం చేసుకోగలరు. తండ్రి చెప్తున్నారు - నేను పతిత-పావనుడను, నన్ను స్మృతి చేయడం
ద్వారా మీ జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు!
తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి చెప్తారు కదా. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క
తండ్రియే, తప్పకుండా వారు ఏదో రథములోకి వచ్చి ఉంటారు. తండ్రి అంటారు - నేను ఈ
రథములోకి వస్తాను, వీరికి వీరి జన్మల గురించి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు
- ఇది 84 జన్మల ఆట, ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు, వారికే అనేక జన్మలు
ఉంటాయి, ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. అందరికన్నా ముందు దేవతలు వచ్చారు. ఈ-ఈ విధంగా
అర్థం చేయించాలి అంటూ తండ్రి పిల్లలకు భాషణ చేయడం నేర్పిస్తారు. మంచి రీతిలో
స్మృతిలో ఉండి, దేహాభిమానం లేనట్లయితే భాషణ చాలా బాగా చేస్తారు. శివబాబా
దేహీ-అభిమాని కదా. పిల్లలూ, దేహీ-అభిమానీ భవ అని చెప్తూ ఉంటారు. ఏ వికారమూ ఉండకూడదు,
లోపల ఎటువంటి అసురత్వమూ ఉండకూడదు. మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరినీ
నిందించకూడదు. పిల్లలైన మీరు ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించకూడదు. వీరు ఇలా
చెప్తున్నారు, ఇది సత్యమా? అని బాబాను అడగండి, అప్పుడు బాబా చెప్తారు. లేకపోతే
అసత్యమైన మాటలను తయారుచేయడంలో ఆలస్యం చేయనివారు ఎందరో ఉన్నారు. ఫలానావారు మీ గురించి
ఇలా-ఇలా అన్నారు అని వారికి వినిపించి వారినే బూడిద చేసేస్తారు. ఇటువంటివారు
ఎంతోమంది ఉంటారని బాబాకు తెలుసు. తప్పుడు విషయాలను వినిపించి ఎదుటివారి హృదయాన్ని
పాడు చేసేస్తారు, అందుకే ఎప్పుడూ కూడా అసత్యమైన మాటలను విని లోలోపల దహించుకుపోకూడదు.
ఫలానావారు నా గురించి ఇలా అన్నారా? అని అడగండి. లోపల స్వచ్ఛత ఉండాలి. చాలామంది
పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెట్టుకుంటారు. తండ్రి లభించారు
కావున తండ్రినే అడగాలి కదా. బ్రహ్మాబాబాపై కూడా చాలామందికి విశ్వాసం ఉండదు.
శివబాబాను కూడా మర్చిపోతారు. తండ్రి అయితే అందరినీ ఉన్నతంగా తయారుచేయడానికే వచ్చారు.
ప్రేమగా పైకి లేపుతూ ఉంటారు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. నిశ్చయమే లేకపోతే అసలు ఏమీ
అడగరు కావున రెస్పాన్స్ కూడా లభించదు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ
చేయాలి.
పిల్లలైన మీరు శ్రీమతముపై విశ్వములో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తులుగా
అయ్యారు. ఒక్క తండ్రి మతము తప్ప ఇంకెవ్వరి మతమూ ఉన్నతోన్నతమైనదిగా ఉండదు.
ఉన్నతోన్నతమైన మతము భగవంతునిదే, దాని ద్వారా పదవి కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది.
తండ్రి అంటారు - మీ కళ్యాణం చేసుకొని ఉన్నత పదవిని పొందండి, మహారథులుగా అవ్వండి.
అసలు చదువుకోనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు. ఇది కల్ప-కల్పాంతరాలకు సంబంధించిన
విషయము. సత్యయుగములో దాస-దాసీలు కూడా నంబరువారుగా ఉంటారు. తండ్రి అయితే ఉన్నతంగా
తయారుచేయడానికే వచ్చారు, కానీ, అసలు చదువుకోనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు.
ప్రజల్లో కూడా ఉన్నతమైన, తక్కువైన పదవులు ఉంటాయి కదా, ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి.
తాము ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనుష్యులకు తెలియదు. పైకి వెళ్తున్నారా లేక కిందకు
దిగుతున్నారా అనేది తెలియదు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు -
ఎక్కడ మీరు స్వర్ణయుగములో, వెండియుగములో ఉండేవారు, ఎక్కడ ఇనుపయుగములోకి వచ్చేసారు.
ఈ సమయంలోనైతే మనుష్యులు, మనుష్యులను తినేస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ
ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానము అని దేనిని అంటారో అర్థమవుతుంది.
కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. మంచి-మంచి సెంటర్లలో
మంచి-మంచి పిల్లలకు క్రిమినల్ (అశుద్ధమైన) దృష్టి ఉంటుంది. లాభ-నష్టాలను, పరువును
లెక్క చేయరు. ముఖ్యమైన విషయము పవిత్రతయే, ఈ విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతాయి.
తండ్రి అంటారు - ఈ కామము మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి, అప్పుడే జగత్
జీతులుగా అవుతారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. మున్ముందుకు అర్థం చేసుకుంటారు,
స్థాపన జరిగే తీరుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.