15-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీకు కర్మ, అకర్మ, వికర్మల గుహ్య
గతులను వినిపించేందుకు తండ్రి వచ్చారు, ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ
పవిత్రముగా ఉంటాయో అప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి, పతితులుగా అవ్వడము వలన
వికర్మలు అవుతాయి’’
ప్రశ్న:-
ఆత్మపై
తుప్పు పట్టడానికి కారణము ఏమిటి? తుప్పు పట్టి ఉంటే దాని గుర్తులేమిటి?
జవాబు:-
తుప్పు
పట్టడానికి కారణము - వికారాలు. పతితులుగా అవ్వడము వలనే తుప్పు పడుతుంది. ఒకవేళ
ఇప్పటివరకూ తుప్పు పట్టి ఉంటే వారికి పాత ప్రపంచపు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బుద్ధి
అశుభ్రత వైపుకు వెళ్తూ ఉంటుంది. వారు స్మృతిలో ఉండలేకపోతారు.
ఓంశాంతి
పిల్లలు దీని అర్థాన్ని అయితే అర్థం చేసుకున్నారు. ఓం శాంతి అని అనడముతోనే -
ఆత్మలమైన మనము ఈ ప్రపంచ నివాసులము కాము అని అర్థమవుతుంది. మనము శాంతిధామ నివాసులము.
మనము ఇంటిలో ఉన్నప్పుడు మన స్వధర్మము శాంతి, ఆ తరువాత ఇక్కడకు వచ్చి పాత్రను
అభినయిస్తాము, ఎందుకంటే శరీరముతోపాటు కర్మలు చేయవలసి ఉంటుంది. కర్మలు రెండు రకాలు,
ఒకటి మంచి కర్మలు, రెండవది చెడు కర్మలు. రావణ రాజ్యములో చెడు కర్మలు జరుగుతాయి.
రావణ రాజ్యములో అందరి కర్మలు వికర్మలు అయిపోయాయి. వికర్మలు జరగని మనుష్యులు ఒక్కరు
కూడా లేరు. మనుష్యులేమని భావిస్తారంటే, సాధు-సన్యాసులు మొదలైనవారి ద్వారా వికర్మలు
జరగవు ఎందుకంటే వారు పవిత్రముగా ఉంటారు మరియు అన్నీ సన్యసించారు కదా అని.
వాస్తవానికి పవిత్రమైనవారు అని ఎవరినంటారో అసలు ఏమాత్రమూ తెలియదు. మేము పతితులము అని
అంటారు కూడా. పతిత-పావనుడిని పిలుస్తూ ఉంటారు. ఎప్పటివరకైతే వారు రారో అప్పటివరకు
ప్రపంచము పావనముగా అవ్వలేదు. ఇక్కడ ఇది పతిత పాత ప్రపంచము, అందుకే పావన ప్రపంచాన్ని
స్మృతి చేస్తారు. పావన ప్రపంచములోకి ఎప్పుడైతే వెళ్తారో, అప్పుడిక పతిత ప్రపంచాన్ని
గుర్తుచేయరు. ఆ ప్రపంచమే వేరు. ప్రతి వస్తువు మొదట కొత్తదిగా ఉంటుంది, ఆ తరువాత
పాతదిగా అవుతుంది కదా. కొత్త ప్రపంచములో పతితులు ఒక్కరు కూడా ఉండే అవకాశము లేదు.
కొత్త ప్రపంచపు రచయిత పరమపిత పరమాత్మ, వారే పతిత-పావనుడు, వారి రచన కూడా తప్పకుండా
పావనముగానే ఉండాలి. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతారు, ఈ
విషయాలు ప్రపంచములోని వారెవ్వరి బుద్ధిలోనూ కూర్చోలేవు. కల్ప-కల్పమూ తండ్రియే వచ్చి
అర్థం చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా కొందరు నిశ్చయబుద్ధి కలవారిగా అయి మళ్ళీ
సంశయబుద్ధి కలవారిగా అవుతారు. మాయ ఒక్కసారిగా వారిని మింగేస్తుంది. మీరు మహారథులు
కదా. మహారథులనే భాషణ ఇచ్చేందుకు పిలుస్తారు. మహారాజులకు కూడా ఏమని అర్థం చేయించాలంటే
- మీరు ఒకప్పుడు పావనులుగా, పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడైతే ఈ ప్రపంచమే పతిత
ప్రపంచము, పావన ప్రపంచములో భారతవాసులే ఉండేవారు, భారతవాసులైన మీరు ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మానికి చెందిన ద్వికిరీటధారులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు.
మహారథులు ఈ విధముగా అర్థం చేయించాలి కదా. ఈ నషాతో అర్థం చేయించాల్సి ఉంటుంది.
భగవానువాచ - కామ చితిపై కూర్చోవడం వలన నల్లగా అయిపోతారు, మళ్ళీ జ్ఞాన చితిపై
కూర్చోవడం ద్వారా తెల్లగా అవుతారు. ఇప్పుడు ఈ విధముగా ఎవరైతే అర్థం చేయిస్తారో
వారైతే కామ చితిపై కూర్చోలేరు. కానీ కొందరు ఎలాంటివారు ఉన్నారంటే, వారు ఇతరులకు
అర్థం చేయిస్తూ, చేయిస్తూ కామ చితిపై కూర్చుండిపోతారు. ఈ రోజు ఇలా అర్థం చేయిస్తారు,
రేపు వికారాల్లో పడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది, ఇక అది అడగకండి. ఇతరులకు అర్థం
చేయించేవారు స్వయం కామ చితిపై కూర్చుండిపోతారు. ఆ తరువాత, ఇలా ఎందుకు జరిగింది అని
పశ్చాత్తాపపడతారు. ఇది ఒక బాక్సింగ్ కదా. స్త్రీని చూడగానే ఆకర్షణ కలుగుతుంది, నల్ల
ముఖము చేసుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. ప్రతిజ్ఞ చేసిన తరువాత మళ్ళీ కిందపడితే
ఎంతగా వంద రెట్లు శిక్ష పడుతుంది. అటువంటివారు శూద్రుల సమానముగా పతితులుగా
అయిపోయినట్లే. అమృతాన్ని తాగి మళ్ళీ బయటకు వెళ్ళి ఇతరులను సతాయించేవారని, వికారాలకు
లోనయ్యేవారని ఇలా కూడా అంటూ ఉంటారు. చప్పట్లు రెండు చేతులతోనే మోగుతాయి, ఒక
చేతితోనైతే చప్పట్లు మోగవు. ఇద్దరూ అపవిత్రమైపోతారు. కొందరు ఈ సమాచారాన్ని ఇస్తారు,
కొందరైతే సిగ్గు కారణముగా సమాచారాన్ని కూడా ఇవ్వరు. బ్రాహ్మణ కులములో పేరు
పాడైపోతుందేమో అని భావిస్తారు. యుద్ధములో ఎవరైనా ఓడిపోతే హాహాకారాలు జరుగుతాయి. అరే,
ఇంత పెద్ద పహల్వాన్ ను కూడా పడేసిందే. ఇలా ఎన్నో యాక్సిడెంట్ లు జరుగుతూ ఉంటాయి.
మాయ చెంపదెబ్బ వేస్తుంది, ఇది చాలా పెద్ద గమ్యము కదా. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం
చేయిస్తారు - ఎవరైతే సతోప్రధానముగా, సుందరముగా ఉండేవారో, వారే కామ చితిపై కూర్చోవడం
వలన నల్లగా, తమోప్రధానముగా అయిపోయారు. రాముడిని కూడా నల్లగా చూపిస్తారు. చిత్రాలైతే
అనేకమందివి నల్లగా తయారుచేస్తారు, కానీ ముఖ్యమైనవారిని గురించే అర్థం చేయించడం
జరుగుతుంది. ఇక్కడ కూడా రామచంద్రుని నల్లని చిత్రము ఉంది, దానిని అలా నల్లగా ఎందుకు
తయారుచేసారు అని వారిని అడగాలి. ఇది ఈశ్వరుని రచన, ఇది ఎంతోకాలముగా ఇలాగే ఉంది అని
వారు అంటారు, కానీ అసలు ఇలా ఎందుకు జరుగుతుందో, ఏమి జరుగుతుంది అనేది వారికేమీ
తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - కామ చితిపై కూర్చోవడం వలన
పతితులుగా, దుఃఖితులుగా, పైసకు కొరగానివారిగా అయిపోతారు. అది నిర్వికారీ ప్రపంచము,
ఇది వికారీ ప్రపంచము. ఇలా, ఇలా అర్థం చేయించాలి. ఈ విధముగా సూర్యవంశీయులుగా,
చంద్రవంశీయులుగా మరియు తరువాత వైశ్యవంశీయులుగా తయారుకావలసిందే. వామ మార్గములోకి
రావడము వలన ఇక వారు దేవతలుగా పిలువబడరు. జగన్నాధుని మందిరములో పైన దేవతల కులాన్ని
చూపించారు, వస్త్రాలు దేవతలవే, కానీ వారి నడవడికను చాలా అశుద్ధముగా చూపిస్తారు.
తండ్రి ఏ విషయముపైనైతే అటెన్షన్ ఇప్పిస్తారో, దానిపై ధ్యానము పెట్టాలి. మందిరాలలో
చాలా సేవ చేయవచ్చు. శ్రీనాథ ద్వార్ లో కూడా అర్థం చేయించవచ్చు. వారిని నల్లగా ఎందుకు
తయారుచేసారు అని అడగాలి. ఇలా అర్థం చేయించడం చాలా మంచిది. అది స్వర్ణిమ యుగము, ఇది
ఇనుప యుగము. మరి తుప్పు పడుతుంది కదా. ఇప్పుడు మీకు పట్టిన తుప్పు వదులుతుంది.
ఎవరైతే అసలు స్మృతే చేయరో వారి నుండి తుప్పు కూడా వదలదు. చాలా తుప్పు పట్టి
ఉన్నట్లయితే వారికి పాత ప్రపంచపు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా
వికారాల వల్లే తుప్పు పడుతుంది. పతితులుగా కూడా వాటి వల్లే అయ్యారు. స్వయాన్ని చెక్
చేసుకోవాలి - నా బుద్ధి అపవిత్రత వైపు అయితే వెళ్ళడము లేదు కదా. మంచి-మంచి ఫస్ట్
క్లాస్ పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వివరణ లభించింది.
ముఖ్యమైన విషయము పవిత్రతయే. ప్రారంభము నుండి మొదలుకుని ఈ విషయముపైనే గొడవలు జరుగుతూ
వచ్చాయి. తండ్రియే ఈ యుక్తిని రచించారు - మేము జ్ఞానామృతాన్ని తాగడానికి
వెళ్తున్నాము అని అందరూ అంటారు. జ్ఞానామృతము ఉన్నది జ్ఞానసాగరుని వద్దే. శాస్త్రాలు
చదవడం వలనైతే ఎవ్వరూ పతితుల నుండి పావనులుగా అవ్వలేరు. పావనముగా అయి తిరిగి పావన
ప్రపంచములోకి వెళ్ళాలి. ఇక్కడ పావనముగా అయి ఎక్కడికి వెళ్తారు? ఫలానా వ్యక్తి
మోక్షాన్ని పొందారు అని మనుష్యులు భావిస్తారు. ఒకవేళ మోక్షాన్ని పొందినట్లయితే ఇక
వారి కర్మకాండలేవీ కూడా చేయడానికి అవ్వదు అని వారికేమి తెలుసు. ఆ ఆత్మకు ఏ కష్టమూ
రాకూడదని, చీకటిలో ఇబ్బంది పడకూడదని ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు. ఆత్మ అయితే ఒక
శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది, ఇది ఒక్క క్షణము యొక్క విషయము.
మరి అంధకారము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక సాంప్రదాయముగా వస్తోంది. ఇదివరకు మీరు
కూడా ఇది చేసేవారు, ఇప్పుడు ఏమీ చేయరు. శరీరమైతే మట్టిలో కలిసిపోయిందని మీకు తెలుసు.
అక్కడ ఇటువంటి సాంప్రదాయాలేవీ ఉండవు. ఈ రోజుల్లోని రిద్ధి-సిద్ధులలో ఏమీ లేదు.
ఒకవేళ ఎవరికైనా రెక్కలు వచ్చాయనుకోండి, వాటితో వారు ఎగరడం మొదలుపెట్టారనుకోండి, ఆ
తరువాత ఏమిటి, దాని వలన లాభమేమిటి? తండ్రి అయితే అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే
మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది యోగాగ్ని, దీని ద్వారా పతితుల నుండి పావనులుగా
అవుతారు. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది, యోగము ద్వారా సదా ఆరోగ్యవంతులుగా,
పవిత్రులుగా అవుతారు. జ్ఞానము ద్వారా సదా సంపన్నులుగా, ధనవంతులుగా అవుతారు. యోగీ
ఆయుష్షు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది, భోగీ ఆయుష్షు తక్కువగా ఉంటుంది.
శ్రీకృష్ణుడిని యోగేశ్వరుడు అని అంటారు. ఈశ్వరుని స్మృతితో కృష్ణుడిగా అయ్యారు,
అతడిని స్వర్గములో యోగేశ్వరుడు అని పిలవరు. అతను అక్కడ యువరాజు. గత జన్మలో అటువంటి
కర్మలు చేసారు కావున అలా తయారయ్యారు. కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా తండ్రి అర్థం
చేయించారు. అర్ధకల్పము రామ రాజ్యము ఉంటుంది, అర్ధకల్పము రావణ రాజ్యము ఉంటుంది.
వికారాలలోకి వెళ్ళడము - ఇది అన్నింటికన్నా పెద్ద పాపము. అందరూ సోదరీ, సోదరులు కదా.
ఆత్మలందరూ పరస్పరము సోదరులు. భగవంతుని సంతానమైన తరువాత ఇక వికారాలలోకి ఎలా వెళ్ళగలరు.
బి.కె.లైన మనము వికారాలలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ యుక్తి ద్వారానే పవిత్రముగా
ఉండగలరు. ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమవుతుందని, ఆ తరువాత ప్రతి ఆత్మ పవిత్రముగా
అవుతుందని మీకు తెలుసు. అక్కడ ఇంటింటిలోనూ ప్రకాశము ఉంటుంది అని అంటారు. మీ జ్యోతి
ఇప్పుడు వెలిగి ఉంది, జ్ఞానమనే మూడవ నేత్రము మీకు లభించింది. సత్యయుగములో అందరూ
పవిత్రముగానే ఉంటారు. ఈ విషయాన్ని కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇతరులకు
అర్థం చేయించడానికి పిల్లలలో నంబరువారుగా శక్తి ఉంటుంది. నంబరువారుగా పిల్లలు
స్మృతిలో ఉంటారు. రాజధాని ఏ విధముగా స్థాపన అవుతుంది, ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు.
మీరు సైన్యము కదా. స్మృతి బలము ద్వారా పవిత్రముగా అయి మనము రాజు-రాణులుగా
అవుతున్నామని మీకు తెలుసు. ఆ తరువాత వచ్చే జన్మలో మీ నోటిలో బంగారు చెంచా ఉంటుంది.
పెద్ద పరీక్షలు పాస్ అయ్యేవారు పదవి కూడా పెద్దదే పొందుతారు. తేడా అయితే ఉంటుంది కదా.
ఎంత చదువో అంత సుఖము. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు. ఈ నషా ఎక్కి ఉండాలి. మీకు
శక్తివంతమైన ఔషధము లభిస్తోంది. భగవంతుడు లేకుండా ఈ విధముగా భగవాన్, భగవతీలుగా ఎవరు
తయారుచేస్తారు. మీరు ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అవుతున్నారు, ఆ తరువాత
జన్మ-జన్మాంతరాల కొరకు సుఖీగా అవుతారు, ఉన్నత పదవిని పొందుతారు. కానీ కొందరు చదువుతూ,
చదువుతూ మళ్ళీ అశుద్ధముగా అయిపోతారు. దేహాభిమానములోకి రావడం వలన ఇక జ్ఞానము యొక్క
మూడవ నేత్రము మూసుకుపోతుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది
అని తండ్రియే స్వయముగా అంటారు. నేను బ్రహ్మా తనువులోకి వచ్చి ఎంత కష్టపడుతున్నానో
చూడండి, కానీ అన్నీ అర్థం చేసుకుని కూడా ఏమంటారంటే - ఇది ఎలా జరగగలదు, శివబాబా
వీరిలోకి వచ్చి చదివిస్తున్నారు అన్నది మేము నమ్మము అని అంటారు. ఇది ఏదో కపటము అని
కూడా అనేస్తారు. రాజ్యమైతే స్థాపన అయ్యే తీరుతుంది. సత్యత అనే నావ కదులుతుందే కానీ
మునగదు అని అంటారు కదా. ఎన్ని విఘ్నాలు వస్తాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన చాలా కాలము తరువాత కలిసిన కంటి రత్నాలకు, శ్యామము నుండి
సుందరముగా తయారయ్యే ఆత్మలకు, మాత-పిత బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణముగా,
ప్రేమగా, ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. యోగాగ్ని ద్వారా వికారాల తుప్పును తొలగించుకోవాలి. నా బుద్ధి అపవిత్రత
వైపుకైతే వెళ్ళడము లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి.
2. నిశ్చయబుద్ధి కలవారిగా అయిన తరువాత మళ్ళీ ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయము
కలగకూడదు. వికర్మల నుండి రక్షింపబడడానికి ఏ కర్మనైనా తమ స్వధర్మములో స్థితులై తండ్రి
స్మృతిలో చేయాలి.
వరదానము:-
శ్రేష్ఠ పాలన యొక్క విధి ద్వారా వృద్ధి చేసే సర్వుల
అభినందనలకు పాత్రులుగా కండి
సంగమయుగము అభినందనల ద్వారానే వృద్ధిని పొందే యుగము. తండ్రి
యొక్క, పరివారం యొక్క అభినందనల ద్వారానే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. అభినందనల
ద్వారానే నాట్యం చేస్తూ, పాడుతూ, పాలింపబడుతూ, ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా
అద్భుతమైనది. కావున పిల్లలైన మీరు కూడా పెద్ద మనసుతో, దయా భావనతో, దాతలుగా అయి ప్రతి
ఘడియ ఒకరికొకరు ‘చాలా బాగుంది, చాలా బాగుంది’ అంటూ అభినందనలు తెలుపుతూ ఉండండి - ఇదే
పాలన యొక్క శ్రేష్ఠమైన విధి. ఈ విధి ద్వారా సర్వుల పాలన చేస్తూ ఉన్నట్లయితే
అభినందనలకు పాత్రులుగా అవుతారు.
స్లోగన్:-
మీ
స్వభావాన్ని సరళ స్వభావముగా చేసుకోవడమే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజమైన విధి.
మాతేశ్వరి గారి
అమూల్యమైన మహావాక్యాలు
‘‘పురుషార్థము మరియు
ప్రారబ్ధము యొక్క తయారైన అనాది డ్రామా’’
మాతేశ్వరి:
పురుషార్థము మరియు ప్రారబ్ధము రెండు వేర్వేరు, పురుషార్థము ద్వారా ప్రారబ్ధము
తయారవుతుంది. ఈ అనాది సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆది సనాతన భారతవాసులు ఎవరైతే
పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు, ఆ పూజారులే పురుషార్థము చేసి
మళ్ళీ పూజ్యులుగా అవుతారు. ఈ ఎక్కడము మరియు దిగడము అనేది ఈ అనాది డ్రామా యొక్క ఆటగా
రచింపబడి ఉంది.
జిజ్ఞాసువు: మాతేశ్వరీ,
నాకు కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది - ఈ డ్రామా ఇలా తయారై ఉన్నట్లయితే, ఒకవేళ పైకి
ఎక్కేది ఉంది అంటే వారంతట వారే ఎక్కుతారు కదా, మరి పురుషార్థము చేయడం వలన లాభమేముంది?
ఎవరైతే ఎక్కుతారో, వారు మళ్ళీ పడిపోతారు అన్నప్పుడు మరి ఇంత పురుషార్థము ఎందుకు
చెయ్యాలి? మాతేశ్వరీ, ఈ డ్రామా యథావిధిగా రిపీట్ అవుతుంది అని మీరు చెప్పారు, మరి
సర్వశక్తివంతుడైన పరమాత్మ సదా ఇటువంటి ఆటను చూస్తూ స్వయం అలసిపోరా? నాలుగు ఋతువులలో
ఏ విధంగా చలి, వేడి మొదలైనవాటిలో తేడాలు ఉంటాయో, అలా ఈ ఆటలో తేడా ఉండదా? మాతేశ్వరి:
ఇదే ఈ డ్రామాలోని ప్రత్యేకత, ఇది యథావిధిగా రిపీట్ అవుతుంది, అంతేకాక ఈ డ్రామాలోని
మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇది రిపీట్ అవుతున్నా కూడా నిత్యం కొత్తదిగా అనిపిస్తుంది.
ఇంతకుముందు మాకు కూడా ఈ శిక్షణ లేదు, కానీ జ్ఞానము లభించిన తరువాత, క్షణ-క్షణము
ఏదైతే నడుస్తూ ఉందో, అది యథావిధిగా కల్పక్రితముదే నడుస్తున్నా కానీ, దానిని సాక్షీగా
భావిస్తూ చూసినట్లయితే నిత్యం కొత్తదిగా అనిపిస్తుంది. ఇప్పుడు సుఖము, దుఃఖము, ఈ
రెండింటి గురించిన జ్ఞానము లభించింది. అందుకే, ఒకవేళ ఫెయిల్ అవ్వాల్సిందే అన్నప్పుడు
ఇంకెందుకు చదవాలి అని ఇలా అనుకోకండి. అలా కాదు. మరి అలాగైతే, ఒకవేళ భోజనం లభించాల్సి
ఉంటే దానంతట అదే లభిస్తుందని భావించాలి కదా, మరి ఇంత శ్రమ చేసి ఎందుకు సంపాదిస్తారు?
అదే విధంగా ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయము వచ్చింది అని మనం కూడా చూస్తున్నాము, అదే
దేవతా వంశము స్థాపన అవుతోంది, మరి ఇప్పుడే ఆ సుఖాన్ని ఎందుకు తీసుకోకూడదు. చూడండి,
ఇప్పుడు ఎవరైనా జడ్జిగా అవ్వాలనుకుంటే, పురుషార్థము చేస్తేనే ఆ డిగ్రీని పొందుతారు
కదా. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే శ్రమ అంతా వృధా అయిపోతుంది. కానీ ఈ అవినాశీ
జ్ఞానములో అలా జరగదు, ఈ అవినాశీ జ్ఞానము కొంచెము కూడా వినాశనమవ్వదు, దైవీ రాయల్
వంశములోకి వచ్చే పురుషార్థము చేయలేకపోయినా కానీ, ఒకవేళ తక్కువ పురుషార్థము చేసినా
కూడా ఆ సత్యయుగీ దైవీ ప్రజలలోకి రావచ్చు. కానీ పురుషార్థము చేయడం తప్పనిసరి,
ఎందుకంటే పురుషార్థము ద్వారానే ప్రారబ్ధము తయారవుతుంది, గొప్పదనమంతా పురుషార్థానిదే
అని అంటారు.
‘‘ఈ ఈశ్వరీయ జ్ఞానము
సర్వ మనుష్యాత్మల కోసము ఉంది’’
మొట్టమొదట మీరు ఒక
ముఖ్యమైన పాయింటును తప్పకుండా ధ్యానములో ఉంచుకోవాలి, ఈ మనుష్య సృష్టి యొక్క
వృక్షానికి బీజరూపుడు పరమాత్మ అయినప్పుడు, ఆ పరమాత్మ ద్వారా ప్రాప్తిస్తున్న జ్ఞానము
మనుష్యలందరికీ అవసరము. అన్ని ధర్మాల వారికి ఈ జ్ఞానాన్ని తీసుకునేందుకు అధికారముంది.
ప్రతి ఒక్క ధర్మానికి తమ-తమ జ్ఞానముంటుంది, ప్రతి ఒక్కరికీ తమ-తమ శాస్త్రముంటుంది,
ప్రతి ఒక్కరికీ తమ-తమ మతము ఉంటుంది, ప్రతి ఒక్కరికీ తమ-తమ సంస్కారాలు ఉంటాయి, కానీ
ఈ జ్ఞానము అందరి కోసము. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోయినా సరే, మన వంశములోకి
రాలేకపోయినా సరే, వారు అందరికీ తండ్రి అయిన కారణముగా వారితో యోగము జోడించడముతో
పవిత్రముగా తప్పకుండా అవుతారు. ఈ పవిత్రత కారణముగా తమ సెక్షన్ లోనే పదవిని తప్పకుండా
పొందుతారు ఎందుకంటే యోగాన్ని అయితే మనుష్యులందరూ అంగీకరిస్తారు, చాలా మంది మనుష్యులు
మాకు కూడా ముక్తి కావాలి అని అంటారు, కానీ శిక్షల నుండి తప్పించుకుని విముక్తులుగా
అయ్యేటువంటి శక్తి కూడా ఈ యోగము ద్వారానే లభించగలదు. అచ్ఛా - ఓంశాంతి.
అవ్యక్త సూచనలు -
ఇప్పుడు లగనమే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
పిల్లలైన మీ వద్ద
పవిత్రత యొక్క మహాశక్తి ఏదైతే ఉందో, ఆ శ్రేష్ఠ శక్తియే అగ్నిలా పని చేస్తుంది, అది
క్షణములో విశ్వములోని చెత్తను భస్మము చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పవిత్రత యొక్క
సంపూర్ణ స్థితిలో స్థితి అవుతుందో, అప్పుడు ఆ స్థితి యొక్క శ్రేష్ఠ సంకల్పాలతో లగనము
అనే అగ్ని ప్రజ్వలితమవుతుంది మరియు చెత్త భస్మమైపోతుంది, వాస్తవానికి ఇదే యోగ
జ్వాల. ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఈ శ్రేష్ఠ శక్తిని కార్యములో వినియోగించండి.
| | |