15-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్వయాన్ని చెక్ చేసుకోండి - ఎంత సమయం తండ్రి స్మృతి ఉంటుంది అని, ఎందుకంటే స్మృతిలో ఉండేదే లాభము, విస్మృతిలో ఉన్నది నష్టము’’

ప్రశ్న:-
ఈ పాపాత్ముల ప్రపంచములో ఏ విషయము పూర్తిగా అసంభవము మరియు ఎందుకు?

జవాబు:-
ఇక్కడ ఎవరైనా - మేము పుణ్యాత్ములము అని అంటే, ఇది పూర్తిగా అసంభవము ఎందుకంటే ప్రపంచమే కలియుగీ తమోప్రధానమైనదిగా ఉంది. మనుష్యులు దేనినైతే పుణ్య కర్మగా భావిస్తారో, అది కూడా పాపము అయిపోతుంది ఎందుకంటే ప్రతి కర్మ వికారాలకు వశమై చేస్తారు.

ఓంశాంతి
ఇప్పుడు మేము బ్రహ్మా పిల్లలమైన బ్రహ్మాకుమార, కుమారీలము అని అయితే పిల్లలు భావిస్తూ ఉండవచ్చు. ఆ తర్వాత దేవీ, దేవతలుగా అవుతారు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు, ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. బ్రహ్మాకుమార, కుమారీలమైన మేము అనంతమైన చదువును చదువుతున్నాము అని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుతారు, సృష్టి చక్రపు చదువును కూడా చదువుతారు. ఆ తర్వాత మీకు పవిత్రముగా అవ్వాలి అన్న ఈ శిక్షణ లభిస్తుంది. ఇక్కడ కూర్చుని పిల్లలైన మీరు పావనముగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి - నిజంగా మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామా లేక మాయా రావణుడు బుద్ధిని ఇతర వైపులకు తీసుకువెళ్ళాడా. తండ్రి అన్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి - మేము బాబా స్మృతిలో ఉన్నామా లేక బుద్ధి ఇంకెటువైపుకైనా వెళ్ళిపోయిందా? మేము ఎంత సమయము బాబా స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము బుద్ధి ఇటూ, అటూ వెళ్ళింది అన్న స్మృతి ఉండాలి. మీ అవస్థను చూసుకోండి. ఎంత సమయమైతే తండ్రిని స్మృతి చేస్తారో, దాని ద్వారానే పావనముగా అవుతారు. జమ మరియు నష్టము యొక్క లెక్కాపత్రాన్ని కూడా ఉంచుకోవాలి. అలవాటైనట్లయితే స్మృతి కూడా ఉంటుంది, ఇక వ్రాస్తూ ఉంటారు. డైరీ అయితే అందరి జేబులో ఉండనే ఉంటుంది. వ్యాపారస్తులెవరైతే ఉంటారో వారిది హద్దులోని డైరీ, మీది అనంతమైన డైరీ. కావున మీరు మీ చార్టును నోట్ చేసుకోవాలి. తండ్రి ఆజ్ఞను ఇచ్చారు - వ్యాపారాలు మొదలైనవన్నీ చేయండి కానీ కొంత సమయం తీసి నన్ను స్మృతి చేయండి. మీ లెక్కాపత్రాన్ని చూసుకుంటూ లాభాన్ని పెంచుకుంటూ వెళ్ళండి, నష్టపరచుకోకండి. మీ యుద్ధమైతే ఉంది కదా. క్షణములో లాభము, క్షణములో నష్టము. మేము లాభము పొందామా లేక నష్టము కలిగిందా అన్నది వెంటనే తెలుస్తుంది. మీరు వ్యాపారస్థులు కదా. ఏ ఒక్కరో ఈ వ్యాపారము చేస్తారు. స్మృతి ద్వారా లాభము ఉంది, విస్మృతి ద్వారా నష్టము ఉంది. ఇది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎవరికైతే ఉన్నత పదవిని పొందేది ఉందో, వారికి - మేము ఎంత సమయము విస్మృతిలో ఉన్నామో చూడాలి అన్న తపన ఉంటుంది. ఆత్మలమైన మనందరికీ తండ్రి పతిత-పావనుడు అని అయితే పిల్లలైన మీకు తెలుసు. వాస్తవానికి మనం ఆత్మలము. మన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము, ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాము. శరీరము వినాశీ, ఆత్మ అవినాశీ. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. బాబా అడుగుతారు - హే ఆత్మా, గుర్తు తెచ్చుకో, ఈ జన్మలో చిన్నతనములో తప్పుడు పనులేమీ చేయలేదు కదా, గుర్తు తెచ్చుకో. మూడు, నాలుగు సంవత్సరాల వయసు నుండి జరిగినవి అయితే గుర్తుంటాయి. నేను బాల్యమును ఎలా గడిపాను, ఏమేమి చేసాను, ఏ విషయమూ మనసు లోపల తినడం లేదు కదా, గుర్తు తెచ్చుకోండి. సత్యయుగములో పాప కర్మలే ఉండవు కావున ఏమీ అడుగవలసిన అవసరమే ఉండదు. ఇక్కడైతే పాపాలు తప్పకుండా జరుగుతాయి. మనుష్యులు వేటినైతే పుణ్య కర్మలుగా భావిస్తారో, అవి కూడా పాపాలే. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. మీ ఇచ్చి-పుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే ఉన్నాయి. పుణ్యాత్ములు ఇక్కడ లేనే లేరు. పుణ్యాత్ముల ప్రపంచములో పాపాత్ములు ఒక్కరు కూడా ఉండరు. పాపాత్ముల ప్రపంచములో పుణ్యాత్ములు ఒక్కరు కూడా ఉండలేరు. ఏ గురువుల చరణాలపైనెతే పడతారో, వారు కూడా ఎవరూ పుణ్యాత్ములు కారు. ఇదంతా కలియుగము, అదీ తమోప్రధానమైనది. కావున ఇందులో పుణ్యాత్ములు ఉండడమనేది అసంభవము. పుణ్యాత్ములుగా అయ్యేందుకే, మీరు వచ్చి మమ్మల్ని పావన ఆత్మలుగా తయారుచేయండి అని తండ్రిని పిలుస్తారు. ఎవరైనా చాలా దాన, పుణ్యాదులు మొదలైనవి చేస్తే, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారు పుణ్యాత్ములు అనేమీ కాదు, అలా కాదు. వివాహాలు మొదలైనవాటి కోసం మండపాలు మొదలైనవి తయారుచేస్తారు, అది పుణ్యమేమీ కాదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది రావణ రాజ్యము, పాపాత్ముల ఆసురీ ప్రపంచము. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. రావణుడు ఉన్నా కానీ అతడిని గుర్తించరు. శివుని చిత్రము కూడా ఉంది కానీ వారిని గుర్తించరు. పెద్ద-పెద్ద శివలింగాలు మొదలైనవాటిని తయారుచేస్తారు, అయినా మళ్ళీ నామ-రూపాలకు అతీతుడు, సర్వవ్యాపి అనేస్తారు. కావుననే తండ్రి యదా యదాహి... అని అన్నారు. భారత్ లోనే శివబాబా గ్లాని జరుగుతుంది. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారో, ఆ తండ్రిని మీరు మనుష్య మతముపై నడిచి ఎంతగా గ్లాని చేస్తారు. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అన్న పుస్తకము కూడా ఉంది కదా. ఈ విషయాల గురించి మీకే తెలుసు మరియు మేము శ్రీమతము ఆధారముగా దేవతలుగా అవుతాము అని మీరు అర్థం చేయిస్తారు. రావణ మతముపై మళ్ళీ ఆసురీ మనుష్యులుగా అయిపోతారు. మనుష్య మతాన్ని ఆసురీ మతము అని అంటారు. వారు ఆసురీ కర్తవ్యాలనే చేస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయమేమిటంటే, ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనేస్తారు. కూర్మావతారము, మత్స్యావతారము అని... అనేస్తారు కావున వారు ఎంత ఆసురీగా, ఛీ-ఛీగా అయిపోయారు. మీ ఆత్మ కూర్మ, మత్స్యావతారాలను తీసుకోదు, అది మనుష్య తనువులోకే వస్తుంది. మేమేమీ తాబేలుగా, చేపగా అవ్వము, 84 లక్షల యోనులను ధరించము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు తండ్రి శ్రీమతము లభిస్తుంది - పిల్లలూ, మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలంటే 84 లక్షల జన్మలలో ఎంత శాతము! అది పూర్తిగా అసత్యమే, ఇసుమంత కూడా సత్యము లేదు. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. భారత్ సత్యఖండముగా ఉండేది, దానిని స్వర్గము అనే అనేవారు. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. రావణ రాజ్యాన్ని ఆసురీ సంప్రదాయము అని అంటారు. ఇది ఎంత కఠినమైన పదము. అర్ధకల్పము దేవతల రాజ్యం కొనసాగుతుంది. లక్ష్మీ-నారాయణ ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్ అని అంటారని తండ్రి అర్థం చేయించారు. ఉదాహరణకు ఎడ్వర్డ్ ది ఫస్ట్, ది సెకండ్... అని ఉంటారు కదా. మొదటి తరము, ఆ తర్వాత రెండో తరము, అలా కొనసాగుతూ ఉంటుంది. మీది కూడా మొదట సూర్యవంశీ రాజ్యము ఉంటుంది, ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యము ఉంటుంది. తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా బాగా అర్థం చేయించారు. మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. కొన్ని శాస్త్రాలలో కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ ఆ సమయములో ఎవరైతే పుస్తకాలను తయారుచేసారో వారు ఏమీ అర్థం చేసుకోలేదు.

బాబా కూడా బెనారస్ కు వెళ్ళినప్పుడు ఆ సమయములో వారికి ఈ ప్రపంచము మంచిగా అనిపించేది కాదు, అక్కడ మొత్తం గోడలపై గీతలు గీస్తూ ఉండేవారు. తండ్రి ఇవన్నీ చేయించేవారు కానీ ఆ సమయములో నేను చిన్న పిల్లవాడిని కదా. పూర్తిగా అర్థమయ్యేది కాదు. నా ద్వారా ఇది చేయించేవారు ఎవరో ఉన్నారు అని మాత్రం అనిపించేది. వినాశనము చూసినప్పుడు లోపల సంతోషము కూడా ఉండేది. రాత్రివేళ పడుకున్నప్పుడు కూడా ఎగురుతూ ఉన్నట్లుగా ఉండేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. అలా, అలా గీతలు గీస్తూ ఉండేవాడిని. ఏదో శక్తి ప్రవేశించింది. నేను ఆశ్చర్యపోయేవాడిని. మొదట వ్యాపారము మొదలైనవి చేసేవాడిని కానీ తర్వాత ఏమైంది, ఎవరిని చూస్తే వారు వెంటనే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇదేమిటి ఇలా జరుగుతంది, నేను ఎవరిని చూస్తే వారి కళ్ళు మూసుకుపోతున్నాయి అని అనేవాడిని. మీరు ఏమి చూసారు అని అడిగితే వైకుంఠాన్ని చూసాము, కృష్ణుడిని చూసాము అని అనేవారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలే కదా, అందుకే అన్నింటినీ వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్ కు వెళ్ళిపోయాను. రోజంతా కూర్చుని ఉండేవాడిని. పెన్సిల్ మరియు గోడ - ఇంకే పనీ లేదు. చిన్న పిల్లవాడిని కదా. ఎప్పుడైతే ఇవన్నీ గమనించానో అప్పుడు ఇక ఇవేవీ చేయకూడదు, వ్యాపారము మొదలైనవాటిని వదిలేయాలి అని అర్థమయ్యింది. ఈ గాడిద చాకిరీని వదిలేయాలి అన్న సంతోషము కూడా ఉండేది. ఇది రావణ రాజ్యము కదా. రావణుడిపై గాడిద తలను చూపిస్తారు కదా, అప్పుడు ఆలోచన కలిగింది, ఇది రాజ్యము కాదు, ఇది గాడిద చాకిరీ అని. గాడిద ఘడియ-ఘడియ మట్టిలో దొర్లుతూ చాకలి బట్టలన్నింటినీ పాడు చేసేస్తుంది. తండ్రి కూడా అంటారు, మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ అవస్థ ఎలా అయిపోయింది. ఈ విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు మరియు ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇద్దరిదీ నడుస్తూ ఉంటుంది. జ్ఞానామును ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో, వారిని చురుకైనవారు అని అంటారు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు - ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది, తప్పకుండా నంబరువారు పదవిని పొందుతారు. ఆత్మయే తన పాత్రను కల్ప-కల్పమూ అభినయిస్తుంది. అందరూ జ్ఞానాన్ని ఒకే విధముగా చేపట్టరు. ఈ స్థాపనయే అద్భుతమైనది. ఇంకెవ్వరూ స్థాపనా జ్ఞానాన్ని ఇవ్వరు. సిక్కు ధర్మ స్థాపన జరిగింది అనుకోండి, శుద్ధ ఆత్మ ప్రవేశించింది, కొంత సమయం తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరిగింది. వారి ముఖ్యులు ఎవరు? గురునానక్. వారు వచ్చి జప్ సాహెబ్ ను తయారుచేసారు. ప్రారంభములోనైతే కొత్త ఆత్మలే ఉంటారు ఎందుకంటే ఆత్మ పవిత్రముగా ఉంటుంది. పవిత్రులను మహానాత్మ అని అంటారు. సుప్రీమ్ అని ఒక్క తండ్రినే అంటారు. వారు కూడా ధర్మ స్థాపనను చేస్తారు కావున వారిని మహానులు అని అంటారు, కానీ నంబరువారుగా వెనుక, వెనుక వస్తారు. 500 సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చింది, వచ్చి సిక్కు ధర్మ స్థాపన చేసింది, ఆ సమయములో గ్రంథ్ ఎక్కడి నుండి వస్తుంది. తప్పకుండా సుఖమని, జప్ సాహెబ్ మొదలైన పుస్తకాలను తర్వాతే తయారుచేసి ఉంటారు కదా! వారు ఏమి శిక్షణను ఇస్తారు. ఉత్సాహము కలిగితే కూర్చుని తండ్రిని మహిమ చేస్తారు. ఈ పుస్తకాలు మొదలైనవైతే తర్వాత తయారవుతాయి. ఎప్పుడైతే చాలామంది అవుతారో అప్పుడు తయారవుతాయి. చదివేవారు కూడా కావాలి కదా. అందరి శాస్త్రాలు తర్వాత తయారై ఉంటాయి. ఎప్పుడైతే భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పుడు శాస్త్రాలను చదివారు. జ్ఞానము కావాలి కదా. మొదట సతోప్రధానముగా ఉంటారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు మహిమ జరుగుతుంది మరియు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి, లేకపోతే ఎవరు వృద్ధిని తీసుకురాగలరు. అనుచరులు తయారవ్వాలి కదా. సిక్కు ధర్మపు ఆత్మలు రావాలి, వారు వచ్చి అనుసరించాలి, అందుకు చాలా సమయము కావాలి.

కొత్త ఆత్మ ఏదైతే వస్తుందో, తనకు దుఃఖము కలగదు. నియమము అలా లేదు. ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది. నియమము కూడా ఉంది కదా! ఇక్కడ అంతా కలిసిపోయారు, రావణ సాంప్రదాయము వారు కూడా ఉన్నారు, రామ సాంప్రదాయము వారు కూడా ఉన్నారు. ఇప్పుడింకా సంపూర్ణము అవ్వలేదు. సంపూర్ణముగా అయితే ఇక శరీరము వదిలేస్తారు. కర్మాతీత అవస్థ కలవారికి దుఃఖము కలగదు. వారు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండలేరు. వారు వెళ్ళిపోతారు. మిగిలినవారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా కర్మాతీతులు అయి ఉండరు. అందరూ ఒకేసారి అయితే కర్మాతీతమవ్వలేరు. వినాశనమైనా కానీ కొంతమందైతే మిగిలి ఉంటారు. ప్రళయము అవ్వదు. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు... అని గానం చేస్తారు కూడా. రావణుని పరివారము చాలా పెద్దది. మన పరివారము అయితే కొద్దిమందిదే. అక్కడ ఎన్ని ధర్మాలు ఉన్నాయి. వాస్తవానికి అన్నింటికన్నా పెద్దదిగా మన పరివారము ఉండాలి ఎందుకంటే దేవీ-దేవతా ధర్మము అన్నింటికన్నా ముందు వచ్చిన ధర్మము. ఇప్పుడైతే అందరూ కలిసిపోయారు కావున క్రిస్టియన్లు ఎంతోమంది అయిపోయారు. మనుష్యులు ఎక్కడైతే సుఖాన్ని చూస్తారో, పదవిని చూస్తారో, వారు ఆ ధర్మానికి చెందినవారిగా అయిపోతారు. పోప్ ఎప్పుడెప్పుడైతే వస్తారో అప్పుడు ఎంతోమంది క్రిస్టియన్లుగా అవుతారు, ఇక వృద్ధి కూడా ఎంతగానో జరుగుతూ ఉంటుంది. సత్యయుగములో అయితే ఒకే కొడుకు, ఒకే కూతురు ఉంటారు. ఇంకే ధర్మములోనూ ఇటువంటి వృద్ధి జరగదు. ఇప్పుడు చూడండి, అందరికన్నా క్రిస్టియన్లు చురుకుగా ఉన్నారు. ఎవరైతే ఎంతోమంది పిల్లలకు జన్మనిస్తారో, వారికి బహుమానము లభిస్తుంది ఎందుకంటే వారికి మనుష్యులు కావాలి కదా, తద్వారా మిలిట్రీలోని సైన్యానికి ఉపయోగపడతారు. వారంతా క్రిస్టియన్లే. రష్యా వారు, అమెరికా వారు అందరూ క్రిస్టియన్లే. రెండు కోతులు కొట్లాడుకుంటే వెన్నను పిల్లి తినేసినట్లుగా ఒక కథ ఉంది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇంతకుముందైతే హిందువులు, ముసల్మానులు కలిసే ఉండేవారు. ఎప్పుడైతే వేరు అయిపోయారో అప్పుడు పాకిస్థాన్ వారి కొత్త రాజ్యము తయారయ్యింది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇద్దరు కొట్లాడుకుంటే యుద్ధ సామాగ్రి కొనుక్కుంటారు, అప్పుడు వారి వ్యాపారము జరుగుతుంది. వారి ముఖ్యమైన వ్యాపారము ఇది. కానీ డ్రామాలో విజయము మీదే వ్రాసి పెట్టి ఉంది. ఇది 100 శాతము నిశ్చితము, మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు, మిగిలినవారంతా అంతమైపోతారు. కొత్త ప్రపంచములో మన రాజ్యము ఉంటుందని, దాని కొరకే మీరు చదువుతున్నారని మీకు తెలుసు. మీరు అర్హులుగా అవుతారు. మీరు అర్హులుగా ఉండేవారు, ఇప్పుడు అనర్హులుగా అయిపోయారు, మళ్ళీ అర్హులుగా అవ్వాలి. పతిత పావనా రండి అని గానం చేస్తారు కూడా, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. ఇదంతా అడవి. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాలతోటలా తయారుచేస్తారు. అది దైవీ ప్రపంచము. ఇది ఆసురీ ప్రపంచము. మొత్తం మనుష్య సృష్టి రహస్యాన్నంతా అర్థం చేయించారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - మనం మన ధర్మాన్ని మరచి ధర్మ భ్రష్టులుగా అయిపోయాము కావున అన్ని కర్మలూ వికర్మలుగానే అవుతాయి. కర్మ, వికర్మ, అకర్మల గతిని బాబా మీకు అర్థం చేయించి వెళ్ళారు. తప్పకుండా నిన్న మనం ఇలా ఉండేవారము, మళ్ళీ ఈ రోజు మేము ఈ విధముగా అవుతాము. సమీపముగా ఉన్నారు కదా. బాబా అంటారు, నిన్న మిమ్మల్ని దేవతలుగా తయారుచేసాను, రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను, మళ్ళీ అదంతా ఏమయ్యింది? భక్తి మార్గములో మనము ఎంత ధనాన్ని పోగొట్టాము అన్నది గుర్తుకొచ్చింది. ఇది నిన్నటి విషయమే కదా. తండ్రి వచ్చి అరచేతిపై స్వర్గాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి.

బాబా ఇది కూడా అర్థం చేయించారు - ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి, వికారీ దృష్టిని జ్ఞానముతో నిర్వికారీ దృష్టిగా తయారుచేసుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ అనంతమైన డైరీలో చార్ట్ నోట్ చేసుకోవాలి - మేము స్మృతిలో ఉంటూ ఎంత లాభాన్ని పెంచుకున్నాము? నష్టమైతే కలగలేదు కదా? స్మృతి చేసే సమయములో బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళింది?

2. ఈ జన్మలో బాల్యము నుండి మా ద్వారా ఏయే తప్పుడు కర్మలు అనగా పాపాలు జరిగాయి, వాటిని నోట్ చేసుకోవాలి. ఏ విషయములోనైతే మనస్సు తింటుందో, దానిని తండ్రికి వినిపించి తేలికైపోవాలి. ఇప్పుడిక ఎటువంటి పాప కర్మలూ చేయకూడదు.

వరదానము:-
కర్మ బంధనాన్ని సేవా బంధనములోకి పరివర్తన చేసి సర్వుల నుండి అతీతముగా మరియు పరమాత్మకు ప్రియముగా కండి

పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారము కానీ ఎప్పుడైతే అతీతముగా అవుతారో అది అప్పుడే లభిస్తుంది. ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నా కానీ సేవ కొరకే ఉంటున్నారు. ఎప్పుడూ కూడా - ఇవి లెక్కాచారాలు, కర్మబంధనాలు... అని అనుకోకండి, ఇది సేవ అని భావించండి. సేవా బంధనములో బంధింపబడినట్లయితే కర్మ బంధనము సమాప్తమైపోతుంది. సేవా భావము లేకపోతే కర్మ బంధనము లాగుతుంది. ఎక్కడైతే కర్మ బంధనము ఉంటుందో, అక్కడ దుఃఖపు అల ఉంటుంది, సేవా బంధనములో సంతోషము ఉంటుంది, అందుకే కర్మ బంధనాన్ని సేవా బంధనములోకి పరివర్తన చేసి అతీతముగా, ప్రియముగా ఉండండి, అప్పుడు పరమాత్మకు ప్రియమైనవారిగా అయిపోతారు.

స్లోగన్:-
ఎవరైతే స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితినీ దాటి వేస్తారో వారే శ్రేష్ఠ ఆత్మలు.