15-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 28.02.2003


‘‘సేవతోపాటుగా ఇప్పుడు సంపన్నముగా అయ్యేందుకు ప్లాన్ ను తయారుచెయ్యండి, కర్మాతీతులుగా అయ్యే ధ్యాసలో నిమగ్నమైపోండి’’

ఈ రోజు శివబాబా తమ సాలిగ్రామాలైన పిల్లలతో పాటు తమ మరియు పిల్లల యొక్క అవతరణ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. ఈ అవతరణా జయంతి ఎంతటి అద్భుతమైనది, ఈ సందర్భముగా బాబా పిల్లలకు మరియు పిల్లలు బాబాకు పదమాపదమాలు రెట్లుగా అభినందనలను ఇస్తున్నారు. నలువైపులా పిల్లలు సంతోషముతో ఊగుతూ ఉన్నారు - వాహ్ బాబా, వాహ్ సాలిగ్రామ ఆత్మలైన మేము! వాహ్-వాహ్ పాటలను పాడుతున్నారు. మీ ఈ జన్మదిన స్మృతిచిహ్నాన్ని ద్వాపరము నుండి ఇప్పటివరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉంటారు. భక్తులు కూడా భావనలో తక్కువైనవారేమీ కారు. కానీ వారు భక్తులు, పిల్లలు కారు. వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు మరియు మీరు మొత్తము కల్పములో ఒక్కసారి అవతరణ మహత్వాన్ని జరుపుకుంటారు. వారు ప్రతి సంవత్సరము ఉపవాసము పాటిస్తారు, ఉపవాసము కూడా పాటిస్తారు మరియు వ్రతాన్ని కూడా చేపడతారు. మీరు ఒకే ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు, మిమ్మల్నే కాపీ చేసారు, కానీ మీ మహత్వానికి మరియు వారి స్మృతిచిహ్న మహత్వానికి తేడా ఉంది. వారు కూడా పవిత్రతా వ్రతాన్ని చేపడతారు కానీ వారు ప్రతి సంవత్సరము ఒక్క రోజు కోసము వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా జన్మ తీసుకోవటముతోనే ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు కదా! చేపట్టారా లేక చేపట్టాలా? చేపట్టారు. మీరు ఒకేసారి చేపట్టారు, వారు ప్రతి సంవత్సరము తీసుకుంటారు. అందరూ వ్రతాన్ని చేపట్టారా? కేవలము బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు. పాండవులారా, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారా? లేక కేవలము బ్రహ్మచర్యమే సరిపోతుందా! బ్రహ్మచర్యమనేది పునాది కానీ కేవలం బ్రహ్మచర్యమే కాదు, దానికి తోడుగా ఇంకో నాలుగు కూడా ఉన్నాయి. ఆ నాలిగింటి వ్రతాన్ని కూడా చేపట్టారా లేక కేవలము ఒకదానిదే చేపట్టారా? చెక్ చేసుకోండి. క్రోధము చెయ్యటానికైతే అనుమతి ఉంది కదా? అనుమతి లేదా? కొంచెం, కొంచెమైతే క్రోధము చేయవలసి ఉంటుంది కదా? చేయవలసిన అవసరం లేదా? పాండవులు చెప్పండి, క్రోధము చేయవలసిన అవసరం లేదా? చేయవలసి అయితే ఉంటుంది కదా! సరే, బాప్ దాదా చూసారు, క్రోధము మరియు దానితోపాటు మిగిలిన సహచరులు ఏవైతే ఉన్నాయో, ఆ మహా భూతాలనైతే త్యాగము చేసారు, కానీ ఎలాగైతే మాతలకు, ప్రవృత్తిలోనివారికి పెద్ద పిల్లలపై అంతగా ప్రేమ ఉండదు, మోహము ఉండదు కానీ మనవలు, మునిమనవలపై చాలా ఉంటుంది. చిన్న-చిన్న పిల్లలు చాలా ప్రియముగా అనిపిస్తారు. కనుక బాప్ దాదా చూసారు, పిల్లలకు కూడా ఈ పంచ వికారాలనే మహాభూతాలు ఏవైతే ఉన్నాయో, వాటి మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది కానీ ఈ వికారాల యొక్క పిల్లాజెల్లా ఉన్నాయి కదా, చిన్న-చిన్నగా అంశమాత్రముగా, వంశమాత్రముగా, వాటిపై ఇప్పుడు కూడా కొంచెం-కొంచెం ప్రేమ ఉంది. ఉందా ప్రేమ! అప్పుడప్పుడైతే ప్రేమ కలుగుతుంది. కలుగుతుందా? మాతలూ? డబుల్ విదేశీయులూ, క్రోధము రాదా? కొంతమంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడుతారు, ఏమంటారో వినిపించమంటారా? వినిపించమంటారా? ఒకవేళ నేను వినిపిస్తే, మరి మీరు ఈ రోజు వదిలేయాల్సి ఉంటుంది. సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా, వదిలేస్తారా? లేక కేవలము ఫైల్లో కాగితాన్ని జమ చేస్తారా? ప్రతి సంవత్సరము చేస్తుంటారు కదా, ప్రతిజ్ఞల ఫైళ్లు బాబా వద్ద చాలా-చాలా పెద్దవైపోయాయి, మరి అలాగే ఇప్పుడు కూడా మరొక ప్రతిజ్ఞా కాగితాన్ని ఫైల్లో జమ చేయడమేది చేయరు కదా, అలా చేయరు కదా! ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో పెడతారా? ఏం చేస్తారు? చెప్పండి, టీచర్లు ఏం చేస్తారు? ఫైనల్? చెయ్యి ఎత్తండి. ఏదో అలా ఊరికే ప్రతిజ్ఞ చెయ్యకండి. మరల బాప్ దాదా కాస్తంత రూపాన్ని ధారణ చేస్తారు. సరేనా. డబుల్ విదేశీయులు - ఫైనల్ చేస్తారా? ఎవరైతే ఫైనల్ చేస్తారో వారు చేతులెత్తండి. టి.వి.లో చూపించండి. చిన్నగా త్రేతాయుగీ చేతిని ఎత్తటము కాదు, చేతిని బాగా పైకి ఎత్తండి. అచ్ఛా, మంచిది.

వినండి, బాబా మరియు పిల్లల మాటలు ఎలా ఉంటాయి? బాప్ దాదా నవ్వుతుంటారు. క్రోధము ఎందుకు చేసావు అని బాబా అంటారు. దానికి వారు అంటారు - నేను చేయలేదు, కానీ నా చేత క్రోధము చేయించారు. నేను చేయలేదు, నా చేత చేయించారు. మరి ఇప్పుడు బాబా ఏమనాలి? ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మీరు అక్కడ ఉండి ఉంటే మీకు కూడా క్రోధము వచ్చేస్తుంది. మధురాతి-మధురమైన మాటలు మాట్లాడుతారు కదా! ఇంకా ఏమంటారు, నిరాకారము నుండి సాకార తనువును తీసుకుని చూడండి. మరి ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మధురమైన పిల్లలకు బాబా ఏమి చెప్పాలి! అయినా కూడా బాబాకు దయార్దృ హృదయునిగా అవ్వవలసి ఉంటుంది. వారేమంటారంటే - అచ్ఛా, ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇకముందు చెయ్యకండి. కానీ చాలా మంచి-మంచి జవాబులిస్తారు.

పవిత్రత బ్రాహ్మణులైన మీ యొక్క అత్యంత గొప్ప అలంకరణ, అందుకే మీ చిత్రాలను ఎంతగా అలంకరిస్తారు. ఇది పవిత్రత యొక్క స్మృతిచిహ్న అలంకారము. పవిత్రత అనగా సంపూర్ణ పవిత్రత, ఏదో పైపైకి, మొక్కుబడిగా ఉండే పవిత్రత కాదు. సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితము యొక్క అన్నింటికన్నా అత్యంత పెద్ద ప్రాపర్టీ (ఆస్తి), రాయల్టీ (హుందాతనము), పర్సనాలిటీ (వ్యక్తిత్వము). అందుకే భక్తులు కూడా ఒక్క రోజు కోసము పవిత్రతా వ్రతాన్ని చేపడతారు. వారు మిమ్మల్ని కాపీ చేసారు. రెండవది, ఆహార-పానీయాల వ్రతాన్ని చేపడతారు. ఆహార-పానీయాల వ్రతము కూడా అవసరము. ఎందుకని? బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార-పానీయాల వ్రతాన్ని పక్కాగా చేపట్టారు కదా! మధుబన్ కు వచ్చేందుకు అందరి చేత ఫారం నింపించినప్పుడు, ఆహార-పానీయాల శుద్ధత ఉందా అని ఇది కూడా ఫారంలో నింపిస్తారు కదా? నింపిస్తారు కదా! మరి ఆహార-పానీయాల వ్రతము పక్కాగా ఉందా? పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు కచ్చాగా అయిపోతుందా? డబుల్ విదేశీయులకైతే డబుల్ పక్కాగా ఉంటుంది కదా! డబుల్ విదేశీయులకు డబుల్ పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోతే, అచ్ఛా, ఈ రోజు కొద్దిగా తినేద్దాము అని అంటారా, కొంచెం ఢీలా చేసేస్తారా, అలా వద్దు. ఆహార-పానీయాలలో పక్కాగా ఉంటారు, అందుకే భక్తులు కూడా ఆహార-పానీయాల వ్రతాన్ని చేపడతారు. మూడవ వ్రతము జాగరణకు సంబంధించి పెట్టుకుంటారు - రాత్రివేళ మేల్కుని ఉంటారు కదా! బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకొనే వ్రతాన్ని చేపడతారు. మధ్యమధ్యలో అజ్ఞానమనే నిద్ర అయితే రాదు కదా! భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారు, మీరు పక్కాగా ఉన్నారు కావుననే కదా వారు కాపీ చేస్తారు. ఎప్పుడూ కూడా అజ్ఞానము యొక్క అనగా బలహీనత, నిర్లక్ష్యము, సోమరితనము యొక్క నిద్ర రాకూడదు. లేక కొంచెం-కొంచెం కునుకుపాట్లు వచ్చినా పర్వాలేదా? కునుకుపాట్లు పడతారా? అమృతవేళ కూడా కొందరు కునుకుపాట్లు పడుతుంటారు. కానీ ఆలోచించండి - మా స్మృతిచిహ్నములో భక్తులు ఏమేమి కాపీ చేస్తున్నారు! భక్తులు ఎంత పక్కాగా ఉంటారంటే ఏం జరిగినా కానీ వ్రతాన్ని భంగము చేయరు. ఈ రోజున భక్తులు ఆహార-పానీయాల ఉపవాసము కూడా చేస్తారు, మరి ఈ రోజు మీరేమి చేస్తారు? పిక్నిక్ చేసుకుంటారా? వారు ఉపవాసము చేస్తారు మరియు మీరు పిక్నిక్ చేసుకుంటారు, కేక్ కట్ చేస్తారు కదా! పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరు జన్మించినప్పటి నుండే వ్రతాన్ని చేపట్టారు, అందుకే ఈ రోజు పిక్నిక్ చేసుకుంటారు.

బాప్ దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? మీకు తెలుసు కదా. సంకల్పాలు చాలా మంచివి చేస్తారు, ఎంత మంచి సంకల్పాలు చేస్తారంటే వాటిని వింటూ-వింటూ సంతోషపడిపోతాము. సంకల్పము చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది? సంకల్పము బలహీనముగా ఎందుకవుతుంది? మీరు కోరుకుంటున్నారు కూడా ఎందుకంటే బాబాపై చాలా ప్రేమ ఉంది, బాప్ దాదాపై పిల్లలందరికీ మనస్ఫూర్వకమైన ప్రేమ ఉంది అన్నది బాబాకు కూడా తెలుసు మరియు ప్రేమ విషయములో అందరూ చేతులెత్తుతారు, 100 శాతము ఏంటి, 100 శాతము కంటే ఎక్కువే ఉంది అని అంటారు. మరియు బాబా కూడా, ప్రేమలో అందరూ పాస్ అయ్యారు అన్నదానిని అంగీకరిస్తారు. కానీ ఏమిటి? కానీ... అనేది ఉందా, లేదా? కానీ అనేది వస్తుందా, రాదా? పాండవులూ, మధ్యమధ్యలో కానీ అనేది వస్తుందా? రాదు అని అనటము లేదంటే వస్తుందనే కదా! బాప్ దాదా మెజారిటీ పిల్లల్లో ఒక విషయాన్ని నోట్ చేసారు - ప్రతిజ్ఞ బలహీనము అవ్వటానికి ఒకటే కారణము ఉంది, ఒకటే పదము ఉంది. ఆ పదము ఏమిటో ఆలోచించండి? టీచర్లు చెప్పండి, ఆ ఒక్క పదము ఏమిటి? పాండవులు చెప్పండి, ఆ ఒక్క పదము ఏమిటి? గుర్తుకు వచ్చేసింది కదా! ఆ ఒక్క పదము ఏమిటంటే - ‘‘నేను’’. అభిమానము రూపములో కూడా ‘నేను’ అనేది వస్తుంది మరియు బలహీనము చెయ్యటములో కూడా ‘నేను’ అనేది వస్తుంది. నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే చేసానో, నేను ఏదైతే అనుకున్నానో, అదే రైట్. అదే జరగాలి. ఇది అభిమానముతో కూడుకున్న ‘నేను’. నేను అనేది ఎప్పుడైతే నెరవేరదో, అప్పుడు నిరాశలోకి కూడా వస్తారు, నేను చెయ్యలేను, నడవలేను, చాలా కష్టము. దేహాభిమానానికి చెందిన ‘నేను’ అనేది మారిపోవాలి, ‘నేను’ అనేది స్వమానాన్ని కూడా గుర్తు తెప్పిస్తుంది మరియు ‘నేను’ అనేది దేహాభిమానములోకి కూడా తీసుకువస్తుంది. ‘నేను’ అనేది నిరాశలోకి కూడా తీసుకువస్తుంది మరియు ‘నేను’ అనేది మనసును సంతోషపెడుతుంది కూడా. మరియు అభిమానము యొక్క గుర్తు ఏమిటో తెలుసా? ఎప్పుడైనా, ఎవరిలోనైనా ఒకవేళ దేహాభిమానానికి చెందిన అభిమానము అంశమాత్రము ఉన్నా కూడా, దాని గుర్తు ఏముంటుంది? వారు తమ అవమానాన్ని సహించ లేరు. అభిమానము అవమానాన్ని సహించనివ్వదు. ఇది కరక్టు కాదు, కొద్దిగా నిర్మానచిత్తముగా అవ్వండి అని ఎవరైనా కొద్దిగా చెప్పినా, అది వారికి అవమానముగా అనిపిస్తుంది, ఇది అభిమానానికి గుర్తు.

బాప్ దాదా వతనములో నవ్వుతూ ఉన్నారు - ఈ పిల్లలు శివరాత్రి సందర్భముగా ఇక్కడా, అక్కడా భాషణ చేస్తారు కదా, ఇప్పుడు చాలా భాషణలు చేస్తున్నారు కదా. అందులో ఏమి చెప్తారు, బాప్ దాదాకు పిల్లల పాయింట్ గుర్తుకొచ్చింది. అందులో ఏం చెప్తారంటే, శివరాత్రి నాడు మేకను బలి ఇస్తారు - ఆ మేక మే, మే అని చాలా అంటుంటుంది కదా, అలాగే శివరాత్రి నాడు ఈ ‘‘మై-మై’’ (నేను-నేను) అనేదానిని బలి ఇవ్వండి. బాబా అది వింటూ, వింటూ నవ్వుకుంటున్నారు. మరి ఈ ‘నేను’ అనేదానిని మీరు కూడా బలి ఇవ్వండి. సరెండర్ చెయ్యగలరా? చెయ్యగలరా? పాండవులు చెయ్యగలరా? డబుల్ విదేశీయులు చెయ్యగలరా? ఫుల్ సరెండరా లేక సరెండరా? ఫుల్ సరెండర్. ఈ రోజు బాప్ దాదా జెండా ఎగరవేసే సమయములో మామూలుగా ప్రతిజ్ఞ చేయించరు. ఈ రోజు ప్రతిజ్ఞ చెయ్యటము మరియు ఫైల్ లో ఆ కాగితాన్ని జమ చెయ్యటము, ఇటువంటి ప్రతిజ్ఞను చేయించరు. ఏం ఆలోచిస్తున్నారు, దాదీలు, ఈ రోజు కూడా అటువంటి ప్రతిజ్ఞను చేయించాలా? ఫైనల్ చేస్తారా లేక ఫైల్ లో జమ చేస్తారా? చెప్పండి (ఫైనల్ చేయించండి). ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? వినటములో నిమగ్నమైపోయారు, చేతులెత్తటం లేదు. రేపు ఏమీ అవ్వదు కదా! అవ్వదు కదా! రేపు మాయ తిరగటానికి వస్తుంది. మాయకు కూడా మీపై ప్రేమ ఉంది కదా ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా ఘనముగా సేవా ప్లాన్లను తయారుచేస్తున్నారు కదా. సేవను చాలా వైభవముగా చేస్తున్నారు, సేవను చాలా వైభవముగా చెయ్యటము అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపముగా తీసుకురావటము. భాషణ చేసి వచ్చాము అని ఊరికే అలా అనుకోకండి కానీ సమయాన్ని సమీపముగా తీసుకువస్తున్నారు. సేవ బాగా చేస్తున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ బాప్ దాదా చూస్తున్నారు, సమయము సమీపముగా వస్తూ ఉంది, మీరు తీసుకువస్తున్నారు. కేవలం లక్షమందిని, లక్షన్నర మందిని ప్రోగు చేసారనే కాదు, మీరు సమయాన్ని సమీపముగా తీసుకువచ్చారు. ఇప్పుడు గుజరాత్ చేసింది, తర్వాత బొంబాయి చేస్తుంది, ఇతరులు కూడా చేస్తున్నారు. పోనీ, లక్షమంది కాకపోయినా 50 వేలమందైనా పరవాలేదు కానీ సందేశాన్ని ఇస్తున్నారు. మరి సందేశముతోపాటు సంపన్నతకు యొక్క తయారీ కూడా జరుగుతుందా? తయారీ ఉందా? వినాశనాన్ని పిలుస్తున్నారు, మరి తయారీ ఉందా? దాదీ ప్రశ్న అడిగారు, త్వరత్వరగా ప్రత్యక్షత జరగాలంటే ఇప్పుడు ఎటువంటి ప్లాన్ ను తయారుచేయాలి అని. అందుకు బాప్ దాదా అంటున్నారు, ప్రత్యక్షత అనేది క్షణము యొక్క విషయము, కానీ ప్రత్యక్షత కంటే ముందు బాప్ దాదా అడుగుతున్నారు, స్థాపనవారు ఎవర్రెడీగా ఉన్నారా? పరదా తెరవమంటారా? లేదా కొందరు చెవులను అలంకరించుకుంటూ ఉన్నారా, కొందరు తలను అలంకరించుకుంటూ ఉన్నారా? తయారుగా ఉన్నారా? అయిపోతారా, ఎప్పుడు? డేట్ చెప్పండి. ఎలాగైతే ఇప్పుడు డేట్ ను ఫిక్స్ చేసారు కదా! ఈ మాసము లోపల సందేశాన్ని ఇవ్వాలి అని! అలాగే అందరూ ఎవర్రెడీగా ఉండాలి, తక్కువలో తక్కువ 16 వేలమందైనా ఎవర్రెడీగా ఉండాలి, 9 లక్షల విషయము వదిలేయండి, దానిని కూడా వదిలేయండి, 16 వేలమందైతే తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చప్పట్లు కొట్టాలా? ఊరికే అలా సరే అని చెప్పకండి. ఎవర్రెడీగా అయిపోండి, అప్పుడు బాబా టచ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది, సైన్స్ వారు తమ పనిని ప్రారంభిస్తారు. ఆలస్యమేముంది, అందరూ రెడీగా ఉన్నారు. 16 వేల మంది తయారుగా ఉన్నారా? ఉన్నారా తయారుగా? తయారైపోతారా. (మీకే బాగా తెలుసు). ఈ జవాబు తప్పించుకోవటానికి ఇచ్చే జవాబు. ఎవర్రెడీగా ఉన్నాము, సంపూర్ణ పవిత్రతతో సంపన్నముగా అయిపోయాము అని 16 వేల మంది నుండి రిపోర్ట్ రావాలి. బాప్ దాదాకు చప్పట్లు కొట్టడానికి ఆలస్యమేమీ లేదు. డేట్ చెప్పండి (మీరు డేట్ ఇవ్వండి) అందరినీ అడగండి. చూడండి, జరిగేదే ఉంది కానీ వినిపించాము కదా - ‘నేను’ అనే పదము సంపూర్ణముగా పరివర్తన అవ్వాలి, అప్పుడు బాబాతోపాటు వెళ్తారు. లేదంటే వెనక-వెనక వెళ్ళాల్సి వస్తుంది. బాప్ దాదా అందుకే ఇప్పుడే గేట్ తెరవరు ఎందుకంటే తోడుగా వెళ్ళాలి.

బ్రహ్మాబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు - గేట్ తెరిచే డేట్ ను చెప్పండి. గేట్ తెరవాలి కదా! వెళ్ళాలి కదా! ఈ రోజు జరుపుకోవటము అనగా తయారవ్వటము. కేవలం కేక్ ను కట్ చెయ్యటము కాదు, కానీ ‘నేను’ అనేదానిని సమాప్తము చేస్తారు. ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేసారా? ఎందుకంటే బాప్ దాదా వద్దకు అమృతవేళ అందరి నుండి చాలా వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి. కనుక పరస్పరం చర్చించుకుని బాబాకు డేట్ చెప్పండి. డేట్ ఫిక్స్ చేయనంత వరకు ఏ పనులూ జరగవు. మొదట మహారథులు పరస్పరములో డేట్ ఫిక్స్ చెయ్యండి, తర్వాత అందరూ ఫాలో చేస్తారు. ఫాలో చేసేవారు సిద్ధముగా ఉన్నారు మరియు మీ ధైర్యము వలన ఇంకా ఎక్కువ బలము లభిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఉల్లాస- ఉత్సాహాలను ఇప్పించినందుకు సిద్ధమైపోయారు కదా! అలా సంపన్నముగా అయ్యే ప్లాన్ ను తయారుచేయండి. కర్మాతీతముగా అవ్వాల్సిందే అన్న ధ్యాసలో నిమగ్నమైపోండి. ఏం జరిగినా కానీ తయారవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, జరగాల్సిందే. సైన్స్ వారి శబ్దము కూడా, వినాశనము చేసేవారి శబ్దము కూడా బాబా చెవులకు చేరుకుంటుంది, వారు కూడా అంటున్నారు - ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అని. అడ్వాన్స్ పార్టీ వారు కూడా అంటున్నారు - డేట్ ను ఫిక్స్ చేయండి, డేట్ ను ఫిక్స్ చేయండి అని. బ్రహ్మాబాబా కూడా డేట్ ను ఫిక్స్ చేయండి అని అంటున్నారు. కనుక ఈ మీటింగ్ చెయ్యండి. బాప్ దాదా ఇప్పుడు ఇంత దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. ముందుగా శక్తులైన మీకు, దేవతలైన పాండవులకు దయ రావాలి. ఎంతగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ పిలుపు యొక్క ధ్వని మీ చెవులలో మారుమ్రోగాలి. సమయము యొక్క పిలుపు అన్న ప్రోగ్రామును చేస్తారు కదా! ఇప్పుడు భక్తుల పిలుపును కూడా వినండి, దుఃఖితుల పిలుపును కూడా వినండి. సేవ చేసే విషయములో నంబర్ మంచిగా ఉంది, దీనికైతే బాప్ దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తారు, ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, గుజరాతువారు నంబరు వన్ తీసుకున్నారు, కనుక నంబరు వన్ తీసుకున్నందుకు అభినందనలు. ఇప్పుడు కొంచెం-కొంచెం వారి పిలుపును వినండి కదా, పాపం వారు చాలా పిలుస్తున్నారు, మనస్ఫూర్తిగా పిలుస్తున్నారు, విలవిలలాడుతున్నారు. సైన్స్ వారు కూడా చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని పిలుస్తున్నారు. ఈ రోజైతే కేక్ కట్ చేసుకోండి, కానీ రేపటి నుండి పిలుపును వినండి. జరుపుకోవటమైతే సంగమయుగపు వేడుక. ఒకవైపు జరుపుకోండి, మరొకవైపు ఆత్మలను తయారుచెయ్యండి. అచ్ఛా. మరి ఏం విన్నారు?

దుఃఖితులపై కొంచెం దయ చూపించండి అన్న మీ పాట ఉంది. మీరు తప్ప ఇంకెవరూ దయ చూపించలేరు, అందుకే ఇప్పుడు సమయమనుసారముగా దయలో మాస్టర్ సాగరులుగా అవ్వండి. స్వయం పట్ల కూడా దయ, ఇతర ఆత్మల పట్ల కూడా దయ. ఇప్పుడు మీ ఈ స్వరూపముగా లైట్ హౌస్ గా అయ్యి రకరకాల లైట్ల యొక్క కిరణాలను ఇవ్వండి. మొత్తము విశ్వములోని అప్రాప్త ఆత్మలకు ప్రాప్తి అనే అంచలి యొక్క కిరణాలను ఇవ్వండి. అచ్ఛా.

సాక్షాత్తు బాబా సమాన శ్రేష్ఠాత్మలందరికీ, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే బాబా యొక్క సమీప ఆత్మలకు, సదా అన్ని అడుగులను బాబా సమానముగా వేసే పిల్లలకు, నలువైపులా ఉన్న బ్రాహ్మణ జన్మ అభినందనలకు పాత్రులైన పిల్లలకు, సదా ఏకాగ్రతా శక్తి సంపన్న ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు పదమాపదమాల రెట్ల జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే.

ప్రియమైన అవ్యక్త బాప్ దాదా తమ హస్తాలతో శివ ధ్వజారోహణ చేసారు మరియు అందరికీ అభినందనలను తెలిపారు:-

ఈ రోజు అందరూ జన్మదిన శుభాకాంక్షలను ఇచ్చారు మరియు తీసుకున్నారు మరియు జెండాను కూడా ఎగరవేసారు. కానీ ఇప్పుడు విశ్వమనే గ్లోబ్ పై ఆత్మలందరూ నిలబడి మీ అందరి ముఖాలలో బాబా జెండాను చూసే రోజును త్వరగా తీసుకురావాలి. వస్త్రముతో తయారుచేసిన జెండా అయితే నిమిత్తమాత్రము, కానీ ఒక్కొక్క బిడ్డ యొక్క ముఖము బాబా చిత్రాన్ని చూపించాలి. అటువంటి జెండాను ఎగరవేయాలి. ఆ రోజును కూడా చాలా, చాలా, చాలా త్వరగా తీసుకురావాలి, అది రావాలి, రావాలి. ఓం శాంతి.

వరదానము:-
హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ

ఏ విధంగా బ్రహ్మాబాబా కర్మబంధనాల నుండి ముక్తులై, అతీతముగా ఉండే ఋజువును ఇచ్చారు. కేవలం సేవ పట్ల స్నేహము తప్ప వేరే ఏ బంధనము లేదు. సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలు ఏవైతే ఉంటాయో, అవి కూడా లెక్కాచారాల బంధనములో బంధిస్తాయి, సత్యమైన సేవాధారులు ఈ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఏ విధంగా దేహము యొక్క బంధనము, దేహ సంబంధాల బంధనము ఉంటాయో, అలాగే సేవలో స్వార్థము - ఇది కూడా బంధనమే. ఈ బంధనము నుండి మరియు రాయల్ లెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా, నిస్వార్థ సేవాధారులుగా అవ్వండి.

స్లోగన్:-
ప్రతిజ్ఞలను ఫైల్ లో ఉంచకండి, ఫైనల్ గా అయ్యి చూపించండి.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము, బ్రహ్మా వత్సలందరూ సంగఠిత రూపములో సాయంత్రము 6.30 నుండి 7.30 గంటల వరకు విశేషముగా మూలవతనము యొక్క లోతైన శాంతిని అనుభవము చేయండి, మనస్సు-బుద్ధిని ఏకాగ్రము చేసి జ్వాలా స్వరూపములో స్థితులై సంపన్నత మరియు సంపూర్ణతను అనుభవము చేయండి.