16-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - స్మృతి చార్టు పెట్టండి, ఎంతెంతగా
స్మృతిలో ఉండే అలవాటు ఏర్పడుతూ ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతూ ఉంటాయి, కర్మాతీత
అవస్థ సమీపముగా వస్తూ ఉంటుంది’’
ప్రశ్న:-
చార్టు
సరిగ్గా ఉందా లేదా అన్నదానిని ఏ 4 విషయాల ద్వారా పరిశీలించవచ్చు?
జవాబు:-
1. ఆసామి 2.
నడవడిక 3. సేవ 4. సంతోషము. బాప్ దాదా ఈ నాలుగు విషయాలను చూసి, వీరి చార్టు సరిగ్గా
ఉందా లేదా అన్నది చెప్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శిని సేవలో ఉంటారో, ఎవరి
నడవడిక అయితే రాయల్ గా ఉంటుందో, ఎవరైతే అపారమైన సంతోషములో ఉంటారో, తప్పకుండా వారి
చార్టు సరిగ్గా ఉంటుంది.
పాట:-
ముఖాన్ని
చూసుకో ఓ ప్రాణీ...
ఓంశాంతి
ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు, దీని అర్థాన్ని కూడా లోలోపల తెలుసుకోవాలి - ఎన్ని
పాపాలు మిగిలి ఉన్నాయి, ఎంత పుణ్యము జమ అయ్యింది అనగా ఆత్మ సతోప్రధానముగా
తయారవ్వడానికి ఇంకా ఎంత సమయము పడుతుంది? ఇప్పుడు ఎంతవరకూ పావనమయ్యారు - ఇదైతే అర్థం
చేసుకోగలరు కదా? చార్టులో కొందరు - మేము 2, 3 గంటలు స్మృతిలో ఉన్నాము అని వ్రాస్తారు,
కొందరు ఒక గంట అని వ్రాస్తారు. ఇది చాలా తక్కువ. తక్కువగా స్మృతి చేస్తే తక్కువ
పాపాలు అంతమవుతాయి. ఇప్పుడైతే ఇంకా అంతమవ్వని పాపాలు చాలా ఉన్నాయి కదా. ఆత్మనే
ప్రాణి అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు - ఓ ఆత్మా, స్వయాన్ని
ప్రశ్నించుకో, ఈ లెక్కన ఇప్పటికి ఎన్ని పాపాలు అంతమై ఉంటాయి? మనము ఎంత
పుణ్యాత్ములుగా అయ్యాము అన్నది చార్టు ద్వారా తెలుస్తుంది. కర్మాతీత అవస్థ అంతిమములో
ఏర్పడుతుంది అనైతే తండ్రి అర్థం చేయించారు. స్మృతి చేస్తూ, చేస్తూ అది అలవాటైపోతే
ఇంకా ఎక్కువ పాపాలు అంతమవ్వడం మొదలవుతుంది. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - మేము ఎంతగా
తండ్రి స్మృతిలో ఉంటున్నాము? ఇందులో గొప్పలు చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ విషయములో
స్వయాన్ని పరిశీలించుకోవలసి ఉంటుంది. బాబాకు మీ చార్టు వ్రాసి ఇస్తే, ఈ చార్టు
సరిగ్గా ఉందా, లేదా అనేది బాబా వెంటనే చెప్తారు. ఆసామి, నడవడిక, సేవ మరియు
సంతోషాన్ని చూసి, వీరి చార్టు ఎలా ఉంది అన్నది బాబా వెంటనే అర్థం చేసుకుంటారు!
ఘడియ-ఘడియ స్మృతి ఎవరికి ఉంటూ ఉండవచ్చు? ఎవరైతే మ్యూజియం మరియు ప్రదర్శిని సేవలో
ఉంటారో వారికి. మ్యూజియంలోనైతే రోజంతా రావడం పోవడం ఉంటుంది. ఢిల్లీలో అయితే చాలామంది
వస్తూ ఉంటారు. ఘడియ-ఘడియ తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా,
వినాశనానికి ఇంకా కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి అని చెప్తే, అది ఎలా అవుతుంది
అని అంటారు. అప్పుడు వెంటనే చెప్పాలి - ఇదేమీ మేము చెప్పడం లేదు, భగవానువాచ ఉంది కదా,
భగవానువాచ అయితే తప్పకుండా సత్యమే అవుతుంది కదా. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు -
ఘడియ, ఘడియ ఇది శివబాబా శ్రీమతము అని చెప్పండి. ఇది మేము చెప్పడం లేదు, ఇది వారి
శ్రీమతము అని చెప్పండి. వారు ఉన్నదే ట్రూత్ (సత్యము). మొట్టమొదటైతే తండ్రి
పరిచయాన్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది, అందుకే బాబా అన్నారు, ప్రతి చిత్రములోనూ -
శివ భగవానువాచ అని వ్రాయండి. వారు ఏక్యురేట్ గానే తెలియజేస్తారు, మనకు కూడా
ఇంతకుముందు తెలియదు కదా. తండ్రి తెలియజేశారు, కావుననే మనము చెప్తున్నాము. వినాశనము
త్వరలో జరగనున్నదని ఫలానావారు భవిష్యత్తును తెలియజేశారని అప్పుడప్పుడు
వార్తాపత్రికలలో కూడా వేస్తారు.
ఇపుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలైతే ఎంతోమంది
ఉన్నారు కదా. మేము అనంతమైన తండ్రి పిల్లలమని మీరు తెలియజేస్తారు. వారే పతిత-పావనుడు,
జ్ఞాన సాగరుడు. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేయించి, పక్కా చేసి, ఆ తర్వాత ముందుకు
వెళ్ళాలి. యాదవులు, కౌరవులు మొదలైనవారు వినాశన కాలములో విపరీత బుద్ధి కలిగి ఉంటారని
శివబాబా చెప్పారని చెప్పండి. శివబాబా పేరును తీసుకుంటూ ఉంటే అందులో పిల్లల కళ్యాణము
కూడా ఉంది. శివబాబానే స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో
దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. సేవ చేసేవారి చార్టు బాగా ఉంటూ ఉండవచ్చు.
వారు మొత్తం రోజంతటిలో 8 గంటలు సేవలో బిజీ ఉంటారు. మహా అయితే ఒక గంట విశ్రాంతి
తీసుకుంటారేమో. అయినా 7 గంటలైతే సేవలో ఉంటారు కదా. కావున వారి వికర్మలు చాలా
వినాశనమవుతూ ఉండవచ్చునని అర్థం చేసుకోవాలి. అనేకులకు ఘడియ-ఘడియ తండ్రి పరిచయాన్ని
ఇస్తూ ఉంటే తప్పకుండా ఇటువంటి సేవాయోగ్యులైన పిల్లలు తండ్రికి కూడా ప్రియమనిపిస్తారు.
వీరు అనేకుల కళ్యాణము చేస్తున్నారు, వీరికి రాత్రింబవళ్ళు మేము అనేకుల కళ్యాణము
చేయాలి అన్న చింతనే ఉంటుంది అన్నది తండ్రి చూస్తారు. అనేకుల కళ్యాణము చేయడమంటే
స్వయము యొక్క కళ్యాణము చేసుకోవడమే. స్కాలర్షిప్ కూడా అనేకుల కళ్యాణము చేసేవారికే
లభిస్తుంది. పిల్లలకైతే ఇదే వ్యాపారము. టీచరుగా అయి అనేకులకు మార్గము తెలియజేయాలి.
మొదటైతే ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయవలసి ఉంటుంది. ఎవరి కళ్యాణమూ చేయకపోతే వీరి
అదృష్టములోనే లేదని భావించడం జరుగుతుంది. పిల్లలు అంటారు - బాబా, మమ్మల్ని ఉద్యోగము
నుండి విడిపించండి, మేము ఈ సేవలో నిమగ్నమవుతాము. తప్పకుండా వీరు సేవకు అర్హులు,
బంధనముక్తులుగా కూడా ఉన్నారు అని బాబా కూడా చూస్తారు, అప్పుడు - 500-1000
సంపాదించడము కన్నా ఈ సేవలో నిమగ్నమై అనేకుల కళ్యాణము చేయండి అని చెప్తారు. అది కూడా
బంధనముక్తులైతేనే. అది కూడా, బాబాకు వారు సేవాయోగ్యులుగా కనిపిస్తేనే సలహా ఇస్తారు.
సేవాయోగ్యులైన పిల్లలనైతే అక్కడికి, ఇక్కడికి పిలుస్తూ ఉంటారు. స్కూలులో
విద్యార్థులు చదువుకుంటారు కదా, ఇది కూడా చదువే. ఇదేమీ ఒక సామాన్యమైన మతము కాదు.
సత్యము అంటేనే సత్యాన్ని చెప్పేవారు. మేము శ్రీమతముపై మీకు ఇది అర్థం చేయిస్తాము.
ఈశ్వరుని మతము ఇప్పుడే మీకు లభిస్తుంది.
తండ్రి అంటారు, మీరు తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని
తీసుకోండి. కల్ప-కల్పమూ మీకు వారసత్వము లభిస్తూ వచ్చింది ఎందుకంటే స్వర్గ స్థాపన
అయితే కల్ప-కల్పమూ అవుతుంది కదా. ఈ సృష్టి చక్రము 5 వేల సంవత్సరాలది అని ఎవరికీ
తెలియదు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. మీరు ఇప్పుడు అత్యంత
ప్రకాశములో ఉన్నారు. స్వర్గ స్థాపననైతే తండ్రియే చేస్తారు. ప్రపంచానికి మంటలు
అంటుకున్నాయి, అయినా కానీ అజ్ఞాన నిద్రలో పడుకునే ఉన్నారని గాయనము ఉంది. అనంతమైన
తండ్రి జ్ఞాన సాగరుడని పిల్లలైన మీకు తెలుసు. ఉన్నతోన్నతుడైన తండ్రి కర్తవ్యము కూడా
ఉన్నతమైనది. అంతేకానీ ఈశ్వరుడైతే సమర్థుడు, ఏది కావాలంటే అది చేస్తారు అని కాదు. అలా
కాదు. ఇది కూడా డ్రామాగా అనాదిగా తయారై ఉంది. అంతా డ్రామానుసారముగానే జరుగుతుంది.
యుద్ధాలు మొదలైనవాటిలో ఎంతమంది మరణిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది.
ఇందులో భగవంతుడు ఏం చేయగలరు. భూకంపాలు మొదలైనవి జరిగితే - ఓ భగవంతుడా! అని ఎంతగా
ఆర్తనాదాలు చేస్తారు, కానీ భగవంతుడు ఏం చేయగలరు. భగవంతుడినైతే - మీరు వచ్చి వినాశనము
చేయండి అని మీరు పిలిచారు. పతిత ప్రపంచములోకి పిలిచారు. స్థాపన చేసి అందరి వినాశనము
చేయించండి అని పిలిచారు. కానీ నేను వినాశనము చేయను, అది డ్రామాలో నిశ్చితమై ఉంది.
రక్తసిక్తమైన ఆటగా అయిపోతుంది. ఇందులో రక్షించడము మొదలైనవాటి విషయమే లేదు. పావన
ప్రపంచాన్ని తయారుచేయండి అని మీరు అన్నారు, కావున పతిత ఆత్మలు తప్పకుండా
వెళ్ళిపోతారు కదా. కొందరైతే అసలు ఏమీ అర్థం చేసుకోరు. శ్రీమతము యొక్క అర్థాన్ని కూడా
అర్థం చేసుకోరు, భగవంతుడు అంటే ఏమిటి అన్నదేమీ అర్థం చేసుకోరు. పిల్లలు ఎవరైనా
సరిగ్గా చదవకపోతే, నీవు రాతిబుద్ధి కలవాడివి అని తల్లిదండ్రులు అంటారు. సత్యయుగములో
ఇలా అనరు. కలియుగములో ఉండేదే రాతిబుద్ధి. పారసబుద్ధి కలవారు ఇక్కడ ఎవరూ ఉండలేరు. ఈ
రోజుల్లో చూడండి, మనుష్యులు ఏమేమి చేస్తూ ఉన్నారు! ఒక గుండెను తీసి ఇంకొక గుండెను
పెడతారు. అచ్ఛా, ఇంత కష్టపడి ఇది చేసారు, కానీ దీని వల్ల లాభము ఏమిటి? బహుశా
మరికొన్ని రోజులు జీవిస్తారేమో. అనేకమంది రిద్ధి-సిద్ధులను నేర్చుకుని వస్తారు, కానీ
లాభమేమీ లేదు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేయండి, మేము
పతిత ప్రపంచములో ఉంటూ చాలా దుఃఖితులైపోయాము అనే భగవంతుడిని తలచుకుంటారు.
సత్యయుగములోనైతే అనారోగ్యము మొదలైన దుఃఖపు విషయమేదీ ఉండదు. ఇప్పుడు తండ్రి ద్వారా
మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ కూడా మనుష్యులు చదువు ద్వారానే ఉన్నతమైన
డిగ్రీలు పొందుతారు. చాలా సంతోషముగా ఉంటారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే జీవించి
ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. పాపాల భారమైతే తలపై చాలా ఉంది. చాలా శిక్షలు
అనుభవిస్తారు. స్వయాన్ని పతితులుగా పిలుచుకుంటారు కదా. వికారాలలోకి వెళ్ళడాన్ని
పాపముగా భావించరు. పాపాత్ములుగా అయితే అవుతారు కదా. గృహస్థ ఆశ్రమమైతే అనాదిగా
నడుస్తూ వస్తోందని అంటారు. సత్య, త్రేతాయుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేదని అర్థం
చేయించడం జరుగుతుంది. అక్కడ పాపాత్ములు ఉండేవారు కాదు. ఇక్కడ పాపాత్ములుగా ఉన్నారు,
అందుకే దుఃఖితులుగా ఉన్నారు. ఇక్కడైతే అల్పకాలికమైన సుఖము ఉంది, రోగగ్రస్తులుగా
అవుతారు మరియు చనిపోతారు. మృత్యువు అయితే నోరు తెరుచుకుని కూర్చుంది. అకస్మాత్తుగా
హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది కాకి రెట్ట సమానమైన సుఖము. అక్కడైతే మీకు
అపారమైన సుఖము ఉంటుంది. మీరు మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. ఏ రకమైన
దుఃఖమూ ఉండదు. వేడీ ఉండదు, చలీ ఉండదు, సదా వసంత ఋతువే ఉంటుంది. తత్వాలు కూడా
సక్రమముగా ఉంటాయి. స్వర్గము స్వర్గమే. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. మీరు
వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేయండి, మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని మీరు
స్వర్గాన్ని స్థాపన చేసేందుకే తండ్రిని పిలుస్తారు.
ప్రతి చిత్రము పైన శివ భగవానువాచ అని వ్రాసి ఉండాలి. దీని వలన ఘడియ-ఘడియ శివబాబా
గుర్తుకొస్తూ ఉంటారు. జ్ఞానము కూడా ఇస్తూ ఉంటారు. మ్యూజియం మరియు ప్రదర్శిని సేవలో
జ్ఞానము మరియు యోగము, రెండూ కలిసి ఉంటాయి. స్మృతిలో ఉండడము ద్వారా నషా ఎక్కుతుంది.
మీరు పావనముగా అయి మొత్తం విశ్వమంతటినీ పావనముగా తయారుచేస్తారు. మీరు పావనముగా
తయారయ్యాక తప్పకుండా సృష్టి కూడా పావనమైనదే కావాలి. అంతిమములో, వినాశన సమయమైన
కారణముగా అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. మీ కోసము నేను కొత్త సృష్టిని
ప్రారంభించవలసి ఉంటుంది. ఇక తర్వాత బ్రాంచులు తెరుస్తూ ఉంటారు. పవిత్రముగా
తయారుచేసేందుకు కొత్త ప్రపంచమైన సత్యయుగపు పునాదిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ వేయలేరు.
కావున ఇటువంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి. మీరు మ్యూజియం మొదలైనవాటి
ప్రారంభోత్సవాన్ని పెద్దవారితో చేయిస్తే పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఇక్కడికి వీరు
కూడా వస్తున్నారే అని మనుష్యులు అనుకుంటారు. అయితే కొందరు - మీరు వ్రాసి ఇవ్వండి,
మేము అది మాట్లాడుతాము అని అంటారు. అది కూడా తప్పే. బాగా అర్థం చేసుకుని ఓరల్ గా
చెప్తే చాలా మంచిది. కొందరు ఏక్యురేట్ గా ఉండేందుకని వివరణను వ్రాసుకుని చదువుతారు.
పిల్లలైన మీరైతే ఓరల్ గానే అర్థం చేయించాలి. మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా.
తర్వాత మీరు ఇతరులకు ఇస్తారు. ప్రజలు వృద్ధి చెందుతూ ఉంటారు. జనాభా కూడా పెరుగుతూ
ఉంటుంది. అన్నీ పెరుగుతూ ఉంటాయి. వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. మన ధర్మమువారు
ఎవరైతే ఉంటారో, వారు వెలువడి బయటకు వస్తారు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. అందరూ
ఒకేలా చదవలేరు. 100లో ఒక్క మార్కునే పొందేవారు కూడా కొందరు ఉన్నారు. ఏ కొద్దిగా
విన్నా, ఒక్క మార్కు లభించినా స్వర్గములోకి వచ్చేస్తారు. ఇది అనంతమైన చదువు, దీనిని
అనంతమైన తండ్రియే చదివిస్తారు. ఈ ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో, వారు వెలువడి
బయటకు వస్తారు. మొదటైతే అందరూ ముక్తిధామానికి, తమ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత
నంబరువారుగా వస్తూ ఉంటారు. కొందరైతే త్రేతా అంతిమము వరకూ కూడా వస్తూ ఉంటారు.
బ్రాహ్మణులుగా అవుతారు కానీ బ్రాహ్మణులందరూ సత్యయుగములోకి రారు, కొందరు త్రేతా
అంతిమము వరకూ వస్తూనే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. రాజధాని స్థాపన
అవుతోందని బాబాకు తెలుసు, అందరూ ఒకేలా ఉండలేరు. రాజ్యములోనైతే అన్ని రకాలవారూ కావాలి.
ప్రజలను బయటివారు అని అంటారు. అక్కడ మంత్రులు మొదలైనవారి అవసరముండదని బాబా అర్థం
చేయించారు. వారికి శ్రీమతము లభించింది, దానితో ఇలా తయారయ్యారు, ఇక ఆ తర్వాత ఎవరి
నుండి సలహాలు తీసుకోరు. మంత్రులు మొదలైనవారెవరూ ఉండరు. మళ్ళీ ఎప్పుడైతే పతితులవుతారో,
అప్పుడు ఒక మంత్రి, ఒక రాజు, రాణి ఉంటారు. ఇప్పుడైతే ఎంతమంది మంత్రులు ఉన్నారు.
ఇక్కడున్నది పంచాయతీ రాజ్యము కదా. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో కలవవు. ఒకరితో స్నేహము
చేసుకుని, అర్థం చేయిస్తే వారు పని చేసేస్తారు. మళ్ళీ ఇంకొకరు వస్తే, వారికి అర్థం
కాకపోతే ఆ పనిని ఇంకా పాడుచేస్తారు. ఒకరి బుద్ధి ఇంకొకరితో కలవదు. అక్కడైతే మీ
కామనలన్నీ పూర్తి అయిపోతాయి. మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు, దీని పేరే దుఃఖధామము.
భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఇది కూడా డ్రామా. ఎప్పుడైతే
దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి మీ
బుద్ధిని ఎంతగా తెరిచారు. షావుకారులకు ఇది స్వర్గము, పేదవారు నరకములో ఉన్నారు అని
మనుషులు అంటారు. స్వర్గమని దేనిని అంటారు అనేది మీకు యథార్థముగా తెలుసు. సత్యయుగములో
దయాహృదయుడా అని ఎవరూ పిలవరు. దయ చూపించండి, ముక్తిని ప్రసాదించండి అని ఇక్కడే
పిలుస్తారు. తండ్రియే అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. అజ్ఞాన
కాలములో మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే నంబరు వన్ తమోప్రధానులో, వారే మళ్ళీ
నంబరు వన్ సతోప్రధానులుగా అవుతారు. వీరు తన మహిమను చేసుకోరు. మహిమ అయితే ఆ ఒక్కరిదే.
లక్ష్మీ-నారాయణులను కూడా అలా తయారుచేసేది వారే కదా. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు.
వారు తయారుచేసేది కూడా ఉన్నతమైనవారిగానే. అందరూ ఉన్నతమైనవారిగా అవ్వరు అని బాబాకు
తెలుసు. అయినా పురుషార్థము చేయవలసి ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చేదే నరుడి నుండి
నారాయణుడిగా తయారయ్యేందుకు. బాబా, మేమైతే స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము, మేము
సత్యనారాయణుని సత్యమైన కథను వినడానికి వచ్చాము అని అంటారు. బాబా అంటారు - అచ్ఛా, మీ
నోటిలో గులాబ్ జామ్, మరి కృషి చేయండి. అందరూ అయితే లక్ష్మీ-నారాయణులుగా అవ్వరు.
ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. రాజ్య కుటుంబములోకి, ప్రజా కుటుంబములోకి చాలామంది
కావాలి కదా. ఆశ్చర్యము కలిగించేలా వింటారు, వినిపిస్తారు, వదిలి వెళ్ళిపోతారు...
మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కూడా. ఏ పిల్లలైతే ఎంతోకొంత తమ ఉన్నతిని చేసుకుంటారో వారు
పైకి వస్తారు. పేదవారే సమర్పణ అవుతారు. దేహ సహితముగా ఇంకెవ్వరూ గుర్తు ఉండకూడదు, ఇది
పెద్ద గమ్యము. ఒకవేళ ఎవరితోనైనా సంబంధము జోడించబడి ఉంటే, వారు తప్పకుండా
గుర్తుకొస్తారు. తండ్రికి ఏమి గుర్తుకొస్తుంది? రోజంతా బుద్ధి అనంతములోనే ఉంటుంది.
ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి అంటారు, నా పిల్లల్లో కూడా ఉత్తములు, మధ్యములు,
కనిష్టులు ఉన్నారు. ఇతరులెవరైనా వస్తే వారు పతిత ప్రపంచమువారని అర్థమవుతుంది, అయినా
కానీ యజ్ఞ సేవను చేస్తారు కావున గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి యుక్తియుక్తుడు కదా.
లేదంటే వాస్తవానికి ఇది సైలెన్స్ స్తంభము, పవిత్రాతి పవిత్రమైన స్తంభము, ఇక్కడ
పవిత్రాతి పవిత్రమైన తండ్రి కూర్చుని మొత్తం విశ్వాన్ని పవిత్రముగా తయారుచేస్తారు.
ఇక్కడకు పతితులెవ్వరూ రావడానికి వీల్లేదు. కానీ తండ్రి అంటారు, నేను పతితులందరినీ
పావనముగా తయారుచేయడానికి వచ్చాను, ఈ ఆటలో నాకు కూడా పాత్ర ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ చార్టును చూసుకుంటూ చెక్ చేసుకోవాలి - ఎంత పుణ్యము జమ అయ్యింది? ఆత్మ
సతోప్రధానముగా ఎంతవరకు తయారయ్యింది? స్మృతిలో ఉంటూ లెక్కాచారాలన్నింటినీ సమాప్తము
చేసుకోవాలి.
2. స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాయోగ్యులుగా అయి అనేకుల కళ్యాణము చేయాలి.
తండ్రికి ప్రియముగా అవ్వాలి. టీచరుగా అయి అనేకులకు మార్గము తెలియజేయాలి.
వరదానము:-
తమ ఫరిశ్తా స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని
అందించే ఆకర్షణా మూర్త భవ
ఫరిశ్తా స్వరూపానికి సంబంధించిన ఎటువంటి మెరిసే
వస్త్రాన్ని ధారణ చేయండంటే, అది దూరదూరాలలో ఉన్న ఆత్మలను మీవైపుకు ఆకర్షించాలి మరియు
అందరినీ బికారీతనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారుచేయాలి, దీని
కొరకు జ్ఞాన మూర్తులుగా, స్మృతి మూర్తులుగా మరియు సర్వ దివ్యగుణ మూర్తులుగా అయ్యి,
ఎగిరే కళలో స్థితులయ్యే అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ ఎగిరే కళయే అందరికీ
నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిశ్తా సో దేవతా స్వరూపపు సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది.
ఇదే విధాత, వరదాతా స్వరూపపు స్థితి.
స్లోగన్:-
ఇతరుల
మనసులలోని భావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితులై ఉండండి.
మీ శక్తిశాలి మనసా
ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి
మనసా శక్తికి దర్పణము
- మాటలు మరియు కర్మలు. అజ్ఞానీ ఆత్మలైనా లేక జ్ఞానీ ఆత్మలైనా, ఇరువురి సంబంధ,
సంపర్కములలో మాటలు మరియు కర్మలు శుభ భావన, శుభ కామన కలిగినవిగా ఉండాలి. ఎవరి మనసా
అయితే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో వారి వాచా మరియు కర్మణా స్వతహాగానే
శక్తిశాలిగా, శుద్ధమైనదిగా ఉంటుంది, శుభభావన కలిగినదిగా ఉంటుంది. మనసా శక్తిశాలి
అనగా స్మృతి శక్తి శ్రేష్ఠమైనదిగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజయోగిగా ఉంటారు.
| | |