‘‘పూర్వజ మరియు పూజ్య అనే స్వమానములో ఉంటూ
విశ్వములోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయండి, ఆశీర్వాదాలు ఇవ్వండి,
ఆశీర్వాదాలు తీసుకోండి’’
ఈ రోజు నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ పిల్లలను చూస్తున్నారు.
పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు కూడా మరియు పూజ్యులు కూడా,
అందుకే ఈ కల్పవృక్షానికి మీరందరూ వేర్లు, అలాగే కాండము కూడా.
కాండానికి మొత్తం వృక్షము యొక్క కొమ్మలు-రెమ్మలతో, ఆకులతో
స్వతహాగానే సంబంధము ఉంటుంది. మరి అందరూ స్వయాన్ని అటువంటి
శ్రేష్ఠాత్మగా, మొత్తం వృక్షానికి పూర్వజులుగా భావిస్తున్నారా?
ఎలా అయితే బ్రహ్మాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో,
అదే విధంగా వారి సహచరులైన మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్
ఫాదర్. పూర్వజ ఆత్మలది ఎంతటి స్వమానము! ఈ నషాలో ఉంటున్నారా?
మొత్తం విశ్వములోని ఆత్మలకు - వారు ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా
కానీ, ఆ సర్వాత్మలకు మీరు కాండము రూపములో ఆధారమూర్తులు,
పూర్వజులు, అందుకే పూర్వజులైన కారణముగా పూజ్యులు కూడా.
పూర్వజుల ద్వారా ప్రతి ఆత్మకు సకాష్ స్వతహాగా లభిస్తూ ఉంటుంది.
వృక్షాన్ని చూడండి, కాండము ద్వారా, వేర్ల ద్వారా చివరి ఆకుకు
కూడా సకాష్ లభిస్తూ ఉంటుంది. పూర్వజుల పని ఏమిటి? పూర్వజుల పని
- సర్వుల పాలన చేయటము. లౌకికములో కూడా చూడండి, పూర్వజుల
ద్వారానే శారీరక శక్తి యొక్క పాలనైనా, స్థూల భోజనము ద్వారా లేక
చదువు ద్వారా శక్తిని నింపే పాలన జరుగుతుంది. కావున
పూర్వజాత్మలైన మీరు బాబా ద్వారా లభించిన శక్తులతో సర్వాత్మల
పాలన చేయాలి.
నేటి సమయమనుసారముగా సర్వాత్మలకు శక్తుల ద్వారా పాలన
చేయవలసిన అవసరముంది. ఈ రోజుల్లో ఆత్మలలో అశాంతి మరియు దుఃఖపు
అల వ్యాపించి ఉందని మీకు తెలుసు. మరి పూర్వజ మరియు పూజ్య
ఆత్మలైన మీకు మీ వంశావళిపై దయ కలుగుతుందా? ఏ విధంగా విశేషముగా
ఏదైనా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే, అప్పుడు విశేష రూపములో
మిలట్రీవారు లేక పోలీసులు అలర్ట్ అయిపోతారు. అదే విధంగా, ఈ
రోజుల్లోని వాతావరణములో పూర్వజులైన మీరు కూడా స్వయాన్ని విశేష
సేవార్థము నిమిత్తముగా భావిస్తున్నారా! మొత్తం విశ్వములోని
ఆత్మలకు మేము నిమిత్తులము, ఈ స్మృతి ఉంటుందా? మొత్తం
విశ్వములోని ఆత్మలకు ఈ రోజు మీ సకాష్ యొక్క అవసరముంది. ఇలా
అనంతమైన విశ్వానికి పూర్వజ ఆత్మలుగా స్వయాన్ని అనుభవం
చేసుకుంటున్నారా? విశ్వసేవ గుర్తుకొస్తుందా లేక తమ సెంటర్ల సేవ
గుర్తుకొస్తుందా? ఈ రోజు ఆత్మలు పూర్వజులైన దేవాత్మలైన
మిమ్మల్ని పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ-తమ భిన్న-భిన్న
దేవీలను లేక దేవతలను పిలుస్తున్నారు - రండి, క్షమించండి, కృప
చూపించండి. మరి భక్తుల యొక్క పిలుపు వినిపిస్తుందా?
వినిపిస్తుందా, లేదా? ఏ ధర్మానికి చెందిన ఆత్మనైనా, మీరు వారిని
కలిసినప్పుడు, మిమ్మల్ని మీరు సర్వాత్మలకు పూర్వజులుగా భావిస్తూ
కలుస్తున్నారా? వీరు కూడా పూర్వజులైన మా యొక్క కొమ్మలు, రెమ్మలే
అని అనుభవమవుతుందా! వారికి కూడా సకాష్ ఇచ్చేది పూర్వజులైన మీరే.
మీ కల్పవృక్షము చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మిమ్మల్ని మీరు
చూసుకోండి, మీ స్థానము ఎక్కడ ఉంది! వేర్లలో కూడా మీరు ఉన్నారు,
కాండములో కూడా మీరు ఉన్నారు. అలాగే పరంధామములో కూడా చూడండి,
పూర్వజ ఆత్మలైన మీ స్థానము బాబాతోపాటు సమీపముగా ఉంటుంది. తెలుసు
కదా! ఈ నషాతో మీరు ఏ ఆత్మనైనా కలిసినప్పుడు, ప్రతి ధర్మానికి
చెందిన ఆత్మ మిమ్మల్ని - వీరు మావారు, మనవారు అనే దృష్టితో
చూస్తారు. ఒకవేళ పూర్వజులము అనే ఆ నషాతో, స్మృతితో, వృత్తితో,
దృష్టితో కలుసుకుంటే వారికి కూడా వీరు మనవారు అనే భావన
కలుగుతుంది ఎందుకంటే మీరు అందరికీ పూర్వజులు, మీరు అందరివారు.
ఇటువంటి స్మృతితో సేవ చేసినట్లయితే ప్రతి ఆత్మ అనుభవం చేస్తుంది
- వీరు మా పూర్వజులు లేక ఇష్టులు, వీరు మళ్ళీ మాకు లభించారు.
అలాగే పూజ్య రూపము కూడా చూడండి, ఎంత గొప్ప పూజ జరుగుతుంది, ఏ
ధర్మాత్మకు గాని, మహాత్మకు గాని దేవీ-దేవతలైన మీకు జరిగినట్లుగా
విధిపూర్వకముగా పూజ జరగదు. పూజ్యులుగా అవుతారు కానీ మీ వంటి
విధిపూర్వకమైన పూజ జరగదు. గాయనము కూడా చూడండి, మీకు ఎంత
విధిపూర్వకముగా కీర్తన చేస్తారు, హారతి ఇస్తారు. ఇటువంటి
పూజ్యులుగా పూర్వజులైన మీరే అవుతారు. మరి మిమ్మల్ని మీరు ఈ
విధంగా భావిస్తున్నారా? ఈ విధమైన నషా ఉందా? ఉందా నషా? ఎవరైతే -
మేము పూర్వజ ఆత్మలము అని భావిస్తున్నారో, ఎవరికైతే ఆ నషా
ఉంటుందో, ఆ స్మృతి ఉంటుందో, వారు చేతులు ఎత్తండి! ఉంటుందా?
మంచిది. ఉంటుంది అనేవారు చేతులు ఎత్తారు, చాలా మంచిది. ఇప్పుడు
రెండవ ప్రశ్న ఏముంటుంది? సదా ఉంటుందా?
బాప్ దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశీగా
చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు కాదు. ఎందుకు? జవాబు చాలా
చతురతతో చెప్తారు, ఏమంటారు? ఉంటుంది... బాగానే ఉంటుంది. కానీ
మెల్లగా చెప్తారు... అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయిపోతుంటుంది.
చూడండి, బాబా కూడా అవినాశీ, ఆత్మలైన మీరు కూడా అవినాశీ కదా!
ప్రాప్తులు కూడా అవినాశీ, జ్ఞానము కూడా అవినాశీ ద్వారా లభించే
అవినాశీ జ్ఞానము. అలాంటప్పుడు ధారణ కూడా ఎలా ఉండాలి? అవినాశీగా
ఉండాలా లేక అప్పుడప్పుడునా?
బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరినీ సమయము యొక్క పరిస్థితి
అనుసారముగా అనంతమైన సేవలో సదా బిజీగా చూడాలనుకుంటున్నారు
ఎందుకంటే సేవలో బిజీగా ఉన్న కారణముగా అనేక రకాల అలజడుల నుండి
రక్షించబడతారు. కానీ ఎప్పుడు సేవ చేసినా, ప్లాన్
తయారుచేస్తున్నారు మరియు ప్లాన్ ప్రకారం ప్రాక్టికల్ లోకి కూడా
వస్తున్నారు, సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటున్నారు. కానీ బాప్
దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఒకే సమయములో మూడు సేవలు కలిసి
జరగాలి. కేవలం వాచా సేవయే కాదు, మనసా కూడా ఉండాలి మరియు వాచా
కూడా ఉండాలి, అంతేకాక కర్మణా అనగా సంబంధ, సంపర్కములోకి
వచ్చేటప్పుడు కూడా సేవ జరగాలి. సేవా భావము మరియు సేవా భావన
ఉండాలి. ఈ సమయములో వాచా సేవ యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది,
మనసా ఉంది కానీ వాచా యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఒకే సమయములో
మూడు సేవలు కలిపి జరగటం వలన సేవలో సఫలత ఇంకా ఎక్కువ లభిస్తుంది.
బాప్ దాదా సమాచారము విన్నారు - ఈ గ్రూప్ లో కూడా
భిన్న-భిన్న వర్గాల వారు వచ్చారు మరియు సేవా ప్లాన్లు మంచివి
తయారుచేస్తున్నారు. బాగా చేస్తున్నారు కానీ మూడు సేవలు కలిపి
జరగడం వలన సేవ యొక్క వేగము మరింత వృద్ధి చెందుతుంది. నలువైపుల
నుండి పిల్లలందరూ చేరుకున్నారు, ఇది చూసి బాప్ దాదాకు కూడా
సంతోషము కలుగుతుంది. కొత్త-కొత్త పిల్లలు ఉల్లాస-ఉత్సాహాలతో
చేరుకుంటారు.
ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న స్వరూపములో
చూడాలనుకుంటున్నారు, ఎందుకు? ఎప్పుడైతే నిమిత్తముగా ఉన్న మీరు
నిర్విఘ్న స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు విశ్వాత్మలను
సర్వ సమస్యల నుండి నిర్విఘ్నముగా చేయగలుగుతారు. దీని కొరకు
విశేషముగా రెండు విషయాలను అండర్ లైన్ చేయండి - చేస్తున్నారు
కూడా, కానీ ఇంకా అండర్ లైన్ చేయండి. ఒకటి - ప్రతి ఆత్మను మీ
ఆత్మిక దృష్టితో చూడండి. ఆత్మ యొక్క నిజ సంస్కారము యొక్క
స్వరూపములో చూడండి. ఎటువంటి సంస్కారము కలిగిన ఆత్మ అయినా కానీ,
మీకు ప్రతి ఆత్మ పట్ల ఉన్న శుభ భావన, శుభ కామన, వారి పరివర్తన
యొక్క శ్రేష్ఠ భావన, వారి సంస్కారాలను కొద్ది సమయము కొరకు
పరివర్తన చేయగలవు. ఆత్మిక భావాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఏ విధంగా
ప్రారంభములో చూసినట్లయితే, సంగఠనలో ఉంటూ ఆత్మిక దృష్టి, ఆత్మిక
వృత్తి ఉండేవి, ఆత్మ ఆత్మతో కలుసుకుంటున్నాము, మాట్లాడుతున్నాము,
ఈ దృష్టితో పునాది ఎంత పక్కా అయ్యింది. ఇప్పుడు సేవా
విస్తారములో, సేవా విస్తారము యొక్క సంబంధములో ఆత్మిక భావముతో
నడుచుకోవటం, మాట్లాడటం, సంపర్కములోకి రావటం అనేది మర్జ్
అయిపోయింది. సమాప్తమవ్వలేదు కానీ మర్జ్ అయిపోయింది. ఆత్మిక
స్వమానము ఆత్మకు సహజముగా సఫలతను ఇప్పిస్తుంది ఎందుకంటే ఇక్కడకు
వచ్చి కలుసుకున్న మీరందరూ ఎవరు? కల్పపూర్వము యొక్క ఆ దేవాత్మలు,
బ్రాహ్మణాత్మలే కలుసుకున్నారు. బ్రాహ్మణాత్మ రూపములో కూడా అందరూ
శ్రేష్ఠాత్మలు, దేవాత్మల లెక్కలో కూడా శ్రేష్ఠాత్మలే. ఆ
స్వరూపముతోనే సంబంధ-సంపర్కములోకి రండి. ప్రతి సమయము చెక్
చేసుకోండి - దేవాత్మ, బ్రాహ్మణాత్మనైన నా శ్రేష్ఠ కర్తవ్యము,
శ్రేష్ఠమైన సేవ ఏమిటి? ‘‘ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు
ఆశీర్వాదాలను తీసుకోవడము.’’ మీ జడచిత్రాలు ఏ సేవ చేస్తున్నాయి?
ఎటువంటి ఆత్మ అయినా కానీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తారు,
ఆశీర్వాదాలను తీసుకుని వస్తారు. మరియు ఒకవేళ ఎవరికైనా
పురుషార్థములో కష్టమనిపిస్తే, అన్నింటికంటే సహజ పురుషార్థము
ఏమిటంటే - మొత్తం రోజంతా దృష్టి, వృత్తి, మాట, భావన అన్నింటి
ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. మీ టైటిల్
మరియు వరదానమే - మహాదాని. సేవ చేస్తూ, కార్యములో సంబంధ,
సంపర్కములోకి వస్తూ కేవలం ఇదే కార్యము చేయండి - ఆశీర్వాదాలు
ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది కష్టమా? లేక సహజమా?
ఎవరైతే సహజము అని భావిస్తున్నారో వారు చేతులు ఎత్తండి. ఎవరైనా
మిమ్మల్ని అపోజిషన్ చేస్తే (వ్యతిరేకిస్తే)? అప్పుడు కూడా
ఆశీర్వాదాలే ఇస్తారా? ఇస్తారా? ఇంతగా మీ వద్ద ఆశీర్వాదాల స్టాక్
ఉందా? అపోజిషన్ అయితే ఉంటుంది ఎందుకంటే అపోజిషనే పొజిషన్ వరకు
చేరుస్తుంది. చూడండి, అందరికంటే ఎక్కువ అపోజిషన్ బ్రహ్మాబాబాకు
జరిగింది. జరిగింది కదా? మరి పొజిషన్ లో కూడా ఎవరు నంబర్ వన్
పొజిషన్ పొందారు? బ్రహ్మాయే పొందారు కదా! ఏది ఏమైనా కానీ నేను
బ్రహ్మాబాబా సమానముగా ఆశీర్వాదాలు ఇవ్వాలి. బ్రహ్మాబాబా ఎదురుగా
వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థమైన పనులు చేసేవారు లేరా? అయినా
కానీ బ్రహ్మాబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు
తీసుకున్నారు, ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించారు. పిల్లలు కదా,
మారిపోతారులే అనుకునేవారు. అలాగే మీరు కూడా ఇదే వృత్తి,
దృష్టిని పెట్టుకోండి, అదేమిటంటి - వీరు కల్ప పూర్వము యొక్క మన
పరివారమువారే, బ్రాహ్మణ పరివారమువారే. నేను మారి వీరిని కూడా
మార్చాలి. వీరు మారితే నేను మారతాను, ఇలా కాదు. నేను మారి
వీరిని మార్చాలి. ఇది నా బాధ్యత. అప్పుడు ఆశీర్వాదాలు
వెలువడుతాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి.
ఇప్పుడు సమయము త్వరగా పరివర్తన వైపుకు వెళ్తూ ఉంది, అతిలోకి
వెళ్తూ ఉంది కానీ సమయ పరివర్తన కంటే ముందు విశ్వ పరివర్తక
శ్రేష్ఠ ఆత్మలైన మీరు స్వ పరివర్తన ద్వారా సర్వుల పరివర్తనకు
ఆధారమూర్తులుగా అవ్వండి. మీరు కూడా విశ్వానికి ఆధారమూర్తులు,
ఉద్ధారమూర్తులు. ప్రతి ఒక్క ఆత్మ లక్ష్యము పెట్టుకోండి - నేను
నిమిత్తము అవ్వాలి. కేవలం మూడు విషయాలు స్వయములో
సంకల్పమాత్రముగా కూడా ఉండకూడదు, వీటిని పరివర్తన చేయండి. ఒకటి
- పరచింతన, రెండు - పరదర్శన. స్వ దర్శనానికి బదులుగా పరదర్శనం
చేయకండి. మూడు - పరమతము లేక పర సాంగత్యము, చెడు సాంగత్యము.
శ్రేష్ఠ సాంగత్యము చేయండి ఎందుకంటే సాంగత్య దోషము చాలా నష్టం
కలిగిస్తుంది. ఇంతకుముందు కూడా బాప్ దాదా చెప్పారు - ఒకటేమో,
పర ఉపకారిగా అవ్వండి మరియు మిగిలిన ఆ మూడు పర అనేవాటిని కట్
చేయండి. పరదర్శన, పరచింతన, పరమతము అనగా చెడు సాంగత్యము, పర
యొక్క అనవసరమైన సాంగత్యము. పర ఉపకారిగా అవ్వండి, అప్పుడే
ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలను ఇస్తారు. ఎవరు
ఏమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంతటి ధైర్యము ఉందా?
ఉందా ధైర్యము? బాప్ దాదా నలువైపులా ఉన్న అన్ని సెంటర్ల పిల్లలకు
చెప్తున్నారు - ఒకవేళ పిల్లలైన మీరందరూ ధైర్యము పెడితే, అప్పుడు
ఎవరు ఏమిచ్చినా కానీ మనము ఆశీర్వాదాలనే ఇవ్వాలి, కావున బాప్
దాదా ఈ సంవత్సరము మీరు పెట్టిన ఎక్స్ ట్రా ధైర్యము, ఉల్లాసము
కారణముగా సహాయము చేస్తారు. ఎక్స్ ట్రా సహాయము చేస్తారు. కానీ
ఆశీర్వాదాలు ఇస్తేనే. దీనిలో మిక్స్ చేయకండి. బాప్ దాదా
వద్దకైతే మొత్తం రికార్డ్ అంతా వస్తుంది కదా! సంకల్పములో కూడా
ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ ఉండకూడదు. ధైర్యము ఉందా? ఉంటే చేతులు
ఎత్తండి! చేయవలసి ఉంటుంది. కేవలం చేతులు ఎత్తడం కాదు. చేయవలసి
ఉంటుంది. చేస్తారా? మధుబన్ వారు, టీచర్లు చేస్తారా? మంచిది,
ఎక్స్ ట్రా మార్కులు జమ చేసుకుంటారా? అభినందనలు. ఎందుకు? బాప్
దాదా వద్దకు ఎడ్వాన్స్ పార్టీ వారు పదే-పదే వస్తున్నారు. వారు
ఏమంటున్నారంటే - మాకైతే ఎడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇచ్చారు,
అది అభినయిస్తున్నాము కానీ మా సహచరులు ఎడ్వాన్స్ స్టేజ్ ను (ఉన్నత
స్థితిని) ఎందుకు తయారుచేసుకోవటం లేదు? ఇప్పుడు ఏం సమాధానము
చెప్పను? ఏమని సమాధానము చెప్పను? ఎడ్వాన్స్ స్టేజ్ మరియు
ఎడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర, రెండు కలిసినప్పుడే సమాప్తి
అవుతుంది. మరి వారు అడుగుతున్నారు, నేను ఏమని సమాధానము చెప్పను?
ఎన్ని సంవత్సరాలలో తయారవుతారు? అన్నీ జరుపుకున్నారు, సిల్వర్
జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, అన్నీ జరుపుకున్నారు.
ఇప్పుడు ఎడ్వాన్స్ స్టేజ్ యొక్క ఉత్సవం జరుపుకోండి. దాని డేట్
ను ఫిక్స్ చేయండి. పాండవులు చెప్పండి, దానికి డేట్ ఫిక్స్
అవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి. డేట్ ఫిక్స్ అవుతుందా లేక
అకస్మాత్తుగా జరిగిపోతుందా? ఏమవుతుంది? అకస్మాత్తుగా జరుగుతుందా
లేక ఫిక్స్ అవుతుందా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి.
ఆలోచిస్తున్నారా? నిర్వైర్ ను అడుగుతున్నాను. ఉత్సవం చేస్తారా
లేక అకస్మాత్తుగా జరిగిపోతుందా? మీరు దాదీని అడుగుతున్నారా?
దాది ఏదో ఒకటి చెప్పాలని ఇతను దాది వైపు చూస్తున్నారు. మీరు
చెప్పండి, రమేష్ ను చెప్పమని అడుగుతున్నాను. (చివరికైతే జరిగేదే
ఉంది) చివరికి అంటే ఎప్పుడు? (మీరు డేట్ చెప్పండి, ఆ డేట్ కల్లా
చేసేస్తాము) అచ్ఛా - బాప్ దాదా అయితే ఒక సంవత్సరం ఎక్స్ ట్రా
సమయము ఇచ్చారు. ధైర్యము ఉంటే ఎక్స్ ట్రా సహాయము లభిస్తుంది.
ఇదైతే చేయగలరు కదా, ఇది చేసి చూపించండి, అప్పుడు బాబా డేట్
ఫిక్స్ చేస్తారు. (మీ డైరెక్షన్ ఉంటే ఈ 2004 సంవత్సరాన్ని ఈ
విధంగా జరుపుకుంటాము) అంటే ఇప్పుడు ఇంకా అంత ఏర్పాటు జరగలేదు
అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎడ్వాన్స్ పార్టీ వారు ఒక
సంవత్సరమైతే ఉండాల్సి ఉంటుంది కదా. మంచిది. ఇప్పటి నుండే -
చేయాల్సిందే అనే లక్ష్యము పెట్టుకున్నట్లయితే, బహుకాలము ఖాతాలో
ఇది కలుస్తుంది ఎందుకంటే బహుకాలము యొక్క లెక్క కూడా ఉంది కదా!
ఒకవేళ అంతిమములో చేస్తే బహుకాలము యొక్క లెక్క సరిగ్గా ఉండదు.
అందుకే ఇప్పటి నుండే అటెన్షన్ ప్లీజ్. అచ్ఛా.
ఇప్పుడు ఆత్మిక డ్రిల్ గుర్తుందా? ఒక్క క్షణములో మీ పూర్వజ
స్థితిలోకి వచ్చి పరంధామ నివాసి అయిన బాబాతో పాటు లైట్ హౌస్ గా
అయ్యి విశ్వానికి లైట్ ఇవ్వగలరా? ఒక్క క్షణములో నలువైపులా ఉన్న,
దేశ విదేశాలలో వినేవారు, చూసేవారు లైట్ హౌస్ గా అయ్యి విశ్వములో
నలువైపులా సర్వాత్మలకు లైట్ ఇవ్వండి, సకాష్ ఇవ్వండి, శక్తులను
ఇవ్వండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న విశ్వము యొక్క పూర్వజ మరియు పూజ్యాత్మలకు,
సదా దాతగా అయ్యి సర్వులకు ఆశీర్వాదాలను ఇచ్చే మహాదాని ఆత్మలకు,
సదా ధృఢత ద్వారా, స్వ పరివర్తనతో సర్వులను పరివర్తన చేసే విశ్వ
పరివర్తక ఆత్మలకు, సదా లైట్ హౌస్ గా అయ్యి సర్వాత్మలకు లైట్ ను
ఇచ్చే సమీప ఆత్మలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
హృదయము యొక్క ఆశీర్వాదాల సహితముగా నమస్తే.