16-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 03.03.20


‘‘శుభ భావమును మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకుని క్రోధమనే మహాశత్రువుపై విజయులుగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా తమ జన్మ సహచరులను, అలాగే సేవా సహచరులను చూసి హర్షిస్తున్నారు. ఈ రోజు మీ అందరికీ బాప్ దాదా యొక్క అలౌకిక జన్మ, అలాగే జన్మ సహచరుల యొక్క జన్మదివసము గురించి సంతోషము ఉంది, ఎందుకు. ఇటువంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ ఇతరులెవ్వరికీ ఉండదు. తండ్రి జన్మదినం కూడా అదే మరియు పిల్లల జన్మదినం కూడా అదే అని ఎప్పుడూ విని ఉండరు. అటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈ రోజు మీరు జరుపుకుంటున్నారు. దీనితో పాటు అందరికీ ఒక అతీతమైన మరియు ప్రియమైన స్థితి స్మృతిలో ఉంది, అదేమిటంటే - ఈ అలౌకిక జన్మ ఎటువంటి విచిత్రమైనదంటే, ఇక్కడ స్వయంగా భగవంతుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమాత్మ పిల్లల యొక్క, శ్రేష్ఠ ఆత్మల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచములో అనేకమంది - మమ్మల్ని పుట్టించినవారు భగవంతుడు, పరమాత్మ అని నామమాత్రంగా అంటారు కానీ దాని గురించి వారికి తెలియదు కూడా, అలాగే ఆ స్మృతిలో నడుచుకోరు కూడా. మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మా వంశీయులము అని మీరందరూ అనుభవముతో అంటారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. మనము పరమాత్ముని జన్మదినాన్ని జరుపుతాము.

ఈ రోజు అన్ని వైపుల నుండి ఇక్కడకు చేరుకున్నారు, ఎందుకు? శుభాకాంక్షలను ఇవ్వడానికి మరియు శుభాకాంక్షలను తీసుకోవడానికి. బాప్ దాదా విశేషంగా తమ జన్మ సహచరులకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సేవా సహచరులకు కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలతోపాటు పరమ ప్రేమ యొక్క ముత్యాల, వజ్రాల, రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూసారు కదా. ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా? పూల వర్షాన్ని, బంగారు వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు, కానీ బాప్ దాదా మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒకసారి కాదు, కానీ పదమాల, పదమాల, పదమాల రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు, అవి కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ రోజు జరుపుకునే మరియు శుభాకాంక్షలను అందించే రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండు మేళం మ్రోగిస్తారు. బాప్ దాదా పిల్లలందరి మనసులోని సంతోషము అనే బ్యాండ్ అనండి, మేళ వాయిద్యాలు అనండి, వాటిని వింటున్నారు. భక్తులేమో పిలుస్తూ ఉన్నారు కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవటము వస్తుంది కదా? ఇలా ఇమిడిపోవటమే సమానులుగా తయారుచేస్తుంది.

బాప్ దాదా పిల్లలను తమ నుండి వేరు చెయ్యలేరు. పిల్లలు కూడా వేరు అవ్వాలని అనుకోరు కానీ అప్పుడప్పుడు మాయతో ఆటలాడుతూ, ఆటలాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళిపోతారు. నేను పిల్లలైన మీకు ఆధారాన్ని అని బాప్ దాదా అంటారు, కానీ పిల్లలు అల్లరివారిగా ఉంటారు కదా. మాయ అల్లరివారిగా చేసేస్తుంది, వాస్తవానికి అటువంటివారు కారు, కానీ మాయ అలా తయారుచేస్తుంది. అప్పుడు ఆధారంగా ఉన్నవారి నుండి పక్కకు వచ్చేసేలా చేస్తుంది. అయినా కూడా బాప్ దాదా ఆధారముగా అయ్యి మళ్ళీ సమీపముగా తీసుకువస్తారు. బాప్ దాదా పిల్లలందరినీ అడుగుతారు - ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు? విదేశీయులు రెండు విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు చాలా ఇష్టమైన రెండు పదాలు ఏమిటి? (కంపానియన్ మరియు కంపెనీ అనగా సహచరుడు మరియు సాంగత్యము). ఈ రెండూ ఇష్టము. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసులకు ఇష్టమా? సహచరుడు కూడా అవసరము మరియు సాంగత్యము కూడా అవసరము. సాంగత్యము లేకుండా కూడా ఉండలేరు మరియు సహచరుడు లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏమి లభించింది? సహచరుడు లభించారా? చెప్పండి, లభించారా లేదా? (హాజీ) సాంగత్యము లభించిందా? (హాజీ) ఇటువంటి సాంగత్యము మరియు ఇటువంటి సహచరుడు మొత్తము కల్పములో లభించారా? కల్పపూర్వము లభించారా? వీరు ఎటువంటి సహచరుడు అంటే వీరు ఎప్పుడూ పక్కకు వెళ్ళిపోరు, పిల్లలు ఎంత అల్లరివారిగా ఉన్నా సరే వారు ఆధారంగానే ఉంటారు. అంతేకాక మీ మనసులోని ప్రాప్తులన్నింటినీ పూర్తి చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? ఈ మాట అందరి మనసులో నుండి వస్తుందా లేక మర్యాదపూర్వకంగా అప్రాప్తి లేదు అని చెప్తున్నారా? పొందాల్సిందేదో పొందేసాము అని పాటనైతే పాడుతారు, మరి పొందేసారా లేక పొందాలా? పొందేసారా? ఇప్పుడిక పొందడానికి ఏమీ లేదు కదా లేక కొన్ని-కొన్ని ఆశలు ఉండిపోయాయా? అన్ని అశలూ పూర్తయిపోయాయా లేక ఏమైనా ఉండిపోయాయా? బాప్ దాదా అంటున్నారు - ఉండిపోయాయి. (బాబాను ప్రత్యక్షము చెయ్యాలనే ఆశ మిగిలిపోయి ఉంది) పిల్లలందరికీ సందేశము తెలియాలి అన్నది బాబా యొక్క ఆశ. బాబా వచ్చారు కానీ కొంతమంది ఇది తెలియకుండా ఉండిపోయారు... అన్నట్లు ఉండకూడదు. అందుకే బాప్ దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటంటే - మా సదా యొక్క తండ్రి వచ్చారు అన్నది అందరికీ కనీసం తెలియనైనా తెలియాలి. పిల్లల యొక్క హద్దు ఆశలన్నీ పూర్తయిపోయాయి, ప్రేమతో కూడిన ఆశలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటారు, ఈ ఆశ ఉందా? (ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు) మరి ఈ ఆశ కూడా పూర్తయిపోయిందా? మీరు సంతుష్ట ఆత్మలు, అభినందనలు ఎందుకంటే పిల్లలందరూ తెలివైనవారు. ఎటువంటి సమయమో అటువంటి స్వరూపాన్ని తయారుచేసుకోవాల్సిందే అని అర్థం చేసుకుంటారు, అందుకే బాప్ దాదా కూడా డ్రామా యొక్క బంధనములోనైతే ఉన్నారు కదా. పిల్లలందరూ ప్రతి సమయమనుసారంగా సంతుష్టంగా ఉంటారు మరియు సదా సంతుష్టమణులుగా అయ్యి మెరుస్తూ ఉంటారు. ఎందుకని? పొందవలసినదేదో పొందేసాము అని మీరు స్వయమే అంటారు. బ్రహ్మాబాబా యొక్క ఆది అనుభవము యొక్క మాట ఇది, మరి బ్రహ్మాబాబా మాటే బ్రాహ్మణులందరి మాట. కనుక బాప్ దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ ఇదే రివైజ్ చేయిస్తున్నారు - సదా బాబా సాంగత్యములో ఉండండి. బాబా సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. బాబాయే సర్వ సంబంధీకుడు అని అంటారు కూడా. మరి సర్వ సంబంధీకుడైనప్పుడు, ఎటువంటి సమయమో అటువంటి సంబంధాన్ని కార్యములో ఎందుకు అనుభవం చెయ్యరు. ఒకవేళ ఈ సర్వ సంబంధాలను ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉన్నట్లయితే సహచరుడు కూడా ఉంటారు, సాంగత్యము కూడా ఉంటుంది. అప్పుడిక వేరే సహచరుల వైపుకు మనసు మరియు బుద్ధి వెళ్ళలేవు. బాప్ దాదా ఆఫర్ చేస్తున్నారు - సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి. సంబంధాలను కార్యములో అనుభవం చెయ్యండి.

బాప్ దాదా పిల్లలను గమనించినప్పుడు - కొంతమంది పిల్లలు కొన్ని-కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరివారిగా లేక కాస్త నీరసంగా అనుభవం చేస్తూ ఉంటారు, అప్పుడు వారిపై బాప్ దాదాకు దయ కలుగుతుంది, ఇంతటి శ్రేష్ఠ సాంగత్యము ఉన్నా కానీ సాంగత్యాన్ని కార్యంలోకి ఎందుకు తీసుకురారు? అప్పుడిక ఏమంటారు? వై వై (ఎందుకు, ఎందుకు). బాప్ దాదా అన్నారు - వై (ఎందుకు) అని అనకండి, వై అన్న మాట వచ్చినప్పుడు ఈ వై అనేది నెగెటివ్ మాట మరియు ఫ్లై (ఎగరటము) అనేది పాజిటివ్ మాట. కావున వై-వై అని ఎప్పుడూ అనకండి, ఫ్లై అన్న మాటను గుర్తుంచుకోండి. బాబాను సహచరునిగా చేసుకుని ఫ్లై చేసినట్లయితే చాలా ఆనందము కలుగుతుంది. ఆ సాంగత్యము మరియు ఆ సహచరుడు - ఈ రెండు రూపాలను మొత్తము రోజంతటిలో కార్యములోకి తీసుకురండి. ఇటువంటి సహచరుడు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? బాప్ దాదా ఎంతవరకు చెప్తున్నారంటే - ఒకవేళ బుద్ధి పరంగా మరియు శరీరం పరంగా, రెండు రకాలుగా అలసిపోయినా సరే, ఆ సహచరుడు మీకు రెండు రకాలుగానూ మాలిష్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు మనోరంజనాన్ని అందించడానికి కూడా ఎవర్రెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దు మనోరంజనము యొక్క అవసరమే ఉండదు. ఇలా బాబాను ఉపయోగించుకోవటము వస్తుందా లేక చాలా-చాలా పెద్ద తండ్రి, టీచరు, సద్గురువు... అని ఇలానే అనుకుంటారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. అర్థమైందా! డబల్ విదేశీయులు?

అచ్ఛా - అందరూ పుట్టినరోజును జరుపుకోవటానికి వచ్చారు కదా! జరుపుకోవాలి కదా! అచ్ఛా, పుట్టినరోజు జరిపినప్పుడు, ఎవరి పుట్టినరోజునైతే జరుపుతారో వారికి ఏదైనా కానుకను ఇస్తారా లేక ఇవ్వరా? (ఇస్తారు). మరి ఈ రోజు మీరందరూ బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. పేరు శివరాత్రి కదా, కావున విశేషంగా బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. ఇది జరపటానికే వచ్చారు కదా? మరి ఈ రోజు పుట్టినరోజు కానుకగా ఏమి ఇచ్చారు? లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించటము, కేక్ కట్ చెయ్యటము.. ఇంతే జరుపుతారా? ఈ రోజు ఏ కానుకను ఇచ్చారు? లేక రేపు ఇస్తారా? చిన్నదైనా లేక పెద్దదైనా కానీ, కానుకనైతే ఇస్తారు కదా! మరి ఏం ఇచ్చారు? ఆలోచిస్తున్నారు. అచ్ఛా, ఇవ్వాలా? ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? బాప్ దాదా ఏది చెప్తే అది ఇస్తారా లేక మీరు మీ ఇష్టప్రకారంగా ఇస్తారా? ఏం చేస్తారు? బాప్ దాదా ఏది చెప్తే అది ఇస్తారా లేక మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా? (బాప్ దాదా ఏది చెప్తే అది ఇస్తాము). చూడండి, కాస్త ధైర్యం పెట్టాల్సి ఉంటుంది. ధైర్యము ఉందా? మధుబన్ వారు ధైర్యము ఉందా? డబల్ విదేశీయులలో ధైర్యము ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అచ్ఛా - శక్తులలో, పాండవులలో ధైర్యము ఉందా? భారతవాసులలో ధైర్యము ఉందా? చాలా మంచిది. ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి. అచ్ఛా, మరి వినిపించాలా! ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి ఉంటుంది అనైతే అనరు కదా? చేస్తాములే, చూస్తాములే అని ఇలా లే, లే అని అనకండి. ఒక విషయాన్ని బాప్ దాదా మెజారిటీలో చూసారు. మైనారిటీలో కాదు, మెజారిటీలో చూసారు. ఏం చూసారు? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే మెజారిటీలో ఒకటి, రెండు, మూడవ నంబరులలో క్రోధము యొక్క అంశము వద్దనుకున్నా కానీ ఇమర్జ్ అవుతుంది. కొందరిలో మహా క్రోధము రూపములో ఉంటుంది, కొందరిలో ఆవేశము రూపములో ఉంటుంది, కొందరిలో మూడవ నంబర్ గా చికాకు రూపంలో ఉంటుంది. చికాకు అంటే ఏమిటో తెలుసా? అది కూడా క్రోధము యొక్క అంశమే, కాస్త తేలికపాటిది. మూడవ నంబరులో ఉంది కదా, అందుకని అది కాస్త తేలికపాటిది. మొదటిది తీవ్రంగా ఉంటుంది, రెండవది మొదటిదానికంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో భాష అయితే అందరిదీ చాలా రాయల్ గా ఉంది. రాయల్ రూపములో ఏమంటారు? విషయమే అటువంటిది కదా, కనుక ఆవేశమైతే తప్పకుండా వస్తుంది అని అంటారు. ఈ రోజు బాప్ దాదా అందరి నుండి ఈ కానుకను తీసుకోవాలని కోరుకుంటున్నారు - క్రోధము కాదు కదా, కానీ క్రోధము యొక్క అంశమాత్రము కూడా ఉండకూడదు. ఎందుకని? క్రోధములోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తారు ఎందుకంటే క్రోధమనేది ఇద్దరి మధ్యలో వస్తుంది. ఒక్కరిలోనే ఉండదు, ఇద్దరి మధ్యలో ఉంటుంది కావున అది కనిపిస్తుంది. మనసులోనైనా ఎవరి పట్లనైనా అంశమాత్రమైనా ద్వేష భావము ఉంటే, అప్పుడు మనసులో కూడా ఆ ఆత్మ పట్ల ఆవేశము తప్పకుండా వస్తుంది. బాప్ దాదాకు డిస్సర్వీస్ కు కారణమైన ఈ విషయము మంచిగా అనిపించటం లేదు. కనుక క్రోధ భావము అంశమాత్రము కూడా ఉత్పన్నమవ్వకూడదు. ఏ విధంగా బ్రహ్మాచర్యముపై అటెన్షన్ పెడతారో, అలాగే కామము మహాశత్రువని, క్రోధము మహాశత్రువని అంటూ ఉంటారు. క్రోధము వల్ల శుభ భావము, ప్రేమ భావము ఇమర్జ్ అవ్వవు. ఇక మూడ్ ఆఫ్ చేసుకుంటారు, ఆ ఆత్మ నుండి పక్కకు తప్పుకుంటారు, వారికి ఎదురుగా రారు, వారితో మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఇవన్నీ బయటివారికి కూడా తెలిసిపోతుంటాయి. కానీ ఈ రోజు వీరి ఆరోగ్యం బాగోలేదు, అంతే, ఇంకేం లేదు అని కప్పిపుచ్చుతూ ఉంటారు. మరి పుట్టినరోజుకు ఈ కానుకను ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. కానుకను ఇవ్వటానికి ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసుపై కూడా సాహెబు రాజీ అవుతారు. (చాలామంది సోదర-సోదరీలు లేచి నిలబడ్డారు) నెమ్మది-నెమ్మదిగా లేస్తున్నారు. సత్యము చెప్పినందుకు అభినందనలు. అచ్ఛా, ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో అది మంచిదే, ప్రయత్నమైతే చెయ్యండి, కానీ ప్రయత్నించటానికి ఎంత సమయము కావాలి? ఒక నెల కావాలా, 6 నెలలు కావాలా, ఎంత సమయము కావాలి? వదులుతారా లేక వదిలే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో, వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము రెండు, మూడు నెలల్లో ప్రయత్నించి వదులుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో, ఒకవేళ 6 నెలలు పూర్తిగా పట్టినా కానీ దానిని తగ్గించుకోవలసిందే. ఈ విషయాన్ని వదలెయ్యకూడదు ఎందుకంటే క్రోధాన్ని వదలటమనేది చాలా అవసరము. దాని ద్వారా డిస్సర్వీస్ కనిపిస్తుంది. నోటితో మాట్లాడకపోయినా, ముఖమైతే చెప్పేస్తుంది, అందుకే ఎవరైతే ధైర్యాన్ని పెట్టారో వారందరిపైనా బాప్ దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అచ్ఛా!

బాప్ దాదా రిటర్న్ గిఫ్ట్ గా అందరికీ ఏ విశేష వరదానాన్ని ఇస్తున్నారంటే - పొరపాటుగానైనా, అనుకోకుండానైనా ఎప్పుడైనా క్రోధము వచ్చినా కానీ కేవలము మనస్ఫూర్తిగా ‘‘మీఠా బాబా (మధురమైన బాబా)’’ అని అనండి, అప్పుడు బాబా ఇచ్చే అదనపు సహాయము ధైర్యము కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మీఠా బాబా అని అనండి, కేవలం బాబా అని అనకండి. ‘‘మీఠా బాబా (మధురమైన బాబా)’’ అని అంటే సహాయము లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే లక్ష్యము పెట్టుకున్నారు కదా, కావున లక్ష్యము ద్వారా లక్షణాలు వచ్చేదే ఉంటుంది. మధుబన్ వారు చేతులెత్తండి. అచ్ఛా - చెయ్యాల్సిందే కదా! (హాజీ) అభినందనలు. చాలా మంచిది. ఈ రోజు ప్రత్యేకంగా మధుబన్ వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి ఇవ్వటం లేదు, శ్రమ చేసినందుకు ఇస్తాము. క్రోధం విషయములో చేతులెత్తాము కాబట్టి టోలీ ఇస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు. వీరు చాలా బాగా శ్రమిస్తున్నారు. అందరినీ సేవ ద్వారా సంతుష్టపరచటములో మధుబన్ ఒక ఉదాహరణ, అందుకే ఈ రోజు నోటిని తీపి చేస్తాము. మీరందరూ వీరి నోటిని తీపి చేయటాన్ని చూసి మీరూ నోటిని తీపి చేసుకోండి, సంతోషము కలుగుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారము యొక్క ఒక కల్చర్. ఈ రోజుల్లో మీరు కల్చర్ ఆఫ్ పీస్ అన్న ఒక ప్రోగ్రామ్ ను తయారుచేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నంబరు కల్చర్ - ‘‘బ్రాహ్మణ కులము యొక్క సభ్యత’’. బాప్ దాదా చూసారు, దాదీ కానుకను ఇస్తారు కదా, అందులో ఒక చిన్న సంచి ఉంటుంది, దానిపై ఇలా వ్రాసి ఉంటుంది - ‘‘తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి.’’ కనుక ఈ రోజు బాప్ దాదా ఈ కానుకను ఇస్తున్నారు. సంచిని ఇవ్వటం లేదు, వరదానముగా ఈ మాటలను ఇస్తున్నారు. బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి ముఖములో, నడవడికలో ఈ బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షమవ్వాలి. ప్రోగ్రామ్ నైతే తయారుచేస్తారు, భాషణ కూడా చేస్తారు, కానీ ముందుగా స్వయములో ఈ సభ్యత ఉండటము అవసరము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ప్రతి ఒక్కరితో సంపర్కములోకి రావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉండకూడదు. ఎవరినో చూసి మీ కల్చర్ ను వదలకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను సభ్యత కల జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా! (అందరూ హాజీ అన్నారు)

చాలా మంచిది, డబల్ విదేశీయులు మెజారిటీ హాజీ అనటంలో చాలా మంచిగా ఉన్నారు. మంచిది. భారతవాసులకైతే ‘‘హాజీ అని అనటం’’ ఒక మర్యాదగా ఉండనే ఉంది. కేవలం మాయకు మాత్రమే ‘‘నాజీ (కాదు)’’ అని చెప్పండి, అంతే, ఇతర ఆత్మలకు హాజీ, హాజీ అనే చెప్పండి. మాయకు నాజీ, నాజీ (కాదు, కాదు) అని చెప్పండి. అచ్ఛా. అందరూ పుట్టినరోజును జరుపుకున్నారా? జరుపుకున్నారు, కానుకను ఇచ్చారు, కానుకను తీసుకున్నారు.

అచ్ఛా - మీతో పాటు వేరే స్థానాలలో కూడా సభలు ఏర్పాటు అయ్యాయి. కొన్నిచోట్ల చిన్న సభలు ఉన్నాయి, కొన్నిచోట్ల పెద్ద సభలు ఉన్నాయి, అందరూ వింటున్నారు, చూస్తున్నారు. వారికి కూడా బాప్ దాదా ఇదే చెప్తున్నారు - ఈ రోజున మీరందరూ కూడా కానుకను ఇచ్చారా, లేదా? హాజీ బాబా, ఇచ్చాము అని అందరూ అంటున్నారు. మంచిది, దూరంలో కూర్చుని ఉన్నా కూడా ఎదురుగా ఉండి వింటున్నట్లుగా ఉంది ఎందుకంటే సైన్స్ వారు ఎంతో శ్రమిస్తున్నారు, చాలా శ్రమ చేస్తారు కదా. కనుక అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకు కలగాలి కదా! అందుకే ఎప్పటి నుండైతే సంగమయుగము ప్రారంభమైందో, అప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూ ఉంటున్నాయి. సత్యయుగములోనైతే దేవతా రూపములో ఉన్న మీకు ఈ సైన్స్ సేవ చేస్తుంది, కానీ సంగమయుగములో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి మరియు సేవలో కూడా, ప్రత్యక్షతలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపములో సహయోగిగా అవుతాయి, అందుకే సైన్స్ కు నిమిత్తులుగా అయ్యే పిల్లలను కూడా బాప్ దాదా వారి శ్రమకు అభినందిస్తారు.

ఇకపోతే బాప్ దాదా చూసారు - మధుబన్ కు కూడా దేశ-విదేశాల నుండి చాలా మంచి-మంచి శోభనీయకమైన కార్డులు, ఉత్తరాలు వచ్చాయి మరియు కొందరి ద్వారా ప్రియస్మృతులను పంపించారు. బాప్ దాదా వారికి కూడా విశేష ప్రియస్మృతులు మరియు జన్మదినము సందర్భంగా పదమాల, పదమాల, పదమాల, పదమాల, పదమాల రెట్ల అభినందనలను ఇస్తున్నారు. పిల్లలందరూ బాప్ దాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూసారు, కానీ బాప్ దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహముతో పంపిస్తారు మరియు ఆ స్నేహముతోనే బాప్ దాదా వాటిని స్వీకరించారు. చాలామంది వారి స్థితులు గురించి కూడా వ్రాసారు. బాప్ దాదా అంటున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. ఎగరటం వలన అన్ని విషయాలు కిందే ఉండిపోతాయి మరియు మీరు సదా ఉన్నతోన్నతమైన బాబాతోపాటు ఉన్నతంగా ఉంటారు. క్షణములో స్టాప్ చెయ్యండి మరియు శక్తుల, గుణాల స్టాక్ ను ఇమర్జ్ చెయ్యండి. అచ్ఛా!

నలువైపుల ఉన్న సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా బాబా సాంగత్యములో ఉండేవారికి, బాబాను సహచరునిగా చేసుకునే స్నేహీ ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరములో ఇమిడిపోయే బాప్ దాదా సమానులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా క్షణములో బిందువు పెట్టే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు చాలా-చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే అని అయితే బాప్ దాదా ప్రతి సమయము, పిల్లలు ప్రతి ఒక్కరికీ చెప్తుంటారు, ఈ రోజు కూడా నమస్తే.

వరదానము:-

పవిత్రత యొక్క శక్తిశాలీ దృష్టి, వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించే దుఃఖహర్త-సుఖకర్తా భవ

సైన్స్ మెడిసిన్స్ లో దుఃఖాన్ని, నొప్పిని సమాప్తము చేసే అల్పకాలిక శక్తి ఉంది, కానీ పవిత్రతా శక్తిలో అనగా సైలెన్స్ శక్తిలోనైతే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రతో కూడిన ఈ శక్తిశాలీ దృష్టి మరియు వృత్తి సదాకాలపు ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే మీ జడ చిత్రాల ముందు ఓ దయామయీ, దయ చూపించు అని అంటూ దయను మరియు ఆశీర్వాదాలను కోరుకుంటారు. చైతన్యములో ఇటువంటి మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తలుగా అయ్యి దయను చూపించారు కావుననే భక్తిలో పూజింపబడతారు.

స్లోగన్:-

సమయము యొక్క సమీపత అనుసారంగా సత్యమైన తపస్య మరియు సాధనయే అనంతమైన వైరాగ్యము.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము, బ్రహ్మా వత్సలందరూ సంగఠిత రూపములో సా.6.30 గం. నుండి 7.30 గం. వరకు విశేషంగా తమ మాస్టర్ దాత స్వరూపములో స్థితులై సర్వాత్మలకు మనసా ద్వారా సర్వ శక్తుల దానమును ఇవ్వండి, వరదానమును ఇవ్వండి, నిండుతనం యొక్క అనుభూతిని చేయించండి.