16-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు సత్యాతి-సత్యమైన
రాజయోగులు, మిమ్మల్ని రాజఋషులు అని కూడా అంటారు, రాజఋషులు అంటేనే పవిత్రమైనవారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు,
మనుష్యులను మాయా రూపీ రావణుడి ఊబి నుండి ఎప్పుడు బయటకు తీయగలరు?
జవాబు:-
ఎప్పుడైతే మీరు
స్వయము ఆ ఊబి నుండి బయటపడతారో, అప్పుడు బయటకు తీయగలరు. ఊబి నుండి బయటపడిన వారి
గుర్తు ఏమిటంటే - వారు ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉంటారు. ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ
గుర్తుకు రాకూడదు. మంచి వస్త్రాలు ధరించాలి, మంచి పదార్థాలు తినాలి... అనే లోభము
ఉండకూడదు. మీరు పూర్తిగా వనవాహములో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి, నాదంటూ ఏమీ
లేదు, నేను ఆత్మను - అనేటువంటి ఆత్మాభిమానులైన పిల్లలే రావణుడి ఊబి నుండి మనుష్యులను
బయటకు తీయగలరు.
పాట:-
నీవు ప్రేమ
సాగరుడవు...
ఓంశాంతి
అప్పుడప్పుడు పాట వేసినప్పుడు, పిల్లలను పాట అర్థాన్ని కూడా అడిగేవారు. ఇప్పుడు
చెప్పండి - మీరు ఎప్పటినుండి మార్గాన్ని మర్చిపోయారు? (కొందరు ద్వాపరము నుండి అని
చెప్పారు, కొందరు సత్యయుగము నుండి అని చెప్పారు) ద్వాపరము నుండి మార్గాన్ని
మర్చిపోయామని ఎవరైతే అంటారో, వారు రాంగ్. సత్యయుగము నుండి మార్గాన్ని మర్చిపోయారు.
మార్గాన్ని తెలియజేసేవారైతే ఇప్పుడు మీకు లభించారు. సత్యయుగములో మార్గాన్ని
తెలియజేసే తండ్రి గురించి తెలియదు. అక్కడ ఎవరికీ తండ్రి గురించి తెలియదు, అంటే
వారిని మర్చిపోయారు. ఇలా మర్చిపోవడము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మళ్ళీ
మార్గాన్ని తెలియజేసేందుకు వారు వచ్చారు. ప్రభూ, మార్గాన్ని తెలియజేయండి అని అంటారు
కదా. మనము సత్యయుగము నుండి మొదలుకుని తండ్రిని మర్చిపోయాము. పిల్లల బుద్ధిని
నడిపించేందుకు బాబా ప్రశ్నలు అడుగుతారు. ఈ జ్ఞానము అద్భుతమైనది కదా, జ్ఞాన సాగరుడు
తండ్రి మాత్రమే. తండ్రి సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు - జ్ఞాన సాగరుడను, సుఖ
సాగరుడను నేనే. తప్పకుండా పతిత-పావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమేనని మీకు కూడా
తెలుసు. ఈ విషయాన్ని భక్తి మార్గము వారు కూడా నమ్ముతారు. పావన ప్రపంచాలు అంటేనే
శాంతిధామము మరియు సుఖధామము. ఇప్పుడు సుఖధామము మరియు దుఃఖధామము, రెండూ సగం-సగం ఉంటాయి.
ఈ విషయము పిల్లలకు మంచి రీతిలో తెలుసు. తండ్రి ప్రేమ సాగరుడు, అందుకే అందరూ వారిని
ఫాదర్ అని పిలుస్తారు. కానీ వారెవరు, ఎలా వస్తారు అనేది మర్చిపోతారు. ఇది 5 వేల
సంవత్సరాల నాటి విషయము, తప్పకుండా ఈ దేవీ-దేవతల రాజ్యముండేది. సత్యయుగములో సద్గతి
ఉంటుంది, మరి దుర్గతి ఎలా జరుగుతుంది అనేది ఎవరు చెప్తారు? ద్వాపరము నుండి మీ
దుర్గతి జరుగుతుంది, అందుకే పిలుస్తారు అని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది
కొత్త విషయమేమీ కాదని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి కల్ప-కల్పము వస్తారు. ఇప్పుడు
నిరాకార తండ్రి, ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఎవరికీ తమ ఆత్మ గురించి తెలియదు. నా
ఆత్మలో మొత్తము పాత్ర అంతా నిండి ఉందని ఎప్పుడూ ఎవరూ అనరు. నేను అనేక సార్లు ఈ
విధముగా తయారయ్యాను, పాత్రను అభినయించాను అని ఎప్పుడూ అనరు. డ్రామా గురించి వారికి
తెలియనే తెలియదు. లక్షల, వేల సంవత్సరాలని చెప్పినా కూడా, అది డ్రామాయే అవుతుంది కదా.
డ్రామా రిపీట్ అవుతుంది అనైతే అంటారు కదా. ఈ జ్ఞానాన్ని తండ్రియే పిల్లలకు
సమ్ముఖముగా ఇస్తారు. వారు నోటి ద్వారా మాట్లాడుతున్నారు. మనల్ని శివబాబా బ్రహ్మా
ద్వారా తమవారిగా చేసుకుని, బ్రాహ్మణులుగా చేసారు అని మీకు తెలుసు. వీరు (బ్రహ్మా)
శివబాబాకు కొడుకు కూడా, పత్ని కూడా. ఎంతమంది పిల్లలను సంభాళించడము జరుగుతుందో చూడండి.
పురుషుడు ఒక్కరే ఉన్న కారణముగా, పిల్లలను సంభాళించమని సరస్వతిని సహాయకురాలుగా చేసారు.
ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఇవి ప్రాక్టికల్ విషయాలు. తండ్రియే రాజయోగాన్ని
నేర్పిస్తారు, ఎవరికైతే రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు, 84
జన్మలలోకి వచ్చారు. బైబిల్, ఖురాన్, వేద-శాస్త్రాలు మొదలైనవాటిని చాలామంది చదువుతారు
కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు తత్వయోగులేమీ కారు. మీకు తండ్రితో యోగము ఉంది
అనగా తండ్రి స్మృతి ఉంది. మీరిప్పుడు రాజయోగులు, రాజఋషులు అనగా యోగీ రాజ్. యోగులని
పవిత్రమైనవారిని అంటారు. స్వర్గ రాజ్యాన్ని తీసుకునేందుకు మీరు యోగులుగా అయ్యారు.
పవిత్రముగా అవ్వండి అని తండ్రి మొట్టమొదటగా చెప్తారు. పవిత్రమైనవారికే యోగి అన్న
పేరు ఉంటుంది. మీరందరూ రాజయోగులు. ఇది బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు
సంబంధించిన విషయము. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కనుక మీరు విద్యార్థులైనట్లే
కదా. విద్యార్థులు ఎప్పుడైనా టీచరును మర్చిపోతారా? శివబాబా మమ్మల్ని
చదివిస్తున్నారని మీకు తెలుసు. కానీ మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. మీరు మిమ్మల్ని
చదివించే టీచరును మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారు అని అర్థం చేసుకున్నప్పుడే
నషా ఎక్కుతుంది. స్కూల్లో ఐ.సి.యస్ చదువుకునేటప్పుడు ఎంత నషా ఉంటుంది. పిల్లలైన
మీరైతే 21 జన్మల కోసం ఈ రాజయోగ చదువును చదువుకుంటారు. మళ్ళీ స్వర్గములో కూడా
చదువుకోవాల్సి ఉంటుంది. రాజవిద్యను కూడా చదువుకోవాల్సి ఉంటుంది, భాష మొదలైనవి
నేర్చుకోవాల్సి ఉంటుంది.
మనము సత్యయుగము నుండి ఈ మార్గాన్ని మర్చిపోతామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతారు. మనము ఎలా ఎక్కుతాము, ఎలా
దిగుతాము అనేది ఇప్పుడు మీకు అంతా గుర్తుంది. ఈ మెట్ల వరుసను బాగా గుర్తుంచుకోండి.
84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మనము వెళ్ళాలి కావున సంతోషము కలుగుతుంది. ఇది
అనంతమైన నాటకము. ఆత్మ ఎంత చిన్నది. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ ఆత్మ అలసిపోతుంది.
అప్పుడు, బాబా, మార్గాన్ని తెలియజేసినట్లయితే మేము విశ్రాంతి పొందుతాము,
సుఖ-శాంతులను పొందుతాము అని అంటారు. మీరు సుఖధామములో ఉన్నప్పుడు, మీ కోసం అక్కడ
సుఖ-శాంతులు కూడా ఉంటాయి. అక్కడ హంగామాలేవీ ఉండవు. ఆత్మకు శాంతి ఉంటుంది. శాంతికి
సంబంధించిన స్థానాలు రెండు - శాంతిధామము మరియు సుఖధామము. దుఃఖధామములో అశాంతి ఉంటుంది.
ఇది చదువు, బాబా మనల్ని వయా శాంతిధామము, సుఖధామానికి తీసుకువెళ్తున్నారని మీకు
తెలుసు కావున ఈ విషయము ఇక మీకు వేరుగా చెప్పాల్సిన అవసరము లేదు. మనము ఇక్కడకు
పాత్రను అభినయించేందుకు వచ్చామని, మళ్ళీ వెళ్ళాలని మీకు తెలుసు. మీకు ఈ సంతోషము
ఉంటుంది. శాంతి గురించి సంతోషము లేదు. పాత్రను అభినయించడములో మనకు మజా వస్తుంది,
సంతోషము కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడముతో వికర్మలు వినాశనమవుతాయని మనకు తెలుసు.
మాకు మనశ్శాంతి కావాలి అని కొంతమంది అంటారు. ఈ మాట కూడా రాంగ్. మనము వికర్మలు
వినాశనమవ్వాలని తండ్రిని స్మృతి చేస్తాము. మనసు శాంతిగా అయితే ఉండలేదు, కర్మలు
చేయకుండా ఎవరూ ఉండలేరు. ఇకపోతే, మేము తండ్రి నుండి పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వాన్ని
తీసుకుంటున్నామని రియలైజ్ అవుతారు కావున ఆ సంతోషము ఉండాలి. ఇది ఉన్నదే దుఃఖధామము,
ఇక్కడ సుఖము ఉండదు. మనుష్యులు శాంతిధామాన్ని, సుఖధామాన్ని మర్చిపోయారు. అందుకే, ఎవరి
వద్దనైతే చాలా ధనముందో, వారు మేము సుఖముగా ఉన్నామని భావిస్తారు. సన్యాసులు
ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్తారు, అక్కడ హంగామాలేవీ ఉండవు కనుక వారు శాంతిగా
అయిపోతారు, కానీ అది అల్పకాలానికే జరుగుతుంది. ఆత్మ స్వధర్మము శాంతి, అందులో
స్థితులైనప్పుడు మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడైతే ప్రవృత్తిలోకి రావాల్సిందే, పాత్రను
అభినయించాల్సిందే. ఇక్కడకు కర్మలు చేసేందుకే వస్తారు. కర్మలోకైతే ఆత్మ తప్పకుండా
రావాల్సిందే. ఈ వివరణను అనంతమైన తండ్రి ఇస్తున్నారని పిల్లలైన మీరు అర్థం
చేసుకుంటారు. నిరాకార భగవానువాచ - నేను ఒక ఆత్మను, నా తండ్రి పరమ ఆత్మ అని ఇప్పుడు
మీకు తెలుసు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఆత్మ వారిని పిలుస్తుంది. ఆ తండ్రియే సర్వుల
సద్గతిదాత. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, ఇదే శ్రమతో
కూడుకున్నది. అర్ధకల్పము నుండి ఏదైతే మాలిన్యము చేరిందో, అది ఈ స్మృతితోనే
తొలగుతుంది. మీరు సత్యమైన బంగారముగా అవ్వాలి. ఎలాగైతే సత్యమైన బంగారములో
మాలిన్యాన్ని కలిపిన తర్వాత ఆభరణాలను తయారుచేస్తారో, అలా వాస్తవానికి మీరు సత్యమైన
బంగారముగా ఉండేవారు, తర్వాత మీలో మాలిన్యము చేరుతుంది. మనము పాత్రను అభినయించామని
ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనము పుట్టింటికి వెళ్తాము. విదేశాల నుండి
పుట్టింటికి తిరిగి వచ్చినప్పుడు సంతోషము కలుగుతుంది. అలాగే, మీకు కూడా సంతోషముగా
ఉంది, బాబా మా కోసం స్వర్గాన్ని తీసుకువచ్చారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఇచ్చే
కానుక - అనంతమైన రాజ్యాధికారము అనగా సద్గతి. సన్యాసులు, ముక్తి యొక్క కానుకను
ఇష్టపడతారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా స్వర్గస్థులయ్యారని అంటారు. సన్యాసులు,
జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని, ఆత్మలన్నీ అందులోనే కలిసిపోతాయని అంటారు. కానీ అది
ఆత్మలమైన మనము నివసించే స్థానము, అంతేకానీ, అందరూ కలిసిపోయేందుకు ఆ స్థానమేమీ జ్యోతి
లేక అగ్ని కాదు. అది బ్రహ్మమహాతత్వము, అక్కడ ఆత్మలు ఉంటాయి. తండ్రి కూడా అక్కడే
ఉంటారు. వారు కూడా బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారము జరిగితే అర్థం
చేసుకోలేరు. చాలామంది పిల్లలంటారు - బాబా, స్మృతి చేయడము కష్టమనిపిస్తుంది, బిందు
రూపాన్ని ఎలా స్మృతి చేయాలి, అర్ధకల్పముగా పెద్ద లింగము రూపాన్ని స్మృతి చేసాము.
దానికి తండ్రి అర్థం చేయిస్తున్నారు - బిందువుకైతే పూజ జరగదు, బిందువుకు మందిరము ఎలా
నిర్మిస్తారు, బిందువైతే కనిపించను కూడా కనిపించదు, అందుకే పెద్ద శివలింగాన్ని
తయారుచేస్తారు. ఇకపోతే, ఆత్మలకు గుర్తుగా సాలిగ్రామాలనైతే చాలా చిన్న-చిన్నవిగా
తయారుచేస్తారు. వాటిని అండాకారములో తయారుచేస్తారు. పరమాత్మ బిందువు వలె ఉంటారని
ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. తండ్రి అంటారు - ఆ సమయములో ఈ మాట చెప్పే పాత్రయే
లేదు. అరే, మీరు ఐ.సి.యస్ ను, ముందు నుండే ఎందుకు చదువుకోరు? చదువుకు కూడా నియమాలు
ఉన్నాయి కదా. ఎవరైనా ఇటువంటి విషయాలను అడిగితే, మీరు ఇలా చెప్పవచ్చు - సరే, బాబాను
అడుగుతాము లేదా మా కన్నా పెద్ద టీచరు ఉన్నారు, వారికి వ్రాసి అడుగుతామని చెప్పండి.
బాబాకు చెప్పవలసి ఉంటే చెప్తారు లేదా మున్ముందు అర్థం చేసుకుంటారులే అని అంటారు.
ఒకేసారి అన్నీ వినిపించరు. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేద-శాస్త్రాలలో ఏముంది అన్న
సారాన్ని అంతా తండ్రి కూర్చుని తెలియజేస్తారు. ఇవి కూడా భక్తి మార్గములో నిశ్చితమై
ఉన్నాయి, వీటిని మీరు మళ్ళీ కూడా చదవాల్సి ఉంటుంది, ఈ భక్తి పాత్రను అభినయించాల్సే
ఉంటుంది. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాలి. భక్తి యొక్క ఊబిలో
చిక్కుకుపోయారని బాబా అంటారు, భక్తి బాహ్యముగా చాలా సుందరముగా ఉంటుంది. ఎండమావులను
ఉదాహరణగా చెప్తారు. భక్తి కూడా చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. అది ఎండమావుల వంటిదని
తండ్రి అంటారు. ఆ ఊబిలో చిక్కుకుపోతారు. ఇక బయటకు రావడము కష్టమైపోతుంది, పూర్తిగా
చిక్కుకుపోతారు. ఇతరులను బయటకు తీసేందుకు వెళ్తారు కానీ వారే స్వయము చిక్కుకుపోతారు.
ఈ విధముగా చాలామంది చిక్కుకుపోయారు, ఆశ్చర్యకరముగా వింటారు, వర్ణిస్తారు, ఇతరులను
బయటకు తీస్తారు, నడుస్తూ-నడుస్తూ మళ్ళీ స్వయము చిక్కుకుపోతారు. ఎంత మంచి-మంచి ఫస్ట్
క్లాస్ పిల్లలు ఉండేవారు. అటువంటివారిని బయటకు తీయడము చాలా కష్టమైపోతుంది. తండ్రిని
మర్చిపోతే వారిని ఊబి నుండి బయటకు తీయడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. ఎంత అర్థం
చేయించినా సరే, బుద్ధిలో కూర్చోదు. మీరు మాయా రూపీ రావణుడి ఊబి నుండి ఎంత బయటపడ్డారు
అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఎంతెంతగా బయటకు వస్తూ ఉంటారో, అంతంతగా సంతోషము
కలుగుతుంది. ఎవరైతే స్వయము బయటపడ్డారో, వారి వద్ద ఇతరులను బయటకు తీసే శక్తి ఉంటుంది.
బాణాలు వేసేవారిలో కొందరు చురుకుగా ఉంటారు, కొందరు బలహీనముగా ఉంటారు. ఏకలవ్యుడు
మరియు అర్జునుడి ఉదాహరణ కూడా ఉంది కదా. అర్జునుడు గురువుతో పాటు ఉండేవారు. అర్జునుడు
అంటే ఒక్కరు కాదు, ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి, తండ్రితో పాటు ఉంటారో,
వారిని అర్జునుడు అని అంటారు. తోడుగా ఉండేవారికి మరియు బయట ఉండేవారికి మధ్యన రేస్
పెట్టడము జరుగుతుంది. ఏకలవ్యుడు అనగా బయట ఉండేవారు, అతను చురుకుగా ముందుకు
వెళ్ళిపోయారు. ఉదాహరణగా ఒక్కరి గురించి చెప్పడము జరుగుతుంది, కానీ ఇది అనేకులకు
సంబంధించిన విషయము. బాణము అనగా ఈ జ్ఞానానికి సంబంధించినది. ప్రతి ఒక్కరూ తమను తాము
అర్థం చేసుకోగలరు - నేను ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఇంకెవరి స్మృతి రావడము
లేదు కదా! మంచి వస్త్రాలు ధరించాలని గాని, మంచి పదార్థాలు తినాలని గాని లోభమైతే
కలగడము లేదు కదా! ఇక్కడ మంచివి ధరించినట్లయితే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడైతే మనము
వనవాహములో ఉండాలి. తండ్రి అంటారు, మీరు మీ ఈ శరీరాన్ని కూడా మర్చిపోండి. ఇది పాత
తమోప్రధాన శరీరము. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా
ఉండాలి.
తండ్రి అంటారు - ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవాటిని కూడా ధరించకండి. ఇలా ఎందుకు అంటారు?
దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరి ఆభరణాలైనా పోతే, అక్కడ బి.కె.లకు ఇచ్చేసి
వచ్చారని అంటారు లేదా మార్గములో వెళ్ళేటప్పుడు దొంగలు కూడా దోచుకుంటారు. ఈ రోజుల్లో
స్త్రీలలో కూడా దొంగతనాలు చేసేవారు చాలామంది వెలువడ్డారు. స్త్రీలు కూడా దోపిడీలు
చేస్తున్నారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి? ఈ ప్రపంచము పూర్తిగా వేశ్యాలయముగా
ఉందని మీరు అర్థం చేసుకుంటారు. మనము ఇక్కడ శివబాబాతో పాటు శివాలయములో కూర్చున్నాము.
వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, ఆనంద స్వరూపుడు. మహిమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంటు
అయ్యాను, నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది. మేము బ్రాహ్మణులమని, బాబా నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీ ఆత్మ అంటుంది. ఆత్మాభిమానిగా ఉండాలి, ఇందులోనే
శ్రమ ఉంది. వారు నాకు ఫలానా అవుతారు, ఇది నాది... ఇవన్నీ గుర్తుంటాయి. ఆత్మలమైన మనము
పరస్పరములో సోదరులము అనేది మర్చిపోతారు. ఈ నాది-నాది అనేది వదలాల్సి ఉంటుంది. నేను
ఒక ఆత్మను, వీరి (బ్రహ్మా) ఆత్మకు కూడా తెలుసు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను
కూడా వింటూ ఉంటాను. నేనే ముందు వింటాను, నేను కూడా వినిపించగలను కానీ పిల్లల
కళ్యాణార్థము చెప్తున్నాను - మీరు సదా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి.
విచార సాగర మంథనము చేయడము పిల్లల పని. మీరు ఏదైతే చేస్తారో, అది నేను కూడా చేస్తాను.
లేదంటే మొదటి నంబరులోకి ఎలా వెళ్ళగలను. కాకపోతే వారు స్వయాన్ని గుప్తముగా
ఉంచుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నాది-నాది అన్నదంతా వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మాభిమానులుగా ఉండే
కృషి చేయాలి. ఇక్కడ పూర్తిగా వనవాహములో ఉండాలి. ఏదైనా ధరించాలి, తినాలి అనే కోరికల
నుండి ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి.
2. పాత్రను అభినయిస్తూ, కర్మలు చేస్తూ తమ శాంతి స్వధర్మములో స్థితులై ఉండాలి.
శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి.
వరదానము:-
ఆత్మిక నషా మరియు దయా గుణము ద్వారా విశ్వ నవ నిర్మాణము చేసే
విశ్వ కళ్యాణకారీ భవ
విశ్వ కళ్యాణకారులుగా అవ్వడానికి ముఖ్యముగా రెండు ధారణలు
అవసరము, ఒకటి - ఈశ్వరీయ ఆత్మిక నషా మరియు రెండు - దయ. ఒకవేళ ఆత్మిక నషా మరియు దయ,
రెండు కలిపి ఉన్నాయి మరియు సమానముగా ఉన్నాయి అంటే ఆత్మికత యొక్క స్థితి తయారవుతుంది.
కావున ఎప్పుడైనా ఏదైనా కర్తవ్యము చేసినా లేక నోటి ద్వారా పదాలను వర్ణించినా, చెక్
చేసుకోండి - దయ మరియు ఆత్మిక నషా, రెండూ సమాన రూపములో ఉన్నాయా? శక్తుల చిత్రాలలో ఈ
రెండు గుణాల సమానతను చూపిస్తారు, దీని ఆధారముగానే విశ్వ నవ నిర్మాణానికి
నిమిత్తులుగా అవ్వగలరు.
స్లోగన్:-
తండ్రి ప్రేమ
ముందు వ్యర్థ సంకల్పాలను అర్పించండి - ఇదే సత్యమైన బలిహారము.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
ఎవరెంత స్వయం సరళముగా
ఉంటారో, అంతగానే స్మృతి కూడా సరళముగా ఉంటుంది. ఎవరైతే ప్రతి విషయములోనూ స్పష్టముగా
మరియు స్వచ్ఛముగా ఉంటారో, వారు అంతే సరళముగా ఉంటారు. స్వయం ఎలా ఉంటారో, వారి రచనలో
కూడా అవే సంస్కారాలు ఉంటాయి. కావున ప్రతి గుణము యొక్క ప్రాక్టికల్ స్వరూపముగా,
ఉదాహరణగా అవ్వండి.