ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఆత్మ ఇప్పుడు
సాకారములో ఉంది మరియు ఆత్మ ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కూడా ఎందుకంటే దత్తత
తీసుకోబడ్డారు. మీ గురించి అందరూ - వీరు సోదరీ, సోదరులుగా చేస్తారు అని అంటారు.
పిల్లలకు తండ్రి అర్థం చేయించారు, వాస్తవానికి ఆత్మలైన మీరు సోదరులు. ఇప్పుడు కొత్త
సృష్టి తయారవుతుంది కావున మొట్టమొదట పిలక అయిన బ్రాహ్మణులు కావాలి. మీరు శూద్రులుగా
ఉండేవారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి.
ప్రజాపిత బ్రహ్మా యొక్క పేరు అయితే ప్రసిద్ధమైనది. ఈ లెక్కలో పిల్లలైన మేమందరమూ
సోదరీ, సోదరులము అవుతాము అని మీరు భావిస్తారు. ఎవరెవరైతే స్వయాన్ని
బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలుచుకుంటారో వారు తప్పకుండా సోదరీ, సోదరులవుతారు. అందరూ
ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కావున తప్పకుండా సోదరీ, సోదరులే అవ్వాలి. ఇది
వివేకహీనులకు అర్థం చేయించాలి. వివేకహీనులుగా కూడా ఉన్నారు మరియు అంధ విశ్వాసము కూడా
ఉంది. ఎవరినైతే పూజిస్తారో, ఎవరిపైనైతే వీరు ఫలానా అని నమ్మకాన్ని ఉంచుతారో వారి
గురించి అసలేమీ తెలియదు. లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారు,
అలా ఏ విధంగా అయ్యారు, మళ్ళీ ఏమయ్యారు? ఇది ఎవరికీ తెలియదు. మనుష్యులకు నెహ్రూ
మొదలైనవారి గురించి తెలుసు అంటే వారి చరిత్ర, భౌగోళికాలను గురించి కూడా తెలుసు.
ఒకవేళ జీవితచరిత్రను గురించి తెలియకపోతే వారు ఎందుకు పనికొస్తారు. పూజ చేస్తారు,
కానీ వారీ జీవితగాథను గురించే తెలియదు. మనుష్యుల యొక్క జీవితగాథను గురించి తెలుసు
కానీ ఏ పెద్దవారైతే గతించిపోయారో వారిలోని ఒక్కరి జీవితగాథను గురించి కూడా తెలియదు.
శివునికి ఎంతమంది పూజారులు ఉన్నారు. పూజ చేస్తారు, మళ్ళీ వారు రాయి-రప్పల్లోనూ,
కణకణములోనూ ఉన్నారని అని నోటితో అనేస్తారు. ఇదేమైనా జీవితగాథా? ఇది తెలివైన విషయమేమీ
కాదు. స్వయాన్ని కూడా పతితులుగానే పిలుచుకుంటారు. పతితులు అన్న పదము ఎంత చక్కగా
సరిపోతుంది. పతితులు అనగా వికారులు. మనము బ్రహ్మాకుమార-కుమారీలుగా ఎందుకు
పిలువబడతాము అన్నది మీరు అర్థం చేయించవచ్చు. ఎందుకంటే మనం బ్రహ్మాకు పిల్లలము మరియు
దత్తత తీసుకోబడ్డవారము. మనం కుఖవంశావళి కాదు, ముఖవంశావళి. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైతే
సోదరీ, సోదరులవుతారు కదా. కావున వారికి పరస్పరం అశుద్ధ దృష్టి ఉండకూడదు. అశుద్ధ
ఆలోచనలలో ముఖ్యమైనవి కామము యొక్క ఆలోచనలే. మీరు అంటారు, మేము ప్రజాపిత బ్రహ్మాకు
సంతానముగా, సోదరీ-సోదరులము అవుతాము. శివబాబా సంతానమైన మనమందరమూ పరస్పరం సోదరులము అని
మీరు భావిస్తారు. ఇది కూడా పక్కాగా ఉంది. ప్రపంచానికి ఏమీ తెలియదు. ఏదో నామమాత్రంగా
అనేస్తారు. ఆత్మలందరికీ తండ్రి వారొక్కరేనని మీరు అర్థం చేయించవచ్చు. వారినే అందరూ
పిలుస్తారు. మీరు చిత్రాన్ని కూడా చూపించారు. గొప్ప-గొప్ప ధర్మాలవారు కూడా ఈ
నిరాకారుడైన తండ్రిని అంగీకరిస్తారు. వారు నిరాకారీ ఆత్మల తండ్రి మరియు సాకారములో
అందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మా. వారి నుండి ఇక వృద్ధి చెందుతూ ఉంటారు, వృక్షం
పెరుగుతూ ఉంటుంది. భిన్న-భిన్న ధర్మాలలోకి వస్తూ ఉంటారు. ఆత్మ అయితే ఈ శరీరానికి
అతీతమైనది. శరీరాన్ని చూసి - వీరు అమెరికన్లు, వీరు ఫలానా అని అంటారు, కానీ ఆత్మను
అలా అనరు. ఆత్మలన్నీ శాంతిధామములో ఉంటాయి, పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి
వస్తాయి. మీరు ఏ ధర్మము వారికైనా వినిపించండి, పునర్జన్మలనైతే అందరూ తీసుకుంటూ
ఉంటారు మరియు పై నుండి కూడా కొత్త ఆత్మలు వస్తూ ఉంటారు. కావున తండ్రి అర్థం
చేయిస్తారు - మీరు కూడా మనుష్యులే, మనుష్యులకే సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలియాలి,
ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, దీని రచయిత ఎవరు, ఇది తిరగడానికి ఎంత సమయం
పడుతుంది అన్నది తెలియాలి. ఇది మీకే తెలుసు, దేవతలకైతే తెలియదు. మనుష్యులే
తెలుసుకొని మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుష్యులను దేవతలుగా తయారుచేసేవారు తండ్రి.
తండ్రి తమ మరియు రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. మీకు తెలుసు, మనం బీజరూపుడైన
తండ్రికి బీజరూపులమైన పిల్లలము. ఏ విధంగా తండ్రికి ఈ తలక్రిందుల వృక్షము గురించి
తెలుసో, అలాగే మనం కూడా తెలుసుకున్నాము. మనుష్యులు మనుష్యులకు ఈ విషయాలను ఎప్పుడూ
అర్థం చేయించలేరు. కానీ మీకు తండ్రి అర్థం చేయించారు.
ఎప్పటివరకైతే మీరు బ్రహ్మాకు పిల్లలుగా అవ్వరో అప్పటివరకూ ఇక్కడకు రాలేరు.
ఎప్పటివరకైతే పూర్తి కోర్సు తీసుకుని అర్థం చేసుకోరో, అప్పటివరకూ మీరు బ్రాహ్మణుల
సభలో ఎలా కూర్చోబెట్టగలరు. దీనిని ఇంద్రసభ అని కూడా అంటారు. ఇంద్రుడు అంటే ఆ నీటి
వర్షాన్ని కురిపించేవారేమీ కాదు. దీనిని ‘ఇంద్ర సభ’ అని అంటారు. దేవకన్యలుగా (దేవతలుగా)
కూడా మీరే అవ్వాలి. అనేక రకాల దేవకన్యలు మహిమ చేయబడ్డారు. పిల్లలెవరైనా చాలా
సుందరంగా ఉంటే ఈమె దేవకన్యలా ఉంది అని అంటారు కదా. పౌడర్ మొదలైనవి రాసుకుని సుందరంగా
అయిపోతారు. సత్యయుగములో మీరు దేవతలుగా, రాకుమారులు, రాకుమార్తెలుగా అవుతారు. ఇప్పుడు
మీరు జ్ఞానసాగరునిలో జ్ఞాన స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా (దేవీ, దేవతలుగా)
అయిపోతారు. మేము ఎలా ఉన్నవారము ఎలా తయారవుతున్నాము అనేది మీకు తెలుసు. ఏ తండ్రి
అయితే సదా పవిత్రునిగా, సదా సుందరముగా ఉన్నారో, ఆ యాత్రికుడు మిమ్మల్ని ఈ విధంగా
తయారుచేసేందుకు నల్లని శరీరములోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు తెల్లగా ఎవరు తయారుచేయాలి?
బాబాయే తయారుచేయవలసి ఉంటుంది కదా. సృష్టి చక్రము అయితే తిరగవలసిందే. ఇప్పుడు మీరు
తెల్లగా అవ్వాలి. చదివించే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. వారు జ్ఞానసాగరుడు,
ప్రేమసాగరుడు. ఆ తండ్రి మహిమ ఏదైతే గానం చేయబడుతుందో అది లౌకిక తండ్రికి ఏమైనా
ఉంటుందా. అనంతమైన తండ్రికే మహిమ ఉంది. వారినే అందరూ పిలుస్తారు - మమ్మల్ని ఈ విధంగా
మహిమాయోగ్యులుగా చేయండి అని. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారముగా అలా
తయారవుతున్నారు కదా. చదువులో అందరూ ఒకే విధముగా ఉండరు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా
ఉంటుంది కదా. మీ వద్దకు కూడా ఎంతోమంది వస్తారు. బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. ఆ
తర్వాత కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. ఎవరైతే చదువులో
అందరికన్నా మంచిగా ఉంటారో వారు ఇతరులను కూడా చదివించగలుగుతారు. ఇన్ని కాలేజీలు
మొదలైనవి వెలువడుతూ ఉంటాయి అని మీరు అర్థం చేసుకోగలరు. బాబా కూడా అంటారు, ఎటువంటి
కాలేజీని తయారుచేయండంటే, ఈ కాలేజీలో రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం
లభిస్తుంది అని ఎవరైనా అర్థం చేసుకోగలగాలి. తండ్రి భారత్ లోకే వస్తారు కావున భారత్
లోనే కాలేజీలు తెరవబడుతూ ఉంటాయి. మున్ముందు విదేశాలలో కూడా తెరుచుకుంటూ ఉంటాయి.
ఎన్నో కాలేజీలు, యూనివర్శిటీలు కావాలి కదా. అక్కడకు ఎంతోమంది వచ్చి చదువుకుంటారు,
మళ్ళీ ఎప్పుడైతే చదువు పూర్తి అవుతుందో అప్పుడు దేవీ-దేవతా ధర్మములోకి అందరూ
ట్రాన్స్ఫర్ అయిపోతారు అనగా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. మీరు మనుష్యుల నుండి
దేవతలుగా అవుతారు కదా. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు భగవంతునికి ఎంతో సమయం
పట్టదు... అన్న గాయనము కూడా ఉంది. ఇక్కడ ఇది మనుష్యుల ప్రపంచము, అది దేవతల ప్రపంచము.
దేవతలకు మరియు మనుష్యులకు మధ్యన రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. పగలులో దేవతలు
ఉంటారు, రాత్రిలో మనుష్యులు ఉంటారు. అందరూ భక్తులే, పూజారులే. ఇప్పుడు మీరు పూజారుల
నుండి పూజ్యులుగా అవుతారు. సత్యయుగములో శాస్త్రాలు, భక్తి మొదలైనవాటి మాటే ఉండదు.
అక్కడ అందరూ దేవతలే. మనుష్యులు భక్తులుగా ఉంటారు. మనుష్యులే మళ్ళీ దేవతలుగా అవుతారు.
అది దైవీ ప్రపంచము, దీనిని ఆసురీ ప్రపంచము అని అంటారు. రామ రాజ్యము మరియు రావణ
రాజ్యము. రావణ రాజ్యము అని దేనినంటారు, రావణుడు ఎప్పుడు వచ్చాడు అనేది ఇంతకుముందు
మీ బుద్ధిలో లేదు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. లంక సముద్రములో మునిగిపోయింది అని
అంటారు. అలాగే మళ్ళీ ద్వారకను గురించి కూడా చెప్తారు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ లంక
అంతా మునిగిపోనున్నదని, మొత్తం ప్రపంచమంతా కూడా అనంతమైన లంకయే. ఇదంతా మునిగిపోతుంది,
నీరు వచ్చేస్తుంది. ఇకపోతే స్వర్గమైతే మునిగిపోదు. ఎంత అపారమైన ధనము ఉండేది. తండ్రి
అర్థం చేయించారు, ఒక్క సోమనాథ మందిరాన్ని ముసల్మానులు ఎంతగా దోచుకున్నారు. ఇప్పుడు
చూడండి, ఏమీ మిగల్లేదు. భారత్ లో ఎంతటి అపారమైన ధనము ఉండేది. భారత్ నే స్వర్గము అని
అంటారు. ఇప్పుడు దీనిని స్వర్గము అని అంటారా? ఇప్పుడు ఇది నరకముగా ఉంది, మళ్ళీ
స్వర్గముగా అవుతుంది. స్వర్గాన్ని ఎవరు తయారుచేస్తారు, నరకాన్ని ఎవరు తయారుచేస్తారు?
ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. రావణ రాజ్యము ఎంత సమయం కొనసాగుతుందో కూడా
తెలియజేశారు. రావణ రాజ్యములో ఎన్ని ధర్మాలు ఏర్పడతాయి. రామ రాజ్యములోనైతే కేవలం
సూర్యవంశీయులు, చంద్రవంశీయులే ఉంటారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఈ చదువు ఇంకెవరి
బుద్ధిలోనూ లేదు. వారంతా రావణ రాజ్యములో ఉన్నారు. రామ రాజ్యము సత్యయుగములో ఉంటుంది.
తండ్రి అంటారు, నేను మిమ్మల్ని అర్హులుగా తయారుచేస్తాను, మళ్ళీ మీరు అనర్హులుగా
అయిపోతారు. అనర్హులు అని ఎందుకు అంటారు? ఎందుకంటే పతితులుగా అయిపోతారు. దేవతల అర్హత
యొక్క మహిమను మరియు తమ అనర్హత యొక్క మహిమను గానం చేస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు - మీరు ఎప్పుడైతే పూజ్యులుగా ఉండేవారో అప్పుడు కొత్త
ప్రపంచము ఉండేది. చాలా కొద్దిమంది మనుష్యులే ఉండేవారు. మొత్తం విశ్వానికి మీరే
యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీకు ఎంతో సంతోషము ఉండాలి. సోదరీ, సోదరులుగానైతే
అవుతారు కదా. వాళ్ళు అంటారు, వీరు ఇళ్ళు-వాకిళ్ళను వదిలించేస్తారు అని. వారే మళ్ళీ
వచ్చి ఎప్పుడైతే శిక్షణను తీసుకుంటారో, అప్పుడు ఇక్కడకు రావడం ద్వారా జ్ఞానం చాలా
బాగుంది అని అర్థం చేసుకుంటారు. అర్థాన్ని తెలుసుకుంటారు కదా. సోదరీ-సోదరులుగా
అనుకోకపోతే పవిత్రత ఎక్కడ నుండి వస్తుంది. మొత్తం ఆధారమంతా పవిత్రత పైనే ఉంది.
తండ్రి రావడం కూడా మగధ దేశములోకి వస్తారు, ఇది చాలా దిగజారిపోయిన దేశము, ఇక్కడ చాలా
పతితులుగా ఉన్నారు, అన్నపానాదులు కూడా అశుద్ధముగా ఉన్నాయి. తండ్రి అంటారు, నేను
అనేక జన్మల అంతిమములోని శరీరములోకే ప్రవేశిస్తాను. ఇతనే 84 జన్మలు తీసుకుంటారు.
లాస్ట్ నుండి మళ్ళీ ఫస్ట్, ఫస్ట్ నుండి మళ్ళీ లాస్ట్. ఉదాహరణనైతే ఒక్కరిదే
తెలియజేస్తారు కదా. మీ వంశము తయారవ్వనున్నది. ఎంత బాగా అర్థం చేసుకుంటూ ఉంటారో,
అంతగా మీ వద్దకు ఎందరో వస్తారు. ఇప్పుడు ఇది చాలా చిన్న వృక్షము. తుఫానులు కూడా
ఎన్నో వస్తూ ఉంటాయి. సత్యయుగములో తుఫానుల విషయమే లేదు. పై నుండి కొత్త-కొత్త ఆత్మలు
వస్తూ ఉంటాయి. ఇక్కడ తుఫానులు రావడంతోనే పడిపోతూ ఉంటారు. అక్కడైతే మాయ తుఫానులు
ఉండనే ఉండవు. ఇక్కడైతే కూర్చుని-కూర్చునే చనిపోతారు మరియు మీకు మాయతో యుద్ధము
జరుగుతూ ఉంది కావున అది కూడా హైరానా పరుస్తూ ఉంటుంది. సత్యయుగములో ఇవేవీ ఉండవు. ఇంకే
ధర్మములోనూ ఇటువంటి విషయాలు ఉండవు. రావణ రాజ్యాన్ని మరియు రామ రాజ్యాన్ని గురించి
ఇంకెవరూ అర్థం చేసుకోరు. సత్సంగాలకు వెళ్తారు కానీ అక్కడ మరణించడం, జీవించడం యొక్క
విషయమేదీ ఉండదు. ఇక్కడైతే పిల్లలు దత్తత అవుతారు. మేము శివబాబా పిల్లలము, వారి నుండి
వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. అలా తీసుకుంటూ, తీసుకుంటూ మళ్ళీ పడిపోతే ఇక
వారసత్వం కూడా అంతమైపోతుంది. హంస నుండి మారి కొంగగా అయిపోతారు. అయినా కానీ తండ్రి
దయార్ద్ర హృదయులు కావున అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరు మళ్ళీ పైకి ఎక్కుతారు. ఎవరైతే
స్థిరంగా ఉంటారో, వారిని మహావీర్, హనుమాన్ అని అంటారు. మీరు మహావీరులు మరియు
మహావీరనీలు. నంబరువారుగా అయితే ఉంటారు. అందరికన్నా పహిల్వాన్ ను మహావీర్ అని అంటారు.
ఆదిదేవ్ ను కూడా మహావీర్ అని అంటారు, వారి ద్వారానే విశ్వముపై రాజ్యం చేసే ఈ
మహావీరులు జన్మిస్తారు. నంబరువారు పురుషార్థానుసారముగా రావణునిపై విజయాన్ని
పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. రావణుడు అంటే ఈ పంచ వికారాలు. ఇది అర్థం
చేసుకోవలసిన విషయము. ఇప్పుడు మీ బుద్ధి తాళమును తండ్రి తెరుస్తారు. మళ్ళీ తాళము
పూర్తిగా మూసుకుపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరి తాళమైతే తెరుచుకుంటుందో, వారు వెళ్ళి
సేవ చేస్తారు. తండ్రి అంటారు, మీరు వెళ్ళి సేవ చేయండి, ఎవరైతే బురదలో పడిపోయారో
వారిని బయటకు తీయండి, అంతేకానీ మీరు కూడా బురదలో పడిపోవడం కాదు. మీరు బయటపడి ఇతరులను
కూడా బయటకు తీయండి. విషయ వైతరణి నదిలో అపారమైన దుఃఖము ఉంది. ఇప్పుడు అపారమైన
సుఖాలలోకి వెళ్ళాలి. ఎవరైతే అపారమైన సుఖాన్ని ఇస్తారో వారి మహిమను గానం చేయడం
జరుగుతుంది. దుఃఖాన్ని ఇచ్చే రావణుడికి మహిమ ఎక్కడైనా జరుగుతుందా? రావణుడిని అసురుడు
అని అంటారు. తండ్రి అంటారు, మీరు రావణ రాజ్యములో ఉండేవారు, ఇప్పుడు అపారమైన సుఖాన్ని
పొందేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. మీకు ఎంతటి అపారమైన సుఖాలు లభిస్తాయి. మీకు ఎంత
సంతోషము ఉండాలి, అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలి. పొజిషన్ అయితే నంబరువారుగా ఉంటుంది.
ప్రతి ఒక్క నటుడి పొజిషన్ వేర్వేరు. అందరిలోనైతే ఈశ్వరుడు ఉండరు. తండ్రి కూర్చొని
ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరు తండ్రిని మరియు రచన ఆదిమధ్యాంతాలను
నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసుకుంటారు. నంబరువారు చదువు పైనే మార్కులు
లభిస్తాయి. ఇది అనంతమైన చదువు, ఇందులో పిల్లలు ఎంతో అటెన్షన్ తో ఉండాలి. చదువును
ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. మనం విద్యార్థులము, గాడ్ ఫాదర్ చదివిస్తారు, ఈ నషా
పిల్లలకు ఎక్కి ఉండాలి. భగవానువాచ, కేవలం వారు పేరును మార్చి శ్రీకృష్ణుని పేరును
వేసేశారు. పొరపాటున శ్రీకృష్ణ భగవానువాచ అని భావించారు ఎందుకంటే శ్రీకృష్ణుడు
నెక్స్ట్ టూ గాడ్ (భగవంతుని తర్వాతవాడు). ఏ స్వర్గాన్ని అయితే తండ్రి స్థాపిస్తారో
అందులో నంబర్ వన్ ఇతనే కదా. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభించింది. నంబరువారు
పురుషార్థానుసారముగా తమ కళ్యాణాన్ని కూడా చేసుకుంటారు మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా
చేస్తూ ఉంటారు, వారికి సేవ లేకుండా ఎప్పుడూ సుఖముగా అనిపించదు.
పిల్లలైన మీరు యోగం మరియు జ్ఞానంలో దృఢముగా అయిపోతే ఇక జిన్ను భూతం వలె పని
చేస్తారు. మనుష్యులను దేవతలుగా తయారుచేయడం హాబీగా (అలవాటుగా) అయిపోతుంది. మృత్యువుకు
ముందే పాస్ అవ్వాలి. ఎంతో సేవను చేయాలి. చివరిలో అయితే యుద్ధం మొదలవుతుంది, ప్రకృతి
వైపరీత్యాలు కూడా వస్తాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.