16-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక పండాలు, మీరు అందరికీ శాంతిధామానికి అనగా అమరపురికి మార్గాన్ని తెలియజేయాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీకు ఏ నషా ఉంది, ఆ నషా ఆధారముగా నిశ్చయముతో కూడుకున్న ఏ మాటలు మాట్లాడుతారు?

జవాబు:-
మేము తండ్రిని స్మృతి చేసి జన్మ-జన్మాంతరాల కొరకు పవిత్రముగా అవుతాము అని పిల్లలైన మీకు నషా ఉంది. మీరు నిశ్చయముతో ఇలా చెప్తారు - ఎన్ని విఘ్నాలు వచ్చినా కానీ స్వర్గ స్థాపన అయితే తప్పకుండా జరగాల్సిందే. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము జరగాల్సిందే. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా, ఇందులో సంశయము యొక్క విషయమేమీ లేదు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఒక ఆత్మను అని మీకు తెలుసు. ఈ సమయములో మనము ఆత్మిక పండాలుగా అయ్యాము. మనం పండాలుగా తయారవుతాము కూడా, అలాగే ఇతరులను కూడా తయారుచేస్తాము. ఈ విషయాలను బాగా ధారణ చేయండి. మాయా తుఫానులు మరపింపజేస్తాయి. అమూల్య జీవితము కోసం ఈ అమూల్య రత్నాలు ఆత్మిక తండ్రి నుండి లభిస్తున్నాయి అని ప్రతిరోజూ ఉదయము-సాయంత్రము ఈ ఆలోచన చేయాలి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు ఇప్పుడు ముక్తిధామానికి మార్గాన్ని తెలియజేసేందుకు ఆత్మిక పండాలు లేక గైడ్ లు. ఇది అమరపురిలోకి వెళ్ళేందుకు సత్యాతి-సత్యమైన అమరకథ. అమరపురిలోకి వెళ్ళేందుకు మీరు పవిత్రముగా అవుతున్నారు. అపవిత్ర భ్రష్టాచారీ ఆత్మ అమరపురిలోకి ఎలా వెళ్తుంది? మనుష్యులు అమరనాథ్ యాత్రకు వెళ్తారు, స్వర్గాన్ని కూడా అమరనాథపురి అని అంటారు. అమరపురి అయిన పరంధామములో అమరనాథుడు ఒక్కరే ఉండరు కదా. ఆత్మలైన మీరందరూ ఆ అమరపురికి వెళ్తున్నారు. అది ఆత్మల అమరపురి అయిన పరంధామము, ఆ తర్వాత అమరపురి అయిన స్వర్గములోకి శరీరముతో పాటు వస్తారు. అమరపురి అయిన పరంధామానికి ఎవరు తీసుకువెళ్తారు? పరమపిత పరమాత్మ ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. దానిని అమరపురి అని కూడా అనవచ్చు. కానీ సరియైన పేరు శాంతిధామము. అక్కడికైతే అందరూ వెళ్ళాల్సిందే. డ్రామా వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు. ఇది బుద్ధిలో బాగా ధారణ చేయండి. మొట్టమొదట అయితే స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమపిత పరమాత్మ కూడా ఆత్మనే. అయితే వారిని పరమపిత పరమాత్మ అని అంటారు, వారు మనకు అర్థం చేయిస్తున్నారు. వారే జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు. ఇప్పుడు పిల్లలను పవిత్రముగా తయారుచేసేందుకు వారు ఈ శ్రీమతాన్ని ఇస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు కట్ అయిపోతాయి. స్మృతినే యోగము అని అనడం జరుగుతుంది. మీరు పిల్లలు కదా. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుతుంది. ఈ విషయ నగరము నుండి మీరు శివుని నగరములోకి వెళ్తారు, ఆ తర్వాత విష్ణుపురిలోకి వస్తారు. మనము చదువుతున్నది అక్కడి కోసమే, ఇక్కడి కోసం కాదు. ఇక్కడ ఎవరైతే రాజులుగా అవుతారో, వారు ధనము దానము చేయడం వలన ఆ విధంగా అవుతారు. పేదవారిని చాలా బాగా సంభాళించేవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆసుపత్రులు, ధర్మశాలలు మొదలైనవాటిని నిర్మిస్తారు, కొంతమంది ధనాన్ని దానము చేస్తారు. సింధ్ లో మూల్ చంద్ ఉండేవారు, వారు పేదవారి వద్దకు వెళ్ళి దానము చేసేవారు. వారు పేదవారిని చాలా సంభాళన చేసేవారు. ఇటువంటి దాతలు చాలామంది ఉంటారు. ఉదయాన్నే లేచి పిడికెడు బియ్యము తీసి పేదవారికి దానము చేస్తారు. ఈ రోజుల్లోనైతే చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. పాత్రులకు దానము ఇవ్వాలి. ఆ తెలివి అయితే లేదు. బయట ఎవరైతే భిక్షము అడిగేవారు కూర్చుని ఉంటారో, వారికివ్వడము కూడా దానమేమీ కాదు. అది వారి వ్యాపారము. పేదవారికి దానము చేసేవారు మంచి పదవిని పొందుతారు.

ఇప్పుడు మీరందరూ ఆత్మిక పండాలు. మీరు ప్రదర్శినీ లేక మ్యూజియం తెరిచినప్పుడు ఎటువంటి పేరు వ్రాయండంటే, దాని ద్వారా మీరు గైడ్స్ టూ హెవెన్ (స్వర్గానికి మార్గదర్శకులు) లేక కొత్త విశ్వ రాజధానికి గైడ్స్ అని అర్థమయ్యేలా ఉండాలి. కానీ మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ఈ ప్రపంచము ముళ్ళ అడవి. స్వర్గము పుష్పాల తోట, అక్కడ దేవతలుంటారు. మేము తండ్రిని స్మృతి చేసి జన్మ-జన్మాంతరాల కొరకు పవిత్రముగా అవుతాము అన్న నషా పిల్లలైన మీకు ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా స్వర్గ స్థాపన అయితే తప్పకుండా జరగనున్నది అని మీకు తెలుసు. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము జరగాల్సిందే. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా, ఇందులో సంశయము యొక్క విషయమేమీ లేదు. కొద్దిగా కూడా సంశయము రానివ్వకూడదు. ఇక్కడైతే అందరూ పతిత-పావన అని అంటారు. మీరు వచ్చి దుఃఖము నుండి లిబరేట్ (విముక్తులుగా) చేయండి అని ఇంగ్లీషులో కూడా అంటారు. పంచ వికారాల వలనే దుఃఖము కలుగుతుంది. అది నిర్వికారీ ప్రపంచము, సుఖధామము. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్ళాలి. మనుష్యులు స్వర్గము పైన ఉందని భావిస్తారు, వారికి ముక్తిధామము పైన ఉంది అన్న విషయము తెలియదు. జీవన్ముక్తి కోసమైతే ఇక్కడికే రావాలి. తండ్రి మీకు ఇది అర్థం చేయిస్తున్నారు, దీనిని బాగా ధారణ చేసి జ్ఞానాన్ని మాత్రమే మంథనము చేయాలి. విద్యార్థులు కూడా ఇంట్లో - ఈ పేపరు పూర్తి చేసి ఇవ్వాలి, ఈ రోజు ఇది చేయాలి అని ఇవే ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు మీ కళ్యాణము కోసం ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. పవిత్రముగా అయి ముక్తిధామానికి వెళ్ళాలి మరియు జ్ఞానము ద్వారా మళ్ళీ దేవతలుగా అవుతారు. నేను ఒక సాధారణ మానవుడి నుండి బ్యారిస్టరుగా అవుతాను, ఆత్మనైన నేను సాధారణ మానవుడి నుండి గవర్నరుగా అవుతాను అని ఆత్మ అంటుంది కదా. ఆత్మ శరీరము ద్వారా ఆ విధంగా తయారవుతుంది. శరీరము సమాప్తమైపోతే మళ్ళీ కొత్తగా చదవవలసి ఉంటుంది. విశ్వానికి యజమానిగా అయ్యేందుకు ఆత్మయే పురుషార్థము చేస్తుంది. తండ్రి అంటారు, నేను ఆత్మను అన్నది పక్కాగా గుర్తుంచుకోండి, దేవతలకు ఈ విధంగా చెప్పాల్సిన అవసరముండదు, దేవతలు స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారు పావనముగానే ఉంటారు. వారు ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటారు, తండ్రిని స్మృతి చేయాల్సి వచ్చేందుకు వారు పతితులుగా లేరు కదా. ఆత్మలైన మీరు పతితముగా ఉన్నారు, కావుననే తండ్రిని స్మృతి చేయాలి. దేవతలు స్మృతి చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఇది డ్రామా కదా. ఇందులో ఏ ఒక్క రోజు కూడా ఇంకొక రోజుతో సమానముగా ఉండదు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. మొత్తం రోజంతటి పాత్ర క్షణ-క్షణము మారుతూ ఉంటుంది. షూటింగ్ జరుగుతూ ఉంటుంది. కనుక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఏ విషయములోనూ హార్ట్ ఫెయిల్ అవ్వకండి. ఇవి జ్ఞానము యొక్క విషయాలు. మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోండి, కానీ భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందేందుకు పూర్తి పురుషార్థము చేయండి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. కుమారీలైతే గృహస్థములోకి వెళ్ళనే లేదు. ఎవరికైతే పిల్లా పాపలుంటారో వారిని గృహస్థులు అని అంటారు. తండ్రి అయితే అధర్ కుమారీలను మరియు కుమారీలను, అందరినీ చదివిస్తున్నారు. అధర్ కుమారీ యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వారికి అర్ధ శరీరమేమైనా ఉంటుందా? ఇప్పుడు మీకు తెలుసు, కన్య అంటే పవిత్రమైనవారు మరియు అధర్ కన్య అంటే అపవిత్రముగా అయిన తర్వాత మళ్ళీ పవిత్రముగా అవుతారు. మీ స్మృతిచిహ్నాలే నిలబడి ఉన్నాయి. తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలైన మనకు మూలవతనము గురించి కూడా తెలుసు, అలాగే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎలా రాజ్యము చేస్తారు, క్షత్రియులకు గుర్తుగా బాణము ఎందుకు చూపించారు అనేది కూడా మీకు తెలుసు. ఆ ప్రపంచములో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. అక్కడ అసురులు అనే విషయము లేదు, అలాగే అపహరించడము అనే మాట ఉండదు. సీతను అపహరించి తీసుకువెళ్ళే రావణుడెవరూ ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మేము స్వర్గానికి, ముక్తి-జీవన్ముక్తికి పండాలము అని మీరు భావిస్తారు. వారు దైహిక పండాలు. మనము ఆత్మిక పండాలము. వారు కలియుగీ బ్రాహ్మణులు. సంగమయుగీ బ్రాహ్మణులైన మీరు ఇప్పడు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నారు. బాబా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కానీ దేహాభిమానములోకి రావడముతో మర్చిపోతారు. నేను ఆత్మను, ఆ తండ్రికి బిడ్డను అన్న నషా ఉండదు. ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా దేహాభిమానము తెగిపోతూ ఉంటుంది. స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండండి. నా దేహాభిమానము తెగిపోయిందా అన్నది చూసుకోండి. మనము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, తిరిగి మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. మన పాత్రే హీరో-హీరోయిన్ పాత్ర. ఎవరైనా విజయము పొందినప్పుడు హీరో-హీరోయిన్ అన్న పేరు వస్తుంది. మీరు ఈ సమయములో విజయము పొందుతారు, అందుకని మీకు హీరో-హీరోయిన్ అన్న పేరు వస్తుంది, ఇంతకుముందు ఆ పేరు లేదు. ఓడిపోయేవారిని హీరో-హీరోయిన్ అని అనరు. మనం ఇప్పుడు వెళ్ళి హీరో-హీరోయిన్లుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మీ పాత్ర ఉన్నతోన్నతమైనది. గవ్వకు మరియు వజ్రానికి చాలా తేడా ఉంటుంది. ఎవరు ఎంత లక్షాధికారులైనా లేక కోటీశ్వరులైనా కానీ ఇదంతా వినాశనమైపోతుందని మీకు తెలుసు.

ఆత్మలైన మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. మిగిలినవారంతా దివాలా తీస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ ధారణ చేయాలి. నిశ్చయముతో ఉండాలి. ఇక్కడ నషా ఎక్కుతుంది, బయటకు వెళ్ళగానే నషా దిగిపోతుంది. ఇక ఇక్కడి విషయాలు ఇక్కడే ఉండిపోతాయి. తండ్రి చెప్తున్నారు - తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని బుద్ధిలో ఉండాలి. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. వ్యాపారాలు మొదలైనవాటి నుండి కూడా కొంత సమయాన్ని తీసి స్మృతి చేయవచ్చు. ఇది కూడా మీ కొరకు ఒక వ్యాపారమే కదా. సెలవు తీసుకుని బాబాను స్మృతి చేయండి. ఇది అసత్యము చెప్పడమేమీ కాదు. మొత్తం రోజంతటినీ ఊరికే అలా పోగొట్టుకోకూడదు. మనము భవిష్యత్తు గురించి ఎంతోకొంత ఆలోచించాలి. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి, ఎంత వీలైతే అంత సమయము తీసి తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కోసం వ్యాపారము మొదలైనవి కూడా చేయండి. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు నేను మీకు చాలా మంచి సలహాను ఇస్తాను. పిల్లలైన మీరు కూడా అందరికీ సలహాలిస్తారు. మంత్రులు సలహాలిచ్చేందుకని ఉంటారు కదా. మీరు అడ్వైజర్లు (సలహాలిచ్చేవారు). ఈ జన్మలో అందరికీ ముక్తి-జీవన్ముక్తి ఎలా లభిస్తుంది అన్న మార్గాన్ని మీరు తెలియజేస్తారు. మనుష్యులు స్లోగన్లు మొదలైనవి తయారుచేసి గోడలపైన తగిలిస్తారు. ఉదాహరణకు మీరు ‘‘బీ హోలీ అండ్ రాజయోగీ’’ (పవిత్రముగా అవ్వండి మరియు రాజయోగిగా అవ్వండి) అని వ్రాస్తారు. కానీ వీటి ద్వారా అర్థం చేసుకోరు. మనకు తండ్రి నుండి ఈ వారసత్వము లభిస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ముక్తిధామము యొక్క వారసత్వము కూడా లభిస్తుంది. నన్ను మీరు పతిత-పావనుడు అని అంటారు, కావున నేను వచ్చి పావనముగా అయ్యేందుకు సలహానిస్తాను. మీరు కూడా అడ్వైజర్లే. తండ్రి సలహా ఇవ్వనంత వరకు, శ్రీమతాన్ని ఇవ్వనంత వరకు ఎవ్వరూ ముక్తిధామానికి వెళ్ళలేరు. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము శివబాబాదే. ఆత్మలకు శివబాబా యొక్క శ్రీమతము లభిస్తుంది. పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. పాప శరీరము అని అనరు. ఆత్మ శరీరముతో పాపము చేస్తుంది, అందుకే పాపాత్మ అని అంటారు. శరీరము లేకుండా ఆత్మ పాపమూ చేయలేదు, పుణ్యమూ చేయలేదు. ఎంత వీలైతే అంత విచార సాగర మంథనము చేయండి. సమయమైతే చాలా ఉంటుంది. టీచర్ లేక ప్రొఫెసర్ కు కూడా యుక్తిగా, వారి కళ్యాణం జరిగే విధముగా ఈ ఆత్మిక చదువును చదివించాలి. ఇకపోతే ఈ దైహిక చదువు ద్వారా ఏమి లభిస్తుంది. మనము ఈ చదువును చదివిస్తాము. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులకు ఏ విధముగా మార్గాన్ని తెలియజేయాలి అని లోలోపల ఉత్సాహము కలుగుతూ ఉంటుంది.

ఒక కుమారీ పరీక్ష వ్రాసినప్పుడు - అందులో గీతా భగవానుడి గురించి అడగడం జరిగింది. ఆమె గీతా భగవానుడు శివుడు అని వ్రాసేసరికి ఆమెను ఫెయిల్ చేశారు. ఆమె నేను తండ్రి మహిమను వ్రాస్తున్నాను అని భావించి ఇలా వ్రాసారు - గీతా భగవానుడు శివుడు, వారు జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు, కృష్ణుడి ఆత్మ కూడా ఈ సమయములో జ్ఞానాన్ని పొందుతూ ఉంది అని. ఇలా వ్రాసేసరికి ఫెయిల్ చేసారు. అప్పుడు ఆమె తల్లిదండ్రులకు చెప్పారు - ఇక నేను ఈ చదువు చదవను, ఇప్పుడిక ఈ ఆత్మిక చదువులో నిమగ్నమవుతాను అని. ఆ కుమారీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవారు. నేను ఇలా వ్రాస్తే ఫెయిల్ అవుతాను కానీ సత్యమైతే వ్రాయాలి కదా అని ఆమె ముందే చెప్పారు. ఈ కుమారీ ఏదైతే వ్రాసిందో అది సత్యమేనని మున్ముందు వారు అర్థం చేసుకుంటారు. ప్రభావము వెలువడినప్పుడు లేక ప్రదర్శనీ లేక మ్యూజియంలో వారిని పిలిచినప్పుడు వారికి తెలుస్తుంది మరియు ఆమె రైట్ అని బుద్ధిలోకి వస్తుంది. అనేకానేకమంది మనుష్యులు వస్తారు, కావున - ఇదేదో కొత్త విషయమని మనుష్యులు వెంటనే అర్థం చేసుకునే విధంగా ఏదైనా చేయాలి అని ఆలోచించాలి. ఇక్కడకు సంబంధించిన ఎవరో కొంతమంది తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీరు అందరికీ ఆత్మిక మార్గాన్ని తెలియజేస్తారు. పాపం వారు ఎంత దుఃఖములో ఉన్నారు, వారందరి దుఃఖాన్ని ఎలా దూరము చేయాలి. చాలా గొడవలు ఉన్నాయి కదా. ఒకరికొకరు శత్రువులుగా అయిపోతే ఎలా ఒకరినొకరు అంతము చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. పాపం మాతలకైతే ఏమీ తెలియదు. మేము చదువుకోలేదని అంటారు. తండ్రి అంటారు, చదువుకోలేదంటే మంచిదే. చదివిన వేద-శాస్త్రాలన్నింటినీ ఇక్కడ మర్చిపోవాలి. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తానో, అది వినండి. నిరాకార పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరని అర్థం చేయించాలి. మనుష్యులలో జ్ఞానమే లేనప్పుడు ఇక వారు సద్గతిని ఎలా ఇవ్వగలరు. సద్గతిదాత జ్ఞానసాగరుడు ఒక్కరే. మనుష్యులు ఈ మాట అనలేరు. ఎవరైతే ఇక్కడికి చెందినవారు ఉంటారో, వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ఒక్క పెద్ద మనిషి వెలువడినా శబ్దము వ్యాపిస్తుంది. పేదవాడైన తులసీదాసు మాట ఎవరూ వినలేదు అని గాయనముంది. సేవ కోసం యుక్తులైతే బాబా ఎన్నో తెలియజేస్తూ ఉంటారు, పిల్లలు వాటిని అమలులోకి తీసుకురావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ భవిష్య ఉన్నత పదవిని పొందేందుకు స్మృతిలో ఉండే పురుషార్థమును పూర్తిగా చేయాలి. ఈ డ్రామా క్షణ-క్షణమూ మారుతూ ఉంటుంది, అందుకే ఎప్పుడూ ఏ దృశ్యాన్ని చూసి హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు.

2. ఈ ఆత్మిక చదువును చదువుకుని ఇతరులను చదివించాలి, అందరి కళ్యాణము చేయాలి. మేము పావనముగా అయ్యే సలహాను అందరికీ ఎలా ఇవ్వాలి, ఇంటి మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని లోలోపల ఇదే ఉత్సాహము కలుగుతూ ఉండాలి.

వరదానము:-
సర్వ సంబంధాల సహయోగపు అనుభూతి ద్వారా నిరంతర యోగీ, సహజయోగీ భవ

అన్నివేళలా తండ్రి యొక్క భిన్న-భిన్న సంబంధాల సహయోగాన్ని తీసుకోవడము అనగా అనుభవము చేయడమే సహజయోగము. తండ్రి ఏ సమయములోనైనా సంబంధాన్ని నిర్వర్తించేందుకు బంధింపబడి ఉన్నారు. మొత్తం కల్పమంతటిలోకి ఇప్పుడే సర్వ అనుభవాల గని ప్రాప్తిస్తుంది, అందుకే సదా సర్వ సంబంధాల సహయోగాన్ని తీసుకోండి మరియు నిరంతర యోగులుగా, సహజయోగులుగా అవ్వండి ఎందుకంటే ఎవరైతే సర్వ సంబంధాల అనుభూతిలో లేక ప్రాప్తిలో నిమగ్నమై ఉంటారో వారు పాత ప్రపంచ వాతావరణము నుండి సహజముగానే ఉపరామముగా అయిపోతారు.

స్లోగన్:-
సర్వశక్తులతో సంపన్నముగా ఉండడము, ఇదే బ్రాహ్మణ స్వరూపము యొక్క విశేషత.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

తపస్వీమూర్తి అంటే అర్థము - తపస్య ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లుగా అనుభవమవ్వాలి. ఈ తపస్వీ స్వరూపము - ఇచ్చే స్వరూపము. ఏ విధముగా సూర్యుడు విశ్వానికి ప్రకాశము మరియు అనేక వినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతిని కలిగిస్తాడో, అలా మహా తపస్వీ ఆత్మలు జ్వాలా రూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయిస్తారు.