16-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏకాంతములో కూర్చొని ఇప్పుడు ఎలా అభ్యాసము చేయండి అంటే - నేను శరీరము నుండి అతీతముగా ఉండే ఆత్మను అన్నది అనుభవమవ్వాలి, దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు’’

ప్రశ్న:-
ఏకాంతము అంటే అర్థమేమిటి? ఏకాంతములో కూర్చొని మీరు ఏ అనుభవము చేయాలి?

జవాబు:-
ఏకాంతము అంటే అర్థము - ఒక్కరి స్మృతిలోనే ఈ శరీరము అంతమవ్వాలి అనగా ఏకాంతములో కూర్చొని ఎలా అనుభవము చేయండి అంటే - ఆత్మనైన నేను ఈ శరీరాన్ని (చర్మాన్ని) వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. కూర్చుని-కూర్చునే అశరీరిగా అయిపోండి. నేను ఈ శరీరము నుండి మరణించాను అన్నట్లుగా అనిపించాలి. నేను ఒక ఆత్మను, శివబాబా సంతానాన్ని, ఈ అభ్యాసము ద్వారా దేహ భానము తెగిపోతూ ఉంటుంది.

ఓంశాంతి
మధురాతి-మధురమైన పిల్లలూ, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, ఇంకెటువైపుకు బుద్ధి వెళ్ళకూడదు, ఇలా పిల్లలకు తండ్రి మొట్టమొదట అర్థం చేయిస్తున్నారు. ‘నేను ఆత్మను’ అని పిల్లలైన మీకు తెలుసు. పాత్రను ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా అభినయిస్తాను. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అయి తండ్రి స్మృతిలో ఉండాలి. నేను ఆత్మను, నేను ఈ ఇంద్రియాలను ఉపయోగించాలంటే ఉపయోగించవచ్చు లేదంటే లేదు. స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ఆత్మలమైన మనము స్వతంత్రులము. మనము ఒక్క తండ్రిని తప్ప వేరెవ్వరినీ స్మృతి చేయకూడదు. జీవిస్తూనే మరణ అవస్థలో ఉండాలి. ఆత్మ అయిన మన యోగము ఇప్పుడు తండ్రితో ఉండాలి, ఇకపోతే ఈ ప్రపంచము నుండి, ఇంటి నుండి మరణించి ఉన్నాము. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు జీవిస్తూ మీరు మరణించాలి. ఆత్మలమైన మనము శివబాబాకు పిల్లలము. శరీర భానాన్ని తొలగిస్తూ ఉండాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చేయండి. శరీర భానాన్ని వదిలేయండి. ఇది పాత శరీరము కదా. పాత వస్తువును వదిలేయడం జరుగుతుంది కదా. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇలా చేస్తూ-చేస్తూ మీకు ఇక అలవాటైపోతుంది. ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళాలి, అటువంటప్పుడు ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి. ఏకాంతములో కూర్చొని ఈ విధంగా మీ విషయములో మీరు కృషి చేయాలి. భక్తి మార్గములో కూడా గదిలో కూర్చొని మాలను తిప్పుతారు, పూజలు చేస్తారు. మీరు కూడా ఏకాంతములో కూర్చొని ఈ ప్రయత్నము చేసినట్లయితే అలవాటైపోతుంది. మీరు నోటి ద్వారానైతే ఏమీ మాట్లాడవలసిన అవసరము లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. శివబాబా అయితే నేర్పించేవారు. వారు పురుషార్థము చేయవలసిన అవసరము లేదు. ఈ బాబా పురుషార్థము చేస్తారు, వీరు తిరిగి పిల్లలైన మీకు కూడా అర్థము చేయిస్తారు. ఎంత వీలైతే అంత ఈ విధంగా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆయుష్షు కూడా పెరుగుతుంది. లోలోపల ఈ చింతన నడవాలి. బయటకు ఏమీ మాట్లాడకూడదు. భక్తి మార్గములో కూడా బ్రహ్మ తత్వాన్ని లేదా కొందరు శివుడిని కూడా స్మృతి చేస్తారు. కానీ ఆ స్మృతి ఏమీ యథార్థమైనది కాదు. తండ్రి పరిచయమే లేనప్పుడు ఇక స్మృతి ఎలా చేస్తారు. మీకు ఇప్పుడు తండ్రి పరిచయము లభించింది. ఉదయముదయమే లేచి ఏకాంతములో ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మంథనము చేయండి, తండ్రిని స్మృతి చేయండి. బాబా, ఇప్పుడు ఇక మేము మీ సత్యమైన ఒడిలోకి వచ్చేసినట్లే. వారిది ఆత్మిక ఒడి. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవాలి. బాబా వచ్చి ఉన్నారు. బాబా కల్ప-కల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. తండ్రిలోనే మొత్తం చక్రము యొక్క జ్ఞానము ఉంది కదా. వారు అది మీకు ఇస్తారు. మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తున్నారు. మూడు కాలాల గురించి అనగా ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు. తండ్రి కూడా పరమ ఆత్మ. వారికి శరీరమైతే లేదు. ఇప్పుడు ఈ శరీరములో కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయము. వారు భగీరథుడిపై విరాజమానమైనప్పుడు తప్పకుండా ఆ దేహములో మరొక ఆత్మ ఉంది. వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నంబరు వన్ పావనమైనవారే మళ్ళీ నంబరు వన్ పతితముగా అవుతారు. వీరు స్వయాన్ని భగవంతుడు, విష్ణువు మొదలైనవారిగా చెప్పుకోరు. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనముగా లేరు, అందరూ పతితముగానే ఉన్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఈ విధంగా విచార సాగర మంథనము చేసినట్లయితే, దీని ద్వారా మీకు సంతోషము కూడా కలుగుతుంది, ఇందులో ఏకాంతము కూడా తప్పకుండా కావాలి. ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతమవ్వడాన్ని ఏకాంతమని అంటారు. అప్పుడు ఈ చర్మము త్యజించబడుతుంది. సన్యాసులు కూడా బ్రహ్మము యొక్క స్మృతిలో లేక తత్వము యొక్క స్మృతిలో ఉంటారు, ఆ స్మృతిలో ఉంటూ-ఉంటూ శరీర భానము తొలగిపోతుంది. ఇక మేము బ్రహ్మములో లీనమవ్వాలి, అంతే, అలా కూర్చుండిపోతారు. తపస్యలో కూర్చుని-కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. భక్తిలోనైతే మనుష్యులు చాలా ఎదురుదెబ్బలు తింటారు, ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయమేమీ లేదు. స్మృతిలోనే ఉండాలి. అంతిమములో ఎవ్వరూ గుర్తు ఉండకూడదు. గృహస్థ వ్యవహారములోనైతే ఉండవలసిందే. కాకపోతే సమయము తీయాలి. విద్యార్థికి చదువు పట్ల అభిరుచి ఉంటుంది కదా. ఇది చదువు, స్వయాన్ని ఆత్మగా భావించకపోతే తండ్రి-టీచరు-గురువు, అందరినీ మర్చిపోతారు. ఏకాంతములో కూర్చొని ఈ విధంగా ఆలోచించండి. గృహస్థుల ఇళ్ళలోనైతే వైబ్రేషన్లు బాగుండవు. ఒకవేళ వేరే ఏర్పాటు ఉన్నట్లయితే ఒక గదిలో ఏకాంతములో కూర్చోండి. మాతలకైతే పగలు కూడా సమయము లభిస్తుంది. పిల్లలు మొదలైనవారు స్కూలుకు వెళ్ళిపోతారు. ఎంత సమయము లభిస్తే అంత ఇదే ప్రయత్నము చేస్తూ ఉండండి. మీకైతే ఒక ఇల్లు ఉంది, తండ్రికైతే ఎన్ని దుకాణాలు ఉన్నాయి, అవి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. మనుష్యులకైతే వ్యాపారము మొదలైనవాటి చింత ఉన్నప్పుడు నిద్ర కూడా దూరమైపోతుంది. ఇది వ్యాపారము కూడా కదా. వీరు ఎంత గొప్ప వ్యాపారస్తుడు. ఎంత పెద్ద ఎక్స్ చేంజ్ వ్యాపారము చేస్తున్నారు. పాత శరీరము మొదలైనవి తీసుకొని కొత్తవి ఇస్తారు, అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. ఈ వ్యాపారము కూడా వారే చేయాలి. ఈ వ్యాపారము అయితే చాలా పెద్దది. వ్యాపారస్థులకు వ్యాపారము గురించే ఆలోచన ఉంటుంది. బాబా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారు, ఆ తర్వాత ఇలా, ఇలా చేయండి అని చెప్తారు. ఎంతగా మీరు తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా స్వతహాగానే నిద్ర తొలగిపోతుంది. సంపాదనలో ఆత్మకు చాలా ఆనందము కలుగుతుంది. సంపాదన కోసం మనుష్యులు రాత్రివేళలో కూడా మేల్కొని ఉంటారు. సీజన్ లో మొత్తం రాత్రి అంతా కూడా దుకాణము తెరిచి ఉంటుంది. మీ సంపాదన రాత్రివేళ మరియు ఉదయమువేళ చాలా బాగుంటుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు, త్రికాలదర్శులుగా అవుతారు. 21 జన్మల కొరకు ధనాన్ని జమ చేసుకుంటారు. మనుష్యులు షావుకారులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, బలము లభిస్తుంది. స్మృతియాత్రలో ఉండకపోతే చాలా నష్టము కలుగుతుంది ఎందుకంటే తలపై పాపాల భారము చాలా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి, ఒక్కరినే స్మృతి చేయాలి మరియు త్రికాలదర్శులుగా అవ్వాలి. ఈ అవినాశీ ధనాన్ని అర్ధకల్పము కోసం జమ చేసుకోవాలి. ఇది చాలా విలువైనది. విచార సాగర మంథనము చేసి రత్నాలను వెలికి తీయాలి. బాబా స్వయం ఏ విధముగా చేస్తారో, పిల్లలకు కూడా ఆ యుక్తులను తెలియజేస్తారు. బాబా, మాయా తుఫానులు చాలా వస్తున్నాయని అంటారు.

బాబా చెప్తున్నారు, ఎంత వీలైతే అంత మీ సంపాదన చేసుకోండి, ఇదే మీకు పనికొస్తుంది. ఏకాంతములో కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. తీరిక లభిస్తే మందిరాలు మొదలైనవాటిలో కూడా చాలా సేవ చేయవచ్చు. బ్యాడ్జీ తప్పకుండా ధరించి ఉండాలి. అప్పుడు, వీరు ఆత్మిక మిలటరీ అని అందరూ అర్థము చేసుకుంటారు. మేము స్వర్గ స్థాపన చేస్తున్నాము, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు లేదు, దానిని తిరిగి స్థాపన చేస్తున్నాము అని మీరు వ్రాస్తారు కూడా. ఈ లక్ష్మీ-నారాయణులు మీ లక్ష్యము-ఉద్దేశ్యము కదా. రాబోయే సమయములో ఈ ట్రాన్స్ లైట్ చిత్రాన్ని బ్యాటరీ సహితముగా తీసుకొని ఊరేగింపు చేస్తూ, ఈ రాజ్యాన్ని మేము స్థాపన చేస్తున్నామని మీరు అందరికీ చెప్తారు. ఈ చిత్రము అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయినది. ఈ చిత్రము చాలా ప్రసిద్ధమైపోతుంది. కేవలం లక్ష్మీ-నారాయణులు మాత్రమే కాదు, వారి రాజధాని ఉండేది కదా. ఆ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి - మన్మనాభవ అని చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము గీతా వారోత్సవాలు జరుపుకుంటాము అని అంటారు. ఈ ప్లాన్లు అన్నీ కల్పక్రితము వలె తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దీనిని చూసి అందరూ సంతోషిస్తారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, మన్మనాభవ అని మీరు చెప్తారు. ఇవి గీతలోని పదాలు కదా. భగవంతుడు శివబాబా, వారు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే ఈ విధంగా అవుతారు. లిటరేచర్ ను కూడా మీరు కానుకగా ఇస్తూ ఉండండి. శివబాబా భాండాగారము అయితే సదా నిండుగా ఉంటుంది. మున్ముందు చాలా సేవ జరుగుతుంది. లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత స్పష్టముగా ఉంది. ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది, చాలా షావుకారులుగా ఉండేవారు. ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండాలని మనుష్యులు కోరుకుంటారు. మనుష్యులు ఏదైతే కోరుకుంటున్నారో, ఇప్పుడు ఆ గుర్తులు కనిపిస్తాయి, అప్పుడు వీరు సరైనదే చెప్తున్నారని భావిస్తారు. 100 శాతము పవిత్రత, సుఖ-శాంతుల రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నారు, అప్పుడు మీకు సంతోషము కూడా కలుగుతుంది. స్మృతిలో ఉన్నట్లయితేనే బాణము తగులుతుంది. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దములోకి రాకూడదు. పాటలు, కవితలు మొదలైనవేవీ బాబా ఇష్టపడరు. బయట మనుష్యులతో పోటీ పడకూడదు. మీ విషయమే వేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, అంతే. స్లోగన్లు కూడా మనుష్యులు చదివి మేల్కొనే విధముగా మంచిగా ఉండాలి. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఖజానా అయితే నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చింది మళ్ళీ పిల్లలకే ఉపయోగపడుతుంది. తండ్రి అయితే ధనాన్ని తీసుకునిరారు. మీ వస్తువులు మీకే ఉపయోగపడతాయి. మేము చాలా పరివర్తన తీసుకువస్తున్నామని భారతవాసులు భావిస్తారు, 5 సంవత్సరాలలోపు ఎంత ధాన్యము పండుతుందంటే, ఇక ధాన్యానికి ఎప్పుడూ లోటుండదని వారు భావిస్తారు. కానీ తినడానికి భోజనము కూడా లభించని పరిస్థితి ఉంటుందని మీకు తెలుసు. అలాగని, ధాన్యము ఏమీ చౌకగా లభిస్తుందని కాదు.

మనము 21 జన్మల కొరకు మన రాజ్య-భాగ్యాన్ని పొందుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. కొద్దో-గొప్పో కష్టాన్ని అయితే సహనము చేయవలసిందే. సంతోషము వంటి ఔషధము లేదని అంటూ ఉంటారు. గోప-గోపికలకు అతీంద్రియ సుఖము ఉంటుందని అంటూ ఉంటారు. ఎంతోమంది పిల్లలుగా అవుతారు. ఈ శ్యాప్లింగ్ (అంటు) కు సంబంధించినవారు వస్తూ ఉంటారు. వృక్షము ఇక్కడే వృద్ధి చెందాలి కదా. స్థాపన జరుగుతూ ఉంది. ఇతర ధర్మాలలో ఇలా ఉండదు. వారు పై నుండి వస్తారు. వృక్షము స్థాపన అయ్యే ఉంది అన్నట్లు ఉంది, ఇందులో మళ్ళీ నంబరువారుగా వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. కష్టమేమీ ఉండదు. ఇతర ధర్మాలవారు పై నుండి వచ్చి పాత్రను అభినయించవలసిందే, ఇందులో మహిమ చేసేందుకు ఏముంది. ధర్మ స్థాపకుల వెనుక మిగలినవారు వస్తూ ఉంటారు. వారు సద్గతి కోసం ఏం శిక్షణ ఇస్తారు? ఏమీ ఇవ్వరు. ఇక్కడ తండ్రి భవిష్య దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సంగమయుగములో కొత్త అంటును కడతారు కదా. మొదట మొక్కలను పూలకుండీలో నాటి ఆ తర్వాత కింద నాటుతారు. అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు మొక్క నాటుతున్నారు, ఆ తర్వాత సత్యయుగములో అది వృద్ధి చెంది రాజ్య-భాగ్యాన్ని పొందుతారు. మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగానికి ఇప్పుడింకా చాలా సంవత్సరాలున్నాయని మనుష్యులు భావిస్తారు ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కలియుగానికి ఇప్పుడింకా 40 వేల సంవత్సరాలుందని, ఆ తర్వాత తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారని వారు భావిస్తారు. ఇది అదే మహాభారత యుద్ధమని, గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటారని కొందరు భావిస్తారు. కానీ అది శ్రీకృష్ణుడు కాదని మీరు చెప్తారు. శ్రీకృష్ణుడు అయితే 84 జన్మలు తీసుకుంటారని తండ్రి అర్థం చేయించారు. ఒక జన్మలోని ముఖకవళికలు మరొక జన్మలోనివాటితో కలవవు. మరి అటువంటప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడకు ఎలా వస్తారు. ఎవ్వరూ ఈ విషయాల గురించి ఆలోచించరు. శ్రీకృష్ణుడు స్వర్గ రాకుమారుడు, అటువంటప్పుడు వారు ద్వాపరములోకి ఎలా వస్తారు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. శివబాబా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారని ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని చూడటముతోనే మీకు అర్థమవుతుంది. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు తండ్రి మాత్రమే. ఈ సృష్టి చక్రము, కల్పవృక్షము మొదలైన చిత్రాలు తక్కువైనవేమీ కావు. ఒకానొక రోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్ లైట్ తో తయారుచేయబడతాయి. అప్పుడు అందరూ, మాకు ఇటువంటి చిత్రాలే కావాలని అంటారు. ఈ చిత్రాల ద్వారా అప్పుడు విహంగ మార్గపు సేవ జరుగుతుంది. మీ వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారంటే, ఇక మీకు తీరికే ఉండదు. చాలామంది వస్తారు. చాలా సంతోషము కలుగుతుంది. రోజురోజుకూ మీ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. డ్రామానుసారముగా ఎవరైతే పుష్పాలుగా తయారయ్యేది ఉంటుందో, వారికి టచ్ అవుతుంది. బాబా, వీరి బుద్ధిని టచ్ చేయండి అని పిల్లలైన మీరు ఈ విధంగా చెప్పే అవసరముండదు. బాబా ఏమీ టచ్ చేయరు. సమయము వచ్చినప్పుడు దానంతట అదే టచ్ అవుతుంది. తండ్రి అయితే మార్గాన్ని తెలియజేస్తారు కదా. మా పతి బుద్ధిని టచ్ చేయండి అని చాలామంది కుమార్తెలు వ్రాస్తారు. ఇలా అందరి బుద్ధిని టచ్ చేసినట్లయితే అందరూ స్వర్గములోకి వచ్చేస్తారు. చదువులోనే శ్రమ ఉంది. మీరు ఈశ్వరీయ సేవాధారులు కదా. ఏమేమి చేయాలి అన్న సత్యాతి-సత్యమైన విషయాన్ని బాబా ముందు నుండే తెలియజేస్తారు. ఇటువంటి చిత్రాలను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మెట్ల చిత్రాన్ని కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. డ్రామానుసారముగా స్థాపన అయితే జరగవలసిందే. బాబా సేవ కోసం ఏవైతే డైరెక్షన్లు ఇస్తారో, వాటిపై ధ్యానముంచాలి. బాబా చెప్తున్నారు, రకరకాల బ్యాడ్జీలు లక్షల కొలది తయారుచేయండి. ట్రైన్ టికెట్ తీసుకొని 100 మైళ్ళ వరకు సేవ చేసి రండి. ఒక రైలు పెట్టె నుండి మరొకదానిలోకి, ఆ తర్వాత మరొకదానిలోకి వెళ్ళండి, ఇది చాలా సహజము. పిల్లలకు సేవ పట్ల అభిరుచి ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. విచార సాగర మంథనము చేసి మంచి-మంచి రత్నాలను వెలికి తీయాలి, సంపాదనను జమ చేసుకోవాలి. సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అయి సేవ చేయాలి.

2. చదువు పట్ల చాలా అభిరుచిని ఉంచాలి. ఎప్పుడు సమయము లభించినా ఏకాంతములోకి వెళ్ళిపోవాలి. జీవిస్తూనే ఈ శరీరము నుండి మరణించినట్లుగా అభ్యాసము చేయాలి, ఈ స్థితి అనుభవమవుతూ ఉండాలి. దేహ భానాన్ని కూడా మర్చిపోవాలి.

వరదానము:-
తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూప భవ

ప్రతి ఒక్కరిలోనూ తమ మూల సంస్కారము ఏదైతే ఉందో, దేనినైతే నేచర్ అని అంటారో, ఏదైతే ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళడములో ఆటంకాన్ని కలిగిస్తుందో, ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకునే ఉదాహరణ స్వరూపులుగా అవ్వండి, అప్పుడు సంపూర్ణ విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి పరివర్తన చేయండి అంటే - వీరి ఈ సంస్కారము ముందు నుండే ఉంది అని ఎవ్వరూ వర్ణన చేయకూడదు. ఎప్పుడైతే పర్సెంటేజ్ లో, అంశమాత్రము కూడా పాత సంస్కారాలేవీ కనిపించవో, వర్ణన జరగవో, అప్పుడు - వీరు సంపూర్ణ పరివర్తనకు ఉదాహరణ స్వరూపులు అని అంటారు.

స్లోగన్:-
ఇప్పుడు ప్రయత్నము చేసే సమయము గడిచిపోయింది, అందుకే ఇక హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని పరివర్తన చేసుకోండి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఏ విధముగా సైన్స్ప్రయోగములోకి వచ్చినప్పుడు సైన్స్ మంచి పని చేస్తుంది అని అనుకుంటారో, అదే విధముగా సైలెన్స్శక్తిని ప్రయోగించండి, దీని కొరకు ఏకాగ్రతా అభ్యాసాన్ని పెంచండి. ఏకాగ్రతకు మూల ఆధారము - మనసు యొక్క కంట్రోలింగ్పవర్, దీని ద్వారా మనోబలము పెరుగుతుంది, దీని కొరకు ఏకాంతవాసులుగా అవ్వండి.