16-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అవ్వండి ఎందుకంటే తండ్రి మీ కోసం స్వర్గము రూపీ కొత్త ఇంటిని తయారుచేస్తున్నారు’’

ప్రశ్న:-
ఈ అవినాశీ రుద్ర యజ్ఞములో ఏయే విషయాల కారణముగానే విఘ్నాలు కలుగుతాయి?

జవాబు:-
ఇది శివబాబా ద్వారా రచించబడిన అవినాశీ రుద్ర యజ్ఞము, ఇందులో మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పవిత్రముగా అవుతారు, భక్తి మొదలైనవి వదిలేస్తారు, ఈ కారణముగానే విఘ్నాలు కలుగుతాయి. మనుష్యులు శాంతి ఏర్పడాలని, వినాశనము జరగకూడదని అంటారు కానీ తండ్రి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించింది పాత ప్రపంచ వినాశనము కోసమే. దీని తర్వాతనే శాంతి ప్రపంచము వస్తుంది.

ఓంశాంతి
ఓంశాంతి అర్థాన్ని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు పురుషార్థమేమీ చేయాల్సిన అవసరము లేదు. ఆత్మ స్వయమే శాంతి స్వరూపము, శాంతిధామ నివాసి. ఇక్కడైతే కొద్ది సమయము కోసం శాంతిగా ఉండగలరు. ఆత్మ అంటుంది - నా కర్మేంద్రియాల వాయిద్యము అలసిపోయింది, నేను నా స్వధర్మములో స్థితి అయిపోతాను, శరీరము నుండి వేరవుతాను. కానీ కర్మలైతే చేయాల్సిందే. ఎంతవరకని శాంతిలో కూర్చుని ఉంటారు. ఆత్మ అంటుంది - నేను శాంతిదేశ నివాసిని. కేవలం ఇక్కడ శరీరములోకి రావడముతో నేను టాకీగా అయ్యాను. నేను ఆత్మను, ఇది నా శరీరము. ఆత్మయే పతితముగా మరియు పావనముగా అవుతుంది. ఆత్మ పతితముగా అయితే శరీరము కూడా పతితముగా అవుతుంది ఎందుకంటే సత్యయుగములో 5 తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి మరియు ఇక్కడ 5 తత్వాలు తమోప్రధానముగా ఉన్నాయి. బంగారములో మాలిన్యము చేరడముతో బంగారము పతితముగా అవుతుంది. తర్వాత దానిని స్వచ్ఛముగా చేయడానికి అగ్నిలో వేయడము జరుగుతుంది. దానిని యోగాగ్ని అని అనరు. యోగము అగ్ని వంటిది కూడా, దాని ద్వారా పాపాలు భస్మమైపోతాయి. ఆత్మను పతితము నుండి పావనముగా తయారుచేసేవారు పరమాత్మ. కేవలం వారొక్కరి పేరు మాత్రమే తీసుకుంటారు. వారిని, ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ పతితముగా, తమోప్రధానముగా అవ్వాల్సిందే. ఇది వృక్షము కదా. ఆ స్థూలమైన వృక్షానికి బీజము కింద ఉంటుంది, దీని బీజము పైన ఉన్నారు. తండ్రిని పిలిచేటప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. మీరు ఎవరి నుండైతే వారసత్వము తీసుకుంటున్నారో, వారిప్పుడు కిందకు వచ్చి ఉన్నారు. నేను రావాల్సి ఉంటుంది అని అంటారు. నా ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము ఏదైతే ఉందో, ఇది అనేక వెరైటీ ధర్మాలతో కూడినది. ఇప్పుడిది తమోప్రధానముగా, పతితముగా అయిపోయింది, శిథిలావస్థకు చేరుకుంది.

తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో మొట్టమొదట దేవీ-దేవతలు ఉంటారు, ఇప్పుడు కలియుగములో అసురులు ఉన్నారు. ఇకపోతే, అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. మీరు ఈ ఆసురీ 5 వికారాలపై యోగబలముతో విజయము పొందుతారు. అంతేకానీ, హింసాత్మక యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు ఏ రకమైన హింస చేయరు. మీరు ఎవరినీ ముట్టుకోను కూడా ముట్టుకోరు. మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడమనేది అన్నింటికంటే పెద్ద పాపము. తండ్రి అంటారు - ఈ కామ ఖడ్గము ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. వికారాల్లోకి వెళ్ళకూడదు. దేవతల ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మహిమను పాడుతారు. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకుంటుంది. మేము పతితముగా అయిపోయామని అంటారు, అంటే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు పావనముగా ఉండేవారని అర్థం. అందుకే కదా, మేము పతితులుగా అయ్యామని అంటారు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు కూడా. పావనముగా ఉన్నప్పుడు ఎవరూ పిలవరు. దానిని స్వర్గమని అంటారు. ఇక్కడైతే సాధు-సత్పురుషులు మొదలైనవారు, పతిత-పావన సీతా-రామ... అంటూ ఎంతగా జపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా పాడుతూనే ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొత్తం ప్రపంచమంతా పతితముగా ఉంది. ఇది రావణ రాజ్యము కదా, రావణుడిని కాలుస్తారు, కానీ అతని రాజ్యము ఎప్పటినుండి మొదలైంది అనేది ఎవరికీ తెలియదు. భక్తి మార్గము యొక్క సామాగ్రి ఎంతో ఉంది. ఒకరు ఒకటి చేస్తారు, మరొకరు మరొకటి చేస్తారు. సన్యాసులు కూడా ఎన్ని రకాల యోగాలు నేర్పిస్తారు. వాస్తవానికి యోగమని దేనినంటారు - ఇది ఎవరికీ తెలియదు. ఇందులో ఎవరి దోషము లేదు. ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది. ఎప్పటివరకైతే నేను రానో, అప్పటివరకు అందరూ తమ పాత్రను అభినయించాల్సి ఉంటుంది. జ్ఞానము మరియు భక్తి, జ్ఞానమనగా పగలు, సత్య-త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర-కలియుగాలు. ఆ తర్వాత వైరాగ్యము. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము. ఇది అనంతమైన వైరాగ్యము. వారిది హద్దు వైరాగ్యము. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ఇంటిని కట్టుకుంటున్నప్పుడు పాతదాని పట్ల వైరాగ్యము కలుగుతుంది.

అనంతమైన తండ్రి ఎలా ఉన్నారో చూడండి! మీకు స్వర్గము రూపీ ఇంటిని తయారుచేసి ఇస్తారు. స్వర్గము కొత్త ప్రపంచము, నరకము పాత ప్రపంచము. కొత్తది నుండి పాతదిగా అవుతుంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత ఉంటుంది, ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు పాత ప్రపంచములో ఉంటూ మనము కొత్తదానిగా తయారుచేస్తున్నాము. మనము పాత శ్మశానవాటికపై పరిస్తాన్ ను తయారుచేస్తున్నాము. ఇదే యమునా నదీ తీరము ఉంటుంది, దీనిపై మహళ్ళు తయారవుతాయి. ఈ ఢిల్లీయే యమునా నదీ తీరములో ఉంటుంది. ఇకపోతే, పాండవులకు కోటలు ఉండేవన్నట్లు చూపిస్తారు కదా, అవన్నీ డ్రామా ప్లాన్ అనుసారముగా తప్పకుండా మళ్ళీ తయారవుతాయి. మీరు ఎలాగైతే యజ్ఞాలు, జపతపాదులు, దానాలు మొదలైనవి చేసేవారో, అవి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ముందుగా శివుని భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ మందిరాలను తయారుచేస్తారు, దానిని అవ్యభిచారీ భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములో ఉన్నారు. ఇది అవ్యభిచారీ జ్ఞానము. మీరు ఒక్క శివబాబా నుండే వింటారు, వారికే మీరు మొదట భక్తి చేసారు. ఆ సమయములో వేరే ధర్మాలేవీ ఉండవు. ఆ సమయములో మీరు చాలా సుఖముగా ఉంటారు. దేవతా ధర్మము చాలా సుఖమిచ్చేటువంటి ధర్మము. ఆ పేరు తీసుకోవడముతో నోరు తీపి అవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండి మాత్రమే జ్ఞానము వింటారు. తండ్రి అంటారు, మీరు ఇంకెవరి నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారీ జ్ఞానము. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది, నంబరువారు పురుషార్థానుసారముగా. తండ్రి కొద్ది సమయము కోసం సాకారములోకి వచ్చారు. వారు అంటారు - నేను పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానము ఇవ్వాల్సి ఉంటుంది, ఇది నా పర్మనెంటు శరీరము కాదు, నేను వీరిలో ప్రవేశిస్తాను. శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. అప్పటినుండి వారు ఈ జ్ఞానము వినిపించడము మొదలుపెడతారు. ఈ ఆత్మిక విద్యను పరమ ఆత్మ ఇస్తున్నారు. ఇక్కడ నీటి విషయమేమీ లేదు. నీటిని జ్ఞానమని అనరు. పతితము నుండి పావనముగా జ్ఞానము ద్వారా అవుతారు, నీటి ద్వారా పావనముగా అవ్వరు. నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడ జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి వీరిలో ప్రవేశించి జ్ఞానము వినిపిస్తారు. ఇక్కడ గోముఖానికి వెళ్తారు. వాస్తవానికి గోముఖమంటే చైతన్యములో ఉన్న మీరే. మీ నోటి నుండి జ్ఞానామృతము వెలువడుతుంది. గోవు నుండైతే పాలు లభిస్తాయి, అంతేకానీ నీటి విషయము కాదు. ఈ విషయాలన్నింటినీ సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది ఇంతకుముందు మీకు తెలియదు. అనంతమైన దసరా జరగనున్నదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపము వలె ఉంది. రావణ రాజ్యము మొత్తం సృష్టిపై ఉంది. వానర సైన్యముండేదని, వానరులు వారధి కట్టారని... శాస్త్రాలలో ఉంది, అవన్నీ కల్పిత కథలు. భక్తి కొనసాగుతుంది, ముందు అవ్యభిచారీ భక్తి ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారీ భక్తి ఉంటుంది. దసరా, రక్షాబంధనము, ఇవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపనవుతోంది. నేడు కంసపురి ఉంది, రేపు కృష్ణపురి ఉంటుంది. కంసుడు అని ఆసురీ సాంప్రదాయము వారిని అంటారు. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. శ్రీకృష్ణుని జన్మ సత్యయుగములో జరుగుతుంది, వారు మొదటి రాకుమారుడు. వారు స్కూల్లో చదువుకునేందుకు వెళ్తారు, పెద్దవారైన తర్వాత రాజ్య సింహాసనముపై కూర్చుంటారు. మహిమంతా పతితులను పావనముగా తయారుచేసే శివబాబాదే. ఇకపోతే, ఈ రాసలీలలు మొదలైనవి పరస్పరములో సంతోషముగా జరుపుకోవడానికి. ఇకపోతే, శ్రీకృష్ణుడు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడమనేది ఎలా జరుగుతుంది. బాబా అంటారు - భక్తి చేయకండి అని ఎవరికీ చెప్పకూడదు. అది దానంతట అదే దూరమైపోతుంది. భక్తిని వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు, దీని గురించే గొడవలు జరుగుతాయి. బాబా అన్నారు - నేను రుద్ర యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులో ఆసురీ సాంప్రదాయము వారి విఘ్నాలు కలుగుతాయి. ఇది శివబాబా యొక్క అనంతమైన యజ్ఞము, దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రకటితమైందని అంటూ ఉంటారు. పాత ప్రపంచ వినాశనము జరిగిన తర్వాత మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. మనుష్యులంటారు - మేము శాంతి ఏర్పడాలి అని అంటాము, ఈ బి.కె.లు వినాశనమవ్వాలని అంటారు. జ్ఞానము అర్థం చేసుకోని కారణముగా ఈ విధముగా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ మొత్తం పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహా అయిపోతుంది. పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, అందరూ ఆవగింజల వలె నలిగి అంతమైపోతారు. ఇకపోతే, కొంతమంది ఆత్మలు మిగులుతారు. ఆత్మ అయితే అవినాశీ. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది, ఇందులో శరీరాలన్నీ అంతమైపోతాయి. ఇకపోతే, ఆత్మ పవిత్రముగా అయి వెళ్ళిపోతుంది. అగ్నిలో వేసినప్పుడు వస్తువు శుద్ధముగా అవుతుంది. శుద్ధత కోసమే యజ్ఞము చేస్తారు. అవన్నీ భౌతిక విషయాలు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. వినాశనానికి ముందే తప్పకుండా స్థాపన జరగాలి. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు - ముందు స్థాపన జరుగుతుంది, ఆ తర్వాత వినాశనము జరుగుతుందని చెప్పండి. బ్రహ్మా ద్వారా స్థాపన. ప్రజాపిత బ్రహ్మా ప్రసిద్ధమైనవారు. ఆదిదేవ్, ఆదిదేవి ఉన్నారు. జగదాంబకు లక్షలాది మందిరాలు ఉన్నాయి. వారి పేరు మీద ఎన్ని మేళాలు జరుగుతాయి. మీరు జగదాంబ పిల్లలు జ్ఞాన-జ్ఞానేశ్వరీలు, తర్వాత రాజ-రాజేశ్వరీలుగా అవుతారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత భక్తి మార్గములో, లక్ష్మి నుండి దీపావళి రోజున వినాశీ ధనాన్ని కోరుకుంటారు. ఇక్కడ మీకు అన్నీ లభిస్తాయి - ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. అక్కడ 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతగా యోగము జోడిస్తారో, అంతగా ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది. మీరు ఈశ్వరునితో యోగము జోడిస్తూ యోగేశ్వరులుగా తయారవుతారు.

తండ్రి అంటారు - నేను చాకలివాడిని, మురికి పట్టిన ఆత్మలందరినీ శుభ్రము చేస్తాను. ఆ తర్వాత శరీరము కూడా శుద్ధమైనది లభిస్తుంది. నేను సెకండులో ప్రపంచములోని వస్త్రాలన్నింటినీ శుభ్రము చేస్తాను. కేవలం మన్మనాభవగా ఉంటే ఆత్మ మరియు శరీరము, పవిత్రముగా తయారవుతాయి. కనుక ఇది మ్యాజిక్ కదా. దీనితో సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది కావున ఇది ఎంత సహజమైన ఉపాయము. నడుస్తూ-తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి, మీకు ఇంకే కష్టము ఇవ్వను. ఇప్పుడు మీరు ఒక్క సెకండులో ఎక్కే కళలోకి వెళ్తారు. తండ్రి అంటారు - నేను పిల్లలైన మీకు సేవకుడినై వచ్చాను. ఓ పతిత-పావనా, వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని మీరు పిలిచారంటే నేను సేవకుడిని అయినట్లే కదా. ఎప్పుడైతే మీరు చాలా పతితముగా అవుతారో, అప్పుడు చాలా గట్టిగా పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలకు ఈ మంత్రాన్ని ఇస్తాను - నన్ను స్మృతి చేయండి. మన్మనాభవ అర్థం కూడా ఇదే. తర్వాత మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు విష్ణుపురి యొక్క రాజ్యము తీసుకునేందుకే వచ్చారు. రావణపురి తర్వాత విష్ణుపురి ఉంటుంది. కంసపురి తర్వాత కృష్ణపురి ఉంటుంది. ఇది ఎంత సహజముగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి అంటారు - కేవలం ఈ పాత ప్రపంచము పట్ల మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు మనము 84 జన్మలు పూర్తి చేసాము. ఈ పాత శరీరాన్ని వదిలి మనం కొత్త ప్రపంచములోకి వెళ్తాము. స్మృతి ద్వారానే మీ పాపాలు కట్ అవుతాయి, అంత ధైర్యము చేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నోటి నుండి సదా జ్ఞానామృతమే వెలువడాలి. జ్ఞానము ద్వారానే అందరికీ సద్గతిని అందించాలి. ఒక్క తండ్రి నుండే జ్ఞానము వినాలి, ఇతరుల నుండి కాదు.

2. ఎక్కే కళలోకి వెళ్ళేందుకు నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. ఈ పాత ప్రపంచము, పాత శరీరము పట్ల మమకారాన్ని తొలగించాలి.

వరదానము:-
బుద్ధి రూపీ పాదము ద్వారా ఈ పంచ తత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే ఫరిశ్తా స్వరూప భవ

ఫరిశ్తాలకు సదా ప్రకాశ శరీరాన్ని చూపిస్తారు. ప్రకాశ శరీరము కలవారు ఈ దైహిక స్మృతి నుండి కూడా అతీతముగా ఉంటారు. వారి బుద్ధి రూపీ పాదము ఈ పంచ తత్వాల ఆకర్షణ నుండి పైన అనగా అతీతముగా ఉంటుంది. ఇటువంటి ఫరిశ్తాలను మాయ లేక ఎటువంటి మాయావి టచ్ చేయలేరు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఎవ్వరికీ ఆధీనులుగా అవ్వనప్పుడు. శరీరానికి కూడా అధికారిగా అయి నడుచుకోవాలి, మాయకు కూడా అధికారిగా అవ్వాలి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు.

స్లోగన్:-
శరీరాన్ని చూసే అలవాటు ఉంటే లైట్ శరీరాన్ని చూడండి, లైట్ రూపములో స్థితులవ్వండి.

మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు - ‘‘నిరంతరము ఈశ్వరీయ స్మృతిలో కూర్చోవడము’’

ఇప్పుడు మనము పరమాత్మ స్మృతిలో కూర్చున్నప్పుడు, కూర్చోవడమంటే అర్థమేమిటి? మనము పరమాత్మ స్మృతిలో కేవలం కూర్చోవడమే కాదు, కానీ ఈశ్వరీయ స్మృతిని నడుస్తూ-తిరుగుతూ నిత్యం, అన్ని వేళలా చేస్తూ ఉండాలి. అంతేకాక, ఎవరి పరిచయమైతే మనకు తెలుసో, వారి స్మృతే ఉంటుంది. వారి నామ-రూపాలు ఏమిటి. ఒకవేళ మనము ఈశ్వరుడు నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటే, అప్పుడు ఏ రూపాన్ని స్మృతి చేయాలి? ఒకవేళ ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అంటే, వారు సర్వత్రా వ్యాపించి ఉన్నారని అర్థం, అటువంటప్పుడు ఎవరిని స్మృతి చేయాలి. ఒకవేళ ‘స్మృతి’ అనే పదముంది అంటే, తప్పకుండా ‘స్మృతి’కి రూపమనేది కూడా ఉంటుంది. ‘స్మృతి’ చేసే విషయములో - ఒకరు స్మృతి చేసేవారు, రెండవవారు ఎవరినైతే స్మృతి చేస్తారో వారు. అంటే, స్మృతి చేసేవారు తప్పకుండా స్మృతి చేయబడుతున్నవారికి వేరుగా ఉంటారు. అంటే, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని అర్థం. ఒకవేళ ఎవరైనా, ఆత్మలమైన మేము పరమాత్ముని అంశము అని అంటే, మరి పరమాత్మ కూడా ఎన్నో భాగాలుగా ఉన్నట్లా? అలా అయితే, పరమాత్మ వినాశీ అయినట్లు! అలాగే, వారి స్మృతి కూడా వినాశీ అయినట్లు! ఇప్పుడు మనుష్యులకు తెలియని విషయమేమిటంటే - పరమాత్మ కూడా అవినాశీ, అలాగే ఆ అవినాశీ పరమపిత పరమాత్ముని సంతానమైన ఆత్మలము కూడా అవినాశీ. కనుక మనము వంశము అయినట్లు, అంతేకానీ అంశము కాదు. ఇప్పుడు ఈ జ్ఞానము కావాలి, దీనిని పరమాత్మ స్వయంగా వచ్చి పిల్లలైన మనకు ఇస్తారు. పిల్లలైన మన పట్ల పరమాత్ముని మహావాక్యాలు ఏమిటంటే - పిల్లలూ, నేను ఎవరినో, ఎలా ఉంటానో, ఆ రూపాన్నే స్మృతి చేస్తే మీరు నన్ను తప్పకుండా పొందుతారు. ఒకవేళ సుఖ-దుఃఖాలకు అతీతమైన తండ్రినైన నేను సర్వవ్యాపిగా ఉన్నట్లయితే, ఇక ఈ ఆటలో సుఖ-దుఃఖాలే ఉండవు. కనుక నేను సర్వవ్యాపిని కాను. నేను కూడా ఆత్మ వలె ఆత్మను, కానీ సర్వాత్మలలో కల్లా నా గుణాలు ఉన్నతమైనవి, అందుకే నన్ను పరమ-ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. అచ్ఛా. ఓంశాంతి.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

మనసా సేవ చేసేందుకు సర్వుల పట్ల సదా శ్రేష్ఠమైన మరియు నిస్వార్థమైన సంకల్పాలు ఉండాలి, సదా పరోపకార భావన ఉండాలి, అపకారుల పట్ల కూడా ఉపకారము యొక్క శ్రేష్ఠ శక్తి ఉండాలి, సదా దాతాతనపు భావన ఉండాలి. సదా స్వ పరివర్తన. స్వయం యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరులకు శ్రేష్ఠ కర్మలు చేయాలనే ప్రేరణను ఇచ్చేవారిగా ఉండాలి.