16-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
15.12.2007
‘‘సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని, కర్మల గుహ్య
గతిపై అటెన్షన్ పెట్టండి, నష్టోమోహులుగా, ఎవర్రెడీగా కండి’’
ఈ రోజు సర్వ ఖజానాల దాత, జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వ
గుణాల ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చే బాప్ దాదా
నలువైపులా ఉన్న ఖజానాలకు బాలకులు మరియు యజమానులైన తమ అధికారీ
పిల్లలను చూస్తున్నారు. అఖండ ఖజానాలకు యజమాని అయిన తండ్రి
పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నము చేస్తున్నారు. ప్రతి
ఒక్కరికీ సర్వ ఖజానాలను ఇస్తారు, కొందరికి తక్కువగా, కొందరికి
ఎక్కువగా ఇవ్వరు ఎందుకంటే అఖండమైన ఖజానా ఉంది. నలువైపులా ఉన్న
పిల్లలు బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్నారు. అందరూ ఖజానాలతో
నిండుగా అయి హర్షిస్తున్నారు.
ఈ రోజుల్లో సమయమనుసారముగా అన్నింటికన్నా అమూల్యమైన శ్రేష్ఠ
ఖజానా - పురుషోత్తమ సంగమ సమయము, ఎందుకంటే ఈ సంగమములోనే మొత్తం
కల్పము యొక్క ప్రారబ్ధాన్ని తయారుచేసుకోగలరు. ఈ చిన్నని
యుగములోని ప్రాప్తులు మరియు ప్రారబ్ధము అనుసారముగా ఒక్క క్షణము
యొక్క విలువ ఒక్క సంవత్సరముతో సమానము. ఈ సమయము అంత అమూల్యమైనది.
ఈ సమయము కోసమే - ‘‘ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు’’ అన్న
గాయనము ఉంది ఎందుకంటే ఈ సమయములోనే పరమాత్మ పాత్ర నిశ్చితమై ఉంది,
అందుకే ఈ సమయాన్ని వజ్రతుల్యమైనది అని అనడం జరుగుతుంది.
సత్యయుగాన్ని బంగారు యుగము అని అనడం జరుగుతుంది. కానీ ఈ సమయములో,
సమయము కూడా వజ్రతుల్యమైనది మరియు పిల్లలైన మీరందరూ కూడా
వజ్రతుల్యమైన జీవితము యొక్క అనుభవీ ఆత్మలు. ఈ సమయములోనే
చాలాకాలం నుండి దూరమై ఉన్న ఆత్మలు పరమాత్మ మిలనము, పరమాత్మ
ప్రేమ, పరమాత్మ జ్ఞానము, పరమాత్మ ఖజానా, ఈ ప్రాప్తులకు
అధికారులుగా అవుతారు. మొత్తం కల్పములో దేవాత్మలు, మహానాత్మలు
ఉన్నారు కానీ ఈ సమయములో పరమాత్ముని ఈశ్వరీయ పరివారము ఉంది,
అందుకే ఈ వర్తమాన సమయానికి ఎంతైతే మహత్వము ఉందో, ఆ మహత్వాన్ని
తెలుసుకుని, ఎంతగా స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలనుకుంటే
అంతగా చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ మహాన్ యుగములోని పరమాత్మ
భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే పదమాపదమ భాగ్యశాలులు కదా! ఈ
విధముగా మీ శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆత్మిక నషాను మరియు
భాగ్యాన్ని తెలుసుకుంటూ, అనుభవం చేస్తున్నారు కదా! సంతోషము
కలుగుతుంది కదా! మనసులో ఏ పాటను పాడుకుంటారు? వాహ్ నా భాగ్యము
వాహ్! ఎందుకంటే ఈ సమయములోని శ్రేష్ఠ భాగ్యము ముందు ఇతర ఏ
యుగాలలోనూ ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తించజాలదు.
మరి చెప్పండి, సదా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచకుంటూ
హర్షిస్తూ ఉంటారు కదా! హర్షిస్తూ ఉంటారా? సదా హర్షితముగా
ఉంటున్నాము, అప్పుడప్పుడు కాదు అని ఎవరైతే భావిస్తున్నారో,
ఎవరైతే సదా హర్షితముగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా, సదా...
సదా అన్నదానిని అండర్ లైన్ చేయండి. ఇప్పుడు టి.వి.లో మీ ఫోటో
వస్తుంది. ‘‘సదా’’ అని అనేవారి ఫోటో వస్తుంది. అభినందనలు. మాతలు
చేతులు ఎత్తండి, శక్తులు ఎత్తండి, డబుల్ విదేశీయులు... ఏ
పదాన్ని గుర్తు పెట్టుకుంటారు? సదా. అప్పుడప్పుడు అనేవారైతే
వెనుక వస్తారు.
బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సమయము యొక్క వేగము
చాలా తీవ్రగతిలో ముందుకు సాగుతుంది. సమయము యొక్క వేగాన్ని
తెలుసుకున్నవారు స్వయాన్ని చెక్ చేసుకోండి - మాస్టర్
సర్వశక్తివంతులమైన మా యొక్క వేగము తీవ్రముగా ఉందా?
పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కానీ బాప్ దాదా ఏం
చూడాలనుకుంటున్నారు? ప్రతి బిడ్డ తీవ్ర పురుషార్థీగా, ప్రతి
సబ్జెక్టులోనూ పాస్ విత్ ఆనర్ గా ఉన్నారా లేక కేవలం పాస్ అయి
ఉన్నారా? తీవ్ర పురుషార్థీ యొక్క లక్షణాలు విశేషముగా రెండు
ఉంటాయి - ఒకటి - నష్టోమోహా, రెండు - ఎవర్రెడీ. అన్నింటికన్నా
ముందుగా, నష్టోమోహా - ఈ దేహ భానము, దేహ అభిమానము నుండి
నష్టోమోహాగా అయినట్లయితే ఇతర విషయాలలో నష్టోమోహులుగా అవ్వడము
కష్టమేమీ కాదు. దేహ-భానానికి గుర్తు వ్యర్థము, వ్యర్థ సంకల్పాలు,
వ్యర్థ సమయము, ఈ చెకింగ్ ను స్వయమే బాగా చేసుకోగలరు. సాధారణ
సమయము, అది కూడా నష్టోమోహాగా కానివ్వదు. కావున చెక్ చేసుకోండి
- ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ సఫలమయ్యాయా?
ఎందుకంటే సంగమయుగములో విశేషముగా తండ్రి ఇచ్చిన వరదానము ఉంది -
సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. అధికారము అనేది సహజముగా ఉన్నట్లు
అనుభవం చేయిస్తుంది. రెండు - ఎవర్రెడీ. ఎవర్రెడీ అంటే అర్థము -
మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో అకస్మాత్తుగా సమయము
ఆర్డర్ చేస్తే ఎవర్రెడీగా ఉండడము, అంతేకాక అకస్మాత్తుగానే
జరగనున్నది. ఏ విధముగా మీ దాదీను చూసారు - అకస్మాత్తు, ఎవర్రెడీ.
ప్రతి స్వభావములో, ప్రతి కార్యములో ఈజీగా ఉండేవారు, సంపర్కములో
ఈజీ, స్వభావములో ఈజీ, సేవలో ఈజీ, సంతుష్టపరచడములో ఈజీ,
సంతుష్టముగా ఉండటములో ఈజీ, అందుకే బాప్ దాదా సమయము యొక్క సమీపత
గురించి పదే-పదే సూచనను ఇస్తున్నారు. స్వ పురుషార్థానికి సమయము
చాలా తక్కువగా ఉంది, అందుకే మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి.
ఖజానాలను జమ చేసుకునేందుకు మూడు విధులను ఇంతకుముందు కూడా
చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. ఆ మూడు విధులను స్వయములో చెక్
చేసుకోండి. ఒకటి - స్వయము యొక్క పురుషార్థముతో ప్రారబ్ధము
యొక్క ఖజానాను జమా చేసుకోవడము, ప్రాప్తుల ఖజానాను జమా
చేసుకోవడము. రెండవది - సంతుష్టముగా ఉండటము, ఇందులో కూడా సదా
అన్న పదాన్ని కలపండి మరియు సర్వులను సంతుష్టపరచడము ద్వారా
దీనితో పుణ్యము యొక్క ఖాతా జమ అవుతుంది. మరియు ఈ పుణ్య ఖాతా
అనేక జన్మల ప్రారబ్ధానికి ఆధారమవుతుంది. మూడవది - సదా సేవలో
అలసటలేనివారిగా, నిస్వార్థముగా మరియు విశాల హృదయముతో సేవ
చెయ్యడము, దీనితో ఎవరి సేవనైతే చేస్తున్నారో వారి నుండి
స్వతహాగానే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ మూడు విధులు, స్వయము
యొక్క పురుషార్థము, పుణ్యము మరియు ఆశీర్వాదాలు. ఈ మూడు ఖాతాలు
జమా అయి ఉన్నాయా? మరి చెక్ చేసుకోండి, అకస్మాత్తుగా ఒకవేళ
ఏదైనా పేపర్ వస్తే పాస్ విత్ ఆనర్ అవ్వగలరా? ఎందుకంటే ఈ
రోజుల్లోని సమయమనుసారముగా ప్రకృతి అలజడుల యొక్క చిన్న-చిన్న
విషయాలు ఎప్పుడైనా రావచ్చు, అందుకే కర్మల గతి యొక్క జ్ఞానము
పట్ల విశేషముగా అటెన్షన్ ఉండాలి. కర్మల గతి చాలా గుహ్యమైనది.
ఏ విధముగా డ్రామా పట్ల అటెన్షన్ ఉంటుందో, ఆత్మిక స్వరూపము పట్ల
అటెన్షన్ ఉంటుందో, ధారణల పట్ల అటెన్షన్ ఉంటుందో, అదే విధముగానే
కర్మల గుహ్య గతి పట్ల కూడా అటెన్షన్ అవసరము. సాధారణ కర్మలు,
సాధారణ సమయము, సాధారణ సంకల్పాలు, వీటి వలన ప్రారబ్ధములో తేడా
వస్తుంది. ఈ సమయములో పురుషార్థీలైన మీరంతా ఎవరైతే ఉన్నారో, మీరు
శ్రేష్ఠమైన విశేష ఆత్మలు, మీరు సాధారణ ఆత్మలు కారు. మీరు
విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన, విశ్వ పరివర్తనకు నిమిత్తమైన
ఆత్మలు. మీరు కేవలం స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు కాదు, మీరు
విశ్వ పరివర్తనకు బాధ్యులు, అందుకే మీ శ్రేష్ఠ స్వమానము యొక్క
స్మృతి స్వరూపులుగా అవ్వవలసిందే.
బాప్ దాదా చూసారు, అందరికీ బాప్ దాదా పట్ల మరియు సేవ పట్ల
మంచి ప్రేమ ఉంది. సేవా వాతావరణము నలువైపులా ఏదో ఒక ప్లాన్
అనుసారముగా నడుస్తూ ఉంది. దానితో పాటుగా ఇప్పుడు సమయమనుసారముగా
విశ్వాత్మలు ఎవరైతే దుఃఖితులుగా అవుతున్నారో, అశాంతిగా
అవుతున్నారో, ఆ ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి విడిపించడానికి
మీ శక్తుల ద్వారా సకాష్ ను ఇవ్వండి. ఏ విధముగా ప్రకృతిలోని
సూర్యుడు తన సకాష్ తో అంధకారాన్ని దూరం చేసి ప్రకాశములోకి
తీసుకువస్తాడో, తన కిరణాల బలముతో ఎన్నో వస్తువులను పరివర్తన
చేస్తాడో, అదే విధముగా మాస్టర్ జ్ఞాన సూర్యులైన మీరు మీకు
ప్రాప్తించిన సుఖ-శాంతుల కిరణాలతో, సకాష్ తో దుఃఖము, అశాంతి
నుండి విముక్తులుగా చెయ్యండి. మనసా సేవతో, శక్తిశాలి వృత్తితో
వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. కావున ఇప్పుడు మనసా సేవను
చెయ్యండి. ఏ విధముగా వాచా సేవను విస్తారము చేసారో, అదే విధముగా
మనసా సకాష్ ద్వారా ఆత్మలలో హ్యాపీ మరియు హోప్ (సంతోషము మరియు
ఆశ) యొక్క అలను వ్యాపింపజేయండి. ఈ సంవత్సరము హ్యాపీ మరియు హోప్
అని ఏదైతే టాపిక్ ను పెట్టారో, దాని అనుసారముగానే ధైర్యాన్ని
ఇప్పించండి, ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించండి, తండ్రి యొక్క
వారసత్వాన్ని ఇప్పించండి, దుఃఖము-అశాంతి నుండి విముక్తిని
ఇప్పించండి. ఇప్పుడు సకాష్ ను ఇచ్చే అవసరము ఎక్కువగా ఉంది. ఈ
సేవలో మనసును బిజీగా పెట్టుకోండి, అప్పుడు మాయాజీతులుగా, విజయీ
ఆత్మలుగా స్వతహాగానే అయిపోతారు. ఇకపోతే, చిన్న-చిన్న విషయాలైతే
సైడ్ సీన్స్, సైడ్ సీన్స్ లో కొన్ని మంచివి కూడా వస్తాయి,
కొన్ని చెడు విషయాలు కూడా వస్తాయి. సైడ్ సీన్స్ ను దాటి
గమ్యాన్ని చేరుకోవలసి ఉంటుంది. సైడ్ సీన్స్ ను చూడడం కోసం
సాక్షీ దృష్ట అనే సీట్ పై సెట్ అవ్వండి, అంతే. అప్పుడు సైడ్
సీన్స్ మనోరంజనముగా అయిపోతాయి. మరి ఎవర్రెడీ కదా? ఒకవేళ రేపే
ఏదైనా జరిగినా కూడా, ఎవర్రెడీగా ఉన్నారా? మొదటి లైన్ వారు
ఎవర్రెడీగా ఉన్నారా? ఒకవేళ రేపే ఏదైనా జరిగితే? టీచర్లు తయారుగా
ఉన్నారా, అయితే మంచిది. ఈ వర్గాలవారు తయారుగా ఉన్నారా. ఎన్ని
వర్గాలైతే వచ్చాయో, ఎవర్రెడీగా ఉన్నారా. ఆలోచించండి. చూడండి
దాదీలు, చూస్తున్నారా, అందరూ చేతులు ఊపుతున్నారు. మంచిది,
అభినందనలు. ఒకవేళ తయారుగా లేకపోయినా కానీ ఈ రోజు రాత్రికల్లా
తయారైపోండి ఎందుకంటే సమయము మీ కోసం ఎదురుచూస్తుంది. బాప్ దాదా
ముక్తి ద్వారాలను తెరవడానికి ఎదురుచూస్తున్నారు.
అడ్వాన్స్పార్టీవారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు
చేయలేనిది ఏముంది... మీరు ఎలాగూ మాస్టర్ సర్వశక్తివంతులే. ఇది
చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని దృఢ సంకల్పము చెయ్యండి, అంతే.
చెయ్యకూడదు అంటే దృఢ సంకల్పముతో ‘చేయకూడదు’ అన్నదానిని
‘చేయకుండా ఉండి’ చూపించండి. మాస్టర్ గా అయితే ఉన్నారు కదా!
అచ్ఛా.
ఇప్పుడు మొదటిసారిగా ఎవరు వచ్చారు? ఎవరైతే మొదటిసారి వచ్చారో,
వారు చేతులెత్తండి. చేతులు పెద్దగా ఎత్తండి, ఊపండి. ఇంతమంది
వచ్చారు. మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారికి పదమాల రెట్లు
అభినందనలు, అభినందనలు. కల్పక్రితము యొక్క పిల్లలు మళ్ళీ తమ
పరివారములోకి చేరుకున్నారు అన్నదానికి బాప్ దాదా
సంతోషిస్తున్నారు, అందుకే ఇప్పుడు వెనుక వచ్చినవారు అద్భుతము
చేసి చూపించండి. వెనుకే ఉండిపోకండి, వెనుక వచ్చారు కానీ వెనుక
ఉండిపోకండి. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి. దీని కోసం తీవ్ర
పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. ధైర్యము ఉంది కదా! ధైర్యము
ఉందా? మంచిది. ధైర్యము పిల్లలది, సహాయము బాప్ దాదాది మరియు
పరివారముది. మంచిది. ఎందుకంటే పిల్లలు ఇంటికి అలంకారము. కావున
ఎవరైతే వచ్చారో వారు మధుబన్ కు అలంకారము. అచ్ఛా!
సేవా టర్న్భోపాల్ జోన్ వారిది:-
అచ్ఛా, చాలామంది వచ్చారు. (జెండాలు
ఊపుతున్నారు). మంచిది, బంగారు అవకాశమైతే లభించింది కదా. మంచిది,
సేవకు నిమిత్తముగా ఎవరైతే వచ్చి ఉన్నారో, వీరిలో అందరూ సేవ
యొక్క బలము, ఫలము అయిన అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి ఏదైతే
ఉందో, దానిని అనుభవం చేసారా? చేసారా? ఇప్పుడు అవును అని
అనుకుంటే జెండాలు ఊపండి, ఎవరైతే చేసారో ఊపండి. అచ్ఛా, ఇప్పుడైతే
అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసారు, ఇది సదా ఉంటుందా? లేక కొద్ది
సమయమే ఉంటుందా? ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తారో, ఇతరులను
చూసి చేతులెత్తకండి, ఎవరైతే మనస్ఫూర్తిగా భావిస్తారో - నేను ఈ
ప్రాప్తిని సదా నిలిపి ఉంచుకుంటాను, విఘ్న-వినాశకునిగా అవుతాను
అని, వారు జెండాలు ఊపండి. అచ్ఛా. చూడండి, మీరు టి.వి.లో
వస్తున్నారు, ఆ తర్వాత ఈ టి.వి.లో తీసిన ఫోటోను పంపిస్తాము.
అచ్ఛా. ఈ అవకాశము ఏదైతే లభించిందో అది చాలా బాగుంది. అవకాశము
తీసుకోవడం కూడా సంతోషముగా తీసుకుంటారు మరియు ప్రతి టర్న్ లోనూ
అందరికీ రావడం కోసం పెద్ద మనసుతో అనుమతి కూడా లభిస్తుంది. అచ్ఛా,
ఇప్పుడు ఏ అద్భుతము చేస్తారు? (2008లో మిమ్మల్ని ప్రత్యక్షము
చేసి చూపిస్తాము). మంచిది. ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుని ఈ
ప్రతిజ్ఞను పూర్తి చెయ్యండి. తప్పకుండా చేస్తారు. మాస్టర్
సర్వశక్తివంతులకు ఎటువంటి ప్రతిజ్ఞనైనా నిలబెట్టుకోవడమనేది
పెద్ద విషయమేమీ కాదు. కేవలం దృఢతను సహచరునిగా చేసుకుని
ఉంచుకోండి. దృఢతను విడిచిపెట్టకండి ఎందుకంటే దృఢత సఫలతకు
తాళంచెవి. కనుక ఎక్కడైతే దృఢత ఉంటుందో, అక్కడ సఫలత తప్పకుండా
ఉంటుంది. అంతే కదా! చేసి చూపిస్తారు. బాప్ దాదాకు కూడా
సంతోషముగా ఉంది, మంచిది. చూడండి, ఎంతమందికి అవకాశము లభిస్తుంది.
సగం క్లాస్ అయితే సేవ చేసేవారిదే ఉంటుంది. మంచిది. చూడండి,
సాకార బాబా ఉన్నప్పటి నుండి చాలా మంచి పాత్రను అభినయించారు,
మొట్టమొదటి మ్యూజియంను వీరు (మహేంద్ర భాయి) తయారుచేసారు. మరి
చూడండి, సాకార తండ్రి యొక్క ఆశీర్వాదాలు మొత్తం జోన్ కు ఉన్నాయి.
ఇప్పుడు ఏదైనా నవీనతను చేసి చూపించండి. ఇప్పుడు చాలా
కాలమయ్యింది, ఎటువంటి కొత్త ఆవిష్కరణను చేయలేదు. వర్గీకరణ కూడా
ఇప్పుడు పాతదైపోయింది. ప్రదర్శినీలు, మేళాలు, కాన్ఫెరెన్సులు,
స్నేహ మిలనాలు, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొత్తది
చెయ్యండి. షార్ట్మరియు స్వీట్, ఖర్చు తక్కువ మరియు సేవ ఎక్కువ.
మీరు రాయ్ బహాదుర్ (సలహాదారులు) కదా! మరి రాయ్ బహాదుర్లు కొత్త
సలహాలను ఆలోచించండి. ఏ విధముగా ప్రదర్శినీ వెలువడింది, ఆ
తర్వాత మేళా వెలువడింది, ఆ తర్వాత వర్గీకరణ వెలువడింది, అదే
విధముగా ఏదైనా కొత్త ఆవిష్కరణను చెయ్యండి. ఎవరు నిమిత్తమవుతారో
చూస్తాము. మంచిది. మీరు ధైర్యము కలవారు, అందుకే బాప్ దాదా
ధైర్యము ఉంచినవారికి సదా ముందుగానే సహాయానికి అభినందనలు
తెలియజేస్తున్నారు. అచ్ఛా!
ఇప్పుడు ఒక్క క్షణములో అందరూ చాలా
మధురాతి మధురమైన స్వీట్ సైలెన్స్ స్టేజ్ యొక్క అనుభవములో
మైమరచిపోండి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ తీవ్ర పురుషార్థులు, సదా దృఢ సంకల్పము
ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, సదా విజయము యొక్క
తిలకధారులు, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు, డబుల్
కిరీటధారులు, విశ్వ కళ్యాణకారులు, సదా లక్ష్యాన్ని మరియు
లక్షణాలను సమానముగా చేసుకునేవారు, పరమాత్మ ప్రేమలో
పాలింపబడేవారు, ఇటువంటి సర్వ శ్రేష్ఠ పిల్లలకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే.
దాదీలతో:-
పిల్లలు హాజరై ఉన్నారు, తండ్రి అయితే
ఎలాగూ హాజరై ఉన్నారు. తండ్రి పిల్లల నుండి దూరం కాలేరు, పిల్లలు
తండ్రి నుండి దూరం కాలేరు. ప్రతిజ్ఞ ఉంది - తోడుగా ఉన్నారు,
తోడుగా వెళ్తారు, అర్ధకల్పము బ్రహ్మాబాబాతో పాటు ఉంటారు. (జానకీ
దాదీజీ ఏమన్నారంటే - వారు కూడా (శివబాబా కూడా) అయితే ఇమిడిపోయి
తోడుగా ఉన్నారు). మీ ఈ అనుభూతి సరైనది. ఇప్పుడైతే గ్యారెంటీ
ఉంది, కానీ ఎప్పుడైతే రాజ్యము చేస్తారో అప్పుడైతే శివబాబా రారు.
ఎవరైనా చూసేవారు కూడా కావాలి కదా. (మీ మనసు పైన ఎలా నిలుస్తుంది?)
డ్రామాలో పాత్ర ఉంది. బ్రహ్మాబాబా అయితే తోడుగా ఉన్నారు కదా.
డ్రామా ఏం చేస్తుందో చూడండి?
వరదానము:-
రియాల్టీ ద్వారా ప్రతి కర్మలోనూ మరియు
మాటలోనూ రాయల్టీని చూపించే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారీ భవ
రియాల్టీ అనగా తమ అసలైన స్వరూపము
యొక్క స్మృతి సదా ఉండటము. దీని ద్వారా స్థూలముగా ముఖములో కూడా
రాయల్టీ కనిపిస్తుంది. రియాల్టీ అనగా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ
లేరు. ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మలోనూ మరియు మాటలోనూ రాయల్టీ
కనిపిస్తుంది. మీ సంపర్కములోకి ఎవరు వచ్చినా, వారికి ప్రతి
కర్మలోనూ బాబా సమానమైన చరిత్ర అనుభవమవుతుంది, ప్రతి మాటలోనూ
బాబా సమానమైన అథారిటీ మరియు ప్రాప్తి అనుభూతి అవుతుంది. బాబా
సాంగత్యము రియల్ (సత్యమైనది) అయిన కారణముగా అది పారసములా పని
చేస్తుంది. ఇటువంటి రియాల్టీ కల రాయల్ ఆత్మలే ఫస్ట్ డివిజన్ కు
అధికారులుగా అవుతారు.
స్లోగన్:-
శ్రేష్ఠ కర్మల ఖాతాను పెంచుకున్నట్లయితే వికర్మల ఖాతా
సమాప్తమైపోతుంది.
అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని
పెంచండి
నలువైపులా అలజడి ఉంది, వ్యక్తుల కారణముగా, ప్రకృతి కారణముగా
అలజడి పెరిగేదే ఉంది, అటువంటి సమయములో రక్షణకు సాధనము - ఒక్క
సెకండ్ లో స్వయాన్ని విదేహీగా, అశరీరిగా లేక ఆత్మాభిమానిగా
తయారుచేసుకోవటము. కనుక మధ్యమధ్యలో ఇలా ట్రయల్చెయ్యండి - ఒక్క
సెకండ్ లో మనసు, బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్థితి
చేయగలరా! దీనినే సాధన అని అంటారు.
సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము. రాజయోగీ తపస్వీ సోదరీ,
సోదరులందరూ సా.6.30 నుండి 7.30 గం. వరకు విశేషముగా యోగాభ్యాసము
సమయములో తమ శుభ భావనల యొక్క శ్రేష్ఠ వృత్తి ద్వారా మనసా
మహాదానులుగా అయి అందరికీ నిర్భయత యొక్క వరదానాన్ని ఇచ్చే సేవ
చెయ్యండి.
|
|
|
|