ఓంశాంతి
ఇప్పుడు శివబాబా జయంతి రానున్నది. దాని గురించి ఎలా అర్థం చేయించాలి? తండ్రి మీకు
అర్థం చేయించారు, అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. అంతేకానీ ఏ విధంగా బాబా
మిమ్మల్ని చదివిస్తారో అలాగే బాబాయే మిగిలిన వారందరినీ చదివించాలని కాదు. శివబాబా
మిమ్మల్ని చదివించారు, ఈ శరీరము ద్వారా చదివించారని మీకు తెలుసు. తప్పకుండా మనం
శివబాబా జయంతిని జరుపుకుంటాము. మనం పేరు కూడా శివునిదే తీసుకుంటాము. వారు నిరాకారుడు.
వారిని శివ అని అంటారు. వాళ్ళు, శివుడు జనన-మరణ రహితుడు కదా, అతనికి జయంతి ఎలా
ఉంటుంది అని అడుగుతారు. ఏ విధంగా నంబరువారుగా జరుపుకుంటూ వస్తారు అనేది మీకు తెలుసు,
ఇలా జరుపుకుంటూనే ఉంటారు, కావున వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి వచ్చి ఈ
తనువును ఆధారముగా తీసుకుంటారు. నోరు అయితే తప్పకుండా కావాలి, అందుకే గోముఖానికి
మహిమ ఉంది. ఈ రహస్యము కాస్త క్లిష్టమైనది. శివబాబా కర్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి.
మన అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, వారి ద్వారానే మనకు అనంతమైన వారసత్వము లభిస్తుంది.
తప్పకుండా భారత్ కు అనంతమైన వారసత్వము ఉండేది, అది ఇంకెవ్వరికీ లభించదు. భారత్ నే
సత్యఖండము అని అంటారు మరియు తండ్రిని కూడా సత్యము అని అంటారు. కావున ఈ విషయాలను
అర్థం చేయించవలసి ఉంటుంది, కొందరికి త్వరగా అర్థం కాదు, కొందరు వెంటనే అర్థం
చేసుకుంటారు. ఈ యోగము మరియు చదువు, రెండూ జారిపోయేలాంటివి. అందులోనూ యోగము ఎక్కువగా
జారిపోతుంది. జ్ఞానమైతే బుద్ధిలో ఉండనే ఉంటుంది, ఇకపోతే స్మృతినే ఘడియ, ఘడియ
మర్చిపోతారు. మనము ఏ విధముగా 84 జన్మలను తీసుకుంటాము అన్న జ్ఞానమైతే మీ బుద్ధిలో
ఉండనే ఉంది, ఎవరికైతే ఈ జ్ఞానము ఉందో వారే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు, ఏమిటంటే,
ఎవరైతే మొట్టమొదటి నంబరులోకి వస్తారో వారే 84 జన్మలను తీసుకుంటారు అని. మొదట
ఉన్నతోన్నతులు అని లక్ష్మీ-నారాయణులనే అంటారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ
కూడా ప్రసిద్ధమైనది. పౌర్ణమి నాడు ఎన్నో చోట్ల సత్యనారాయణుని కథ నడుస్తుంది. మనము
నిజంగా బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువును చదువుతాము అని ఇప్పుడు
మీకు తెలుసు. ఇది పావనముగా అయ్యే చదువు మరియు ఇది అన్ని చదువులలో కల్లా చాలా
సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి మరియు ఈ చదువు అనేది అందరికీ ఒక్కటే.
వృద్ధులు, పిల్లలు, యువత, ఎవరైతే ఉన్నారో, అందరికీ ఒకే చదువు ఉంది. చిన్నపిల్లలకు
కూడా హక్కు ఉంది. ఒకవేళ తల్లి-తండ్రులు వారికి కొద్ది-కొద్దిగా నేర్పించినా సరే,
సమయమైతే ఎంతో ఉంటుంది. శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పించడం
జరుగుతుంది. ఆత్మ మరియు శరీరము, రెండింటి తండ్రి వేర్వేరు. బిడ్డ అయిన ఆత్మ
నిరాకారియే, అలాగే ఆత్మిక తండ్రీ నిరాకారుడే. ఆ నిరాకారుడైన శివబాబా మన తండ్రి అని,
వారు ఎంతో చిన్నగా ఉంటారు అని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలను బాగా
గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఆత్మ అయిన మనము కూడా బిందువులా చిన్నగా ఉంటాము.
అలాగని పైకి వెళ్తే పెద్దగా కనిపిస్తుందని, కిందకు వస్తే చిన్నగా అయిపోతుందని కాదు.
అలా కాదు, అది చిన్నని బిందువు. పైకి వెళ్ళినట్లయితే మీకు అది కనిపించను కూడా
కనిపించదు. బిందువు కదా. చూడటానికి బిందువేమి కనిపిస్తుంది. ఈ విషయాల గురించి
పిల్లలు బాగా ఆలోచించాలి కూడా. ఆత్మ అయిన మనము శరీరము ద్వారా పాత్రను అభినయించడానికి
పై నుండి వచ్చాము. ఆత్మ ఏమీ చిన్నగా, పెద్దగా అవ్వదు. ఇంద్రియాలు మొదట చిన్నగా
ఉంటాయి, ఆ తర్వాత పెద్దగా అవుతాయి.
ఇప్పుడు ఏ విధముగా మీరు అర్థం చేసుకున్నారో, అలా ఇతరులకు కూడా అర్థం చేయించాలి.
నంబరువారుగా ఎవరు ఎంతగా చదువుకున్నారో అంతగానే చదివిస్తారు అన్నదైతే తప్పనిసరి.
నేర్పించేందుకు అందరూ టీచరుగా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రిలోనైతే జ్ఞానము ఉంది,
వారు ఇంత చిన్నని పరమ ఆత్మ, సదా పరంధామములో ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమములో
వస్తారు. తండ్రిని పిలవడము కూడా, ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో, అప్పుడే
పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని సుఖవంతులుగా తయారుచేయండి అని అంటారు. బాబా, మీరు
వచ్చి మమ్మల్ని పతిత ప్రపంచము నుండి కొత్త సత్యయుగీ సుఖమయమైన పావన ప్రపంచములోకి
తీసుకువెళ్ళండి లేక అక్కడకు వెళ్ళే దారిని తెలియజేయండి అని మేము పిలుస్తూ వచ్చాము
అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వారు కూడా ఎప్పుడైతే స్వయం వస్తారో, అప్పుడే దారిని
తెలియజేయగలరు. ఎప్పుడైతే ప్రపంచము మారవలసి ఉంటుందో వారు అప్పుడే వస్తారు. ఇవి చాలా
సరళమైన విషయాలు, వీటిని నోట్ చేసుకోవాలి. బాబా ఈ రోజు ఇది అర్థం చేయించారు, నేను
కూడా ఇలా అర్థం చేయిస్తాను అని అనుకోవాలి. ఇలా అభ్యాసము చేస్తూ, చేస్తూ ఉంటే నోరు
తెరుచుకుంటుంది. మీరు మురళీధరుని పిల్లలు, మీరు మురళీధరులుగా తప్పకుండా అవ్వాలి.
ఎప్పుడైతే ఇతరుల కళ్యాణాన్ని చేస్తారో, అప్పుడే కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని
పొందుతారు. ఆ చదువు అనేది ఇక్కడి కోసమే, కానీ ఇది భవిష్య కొత్త ప్రపంచము కోసము.
అక్కడైతే సదా సుఖమే ఉంటుంది. అక్కడ విసిగించే పంచ వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ మనము
రావణ రాజ్యములో అనగా పరాయి రాజ్యములో ఉన్నాము. మీరే మొదట మీ రాజ్యములో ఉండేవారు.
మీరు కొత్త ప్రపంచము అని అంటారు, తర్వాత భారత్ నే పాత ప్రపంచము అని అంటారు. కొత్త
ప్రపంచములో భారత్... అని అంటారు. అంతేకానీ కొత్త ప్రపంచములో ఇస్లాములు, బౌద్ధులు అని
అనరు. అలా అనరు. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొలుపుతారు అని ఇప్పుడు మీ
బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రయే ఇలా ఉంది. భారత్ నే వారు వచ్చి స్వర్గముగా
తయారుచేస్తారు. భారత్ యే మొదటి దేశము. మొదటి దేశమైన భారత్ నే స్వర్గము అని అంటారు.
భారత్ యొక్క ఆయువు కూడా లిమిటెడ్ గా ఉంటుంది. లక్షల సంవత్సరాలు అని అన్నట్లయితే అది
అన్ లిమిటెడ్ అయిపోతుంది. లక్షల సంవత్సరాల విషయమేదీ స్మృతిలోకి రానే రాలేదు. కొత్త
భారత్ ఉండేది, ఇప్పుడు దానిని పాత భారత్ అనే అంటారు. భారత్ యే కొత్త ప్రపంచముగా
ఉంటుంది. మనము ఇప్పుడు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు.
తండ్రి సలహా ఇచ్చారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ కొత్తగా, పవిత్రముగా
అయిపోతుంది, అప్పుడు శరీరము కూడా కొత్తగా లభిస్తుంది. ఆత్మ మరియు శరీరము, రెండూ
సతోప్రధానముగా అవుతాయి. మీకు రాజ్యము సుఖము కొరకే లభిస్తుంది. ఈ డ్రామా కూడా అనాదిగా
తయారుచేయబడి ఉంది. కొత్త ప్రపంచములో సుఖము మరియు శాంతి ఉంటాయి. అక్కడ తుఫానులు
మొదలైనవేవీ ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతిగా అయిపోతారు. ఇక్కడ అశాంతి ఉంది
కావున అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగములో అంతా శాంతిగానే ఉంటారు. ఇవి అద్భుతమైన
విషయాలు కదా. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన ఆట. ఇవి అనంతమైన విషయాలు. వారు
హద్దులోని బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో
అనంతమైన జ్ఞానము ఉంది. ఒకేసారి తండ్రి వచ్చి అనంతమైన డ్రామా రహస్యాన్ని అర్థం
చేయిస్తారు. అనంతమైన డ్రామా ఎలా నడుస్తుంది అన్న మాట కూడా ఇంతకుముందు వినలేదు.
ఇప్పుడు అర్థం చేసుకున్నారు - సత్య, త్రేతాయుగాలు తప్పకుండా గతించిపోయాయి, అందులో
వీరి రాజ్యము ఉండేది, త్రేతాలో రామ రాజ్యము ఉండేది, ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలు
వచ్చాయి, ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు... ఇలా అన్ని ధర్మాల గురించి పూర్తిగా
తెలుసు. ఇవన్నీ ఈ 2500 సంవత్సరాలలోనే వచ్చాయి. అందులో 1250 సంవత్సరాలు కలియుగము.
లెక్క అంతా ఉంది కదా. సృష్టి ఆయువే 2500 సంవత్సరాలు అని కాదు. అలా కాదు. అచ్ఛా, ఇంకా
ఎవరు ఉండేవారు అన్నది కూడా ఆలోచించడం జరుగుతుంది. వీరికంటే ముందు తప్పకుండా
దేవీ-దేవతలు ఉండేవారు, వారు కూడా మనుష్యులే కదా, కానీ వారు దైవీ గుణాలు కలవారిగా
ఉండేవారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు 2500 సంవత్సరాలు ఉంటారు, మిగిలిన సగభాగములో
వారందరూ ఉండేవారు. దీనికన్నా ఎక్కువ లెక్క అయితే ఏదీ వెలువడలేదు. మొత్తము, ముప్పావు,
సగము, పావు... ఇలా నాలుగు భాగాలున్నాయి. నియమానుసారముగా భాగాలుగా చేస్తారు కదా. సగము
సమయమైతే వీరు ఉన్నారు. సత్యయుగములో సూర్యవంశీ రాజ్యము, త్రేతాలో చంద్రవంశీ రామ
రాజ్యము అని అంటారు కూడా - దీనిని మీరు నిరూపించి చెప్తారు. కావున ఎవరైతే మొట్టమొదట
సత్యయుగములోకి వస్తారో, తప్పకుండా అందరికన్నా ఎక్కువ ఆయువు వారికే ఉంటుంది. కల్పమే
5000 సంవత్సరాలది. వారు 84 లక్షల యోనులు అని అనేస్తారు, కావున కల్పము ఆయువును కూడా
లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. దానిని ఎవరూ అంగీకరించలేరు కూడా. అంత పెద్ద
ప్రపంచము ఉండలేదు కూడా. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - అదంతా
అజ్ఞానము మరియు ఇది జ్ఞానము. జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది, ఇది కూడా ఎవరికీ
తెలియదు. జ్ఞానసాగరుడు అయితే ఒక్క తండ్రే, వారే ముఖము ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు.
గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా మిమ్మల్నందరినీ దత్తత తీసుకుంటారు. ఈ కొద్ది
విషయాలను అర్థం చేయించడమైతే చాలా సహజము. ఒకరోజు అర్థం చేయించి వదిలేస్తే ఇక బుద్ధి
ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. స్కూల్లో ఒక రోజు చదివిస్తారా లేక రెగ్యులర్ గా
చదువుకోవలసి ఉంటుందా! జ్ఞానాన్ని ఒక్క రోజులో అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి
మనల్ని చదివిస్తున్నారు కావున తప్పకుండా చదువు కూడా అనంతమైనదే ఉంటుంది. వారు
అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. భారత్ లో అనంతమైన రాజ్యము ఉండేది కదా. ఈ
లక్ష్మీ-నారాయణులు అనంతమైన రాజ్యాన్ని పరిపాలించేవారు. వీరు రాజ్యాన్ని ఎలా
తీసుకున్నారు అని అడిగేందుకు అసలు ఈ విషయాలు ఎవరికీ స్వప్నములో కూడా లేవు. వారిలో
పవిత్రత ఎక్కువ ఉండేది, వారు యోగులు కదా, అందుకే ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. మనమే
యోగులుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మలు తీసుకుని భోగులుగా కూడా తప్పకుండా అవ్వాలి.
వీరు కూడా తప్పకుండా పునర్జన్మలలోకి వచ్చి ఉంటారని మనుష్యులకు తెలియదు. వీరిని
భగవాన్, భగవతి అని అనరు. వీరి కన్నా ముందు 84 జన్మలను తీసుకునేవారు ఇంకెవరూ లేరు.
మొట్టమొదట ఎవరైతే సత్యయుగములో రాజ్యము చేస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ
నంబరువారుగా కిందకు వస్తారు. ఆత్మయైన మనమే దేవతగా అవుతాము, మళ్ళీ మనమే క్షత్రియులుగా...
అవుతాము. డిగ్రీ తగ్గుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు అని కూడా అంటూ ఉంటారు.
సతోప్రధానుల నుండి మళ్ళీ తమోప్రధానులుగా అవుతారు. ఇలా పునర్జన్మలు తీసుకుంటూ,
తీసుకుంటూ కిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజము. కానీ మాయ ఎటువంటిదంటే అది అన్ని
విషయాలనూ మరపింపజేస్తుంది. ఈ పాయింట్లన్నింటినీ పోగు చేసి పుస్తకము మొదలైనవి
తయారుచేయవచ్చు కానీ అవేవీ ఉండవు. అవి అల్పకాలికముగానే ఉంటాయి. తండ్రి గీతనేమీ
వినిపించలేదు. తండ్రి ఇప్పుడు ఎలా అయితే అర్థం చేయిస్తున్నారో, అలాగే అర్థం
చేయించారు. ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. ఈ మొత్తమంతా ఏదైతే ఉందో,
అంతా వినాశనము జరిగినప్పుడు తగలబడిపోతుంది. సత్య-త్రేతాయుగాల్లో పుస్తకాలేవీ ఉండవు,
అవి మళ్ళీ భక్తి మార్గములో తయారవుతాయి. ఎన్ని వస్తువులు తయారవుతాయి. రావణుడిని కూడా
తయారుచేస్తారు కానీ తెలుసుకోకుండా తయారుచేస్తారు. ఏమీ చెప్పలేకపోతారు. తండ్రి అర్థం
చేయిస్తారు, అతడిని ప్రతి సంవత్సరమూ తయారుచేస్తారు మరియు కాలుస్తారు, కావున
తప్పకుండా అతను పెద్ద శత్రువే కదా. కానీ అతను ఏ విధముగా శత్రువు అవుతాడు అనేది
ఎవరికి తెలియదు. సీతను అపహరించాడు కావున అతను శత్రువేమో అని అనుకుంటారు. రాముని
సీతను అపహరించాడు కావున అతను పెద్ద బందిపోటే కదా. ఎప్పుడు అపహరించాడు? త్రేతాలో
అనాలా లేక త్రేతా అంతిమములోనా. ఈ విషయాల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. ఎప్పుడో
అయితే అపహరించి ఉంటాడు! ఏ రాముని యొక్క సీత అపహరించబడింది? సీతా-రాముల రాజధాని కూడా
నడిచిందా? ఒక్క సీతా-రాములే ఉండేవారా? శాస్త్రాలలో ఈ విషయాలను ఒక కథగా వ్రాశారు. ఏ
సీత అని ఆలోచించడం జరుగుతుంది. సీతా-రాములు 12 మంది ఉంటారు కదా. మరి అందులో ఏ సీతను
అపహరించాడు? తప్పకుండా చివరి సీతనే అపహరించి ఉంటాడు. రాముని సీత అపహరించబడింది అని
అంటారు. వాస్తవానికి రాముని రాజ్యములో మొత్తం సమయమంతా ఒక్కరి రాజ్యమే ఉండదు కదా.
తప్పకుండా వంశావళి ఉంటుంది. మరి ఏ నంబరు సీత అపహరించబడింది? ఇవన్నీ చాలా అర్థం
చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలను అర్థం
చేయించవచ్చు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గములో మనుష్యులు ఎంతగా ఎదురుదెబ్బలు
తింటూ, తింటూ దుఃఖితులుగా అయిపోయారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అవుతారో, అప్పుడు -
బాబా, ఈ దుఃఖము నుండి విడిపించండి అని ఆర్తనాదాలు చేస్తారు. రావణుడు అంటూ ఎవరూ లేరు
కదా. ఉన్నట్లయితే తమ రాజును మరి ప్రతి సంవత్సరమూ ఎందుకు కాలుస్తారు! ఆ రావణునికి
తప్పకుండా భార్య కూడా ఉంటుంది. మండోదరిని చూపిస్తారు. మండోదరి బొమ్మను తయారుచేసి
కాల్చడమనేది ఎప్పుడూ చూడలేదు. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇదంతా
అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము. ఇప్పుడు మీరు అసత్యమైన మానవుల నుండి సత్యమైన
దేవతలుగా అవ్వడానికి కూర్చున్నారు. తేడా అయితే ఉంది కదా! అక్కడైతే ఎల్లప్పుడూ సత్యమే
చెప్తారు. అది సత్యఖండము. ఇది అసత్యఖండము. కావున ఇక్కడ అసత్యమే చెప్తూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.