17-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీ అతిథిగా అయి వచ్చారు కావున
మీరు గౌరవించాలి, ఏ విధంగా ప్రేమతో పిలిచారో అలా వారిని గౌరవించాలి కూడా,
అగౌరవపరచకూడదు’’
ప్రశ్న:-
ఏ నషా
పిల్లలైన మీకు సదా ఎక్కి ఉండాలి? ఒకవేళ నషా ఎక్కకపోతే ఏమంటారు?
జవాబు:-
ఉన్నతోన్నతుడైన ఆసామి ఈ పతిత ప్రపంచములో మన అతిథిగా అయి వచ్చారు, ఈ నషా సదా ఎక్కి
ఉండాలి. కానీ నంబరువారుగా ఈ నషా ఎక్కుతుంది. కొందరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి
కూడా సంశయబుద్ధికలవారిగా అయి చేతిని వదిలి వెళ్ళిపోతే, ఇక వీరి భాగ్యము అని అంటారు.
ఓంశాంతి
ఓం శాంతి. రెండు సార్లు అనవలసి ఉంటుంది. ఒకరేమో బాబా, ఇంకొకరు దాదా అనైతే పిల్లలకు
తెలుసు. ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. భగవంతునికి మహిమ కూడా ఎంత ఉన్నతముగా చేస్తారు
కానీ ఆ పదము ఎంత సింపుల్ గా ఉంది - గాడ్ ఫాదర్. కేవలం ఫాదర్ అని అనరు, గాడ్ ఫాదర్,
వారు ఉన్నతోన్నతమైనవారు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పిలిచేది కూడా
పతిత ప్రపంచములోనే. నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు అని వారు స్వయంగా వచ్చి
తెలియజేస్తున్నారు కానీ వారు ఎలా పతిత-పావనుడు, ఎప్పుడు వస్తారు, ఇది ఎవ్వరికీ
తెలియదు. అర్ధకల్పము సత్యయుగ, త్రేతాలో ఎవరి రాజ్యము ఉండేది, అది ఎలా ఏర్పడింది, ఇది
ఎవ్వరికీ తెలియదు. పతిత-పావనుడైన తండ్రి రావడం కూడా తప్పకుండా వస్తారు, వారిని
కొందరు పతిత-పావనా అని అంటారు, కొందరు ముక్తిదాత అని అంటారు. స్వర్గములోకి
తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు కదా. మీరు వచ్చి
భారతవాసులైన మమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేయండి అని వారిని పతిత ప్రపంచములోకి
పిలుస్తారు. వారి పొజిషన్ ఎంత గొప్పది. హైయ్యెస్ట్ అథారిటీ. రావణ రాజ్యమున్నప్పుడు
వారిని పిలుస్తారు. లేకపోతే ఈ రావణ రాజ్యము నుండి ఎవరు విడిపిస్తారు? ఈ విషయాలన్నీ
పిల్లలైన మీరు విన్నప్పుడు నషా కూడా ఎక్కి ఉండాలి. కానీ ఇంతటి నషా ఎక్కడం లేదు.
మద్యపానం యొక్క నషా అందరికీ ఎక్కుతుంది, ఇది ఎక్కదు. ఇందులో ధారణకు సంబంధించిన
విషయము, భాగ్యానికి సంబంధించిన విషయం ఉన్నాయి. కావున తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో
కూడా కొందరికి పూర్తి నిశ్చయము ఉంటుంది. నిశ్చయము ఒకవేళ అందరికీ ఉన్నట్లయితే మరి
సంశయములోకి వచ్చి ఎందుకు పారిపోతారు? తండ్రిని మర్చిపోతారు. తండ్రికి చెందినవారిగా
అయ్యాక, ఇక తండ్రి పట్ల ఎటువంటి సంశయబుద్ధి ఉండజాలదు. కానీ ఈ తండ్రి అద్భుతమైనవారు.
గాయనము కూడా ఉంది - ఆశ్చర్యము కలిగించేలా బాబాను తెలుసుకుంటారు, బాబా అని అంటారు,
జ్ఞానాన్ని వింటారు, వినిపిస్తారు, అహో మాయ, అయినా సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ భక్తి మార్గపు శాస్త్రాలలో ఏ సారము లేదు. తండ్రి
అంటారు, నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా కష్టం మీద ఎవరో నిలవగలరు.
ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదు అని మీరు కూడా ఫీల్ అవుతారు. ఆత్మ అయిన మనము బిందువు,
బాబా కూడా బిందువు, వారు మన తండ్రి, వారికి తమ శరీరమంటూ ఏదీ లేదు. వారు అంటారు, నేను
ఈ తనువును ఆధారముగా తీసుకుంటాను. నా పేరు శివ. ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు. మీ
శరీరాల పేర్లు మారతాయి. శరీరాలకే పేరు పెడతారు. వివాహము జరిగితే పేరు మారిపోతుంది.
ఆ తర్వాత ఇక ఆ పేరును పక్కా చేసుకుంటారు. కావున ఇప్పుడు తండ్రి అంటారు - నేను ఆత్మను
అని ఇక్కడ మీరు ఇది పక్కా చేసుకోండి. తండ్రియే ఇచ్చిన పరిచయమేమిటంటే -
ఎప్పుడెప్పుడైతే అత్యాచారాలు మరియు గ్లాని జరుగుతుందో, అప్పుడు నేను వస్తాను. కొన్ని
పదాలను కూడా పట్టుకోకూడదు. తండ్రి స్వయం అంటారు, నన్ను రాయి-రప్పలలోకి తోసి ఎంతగా
గ్లాని చేస్తారు, ఇది కూడా కొత్త విషయము కాదు. కల్ప-కల్పమూ ఈ విధంగా పతితముగా
అవుతారు మరియు నిందిస్తారు, అప్పుడే నేను వస్తాను. ఇది కల్ప-కల్పము యొక్క నా పాత్ర.
ఇందులో మార్పులు-చేర్పులు జరగవు. డ్రామాలో నిశ్చితమై ఉంది కదా. మిమ్మల్ని కొందరు
అడుగుతారు - వారు కేవలం భారత్ లోనే వస్తారా! కేవలం భారత్ యే స్వర్గముగా అవుతుందా
ఏమిటి? అవును. ఇది అనాది-అవినాశీ పాత్ర అయ్యింది కదా. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారు.
పతితులను పావనముగా తయారుచేసే తండ్రి అంటారు, నన్ను ఈ పతిత ప్రపంచములోకే పిలుస్తారు.
నేనైతే సదా పావనుడను. నన్ను పావన ప్రపంచములోకి పిలవాలి కదా! కానీ అలా కాదు, పావన
ప్రపంచములోకి పిలవాల్సిన అవసరమే లేదు. మీరు వచ్చి పావనముగా చేయండి అని పతిత
ప్రపంచములోకే పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పము నుండి నన్ను స్మృతి
చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలుస్తే, మహా అయితే ఒకటి-రెండు
సంవత్సరాలు పిలుస్తారు. ఫలానావారు ఈ సంవత్సరము కాకపోతే మరుసటి సంవత్సరము వస్తారు అని
అనుకుంటారు. వీరినైతే అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర
అయితే నిశ్చితమై ఉంది. ఇది ఎవ్వరికీ తెలియదు. వారు చాలా ఉన్నతోన్నతుడైన తండ్రి.
మనుష్యులు తండ్రిని ఒకవైపు చాలా ప్రేమతో పిలుస్తారు, ఇంకొకవైపు మహిమలో మచ్చలు
వేసేస్తారు. వాస్తవానికి వీరు అత్యంత గొప్ప గెస్ట్ ఆఫ్ హానర్ (గొప్ప మహిమ గల అతిథి),
వీరి ఆనర్ పై (మహిమపై) మచ్చ వేసేసారు, రాయి-రప్పలు అన్నింటిలోనూ ఉన్నారు అని
అనేస్తారు. వారు ఎంత హైయ్యెస్ట్ అథారిటీ, వారిని పిలవడం కూడా చాలా ప్రేమతో
పిలుస్తారు, కానీ పిలుస్తున్నవారు పూర్తిగా తెలివితక్కువవారిలా ఉన్నారు. నేను మీ
తండ్రిని అని నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను. నన్ను గాడ్ ఫాదర్ అంటారు. ఎప్పుడైతే
అందరూ రావణుడి జైలులో ఖైదిగా అవుతారో అప్పుడే తండ్రికి రావలసి ఉంటుంది ఎందుకంటే
అందరూ భక్తురాళ్ళు అనగా వధువులు - సీతలు. తండ్రి వరుడు - రాముడు. ఇది ఒక్క సీతకు
సంబంధించిన విషయము కాదు, సీతలందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. ఇది అనంతమైన
విషయము. ఇది పాత పతిత ప్రపంచము. ఇది పాతదిగా అవ్వడము, మళ్ళీ కొత్తదిగా అవ్వడము, అంతా
ఏక్యురేట్, ఈ శరీరము మొదలైనవైతే కొన్ని చాలా త్వరగా పాతవిగా అవుతాయి, కొన్ని ఎక్కువ
కాలము నడుస్తాయి. ఇది డ్రామాలో ఏక్యురేట్ గా నిశ్చితమై ఉంది. పూర్తి 5 వేల
సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రావలసి ఉంటుంది. నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను
మరియు సృష్టి చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికీ నా పరిచయమూ లేదు,
అలాగే బ్రహ్మా, విష్ణు, శంకరుల యొక్క, లక్ష్మీ-నారాయణలు, సీతా-రాముల యొక్క పరిచయమూ
లేదు. డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్రధారులైతే వీరే. వాస్తవానికి ఇది మనుష్యులకు
సంబంధించిన విషయము. 8-10 భుజాలు కలిగిన మనుష్యులెవ్వరూ ఉండరు. విష్ణువుకు 4 భుజాలు
ఎందుకు చూపిస్తారు? రావణుడి యొక్క 10 తలలు ఏమిటి? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రియే
వచ్చి మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు. వారంటారు, నేను
అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తమైనవాడిని. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు.
కానీ తెలిసినా కూడా మళ్ళీ మర్చిపోతారు. వారిపై ఎంత గౌరవాన్ని ఉంచాలి, వారిని స్మృతి
చేయాలి. ఆత్మ కూడా నిరాకారియే, పరమాత్మ కూడా నిరాకారుడే, ఇందులో ఫొటో యొక్క విషయము
కూడా లేదు. మీరైతే ఆత్మ అని నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి,
దేహాభిమానాన్ని వదలాలి. మీరు సదా అవినాశీ వస్తువునే చూడాలి. మీరు వినాశీ దేహాన్ని
ఎందుకు చూస్తారు! దేహీ-అభిమానులుగా అవ్వండి, ఇందులోనే శ్రమ ఉంది. ఎంతగా స్మృతిలో
ఉంటారో అంతగా కర్మాతీత అవస్థను పొంది ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన
యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. యోగమైతే అనేక రకాలవి ఉన్నాయి. స్మృతి అనే పదమే
యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడములోనే శ్రమ ఉంది. మేము ఇంత సమయము
స్మృతిలో ఉన్నాము అని ఎవరో అరుదుగా సత్యము చెప్తారు. స్మృతియే చేయకపోతే మరి
వినిపించడానికి సిగ్గు అనిపిస్తుంది. రోజంతటిలో ఒక గంట స్మృతిలో ఉన్నాము అని
వ్రాస్తారు, అంటే సిగ్గుగా అనిపించాలి కదా. ఇటువంటి తండ్రిని ఎవరినైతే పగలు-రాత్రి
స్మృతి చేయాలో, వారిని మనము కేవలం ఒక గంట మాత్రమే స్మృతి చేస్తున్నామా! ఇందులో చాలా
గుప్తమైన శ్రమ ఉంది. తండ్రిని పిలుస్తున్నామంటే వారు దూరము నుండి వచ్చిన అతిథి
అయినట్లు కదా. తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచములోని అతిథిగా అవ్వను. నేను వచ్చేదే
పాత ప్రపంచములో. నేను వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచము, ఇది
కూడా ఎవ్వరికీ యథార్థముగా తెలియదు. కొత్త ప్రపంచము యొక్క ఆయువు గురించే తెలియదు.
తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని నేనే వచ్చి ఇస్తాను, మళ్ళీ డ్రామానుసారముగా ఈ జ్ఞానము
మాయమైపోతుంది. మళ్ళీ కల్పము తర్వాత ఈ పాత్ర రిపీట్ అవుతుంది. నన్ను పిలుస్తారు,
ప్రతి సంవత్సరము శివజయంతిని జరుపుతారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి
వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరము జరుపుతారు. శివబాబాకు కూడా 12 నెలలు తర్వాత
జయంతిని జరుపుతారు, కానీ ఎప్పటినుండి జరుపుతూ వచ్చారు, ఇది ఎవ్వరికీ తెలియదు. కేవలం
లక్షల సంవత్సరాలు గడిచాయి అని అనేస్తారు, అంటే కలియుగ ఆయువునే లక్షల సంవత్సరాలు అని
వ్రాసేసారు. తండ్రి అంటారు - ఇది 5000 సంవత్సరాల విషయము. తప్పకుండా ఈ దేవతలది భారత్
లో రాజ్యము ఉండేది కదా. కావున తండ్రి అంటారు - నేను భారత్ కు చాలా గొప్ప అతిథిని,
నాకు అర్ధకల్పము నుండి ఎన్నో ఆహ్వానాలు ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా
అవుతారో, అప్పుడు - ఓ పతిత-పావనా రండి అని అంటారు. నేను వచ్చింది కూడా పతిత
ప్రపంచములో. రథమైతే నాకు కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి, ఆత్మకు ఇది సింహాసనము. తండ్రి
కూడా అకాలమూర్తియే, వచ్చి ఈ సింహాసనముపై విరాజమానమవుతారు. ఇవి చాలా రమణీకమైన విషయాలు.
ఇంకెవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, నా మతముపై నడవండి.
శివబాబాయే మతము ఇస్తారు, శివబాబాయే మురళి నడిపిస్తారు అని భావించండి. వీరు అంటారు,
నేను కూడా వారి మురళిని వినే మ్రోగిస్తాను. వినిపించేవారైతే వారు కదా. వీరు నంబరు
వన్ పూజ్యుడిగా, మళ్ళీ వీరే నంబరు వన్ పూజారిగా అయ్యారు. ఇప్పుడు వీరు పురుషార్థీ.
పిల్లలు సదా - మాకు శివబాబా శ్రీమతము లభించింది అని భావించాలి. ఒకవేళ ఏదైనా విషయము
తలకిందులైనా కూడా వారు దానిని సరి చేసేస్తారు. ఇటువంటి ఎడతెగని నిశ్చయము ఉన్నట్లయితే
బాధ్యత శివబాబాది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. విఘ్నాలైతే వచ్చేదే ఉంది, చాలా
కఠినాతి కఠినమైన విఘ్నాలు వస్తాయి. తమ పిల్లల ద్వారా కూడా విఘ్నాలు కలుగుతాయి.
కావున ఎల్లప్పుడూ, శివబాబాయే అర్థం చేయిస్తున్నారు అని భావించండి, అప్పుడు స్మృతి
ఉంటుంది. చాలామంది పిల్లలు, ఈ బ్రహ్మాబాబా మతము ఇస్తున్నారు అని భావిస్తారు కానీ అలా
కాదు. శివబాబాదే బాధ్యత. కానీ దేహాభిమానము ఉన్నట్లయితే ఘడియ-ఘడియ వీరినే చూస్తూ
ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి, అయినా కూడా రైల్వేవారు మొదలైనవారికి ఏమీ తెలియదు,
నిరాకారుడిని ఎలా తెలుసుకోగలరు మరియు అర్థం చేసుకోగలరు. వారైతే అనారోగ్యంపాలు అవ్వరు.
వ్యాధులు మొదలైనవాటికి గల కారణాన్ని తెలియజేస్తారు. వీరిలో ఎవరు ఉన్నారు అనేది
వారికేమి తెలుసు? పిల్లలైన మీకు కూడా నంబరువారుగా తెలుసు. వారు సర్వాత్మలకు తండ్రి
మరియు ఈ ప్రజాపిత మనుష్యులకు తండ్రి. కావున వీరిరువురూ (బాప్ దాదా) ఎంత గొప్ప
అతిథులు అయినట్లు.
తండ్రి అంటారు, ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో నిశ్చితమై ఉంది, నేను కూడా డ్రామా
యొక్క బంధనములో బంధింపబడి ఉన్నాను. నిశ్చితమై లేకపోతే ఏమీ చేయలేను. మాయ కూడా చాలా
శక్తివంతమైనది. రాముడు మరియు రావణుడు, ఇరువురి పాత్ర ఉంది. డ్రామాలో రావణుడు
చైతన్యమై ఉన్నట్లయితే - నేను కూడా డ్రామానుసారముగా వస్తాను అని అంటాడు. ఇది దుఃఖము
మరియు సుఖము యొక్క ఆట. సుఖము కొత్త ప్రపంచములో ఉంటుంది, దుఃఖము ప్రాత ప్రపంచములో
ఉంటుంది. కొత్త ప్రపంచములో తక్కువమంది మనుష్యులు ఉంటారు, పాత ప్రపంచములో ఎంత
ఎక్కువమంది మనుష్యులు ఉన్నారు. మీరు వచ్చి పావన ప్రపంచాన్ని తయారుచేయండి అని
పతిత-పావనుడైన తండ్రినే పిలుస్తారు ఎందుకంటే పావన ప్రపంచములో చాలా సుఖము ఉండేది,
అందుకే కల్ప-కల్పము పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు
మళ్ళీ పాత్ర రిపీట్ అవుతుంది. ప్రపంచము ఎప్పుడూ అంతమవ్వదు. అంతమవ్వడము అసంభవము.
సముద్రము కూడా ప్రపంచములోనే ఉంది కదా. ఇది మూడవ అంతస్థు కదా. జలమయమైపోతుంది, మొత్తం
నీరు-నీరు అయిపోతుంది అని అంటారు, అయినా కూడా భూమి అనేది అంతస్థు కదా. నీరు కూడా
ఉంది కదా. భూమి అనే అంతస్థు ఏమీ వినాశనమవ్వదు. నీరు కూడా ఈ అంతస్థులోనే ఉంటుంది.
రెండవ మరియు ఒకటవ అంతస్థులైన, సూక్ష్మవతనము మరియు మూలవతనములోనైతే నీరు ఉండదు. ఈ
అనంతమైన సృష్టికి మూడు అంతస్థులు ఉన్నాయి, వాటి గురించి పిల్లలైన మీకు తప్ప
ఇంకెవ్వరికీ తెలియదు. ఈ సంతోషకరమైన విషయాన్ని అందరికీ సంతోషముగా వినిపించాలి. ఎవరైతే
పూర్తిగా పాస్ అవుతారో, వారి విషయములోనే అతీంద్రియ సుఖము అని గాయనముంది. ఎవరైతే
రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉంటారో, సేవే చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషము
ఉంటుంది. కొన్ని-కొన్ని సార్లు మనుష్యులు రాత్రివేళలో కూడా మేలుకుని ఉండే రోజులు
వస్తాయి, కానీ ఆత్మ అలసిపోతుంది కావున నిద్రించవలసి ఉంటుంది. ఆత్మ నిద్రించడంతో
శరీరము కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరము కూడా నిద్రపోదు. అలసిపోయేది
ఆత్మ. ఈ రోజు నేను అలసిపోయాను - ఇలా ఎవరు అన్నారు? ఆత్మ. పిల్లలైన మీరు
ఆత్మాభిమానులుగా అయి ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకపోతే,
దేహీ-అభిమానులుగా ఉండకపోతే, ఇక దేహ సంబంధీకులు మొదలైనవారు గుర్తుకు వచ్చెస్తారు.
తండ్రి అంటారు, మీరు వివస్త్రముగా వచ్చారు, మళ్ళీ వివస్త్రముగానే వెళ్ళాలి. ఈ దేహ
సంబంధాలు మొదలైనవి మర్చిపోండి. ఈ శరీరములో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానముగా
అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ. పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి
అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని, అందరూ సాధారణమైనవారే. పతిత-పావనుడైన తండ్రి
వచ్చారు, ఇది తెలిసిపోతే ఇక ఎంత గుంపు ఏర్పడిపోతుందో తెలియదు. గొప్ప-గొప్ప వ్యక్తులు
వచ్చినప్పుడు ఎంత గుంపు చేరుకుంటుంది. డ్రామాలో వీరి పాత్రయే గుప్తముగా ఉండేది ఉంది.
మున్ముందు నెమ్మది-నెమ్మదిగా ప్రభావము పడుతుంది మరియు వినాశనమైపోతుంది. అందరూ ఏమీ
కలుసుకోలేరు. తలచుకుంటారు కదా, కావున వారికి తండ్రి పరిచయము లభిస్తుంది. మిగిలినవారు
చేరుకోలేరు. ఏ విధంగా బంధనములో ఉన్న కుమార్తెలు కలుసుకోలేకపోతారు, ఎన్ని అత్యాచారాలు
సహిస్తారు. వికారాలను వదల్లేకపోతారు. ఇలా అయితే సృష్టి ఎలా నడుస్తుంది అని అంటారు.
అరే, సృష్టి యొక్క బాధ్యత తండ్రిపై ఉందా లేక మీపై ఉందా? తండ్రిని తెలుసుకున్నట్లయితే
ఇక ఇటువంటి ప్రశ్నలు అడగరు. మీరు చెప్పండి, మొదట తండ్రినైతే తెలుసుకోండి, ఆ తర్వాత
మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. అర్థం చేయించేందుకు కూడా యుక్తి కావాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా హైయ్యెస్ట్ అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశీ దేహాన్ని
చూడకుండా దేహీ-అభిమానులుగా అయ్యే కృషి చేయాలి. స్మృతి యొక్క సత్యాతి-సత్యమైన
చార్టును పెట్టాలి.
2. రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషములో ఉండాలి. మూడు లోకాల
రహస్యాన్ని అందరికీ సంతోషముగా అర్థం చేయించాలి. శివబాబా ఏ శ్రీమతాన్ని అయితే ఇస్తారో,
దానిపై ఎడతెగని నిశ్చయము పెట్టుకుని నడవాలి, ఏవైనా విఘ్నాలు వస్తే భయపడకూడదు,
బాధ్యత శివబాబాది, అందుకే సంశయము రాకూడదు.
వరదానము:-
శ్రేష్ఠ వేళ యొక్క ఆధారముపై సర్వ ప్రాప్తుల యొక్క అధికారాన్ని
అనుభవం చేసే పదమాపదమ భాగ్యశాలీ భవ
ఎవరైతే శ్రేష్ఠ వేళలో జన్మ తీసుకునే భాగ్యశాలీ పిల్లలు
ఉన్నారో, వారు కల్పపూర్వపు టచింగ్ యొక్క ఆధారముపై జన్మించడముతోనే నా వారు అన్న
అనుభవం చేస్తారు. వారు జన్మించడముతోనే సర్వ ఆస్తులకు అధికారులుగా అవుతారు. ఏ విధంగా
బీజములో మొత్తం వృక్షము యొక్క సారము ఇమిడి ఉందో, అలాగే నంబర్ వన్ వేళలోని ఆత్మలు
సర్వ స్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానా విషయములో రావడముతోనే అనుభవజ్ఞులుగా అయిపోతారు.
సుఖము అనుభవమవుతుంది, శాంతి అవ్వడం లేదు, శాంతి అనుభవమవుతుంది, సుఖము లేక శక్తి
అనుభవమవ్వడం లేదు అని వారు ఎప్పుడూ ఈ విధంగా అనరు. వారు సర్వ అనుభవాలతో సంపన్నముగా
ఉంటారు.
స్లోగన్:-
తమ
ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలముగా మరియు
నిర్మానచిత్తముగా అవ్వండి.
అవ్యక్త సూచనలు:-
ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి
సర్వ సంబంధాలు, సర్వ
రసాలు ఒక్కరి నుండి తీసుకునేవారే ఏకాంతప్రియులుగా అవ్వగలరు. ఒక్కరి ద్వారా సర్వ
రసాలు ప్రాప్తించగలవు అన్నప్పుడు ఇక అనేక వైపులకు వెళ్ళవలసిన అవసరమేముంది? కేవలం
‘ఒక్క’ అన్న మాటను గుర్తుంచుకున్నా సరే, అందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది,
స్మృతి కూడా వచ్చేస్తుంది, సంబంధము కూడా వచ్చేస్తుంది, స్థితి కూడా వచ్చేస్తుంది
మరియు వాటితోపాటు ఏదైతే ప్రాప్తి ఉంటుందో, అది కూడా ఆ ‘ఒక్క’ అన్న పదముతో
స్పష్టమవుతుంది. ఒక్కరి స్మృతి, స్థితి ఏకరసము మరియు జ్ఞానము కూడా పూర్తిగా ఒక్కరి
స్మృతికి సంబంధించినదే లభిస్తుంది. ప్రాప్తి కూడా ఏదైతే కలుగుతుందో, అది కూడా
ఏకరసముగా ఉంటుంది.
| | |