17-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - చదువే సంపాదన, చదువు సంపాదనకు ఆధారము,
ఈ చదువు ద్వారానే మీరు 21 జన్మల కొరకు ఖజానాను జమ చేసుకోవాలి’’
ప్రశ్న:-
ఏ
పిల్లలపై బృహస్పతి దశ ఉంటుందో వారిలో ఏ గుర్తులు కనిపిస్తాయి?
జవాబు:-
వారి యొక్క
పూర్తి అటెన్షన్ శ్రీమతముపై ఉంటుంది. చదువును బాగా చదువుతారు. ఎప్పుడూ కూడా ఫెయిల్
అవ్వరు. శ్రీమతాన్ని ఉల్లంఘించేవారే చదువులో ఫెయిల్ అవుతారు, వారిపై మళ్ళీ రాహు దశ
కూర్చుండిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీపై వృక్షపతి అయిన తండ్రి ద్వారా బృహస్పతి దశ
కూర్చుంది.
పాట:-
ఈ పాపపు
ప్రపంచము నుండి...
ఓంశాంతి
ఇది పాపాత్ముల పిలుపు. మీరైతే ఇలా పిలవవలసిన అవసరము లేదు ఎందుకంటే మీరు పావనముగా
అవుతున్నారు. ఇది ధారణ చేయవలసిన విషయము. ఇది చాలా భారీ ఖజానా. స్కూల్లో చదివే చదువు
కూడా ఖజానా వంటిదే కదా. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. భగవంతుడు
చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన సంపాదన ఎందుకంటే
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. సత్యాతి-సత్యమైన ఈ సత్సంగము మొత్తము
కల్పములో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఇప్పుడు
వారు పిలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మీ ఎదురుగా కూర్చుని ఉన్నారు. మనము కొత్త
ప్రపంచము కొరకు పురుషార్థము చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు, అక్కడ దుఃఖము
యొక్క నామ-రూపాలు ఉండవు. మీకు ప్రశాంతత అనేది స్వర్గములో లభిస్తుంది. నరకములో
ప్రశాంతత లేదు. ఇదైతే విషయ సాగరము, కలియుగము కదా. అందరూ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు.
అందరూ భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకునేవారే, అందుకే - బాబా, మేము పతితముగా
అయిపోయాము అని ఆత్మ పిలుస్తుంది. పావనముగా అయ్యేందుకు గంగలో స్నానము చేయడానికి
వెళ్తారు. అచ్ఛా, మరి స్నానము చేసారంటే పావనముగా అయిపోవాలి కదా, మళ్ళీ ఘడియ-ఘడియ
ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు? ఎదురుదెబ్బలు తింటూ మెట్లు కిందకు దిగుతూ-దిగుతూ
పాపాత్ములుగా అయిపోతారు. 84 జన్మల రహస్యాన్ని పిల్లలైన మీకు తండ్రియే కూర్చుని అర్థం
చేయిస్తారు, ఇతర ధర్మాల వారైతే 84 జన్మలు తీసుకోరు. మీ వద్ద ఈ 84 జన్మల యొక్క
చిత్రము (మెట్ల వరుస చిత్రము) చాలా బాగా తయారుచేయబడి ఉంది. కల్పవృక్షము యొక్క
చిత్రము కూడా గీతలో ఉంది. కానీ భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారు, వారు వచ్చి ఏం
చేసారు అనేది ఏమీ తెలియదు. ఇతర ధర్మాలవారికి తమ-తమ శాస్త్రాల గురించి తెలుసు,
భారతవాసులకు ఏ మాత్రమూ తెలియదు. తండ్రి అంటారు, నేను సంగమయుగములోనే స్వర్గాన్ని
స్థాపన చేయడానికి వస్తాను. డ్రామాలో మార్పు జరగదు. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో,
అది ఖచ్చితముగా అదే విధంగా జరగనున్నది. అలాగని అది అలా జరిగి మళ్ళీ మారిపోతుంది అని
కాదు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్రము పూర్తిగా కూర్చుని ఉంది. ఈ 84 జన్మల
చక్రము నుండి మీరు ఎప్పటికీ విముక్తులవ్వలేరు అనగా ఈ ప్రపంచము ఎప్పటికీ అంతమవ్వదు
అని అర్థము. ప్రపంచము యొక్క చరిత్ర-భూగోళము రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ 84 జన్మల
చక్రము యొక్క చిత్రము (మెట్ల వరుస చిత్రము) చాలా అవసరము. త్రిమూర్తి మరియు సృష్టి
చక్రము ముఖ్యమైన చిత్రాలు. ప్రతి యుగము 1250 సంవత్సరాలది అని సృష్టి చక్రము
చిత్రములో చాలా స్పష్టముగా చూపించబడింది. ఇది అంధుల ముందు అద్దము వంటిది. 84 జన్మల
జన్మపత్రి యొక్క అద్దము. తండ్రి పిల్లలైన మీ దశను వర్ణణ చేస్తారు. తండ్రి మీకు
అనంతమైన దశ గురించి తెలియజేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి యొక్క అవినాశీ
దశ కూర్చుంది. ఇక ఆపై అంతా చదువుపై ఆధారపడి ఉంది. కొందరిపై బృహస్పతి దశ, కొందరిపై
శుక్రుని దశ, కొందరిపై రాహు దశ కూర్చుని ఉంది. ఫెయిల్ అయితే రాహు దశ అని అంటారు.
ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. శ్రీమతముపై నడవకపోతే రాహు యొక్క అవినాశీ దశ కూర్చుంటుంది.
అది బృహస్పతి యొక్క అవినాశీ దశ, అది మళ్ళీ రాహు యొక్క దశగా అయిపోతుంది. పిల్లలు
చదువుపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. సెంటరు దూరముగా ఉంది, ఇది ఉంది, అది ఉంది... అని
ఇందులో సాకులు చెప్పకూడదు. నడుచుకుని రావటానికి 6 గంటలు పట్టినా సరే చేరుకోవాలి.
మనుష్యులు యాత్రలకు వెళ్తారు, ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. పూర్వము ఎక్కువగా నడిచి
వెళ్ళేవారు, ఎద్దుల బండిపై కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఇది ఒక పట్టణానికి
సంబంధించిన విషయమే. ఇది తండ్రి యొక్క ఎంత పెద్ద విశ్వవిద్యాలయము, దీని ద్వారా మీరు
ఈ లక్ష్మీ-నారాయణులు వలె తయారవుతారు. ఇంత ఉన్నతమైన చదువు కొరకు దూరమవుతుందని లేదా
తీరిక లేదని కొందరు అంటారు! తండ్రి ఏమి అంటారు? ఈ బిడ్డ యోగ్యముగా లేడు. తండ్రి
ఉన్నతిలోకి తీసుకువెళ్ళేందుకు వస్తే, ఇతను స్వయాన్ని సర్వనాశనము చేసుకుంటున్నాడు.
శ్రీమతము ఏం చెప్తుందంటే - పవిత్రముగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి. కలిసి
ఉంటూ కూడా వికారాలలోకి వెళ్ళకూడదు. మధ్యలో జ్ఞాన-యోగాలనే ఖడ్గము ఉంది, మనమైతే
పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడైతే పతిత ప్రపంచానికి యజమానులుగా
ఉన్నారు కదా. ఆ దేవతలు డబుల్ కిరీటధారులుగా ఉండేవారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత
ప్రకాశ కిరీటము పోతుంది. ఈ సమయములో ప్రకాశ కిరీటము ఎవరిపైనా లేదు. కేవలం ధర్మ
స్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారిపై ఉండవచ్చు ఎందుకంటే ఆ పవిత్ర ఆత్మలు శరీరములోకి
వచ్చి ప్రవేశిస్తారు. ఇదే భారత్ లో డబుల్ కిరీటధారులు కూడా ఉండేవారు, సింగల్
కిరీటధారులు కూడా ఉండేవారు. ఇప్పటికీ కూడా డబుల్ కిరీటధారుల ఎదురుగా సింగల్
కిరీటధారులు తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే వారు పవిత్రమైన మహారాజులు-మహారాణులు.
మహారాజులు రాజుల కంటే కూడా గొప్పవారు. వారి వద్ద పెద్ద-పెద్ద ఆస్తులు ఉంటాయి. సభలో
కూడా ముందు మహారాజులు, వారి వెనుక నంబరువారుగా రాజులు కూర్చుంటారు. వారి దర్బారు
నియమానుసారముగా జరుగుతుంది. ఇది కూడా ఈశ్వరీయ దర్బారు, దీనిని ఇంద్ర సభ అని కూడా
అంటూ ఉంటారు. మీరు జ్ఞానము ద్వారా దేవ కన్యల వలె తయారవుతారు. సుందరముగా ఉన్నవారిని
దేవ కన్య అని అంటారు కదా. రాధా-కృష్ణులది సహజ సిద్ధమైన సౌందర్యము కదా, అందుకే వారిని
సుందర్ అని అంటారు. మళ్ళీ ఎప్పుడైతే కామచితిపై కూర్చుంటారో అప్పుడు వారు కూడా వేరే
నామ-రూపాలతో శ్యామ్ గా (నల్లగా) అవుతారు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. జ్ఞానము,
భక్తి మరియు వైరాగ్యము, ఇవి మూడు విషయాలు. జ్ఞానము ఉన్నతోన్నతమైనది. ఇప్పుడు మీరు
జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. మీకు భక్తి పట్ల వైరాగ్యము ఉంది. ఈ తమోప్రధాన
ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తమవ్వనున్నది, దాని పట్ల వైరాగ్యము ఉంది. కొత్త ఇల్లు
కట్టుకునేటప్పుడు పాతదాని పట్ల వైరాగ్యము ఏర్పడుతుంది కదా. అది హద్దులోని విషయము,
ఇది అనంతమైన విషయము. ఇప్పుడు బుద్ధి కొత్త ప్రపంచము వైపు ఉంది. ఇది పాత ప్రపంచము
నరకము. సత్య-త్రేతాయుగాలను శివాలయము అని అంటారు ఎందుకంటే అది శివబాబా ద్వారా
స్థాపించబడింది కదా. ఇప్పుడు ఈ వేశ్యాలయము పట్ల మీకు అయిష్టము కలుగుతుంది. కొందరికి
అయిష్టము కలగదు. నాశనము చేసే వివాహము చేసుకుని మురికి గుంటలో పడాలనుకుంటారు.
మనుష్యులైతే అందరూ విషయ వైతరణి నదిలో ఉన్నారు, మురికిలో పడి ఉన్నారు. ఒకరికొకరు
దుఃఖమును ఇచ్చుకుంటారు. అమృతాన్ని వదిలి విషము ఎందుకు తాగాలి అని అంటూ ఉంటారు కూడా.
ఏదైతే చెప్తారో దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా
ఉన్నారు. వీరి బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది అనేది తెలివైన టీచరు చూడగానే అర్థం
చేసుకుంటారు. క్లాస్ మధ్యలో ఎవరైనా ఆవలించినా లేక కునికిపాట్లు పడినా, వీరి బుద్ధి
ఇంటి వైపో లేదా వ్యాపార-వ్యవహారాల వైపో భ్రమిస్తుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది.
ఆవలింతలు అలసటకు కూడా గుర్తు. వ్యాపారములో మనుష్యులకు సంపాదన జరుగుతూ ఉన్నట్లయితే
రాత్రి 1-2 గంటల వరకు కూడా కూర్చుని ఉంటారు, ఎప్పుడూ ఆవలింతలు రావు. ఇక్కడైతే తండ్రి
ఎన్ని ఖజానాలను ఇస్తారు. ఆవలించడము నష్టానికి గుర్తు. దివాలా తీసేవారు గుటకలు
మింగుతూ చాలా ఆవలిస్తూ ఉంటారు. మీకైతే ఖజానా తర్వాత ఖజానా లభిస్తూ ఉంటుంది కావున
ఎంత అటెన్షన్ ఉండాలి. చదువుకునే సమయములో ఎవరైనా ఆవలిస్తే వీరి బుద్ధియోగము వేరే
వైపులకు భ్రమిస్తూ ఉంటుందని తెలివైన టీచరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూర్చుని కూడా
ఇళ్ళు-వాకిళ్ళు గుర్తుకొస్తాయి, పిల్లలు గుర్తుకొస్తారు. ఇక్కడైతే మీరు భట్టీలో
ఉండవలసి ఉంటుంది, ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఉదాహరణకు ఎవరైనా 6 రోజులు భట్టీలో
ఉన్నారనుకోండి, చివరిలో వారికి ఎవరైనా గుర్తుకు వచ్చి ఉత్తరము వ్రాసారంటే వారిని
ఫెయిల్ అని అంటారు, మళ్ళీ 7 రోజుల భట్టీని ప్రారంభించాలి. అన్ని రోగాలు తొలగిపోవాలని
7 రోజుల భట్టీలో ఉంచుతారు. మీరు అర్ధకల్పపు మహా రోగులు. కూర్చుని-కూర్చుని ఉండగా
అకాల మృత్యువు సంభవిస్తుంది. సత్యయుగములో ఈ విధంగా ఎప్పుడూ జరగదు. ఇక్కడైతే ఏదో ఒక
రోగము తప్పకుండా ఉంటుంది. మరణించే సమయములో ఆ రోగము వలన ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు.
స్వర్గములో కొద్దిగా కూడా దుఃఖము ఉండదు. అక్కడైతే సమయము వచ్చినప్పుడు అర్థం
చేసుకుంటారు - ఇప్పుడిక సమయము పూర్తయింది, మేము ఈ శరీరాన్ని వదిలి బిడ్డగా అవుతాము
అని. ఇక్కడ కూడా - మేము ఈ విధంగా అవుతాము అని మీకు సాక్షాత్కారము జరుగుతుంది. మేము
బికారి నుండి రాకుమారునిగా అవుతున్నాము అని జ్ఞానము ద్వారా కూడా తెలుసుకుంటారు. మన
లక్ష్యము-ఉద్దేశ్యము ఈ రాధా-కృష్ణులుగా అవ్వడమే. లక్ష్మీ-నారాయణులుగా కాదు,
రాధా-కృష్ణులుగా అవ్వడము ఎందుకంటే పూర్తి 5 వేల సంవత్సరాలు అని వీరికే చెప్తారు.
లక్ష్మీ-నారాయణులకైతే ఎంతైనా 20-25 సంవత్సరాలు తక్కువవుతాయి, అందుకే శ్రీకృష్ణుని
మహిమ ఎక్కువగా ఉంది. రాధా-కృష్ణులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారని కూడా ఎవరికీ
తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది చదువు. ప్రతి ఊరిలోనూ
సెంటర్లు తెరుస్తూ వెళ్తారు. ఇది మీ విశ్వవిద్యాలయము మరియు హాస్పిటల్. ఇందులో కేవలము
మూడు అడుగుల భూమి కావాలి. ఇది అద్భుతము కదా. ఎవరి అదృష్టములోనైనా ఉంటే వారు తమ గదిలో
కూడా సత్సంగాన్ని తెరుస్తారు. ఇక్కడ ఎవరైతే ఎంతో ధనవంతులుగా ఉన్నారో, వారి ధనమైతే
మొత్తమంతా మట్టిలో కలిసిపోనున్నది. మీరు భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి స్వయం అంటారు - ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా
బుద్ధియోగాన్ని అక్కడ జోడించండి. కర్మలు చేస్తూ ఈ అభ్యాసము చేయండి. ప్రతి విషయాన్ని
చూడవలసి ఉంటుంది కదా. మీకు ఇప్పుడు అభ్యాసమవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
ఎల్లప్పుడూ శుద్ధమైన కర్మలే చేయండి, అశుద్ధమైన కర్మలేవీ చేయకండి. ఏదైనా రోగము
ఉన్నట్లయితే సర్జన్ కూర్చుని ఉన్నారు, వారి నుండి సలహాను తీసుకోండి. ప్రతి ఒక్కరికీ
తమ, తమ రోగాలు ఉన్నాయి, సర్జన్ నుండైతే మంచి సలహా లభిస్తుంది. ఈ పరిస్థితిలో నేనేమి
చేయాలి అని అడగవచ్చు. ఏ వికర్మలూ జరగకుండా అటెన్షన్ పెట్టాలి.
ఎటువంటి ఆహారమో అటువంటి మనసు అన్న గాయనము కూడా ఉంది. మాంసాన్ని కొనుగోలు
చేసేవారిపైన, అమ్మేవారిపైన, తినిపించేవారిపైన కూడా పాపము అంటుకుంటుంది.
పతిత-పావనుడైన తండ్రి నుండి ఏ విషయాన్నీ దాచిపెట్టకూడదు. సర్జన్ నుండి
దాచిపెట్టినట్లయితే రోగము దూరమవ్వదు. వీరు అనంతమైన అవినాశీ సర్జన్. ఈ విషయాల గురించి
ప్రపంచానికైతే తెలియదు. మీకు కూడా ఇప్పుడు జ్ఞానము లభిస్తూ ఉంది కానీ యోగములో చాలా
లోటు ఉంది. స్మృతిని అసలు చేయనే చేయరు. స్మృతి అనేది వెంటనే ఏమీ నిలిచిపోదు అన్న
విషయము బాబాకు తెలుసు. నంబరువారుగా ఉన్నారు కదా. ఎప్పుడైతే స్మృతియాత్ర పూర్తవుతుందో
అప్పుడు కర్మాతీత అవస్థ పూర్తయింది అని అంటారు, ఇక అప్పుడు యుద్ధము కూడా పూర్తి
ఎత్తున మొదలైపోతుంది. అప్పటివరకూ ఎంతోకొంత జరిగి మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. యుద్ధమైతే
ఎప్పుడైనా మొదలవచ్చు. కానీ వివేకము ఏం చెప్తుందంటే, ఎప్పటివరకైతే రాజ్యము స్థాపన
అవ్వదో అప్పటివరకు పెద్ద యుద్ధము ప్రారంభమవ్వదు. కొద్ది-కొద్దిగా జరిగి మళ్ళీ
ఆగిపోతుంది. రాజ్యము స్థాపన అవుతుంది అన్న విషయము ఎవరికీ తెలియదు. సతోప్రధాన, సతో,
రజో, తమో బుద్ధి కలవారు ఉన్నారు కదా. మీలో కూడా సతోప్రధాన బుద్ధి కలవారు మంచి రీతిలో
స్మృతి చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులైతే ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉంటారు కానీ అందులో కూడా
సొంత పిల్లలు మరియు సవతి పిల్లలు ఉంటారు కదా. సొంత పిల్లలు బాగా సేవ చేస్తారు,
తల్లిదండ్రుల మతముపై నడుస్తారు. సవతి పిల్లలు రావణుని మతముపై నడుస్తారు. కొంత
రావణుని మతముపై, కొంత రాముని మతముపై కుంటుకుంటూ నడుస్తారు. పిల్లలు పాట విన్నారు.
ఏమంటారంటే - బాబా, మమ్మల్ని ప్రశాంతత ఉండే చోటుకు తీసుకువెళ్ళండి. స్వర్గములో
ప్రశాంతతయే ప్రశాంతత ఉంటుంది, దుఃఖము యొక్క మాటే ఉండదు. స్వర్గము అని సత్యయుగమునే
అంటారు. ఇప్పుడు ఇది కలియుగము. ఇక్కడికి స్వర్గము ఎక్కడి నుండి వస్తుంది. మీ బుద్ధి
ఇప్పుడు స్వచ్ఛముగా అవుతూ ఉంటుంది. స్వచ్ఛబుద్ధి కలవారికి మలిన బుద్ధి కలవారు
నమస్కరిస్తారు. పవిత్రముగా ఉండేవారికి గౌరవము ఉంటుంది. సన్యాసులు పవిత్రముగా ఉంటారు
కావున గృహస్థులు వారికి తల వంచి నమస్కరిస్తారు. సన్యాసులైతే వికారాల ద్వారా జన్మ
తీసుకుని తర్వాత సన్యాసులుగా అవుతారు. దేవతలనైతే సంపూర్ణ నిర్వికారులు అని అనడం
జరుగుతుంది. సన్యాసులను ఎప్పుడూ సంపూర్ణ నిర్వికారులు అని అనరు. కావున పిల్లలైన మీకు
లోలోపల సంతోషము యొక్క పాదరసము ఎంతగానో పైకి ఎక్కాలి, అందుకే అతీంద్రియ సుఖము గురించి
అడగాలంటే గోప-గోపికలను అడగండి అని అంటారు, వారు తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ సమ్ముఖముగా వినడముతో నషా ఎక్కుతుంది, ఆ
తర్వాత కొందరికి అది నిలుస్తుంది, కొందరికి వెంటనే పోతుంది. సాంగత్య దోషము కారణముగా
నషా స్థిరముగా నిలవదు. మీ సెంటర్లకు ఇటువంటివారు ఎంతోమంది వస్తారు - కొద్దిగా నషా
ఎక్కుతుంది, మళ్ళీ పార్టీలు మొదలైనవాటికి ఎక్కడికైనా వెళ్తారు, అక్కడ మద్యము, బీడీ
మొదలైనవి తాగుతారు, ఇక సమాప్తము. సాంగత్య దోషము చాలా చెడ్డది. హంస మరియు కొంగ కలిసి
ఉండలేవు. పతి హంసగా అయితే పత్ని కొంగగా ఉంటుంది. కొన్ని చోట్ల పత్ని హంసగా అవుతుంది,
పతి కొంగగా ఉంటారు. పవిత్రముగా ఉండమని చెప్తే దెబ్బలు తినవలసి వస్తుంది.
కొన్ని-కొన్ని ఇళ్ళల్లో అందరూ హంసలుగా ఉంటారు, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ హంసల నుండి
మారి కొంగలుగా అయిపోతారు. తండ్రి అంటారు, అందరూ స్వయాన్ని సుఖమిచ్చేవారిగా
తయారుచేసుకోండి. తమ పిల్లలను కూడా సుఖమిచ్చేవారిగా తయారుచేయండి. ఇది దుఃఖధామము కదా.
ఇప్పుడైతే ఇంకా ఎన్నో ఆపదలు రానున్నాయి, అప్పుడిక ఎలా ఆర్తనాదాలు చేస్తారో చూడండి.
అరే, తండ్రి వచ్చారు, మేము తండ్రి నుండి వారసత్వాన్ని పొందలేదు అని ఆర్తనాదాలు
చేస్తారు కానీ అప్పటికి టూ లేట్ (చాలా ఆలస్యము) అయిపోతుంది. తండ్రి స్వర్గము యొక్క
రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వస్తారు, కానీ వారు దానిని పోగొట్టుకుంటారు, అందుకే
బాబా అర్థం చేయిస్తారు - బాబా వద్దకు ఎల్లప్పుడూ దృఢమైనవారిని తీసుకురండి అని.
అటువంటివారు స్వయం అర్థము చేసుకుని ఇతరులకు కూడా అర్థము చేయించగలగాలి. అంతేకానీ,
బాబా కేవలం ఒక చూసే వస్తువు కాదు. శివబాబా ఏమీ కనిపించరు కదా! ఎవరైనా తమ ఆత్మను
చూసారా? కేవలం తెలుసుకుంటారు. అదే విధంగా పరమాత్మను కూడా తెలుసుకోవాలి. దివ్యదృష్టి
లేకుండా వారిని ఎవరూ చూడలేరు. దివ్యదృష్టి ద్వారా ఇప్పుడు మీరు సత్యయుగాన్ని
చూస్తారు, తర్వాత అక్కడికి ప్రాక్టికల్ గా వెళ్ళాలి. పిల్లలైన మీరు కర్మాతీత అవస్థకు
చేరుకున్నప్పుడు కలియుగము వినాశనమవుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ బుద్ధి యోగము బాబా మరియు కొత్త ప్రపంచముతో జోడించబడి
ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మలూ జరగకూడదు అన్న అటెన్షన్ ఉండాలి. ఎల్లప్పుడూ
శుద్ధ కర్మలనే చేయాలి, లోపల ఏదైనా రోగము ఉన్నట్లయితే సర్జన్ నుండి సలహా తీసుకోవాలి.
2. సాంగత్య దోషము చాలా చెడ్డది, దీని నుండి స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి.
స్వయాన్ని మరియు పరివారాన్ని సుఖమిచ్చేవారిగా తయారుచేయాలి. చదువు విషయములో ఎప్పుడూ
సాకులు చెప్పకూడదు.
వరదానము:-
శ్రేష్ఠ భావన ఆధారముగా సర్వులకు శాంతి, శక్తి కిరణాలను ఇచ్చే
విశ్వకళ్యాణకారీ భవ
ఏ విధంగా బాబా యొక్క సంకల్పాలలో మరియు మాటలలో, నయనాలలో సదా
కళ్యాణ భావన మరియు కామన ఉంటుందో, అలా పిల్లలైన మీ సంకల్పాలలో విశ్వ కళ్యాణ భావన
మరియు కామన నిండి ఉండాలి. ఏ కార్యాన్ని చేస్తున్నా విశ్వములోని సర్వాత్మలు ఇమర్జ్
అవ్వాలి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి శుభభావన మరియు శ్రేష్ఠ కామనల ఆధారముగా శాంతి
మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి, అప్పుడు విశ్వకళ్యాణకారులు అని పిలవబడతారు. కానీ
దీని కొరకు సర్వ బంధనాల నుండి ముక్తులుగా, స్వతంత్రులుగా అవ్వండి.
స్లోగన్:-
నేను
మరియు నాది అన్న భావన - ఇదే దేహాభిమానము యొక్క ద్వారము, ఇప్పుడు ఈ ద్వారాన్ని మూసి
వేయండి.
అవ్యక్త ప్రేరణలు -
సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి
సత్యత యొక్క పరిశీలన
ఏమిటంటే - సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ-సంపర్కాలు, అన్నింటిలోనూ దివ్యత యొక్క
అనుభూతి కలగటము. కొందరు ఏమంటారంటే - నేను అయితే సదా సత్యమే మాట్లాడుతాను. కానీ మాటలు
మరియు కర్మలలో ఒకవేళ దివ్యత లేకపోతే అప్పుడు ఇతరులకు మీ సత్యము, సత్యముగా అనిపించదు,
అందుకే సత్యతా శక్తితో దివ్యతను ధారణ చెయ్యండి. ఏది సహించాల్సి వచ్చినా కానీ గాభరా
పడకండి. సత్యము సమయమనుసారముగా దానంతటదే నిరూపణ అవుతుంది.
| | |