17-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సూర్యవంశీ రాజ్య పదవిని తీసుకునేందుకు
మీదంతా తండ్రికి స్వాహా చేయండి, సూర్యవంశీ రాజ్య పదవి అనగా ఎయిర్ కండిషన్ టికెట్’’
ప్రశ్న:-
ఈ ప్రపంచములో
పిల్లలైన మీ కన్నా గొప్ప అదృష్టవంతులు ఎవరూ లేరు - ఎలా?
జవాబు:-
పిల్లలైన మీ
సమ్ముఖములో అనంతమైన తండ్రి ఉన్నారు. వారి నుండి మీకు అనంతమైన వారసత్వము లభిస్తూ ఉంది.
మీరు ఈ సమయములో అనంతమైన తండ్రి, టీచరు మరియు సద్గురువుకు చెందినవారిగా అయ్యి వారి
నుండి అనంతమైన ప్రాప్తిని పొందుతారు. ప్రపంచములోని వారికైతే అనంతమైన తండ్రి గురించి
తెలియను కూడా తెలియదు అన్నప్పుడు వారు మీ వంటి అదృష్టవంతులుగా ఎలా అవ్వగలరు.
పాట:-
గొప్ప
అదృష్టవంతులు...
ఓంశాంతి
ఇప్పుడు మనము బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారమని, తర్వాత దైవీ సాంప్రదాయానికి
చెందినవారిగా అవుతామని బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలకు తెలుసు. పిల్లలకు తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తున్నారు - అనంతమైన తండ్రి మీ సమ్ముఖముగా ఉన్నప్పుడు మరియు
వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తున్నప్పుడు, ఇంకేమి కావాలి. భక్తి మార్గము
ఎప్పటినుండి ప్రారంభమవుతుంది, ఇది ఎవరికీ తెలియదు. భక్తి మార్గపు భక్తులు భగవంతుడిని
మరియు వధువులు వరుడిని స్మృతి చేస్తారు. కానీ విచిత్రమేమిటంటే, వారి గురించి తెలియదు.
ప్రేయసికి ప్రియుడి గురించి తెలియకపోవడమనేది ఎప్పుడైనా చూసారా. తెలియనే తెలియనప్పుడు,
ఇక స్మృతి ఎలా చేయగలరు. భగవంతుడైతే అందరికీ తండ్రి. పిల్లలు తండ్రిని స్మృతి
చేస్తారు. కానీ పరిచయము లేకుండా స్మృతి చేస్తే అంతా వృధా అయిపోతుంది, అందుకే ఈ
విధముగా స్మృతి చేయడము వలన లాభమేమీ కలగడము లేదు. ఈ విధముగా స్మృతి చేస్తూ ఆ
లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని ఎవరూ చేరుకోరు. భగవంతుడు ఎవరు, వారి నుండి ఏమి లభిస్తుంది
అనేది ఏమీ తెలియదు. క్రైస్టు, బుద్ధుడు మొదలైన గురువులను అనగా అన్ని ధర్మాలలో ధర్మ
స్థాపన చేసినవారిని, వారి ఫాలోవర్స్ గుర్తు చేస్తారు, కానీ వారిని గుర్తు చేయడముతో
మాకు ఏమి లభిస్తుంది అనేది ఏమీ తెలియదు. దాని కన్నా దైహిక చదువు మంచిది. అక్కడ
లక్ష్యము-ఉద్దేశ్యమైతే బుద్ధిలో ఉంటాయి కదా. తండ్రి నుండి ఏమి లభిస్తుంది? టీచరు
నుండి ఏమి లభిస్తుంది? మరియు గురువు నుండి ఏమి లభిస్తుంది? ఇది ఇతరులెవ్వరూ అర్థం
చేసుకోలేరు. మీరు ఇక్కడ తండ్రికి చెందినవారిగా, తర్వాత టీచరుకు చెందినవారిగా,
తర్వాత సద్గురువుకు చెందినవారిగా అవుతారు. తండ్రి మరియు టీచరు కన్నా గురువు
ఉన్నతముగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయము కలిగింది - మేము తండ్రికి
చెందినవారిగా అయ్యాము, బాబా 5 వేల సంవత్సరాల క్రితం వలె వచ్చి, మనల్ని స్వర్గానికి
యజమానులుగా చేస్తారు మరియు శాంతిధామానికి యజమానులుగా చేస్తారు.
తండ్రి అంటారు - ప్రియమైన పిల్లలూ, మీరు నా నుండి మీ వారసత్వాన్ని తీసుకుంటారు కదా!
అప్పుడు పిల్లలందరూ - అవును బాబా, ఎందుకు తీసుకోము అని అంటారు. అచ్ఛా, చంద్రవంశీ
రాముని పదవిని పొందితే తృప్తి చెందుతారా? మీకేమి కావాలి? తండ్రి కానుకను తీసుకుని
వచ్చారు. మీరు సూర్యవంశీ లక్ష్మిని వరిస్తారా లేక చంద్రవంశీ సీతను వరిస్తారా? మీరు
మీ ముఖాన్ని చూసుకోండి కదా. శ్రీనారాయణుడిని లేక శ్రీలక్ష్మిని వరించేందుకు
యోగ్యులుగా ఉన్నారా? యోగ్యులుగా అవ్వకుండా ఎలా వరించగలరు? ఇప్పుడు తండ్రి కూర్చుని
అర్థం చేయిస్తున్నారు - కల్పక్రితం ఎలాగైతే అర్థం చేయించారో, యథావిధిగా మళ్ళీ అర్థం
చేయిస్తున్నారు. మీరు మళ్ళీ వచ్చి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన తండ్రి
నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడమే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. అది సూర్యవంశీ
రాజ్య పదవి, సెకండ్ గ్రేడ్ లో చంద్రవంశీయులు ఉన్నారు. ఉదాహరణకు ఎయిర్ కండిషన్, ఫస్ట్
క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయి కదా. అలా సత్యయుగ రాజధాని అంతా ఎయిర్ కండిషన్ అనుకోండి.
ఎయిర్ కండిషన్ కన్నా ఉన్నతమైనదైతే ఇంకేదీ ఉండదు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది.
ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు - మీరు ఎయిర్ కండిషన్ వంటి సూర్యవంశీ రాజ్యాన్ని
తీసుకుంటారా లేక చంద్రవంశీ ఫస్ట్ క్లాస్ పదవిని తీసుకుంటారా? దాని కన్నా తక్కువగా
అంటే సెకండ్ క్లాసులో నంబరువారుగా వారసులుగా అవ్వండి, అప్పుడు మీరు చివరిలో
రాజ్యాన్ని పొందుతారు. లేదంటే థర్డ్ క్లాస్ ప్రజలుగా అవుతారు, వాళ్ళకు కూడా టికెట్
రిజర్వ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ రిజర్వ్, సెకండ్ క్లాస్ రిజర్వ్, ఇలా పదవులు
నంబరువారుగా ఉంటాయి కదా. ఇకపోతే అక్కడ సుఖము ఎలాగూ ఉంటుంది. వేర్వేరు
కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా. షావుకారు వ్యక్తి ఎయిర్ కండిషన్ టికెట్ తీసుకుంటారు.
మీలో షావుకారులుగా ఎవరు అవుతారు? ఎవరైతే తమదంతా తండ్రికి ఇచ్చేస్తారో, వారు. బాబా,
ఇదంతా మీదే అని అంటారు. భారత్ లోనే మహిమ గాయనము చేయబడింది - వ్యాపారస్థుడు,
రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అనే ఈ మహిమ తండ్రిది, అంతేకానీ శ్రీకృష్ణుడిది కాదు.
శ్రీకృష్ణుడైతే వారసత్వాన్ని తీసుకున్నారు, సత్యయుగములో ప్రారబ్ధాన్ని పొందారు. అతను
కూడా బాబాకు చెందినవారిగా అయ్యారు. ప్రారబ్ధాన్ని ఎక్కడో ఒక చోట నుండైతే పొంది
ఉంటారు కదా. లక్ష్మీ-నారాయణులు సత్యయుగములో ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. వారు
తప్పకుండా గతంలో ప్రారబ్ధాన్ని తయారుచేసుకుని ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీరు మంచి
రీతిలో తెలుసుకున్నారు. నెహ్రూ ప్రారబ్ధము ఎంత బాగుండేది, వారు తప్పకుండా మంచి
కర్మలు చేసి ఉంటారు. వారు భారత్ కు కిరీటము లేని చక్రవర్తి వలె ఉండేవారు. భారత్
మహిమ చాలా ఉంది. భారత్ వంటి ఉన్నతమైన దేశము ఇంకేదీ ఉండదు. భారత్ పరమపిత పరమాత్ముని
జన్మ స్థలము. ఈ రహస్యము ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పరమాత్మయే అర్ధకల్పము కొరకు
అందరికీ సుఖ-శాంతులను ఇస్తారు. భారత్ యే నంబరువన్ తీర్థ స్థానము. కానీ
డ్రామానుసారముగా ఒక్క తండ్రిని మర్చిపోవడముతో సృష్టి పరిస్థితి ఎలా అయిపోయింది,
అందుకే శివబాబా మళ్ళీ వస్తారు. ఎవరో ఒకరు నిమిత్తమవుతారు కదా.
ఇప్పుడు తండ్రి అంటున్నారు - అశరీరి భవ, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి.
ఆత్మనైన నేను ఎవరి సంతానాన్ని, ఇది ఎవరికీ తెలియదు. ఇది విచిత్రము కదా. ఓ గాడ్ ఫాదర్,
దయ చూపించండి అని అంటారు కూడా. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారెప్పుడు
వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. తండ్రియే వచ్చి
కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలైతే
కాదు. ఘోర అంధకారము ఉంది కదా. గీతోపదేశాన్ని ఎంతమంది వచ్చి వింటారు. కానీ అక్కడ అది
నేర్పించేవారు గాని లేక నేర్చుకునేవారు గాని, ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సులభము
చేసి అర్థం చేయిస్తారు, కేవలం తండ్రిని స్మృతి చేయండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ
కమలపుష్ప సమానముగా అవ్వండి. విష్ణువుకే అన్ని అలంకారాలను ఇచ్చారు, శంఖాన్ని కూడా
ఇచ్చారు, పుష్పాన్ని కూడా ఇచ్చారు. వాస్తవానికి ఇవి దేవతలకు ఇవ్వడము జరగదు. ఇవి
ఎంతటి గుహ్యమైన గంభీరమైన విషయాలు. వాస్తవానికి ఇవి బ్రాహ్మణుల అలంకారాలు. కానీ
బ్రాహ్మణులకు ఎలా ఇవ్వాలి, నేడు బ్రాహ్మణులుగా ఉంటారు, రేపు శూద్రులుగా అయిపోతారు.
బ్రహ్మాకుమారులే శూద్ర కుమారులుగా అయిపోతారు. మాయ ఆలస్యం చేయదు. ఒకవేళ ఏదైనా తప్పు
చేసారంటే, తండ్రి శ్రీమతాన్ని అనుసరించలేదంటే, బుద్ధి పాడైపోయిందంటే మాయ గట్టిగా
చెంపదెబ్బ వేసి ముఖము తిప్పేస్తుంది. మనుష్యులు కోపములో అంటూ ఉంటారు కదా -
చెంపదెబ్బ వేసి ముఖము తిప్పేస్తాను అని. మాయ కూడా అలాంటిదే. తండ్రిని మర్చిపోయారంటే,
మాయ ఒక్క సెకండులో చెంపదెబ్బ వేసి ముఖము తిప్పేస్తుంది. ఒక్క సెకండులో జీవన్ముక్తిని
పొందుతారు, మాయ సెకండులో జీవన్ముక్తిని సమాప్తము చేసేస్తుంది. ఎంత మంచి-మంచి
పిల్లలను మాయ పట్టుకుంటుంది. ఎక్కడైనా పొరపాటు చేస్తూ ఉండటాన్ని చూసిందంటే, వెంటనే
చెంపదెబ్బ వేస్తుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి ముఖము తిప్పేస్తారు. పాత
కుటీరములో ఉండే నిరుపేద లౌకిక తండ్రి, కొత్త ఇంటిని నిర్మిస్తున్నప్పుడు, ఆ పిల్లల
బుద్ధిలో కూర్చుండిపోతుంది - ఇప్పుడిక కొత్త ఇల్లు తయారవుతుంది, మేము వెళ్ళి అక్కడ
ఉంటాము, ఈ పాత ఇంటిని పడగొట్టేస్తారు అని. ఇప్పుడు తండ్రి మీ కోసం అరచేతిలో
స్వర్గాన్ని అనగా వైకుంఠాన్ని తీసుకువచ్చారు. ప్రియమైన పిల్లలూ - అని అంటారు.
ఆత్మలతో మాట్లాడుతారు. ఈ కళ్ళ ద్వారా పిల్లలైన మిమ్మల్ని చూస్తున్నారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. డ్రామాలో లేకపోయినా సరే ఏమైనా
చేయగలను అని కాదు. అలా కాదు. పిల్లలు అనారోగ్యము పాలైతే, నేను నయం చేసేస్తానని కాదు,
ఆపరేషన్ లేకుండా తప్పిస్తానని కాదు. అలా కాదు. కర్మభోగాన్ని అయితే అందరూ
అనుభవించాల్సిందే. మీపైనైతే చాలా భారము ఉంది ఎందుకంటే మీరు అందరికన్నా పాతవారు.
సతోప్రధానము నుండి పూర్తిగా తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి
లభించారు కనుక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కల్ప-కల్పము డ్రామానుసారముగా
మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. ఎవరైతే సూర్యవంశానికి,
చంద్రవంశానికి చెందినవారు ఉంటారో, వారు తప్పకుండా వస్తారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో,
వారే శూద్రులుగా అయిపోయారు. మళ్ళీ వారే బ్రాహ్మణులుగా అయ్యి, దైవీ సాంప్రదాయులుగా
అవుతారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఎవరూ అర్థం చేయించలేరు.
తండ్రికి పిల్లలైన మీరు ఎంత మధురముగా అనిపిస్తారు. మీరు నా ఆ కల్పక్రితపు పిల్లలే
అని అంటారు. నేను కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇవి ఎంత అద్భుతమైన
విషయాలు. నిరాకార భగవానువాచ. శరీరము ద్వారానే మాట్లాడుతారు కదా. శరీరము నుండి వేరైతే,
ఆత్మ ఇక మాట్లాడలేదు. ఆత్మ అతీతమైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు - అశరీరి భవ. దీని
అర్థం ప్రాణాయామము మొదలైనవి చేయమని కాదు. నేను ఆత్మను, అవినాశీ అని భావించాలి. నా
ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. తండ్రి స్వయంగా అంటున్నారు - నా ఆత్మ కూడా ఏ
పాత్రనైతే అభినయిస్తుందో, ఆ పాత్ర అంతా నాలో నిండి ఉంది. నా పాత్ర అక్కడ భక్తి
మార్గములోనూ నడుస్తుంది, మళ్ళీ జ్ఞాన మార్గములో ఇక్కడకు వచ్చి జ్ఞానాన్ని ఇస్తాను.
భక్తి మార్గము వారికి జ్ఞానము గురించి అసలు తెలియదు. మద్యం తాగనంతవరకు దాని రుచి
గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది. అలాగే జ్ఞానాన్ని తీసుకున్నప్పుడే, దాని గురించి
తెలుస్తుంది. జ్ఞానముతో సద్గతి కలుగుతుంది కనుక తప్పకుండా జ్ఞాన సాగరుడే సద్గతిని
ఇవ్వగలరు. తండ్రి అంటారు, నేను సర్వుల సద్గతిదాతను. సర్వోదయ లీడర్ ఉంటారు కదా, ఎన్ని
రకాల వారు ఉంటారు. వాస్తవానికైతే సర్వులపై దయ చూపించేవారు తండ్రి. ఓ భగవంతుడా, దయ
చూపించండి అని తండ్రితో అంటారు. కనుక అందరిపై దయ చూపించేవారు వారు, మిగిలినవారంతా
హద్దు దయను చూపేవారు. తండ్రి అయితే మొత్తం ప్రపంచాన్ని సతోప్రధానముగా తయారుచేస్తారు.
అప్పుడు తత్వాలు కూడా సతోప్రధానముగా అయిపోతాయి. ఈ పని అయితే పరమాత్మునిదే. కనుక
సర్వోదయ అన్న మాటకు ఎంత పెద్ద అర్థం ఉంది. అందరిపై పూర్తి దయను చూపిస్తారు. స్వర్గ
స్థాపనలో ఎవరూ దుఃఖితులుగా అవ్వరు. అక్కడ నంబరువన్ ఫర్నీచర్, వైభవాలు మొదలైనవి
లభిస్తాయి. దుఃఖాన్ని ఇచ్చే జంతువులు, ఈగలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ కూడా, గొప్పవారి
ఇళ్ళల్లో ఎంత శుభ్రత ఉంటుంది. అక్కడ మీరెప్పుడూ ఈగలను చూడరు, దోమలు మొదలైనవేవీ
ప్రవేశించలేవు. స్వర్గములోకి ప్రవేశించగలిగే శక్తి ఎవరికీ లేదు. అశుద్ధి చేసే
వస్తువులేవీ ఉండవు. పుష్పాలు మొదలైనవాటి సహజ సుగంధము ఉంటుంది. మీకు సూక్ష్మవతనములో
బాబా శూబీ రసాన్ని తాగిస్తారు. వాస్తవానికి సూక్ష్మవతనములోనైతే ఏమీ లేవు. అవన్నీ
సాక్షాత్కారాలు. వైకుంఠములో ఎంత మంచి-మంచి పుష్పాలు, తోటలు మొదలైనవి ఉంటాయి.
సూక్ష్మవతనములో తోటలు మొదలైనవి ఉండవు. అవన్నీ సాక్షాత్కారాలు. ఇక్కడ కూర్చుని
ఉండగానే మీకు సాక్షాత్కారము కలుగుతుంది.
పాట కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. మీకు తండ్రి లభించారని మీకు తెలుసు, ఇంకేమి
కావాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు కనుక తండ్రిని
స్మృతి చేయాలి. తండ్రి మతము ప్రసిద్ధమైనది. శ్రీమతము ద్వారా మనము శ్రేష్ఠాతి
శ్రేష్ఠముగా అవుతాము. మిగిలినవారందరివీ ఆసురీ మతాలు, అందుకే సత్యయుగములో సదా
సుఖముండేదని, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని వారికి తెలియదు. బాల్యములో వారే
రాధా-కృష్ణులు, వారి చరిత్ర మొదలైనవేవీ లేవు. స్వర్గములోనైతే పిల్లలందరూ చాలా ఫస్ట్
క్లాస్ గా ఉంటారు. అల్లరి అనే మాటే ఉండదు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచము నుండి ముఖము తిప్పుకున్న తర్వాత ఇక మళ్ళీ మాయ తన వైపుకు
ముఖాన్ని తిప్పే విధముగా ఎటువంటి పొరపాటు చేయకూడదు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు.
తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.
2. తండ్రిపై తమదంతా స్వాహా చేసి పక్కా వారసులుగా అయి సత్యయుగీ ఎయిర్ కండిషన్
టికెట్ ను తీసుకోవాలి. లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని బుద్ధిలో ఉంచుకుని పురుషార్థము
చేయాలి.
వరదానము:-
స్వ-స్థితి ద్వారా సర్వ పరిస్థితులను ఎదుర్కొనే అవ్యక్త
స్థితి యొక్క అభ్యాసీ భవ
ఎప్పుడైతే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసము చేసే అలవాటు
ఏర్పడుతుందో, అప్పుడు స్వ-స్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. మరియు
ఈ అలవాటు కోర్టుకు వెళ్ళడము నుండి రక్షిస్తుంది, అందుకే ఈ అభ్యాసాన్ని ఎప్పుడైతే
న్యాచురల్ గా మరియు నేచర్ గా (సహజముగా మరియు స్వభావముగా) చేసుకుంటారో, అప్పుడు
న్యాచురల్ కెలామిటీస్ (ప్రకృతి వైపరీత్యాలు) జరుగుతాయి ఎందుకంటే ఎప్పుడైతే
ఎదుర్కొనేవారు స్వ-స్థితితో ప్రతి పరిస్థితిని దాటే శక్తిని ధారణ చేస్తారో, అప్పుడు
పరదా తెరుచుకుంటుంది. దీని కొరకు పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత
విషయాల నుండి... పూర్తి వైరాగ్యము కావాలి.
స్లోగన్:-
స్వయాన్ని
నిమిత్తముగా, చేసేవారిగా భావించినట్లయితే ఏ కర్మలోనూ అలసట ఉండదు.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు - ‘‘మనుష్య లోకం, దేవ లోకం, భూత-ప్రేతాల ప్రపంచము యొక్క
విస్తారము’’
చాలా మంది మనుష్యులు
ప్రశ్నిస్తుంటారు - అశుద్ధ జీవాత్మలు, వేటినైతే భూతాలని అంటారో, అవి నిజంగా ఉన్నాయా
లేక ఊహనా? లేదా కేవలం అనుమానమా? దీని గురించి ఈ రోజు స్పష్టముగా అర్థం
చేయించబడుతుంది - మనుష్యాత్మలు వికర్మలు చేసినప్పుడు, వారికి తప్పకుండా అనేక రకాలుగా
శిక్షలను అనుభవించవలసి ఉంటుంది, అది కూడా మనుష్య జన్మలోనే అనుభవించవలసి ఉంటుంది,
అంతేకానీ జంతువులు, పశు-పక్ష్యాదుల యోనులలో కాదు. సుఖ-దుఃఖాలను అనుభవించే శక్తి
మనుష్యులలో ఎక్కువ ఉంది, అంతేకానీ జంతువులలో కాదు. ఈ సృష్టి ఆటలో ముఖ్యమైన పాత్ర
మనుష్యులదే. ఈ జంతువులు, పక్షులు మొదలైనవైతే ఈ సృష్టి డ్రామాకు శోభ వంటివి. మొత్తం
కల్పములో, సత్యయుగము ఆది నుండి కలియుగాంతము వరకు మనుష్యాత్మలకు 84 జన్మలు ఉంటాయి.
ఇకపోతే ఈ 84 లక్షలు అనే మాట జంతువులు, పక్షులు మొదలైనవాటి వెరైటీలు కావచ్చు. ఇప్పుడు
ఈ రహస్యాలన్నింటినీ పరమాత్మ తప్ప ఎవరూ అర్థం చేయించలేరు. ఆత్మల నివాస స్థానము
బ్రహ్మ తత్వము అనగా నిరాకారీ ప్రపంచము. ఇకపోతే ఈ జంతువుల ఆత్మలు బ్రహ్మతత్వములోకి
వెళ్ళలేవు, అవి ఈ ఆకాశ తత్వములోనే పాత్రను అభినయిస్తాయి. వాటికి కూడా మర్జ్, ఇమర్జ్
పాత్ర మరియు సతో, రజో, తమోలలోకి వచ్చే పాత్ర ఉంటుంది. అందుకే మనం ప్రకృతి గురించి
చాలా విస్తారములోకి వెళ్ళకుండా, ముందు మన ఆత్మ కళ్యాణము చేసుకోవాలి అనగా మన్మనాభవ.
ఇప్పుడు మనుష్యాత్మల గురించి తెలుసుకుందాము. ఏ ఆత్మలైతే అశుద్ధ కర్మలు చేయడము వలన
వికర్మలు తయారుచేసుకుంటారో, వారు తమ అశుద్ధ సంస్కారాలనుసారముగా జనన-మరణ చక్రములోకి
వచ్చి, ఆదిమధ్యాంతాలు అనగా మరణించే సమయము వరకు తాము చేసిన వికర్మల సాక్షాత్కారము
పొంది, సూక్ష్మముగా శిక్షలు అనుభవిస్తారు. ఈ కొద్ది సమయములో అనేక జన్మల దుఃఖము
అనుభవమవుతుంది, తర్వాత శరీరాన్ని వదిలి గర్భ జైలులో దుఃఖము అనుభవిస్తారు. తర్వాత
సంస్కారాలనుసారముగా అటువంటి తల్లిదండ్రుల వద్ద జన్మ తీసుకుని, అక్కడ కూడా తమ
జీవితములో సుఖ-దుఃఖాలను అనుభవిస్తారు. దీనినే ఆదిమధ్యాంతము అని అంటారు. కానీ
కొంతమంది ఆత్మలకు త్వరగా శరీరము లభించదు, ఆ ఆత్మలు ఆకారీ రూపములో ఈ ఆకాశ తత్వములో
భూతాలుగా అయి భ్రమిస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక శిక్ష అనగా అనుభవించడము. ఆ అశుద్ధ
జీవాత్మతో ఎవరికైనా లెక్కాచారము ఉన్నట్లయితే, అది వారిలో ప్రవేశించి వారికి
దుఃఖాన్ని ఇస్తుంది, అనగా లెక్కాచారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళి తన
శరీరాన్ని ధారణ చేస్తుంది. కొంతమంది జీవాత్మలైతే, ఎవరిలోనైతే ప్రవేశిస్తాయో, వారిని
చాలా కొడతాయి కూడా, చాలా కష్టము కలిగిస్తాయి. కానీ ఇదంతా లెక్కాచారాలలో శిక్షలు
అనుభవించే ఒక విధానము. కావున అందరికీ మనుష్య తనువులోనే సుఖ-దుఃఖాలు అనుభవమవుతాయి. ఈ
విషయము మీకు అర్థం చేయించడం జరిగింది - ఏ ఆత్మ అయితే ముక్తిధామము నుండి ఈ సాకారీ
ఆటలోకి వస్తుందో, అది మధ్యలో తిరిగి ముక్తిధామానికి వెళ్ళలేదు. కానీ తాను చేసిన
అశుద్ధ, శుద్ధ కర్మలనుసారముగా, సంస్కారాలను తీసుకుని సుఖ-దుఃఖాల చక్రములోకి వస్తుంది.
ఆత్మలన్నింటికీ పునర్జన్మలు ఉంటాయి, కేవలం ఒక్క పరమాత్మకు మాత్రము ఉండవు. అచ్ఛా. ఓం
శాంతి.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు తమ నేచర్ ను సరళంగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
స్వచ్ఛమైన మనసు కల
పిల్లలు బాప్ దాదాకు అందరికంటే ప్రియమైనవారు. స్వచ్ఛమైన మనసు కలవారు సదా బాప్ దాదా
హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారు వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ-సంపర్కాలలో
సరళముగా మరియు స్పష్టముగా, ఒకే విధముగా కనిపిస్తారు. సరళతకు గుర్తు - మనసు, బుద్ధి,
మాటలు ఒకే విధముగా ఉండటము. మనసులో ఒకటి, మాటలో మరొకటి ఉండటము - ఇది సరళతకు గుర్తు
కాదు. సరళ స్వభావము కలవారు సదా నిర్మానచిత్తముగా, నిరహంకారిగా, నిస్వార్థముగా ఉంటారు.
వారు సరళచిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి కలవారిగా ఉంటారు.