17-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి, ఈ అవస్థను తయారుచేసుకోవాలి, ఇదే ఉన్నతమైన గమ్యము’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు తండ్రితోపాటు పైకి, ఇంటికి ఎప్పుడు వెళ్తారు?

జవాబు:-
ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రము కూడా ఉండదో, అప్పుడు వెళ్తారు. ఏ విధముగా తండ్రి పవిత్రమైనవారో, అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖములో ఉన్నారు. జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని వింటూ-వింటూ ఎప్పుడైతే నిండుగా అవుతారో, తండ్రిని జ్ఞానములో ఖాళీ చేసేస్తారో, అప్పుడు వారు కూడా శాంతమైపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామములోకి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞానము చిందడం ఆగిపోతుంది. సర్వస్వమూ ఇచ్చేసాక, ఇక వారి పాత్ర సైలెన్స్ పాత్రయే.

ఓంశాంతి
శివ భగవానువాచ. శివ భగవానువాచ అని అన్నప్పుడు, ఒక్క శివుడే భగవంతుడు లేక పరమపిత అని అర్థం చేసుకోవాలి. వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయమైతే లభించింది. నంబరువారు పురుషార్థానుసారముగానే స్మృతి చేస్తూ ఉంటారు. అందరూ ఏకరసముగా స్మృతి చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించాలి, ఈ అవస్థను తయారుచేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఏమీ తెలియని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు. ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో, అలా ఇంకెవ్వరూ స్మృతి చేయలేకపోతారు. ఏ ఆత్మ యొక్క యోగమూ తండ్రితో జోడింపబడి లేదు. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి, సూక్ష్మమైనవి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మనమంతా పరస్పరం సోదరులము అని అంటారు కూడా, కావున ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయనివారు కూడా ఎందరో ఉన్నారు. ఆత్మ పైన మురికి పట్టి ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే. సతోప్రధానముగా ఉన్న ఆత్మయే ఇప్పుడు తమోప్రధానముగా అయ్యింది - ఈ జ్ఞానము ఆత్మలో ఉంది. జ్ఞానసాగరుడు పరమాత్మయే. మీరు స్వయాన్ని జ్ఞానసాగరునిగా పిలుచుకోరు. మేము బాబా నుండి పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకొని ఏమి చేస్తారు. అవినాశీ జ్ఞాన రత్నాల ధనమునైతే పిల్లలకు ఇవ్వవలసిందే. పిల్లలు నంబరువారు పురుషార్థానుసారముగా వాటిని తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. వారు కూడా ఆత్మయే, అలాగే మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతటినీ తీసుకుంటారు. ఏ విధముగా వారు సదా పవిత్రముగా ఉంటారో, అలా మీరు కూడా సదా పవిత్రముగా అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రము కూడా ఉండదో అప్పుడు ఇక పైకి వెళ్ళిపోతారు. తండ్రి స్మృతియాత్ర అనే యుక్తిని నేర్పిస్తారు. రోజంతా స్మృతి నిలవదని కూడా మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సమ్ముఖముగా కూర్చొని అర్థం చేయిస్తారు, ఇతర పిల్లలు సమ్ముఖముగా వినరు, వారు మురళిని చదువుకుంటారు. ఇక్కడ మీరు సమ్ముఖముగా ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగరులుగా అవ్వాలి. పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానములో ఖాళీ చేసినట్లే, అప్పుడు వారు ఇక శాంతమైపోతారు. అలాగని వారి లోపల జ్ఞానం చిందుతూ ఉంటుందని కాదు. అంతటినీ ఇచ్చేసాక ఇక వారికి సైలెన్స్ యొక్క పాత్రయే ఉంటుంది. మీరు సైలెన్స్ లో ఉన్నప్పుడు జ్ఞానం చిందదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుందని కూడా తండ్రి అర్థం చేయించారు. ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్ళీ జన్మిస్తే బాల్యంలోనే వారికి శాస్త్రాలు కంఠస్థమైపోతాయి. ఆ తర్వాత వారి పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాలను తీసుకురాలేరు. ఆ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. ఇకపోతే ఆత్మ నంబరువారు పురుషార్థానుసారముగా తన సీటును తీసుకుంటుంది. ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా అయితే నిరాకారుడు. నేను ఈ ఇంద్రియాలను అద్దెకు తీసుకుంటాను అని వారు అంటారు. వారు కేవలం వినిపించేందుకే వస్తారు, వారు ఎవరి జ్ఞానాన్ని వినరు ఎందుకంటే వారు స్వయం జ్ఞానసాగరుడు కదా. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన పనిని చేస్తారు. వారు అందరికీ దారిని తెలిపేందుకే వస్తారు. ఇకపోతే వారు విని ఏం చేస్తారు. వారు ఎల్లప్పుడూ ఇలా, ఇలా చేయండి అని వినిపిస్తూనే ఉంటారు. మొత్తం వృక్షము యొక్క రహస్యాన్ని వినిపిస్తారు. కొత్త ప్రపంచమైతే చాలా చిన్నగా ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచము ఎంత పెద్దది. మొత్తం ప్రపంచములో ఎంత విద్యుత్తును ఉపయోగిస్తూ ఉంటారు. విద్యుత్తు ద్వారా ఏమేమి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే ప్రపంచమూ చిన్నగానే ఉంటుంది, అలాగే విద్యుత్తు కూడా కొద్దిగానే ఉంటుంది. అదొక చిన్న పల్లెటూరులా ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెద్ద-పెద్ద ఊళ్లు ఉన్నాయి. అక్కడ అన్ని ఉండవు. కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి. పంచ తత్వాలు కూడా అక్కడ సతోప్రధానముగా అయిపోతాయి. అవి ఎప్పుడూ చంచలమవ్వవు. దానిని సుఖధామము అని అంటారు. దాని పేరే స్వర్గము. మున్ముందు మీరు ఎంతగా దగ్గరగా వస్తూ ఉంటారో, అంతగా వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధములో కూడా సైన్యము లేక విమానాలు మొదలైనవాటి అవసరం ఉండదు. మేము ఇక్కడ కూర్చొనే అందరినీ అంతం చేయగలము అని వారు అంటారు. అప్పుడిక ఈ ఏరోప్లేన్లు మొదలైనవి ఏమైనా ఉపయోగపడతాయా. ఇక చంద్రుడు మొదలైన చోట్లకు ప్లాట్లు మొదలైనవాటిని చూసేందుకు కూడా వెళ్ళరు. ఇదంతా అనవసరమైన విజ్ఞాన గర్వము. ఎంతగా షో చేస్తున్నారు. జ్ఞానములో ఎంతటి సైలెన్స్ ఉంది, దీనిని ఈశ్వరీయ కానుక అని అంటారు. సైన్స్ లో అంతా హంగామాయే హంగామా ఉంటుంది. వారికి అసలు శాంతి గురించి తెలియనే తెలియదు.

విశ్వములో శాంతి అయితే కొత్త ప్రపంచములో ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు అంతా దుఃఖము, అశాంతియే ఉంది. మీరు శాంతిని కోరుకుంటున్నారు కదా, అసలు ఎప్పుడూ అశాంతి ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా, అది కేవలం శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి. స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు. భారతవాసులే వైకుంఠాన్ని, స్వర్గాన్ని తలచుకుంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని తలచుకోరు. వారు కేవలం శాంతినే తలచుకుంటారు. సుఖమునైతే వారు తలచుకోలేరు. నియమము అలా లేదు. సుఖమునైతే మీరే తలచుకుంటారు, కావుననే మమ్మల్ని దుఃఖము నుండి విముక్తులను చేయండి అని పిలుస్తారు. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ వాసులు. ఇది కూడా ఎవరికీ తెలియదు. మీరు తెలివితక్కువవారిగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పటి నుండి అలా అయ్యారు? 16 కళల నుండి 14-12 కళల వారిగా అవుతూ ఉంటారు అనగా తెలివితక్కువవారిగా అవుతూ ఉంటారు. ఇప్పుడైతే ఏ కళలూ లేవు. స్త్రీలకు దుఃఖము ఎందుకు ఉంది అని కాన్ఫరెన్స్ లు చేస్తూ ఉంటారు. అరే, దుఃఖమైతే మొత్తం ప్రపంచమంతటిలోనూ ఉంది, అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మొత్తం విశ్వమంతటిలో శాంతి అనేది ఇప్పుడు ఏర్పడదు. సుఖము గురించైతే తెలియనే తెలియదు. ఈ ప్రపంచములో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయని, అశాంతి ఉందని కుమార్తెలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అది శాంతిధామము మరియు ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామము. ఆది సనాతన హిందూ ధర్మం అని అనరు. ఆది అనగా ప్రాచీనమైనది, అది సత్యయుగములో ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రముగా ఉండేవారు. అది నిర్వికారీ ప్రపంచము, అక్కడ వికారము అన్న మాటే లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదటైతే నిర్వికారీతనము కావాలి కదా, కావుననే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలూ, కామంపై విజయాన్ని పొందండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అపవిత్రముగా ఉంది, ఆత్మలో మాలిన్యము కలిసింది, అందుకే నగ (శరీరము) కూడా అలా తయారయ్యింది. ఆత్మ పవిత్రముగా అయితే నగ కూడా పవిత్రముగా ఉంటుంది, దానినే నిర్వికారీ ప్రపంచము అని అంటారు. మర్రి వృక్షము ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, కానీ కాండము లేదు. ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు, మిగిలినవన్నీ నిలబడి ఉన్నాయి. అందరూ అపవిత్రముగా ఉన్నారు, వీరిని మనుష్యులు అని అంటారు. వారు దేవతలు. నేను మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి వచ్చాను. 84 జన్మలను కూడా మనుష్యులే తీసుకుంటారు. తమోప్రధానముగా అయితే హిందువులు అని అంటారని మెట్ల చిత్రములో చూపించాలి. వారిని దేవతలు అని అనలేరు ఎందుకంటే పతితులుగా ఉన్నారు. డ్రామాలో ఈ రహస్యము ఉంది కదా. వాస్తవానికి హిందూ ధర్మమంటూ ఏదీ లేదు. ఆది సనాతనమైన దేవీ-దేవతలుగా మనమే ఉండేవారము. భారత్ యే పవిత్రముగా ఉండేది, ఇప్పుడు అపవిత్రముగా ఉంది. కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. హిందూ ధర్మాన్ని అయితే ఎవ్వరూ స్థాపించలేదు. ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజుల్లోనైతే అంతటి సమయాన్ని కూడా ఇవ్వరు. తక్కువలో తక్కువ అరగంట ఇస్తే ఈ పాయింట్లను వినిపించవచ్చు. పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి. వాటి నుండి ముఖ్యమైనవి వినిపించడం జరుగుతుంది. చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారో అంతగా చిన్న-చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు, వాటిని మర్చిపోతారు. ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయింది అని మీతో కూడా అంటారు. అరే, చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకు నిత్యము కొత్త-కొత్త విషయాలు వినిపిస్తారు. మొదట తేలికపాటి చదువు ఉండేది, ఇప్పుడు తండ్రి గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కదా. వినిపిస్తూ-వినిపిస్తూ చివరిలో - అల్లాను అర్థం చేసుకున్నా చాలు అని రెండు మాటలను చెప్తారు. భగవంతుడిని తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారాన్ని కూడా తెలుసుకుంటారు. కేవలం అది అర్థం చేయించినా చాలు. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు, పాస్ విత్ ఆనర్లుగా అవ్వలేరు, వారు కర్మాతీత అవస్థను పొందలేరు, ఇందులో ఎంతో శ్రమించాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని ధారణ చేయడంలో కూడా శ్రమ ఉంటుంది. ఈ రెండు విషయాలలో అందరూ చురుకైనవారిగా అయిపోవడం అనేది కూడా జరగదు. రాజధాని స్థాపన అవుతోంది. అందరూ నరుని నుండి నారాయణునిగా ఎలా అవ్వగలరు. ఈ గీతా పాఠశాల యొక్క లక్ష్యము-ఉద్దేశ్యము అదే. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరు ఇస్తారు, ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది స్మశానవాటిక, ఇదే మళ్ళీ స్వర్గముగా అవ్వనున్నది.

ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చొని పూజారుల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. సైన్స్ వారు కూడా ఎంత తెలివైనవారిగా అవుతూ ఉంటారు, ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు. భారతవాసులు ప్రతి విషయము యొక్క తెలివితేటలను అక్కడి నుండి నేర్చుకొని వస్తారు. వారు కూడా చివరిలో వస్తారు, కానీ ఇంత జ్ఞానాన్ని తీసుకోరు. మళ్ళీ అక్కడకు కూడా వచ్చి ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు, వారు రాజు-రాణులుగానైతే అవ్వలేరు, రాజు-రాణుల ముందు సేవలో ఉంటారు. అటువంటి ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు. రాజు-రాణులుగా అయ్యేది సుఖము కొరకే. అక్కడైతే అన్ని సుఖాలు లభించనున్నాయి. కావున పిల్లలు పూర్తి పురుషార్థమును చేయాలి. పూర్తిగా పాస్ అయి కర్మాతీత అవస్థను పొందాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. తండ్రి చదివిస్తున్నారు. ఇది మనుష్యులను పరివర్తన చేసే మిషన్. బౌద్ధుల, క్రిస్టియన్ల మిషన్ ఉంటుంది కదా. కృష్ణుడు మరియు క్రిస్టియన్ల రాశి కూడా కలుస్తుంది. వారి మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాల సంబంధం కూడా ఎంతో ఉంది. ఎవరైతే ఇంతగా సహాయం చేస్తారో వారి భాష మొదలైనవాటిని వదిలివేయడం కూడా ఒక రకమైన అవమానమే. వారైతే చివరిలోనే వస్తారు. వారు అంత ఎక్కువ సుఖాన్ని పొందరు, అంత ఎక్కువ దుఃఖాన్ని పొందరు. మొత్తం ఇన్వెన్షన్ లన్నింటినీ వారే కనుగొంటారు. ఇక్కడ ప్రయత్నిస్తారు కానీ అంత ఏక్యురేట్ గా తయారుచేయలేకపోతారు, విదేశీ వస్తువులు బాగుంటాయి. వారు నిజాయితీగా తయారుచేస్తారు. ఇక్కడ నిజాయితీగా తయారుచేయరు, అపారమైన దుఃఖము ఉంది. అందరి దుఃఖాలనూ దూరం చేసేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకే మానవమాత్రులూ కాలేరు. విశ్వములో శాంతి ఏర్పడాలని ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాతల దుఃఖాల విషయమే కాదు, ఇక్కడైతే అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతటిలోనూ కొట్లాటలు, దెబ్బలాటల విషయమే ఉంది. ఎందుకూ కొరగాని విషయాలకు దెబ్బలాటలు ఆడుకుంటారు. అక్కడైతే దుఃఖం అనే విషయమే ఉండదు. ఈ లెక్కను కూడా తీయాలి. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభమవ్వవచ్చు. భారత్ లోకి రావణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. వేర్వేరు అయిపోతారు, పరస్పరం కొట్లాడుకుని మరణిస్తారు, అప్పుడు బయటివారు వస్తారు. మొదట బ్రిటిష్ వారు లేరు, వారు తర్వాత వచ్చి మధ్యలో లంచం మొదలైనవి ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. కొత్తవారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం కదా, ఇది మళ్ళీ కనుమరుగైపోతుంది. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత అది కనుమరుగైపోతుంది. ఇది ఒకటే చదువు, ఇది ఒకేసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది. మున్ముందు, మీరు ఇలా అవుతారు అని మీ అందరికీ సాక్షాత్కారాలవుతాయి, కానీ ఆ సమయంలో ఏమి చేయగలరు, ఉన్నతిని పొందలేరు. రిజల్టు వెలువడ్డాక ఇక ట్రాన్స్ఫర్ అయ్యే విషయమే ఉంటుంది. ఆ తర్వాత ఏడుస్తారు, రోదిస్తారు. మనం కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ అయిపోతాము. త్వరత్వరగా నలువైపులా శబ్దం వ్యాపించాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత తమంతట తామే సెంటర్ల వద్దకు పరుగెడుతూ ఉంటారు. కానీ ఎంత ఆలస్యమవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటారు. అప్పుడిక ఏమీ జమ అవ్వదు, ధనం యొక్క అవసరం ఉండదు. అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జి చాలు. ఈ బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. ఈ బ్యాడ్జి ఎటువంటిదంటే ఇందులో అన్ని శాస్త్రాల సారము ఇమిడి ఉంది. బాబా బ్యాడ్జికు ఎంతో మహిమ చేస్తారు. మీ ఈ బ్యాడ్జిని అందరూ తమ కళ్ళకు హత్తుకునే సమయము కూడా వస్తుంది. మన్మనాభవ - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇలా అవుతారు అని ఇందులో ఉంది. మళ్ళీ వీరే 84 జన్మలను తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకోనివారు ఒక్క తండ్రే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి యొక్క కృషి మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత అవస్థను పొందే పురుషార్థము చేయాలి. జ్ఞాన సాగరుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి.

2. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో, దానిని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. కొంచెము కూడా అపవిత్రత యొక్క అంశము ఉండకూడదు. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము... ఈ అభ్యాసము చేయాలి.

వరదానము:-

సమయము మరియు సంకల్పము రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి జమ ఖాతాను పెంచుకొనే పదమాపదమపతి భవ

ఖజానాలైతే ఎన్నో ఉన్నాయి కానీ సమయము మరియు సంకల్పాలు, విశేషంగా ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ప్రతి సమయమూ సంకల్పము శ్రేష్ఠమైనదిగా మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమ ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయములో ఒకటి జమ చేసుకుంటే పదమాలు లభిస్తాయి, లెక్క ఉంది. ఒకటికి పదమాల రెట్లుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది. అందుకే ఏం జరిగినా కానీ, త్యాగము చెయ్యవలసి వచ్చినా, తపస్య చెయ్యవలసి వచ్చినా, నిర్మానముగా అవ్వవలసి వచ్చినా, ఏం జరిగినా కానీ... ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉన్నట్లయితే పదమాపదమపతులుగా అవుతారు.

స్లోగన్:-

మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రారబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది.