ఓంశాంతి
జ్ఞానము మరియు అజ్ఞానము. భక్తులు ఎవరిని మహిమ చేస్తున్నారు మరియు ఇక్కడ కూర్చొని
ఉన్న పిల్లలైన మీరు ఎవరి మహిమను వింటున్నారు అన్న జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీలో
ఉంది. ఈ రెండింటికీ రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారైతే కేవలం మహిమను పాడుతూ
ఉంటారు. వారికి అంత ప్రేమ ఉండదు ఎందుకంటే తండ్రి పరిచయము లేదు. నేను ప్రేమ సాగరుడను
మరియు మిమ్మల్ని ప్రేమ సాగరులుగా తయారుచేస్తున్నాను అని మీకు తండ్రి పరిచయాన్ని
ఇచ్చారు. తండ్రి ప్రేమ సాగరుడు, వారు అందరికీ ఎంతగా ప్రియమనిపిస్తారు. అక్కడ కూడా
అందరూ ఒకరినొకరు ప్రేమిస్తారు. ఇది మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఎవరితోనూ
విరోధముండకూడదు, అలా ఉంటే బాబా ఉప్పునీరులా ఉండటము అని అంటారు. లోలోపల ఎవరి పట్ల
ద్వేషం ఉండకూడదు. ద్వేషించేవారు కలియుగీ నరకవాసులు. మనమంతా సోదరీ-సోదరులమని మీకు
తెలుసు. శాంతిధామంలో ఉన్నప్పుడైతే సోదరులము. ఇక్కడ కర్మక్షేత్రములో పాత్రను
అభినయించేటప్పుడు, సోదరీ-సోదరులము. మనము ఈశ్వరీయ సంతానము. జ్ఞాన సాగరుడు, ప్రేమ
సాగరుడు అన్నది ఈశ్వరుని మహిమ, అనగా వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఏ విధంగా తండ్రి
భవిష్య 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తారో, అదే విధంగా నేను కూడా ఆ కార్యం చేస్తున్నానా
అని మీరందరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ తండ్రికి సహాయకులుగా అవ్వకపోతే,
ప్రేమించకపోతే, ఒకరి పట్ల ఒకరికి ప్రీతి లేకపోతే, విపరీత బుద్ధికలవారిగా ఉంటే
వినాశనమైపోతారు. విపరీత బుద్ధి కలవారిగా ఉండడం అసురుల పని. స్వయాన్ని ఈశ్వరీయ
సాంప్రదాయులు అని చెప్పుకుంటూ, ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటే వారిని అసురులని అంటారు.
పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. మీరు ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త తండ్రికి
పిల్లలు. కావున దుఃఖమునిచ్చే ఆలోచన కూడా మీకు రాకూడదు. వారు ఆసురీ సాంప్రదాయానికి
చెందినవారు, ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారు కాదు, ఎందుకంటే వారు దేహాభిమానులు.
వారెప్పుడూ స్మృతియాత్రలో ఉండలేరు. స్మృతియాత్ర లేకుండా కళ్యాణము జరగదు.
వారసత్వమునిచ్చే తండ్రినైతే తప్పకుండా స్మృతి చేయాలి, అప్పుడు వికర్మలు
వినాశనమవుతాయి. అర్ధకల్పము అయితే ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ వచ్చారు. పరస్పరము
ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ, విసిగించుకుంటూ ఉంటారు, వారు ఆసురీ సాంప్రదాయులుగా
భావించబడతారు. పురుషార్థులే అయి ఉండవచ్చు, అయినా కానీ ఇంకా ఎంతవరకని దుఃఖమునిస్తూ
ఉంటారు, అందుకే బాబా అంటున్నారు, మీ చార్టు వ్రాయండి. నా రిజిస్టరు బాగుపడుతూ ఉందా
లేక అదే ఆసురీ నడవడిక ఉందా అన్నది చార్టు పెడితే తెలుస్తుంది. బాబా సదా చెప్తుంటారు,
ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి, నింద-స్తుతి, మానావమానాలు, చలి-వేడి అన్నీ సహనం
చేయాలి. ఎవరైనా ఏదైనా అంటే శాంతిగా ఉండాలి. అంతేకానీ, వారిని ఇంకో రెండు మాటలు అనడం
కాదు. ఎవరైనా ఎవరికైనా దుఃఖమునిస్తే, వారికి తండ్రి అర్థము చేయిస్తారు కదా. పిల్లలు,
పిల్లలను అనడానికి వీల్లేదు. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. ఏ విషయమున్నా,
తండ్రి వద్దకు రావాలి. ఎవ్వరూ ఒకరినొకరు కొట్టుకోకూడదు అని గవర్నమెంట్ లో కూడా నియమం
ఉంది. ఫిర్యాదు చేయవచ్చు. చట్టాన్ని ఉపయోగించడం గవర్నమెంట్ పని. మీరు కూడా
గవర్నమెంట్ వద్దకు రండి. చేతిలోకి చట్టాన్ని తీసుకోకండి. ఇది అయితే మీ ఇల్లు. అందుకే
బాబా అంటారు, రోజూ కచేరి జరపండి. శివబాబా ఆర్డర్ చేస్తున్నారని కూడా అర్థము చేసుకోరు.
బాబా చెప్పారు, సదా శివబాబానే వినిపిస్తున్నారని భావించండి, బ్రహ్మా
వినిపిస్తున్నారని భావించకండి. సదా శివబాబానే చెప్తున్నారని భావిస్తే వారి స్మృతి
ఉంటుంది. మీకు జ్ఞానము వినిపించేందుకని శివబాబా ఈ రథము తీసుకున్నారు. సతోప్రధానంగా
అయ్యే మార్గాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు గుప్తమైనవారు. మీరు
ప్రత్యక్షంగా ఉన్నారు. ఏ డైరెక్షన్ లభించినా, అది శివబాబాదే అని భావించినట్లయితే
మీరు సురక్షితంగా ఉంటారు. మీరు బాబా-బాబా అని శివుడినే అంటారు. వారసత్వము కూడా వారి
నుండే లభిస్తుంది. వారితో ఎంత గౌరవంగా, రాయల్టీతో నడుచుకోవాలి. బాబా, మేము అయితే
లక్ష్మీ-నారాయణులుగా అవుతామని మీరు అంటారు కదా. అప్పుడు సెకెండ్, థర్డ్ గా అయినా
అవుతారు, సూర్య వంశీయులుగా కాకపోతే, చంద్ర వంశీయులుగా అయినా అవుతారు. అంతేకానీ మనం
దాస-దాసీలుగా అయినా పర్వాలేదు అని కాదు. ప్రజలుగా అవ్వడమైతే మంచిది కాదు. మీరైతే
ఇక్కడ దైవీ గుణాలనే ధారణ చేయాలి. ఆసురీ నడవడిక ఉండకూడదు. నిశ్చయము లేకపోతే ఇక
కూర్చుని-కూర్చునే - వీరిలోకి శివబాబా వస్తున్నారని నేనైతే అనుకోవడం లేదు అని
అనేస్తారు. మాయా భూతము వస్తే పరస్పరములో ఇలా అనుకుంటారు. ఆసురీ స్వభావము కలవారు
పరస్పరము కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడడం మొదలుపెడతారు, ఆసురీ మాటలే నోటి నుండి
వెలువడుతూ ఉంటాయి. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు రూప్-బసంత్ గా అవుతారు. మీ నోటి
నుండి రత్నాలే వెలువడాలి. ఒకవేళ రాళ్ళు వెలువడితే, ఆసురీ బుద్ధి ఉన్నట్లు.
పాట కూడా పిల్లలు విన్నారు. బాబా ప్రేమసాగురుడు, సుఖసాగరుడు అని పిల్లలంటారు. ఈ
మహిమ శివబాబాదే. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి
చెప్తున్నారు. ఇందులో చాలా మంచి-మంచి పిల్లలు ఫెయిల్ అయిపోతారు. దేహీ-అభిమానీ
స్థితిలో ఉండలేరు. దేహీ-అభిమానిగా అయినప్పుడే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. చాలామంది
పిల్లలు వ్యర్థమైన విషయాలలో చాలా సమయాన్ని వృధా చేస్తారు. జ్ఞానం యొక్క విషయాలే
అటెన్షన్ లో ఉండవు. ఇంటిలోని గంగకు గౌరవమివ్వరు అనే గాయనము కూడా ఉంది. ఇంటి
వస్తువుకు అంత గౌరవమివ్వరు. కృష్ణుడు మొదలైనవారి చిత్రాలు ఇంట్లో ఉన్నా కూడా, మళ్ళీ
శ్రీనాథ ద్వారము మొదలైన చోట్లకు, అంత దూర-దూరాలకు ఎందుకు వెళ్తారు. శివుని మందిరాలలో
కూడా ఉండేది రాతి లింగాలే. పర్వతాల నుండి రాళ్ళు వస్తాయి, అవి అరిగి-అరిగి లింగాలుగా
తయారవుతాయి, అందులో కొన్ని-కొన్ని రాళ్ళకు బంగారం కూడా అంటుకుని ఉంటుంది. బంగారు
కైలాస పర్వతమని అంటారు. బంగారం, పర్వతాల నుండి వెలువడుతుంది కదా. అందువలన,
కొద్ది-కొద్దిగా బంగారం అంటుకుని ఉన్న రాళ్ళు కూడా ఉంటాయి, అవి మళ్ళీ చాలా బాగా
గుండ్రంగా అయినప్పుడు వాటిని అమ్ముతారు. విశేషంగా మార్బల్ వి కూడా తయారుచేస్తారు.
మీరు బయట ఇంతగా ఎందుకు భ్రమిస్తున్నారు అని ఇప్పుడు భక్తి మార్గానికి చెందినవారిని
అడిగినట్లయితే డిస్టర్బ్ అవుతారు. పిల్లలైన మీరు చాలా ధనాన్ని వృధా చేశారు అని
తండ్రి స్వయంగా చెప్తున్నారు. మీరు ఎదురుదెబ్బలు తినవలసి రావడం కూడా డ్రామాలోని
పాత్ర. ఇది ఉన్నదే జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం
వివేకం లభిస్తుంది. జ్ఞానము సుఖం యొక్క మార్గము, జ్ఞానము ద్వారా సత్యయుగ రాజ్యం
లభిస్తుంది. ఈ సమయంలో రాజా, రాణి మరియు ప్రజలు, అందరూ నరకానికి యజమానులు. ఎవరైనా
మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు స్వర్గ స్థాపన చేసే తండ్రి వద్ద కూర్చున్నామని
ఇప్పుడు మీరు అంటారు. జ్ఞాన బిందువులు లభిస్తాయి. కొద్దిగా జ్ఞానము విన్నా కూడా
స్వర్గములోకి తప్పకుండా వస్తారు, ఇక మిగిలినది పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. ఒక్క
చెంబు గంగా జలము నోట్లో వేసుకున్నా, పతితం నుండి పావనంగా అవుతారని భావిస్తారు.
చెంబుతో నింపుకొని తీసుకువెళ్తారు, ఆ తర్వాత రోజూ దాని నుండి ఒక్కొక్క చుక్క నీటిలో
కలుపుకుని స్నానము చేస్తారు. అలా చేస్తే, అది గంగా స్నానము అవుతుందని భావిస్తారు.
విదేశాలకు కూడా గంగా జలము నింపుకొని తీసుకువెళ్తారు. ఇదంతా భక్తి.
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మాయ చాలా తీవ్రంగా చెంపదెబ్బ
వేస్తుంది, వికర్మలు చేయిస్తుంది, అందుకే కచేరి చేయండి, మీకు మీరే కచేరి చేసుకోవడం
మంచిది. మీకు మీరే రాజ్యతిలకము దిద్దుకుంటారు కనుక స్వయాన్ని చెక్ చేసుకోవాలి.
తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఇలా ఇలా చేయండి, దైవీ గుణాలు ధారణ చేయండి
అని తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. మీకైతే సంతోషంలో
రోమాలు నిక్కబొడుచుకోవాలి. అనంతమైన తండ్రి లభించారు, వారి సేవలో సహాయకులుగా అవ్వాలి.
అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఎంత ఎక్కువగా అలా అవుతారో, అంతగా మీ కళ్యాణమే
జరుగుతుంది. బాబానైతే పదే-పదే స్మృతి చేయాలి. నిష్ఠలో ఒక చోట కూర్చునే విషయం లేదు.
నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయాలి. ట్రైన్ లో కూడా మీరు సేవ చేయవచ్చు.
ఉన్నతోన్నతమైనవారు ఎవరు అన్నది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు, వారిని స్మృతి
చేయండి, వారసత్వము వారి నుండే లభిస్తుంది. ఆత్మకు తండ్రి నుండి అనంతమైన వారసత్వం
లభిస్తుంది. ఎవరైనా దాన-పుణ్యాలు చేస్తే, రాజుల వద్ద జన్మ తీసుకుంటారు, అది కూడా
అల్పకాలికముగానే. సదా కోసం రాజుగా అవ్వలేరు. ఇక్కడైతే 21 జన్మలకు గ్యారంటీ ఉంది అని
తండ్రి చెప్తున్నారు. మనం అనంతమైన తండ్రి నుండి ఈ వారసత్వము తీసుకుని వచ్చామని
అక్కడ తెలియదు. ఈ జ్ఞానము ఈ సమయములో మీకు లభిస్తుంది కావున ఎంత బాగా పురుషార్థము
చేయాలి. పురుషార్థము చేయకపోతే మీ కాళ్ళను మీరే గొడ్డలితో నరుక్కున్నట్లు. చార్టు
వ్రాస్తూ ఉంటే భయముంటుంది. కొంతమంది వ్రాస్తారు కూడా, అయితే, బాబా చూస్తే ఏమంటారో
అని అనుకుంటారు. నడవడికలో చాలా తేడా ఉంటుంది. కావున తండ్రి అంటారు - నిర్లక్ష్యము
విడిచిపెట్టండి, లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మీ పురుషార్థము చివర్లో
తప్పకుండా సాక్షాత్కారమవుతుంది, అప్పుడు కల్ప-కల్పము ఇదే వారసత్వము లభిస్తుందా అని
చాలా ఏడ్వవలసి వస్తుంది. వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. ఇంతకుముందు ధ్యానములోకి
వెళ్ళి ఫలానావారు దాసి, ఫలానావారు ఇది - అని వినిపించేవారు. తర్వాత దీనిని బాబా
ఆపేసారు. చివర్లో పిల్లలైన మీకు మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి. సాక్షాత్కారము
చేయించకుండా శిక్షలెలా లభిస్తాయి. నియమమే లేదు.
పిల్లలకు యుక్తులు కూడా చాలా అర్థం చేయించడం జరుగుతుంది, మీరు మీ పతికి ఇలా
చెప్పండి - బాబా చెప్తున్నారు, పిల్లలూ, కామము మహాశత్రువు, దీనిపై విజయం పొందండి,
మాయను జయించి జగజ్జీతులుగా అవ్వండి అని, ఇప్పుడు నేను స్వర్గానికి యజమానిగా అవ్వాలా
లేక మీ కారణంగా అపవిత్రంగా అయి నరకములోకి వెళ్ళాలా, అని చాలా ప్రేమగా, నమ్రతతో అర్థం
చేయించండి. నన్ను నరకములోకి ఎందుకు తోస్తున్నారు. ఈ విధంగా అర్థం చేయిస్తూ, అర్థం
చేయిస్తూ చివరికి వారి పతులను తీసుకొచ్చిన కుమార్తెలు చాలామంది ఉన్నారు. అప్పుడు,
ఈమె నాకు గురువు, ఈమె నాకు చాలా మంచి మార్గాన్ని తెలియజేసారని పతి అంటారు. బాబా
వద్దకు వచ్చి పాదాలపై పడతారు. అప్పుడప్పుడు గెలుపు, అప్పుడప్పుడు ఓటమి కూడా
కలుగుతుంది. పిల్లలు చాలా-చాలా మధురంగా అవ్వాలి. ఎవరైతే సేవ చేస్తారో, వారే ప్రియంగా
అనిపిస్తారు. భగవంతుడైన తండ్రి పిల్లల వద్దకు వచ్చారు, వారి శ్రీమతంపై నడవాల్సి
ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే తుఫాను రావడంతో పడిపోతారు. అటువంటివారు కూడా ఉన్నారు,
వారు దేనికి పనికొస్తారు. ఈ చదువు సాధారణమైనదేమీ కాదు. ఇతర సత్సంగాలు
మొదలైనవాటిలోనైతే కర్ణరసము ఉంటుంది, దానితో అల్పకాలిక సుఖం లభిస్తుంది. ఈ తండ్రి
ద్వారానైతే 21 జన్మలకు సుఖము లభిస్తుంది. బాబా సుఖ-శాంతుల సాగరుడు, మనకు కూడా తండ్రి
నుండి వారసత్వము లభించేది ఉంది. సేవ చేస్తేనే లభిస్తుంది, కనుక బ్యాడ్జి సదా ధరించి
ఉండాలి. మనము ఇటువంటి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. నేను ఎవ్వరికీ దుఃఖమునివ్వటం
లేదు కదా, ఆసురీ నడవడికను నడవడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. మాయ ఎటువంటి పనులు
చేయిస్తుందంటే ఇక అడగకండి. మంచి-మంచి కుటుంబాల వారు కూడా, మాయ ఈ వికర్మలు చేయించింది
అని చెప్తారు. కొంతమంది సత్యము చెప్తారు, కొంతమంది సత్యము చెప్పకపోతే వంద రెట్ల
శిక్షను పొందుతారు. ఆ తర్వాత ఆ అలవాటు పెరిగిపోతూ ఉంటుంది. తండ్రికి
వినిపించినట్లయితే బాబా సావధాన పరుస్తారు. పాపము చేస్తే రిజిస్టరులో వ్రాసి నాకు
తెలియజేస్తే మీ పాపం సగం సమాప్తమైపోతుంది అని బాబా అంటున్నారు. ఒకవేళ వినిపించకుండా,
దాచిపెడితే, ఇక మళ్ళీ-మళ్ళీ చేస్తూనే ఉంటారు. శాపము లభిస్తుంది. చెప్పకపోతే ఒకసారికి
బదులుగా 100 సార్లు చేస్తూ ఉంటారు. బాబా ఎంత మంచి సలహానిస్తున్నారు కానీ కొంతమందిపై
ఎటువంటి ప్రభావముండదు. తమ భాగ్యాన్ని తామే కాలదన్నుకుంటూ ఉంటారు. చాలా-చాలా నష్టం
కలిగిస్తారు. ఇలా-ఇలా అవుతారని చివర్లో అందరికీ సాక్షాత్కారమవుతుంది. క్లాసులో
ట్రాన్స్ఫర్ అయినప్పుడు మార్కులు వస్తాయి కదా. ట్రాన్స్ఫర్ అయ్యే ముందే ఫలితాలు
వెలువడుతాయి. మీరు కూడా మీ క్లాసుకు వెళ్ళినప్పుడు మార్కులు తెలుస్తాయి, అప్పుడు
చాలా వెక్కి-వెక్కి ఏడుస్తారు. కానీ అప్పుడు ఏం చేయగలరు? రిజల్టు అయితే
వెలువడిపోయింది కదా. అదృష్టంలో ఏముంటే అది తీసుకున్నారు. బాబా పిల్లలందరినీ
సావధానపరుస్తున్నారు. కర్మాతీత అవస్థ ఇప్పుడే ఏర్పడదు. కర్మాతీత అవస్థ తయారైపోతే ఇక
శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏవో కొన్ని వికర్మలు మిగిలి ఉన్నాయి,
లెక్కాచారాలు ఉన్నాయి, అందుకే యోగము పూర్తిగా కుదరదు. మేము కర్మాతీత అవస్థలో
ఉన్నామని ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. సమీపంగా వచ్చే కొద్ది చాలా గుర్తులు కనిపిస్తాయి.
మీ అవస్థపై మరియు వినాశముపైనే అంతా ఆధారపడి ఉంది. మీ చదువు పూర్తయ్యేసరికి యుద్ధము
తలపై నిలబడి ఉంది అన్నది మీరు చూస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.