ఓంశాంతి
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తున్నారు -
మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి.
అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా! అలాగే తండ్రి అంటున్నారు - ఒకటేమో తండ్రి వైపు
అటెన్షన్ పెట్టండి. తండ్రి ఎంత మధురమైనవారు, వారిని ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు
అని అంటారు. కావున మీరు కూడా ప్రియముగా తయారవ్వాలి. మనసా-వాచా-కర్మణా ప్రతి
విషయములోనూ మీకు సంతోషము ఉండాలి. ఎవ్వరికీ కూడా దుఃఖమునివ్వకూడదు. తండ్రి కూడా
ఎవ్వరినీ దుఃఖితులుగా చేయరు. తండ్రి సుఖవంతులుగా చేయడానికే వచ్చారు. మీరు కూడా
ఎవ్వరికీ ఏ రకమైన దుఃఖమును ఇవ్వకూడదు. అటువంటి కర్మలేవీ చేయకూడదు. మనసులో కూడా ఇలా
రాకూడదు. కానీ ఆ అవస్థ చివరిలో ఉంటుంది. ఈ లోపు కర్మేంద్రియాలతో ఏదో ఒక పొరపాటు
జరుగుతుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తే, ఇతరులను కూడా ఆత్మ సోదరునిగా చూస్తే,
అప్పుడిక ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. శరీరాన్నే చూడనప్పుడు ఇక దుఃఖమెలా ఇస్తారు. ఇందులో
గుప్తమైన శ్రమ ఉంది. ఇదంతా బుద్ధితో చేసే పని. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా
అవుతున్నారు. మీరు పారసబుద్ధి కలవారిగా ఉన్నప్పుడు మీరు చాలా సుఖాన్ని చూసారు. మీరే
సుఖధామానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇది దుఃఖధామము. ఇది చాలా సాధారణమైన విషయము. ఆ
శాంతిధామము మన మధురమైన ఇల్లు. తర్వాత అక్కడ నుండి పాత్రను అభినయించడానికి వచ్చాము,
దుఃఖపు పాత్రను చాలా సమయము అభినయించాము, ఇప్పుడిక సుఖధామములోకి వెళ్ళాలి, అందుకే
పరస్పరము ఒకరినొకరు సోదరులుగా భావించాలి. ఆత్మ ఆత్మకు దుఃఖమునివ్వలేదు. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మయే సింహాసనముపై విరాజమానమై ఉంది.
వీరు కూడా శివబాబా రథమే కదా. మేము శివబాబా రథాన్ని అలంకరిస్తున్నాము, శివబాబా
రథానికి తినిపిస్తున్నాము అని కుమార్తెలు అంటారు. అప్పుడు శివబాబాయే గుర్తుంటారు.
వారు ఉన్నదే కళ్యాణకారీ తండ్రి. వారు అంటారు, నేను 5 తత్వాల కళ్యాణము కూడా చేస్తాను.
అక్కడ ఎప్పుడూ ఏ వస్తువూ ఇబ్బంది కలిగించదు. ఇక్కడైతే ఒక్కోసారి తుఫాను, ఒక్కోసారి
చలి, ఒక్కోసారి ఒక్కోటి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది.
దుఃఖమన్న మాటే ఉండదు. అది ఉన్నదే స్వర్గము. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా
చేయడానికి తండ్రి వచ్చారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఉన్నతోన్నతమైన తండ్రి
ఉన్నతోన్నతమైన సుప్రీమ్ టీచర్ కూడా కావున వారు తప్పకుండా ఉన్నతోన్నతముగానే
తయారుచేస్తారు కదా. మీరే ఈ లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారు కదా. ఈ విషయాలన్నింటినీ
మీరు మర్చిపోయారు. వీటిని తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీకు రచయిత మరియు
రచనల గురించి తెలుసా అని ఋషులు, మునులు మొదలైనవారిని అడిగేవారు, అప్పుడు వారు
తెలియదు-తెలియదు అని అనేవారు, వారి వద్దే జ్ఞానము లేనప్పుడు ఇది మరి పరంపరగా ఎలా
కొనసాగుతుంది. తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడు మాత్రమే ఇస్తాను. మీకు
సద్గతి లభించిన తర్వాత ఇక జ్ఞానము యొక్క అవసరముండదు. అక్కడ దుర్గతి జరగనే జరగదు.
సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. ఇక్కడ ఉన్నది దుర్గతి. కానీ తాము దుర్గతిలో ఉన్నారు
అన్న విషయము కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు, నావికుడు
అని గాయనము చేస్తారు. వారు విషయ సాగరము నుండి అందరి నావలను ఆవలి తీరానికి చేరుస్తారు,
దానిని క్షీరసాగరమని అంటారు. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. ఇదంతా భక్తి
మార్గములోని గాయనము. పెద్ద సరస్సులు ఉన్నాయి, వాటిలో విష్ణువు యొక్క పెద్ద
చిత్రాన్ని చూపిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే మొత్తము విశ్వమంతటిపైన
రాజ్యము చేసారు. అనేక సార్లు ఓడిపోయారు మరియు గెలుపొందారు. తండ్రి అంటారు, కామము
మహాశత్రువు, దానిపై విజయము పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు, కావున
సంతోషముగా అలా తయారవ్వాలి కదా. గృహస్థ వ్యవహారములో, ప్రవృత్తి మార్గములో ఉండండి కానీ
కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా
తయారవుతున్నారు. ఇది ముళ్ళ అడవి అని అర్థమవుతుంది, ఒకరినొకరు ఎంతగా విసిగించుకుంటూ
ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు.
మీ అందరిదీ ఇప్పుడు వానప్రస్థ అవస్థ అని తండ్రి మధురాతి మధురమైన పిల్లలతో
అంటున్నారు. చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థయే. మీరు వాణి నుండి అతీతముగా
వెళ్ళేందుకు చదువుకుంటారు కదా. మీకు ఇప్పుడు సద్గురువు లభించారు. వారు
వానప్రస్థములోకి మిమ్మల్ని తీసుకువెళ్ళే తీరుతారు. ఇది యూనివర్శిటీ. భగవానువాచ కదా
- నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారుచేస్తాను. ఎవరైతే పూజ్య
రాజులుగా ఉండేవారో, వారే తిరిగి పూజారి రాజులుగా అవుతారు. కావున తండ్రి అంటారు -
పిల్లలూ, మంచి రీతిలో పురుషార్థము చేయండి. దైవీ గుణాలను ధారణ చేయండి. బాగా తినండి,
తాగండి, శ్రీనాథ ద్వారానికి వెళ్తే వెళ్ళండి. అక్కడ నేతితో తయారుచేసిన వస్తువులు
చాలా లభిస్తాయి, నేతి బావులే తయారుచేయబడి ఉన్నాయి. అవన్నీ ఎవరు తింటారు? పూజారులు.
శ్రీనాథుడిని, జగన్నాథుడిని, ఇరువురి మూర్తులను నల్లగా తయారుచేసారు. జగన్నాథ
మందిరములో దేవతలవి అశుద్ధమైన చిత్రాలు ఉన్నాయి, అక్కడ అన్నము పెద్ద-పెద్ద అండాలలో
వండుతారు. అది ఉడికిన తర్వాత నాలుగు భాగాలుగా అవుతుంది. అక్కడ కేవలం అన్నమే
నైవేద్యముగా పెడతారు ఎందుకంటే ఈ సమయములో సాధారణముగా ఉన్నారు కదా. ఇటువైపు పేదవారిగా
ఉన్నారు, అటువైపు షావుకారులుగా ఉంటారు. ఇప్పుడెంత పేదవారిగా ఉన్నారో చూడండి.
తినడానికి-తాగడానికి ఏమీ లభించదు. సత్యయుగములోనైతే అన్నీ ఉంటాయి. తండ్రి కూర్చుని
ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. శివబాబా చాలా మధురమైనవారు. వారు నిరాకారుడు. ఆత్మను
ప్రేమించడము జరుగుతుంది కదా. ఆత్మనే పిలవడము జరుగుతుంది. శరీరమైతే కాలిపోయింది. వారి
ఆత్మను పిలుస్తారు, జ్యోతిని వెలిగిస్తారు ఎందుకంటే ఆత్మ అంధకారములో ఉందని
భావిస్తారు. ఆత్మ శరీరము లేకుండా ఉంటుంది, అటువంటప్పుడు అంధకారము మొదలైనవాటి విషయము
ఎలా ఉంటుంది? అక్కడ ఈ విషయాలు ఉండవు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి ఎంత బాగా అర్థం
చేయిస్తున్నారు. జ్ఞానము చాలా మధురమైనది. ఇక్కడ కళ్ళు తెరుచుకుని వినవలసి ఉంటుంది.
తండ్రినైతే చూస్తారు కదా. శివబాబా ఇక్కడ విరాజమానమై ఉన్నారని మీకు తెలిసినప్పుడు మరి
కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి కదా. అనంతమైన తండ్రిని చూడాలి కదా. పూర్వము కుమార్తెలు
బాబాను చూడగానే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు, పరస్పరములో కూడా కూర్చుని-కూర్చునే
ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. కళ్ళు మూసుకుని పరుగెడుతూ ఉండేవారు. అది అద్భుతము కదా.
తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఒకరినొకరు చూసినప్పుడు నేను సోదరునితో (ఆత్మతో)
మాట్లాడుతున్నాను, సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి. మీరు అనంతమైన
తండ్రి సలహాను పాటించరా? మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అయితే పవిత్ర ప్రపంచానికి
యజమానులుగా అవుతారు. బాబా అనేకమందికి అర్థం చేయిస్తుంటారు, కొందరైతే వెంటనే - బాబా,
మేము తప్పకుండా పవిత్రముగా అవుతామని అంటారు. పవిత్రముగా ఉండడమనేది మంచిది. కుమారీ
పవిత్రముగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు. వివాహము చేసుకున్నట్లయితే
ఆమె పూజారిగా అయిపోతుంది. ఆమె అందరికీ తల వంచి నమస్కరించవలసి ఉంటుంది. కావున
పవిత్రత మంచిది కదా. పవిత్రత ఉన్నట్లయితే సుఖము, సమృద్ధి ఉంటుంది. అంతా పవిత్రతపైనే
ఆధారపడి ఉంది. ఓ పతిత-పావనా, రండి అని పిలుస్తారు కూడా. పావన ప్రపంచములో రావణుడు
ఉండనే ఉండడు. అది ఉన్నదే రామ రాజ్యము, అందరూ క్షీరఖండము (పాలు-పంచదార) వలె
కలిసి-మెలిసి ఉంటారు. అది ధర్మయుక్తమైన రాజ్యము కావున రావణుడు ఎక్కడ నుండి వస్తాడు.
రామాయణము మొదలైనవి ఎంత ప్రేమగా కూర్చుని వినిపిస్తారు. ఇదంతా భక్తి. కుమార్తెలు
సాక్షాత్కారాలలో నాట్యము చేయడము మొదలుపెడతారు. సత్యము యొక్క నావ గురించైతే గాయనము
ఉంది - అది ఊగిసలాడుతుంది కానీ మునగదు అని. ఇతర ఏ సత్సంగాలకు వెళ్ళేందుకు వద్దని
చెప్పరు. ఇక్కడకు వద్దామంటే ఎంతగా ఆపుచేస్తారు. తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తారు.
మీరు బి.కె.లుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి స్వర్గ
స్థాపనను చేసేవారు, కావున తప్పకుండా మనము కూడా స్వర్గానికి యజమానులుగా ఉండాలి.
మనమిక్కడ నరకములో ఎందుకు పడి ఉన్నాము. ఇప్పుడు అర్థమవుతుంది - మనము కూడా ఇంతకుముందు
పూజారులుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ 21 జన్మల కొరకు పూజ్యులుగా అవుతాము, 63 జన్మలు
పూజారులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ మనము పూజ్యులుగా, స్వర్గానికి యజమానులుగా అవుతాము.
ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానము. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే
రాజుగా తయారుచేస్తాను. పతిత రాజులు పావన రాజులకు నమస్కరిస్తారు, వందనము చేస్తారు.
ప్రతి మహారాజు యొక్క మహలులో మందిరము తప్పకుండా ఉంటుంది. ఆ మందిరము కూడా
రాధా-కృష్ణులది లేక లక్ష్మి-నారాయణులది లేక సీతా-రాములది ఉంటుంది. ఈ రోజుల్లోనైతే
గణేశుడు, హనుమంతుడు మొదలైనవారి మందిరాలను కూడా తయారుచేస్తూ ఉంటారు. భక్తి మార్గములో
ఎంత అంధవిశ్వాసము ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - తప్పకుండా మేము రాజ్యము
చేసాము, ఆ తర్వాత వామ మార్గములోకి పడిపోయాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు
- ఇది మీ అంతిమ జన్మ. మధురాతి మధురమైన పిల్లలూ, మొదట మీరు స్వర్గములో ఉండేవారు, ఆ
తర్వాత కిందకు దిగుతూ-దిగుతూ పూర్తిగా నేలపైకి పడిపోయారు. మీరు అంటారు - మేము చాలా
ఉన్నతముగా ఉండేవారము, మళ్ళీ తండ్రి మమ్మల్ని ఉన్నతముగా తయారుచేస్తున్నారు. మనము
ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చదువుతూనే వచ్చాము. దీనినే ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
రిపీట్ అవ్వడము అని అంటారు.
బాబా అంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను.
పూర్తి విశ్వముపై మీ రాజ్యము ఉంటుంది. బాబా, మీరు ఎటువంటి రాజ్యాన్ని ఇస్తారంటే,
దానిని ఎవ్వరూ లాక్కోలేరు అని పాటలో కూడా ఉంది కదా. ఇప్పుడైతే ఎన్ని విభజనలు ఉన్నాయి.
నీటి విషయములో, భూమి విషయములో గొడవలు జరుగుతూ ఉంటాయి. తమ-తమ ప్రాంతాలను
సంభాళించుకుంటూ ఉంటారు. అలా కాపాడుకోకపోతే, యువకులు (పిల్లలు) రాళ్ళు విసరడము
మొదలుపెడతారు. ఈ నవ యువకులు శక్తిశాలిగా అయి భారత్ ను రక్షిస్తారని వారు భావిస్తారు.
ఆ శక్తిని ఇప్పటినుండే చూపిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది
రావణ రాజ్యము కదా.
తండ్రి అంటారు, ఇది ఉన్నదే ఆసురీ సాంప్రదాయము. మీరు ఇప్పుడు దైవీ సాంప్రదాయానికి
చెందినవారిగా అవుతున్నారు. దేవతలకు మరియు అసురులకు మధ్యన యుద్ధము ఎలా జరుగుతుంది.
మీరైతే డబల్ అహింసకులుగా అవుతారు. దేవతలు డబల్ అహింసకులు. దేవీ-దేవతలను డబల్
అహింసకులు అని అనడము జరుగుతుంది. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మమని అంటారు. బాబా అర్థం
చేయించారు - ఎవరికైనా మాటలతో దుఃఖమునివ్వడము కూడా హింసయే. మీరు దేవతలుగా అవుతారు
కావున ప్రతి మాటలోనూ రాయల్టీ ఉండాలి. అన్నపానాదులు మొదలైనవి చాలా గొప్పగానూ ఉండకూడదు,
చాలా తక్కువరకంగానూ ఉండకూడదు. ఏకరసముగా ఉండాలి. రాజులు మొదలైనవారు చాలా తక్కువగా
మాట్లాడుతారు. ప్రజలకు కూడా రాజు అంటే చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రపంచములో ఎలా
ఉందో చూడండి. ఎన్ని విప్లవాలు జరుగుతున్నాయి. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి
పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు నేను వచ్చి విశ్వములో శాంతిని స్థాపన చేస్తాను.
అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలని ప్రభుత్వము కోరుకుంటుంది. అందరూ సోదరులే, కానీ ఇది
ఒక ఆట కదా. తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మీరు ఏమీ చింతించకండి. ధాన్యము విషయములో
ప్రస్తుతము చాలా కష్టమవుతుంది. అక్కడైతే ఎంత ధాన్యముంటుందంటే, ధనము వెచ్చించకుండానే
ఎంత కావాలంటే అంత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు.
మనము ఆరోగ్యాన్ని కూడా ఎలా తయారుచేసుకుంటామంటే, అక్కడ ఎప్పుడూ ఎటువంటి రోగమూ ఉండనే
ఉండదు, ఇది గ్యారంటీ. క్యారెక్టర్ ను కూడా మనము ఈ దేవతల వలె తయారుచేసుకుంటాము.
ఎటువంటి మినిస్టర్లు వస్తే, వారికి తగినట్లుగా అర్థం చేయించవచ్చు. యుక్తిగా అర్థం
చేయించాలి. అభిప్రాయాలు వ్రాసే పుస్తకములో చాలా బాగా వ్రాస్తారు. కానీ - అరే, మీరు
కూడా అర్థం చేసుకోండి కదా అని అంటే, మాకు తీరిక లేదని అంటారు. మీలాంటి పెద్దవారు
ఏదైనా శబ్దాన్ని వ్యాపింపజేస్తే పేదలకు కూడా మేలు జరుగుతుంది అని వారికి చెప్పాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అందరి తలపైన మృత్యువు నిలబడి ఉంది. ఇవాళ,
రేపు అంటూ-అంటూ మృత్యువు తినేస్తుంది. మీరు కుంభకర్ణుని వలె అయిపోయారు. ఇతరులకు
అర్థం చేయించడములో పిల్లలకు చాలా సంతోషము కూడా కలుగుతుంది. బాబాయే ఈ చిత్రాలు
మొదలైనవి తయారుచేయించారు. దాదాకు ఈ జ్ఞానము ఉండేది కాదు కదా. మీకు వారసత్వము లౌకిక
మరియు పారలౌకిక తండ్రుల నుండి లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వము లభించదు.
వీరు కేవలం మధ్యవర్తి మాత్రమే, వీరి నుండి వారసత్వము లభించదు. ప్రజాపిత బ్రహ్మాను
స్మృతి చేయకూడదు. నా ద్వారానైతే మీకు ఏమీ లభించదు, నేను కూడా చదువుకుంటున్నాను.
వారసత్వము అనేది ఒకటేమో హద్దులోనిది, మరొకటి అనంతమైన తండ్రి నుండి లభించేది.
ప్రజాపిత బ్రహ్మా ఏం వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి
చేయండి, వీరు రథము కదా. రథాన్ని అయితే స్మృతి చేయకూడదు కదా. ఉన్నతోన్నతమైనవారు
భగవంతుడు అని అంటారు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే అంతా
చేస్తుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఉంది
కదా. భ్రమరము కూడా మీరే. జ్ఞానము యొక్క భూ-భూ చేయండి. జ్ఞానాన్ని
వినిపిస్తూ-వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేయగలరు. విశ్వానికి
యజమానులుగా తయారుచేసే ఈ తండ్రిని ఎందుకు స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి వచ్చారు
కావున వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు. తీరిక లభించదు అని ఎందుకంటారు. మంచి-మంచి
పిల్లలైతే ఈ విషయాలను ఒక్క సెకెండులో అర్థం చేసుకుంటారు. బాబా అర్థం చేయించారు -
మనుష్యులు లక్ష్మిని పూజిస్తారు, ఇప్పుడు లక్ష్మి నుండి ఏం లభిస్తుంది మరియు అంబ
నుండి ఏం లభిస్తుంది? లక్ష్మి అయితే స్వర్గానికి దేవి. వారి నుండి ధనము కోసం భిక్షము
అడుగుతారు. అంబ అయితే విశ్వానికి యజమానిగా తయారుచేస్తారు, వారు అన్ని కోరికలను
పూర్తి చేస్తారు. శ్రీమతము ద్వారా అన్ని కోరికలు పూర్తవుతాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.