18-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇంటింటికీ తండ్రి సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత, ఎటువంటి పరిస్థితిలోనైనా యుక్తిని రచించి తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఇవ్వండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీకు ఏ విషయముపై అభిరుచి ఉండాలి?

జవాబు:-
ఏవైతే కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతాయో, వాటిని తమ వద్ద నోట్ చేసుకునే అభిరుచి ఉండాలి ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తుండడం కష్టము. నోట్స్ వ్రాసుకుని అప్పుడు ఎవరికైనా అర్థం చేయించాలి. అలాగని వ్రాసుకుని మళ్ళీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో, వారికి నోట్స్ వ్రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది.

పాట:-
ప్రపంచములోని లక్షలాదిమంది....

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అన్న ఈ మాటను ఒక్క తండ్రియే అనగలరు. ఆత్మిక తండ్రి తప్ప ఇక ఎప్పుడూ ఎవ్వరూ ఎవ్వరినీ ఆత్మిక పిల్లలు అని అనలేరు. ఆత్మలందరికీ ఒక్కరే తండ్రి అని, మనమందరము సోదరులము అని పిల్లలకు తెలుసు. బ్రదర్ హుడ్ (సోదర భావము) అని గానం కూడా చేస్తారు, అయినా కానీ మాయ ప్రవేశత ఎలా ఉందంటే దాని వలన పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు, మరి అది ఫాదర్ హుడ్ (పితృ భావము) అవుతుంది. రావణ రాజ్యము పాత ప్రపంచములోనే ఉంటుంది. కొత్త ప్రపంచములో రామ రాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. రెండు రాజ్యాలు తప్పకుండా ఉన్నాయి - ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యము. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రియే రచిస్తూ ఉండవచ్చు. ఈ ప్రపంచములో మనుష్యులు కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అనేది కూడా అర్థం చేసుకోరు. అనగా వారికి ఏమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు, వివేకహీనులుగా ఉండేవారు. కొత్త సుఖమయమైన ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు, మళ్ళీ పాత ప్రపంచములో దుఃఖము ఎందుకు ఉంటుంది, స్వర్గము నుండి నరకముగా ఎలా తయారవుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలనైతే మనుష్యులే తెలుసుకుంటారు కదా. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి అంటే తప్పకుండా ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఈ సమయములో అది లేదు. ఇప్పుడున్నది ప్రజలపై ప్రజల రాజ్యము. తండ్రి భారత్ లోనే వస్తారు. శివబాబా భారత్ లోకి వచ్చి ఏమి చేస్తారు అనేది మనుష్యులకు తెలియదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. మీరు ఇప్పుడు త్రిమూర్తి మరియు శివబాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బ్రహ్మా దేవత, విష్ణు దేవత, శంకర దేవత అని అంటారు, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు, కావున పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని యొక్క పరిచయాన్నే ఇవ్వాలి. ఈ విధంగా సేవ చేయాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా తండ్రి పరిచయం అందరికీ లభిస్తే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనము ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇంకా ఎంతోమంది వారసత్వాన్ని తీసుకోవాలి. ఇంటింటికీ తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మనపై ఉంది. వాస్తవానికి సందేశకుడు ఒక్క తండ్రియే. తండ్రి తమ పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి జ్ఞానాన్ని ఇవ్వాలి. ముఖ్యమైనది త్రిమూర్తి శివుని చిత్రము, దీనినే రాజముద్రికగా కూడా తయారుచేసారు. ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థము తెలియదు. అందులో రాట్నం వలె ఉన్న చక్రాన్ని కూడా చూపించారు మరియు అందులో సత్యమేవ జయతే అని వ్రాసారు. దీని నుండి అర్థమేమీ వెలువడదు. అవి సంస్కృత పదాలు. వాస్తవానికి తండ్రి అయితే ఉన్నదే ట్రూత్ (సత్యము). వారు ఏదైతే అర్థం చేయిస్తారో దాని ద్వారా పూర్తి విశ్వముపై మీకు విజయము లభిస్తుంది. తండ్రి అంటారు, నేను సత్యము చెప్తున్నాను, మీరు ఈ చదువు ద్వారా నిజంగా నారాయణునిగా అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు తీస్తూ ఉంటారు. అవి కూడా వారిని అడగాలి. బాబా అయితే అనేక రకాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడైతే మేళాలు జరుగుతాయో అక్కడి నదుల వద్దకు వెళ్ళి కూడా అర్థం చేయించండి. పతిత-పావని గంగ అయితే అవ్వదు. నదులు సాగరము నుండి వెలువడ్డాయి. అది నీటి సాగరము. దాని నుండి నీటి నదులు వెలువడుతాయి. జ్ఞాన సాగరుడి నుండి జ్ఞాన నదులు వెలువడుతాయి. మాతలైన మీలో ఇప్పుడు జ్ఞానము ఉంది. గోముఖము వద్దకు వెళ్తారు, దాని నోటి నుండి నీరు వెలువడుతుంది, దానిని గంగా జలము అని భావిస్తారు. ఎంతో చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడికి గంగా జలము ఎక్కడి నుండి వస్తుంది అనేది అర్థం చేసుకోరు. బాణము వేసారు మరియు గంగ వెలువడింది అన్నట్లుగా శాస్త్రాలలో ఉంది. ఇప్పుడు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అంతేకానీ అర్జునుడు బాణం వేసినప్పుడు గంగ వెలువడింది అని కాదు. ఎంత దూర-దూరాలలో ఉన్న తీర్థాలకు వెళ్తారు. శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడిందని, అందులో స్నానము చేయడంతో మనుష్యుల నుండి దేవకన్యల్లా అవుతారు అని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఇది కూడా దేవకన్యల వలె అవ్వడం వంటిదే కదా.

ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి, అందుకే బాబా ఈ చిత్రాలను తయారుచేయించారు. త్రిమూర్తి శివుని చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఉంది. వాళ్ళ యొక్క త్రిమూర్తి చిత్రములో కేవలం జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రము లేదు, జ్ఞానము తీసుకునేవారి చిత్రము ఉంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రముపై అర్థం చేయిస్తారు. పైన జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మాకు వారి నుండి జ్ఞానము లభిస్తుంది, దానిని వ్యాపింపజేస్తారు. దీనినే ఈశ్వరుని ధర్మ స్థాపన యొక్క మెషినరీ (యంత్రాంగము) అని అంటారు. ఈ దేవీ-దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. పిల్లలైన మీకు మీ సత్య ధర్మము యొక్క పరిచయము లభించింది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తారు అని మీకు తెలుసు. మీరు ఎంత సంతోషిస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీ సంతోషానికి అవధులు ఉండకూడదు ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడు. భగవంతుడు నిరాకారుడైన శివుడు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. సద్గతి అని సత్యయుగాన్ని అంటారు, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్తది అని, పాత ప్రపంచాన్ని పాతది అనే అంటారు. ఇప్పుడు ప్రపంచము పాతబడేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుంది అని మనుష్యులు భావిస్తారు. ఎంతగా తికమక చెంది ఉన్నారు. ఒక్క తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా అంటారు, నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి మిగిలినవారందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. ఎవరైతే నా మతముపై నడుచుకుంటారో వారు దేవతలుగా అవుతారు. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు, కొత్తవారు ఎవరైనా ఏమి అర్థం చేసుకుంటారు.

తోటమాలులైన మీ కర్తవ్యము, తోటను నాటి తయారుచేయడము. తోట యజమాని అయితే డైరెక్షన్ ఇస్తారు. బాబా ఏమీ కొత్తవారిని కలిసి జ్ఞానము ఇవ్వరు. ఈ పని తోటమాలులది. ఉదాహరణకు, బాబా కలకత్తా వెళ్ళారనుకోండి, అప్పుడు పిల్లలు - మేము మా ఆఫీసర్ ను, ఫలానా స్నేహితుడిని బాబా వద్దకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు. బాబా అంటారు, వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు. తెలివితక్కువవారిని ఎదురుగా తీసుకువచ్చి కూర్చోబెట్టినట్లు ఉంటుంది. అందుకే బాబా అంటారు, కొత్తవారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకురాకండి. ఇది తోటమాలులైన మీ పని, అంతేకానీ తోటయజమానిది కాదు. తోటను తయారుచేయడం తోటమాలుల పని. ఈ-ఈ విధంగా చేయండి అని తండ్రి డైరెక్షన్లు ఇస్తారు, అందుకే బాబా ఎప్పుడూ కొత్తవారిని కలవరు. కానీ ఎప్పుడైనా అతిథుల్లా ఇంటికి వస్తే వారు - మేము దర్శించుకుంటాము, మీరు మమ్మల్ని ఎందుకు కలవనివ్వడం లేదు? అని అడుగుతారు. శంకరాచార్యులు మొదలైనవారి వద్దకు ఎంతమంది వెళ్తారు. ఈ రోజుల్లో శంకరాచార్యునికి చాలా గొప్ప స్థానము ఉంది. చదువుకున్నవారే అయినా కానీ జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు కదా. ట్రస్టీలు ఆసనముపై ఎవరినైనా కూర్చోబెట్టెస్తారు. అందరి అభిప్రాయాలు ఎవరివి వారివి. తండ్రి స్వయం వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు - నేను కల్ప-కల్పము ఈ పాత తనువులోకి వస్తాను. వీరికి కూడా వీరి జన్మల గురించి తెలియదు. శాస్త్రాలలోనైతే కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలుగా వ్రాసేసారు. మనుష్యులైతే ఇన్ని జన్మలు తీసుకోలేరు, ఇక జంతువులు మొదలైనవాటి యోనులను కూడా కలిపి 84 లక్షలుగా చేసేసారు. మనుష్యులైతే ఏది వింటే దానిని సత్యము-సత్యము అని అంటూ ఉంటారు. శాస్త్రాలలోనైతే అన్నీ భక్తి మార్గపు విషయాలే ఉన్నాయి. కలకత్తాలో దేవీలవి చాలా శోభనీయమైన, సుందరమైన మూర్తులను తయారుచేస్తారు, అలంకరిస్తారు. మళ్ళీ వాటిని ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజలు చేసే పసిపిల్లల వంటివారే. పూర్తిగా అమాయకులు. ఇది నరకము అని మీకు తెలుసు. స్వర్గములోనైతే అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పటికీ కూడా ఎవరైనా మరణిస్తే ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు అంటే తప్పకుండా ఏదో ఒక సమయములో స్వర్గము ఉండేది, అది ఇప్పుడు లేదు. నరకము తర్వాత మళ్ళీ తప్పకుండా స్వర్గము వస్తుంది. ఈ విషయాల గురించి కూడా మీకే తెలుసు. మనుష్యులకైతే అంశమాత్రము కూడా తెలియదు. అటువంటప్పుడు కొత్తవారు ఎవరైనా బాబా ఎదురుగా కూర్చుని ఏమి చేస్తారు, అందుకే పూర్తి పాలన చేసేందుకు తోటమాలి కావాలి. ఇక్కడైతే తోటమాలులు కూడా ఎంతోమంది కావాలి. మెడికల్ కాలేజీలోకి ఎవరైనా కొత్తవారు వెళ్ళి కూర్చుంటే ఏమీ అర్థం చేసుకోరు. అలాగే ఈ జ్ఞానము కూడా కొత్తది. తండ్రి అంటారు, నేను అందరినీ పావనముగా తయారుచేయడానికే వచ్చాను. నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. ఈ సమయములో అందరూ తమోప్రధానమైన ఆత్మలు, అందుకే - ఆత్మయే పరమాత్మ, అందరిలోనూ పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు. కావున తండ్రి కూర్చుని ఇలాంటివారితో తల బాదుకోరు. ముళ్ళను పుష్పాలులా తయారుచేయడమనేది తోటమాలులైన మీ పని.

భక్తి రాత్రి, జ్ఞానము పగలు అని మీకు తెలుసు. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని గానం కూడా చేస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు అయితే తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. ఇంతమంది బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు, వీరి బ్రహ్మా ఎవరు అని కొందరు అడుగుతారు, వారికి ఆ మాత్రము తెలివి కూడా లేదు. అరే, ప్రజాపిత బ్రహ్మా అయితే ప్రసిద్ధమైనవారు, వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతుంది. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేసి, ఆ తర్వాత దేవతలుగా తయారుచేస్తారు.

ఏవైతే కొత్త-కొత్త పాయింట్లు వెలువడతాయో, వాటిని తమ వద్ద నోట్ చేసి పెట్టుకునే అభిరుచి పిల్లలకు ఉండాలి. ఏ పిల్లలైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారికి నోట్స్ వ్రాసుకునే అభిరుచి ఎంతగానో ఉంటుంది. నోట్స్ వ్రాసుకోవడం మంచిది, ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టము. నోట్స్ వ్రాసుకుని ఆ తర్వాత ఎవరికైనా అర్థం చేయించాలి. అలాగని వ్రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ నోట్స్ అలా పడి ఉండడం కాదు. కొత్త-కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటే ఇక పాత పాయింట్లు వ్రాసుకున్న కాపీలు అలా పడి ఉంటాయి. స్కూల్లో కూడా చదువుకుంటూ వెళ్తారు, ముందు తరగతి పుస్తకాలు అలా పడి ఉంటాయి. మీరు అర్థం చేయించేటప్పుడు చివరిలో ఇది అర్థం చేయించండి - మన్మనాభవ. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ముఖ్యమైన విషయము - నన్నొక్కరినే స్మృతి చేయండి, దీనినే యోగాగ్ని అని అంటారు. భగవంతుడు జ్ఞాన సాగరుడు. మనుష్యులు శాస్త్రాల సాగరులు. తండ్రి ఏమీ శాస్త్రాలు వినిపించరు, వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే ఇక భగవంతునికి మరియు మనుష్యులకు మధ్యన తేడా ఏముంది? తండ్రి అంటారు, ఈ భక్తి మార్గపు శాస్త్రాల సారము నేను మీకు అర్థం చేయిస్తాను.

ఆ మురళీని (పిల్లనగ్రోవును) వాయించేవారు పామును పట్టుకున్నప్పుడు దాని కోరలు తీసేస్తారు. తండ్రి కూడా విషాన్ని త్రాగడం నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఈ విషము వలనే మనుష్యులు పతితులుగా అయ్యారు. దీనిని వదిలేయండి అని తండ్రి అంటారు, అయినా కానీ వదలరు. తండ్రి తెల్లగా తయారుచేస్తారు, అయినా కానీ పడిపోయి నల్ల ముఖము చేసుకుంటారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన చితిపై కూర్చోబెట్టేందుకు వచ్చారు. జ్ఞాన చితిపై కూర్చోవడం ద్వారా మీరు విశ్వాధిపతులుగా, జగత్ జీతులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా సంతోషము ఉండాలి - మేము సత్య ధర్మ స్థాపనకు నిమిత్తులము. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. మా దేవీ-దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది.

2. తోటమాలులుగా అయి ముళ్ళను పుష్పాల వలె తయారుచేసే సేవను చేయాలి. పూర్తిగా పాలన చేసి అప్పుడు తండ్రి ముందుకు తీసుకురావాలి. కృషి చేయాలి.

వరదానము:-
పాత దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోయే బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారీ భవ

సంగమయుగీ శ్రేష్ఠ ఆత్మల స్థానము బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము. ఇటువంటి సింహాసనము పూర్తి కల్పములో లభించదు. విశ్వరాజ్యము లేక రాష్ట్ర రాజ్యము యొక్క సింహాసనమైతే లభిస్తూనే ఉంటుంది కానీ ఈ సింహాసనము లభించదు - ఇది ఎంతటి విశాలమైన సింహాసనమంటే దీనిపై నడవండి, తిరగండి, తినండి, పడుకోండి, అయినా కానీ సదా సింహాసనాధికారులుగా ఉండగలరు. ఏ పిల్లలైతే సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహము మరియు దైహిక ప్రపంచము నుండి విస్మృతులై ఉంటారు, దీనిని చూస్తూ కూడా చూడరు.

స్లోగన్:-
హద్దులోని పేరు, గౌరవము, ప్రతిష్ఠల వెనుక పరుగుపెట్టడం అనగా నీడ వెనుక పడడం వంటిది.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఎలాగైతే ఏదైనా కొత్త ఆవిష్కారమును అండర్ గ్రౌండ్లోకి వెళ్ళటం ద్వారా చెయ్యగలరో, అలాగే మీరు కూడా ఎంతగా అండర్ గ్రౌండ్ లో అనగా అంతర్ముఖులుగా ఉంటారో, అంతగా క్రొత్త-క్రొత్త ఆవిష్కరణలను మరియు ప్రణాళికలను కనుగొనగలరు. అండర్ గ్రౌండ్ లో ఉండటము ద్వారా ఒకటేమో వాయుమండలము నుండి రక్షణ లభిస్తుంది, రెండు ఏకాంతము ప్రాప్తించిన కారణముగా మనన శక్తి కూడా పెరుగుతుంది, మూడు ఏ రకమైన మాయా విఘ్నాల నుండైనా ఇది రక్షణా సాధనముగా అవుతుంది.