ఓంశాంతి
పిల్లలకు తెలుసు - ఓం అనగా నేను ఒక ఆత్మను, ఇది నా శరీరము. ఇప్పుడు మీరు ఈ డ్రామాను,
సృష్టి చక్రాన్ని మరియు సృష్టి చక్రము గురించి తెలిసిన తండ్రిని తెలుసుకున్నారు
ఎందుకంటే చక్రము గురించి తెలిసినవారిని రచయిత అనే అంటారు. రచయిత మరియు రచనల గురించి
ఇంకెవరికీ తెలియదు. ఎంతో చదువుకున్న గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారు
ఉన్నారు, వారికి తమ అహంకారము ఉంటుంది కదా, కానీ వారికి దీని గురించి తెలియదు.
జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు కూడా. ఇప్పుడు ఇవి మూడూ వేర్వేరు, వారికి
వీటి అర్థము కూడా తెలియదు. సన్యాసులకు తమ ఇంటి పట్ల వైరాగ్యము కలుగుతుంది. వాళ్ళకు
కూడా - ఉన్నతమైనవారు మరియు కనిష్ఠమైనవారు అన్న విషయాలలో ఈర్ష్య ఉంటుంది. ఇతను ఉన్నత
కులానికి చెందినవారు, ఇతను మధ్యమ కులానికి చెందినవారు అన్న విషయాలలో వారికి చాలా
పట్టింపు ఉంటుంది. కుంభ మేళాలో కూడా - ఎవరి ఊరేగింపు మొదట వెళ్ళాలి అన్న విషయముపై
వారికి చాలా గొడవ జరుగుతుంది. ఈ విషయములో చాలా గొడవ పడతారు, చివరికి పోలీసులు వచ్చి
విడిపిస్తారు. మరి ఇది కూడా దేహాభిమానమే కదా. ప్రపంచములో మనుష్యమాత్రులెవరైతే
ఉన్నారో, అంతా దేహాభిమానులే. మీరైతే ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి
అంటారు, దేహాభిమానాన్ని విడిచిపెట్టండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే
పతితముగా అయ్యింది, అందులో మాలిన్యము చేరింది. ఆత్మయే సతోప్రధానముగా, తమోప్రధానముగా
అవుతుంది. ఎటువంటి ఆత్మనో, అటువంటి శరీరము లభిస్తుంది. శ్రీకృష్ణుని ఆత్మ సుందరముగా
ఉంటుంది కావున శరీరము కూడా చాలా సుందరముగా ఉంటుంది, వారి శరీరములో ఎంతో ఆకర్షణ
ఉంటుంది. పవిత్ర ఆత్మయే ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడు పవిత్రమైన చిన్న బాలుడు కావున
శ్రీకృష్ణునికి ఉన్నంత మహిమ లక్ష్మీ-నారాయణులకు లేదు. ఇక్కడ కూడా చిన్న పిల్లలు
మహాత్ములతో సమానము అని అంటారు కదా. మహాత్ములైతే ఎంతైనా జీవితాన్ని అనుభవించి, ఆ
తర్వాత వికారాలను త్యజిస్తారు, వికారాల పట్ల వారికి ద్వేషము కలుగుతుంది. కానీ
పిల్లలైతే పవిత్రముగానే ఉంటారు, అందుకే వారిని ఉన్నతమైన మహాత్ములుగా భావిస్తారు.
తండ్రి అర్థం చేయించారు - ఈ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు కూడా ఈ సృష్టిని
కొంత నిలబెడతారు. ఏ విధంగా ఇల్లు సగము పాతదైన తర్వాత దానికి మరమ్మత్తులు చేయించడము
జరుగుతుందో, అలా సన్యాసులు కూడా మరమ్మత్తు చేస్తారు, వారు పవిత్రముగా ఉన్న కారణముగా
భారత్ ఎంతోకొంత నిలబడుతుంది. భారత్ వంటి పవిత్రమైన మరియు సంపన్నమైన ఖండము ఇంకేదీ
ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల స్మృతిని
కలిగిస్తున్నారు ఎందుకంటే వీరు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. గీతలో
శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాశారు, కానీ శ్రీకృష్ణుడిని ఎప్పుడైనా తండ్రీ అని అంటారా!
లేక పతిత-పావనా అని అంటారా. మనుష్యులు పతిత-పావనా అని అన్నప్పుడు శ్రీకృష్ణుడిని
తలచుకోరు, వారు భగవంతుడిని తలచుకుంటారు, మళ్ళీ పతిత-పావన సీతారామ్, రఘుపతి రాఘవ రాజా
రామ్ అని అంటారు. ఎంత తికమక ఉంది. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన మీకు యథార్థ
రీతిలో సర్వ వేద-శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. మొట్టమొదట ముఖ్యమైన విషయముగా ఏం
అర్థము చేయిస్తారంటే - మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి
చేయండి, అప్పుడు మీరు పావనముగా అవుతారు. మీరు పరస్పరము సోదరులు, ఆ తర్వాత బ్రహ్మా
సంతానముగా కుమార-కుమారీలు, కావున సోదర-సోదరీలు అయ్యారు. ఇది బుద్ధిలో గుర్తు ఉండాలి.
వాస్తవానికి ఆత్మలు పరస్పరము సోదరులు, తర్వాత ఈ శరీరములోకి రావటముతో సోదర-సోదరీలుగా
అవుతారు. ఈ మాత్రము అర్థం చేసుకునే బుద్ధి కూడా లేదు. వారు ఆత్మలైన మన తండ్రి కావున
మనము సోదరులమవుతాము కదా. మరి సర్వవ్యాపి అని ఎలా అంటారు. వారసత్వమనేది పిల్లలకే
లభిస్తుంది, అంతేకానీ తండ్రికి లభించదు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వము లభిస్తుంది.
బ్రహ్మా కూడా శివబాబాకు సంతానమే, వీరికి కూడా వారి నుండే వారసత్వము లభిస్తుంది. మీరు
మనవలు, మనవరాళ్ళు అవుతారు. మీకు కూడా హక్కు ఉంది. ఆత్మ రూపములో అందరూ కొడుకులే,
మళ్ళీ శరీరములోకి వస్తే సోదర-సోదరీలు అని అంటారు. వేరే ఏ సంబంధమూ లేదు. సదా పరస్పరము
సోదరులము అనే దృష్టి ఉండాలి, స్త్రీ-పురుషుల భానము కూడా తొలగిపోవాలి.
స్త్రీ-పురుషులు ఇద్దరూ, ఓ గాడ్ ఫాదర్ అని అంటున్నప్పుడు మరి పరస్పరము సోదర-సోదరీలు
అయినట్లు కదా. తండ్రి సంగమయుగములో వచ్చి రచనను రచించినప్పుడే సోదర-సోదరీలు అవుతారు.
కానీ స్త్రీ-పురుషుల దృష్టి చాలా కష్టము మీద తొలగుతుంది. తండ్రి అంటారు, మీరు
దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రికి పిల్లలుగా అయితేనే వారసత్వము లభిస్తుంది.
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా అవ్వకుండా
మీరు తిరిగి ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. ఈ యుక్తిని సన్యాసులు మొదలైనవారెవరు
ఎప్పుడూ చెప్పరు. వారెప్పుడూ - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి
అని చెప్పరు. తండ్రిని పరమపిత పరమాత్మ, సుప్రీమ్ అని అంటారు. అందరినీ ఆత్మ అని
అంటారు కానీ వారిని పరమ ఆత్మ అని అంటారు. ఆ తండ్రి అంటున్నారు - పిల్లలూ, నేను
పిల్లలైన మీ వద్దకు వచ్చాను. నాకు మాట్లాడేందుకు నోరు అయితే కావాలి కదా. ఈ రోజుల్లో
చూడండి, అన్ని చోట్ల గోముఖాన్ని తప్పకుండా పెడుతుంటారు. గోముఖము నుండి అమృతము
వెలువడుతుంది అని అంటారు. వాస్తవానికి అమృతము అని ఈ జ్ఞానమును అంటారు. జ్ఞానామృతము
నోటి నుండే వెలువడుతుంది. ఇందులో నీటి విషయము కాదు. ఇతను గోమాత కూడా. బాబా వీరిలో
ప్రవేశించారు, తండ్రి వీరి ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు, వీరి ద్వారా
జ్ఞానము వెలువడుతుంది. వారైతే ఒక రాయిని చెక్కి దానిలో ఒక నోరును తయారుచేసారు,
దానిలో నుండి నీరు వస్తుంది. అది భక్తిలోని ఆచారము కదా. యథార్థమైన విషయాలు మీకు
తెలుసు. భీష్మ పితామహులు మొదలైనవారికి కుమారీలైన మీరు బాణము వేసారు. మీరు
బ్రహ్మాకుమార, కుమారీలు. మరి కుమారీ అన్న తర్వాత ఆమె ఎవరికో అయితే కుమార్తె కదా.
అదర్ కుమారి మరియు కుమారి, ఇరువురి మందిరాలు ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఇవి మీ స్మృతి
చిహ్న మందిరాలు కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మీరు
బ్రహ్మాకుమార, కుమారీలు కావున మీకు వికారీ దృష్టి ఉండడానికి వీల్లేదు. లేదంటే చాలా
కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. దేహాభిమానములోకి రావడము వలన - మేము
సోదర-సోదరీలము అన్న విషయాన్ని మర్చిపోతారు. వారు కూడా బి.కె. మరియు మనము కూడా బి.కె.
అన్నప్పుడు వికారీ దృష్టి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఆసురీ సాంప్రదాయానికి చెందిన
మనుష్యులు వికారాలు లేకుండా ఉండలేరు కావున విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు
బ్రహ్మాకుమార, కుమారీలైన మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి శ్రీమతముపై
నడవాలి, పవిత్రముగా అవ్వాలి. ఇది ఈ వికారీ మృత్యులోకములోని అంతిమ జన్మ. ఇది కూడా
ఎవరికీ తెలియదు. అమరలోకములో వికారులెవ్వరూ ఉండరు. వారిని సతోప్రధాన సంపూర్ణ
నిర్వికారులు అని అంటారు. ఇక్కడ ఉన్నది తమోప్రధాన సంపూర్ణ వికారులు. వారు సంపూర్ణ
నిర్వికారులు, మేము వికారులము, పాపులము అని గానము కూడా చేస్తారు. సంపూర్ణ
నిర్వికారులకు పూజ చేస్తారు. తండ్రి అర్థం చేయించారు - భారతవాసులైన మీరే పూజ్యుల
నుండి మళ్ళీ పూజారులుగా అవుతారు. ఈ సమయములో భక్తి ప్రభావము ఎంతో ఉంది. మీరు వచ్చి
భక్తి ఫలాన్ని ఇవ్వండి అని భక్తులు భగవంతుడిని తలచుకుంటూ ఉంటారు. భక్తిలో ఎలాంటి
పరిస్థితి ఏర్పడిందో చూడండి. తండ్రి అర్థం చేయించారు - ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు
నాలుగు. ఒకటి దేవతా ధర్మము, ఇందులో బ్రాహ్మణులు, దేవతలు మరియు క్షత్రియులు ముగ్గురూ
వచ్చేస్తారు. తండ్రి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణుల పిలక
సంగమయుగానికి సంబంధించినది. బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు.
బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవుతారు. ఆ బ్రాహ్మణులు కూడా వికారులే. వారు
కూడా ఈ బ్రాహ్మణుల ఎదురుగా నమస్కరిస్తారు. బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు
ఎందుకంటే ఆ బ్రాహ్మణులు మిమ్మల్ని బ్రహ్మా సంతానముగా భావిస్తారు, వాళ్ళు తమను తాము
మేము బ్రహ్మా సంతానము కాదు కదా అని భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మాకు సంతానము.
మీకు అందరూ నమస్కరిస్తారు. మీరే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు
బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు, తర్వాత దైవీ కుమార-కుమారీలుగా అవుతారు.
ఈ సమయములో మీ ఈ జీవితము చాలా-చాలా అమూల్యమైనది ఎందుకంటే మీరు జగన్మాతలుగా గాయనము
చేయబడ్డారు. మీరు హద్దు నుండి బయటపడి అనంతములోకి వచ్చారు. మనము ఈ జగత్తుకు కళ్యాణము
చేసేవారము అని మీకు తెలుసు. కావున ప్రతి ఒక్కరూ జగన్మాతలు మరియు జగత్పితలు. ఈ
నరకములో మనుష్యులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, మనము వారికి ఆత్మిక సేవ చేయడానికి
వచ్చాము. మనము వారిని స్వర్గవాసులుగా తయారుచేసే తీరుతాము. మీరు సైన్యము, దీనిని
యుద్ధ స్థలము అని కూడా అంటారు. యాదవులు, కౌరవులు మరియు పాండవులు కలిసి ఉంటారు.
పరస్పరము సోదరులు కదా. ఇప్పుడు మీ యుద్ధము సోదర-సోదరీలతో కాదు, మీ యుద్ధము రావణుడితో
ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి సోదర-సోదరీలకు మీరు అర్థం చేయిస్తారు.
కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను
విడిచిపెట్టాలి. ఇది పాత ప్రపంచము. ఎంత పెద్ద-పెద్ద ఆనకట్టలను, కాలువలను
మొదలైనవాటిని నిర్మిస్తారు, ఎందుకంటే నీరు లేదు. ప్రజలు ఎంతగానో పెరిగిపోయారు.
అక్కడైతే మీరు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. అక్కడ నదులలో నీరు కూడా ఎంతో ఉంటుంది,
ధాన్యము కూడా ఎంతగానో ఉంటుంది. ఇక్కడైతే ఈ భూమిపై కోట్లాది మంది మనుష్యులు ఉన్నారు.
అక్కడ మొత్తము భూమిపై ప్రారంభములో 9-10 లక్షల మంది ఉంటారు. ఇతర ఖండాలేవీ ఉండనే ఉండవు.
మీరు కొద్దిమంది మాత్రమే అక్కడ ఉంటారు. మీకు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరము కూడా ఉండదు.
అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది. పంచ తత్వాలు కూడా ఏ కష్టమూ ఇవ్వవు, అన్నీ
నియమబద్ధముగా ఉంటాయి. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. అది ఉన్నదే స్వర్గము. ఇప్పుడు
ఉన్నది నరకము. ఇది మధ్యలో ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గములో పడిపోయినప్పుడు ఇక
రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. మనము ద్వికిరీటధారులుగా, పూజ్యులుగా అవుతాము, మళ్ళీ
సింగిల్ కిరీటధారులుగా అవుతాము అని మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో పవిత్రత
యొక్క చిహ్నముగా కూడా కిరీటము ఉంటుంది. దేవతలందరూ పవిత్రముగానే ఉంటారు. ఇక్కడ
పవిత్రమైనవారు ఎవరూ లేరు. జన్మ అనేది ఎంతైనా వికారాల ద్వారానే తీసుకుంటారు కదా,
అందుకే దీనిని భ్రష్టాచారీ ప్రపంచము అని అంటారు. సత్యయుగము శ్రేష్ఠాచారీ ప్రపంచము.
వికారాలనే భ్రష్టాచారము అని అంటారు. సత్యయుగములో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేదని,
వారు ఇప్పుడు అపవిత్రముగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్ర
శ్రేష్ఠాచారీ ప్రపంచము తయారవుతుంది. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. పరమపిత
పరమాత్మనే పతిత-పావనా అని అంటారు. భగవంతుడు ప్రేరణ ఇస్తారు అని మనుష్యులు అంటారు,
ఇప్పుడు ప్రేరణ అనగా ఆలోచన, ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. నేను శరీరాన్ని
ఆధారముగా తీసుకోవలసి ఉంటుందని వారు స్వయముగా చెప్తున్నారు. నేను నోరు లేకుండా
శిక్షణ ఎలా ఇవ్వగలను. ప్రేరణ ద్వారా ఎవరికైనా శిక్షణ ఇవ్వడము జరుగుతుందా! భగవంతుడు
ప్రేరణ ద్వారా ఏమీ చేయరు. తండ్రి అయితే పిల్లలను చదివిస్తారు. ప్రేరణ ద్వారా
చదువుకోవడం జరగదు. తండ్రి తప్ప సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవరూ
తెలియజేయలేరు. వారికి తండ్రి గురించే తెలియదు. కొందరు వారిని లింగము అని అంటారు,
కొందరు అఖండ జ్యోతి అని అంటారు, కొందరు బ్రహ్మ తత్వమే ఈశ్వరుడు అని అంటారు. తత్వ
జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు కూడా ఉన్నారు కదా. శాస్త్రాలలో 84 లక్షల యోనులు ఉన్నాయని
చూపించారు. ఇప్పుడు ఒకవేళ 84 లక్షల జన్మలు ఉన్నట్లయితే కల్పము చాలా పెద్దగా ఉండాలి,
అప్పుడిక దాని లెక్కను ఎవరూ తీయలేరు. వారు సత్యయుగమునే లక్షల సంవత్సరాలు అని
అనేస్తారు. తండ్రి అంటారు, మొత్తము సృష్టి చక్రమే 5 వేల సంవత్సరాలది. 84 లక్షల
జన్మల కొరకైతే సమయము కూడా అంతగా కావాలి కదా. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి
చెందినవి. తండ్రి అంటారు, నేను వచ్చి మీకు ఈ సర్వ శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను.
ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి, వీటి ద్వారా ఎవరూ నన్ను పొందలేరు. నేను ఎప్పుడైతే
వస్తానో, అప్పుడే అందరినీ తీసుకువెళ్తాను. నన్ను పిలవడమే - ఓ పతిత-పావనా రండి,
పావనముగా తయారుచేసి మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. మరి
నన్ను వెతికేందుకు ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు? ఎంత దూరదూరాలలో ఉన్న పర్వతాలు
మొదలైనవాటిపైకి వెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లోనైతే ఎన్ని మందిరాలు ఖాళీగా పడి ఉన్నాయి,
అక్కడికి ఎవరూ వెళ్ళరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క జీవిత
చరిత్రను కూడా తెలుసుకున్నారు. తండ్రి పిల్లలకు సర్వస్వాన్ని ఇచ్చి 60 సంవత్సరాల
తర్వాత వానప్రస్థములోకి వెళ్ళి కూర్చుంటారు. ఈ ఆచారము కూడా ఇప్పటిదే, పండుగలు కూడా
అన్నీ ఈ సమయానికి సంబంధించినవే.
ఇప్పుడు మనము సంగమములో నిలబడి ఉన్నామని మీకు తెలుసు. రాత్రి తర్వాత మళ్ళీ పగలు
వస్తుంది. ఇప్పుడైతే ఘోర అంధకారము ఉంది. జ్ఞాన సూర్యుడు ఉదయించినప్పుడు
అజ్ఞానాంధకారము తొలగిపోయింది అని గానము కూడా చేస్తారు. మీకు తండ్రి మరియు రచన యొక్క
ఆదిమధ్యాంతాల గురించి ఇప్పుడు తెలుసు. తండ్రి ఏ విధంగా నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో,
అలా మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు. పిల్లలైన మీకు తండ్రి నుండి
అనంతమైన సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి నుండైతే హద్దు వారసత్వము
లభిస్తుంది, దాని ద్వారా అల్పకాలికమైన సుఖము లభిస్తుంది, దానినే సన్యాసులు
కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. కావున సన్యాసులు ఇక్కడికి వచ్చి సుఖము కొరకు
పురుషార్థము చేయలేరు. వారు ఉన్నదే హఠయోగులు, మీరు రాజయోగులు. మీ యోగము తండ్రితో ఉంది,
వారి యోగము తత్వముతో ఉంది. ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.