18-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 25.03.2005


‘‘మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపజేయండి, విధాతగా అవ్వండి, తపస్వీగా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ హోలీహంసలైన పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే సూత్రములో బంధింపబడి హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. మిలనము జరుపుకునేందుకు ఎంత ప్రేమతో చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూస్తున్నారు - ఎంత గొప్ప భాగ్యము, ఎంతటి పవిత్రాతి పవిత్రమైనవారో అంతగానే ఉన్నతోన్నతమైనవారు. మొత్తము కల్పములో చూడండి, మీ అందరి భాగ్యము కంటే ఉన్నతమైన భాగ్యము మరెవ్వరికీ లేదు. మీ భాగ్యము గురించి తెలుసు కదా? వర్తమాన సమయములో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. అలా అవ్వాల్సిందే, అది నిశ్చితము, ఆ నిశ్చయము ఉంది కూడా. ఆ తర్వాత పూజ్యులుగా అయినప్పుడు కూడా, శ్రేష్ఠ ఆత్మలైన మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. కనుక వర్తమానము, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపములో మీరు హైయ్యెస్ట్ అనగా ఉన్నతోన్నతమైనవారు. మీ జడచిత్రాలకు కూడా ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది. అనేక ధర్మపితలు, మహానాత్మలు ఉండి వెళ్ళారు కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ ఉన్నతోన్నతమైన పరమాత్ముని పిల్లలైన మీకే జరుగుతుంది ఎందుకంటే ఈ సమయములో ప్రతి కర్మలో కర్మయోగులుగా అయ్యి కర్మ చేసిన విధికి ఫలితముగా పూజ కూడా విధిపూర్వకముగా జరుగుతుంది. ఈ సంగమయుగ సమయములోని పురుషార్థానికి ప్రారబ్ధము లభిస్తుంది. కనుక ఉన్నతోన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు కూడా ఉన్నతోన్నతమైన ప్రాప్తిని కలిగిస్తారు.

హోలీ అనగా పవిత్రత, మీరు హోలీయెస్ట్ (అత్యంత పవిత్రమైనవారు) కూడా, హైయ్యెస్ట్ (అత్యంత ఉన్నతమైనవారు) కూడా. ఈ బ్రాహ్మణ జీవితము యొక్క పునాదియే పవిత్రత. అపవిత్రత అనేది సంకల్పమాత్రము ఉన్నా అది శ్రేష్ఠముగా అవ్వనివ్వదు. పవిత్రతయే సుఖ-శాంతులకు జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళంచెవి, అందుకే మీ అందరి స్లోగన్ ఏమిటంటే - ‘‘పవిత్రముగా అవ్వండి, యోగీగా అవ్వండి.’’ హోలీ కూడా స్మృతిచిహ్నము వంటిది, హోలీలో కూడా చూడండి, ముందుగా కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు. అపవిత్రతను కాల్చటము. యోగాగ్ని ద్వారా అపవిత్రతను కాలుస్తారు, దానికి స్మృతిచిహ్నముగా వారు అగ్నిలో కాలుస్తారు మరియు కాల్చిన తర్వాత ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో, అప్పుడు సంతోషాలతో పండుగ జరుపుకుంటారు. పవిత్రముగా అయినదానికి స్మృతిచిహ్నముగా మిలనము జరుపుకుంటారు ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడైతే అపవిత్రతను కాల్చేస్తారో, పరమాత్ముని సాంగత్యపు రంగులో ఎర్రగా అయిపోతారో, అప్పుడు సర్వాత్మలతో శుభ భావన, శుభ కామనల మిలనాన్ని జరుపుకుంటారు. దీని స్మృతిచిహ్నముగా మంగళ మిలనాన్ని జరుపుకుంటారు. అందుకే బాప్ దాదా పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు - సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. మీ ఆశీర్వాదాల శుభ భావనతో మంగళ మిలనాన్ని జరుపుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇచ్చినా కూడా, వారు అపవిత్రతతో పరవశులై ఉన్నారు, కానీ మీరు ఒకవేళ ఆ శాపనార్థాలను మనసులో ఇముడ్చుకుంటే మీరు సంతోషముగా ఉంటారా? సుఖముగా ఉంటారా? లేదా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు... అనే ఈ వ్యర్థ సంకల్పాలతో దుఃఖాన్ని అనుభవము చేస్తారా? శాపనార్థాలను తీసుకోవటము అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవము చేయించటము. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి అన్న బాప్ దాదా శ్రీమతాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలు తీసుకోవటాన్ని మరియు ఆశీర్వాదాలు ఇవ్వటాన్ని నేర్చుకున్నారు కదా! నేర్చుకున్నారా?

ప్రతిజ్ఞ మరియు దృఢత, ధృఢతతో ప్రతిజ్ఞ చెయ్యండి - సుఖాన్ని ఇవ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి, ఆశీర్వాదాలను ఇవ్వాలి, తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ ఉందా? ధైర్యము ఉందా? ఈ రోజు నుండి ఆశీర్వాదాలను తీసుకుంటాము, ఆశీర్వాదాలను ఇస్తాము అన్న ఈ దృఢ సంకల్పాన్ని చేసే ధైర్యము ఎవరిలో అయితే ఉందో వారు చేతులెత్తండి. పక్కానా? పక్కానా? కచ్చాగా (అపరిపక్వముగా) అవ్వకండి. కచ్చాగా అయ్యారనుకోండి, అప్పుడు కచ్చా ఫలాలను పక్షులు బాగా తింటాయి. దృఢత సఫలతకు తాళముచెవి. అందరి వద్దా ఈ తాళముచెవి ఉందా? ఉందా తాళముచెవి? తాళముచెవి భద్రముగా ఉందా, మాయ దొంగలించటము లేదు కదా? దానికి కూడా తాళముచెవి అంటే ప్రేమ. ఎల్లప్పుడూ సంకల్పము చేస్తున్నప్పుడు ఈ సంకల్పాన్ని ఇమర్జ్ చేయండి, మర్జ్ కాదు, ఇమర్జ్. నేను చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉంది అన్నదానిని ఇమర్జ్ చేయండి. దీనినే నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు. డ్రామా విజయముతో కూడినదిగా తయారయ్యే ఉంది. కేవలము రిపీట్ చెయ్యాలి. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇది తయారై ఉంది, దీనిని రిపీట్ చేసి తయారుచేయాలి. కష్టమా? అప్పుడప్పుడు కష్టమైపోతుంది! ఎందుకని కష్టమవుతుంది? మీకు మీరే సహజమైనదానిని కష్టము చేసేసుకుంటారు. చిన్నపాటి పొరపాటు చేసేస్తారు, ఏం పొరపాటు చేస్తారో తెలుసా? బాప్ దాదాకు ఆ సమయములో పిల్లలపై చాలా దయే కాదు, ఎంతో ప్రేమ కలుగుతుంది. ఏమని ప్రేమ కలుగుతుంది? ఒకవైపేమో బాబా మాతో కంబైండుగా ఉన్నారు అని అంటారు, తోడు కాదు, కంబైండుగా ఉన్నారు అని అంటారు. మరి కంబైండుగా ఉన్నారా? డబుల్ విదేశీయులు కంబైండుగా ఉన్నారా? వెనుక ఉన్నవారు కంబైండుగా ఉన్నారా? గ్యాలరీలోనివారు కంబైండుగా ఉన్నారా?

అచ్ఛా - ఈ రోజు బాప్ దాదాకు సమాచారము లభించింది - మధుబన్ నివాసులైన పాండవ భవన నివాసులు, జ్ఞాన సరోవర్ నివాసులు మరియు ఇక్కడివారు కూడా వేరే హాల్లో వింటూ ఉన్నారు. వారిని కూడా బాప్ దాదా అడుగుతున్నారు, కంబైండుగా ఉన్నారా? చేతులెత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాప్ దాదా కంబైండుగా ఉన్నప్పుడు మరి మళ్ళీ ఒంటరిగా ఎందుకు అయిపోతారు? ఒకవేళ మీరు బలహీనముగా ఉన్నా కానీ బాప్ దాదా అయితే సర్వశక్తివంతుడు కదా! ఒంటరివారిగా అయిపోతారు, అప్పుడే బలహీనముగా అవుతారు. కంబైండు రూపములో ఉండండి. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ప్రతి సమయములోనూ సహయోగిగా ఉంటారు. శివబాబా పరంధామము నుండి ఎందుకు వచ్చారు? ఎందుకోసము వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకు వచ్చారు. చూడండి, బ్రహ్మాబాబా కూడా వ్యక్తము నుండి అవ్యక్తముగా ఎందుకని అయ్యారు? సాకార శరీరము కంటే కూడా అవ్యక్త రూపములో చాలా ఎక్కువ సహయోగాన్ని ఇవ్వవచ్చు. మరి బాప్ దాదా సహయోగాన్ని ఇచ్చేందుకు ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరివారిగా ఎందుకు అవుతున్నారు? ఎందుకు శ్రమపడుతున్నారు? 63 జన్మలైతే శ్రమించారు కదా! ఆ శ్రమించే సంస్కారాలే ఇప్పుడు కూడా లాగుతూ ఉన్నాయా? ప్రేమలో ఉండండి, లవలీనులై ఉండండి. ప్రేమ అనేది కష్టము నుండి విముక్తులుగా చేస్తుంది. శ్రమ పడటము మంచిగా అనిపిస్తుందా ఏమిటి? అలవాటుకు వశమైపోతున్నారా ఏమిటి? మీరు సహజయోగులు. బాప్ దాదా విశేషముగా పిల్లల కోసం పరంధామము నుండి కానుకను తీసుకువచ్చారు, ఏ కానుకను తీసుకువచ్చారో తెలుసా? అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చారు. మీ చిత్రము కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకువచ్చారు, అందుకే బాప్ దాదాకు శ్రమ మంచిగా అనిపించదు.

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ శ్రమ నుండి ముక్తులుగా, ప్రేమలో మగ్నమైనట్లుగా చూడాలనుకుంటున్నారు. కనుక శ్రమ పడటము నుండి మరియు మాయ యుద్ధము నుండి ముక్తులుగా అవుతాము అని ఈ రోజు సంకల్పము ద్వారా హోలీని కాలుస్తారా? కాలుస్తారా? కాల్చటము అనగా నామ-రూపాలు మాయమైపోవటము. ఏ వస్తువునైనా కాలిస్తే దాని నామ-రూపాలు అంతమైపోతాయి కదా! మరి అటువంటి హోలీని జరుపుకుంటారా? చేతులైతే ఊపుతున్నారు. బాప్ దాదా చేతులను చూసి సంతోషిస్తున్నారు. కానీ... కానీ అనేది ఉందా? కానీ అనేది ఏమిటో చెప్పమంటారా, వద్దా? మనసు యొక్క చేతిని ఊపండి. ఈ చేతిని ఊపటమైతే చాలా సులభము. చెయ్యాల్సిందే అని మనసు అంగీకరించింది అంటే అది జరిగే తీరుతుంది. కొత్త-కొత్తవారు కూడా చాలామంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిలనము జరుపుకునేందుకు వచ్చారో, వారు చేతులెత్తండి. డబుల్ విదేశీయులలో కూడా ఉన్నారు.

ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో, బాప్ దాదా వారికి విశేషముగా తమ భాగ్యము తయారుచేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు, కానీ ఈ అభినందనలను స్మృతిలో ఉంచుకోండి. అంతేకాక ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫాస్ట్ గా వెళ్ళే అవకాశము ఉంది, ఎందుకంటే ఫైనల్ రిజల్టు ఇంకా ప్రకటించబడలేదు. కనుక చివరిలో వచ్చినవారు కూడా, మొదటివారితో పోలిస్తే చివర్లో వచ్చారు కదా, కనుక చివరలో వచ్చినవారు లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ (చివరిలో వచ్చినా వేగముగా వెళ్ళి మొదటి నంబరులోకి రావచ్చు). దీనికి అనుమతి ఉంది, వెళ్ళవచ్చు. కనుక సదా ఈ లక్ష్యము గుర్తుంచుకోండి - నేను అనగా ఆత్మనైన నేను ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ క్లాస్ లోకి రావాల్సిందే. వి.ఐ.పి.లు కూడా చాలామంది వచ్చారు కదా. టైటిల్ వి.ఐ.పి. అని ఉంది. వి.ఐ.పి.లు ఎవరైతే వచ్చారో వారు చేతులు బాగా పైకి ఎత్తండి. (సుమారుగా 150 మంది భారత్ యొక్క అతిథులు బాప్ దాదా ఎదురుగా కూర్చుని ఉన్నారు) స్వాగతం. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం, విచ్చేసారు. ఇప్పుడు పరిచయము చేసేందుకని వి.ఐ.పి. అని అంటారు కానీ ఇప్పుడు వి.ఐ.పి. నుండి వి.వి.వి.ఐ.పి. గా అవ్వాలి. చూడండి, దేవతలు, వారి జడ చిత్రాలు వి.వి.వి.ఐ.పి.లు కదా, మరి మీరు కూడా మీ పూర్వజుల వలె అవ్వాల్సిందే. బాప్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తారు. సంబంధములోకి వచ్చారు. వి.ఐ.పి.లు ఎవరైతే వచ్చారో వారు లేచి నిలబడండి. కూర్చుని-కూర్చుని అలసిపోయి ఉంటారు, కాస్త లేచి నిలబడండి. అచ్ఛా.

వర్తమాన సమయములో బాప్ దాదా రెండు విషయాలపై పదే-పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఒకటేమో స్టాప్, బిందువు పెట్టండి, పాయింటు పెట్టండి. రెండవది - స్టాక్ ను జమ చేసుకోండి. రెండూ తప్పనిసరిగా అవసరము. మూడు ఖజానాలను విశేషముగా జమ చేసుకోండి - ఒకటి, మీ పురుషార్థపు ప్రారబ్ధము అనగా ప్రత్యక్ష ఫలము, దానిని జమ చేసుకోండి. రెండు - సదా సంతుష్టముగా ఉండండి, సంతుష్టము చేయండి. కేవలం అలా ఉండటమే కాదు, అలా చేయాలి కూడా. దాని ఫల స్వరూపముగా ఆశీర్వాదాలను జమ చేసుకోండి. ఆశీర్వాదాల ఖాతాను అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు జమ చేసుకుంటారు కానీ నడుస్తూ-నడుస్తూ కొన్ని చిన్న-చిన్న విషయాలలో తికమక పడి, ధైర్యహీనులుగా అయి జమ చేసుకున్న ఖజానాలకు కూడా అడ్డుగీత గీసుకుంటారు. కనుక ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవ్వాలి. దానికి విధి - సంతుష్టముగా ఉండటము, సంతుష్టము చెయ్యటము. మూడవది - సేవ ద్వారా సేవా ఫలము జమ చేసుకోవటము లేక ఖజానాను జమ చేసుకోవటము మరియు సేవలో కూడా విశేషముగా నిమిత్త భావము, నిర్మాన భావము, నిర్మల వాణి ఉండాలి, అనంతమైన సేవ ఉండాలి. నాది కాదు, బాబాది. బాబా చేయించేవారు, చేయించే నాతో చేయిస్తున్నారు, ఇది అనంతమైన సేవ. ఈ మూడు ఖాతాలను చెక్ చేసుకోండి - మూడు ఖాతాలు జమ అయి ఉన్నాయా? నాది అన్న భావము ఉండకూడదు. ఇచ్ఛా మాత్రం అవిద్య (కోరిక అంటే ఏమిటో తెలియకపోవటం). ఈ సంవత్సరము ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా? సీజన్ పూర్తవుతూ ఉంది, ఇప్పుడు 6 నెలలు ఏం చెయ్యాలి? కనుక ఒకటేమో ఖాతాను జమ చేసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఎక్కడా ఏ మూల కూడా హద్దు కోరికలైతే లేవు కదా? నేను మరియు నాది అనేవైతే లేవు కదా? లేవతగా (తీసుకునేవారిగా) అయితే లేను కదా? విధాతగా అవ్వండి, తీసుకునేవారిగా కాదు. పేరు, ప్రతిష్ట, గౌరవము... దేనినీ తీసుకునేవారిగా అవ్వకండి. దాతగా, విధాతగా అవ్వండి.

ఇప్పుడు దుఃఖము చాలా-చాలా పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంటుంది, అందుకే మాస్టర్ సూర్యునిగా అయ్యి అనుభూతి కిరణాలను వ్యాపింపజేయండి. ఏ విధంగా సూర్యుడు ఒకే సమయములో ఎన్నో ప్రాప్తులను చేయిస్తాడో, ఒక ప్రాప్తి మాత్రమే కాదు కదా చేయించేది. కేవలం వెలుగు మాత్రమే ఇవ్వడు, శక్తిని కూడా ఇస్తాడు. అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అలా మీరందరూ ఈ 6 నెలలలో జ్ఞాన సూర్యునిగా అయ్యి సుఖము, సంతోషము, శాంతి, సహయోగము యొక్క కిరణాలను వ్యాపింపజేయండి. అనుభూతి చేయించండి. మీ ముఖాన్ని చూడగానే దుఃఖపు అల ఉన్నవారికి కనీసం చిరునవ్వు రావాలి. మీ దృష్టితో ధైర్యము రావాలి. కావున ఈ అటెన్షన్ పెట్టాలి. విధాతగా అవ్వాలి, తపస్వీగా అవ్వాలి. ఎటువంటి తపస్య చేయండంటే, ఆ తపస్యా జ్వాల ఏదో ఒక అనుభూతిని కలిగించాలి. వారు కేవలం మీ మాటలు వినటము కాదు, వారికి అనుభూతి చేయించండి. అనుభూతి అమరముగా ఉంటుంది. కేవలం వాణి వినటము అంటే అది కొద్ది సమయము కొరకు మంచిగా అనిపిస్తుంది, సదా గుర్తుండదు, అందుకే అనుభవము యొక్క అథారిటీగా అయ్యి అనుభవము చేయించండి. ఎవరైతే సంబంధ-సంపర్కములోకి వస్తున్నారో, వారికి ధైర్యమును, ఉల్లాస-ఉత్సాహాలను మీ సహయోగము ద్వారా, బాప్ దాదా యొక్క కనెక్షన్ తో ఇప్పించండి. ఎక్కువ శ్రమ చేయించకండి. స్వయమూ శ్రమించకండి, ఇతరుల చేత శ్రమ చేయించకండి. నిమిత్తులు కదా! కనుక ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన వైబ్రేషన్లను ఎలా తయారుచెయ్యాలంటే, గంభీరముగా ఉన్నవారు కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి రావాలి. సంతోషముతో మనసు నాట్యము చేయడం మొదలుపెట్టాలి. ఏం చెయ్యాలో విన్నారా? రిజల్టు చూస్తాము. ఏ స్థానములో ఎంతమంది ఆత్మలను దృఢముగా తయారుచేసారు, స్వయం ఎంత దృఢముగా తయారయ్యారు, ఎంతమంది ఆత్మలను దృఢముగా తయారుచేసారు? పొరపాటు చెయ్యలేదు కదా, అబద్ధము చెప్పలేదు కదా, ఎటువంటి వికర్మ చెయ్యలేదు కదా అనే సాధారణ ఖాతాను చూడరు, కానీ ఎంతమంది ఆత్మలను ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువచ్చారు, అనుభూతి చేయించారు మరియు దృఢత అనే తాళముచెవిని ఎంతమందికి ఇచ్చారు? సరేనా, చెయ్యాల్సిందే కదా. బాప్ దాదా కూడా చేస్తారా అని ఎందుకు అనాలి, చెయ్యాల్సిందే. మీరు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? తర్వాత వచ్చేవారు చేస్తారా? మీరే కల్ప-కల్పము బాబా ద్వారా అధికారులుగా అయ్యారు, ఇప్పుడూ అయ్యారు మరియు ప్రతి కల్పము అవుతారు. ఇటువంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంగఠనను బాప్ దాదా చూడాల్సిందే. సరేనా! చేతులెత్తండి, తయారవ్వాల్సిందే, మనసు యొక్క చేతిని ఎత్తండి. దృఢ నిశ్చయము అనే చేతిని ఎత్తండి. అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయ్యారు కదా? అచ్ఛా!

నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారీ పిల్లలకు, దూరంగా కూర్చుని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసే పిల్లలకు, సదా హోలీ అనగా పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకునేవారికి, స్వప్నమాత్రపు అపవిత్రత యొక్క అంశానికి కూడా దూరంగా ఉండే మహావీర్, మహావీరనీ పిల్లలకు, సదా ప్రతి సమయము అన్ని జమ ఖాతాలను జమ చేసుకునే సంపన్న పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయ్యి సంతుష్టముగా ఉండే మరియు సంతుష్టము చేసే బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే.

దాదీలతో:- దాదీలైతే గురుభాయిలు కదా, అందుకే పక్కన కూర్చోండి. భాయి పక్కన కూర్చుంటారు. మంచిది. బాప్ దాదా ప్రతిరోజు స్నేహమనే మాలిష్ చేస్తారు. నిమిత్తులు కదా! ఈ మాలిష్ యే నడిపిస్తూ ఉంది. మంచిది. మీ అందరి ఉదాహరణను చూసి అందరికీ ధైర్యము వస్తుంది. నిమిత్త దాదీల సమానముగా సేవలో, నిమిత్త భావముతో ముందుకు వెళ్ళాలి. మంచిది, చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని మీ అందరికీ ఈ పక్కా నిశ్చయము ఉంది కదా. ఈ నిమిత్త భావమే సేవ చేయిస్తూ ఉంది. మైపన్ (నేను అన్న భావన) ఉందా? ఏదైనా నేను అన్న భావన వస్తుందా? మంచిది. మొత్తము విశ్వము ముందు నిమిత్త ఉదాహరణలు కదా. కనుక బాప్ దాదా కూడా సదా విశేష ప్రేమను మరియు ఆశీర్వాదాలను ఇస్తూనే ఉంటారు. మంచిది. చాలామంది వచ్చారంటే మంచిదే కదా! చివరి టర్న్ వేగముగా అయ్యింది. అచ్ఛా!

డబుల్ విదేశీ ముఖ్య టీచరు అక్కయ్యలతో:- అందరూ కలిసి అందరి పాలన చేయడానికి నిమిత్తులు అయ్యారు, చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మంచి ప్రోగ్రాములను తయారుచేస్తారు. అవి బాప్ దాదాకు ఇష్టము. స్వయం రిఫ్రెష్ అవుతారు కనుకనే ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. చాలా మంచిది. అందరికీ బాగా రిఫ్రెష్మెంట్ అయ్యింది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. చాలా మంచిది. ఓం శాంతి.

వరదానము:-
నాలెడ్జ్ ఫుల్ స్థితి ద్వారా పరిస్థితులను దాటి వేసే అంగద సమానమైన అచల్-అడోల్ భవ (చలించనివారిగా, స్థిరమైనవారిగా కండి)

రావణ రాజ్యానికి చెందిన ఏ పరిస్థితి కానీ లేక వ్యక్తి కానీ ఏ మాత్రము సంకల్ప రూపములో కూడా కదిలించకూడదు. అటువంటి అచల్-అడోల్ భవ యొక్క వరదానులుగా అవ్వండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా పడేసేందుకు కాదు, దృఢంగా చేసేందుకు వస్తుంది. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నవారు ఎప్పుడూ పేపర్ ను చూసి తికమకపడరు. మాయ ఏ రూపములోనైనా రాగలదు - కానీ మీరు యోగాగ్నిని వెలిగించి ఉన్నట్లయితే, నాలెడ్జ్ ఫుల్ స్థితిలో ఉన్నట్లయితే అన్ని విఘ్నాలు స్వతహాగా సమాప్తమైపోతాయి మరియు మీరు చలించని-స్థిరమైన స్థితిలో ఉంటారు.

స్లోగన్:-
శుద్ధ సంకల్పాల ఖజానా జమ అయ్యి ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలలో సమయము పోదు.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

పవిత్రత యొక్క పర్సనాలిటీ ఆధారముగా బ్రహ్మాబాబా ఆదిదేవ్గా మరియు మొదటి రాకుమారునిగా అయ్యారు. అలాగే మీరు కూడా ఫాలో ఫాదర్చేసి మొదటి నంబర్పర్సనాలిటీ యొక్క లిస్ట్లోకి రండి ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్ఠత మరియు మహానతయే పవిత్రత.

సూచన:- ఈ రోజు అంతర్జాతీయ యోగ దివసము మూడవ ఆదివారము, సాయంత్రము 6.30 నుండి 7.30 గం. వరకు సోదర-సోదరీలందరూ సంగఠిత రూపములో ఏకత్రితులై ప్రభు ప్రేమలో ఇమిడిపోయే అనుభవము చేయండి. సదా ఈ స్వమానంలోనే కూర్చోండి, నేను ఆత్మను సర్వ ప్రాప్తులతో సంపన్నముగా సర్వ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. ప్రేమ సాగరుడైన బాబా నుండి ప్రేమ కిరణాలు వెలువడి ఆత్మనైన నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఆ ప్రేమ వైబ్రేషన్స్ యే నలువైపులా వాతావరణంలో వ్యాపిస్తున్నాయి.