ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఏ విధముగా ఆకాశములో సితారలు ఉన్నాయో
అలాగే పిల్లలైన మీ గురించి కూడా, వీరు ధరిత్రి సితారలు అన్న గాయనము ఉంది. వాటిని
కూడా నక్షత్ర దేవతలు అని అంటారు. వాస్తవానికి అవి దేవతలేమీ కావు. కావున మీరు
వాటికన్నా మహాన్ శక్తివంతులు ఎందుకంటే సితారలైన మీరు మొత్తం విశ్వమంతటినీ ప్రకాశవంతం
చేస్తారు. మీరే దేవతలుగా అవ్వనున్నారు. మీదే ఉన్నతి మరియు పతనము జరుగుతుంది. ఆ
సితారలు మహా అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి, వాటినేమీ దేవతలు అని అనరు.
మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వమంతటినీ ప్రకాశవంతం చేసేవారు. ఇప్పుడు
మొత్తం విశ్వమంతటిపై ఘోర అంధకారము ఉంది. అంతా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి
మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారుచేయడానికి వస్తారు. మనుష్యులైతే
అందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుడిని కూడా దేవత అని అనేస్తారు. అక్కడక్కడ
సూర్యుని జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశీయులుగా కూడా పిలుచుకుంటారు.
వాస్తవానికి మీరే సూర్యవంశీయులు కదా. కావున తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం
చేయిస్తారు. భారత్ లోనే ఘోర అంధకారము ఏర్పడింది. ఇప్పుడు భారత్ లోనే ప్రకాశము కావాలి.
తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ
ఉండేవారు, తండ్రి వచ్చి మళ్ళీ మేల్కొలుపుతారు. వారు అంటారు, డ్రామా ప్లాన్ అనుసారంగా
కల్ప-కల్పపు పురుషోత్తమ సంగమయుగములో నేను మళ్ళీ వస్తాను. ఈ పురుషోత్తమ సంగమయుగము ఏ
శాస్త్రములోనూ లేదు. ఈ యుగము గురించి ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు, ఈ సమయంలోనే
సితారలైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. మిమ్మల్నే నక్షత్ర దేవతాయ నమః అని అంటారు.
ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అయిపోతారు,
ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు, ఇందులో
ఎప్పుడూ, ఎవ్వరి యుద్ధమూ జరగదు. టీచర్ సాధారణ రీతిలో చదివిస్తారు మరియు పిల్లలు కూడా
సాధారణ రీతిలో చదువుకుంటారు. ఇందులో ఎప్పుడూ యుద్ధము విషయమేమీ ఉండదు. ఇతనేమీ - నేను
భగవంతుడిని అని అనరు. చదివించేవారు నిరాకారుడైన శివబాబాయేనని పిల్లలైన మీకు కూడా
తెలుసు. వారికి తమ శరీరము లేదు. వారు అంటారు, నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకుంటాను.
భగీరథుడు అని కూడా ఎందుకు అంటారు? ఎందుకంటే వీరు చాలా, చాలా భాగ్యశాలీ రథము. వీరే
మళ్ళీ విశ్వాధిపతిగా అవుతారు, కావున వీరు భగీరథుడే కదా. అన్నింటి అర్థాలను అర్థం
చేసుకోవాలి కదా. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు. ప్రపంచములోనైతే అసత్యమే అసత్యము
ఉంది కదా. సత్యము యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు అన్న నానుడి కూడా ఉంది కదా.
ఈ రోజుల్లోనైతే అనేక రకాల భగవానులు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతునిగా పిలుచుకోవడమే
కాదు, రాయి-రప్పలను కూడా భగవంతుడు అని అనేస్తారు. భగవంతుడిని ఎంతగా భ్రమింపజేసేసారు.
ఏ విధముగా లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు అర్థం చేయిస్తారో అలా ఈ తండ్రి కూర్చొని
అర్థం చేయిస్తారు. కానీ ఆ లౌకిక తండ్రి తండ్రిగానూ, టీచరుగానూ మరియు తానే గురువుగానూ
అవ్వరు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు, ఆ తర్వాత కొద్దిగా పెద్దయ్యాక
చదివించేందుకు టీచర్ కావాలి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే
ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురువు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. చదివేది
కూడా ఆత్మయే. ఆత్మను ఆత్మ అనే అంటారు. ఇకపోతే శరీరాలకైతే అనేక పేర్లు ఉన్నాయి.
ఆలోచించండి - ఇది అనంతమైన నాటకము. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే
ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా
చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది అనాదిగా తయారై,
తయారుచేయబడిన డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. పాత్రధారులు ఆత్మలే. ఆత్మలు ఎక్కడ
ఉంటాయి? మేము మా ఇంట్లో పరంధామములో ఉండేవారము, ఇక్కడకు మళ్ళీ అనంతమైన పాత్రను
అభినయించేందుకు వస్తాము అని అంటారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. వారు
పునర్జన్మలలోకి రారు. ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి తమ మరియు రచన యొక్క సారమును
వినిపిస్తారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారీ పిల్లలు అని అంటారు. దీని అర్థాన్ని కూడా
ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారిగా
భావిస్తారు, కావున మనుష్యులను అలా ఎందుకంటారు అని మిమ్మల్ని అడుగుతారు. ఇది మీకు
తెలుసు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మనుష్యులుగానే ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా
అయ్యాక కూడా మనుష్యులుగానే ఉన్నారు, మళ్ళీ దేవతలుగా అయ్యాక కూడా మనుష్యులుగానే
ఉంటారు, కానీ క్యారెక్టర్స్ మారుతాయి. రావణుడు వచ్చినప్పుడు మీ నడవడిక ఎంతగా
పాడైపోతుంది. సత్యయుగములో ఈ వికారాలేవీ ఉండవు.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమరకథను వినిపిస్తున్నారు. భక్తి మార్గములో మీరు
ఎన్ని కథలను విని ఉంటారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించారు అని అంటారు. ఇప్పుడు
ఆమెకైతే శంకరుడు వినిపిస్తారు కదా. శివుడు ఎలా వినిపిస్తారు. అది వినేందుకు ఎంతమంది
మనుష్యులు వెళ్తారు. ఈ భక్తి మార్గపు విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు.
తండ్రి ఏమీ భక్తి చెడ్డది అని అనరు. అలా కాదు, డ్రామా ఏదైతే అనాదిగా ఉందో దాని
గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పడు తండ్రి అంటారు, ఒకటేమో స్వయాన్ని ఆత్మగా
భావించండి, ముఖ్యమైన విషయమే ఇది. భగవానువాచ - మన్మనాభవ, దీని అర్థమేమిటి? ఈ తండ్రి
కూర్చొని నోటి ద్వారా వినిపిస్తారు, కావున వీరు గోముఖము. త్వమేవ మాతాశ్చ పితా... అని
వారినే అంటారని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాత ద్వారా మిమ్మల్నందరినీ దత్తత
తీసుకున్నారు. శివబాబా అంటారు - ఈ ముఖము ద్వారా పిల్లలైన మీకు జ్ఞాన పాలును
త్రాగిస్తాను కావున మీ పాపాలేవైతే ఉన్నాయో అవన్నీ భస్మమై మీ ఆత్మ కాంచనముగా
అయిపోతుంది. కావున శరీరము కూడా కాంచనముగా లభిస్తుంది. ఆత్మలు పూర్తి పవిత్రముగా,
కాంచనముగా అయిపోతాయి, మళ్ళీ మెల్లమెల్లగా మెట్లు దిగుతారు. ఆత్మలమైన మనం కూడా
కాంచనముగా ఉండేవారమని, శరీరాలు కూడా కాంచనముగా ఉండేవని, మళ్ళీ డ్రామానుసారంగా మనం
84 జన్మల చక్రములోకి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాంచనముగా
లేము. ఇప్పుడైతే 9 క్యారెట్లు అని అంటారు, ఏదో కాస్త శాతం మాత్రం మిగిలి ఉంది.
పూర్తిగా మాయమైపోయింది అని అనరు. ఎంతో కొంత శాంతి ఉంటుంది. తండ్రి ఆ గుర్తులను కూడా
తెలియజేశారు. లక్ష్మీ-నారాయణుల చిత్రము నంబర్ వన్ చిత్రము. ఇప్పుడు మీ బుద్ధిలోకి
మొత్తం చక్రమంతా వచ్చేసింది. తండ్రి పరిచయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ఆత్మ
పూర్తిగా కాంచనముగా అవ్వలేదు కానీ తండ్రి పరిచయమైతే బుద్ధిలో ఉంది కదా. కాంచనముగా
అయ్యే యుక్తిని తెలియజేస్తారు. ఆత్మలో ఏ మలినాలైతే కలిసాయో అవి ఎలా తొలగుతాయి? దాని
కొరకు స్మృతియాత్ర ఉంది. దీనిని యుద్ధ మైదానము అని అంటారు. మీరు ప్రతి ఒక్కరూ యుద్ధ
మైదానములో స్వతంత్రులుగా ఉన్న సిపాయిలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలనుకుంటే అంత
పురుషార్థం చేసుకోవచ్చు. పురుషార్థం చేయడమైతే విద్యార్థుల పని. ఎక్కడికైనా వెళ్ళండి,
ఒకరినొకరు - మన్మనాభవ అని అప్రమత్తం చేసుకోండి. శివబాబా గుర్తున్నారా? అని ఒకరికొకరు
ఇదే సూచనను ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సూచనాప్రాయంగా ఉంటుంది, అందుకే తండ్రి
అంటారు - ఒక్క క్షణములో శరీరము కాంచనముగా అయిపోతుంది, విశ్వాధిపతులుగా చేసేస్తాను.
తండ్రికి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే. ఆ తర్వాత విశ్వములో
రాజ్యాధికారము ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందడము - ఇది పురుషార్థము చేయడము.
ఇకపోతే క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. అది యథార్థమే కదా. పురుషార్థము చేయడమైతే
ప్రతి ఒక్కరి పైనా ఆధారపడి ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ
పూర్తిగా పవిత్రముగా అయిపోతుంది. సతోప్రధానముగా అయి సతోప్రధాన ప్రపంచానికి
యజమానులుగా అయిపోతారు. ఎన్ని సార్లు మీరు తమోప్రధానుల నుండి మళ్ళీ సతోప్రధానులుగా
అయ్యారు! ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. తండ్రి కూర్చొని ఎంత
బాగా అర్థం చేయిస్తారు. వారు అంటారు, నేను కల్ప-కల్పమూ వస్తాను. పిల్లలైన మీరు నాకు
ఛీ-ఛీ ప్రపంచములోకి రమ్మని ఆహ్వానాన్ని ఇస్తారు. మీరు ఏమని ఆహ్వానాన్ని ఇస్తారు?
పతితులుగా అయిపోయిన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా తయారుచేయండి అని పిలుస్తారు. వాహ్,
మీ ఆహ్వానము! మమ్మల్ని శాంతిధామములోకి, సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని మీరు
పిలుస్తారు కావున నేను మీకు విధేయుడినైన సేవకుడను. ఇది కూడా డ్రామా ఆట. మేము
కల్ప-కల్పమూ అదే చదువుతాము, పాత్రను అభినయిస్తాము అని మీరు భావిస్తారు. ఆత్మయే
పాత్రను అభినయిస్తుంది. ఇక్కడ కూర్చొని కూడా తండ్రి ఆత్మలను చూస్తూ ఉంటారు. సితారలను
చూస్తారు. ఆత్మ ఎంత చిన్ననిది. నక్షత్రాల మెరుపు ఉన్నట్లు ఉంటుంది. కొన్ని సితారలు
చాలా ప్రకాశవంతముగా ఉంటాయి, కొన్ని తక్కువ ప్రకాశవంతముగా ఉంటాయి, కొన్ని చంద్రునికి
సమీపముగా ఉంటాయి. మీరు కూడా యోగబలం ద్వారా బాగా పవిత్రముగా అయితే ప్రకాశిస్తూ ఉంటారు.
బాబా కూడా అంటారు, పిల్లలలో చాలా మంచి నక్షత్రముగా ఎవరైతే ఉన్నారో వారికి పుష్పాన్ని
ఇవ్వండి. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. తప్పకుండా కొందరు చాలా
చురుకుగా ఉంటారు, కొందరు చాలా ఢీలాగా ఉంటారు. ఆ సితారలను దేవతలు అని అనలేరు. మీరు
కూడా మనుష్యులే, కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రముగా తయారుచేసి విశ్వాధిపతులుగా
తయారుచేస్తారు. తండ్రి వారసత్వముగా ఎంతటి శక్తిని ఇస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు
కదా. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు ఇంతటి శక్తిని ఇస్తాను. శివబాబా, మీరు
కూర్చుని మమ్మల్ని ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు అని గానం
చేస్తారు కూడా కదా. వాహ్! ఈ విధంగా ఇంకెవ్వరూ తయారుచేయరు. చదువు సంపాదనకు ఆధారము కదా.
మొత్తం ఆకాశము, భూమి మొదలైనవన్నీ మనవైపోతాయి, వాటిని ఎవ్వరూ దోచుకోలేరు, దానిని
స్థిరమైన రాజ్యం అని అంటారు. దానిని ఎవ్వరూ ఖండితము చేయలేరు, ఎవ్వరూ తగలబెట్టలేరు.
కావున ఇటువంటి తండ్రి శ్రీమతముపై నడవాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చేయాలి.
పిల్లలు మ్యూజియం మొదలైనవి తయారుచేస్తారు - ఈ చిత్రాలు మొదలైనవాటి ద్వారా తమ
తోటివారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు - ఏ చిత్రాలు
అవసరమవుతాయో వాటిని తయారుచేయండి. బుద్ధీ అయితే అందరిదీ నడుస్తూ ఉంటుంది. మనుష్యుల
కళ్యాణము కొరకే ఇవి తయారుచేయబడతాయి. సెంటర్లకు కొంతమంది వస్తూ ఉంటారని మీకు తెలుసు,
ఇప్పుడు వాళ్ళు తమంతట తామే ఈ మిఠాయిని తీసుకునేందుకు వచ్చేలా ఎటువంటి యుక్తిని
రచించాలి. ఎవరి వద్దనైనా మంచి మిఠాయిలు ఉంటే దాని ప్రచారము జరుగుతుంది. ఫలానా
దుకాణానికి వెళ్ళండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక్కడైతే చాలా మంచి నంబర్
వన్ మిఠాయి ఉంటుంది. ఇటువంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకరు చూసి వెళ్తే ఇతరులకు
కూడా వినిపిస్తారు. మొత్తం భారత్ అంతా ఏ విధంగా స్వర్ణిమ యుగములోకి రావాలి అన్న
ఆలోచన అయితే కలుగుతుంది, దాని కోసం ఎంతగా అర్థం చేయిస్తారు, కానీ రాతిబుద్ధి
కలవారిగా ఉన్నారు, శ్రమ అయితే పడుతుంది కదా. వేట చేయడం కూడా నేర్చుకోవలసి ఉంటుంది
కదా. మొట్టమొదట చిన్న వేటను పట్టడం నేర్చుకుంటారు. పెద్ద వేటను పట్టుకునేందుకైతే
శక్తి కావాలి కదా. ఎంత పెద్ద-పెద్ద విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేద-శాస్త్రాలు
మొదలైనవి ఎన్నో చదివి ఉన్నారు. స్వయాన్ని ఎంత పెద్ద అథారిటీగా భావిస్తారు. బనారస్
లో వారికి ఎంత పెద్ద-పెద్ద టైటిల్స్ లభిస్తాయి. అందుకే బాబా అర్థం చేయించారు,
మొట్టమొదటైతే బనారస్ ను సేవతో చుట్టుముట్టండి. పెద్దవారి నుండి శబ్దం వెలువడితే
అప్పుడు ఎవరైనా వింటారు. చిన్నవారు చెప్పే విషయాన్ని ఎవరూ వినరు. ఎవరైతే స్వయాన్ని
శాస్త్రాల అథారిటీగా భావిస్తారో అటువంటి సింహాలకు అర్థం చేయించాలి. ఎన్ని
పెద్ద-పెద్ద టైటిల్స్ ఇస్తారు. శివబాబాకు కూడా అన్ని టైటిల్స్ లేవు. ఇది భక్తి
మార్గపు రాజ్యము కదా, ఆ తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యం ఉంటుంది. జ్ఞాన మార్గములో భక్తి
ఉండదు. భక్తిలో మళ్ళీ జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. కావున ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు,
తండ్రి చూడడం కూడా అదే దృష్టితో చూస్తారు, వీరంతా సితారలు కూర్చున్నారు అని
భావిస్తారు. దేహ భానాన్ని వదిలివేయాలి. ఏ విధంగా పైన సితారలు మెరుస్తూ ఉంటాయో, అలా
ఇక్కడ కూడా మెరుస్తున్నాయి. కొందరు చాలా ప్రకాశవంతంగా అయిపోయారు. వీరు ఈ ధరిత్రి
సితారలు, వీరినే దేవతలు అని అంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన రంగస్థలము. తండ్రి అర్థం
చేయిస్తారు, అవి హద్దులోని రాత్రి మరియు పగలు. ఇదేమో అర్ధ కల్పపు రాత్రి మరియు అర్ధ
కల్పపు పగలు, ఇవి అనంతమైనవి. పగలులో అంతా సుఖమే సుఖము ఉంటుంది. ఎక్కడా ఎదురుదెబ్బలు
తినవలసిన అవసరమే ఉండదు. జ్ఞానములో సుఖము ఉంది, భక్తిలో దుఃఖము ఉంది. సత్యయుగములో
దుఃఖము అన్న మాటే ఉండదు. అక్కడ మృత్యువు అనేది ఉండదు. మీరు మృత్యువుపై విజయాన్ని
పొందుతారు. మృత్యువు అన్న మాటే ఉండదు. అది అమరలోకము. తండ్రి మనకు అమరలోకము కోసం
అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీకు పై
నుండి మొదలుకుని మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. బ్రహ్మలోకము ఆత్మలమైన మన ఇల్లు అని
మీకు తెలుసు. అక్కడి నుండి ఇక్కడకు నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు.
లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి, ఒక్కొక్కరి గురించి వారు కూర్చొని తెలియజేయరు కదా.
సారములో తెలియజేస్తారు. ఎన్ని శాఖోపశాఖలున్నాయి. అలా వెలువడుతూ, వెలువడుతూ వృక్షము
వృద్ధి చెందుతుంది. తమ ధర్మము గురించి కూడా తెలియనివారు ఎందరో ఉన్నారు. తండ్రి వచ్చి
అర్థం చేయిస్తున్నారు, మీరు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, కానీ
ఇప్పుడు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, వాస్తవానికి మనం శాంతిధామ నివాసులము, మళ్ళీ
పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, వారి
వంశము ఉండేది, వారు మళ్ళీ ఇప్పుడు సంగమయుగములో ఉన్నారు. తండ్రి అన్నారు, మీరు
సూర్యవంశీయులుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశీయులుగా అయ్యారు. మధ్యలో ఉన్నవన్నీ ఉపకథలు.
ఇది అనంతమైన నాటకము. ఇది ఎంత చిన్నని వృక్షము. ఇది బ్రాహ్మణుల కులము. తర్వాత ఇది
ఎంత పెద్దగా అయిపోతుందంటే, అందరినీ చూడలేము మరియు కలుసుకోలేము కూడా. అన్ని వైపులా
చుట్టుముడుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఢిల్లీని, బెనారస్ ను చుట్టుముట్టండి, ఇంకా
ఏమంటారంటే, ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచమంతటినీ చుట్టుముడతారు. మీరు యోగబలం ద్వారా
మొత్తం విశ్వముపై ఒకే రాజ్య స్థాపనను చేస్తారు, ఎంత సంతోషము కలుగుతుంది. ఒక్కొక్కరు
ఒక్కో వైపుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాన్ని ఎవ్వరూ వినరు. ఎప్పుడైతే
గొప్ప-గొప్పవారు వస్తారో, వార్తాపత్రికల్లో పడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు చిన్న-చిన్న వేటలు జరుగుతున్నాయి. గొప్ప-గొప్ప షావుకార్లు అయితే, మా కొరకు
స్వర్గము ఇక్కడే ఉంది అని భావిస్తారు. పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. వారు
అంటారు - బాబా, నాకైతే మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కానీ మోహ మమకారాలు కూడా మొత్తం
ప్రపంచమంతటి నుండి అంతమవ్వాలి కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.