18-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి అవినాశీ వైద్యుడు, వారు ఒకే మహామంత్రముతో మీ దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు’’

ప్రశ్న:-
మాయ మీ మధ్య విఘ్నాలను ఎందుకు కలిగిస్తుంది? ఏదైనా కారణము తెలపండి?

జవాబు:-
1. ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా అతి పెద్ద గ్రాహకులు. దాని వ్యాపారము సమాప్తమైపోతుంది, అందుకే విఘ్నాలు కలిగిస్తుంది. 2. అవినాశీ వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయ రోగము బయటకు వస్తుంది, అందుకే విఘ్నాలను చూసి భయపడకూడదు. మన్మనాభవ మంత్రముతో మాయ పారిపోతుంది.

ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, మనుష్యులు ‘మనశ్శాంతి, మనశ్శాంతి’ అని అంటూ హైరానా పడుతూ ఉంటారు. రోజూ ఓంశాంతి అని అంటారు కూడా. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోని కారణముగా శాంతిని యాచిస్తూనే ఉంటారు. నేను ఒక ఆత్మను అనగా నేను సైలెన్స్ అని అంటారు కూడా. మన స్వధర్మము సైలెన్స్. మరి స్వధర్మమే శాంతి అయినప్పుడు ఇక అడగడమెందుకు? అర్థం తెలుసుకోని కారణముగా ఇక అడుగుతూనే ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీరు అర్థం చేసుకున్నారు. కానీ రావణుడు మామూలుగా మొత్తం ప్రపంచానికి మరియు విశేషముగా భారత్ కు శత్రువని, అందుకే రావణుడిని కాలుస్తూ ఉంటారని కూడా వారు అర్థం చేసుకోరు. మనుష్యుల్నెవరినైనా ప్రతి సంవత్సరమూ కాలుస్తారా? రావణుడినైతే జన్మ-జన్మాంతరాలూ, కల్ప-కల్పాంతరాలూ కాలుస్తూ వచ్చారు ఎందుకంటే అతడు మీకు చాలా పెద్ద శత్రువు. పంచ వికారాలలో అందరూ చిక్కుకుంటారు. జన్మయే భ్రష్టాచారముతో జరుగుతుంది కావున ఇది రావణ రాజ్యమైనట్లు. ఈ సమయములో అపారమైన దుఃఖము ఉంది. దీనికి నిమిత్తము ఎవరు? రావణుడు. దుఃఖము ఏ కారణముగా లభిస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. ఈ రాజ్యమే రావణుడిది. అందరికన్నా పెద్ద శత్రువు ఇతడే. ప్రతి సంవత్సరమూ ఇతడి దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా పెద్దగా తయారుచేస్తూ ఉంటారు. దుఃఖము కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద-పెద్ద సాధు-సన్యాసులు, మహాత్ములు, రాజులు మొదలైనవారు ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా తెలియని విషయమేమిటంటే - రావణుడు మన శత్రువు, అందుకే అతడిని ప్రతి సంవత్సరమూ కాలుస్తున్నాము మరియు వేడుక జరుపుకుంటున్నాము అని. రావణుడు మరణించాడు మరియు మేము లంకకు యజమానులుగా అయ్యాము అని భావిస్తారు. కానీ అలా యజమానులుగా అవ్వరు. ఎంత ధనం ఖర్చు చేస్తారు. తండ్రి అంటారు, మీకు ఎంతో లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను, దానినంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? దసరా సమయములో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. రావణుడిని హతమార్చి లంకను దోచుకుంటారు. కానీ రావణుడిని ఎందుకు కాలుస్తున్నారు అన్నది ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయములో అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు. అర్ధకల్పము రావణుడిని కాలుస్తారు ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. రావణుని రాజ్యములో మేము చాలా దుఃఖితులుగా ఉన్నాము అని అర్థం చేసుకుంటారు కూడా. సత్యయుగములో ఈ పంచ వికారాలు ఉండవని, అక్కడ ఈ రావణుడిని కాల్చడం మొదలైనవేవీ ఉండవని అర్థం చేసుకోరు. వారిని అడగండి - ఇవన్నీ ఎప్పటినుండీ జరుపుకుంటూ వచ్చారు? ఇవైతే అనాదిగా నడుస్తూ వస్తున్నాయి అని చెప్తారు. రక్షాబంధనము ఎప్పటినుండి ప్రారంభమైంది? అని అడిగితే, అనాదిగా నడుస్తూ వస్తోంది అని చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. మనుష్యుల బుద్ధి ఎలా అయిపోయింది. జంతువులుగానూ లేరు, మనుష్యులుగానూ లేరు. ఎందుకూ పనికిరానివారిగా ఉన్నారు. స్వర్గము గురించి ఏమాత్రమూ తెలియదు. భగవంతుడు ఇదే ప్రపంచాన్ని తయారుచేసారు అని భావిస్తారు, అంతే. దుఃఖములో మళ్ళీ భగవంతుడినే తలచుకుంటారు - ఓ భగవంతుడా, ఈ దుఃఖాల నుండి విడిపించండి అని. కానీ కలియుగములోనైతే సుఖవంతులుగా అవ్వలేరు. దుఃఖాన్ని అయితే తప్పకుండా అనుభవించవలసిందే. మెట్లు దిగవలసిందే. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచ అంతిమము వరకూ కల అన్ని రహస్యాలనూ తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లల వద్దకు వచ్చినప్పుడు తండ్రి చెప్తారు - ఈ దుఃఖాలన్నింటికీ ఒక్కటే మందు. వారు అవినాశీ వైద్యుడు కదా. 21 జన్మల కొరకు అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసేస్తారు. ఆ వైద్యులైతే స్వయమూ రోగగ్రస్థులుగా అయిపోతారు. వీరైతే అవినాశీ వైద్యుడు. దుఃఖము కూడా అపారముగా ఉంది, సుఖము కూడా అపారముగా ఉంది అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అపారమైన సుఖాన్ని ఇస్తారు. అక్కడ దుఃఖపు నామరూపాలు ఉండవు. సుఖవంతులుగా అయ్యేందుకే మందు ఉంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా, సతోప్రధానులుగా అయిపోతారు, అన్ని దుఃఖాలూ దూరమైపోతాయి, ఆ తర్వాత ఇక సుఖమే సుఖము ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త అని కూడా అంటూ ఉంటారు. అర్ధకల్పము కొరకు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి.

ఆత్మ మరియు జీవము, ఇది రెండింటి ఆట. నిరాకార ఆత్మ అవినాశీ మరియు సాకార శరీరము వినాశీ. ఇది వీటి ఆట. ఇప్పుడు తండ్రి అంటారు, దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలనూ మర్చిపోండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఇప్పుడు ఇక మేము తిరిగి వెళ్ళాలి అని భావించండి. పతితులైతే వెళ్ళలేరు, అందుకే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానులుగా అయిపోతారు. తండ్రి వద్ద మందు ఉంది కదా. మాయ విఘ్నాలను తప్పకుండా కలిగిస్తుంది అన్నది కూడా చెప్తున్నాను. మీరు రావణుని గ్రాహకులు కదా. తన గ్రాహకులు వెళ్ళిపోతుంటే అది తప్పకుండా కంగారు పడుతుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది చదువు, ఇది మందేమీ కాదు. స్మృతియాత్రయే మందు. ఒక్క మందుతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి, అది కూడా ఒకవేళ నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థము చేస్తే అప్పుడు దూరమవుతాయి. భక్తి మార్గములో ఇలాంటివారు ఎంతోమంది ఉన్నారు, వారి నోరు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక మంత్రాన్ని, రామనామాన్ని జపిస్తూ ఉంటారు. ఇన్ని సార్లు మీరు రోజూ జపించాలి అని వారికి గురువు ద్వారా మంత్రము లభించింది. దానిని రామనామ మాలను జపించడము అని అంటారు. దీనినే రామనామ దానము అని అంటారు. ఇటువంటి సంస్థలు ఎన్నో తయారయ్యాయి. రామ-రామ అని జపిస్తూ ఉంటే ఎవరూ కొట్లాటలు మొదలైనవేవీ చేయరు, బిజీగా ఉంటారు. ఎవరైనా ఏమైనా అన్నా కానీ జవాబు ఇవ్వరు. చాలా కొద్దిమందే ఇలా చేస్తారు. కానీ ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తున్నారు, రామ-రామ అని నోటి ద్వారా అననక్కర్లేదు. ఇది అజపా జపము, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి అంటారు, నేను రాముడినేమీ కాను. రాముడు త్రేతాయుగపు వారు, అతని రాజ్యముండేది, అతడిని జపించేది ఏమీ లేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గములో ఇవన్నీ స్మరిస్తూ, పూజలు చేస్తూ మీరు మెట్లను కిందకు దిగుతూనే వచ్చారు ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనవి. ధర్మయుక్తమైనవారైతే ఒక్క తండ్రే. వారు కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది తికమక దారుల ఆట. ఏ తండ్రి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వము లభిస్తుందో వారిని స్మృతి చేసినట్లయితే ఇక ముఖము మెరుస్తూ ఉంటుంది. సంతోషములో ముఖము వికసిస్తుంది. ముఖముపై చిరునవ్వు వస్తుంది. మీకు తెలుసు - తండ్రిని స్మృతి చేయడము ద్వారా మనము ఈ విధముగా అవుతాము, అర్ధకల్పము కొరకు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. తండ్రి ఏదో కృప చూపిస్తారని కాదు. అలా కాదు. అర్థం చేసుకోవలసినదేమిటంటే, మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా సతోప్రధానముగా అయిపోతాము. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులు, వారు ఎంత హర్షితముఖులుగా ఉన్నారు. అలా తయారవ్వాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే లోపల సంతోషము కలుగుతుంది, మనం మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతాము అన్న సంతోషము కలుగుతుంది. ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలే మళ్ళీ మీతోపాటు వస్తాయి. తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయములో మాయ మిమ్మల్ని హైరానా పరుస్తుంది. మీ స్మృతిని మరపింపజేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది. సదా ఇలా హర్షితముఖులుగా ఉండలేరు. తప్పకుండా ఏదో ఒక సమయములో గుటకలు మింగుతారు. మనుష్యులు రోగగ్రస్థులుగా అయినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయండి అని చెప్తూ కూడా ఉండవచ్చు కానీ శివబాబా ఎవరు అన్నది ఎవరికీ తెలియనప్పుడు ఇక ఏమని భావిస్తూ స్మృతి చేయాలి? ఎందుకు స్మృతి చేయాలి? పిల్లలైన మీకైతే తెలుసు - తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం తమోప్రధానుల నుండి సతోప్రధానలుగా అవుతామని. దేవీ-దేవతలు సతోప్రధానులు కదా, దానిని దైవీ ప్రపంచము అనే అనడం జరుగుతుంది. దానిని మనుష్య ప్రపంచము అని అనరు. మనుష్యులు అన్న పేరే ఉండదు. ఫలానా దేవత అని అంటారు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచము, ఇది మనుష్య ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రే అర్థం చేయిస్తారు, తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. తండ్రి అనేక రకాల వివరణను ఇస్తూ ఉంటారు. అయినా చివరిలో మహామంత్రాన్ని ఇస్తారు - తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయిపోతారు మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కల్పపూర్వము కూడా మీరు దేవీ-దేవతలుగా అయ్యారు. మీ ముఖము దేవతల వలె ఉండేది. అక్కడ ఎటువంటి తప్పుడు మాటలనూ మాట్లాడేవారు కాదు. అసలు అటువంటి పనులేవీ అక్కడ జరగవు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచము. ఇది మనుష్య ప్రపంచము. తేడా ఉంది కదా. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దైవీ ప్రపంచము ఉండి లక్షల సంవత్సరాలు అయిపోయింది అని మనుష్యులు భావిస్తారు. ఇక్కడైతే ఎవ్వరినీ దేవతలు అని అనలేరు. దేవతలైతే స్వచ్ఛముగా ఉండేవారు. మహాన్ ఆత్మలు అని దేవి-దేవతలనే అంటారు. అలా మనుష్యులను ఎప్పుడూ అనలేరు. ఇది రావణుడి ప్రపంచము. రావణుడు చాలా భారీ శత్రువు. ఇతడివంటి శత్రువు ఇంకెవ్వరూ ఉండరు. ప్రతి సంవత్సరమూ మీరు రావణుడిని కాలుస్తారు. అతడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. అతడు మానవమాత్రుడేమీ కాదు. ఇవి పంచ వికారాలు, అందుకే దీనిని రావణ రాజ్యము అని అంటారు. ఇది పంచ వికారాల రాజ్యము కదా. అందరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి. ఇది దుర్గతి మరియు సద్గతి యొక్క ఆటగా రచింపబడి ఉంది. ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయము మొదలైన విషయాలను గురించి కూడా తండ్రి అర్థం చేయించారు. అలాగే దుర్గతిని గురించి కూడా అర్థం చేయించారు. మీరే ఉన్నతిలోకి పైకి ఎక్కుతారు, మళ్ళీ మీరే కిందపడిపోతారు. శివజయంతి కూడా భారత్ లోనే ఉంటుంది. రావణ జయంతి కూడా భారత్ లోనే ఉంటుంది. అర్ధకల్పము దైవీ ప్రపంచము ఉంటుంది, లక్ష్మీ-నారాయణుల, సీతా-రాముల రాజ్యముంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు అందరి జీవితచరిత్రను గురించి తెలుసు. మహిమ అంతా మీదే. నవరాత్రులలో పూజ మొదలైనవన్నీ మీవే జరుగుతాయి. మీరే స్థాపన చేస్తారు. శ్రీమతముపై నడిచి మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తారు కావున శ్రీమతముపై పూర్తిగా నడవాలి కదా. నంబరువారుగా పురుషార్థము చేస్తూ ఉంటారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేదీ లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఈ పురుషోత్తమ సంగమయుగము పూర్తిగా వేరు. పాత ప్రపంచపు అంతిమము, కొత్త ప్రపంచపు ఆది. తండ్రి పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకే వస్తారు. మీకు వారు ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ మర్చిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. భాషణ చేసిన తర్వాత గుర్తుకు వస్తుంది, ఈ ఈ విషయాలను అర్థం చేయించవలసిందే అని. ఖచ్చితముగా కల్ప-కల్పమూ ఏ విధంగా స్థాపన జరిగిందో, అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పదవిని పొందారో వారు అదే పదవిని పొందుతారు. అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు. ఉన్నతోన్నతమైన పదవిని పొందేవారు కూడా ఉన్నారు, అలాగే తక్కువలో తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు. అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మున్ముందు ఎంతో అర్థం చేసుకోగలుగుతారు - వీరు షావుకార్ల దాసిగా అవుతారని, వీరు రాజ్యవంశములోని దాసిగా అవుతారని, వీరు గొప్ప షావుకారుగా అవుతారని, అటువంటివారిని అప్పుడప్పుడు రాజ్యపరివారములోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అందరినీ ఆహ్వానించరు. అందరూ వారి ముఖాలను చూడలేరు కదా.

తండ్రి కూడా బ్రహ్మా ముఖము ద్వారా అర్థం చేయిస్తారు. అందరూ సమ్ముఖముగా కూర్చుని చూడలేరు. మీరు ఇప్పుడు సమ్ముఖముగా వచ్చారు, పవిత్రముగా అయ్యారు. అపవిత్రులు ఎవరైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో, వారు ఎంతోకొంత వింటే దేవతలుగా అవుతారు. అయినా ఎంతోకొంత వింటే దాని ప్రభావము పడుతుంది. వినకపోతే ఇక రానే రారు. ముఖ్యమైన విషయము తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఈ ఒక్క మంత్రముతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మన్మనాభవ - అని తండ్రి అంటారు, మళ్ళీ టీచరుగా అయి మధ్యాజీభవ అని అంటారు. వీరు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. ముగ్గురూ గుర్తున్నా సరే చాలా హర్షితముఖ అవస్థ ఉంటుంది. తండ్రి చదివిస్తారు, మళ్ళీ తండ్రే తమతో పాటు తీసుకువెళ్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. భక్తి మార్గములోనైతే తండ్రి గురించి ఎవరికీ తెలియనే తెలియదు. కేవలం ఇంతమాత్రం తెలుసు - వారు భగవంతుడు, మనమందరమూ సోదరులము. తండ్రి నుండి ఏమి లభిస్తుంది? అన్నది ఏమీ తెలియదు. మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు, తండ్రి ఒక్కరే, వారి పిల్లలమైన మనమంతా సోదరులము. ఇది అనంతమైన విషయము కదా. వారు పిల్లలందరికీ టీచర్ అయి చదివిస్తారు. మళ్ళీ అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తిరిగి తీసుకువెళ్తారు. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి తిరిగి వెళ్ళాలి. కొత్త ప్రపంచములోకి వచ్చేందుకు మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తారు. ఎవరెవరైతే యోగ్యులుగా అవుతారో, వారు సత్యయుగములోకి వస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ అవస్థను సదా ఏకరసముగా మరియు హర్షితముఖముగా ఉంచుకునేందుకు తండ్రిని, టీచరును మరియు సద్గురువును, ముగ్గురినీ స్మృతి చేయాలి. ఇక్కడి నుండే సంతోషపు సంస్కారాలను నింపుకోవాలి. వారసత్వపు స్మృతితో ముఖము సదా మెరుస్తూ ఉండాలి.

2. శ్రీమతముపై నడుస్తూ మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేసే సేవను చేయాలి. పంచ వికారాలలో ఎవరైతే చిక్కుకుపోయారో వారిని బయటకు తీయాలి. తమ స్వధర్మము యొక్క పరిచయాన్ని ఇవ్వాలి.

వరదానము:-
సర్వుల పట్ల తమ దృష్టిని మరియు భావనను ప్రేమతో కూడినదిగా ఉంచుకునే సర్వులకు ప్రియమైన ఫరిశ్తా భవ

స్వప్నములోనైనా ఎవరి వద్దకైనా ఫరిశ్తా వస్తే ఎంత సంతోషిస్తారు. ఫరిశ్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. హద్దులోని ప్రియమైనవారు కాదు, అనంతములో ప్రియమైనవారు. ఎవరైతే ప్రేమను ఇస్తారో వారికే ప్రియమైనవారు కాదు, సర్వులకు ప్రియమైనవారు. ఎవరు ఎటువంటి ఆత్మ అయినా కానీ, మీ దృష్టి, మీ భావన ప్రేమతో కూడినదిగా ఉండాలి - అటువంటివారినే సర్వులకు ప్రియమైనవారు అని అంటారు. ఎవరైనా అవమానించినా లేక ద్వేషించినా సరే, వారి పట్ల ప్రేమ మరియు కళ్యాణ భావన ఉత్పన్నమవ్వాలి ఎందుకంటే ఆ సమయములో వారు పరవశులై ఉన్నారు.

స్లోగన్:-
ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నముగా ఉంటారో, వారే సదా హర్షితముగా, సదా సుఖవంతముగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు.