18-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరే సత్యమైన అలౌకిక ఇంద్రజాలికులు, మీరు మనుష్యులను దేవతలుగా తయారుచేసే ఇంద్రజాలాన్ని చూపించాలి’’

ప్రశ్న:-
మంచి పురుషార్థీ విద్యార్థుల లక్షణాలు ఏమిటి?

జవాబు:-
వారు పాస్ విత్ ఆనర్ గా అవ్వాలని అనగా విజయమాలలోకి రావాలని లక్ష్యము పెట్టుకుంటారు. వారి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటుంది. దేహ సహితముగా దేహము యొక్క అన్ని సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరితోనే ప్రీతిని పెట్టుకుంటారు. ఇటువంటి పురుషార్థులే మాలలోని మణులుగా అవుతారు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఇంద్రజాలికులుగా అయ్యారు, అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలికుడని అంటారు. మనుష్యులను దేవతలుగా తయారుచేసే ఇంద్రజాలికులు ఎవ్వరూ ఉండరు. ఇది ఇంద్రజాలమే కదా. మీరు ఎంత గొప్ప సంపాదన చేయించే మార్గాన్ని తెలియజేస్తారు. స్కూల్లో టీచర్ కూడా సంపాదించడం నేర్పిస్తారు. చదువు సంపాదనే కదా. భక్తి మార్గములోని కథలు, శాస్త్రాలు మొదలైనవాటిని వినడాన్ని చదువు అని అనరు. అందులో ఆదాయమేమీ లేదు, కేవలం ధనము ఖర్చవుతుంది. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గములో చిత్రాలను తయారుచేస్తూ, మందిరాలు మొదలైనవాటిని నిర్మిస్తూ, భక్తిని చేస్తూ-చేస్తూ మీరు ఎంత ధనాన్ని ఖర్చు చేసేసారు. ఎంతైనా టీచర్ అయితే సంపాదన చేయిస్తారు, జీవనోపాధి జరుగుతుంది. పిల్లలైన మీ చదువు ఎంత ఉన్నతమైనది. చదువుకోవడం కూడా అందరూ చదువుకోవాలి. పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. ఆ చదువు ద్వారానైతే బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు, అది కూడా ఒక్క జన్మ కోసం మాత్రమే. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది, అందుకే ఆత్మలైన మీకు శుద్ధమైన నషా ఉండాలి. ఇది గుప్తమైన నషా. ఇది అనంతమైన తండ్రి యొక్క అద్భుతము. ఇది ఎటువంటి ఆత్మిక ఇంద్రజాలము. ఆత్మను స్మృతి చేస్తూ-చేస్తూ సతోప్రధానముగా అవ్వాలి. సన్యాసులు ఒక ఉదాహరణను చెప్తారు కదా - ఒక వ్యక్తికి నేను ఎద్దును... అని అనుకోమని చెప్తే, అలాగే అనుకుంటూ గదిలో కూర్చుండిపోతారు, ఆ తర్వాత నేను ఎద్దును, గది నుండి బయటకు ఎలా రాగలను అని అన్నారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు పవిత్రాత్మలుగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రముగా అయిపోయారు, మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మీరు పవిత్రముగా అవుతారు. ఈ జ్ఞానాన్ని విని నరుని నుండి నారాయణునిగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలది కూడా రాజ్యము ఉంటుంది కదా. పిల్లలైన మీరు ఇప్పుడు శ్రీమతము ఆధారముగా భారత్ లో దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటున్నారు - ఇప్పుడు నేను మీకు ఇచ్చే శ్రీమతము సరైనదా లేక శాస్త్రాలలోని మతము సరైనదా? మీకు మీరే నిర్ణయించుకోండి. సర్వ శాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత అని గీత గురించి విశేషముగా వ్రాయబడింది. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? తప్పకుండా అందరూ నిరాకార శివుడు అని అంటారు. ఆత్మలమైన మనము వారి పిల్లలము, పరస్పరము సోదరులము. వారొక్కరే తండ్రి. తండ్రి అంటారు - మీరందరూ ప్రేయసులు, మీరు ప్రియుడినైన నన్ను స్మృతి చేస్తారు ఎందుకంటే నేనే రాజయోగాన్ని నేర్పించాను, దానితో మీరు ప్రాక్టికల్ గా నరుని నుండి నారాయణునిగా అవుతారు. మేము సత్యనారాయణుని కథను వింటామని వాళ్ళు అంటారు. దీని ద్వారా మనము నరుని నుండి నారాయణునిగా అవుతామని ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి ఆత్మలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. శరీరము లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు. ఆత్మలు నివసించే స్థానాన్ని నిర్వాణధామమని అంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని మాత్రమే స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు ఆత్మకు రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అనే వివేకము లభించింది. కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. తండ్రి పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు మరియు పిల్లలకు మాత్రమే తెలుసు. ఇతర మనుష్యులకైతే తండ్రి గురించే తెలియదు. తండ్రి అంటారు, ఈ డ్రామా తయారుచేయబడి ఉంది. రావణ రాజ్యములో అందరి కర్మలు వికర్మలే అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. అక్కడ పిల్లలు ఉండరా అని ఎవరైనా ప్రశ్నిస్తే, మీరు చెప్పండి - దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు కావున అక్కడకు ఈ పంచ వికారాలు ఎక్కడ నుండి వస్తాయి. ఇది చాలా సింపుల్ విషయము. ఇక్కడ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ఇది రైట్ అని భావిస్తారో, వారు వెంటనే నిలబడిపోతారు. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకపోయినా, వారికి మున్ముందు అర్థమవుతుంది. దీపము వద్దకు దీపపు పురుగులు వస్తాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి. వీరు కూడా దీపము, అందరూ కాలిపోయి సమాప్తమవ్వనున్నారు, అయితే ఇక్కడ దీపమంటూ వేరే ఏదీ లేదని కూడా అర్థం చేయించడం జరిగింది. ఇది సాధారణమైన విషయము. దీపముపై అనేక దీపపు పురుగులు పడి కాలిపోతాయి. దీపావళి రోజున చిన్న-చిన్న దోమలు ఎన్ని వెలువడతాయి మరియు సమాప్తమైపోతాయి. జన్మించడము మరియు మరణించడము. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు - ఈ విధముగా అంతిమములో వచ్చి, జన్మ తీసుకుని, మళ్ళీ మరణించడమంటే, వారు దోమల వలె జన్మ తీసుకున్నట్లు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు కావున పురుషార్థము చేసి పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. మంచి విద్యార్థులు చాలా పురుషార్థము చేస్తారు. ఈ మాల కూడా పాస్ విత్ ఆనర్ గా అయిన వారిదే. ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి. వినాశన కాలములో విపరీత బుద్ధి అని అంటారు. దీని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. మనకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. ఒక్క తండ్రిని తప్ప మనము ఇంకెవ్వరినీ స్మృతి చేయము. తండ్రి అంటారు, దేహ సహితముగా దేహము యొక్క సంబంధాలన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గములో - ఓ దుఃఖహర్త, సుఖకర్త... అని చాలా స్మృతి చేస్తూ వచ్చారు, అంటే తప్పకుండా తండ్రి సుఖాన్ని ఇచ్చేవారే కదా. స్వర్గాన్ని సుఖధామము అనే అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను వచ్చిందే పావనముగా తయారుచేయడానికి. కామ చితిపై కూర్చుని భస్మమైపోయిన పిల్లలెవరైతే ఉన్నారో, నేను వచ్చి వారిపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. పిల్లలైన మీకు యోగము నేర్పిస్తాను - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పరిస్తాన్ కు యజమానులుగా అవుతారు. మీరు కూడా ఇంద్రజాలికులు కదా. ఇది మా సత్యాతి-సత్యమైన ఇంద్రజాలము అని పిల్లలకు నషా ఉండాలి. కొంతమంది చాలా మంచి తెలివైన ఇంద్రజాలికులు ఉంటారు. ఎలాంటి, ఎలాంటి వస్తువులను తీస్తారు. ఈ ఇంద్రజాలము అలౌకికమైనది అనగా దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ శిక్షణ కొత్త ప్రపంచము కోసమే ఉన్నది. దానిని సత్యయుగము, కొత్త ప్రపంచము అని అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఎంత ఉత్తమ పురుషులుగా అవుతారు. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణీలైన మీరు కూడా క్లాసులో కూర్చున్నప్పుడు మీ పని మొట్టమొదట సావధానపరచడం - సోదరీ-సోదరులారా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఆత్మలమైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటాము. 84 జన్మల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ మనుష్యులు 84 జన్మలను తీసుకుంటారు? అందరూ అయితే తీసుకోరు. దీని గురించి కూడా ఎవ్వరికీ ఆలోచన నడవదు. ఏది వింటే అది సత్యము అని అనేస్తారు. హనుమంతుడు పవనుడి నుండి వెలువడ్డారు - ఇది వినగానే సత్యము అని అంటారు. తర్వాత ఇతరులకు కూడా ఇటువంటి విషయాలను వినిపిస్తూ ఉంటారు మరియు సత్యము-సత్యము అని అంటూ ఉంటారు.

ఇప్పుడు పిల్లలైన మీకు రైట్ మరియు రాంగ్ ను అర్థం చేసుకునే జ్ఞాన చక్షువు లభించింది కావున రైట్ కర్మలే చేయాలి. మేము అనంతమైన తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయిస్తారు కూడా. మీరందరూ పురుషార్థము చేయండి. ఆ తండ్రి ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలైన మీకు తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే సంస్కారము ఉంటుంది. సంస్కారాలను తమతోపాటు తీసుకువెళ్తారు. కొందరికి బాల్యములోనే చాలా పేరు వస్తుంది, అప్పుడు వారు ఇంతకుముందు జన్మలో అటువంటి కర్మలేవో చేసారని అనుకుంటారు. కొందరు కాలేజ్ మొదలైనవి నిర్మించినట్లయితే మరుసటి జన్మలో బాగా చదువుకుంటారు. ఇది కర్మల లెక్కాచారము కదా. సత్యయుగములో వికర్మల మాటే ఉండదు. కర్మలైతే తప్పకుండా చేస్తారు. రాజ్యము చేస్తారు, తింటారు, కానీ తప్పుడు కర్మలు చేయరు. దానిని రామ రాజ్యమని అంటారు. ఇక్కడిది రావణ రాజ్యము. ఇప్పుడు మీరు శ్రీమతము ఆధారముగా రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అది కొత్త ప్రపంచము. పాత ప్రపంచముపై దేవతల నీడ పడదు. లక్ష్మి యొక్క జడ చిత్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ చిత్రము యొక్క నీడ పడుతుంది కానీ చైతన్యమైన లక్ష్మి యొక్క నీడ పడదు. అందరూ పునర్జన్మలు తీసుకోవలసిందేనని పిల్లలైన మీకు తెలుసు. బావిలో నుండి నీరు తోడేటప్పుడు చక్రము ఉంటుంది కదా, అది తిరుగుతూనే ఉంటుంది. అలా మీ ఈ చక్రము కూడా తిరుగుతూనే ఉంటుంది. దీని గురించే ఉదాహరణలను అర్థం చేయించడం జరుగుతుంది. పవిత్రత అయితే అన్నింటికన్నా మంచిది. కుమారీ పవిత్రముగా ఉంటారు కావున అందరూ ఆమె పాదాలకు నమస్కరిస్తారు. మీరు ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు. మెజారిటీ కుమారీలదే, అందుకే కుమారీల ద్వారా బాణము వేయించారని గాయనముంది. ఇవి జ్ఞాన బాణాలు. మీరు ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి, సద్గురువు ఒక్కరే. వారు సర్వుల సద్గతిదాత. భగవానువాచ - మన్మనాభవ. ఇది కూడా మంత్రమే కదా, ఇందులోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది గుప్తమైన శ్రమ. ఆత్మయే తమోప్రధానముగా అయ్యింది, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి అర్థం చేయించారు, ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... ఎవరైతే మొట్టమొదట విడిపోయారో, కలుసుకోవడం కూడా వారినే మొట్టమొదట కలుసుకుంటారు, అందుకే తండ్రి - ప్రియమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు అని అంటారు. భక్తిని ఎప్పటినుండి ప్రారంభము చేసారు అనేది తండ్రికి తెలుసు. సగం-సగం ఉంటుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి. పగలు మరియు రాత్రి, 24 గంటలలో కూడా 12 గంటలు పగలు (ఏ.ఎమ్) మరియు 12 గంటలు రాత్రి (పి.ఎమ్) ఉంటాయి. కల్పములో కూడా సగం-సగం ఉంటుంది. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి, మరి కలియుగ ఆయువును ఇంత ఎక్కువగా ఎందుకు చూపించారు? ఇప్పుడు మీరు రైట్-రాంగ్ ను తెలియజేయగలరు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. తర్వాత భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు. వారిని భక్తుల రక్షకుడు అని అంటారు కదా. మున్ముందు మీరు సన్యాసులు మొదలైనవారికి చాలా ప్రేమగా కూర్చుని అర్థం చేయిస్తారు. వారు మీ ఫారమ్ ను నింపరు. వారి తల్లిదండ్రుల పేర్లను వ్రాయరు. కొంతమంది తెలియజేస్తారు. ఎందుకు సన్యసించారు, కారణము చెప్పండి అని బాబా వెళ్ళి అడిగేవారు. వికారాలను సన్యసిస్తారు కావున ఇంటిని కూడా సన్యసిస్తారు. ఇప్పుడు మీరు మొత్తం పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. మీకు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారము చేయించారు. అది నిర్వికారీ ప్రపంచము. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ ను స్థాపన చేసేవారు. వారు పుష్పాలతోటను తయారుచేసేవారు. వారు ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. నంబర్ వన్ ముల్లు - కామ ఖడ్గము. కామాన్ని ఖడ్గమని అంటారు, క్రోధాన్ని భూతమని అంటారు. దేవీ-దేవతలు డబల్ అహింసకులుగా ఉండేవారు. నిర్వికారీ దేవతల ఎదురుగా వికారీ మనుష్యులంతా తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనము ఇక్కడకు చదువుకునేందుకు వచ్చాము. ఇకపోతే ఆ సత్సంగాలు మొదలైనవాటికి వెళ్ళడమనేది సాధారణమైన విషయము. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అంటారు. తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవుతారా? తండ్రి నుండి పిల్లలైన మీకు వారసత్వము లభిస్తుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా, స్వర్గముగా తయారుచేస్తారు. కొందరైతే నరకాన్ని నరకముగా కూడా భావించరు. షావుకార్లు ఏమనుకుంటారంటే - స్వర్గములో ఏముంటుంది, మా వద్దనైతే ధనము, మహళ్ళు, విమానాలు మొదలైనవన్నీ ఉన్నాయి, మా కొరకు ఇదే స్వర్గము, ఎవరైతే మురికివాడలలో ఉంటారో, వారికది నరకము. అందుకే భారత్ ఎంత నిరుపేదగా ఉంది, చరిత్ర మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. తండ్రి మమ్మల్ని మళ్ళీ డబల్ కిరీటధారులుగా చేస్తున్నారని మీకు నషా ఉండాలి. భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలుసుకున్నారు. సత్య, త్రేతాయుగాల కథను బాబా వినిపించారు, మధ్యలో మనము కిందకు పడిపోతాము. వామ మార్గము వికారీ మార్గము. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. అంతేకానీ చక్రాన్ని తిప్పితే దానితో శిరస్సు ఖడించబడుతుందని కాదు. శ్రీకృష్ణుడికి చక్రాన్ని చూపించి, దానితో అసురులను వధించినట్లుగా చూపిస్తారు, అటువంటి విషయమేమీ ఉండదు. బ్రాహ్మణులైన మనము స్వదర్శన చక్రధారులమని మీరు భావిస్తారు. మనకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. అక్కడ దేవతలకు ఈ జ్ఞానముండదు. అక్కడ ఉన్నదే సద్గతి, అందుకే దానిని పగలు అని అంటారు. రాత్రిలోనే కష్టము ఉంటుంది. భక్తిలో దర్శనము కొరకు ఎన్ని హఠయోగాలు మొదలైనవి చేస్తారు. నవ విధ భక్తిని చేసేవారు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమవుతారు, అప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది. డ్రామానుసారముగా అల్పకాలము కొరకు కోరిక పూర్తవుతుంది. అంతేకానీ ఈశ్వరుడేమీ చేయరు. అర్ధకల్పము భక్తి పాత్ర నడుస్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బాబా మమ్మల్ని డబల్ కిరీటధారులుగా చేస్తున్నారని ఈ ఆత్మిక నషాలో ఉండాలి. మనము స్వదర్శన చక్రధారీ బ్రాహ్మణులము. భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని నడుచుకోవాలి.

2. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. తండ్రిని స్మృతి చేసే గుప్తమైన శ్రమను చేయాలి.

వరదానము:-
తమ డబల్ లైట్ స్వరూపము ద్వారా రాబోయే విఘ్నాలను దాటి వేసే తీవ్ర పురుషార్థీ భవ

రాబోయే విఘ్నాలలో అలసిపోయేందుకు మరియు నిరాశపడేందుకు బదులుగా ఒక్క క్షణములో స్వయము యొక్క ఆత్మిక జ్యోతి స్వరూపము మరియు నిమిత్త భావము యొక్క డబల్ లైట్ స్వరూపము ద్వారా క్షణములో హై జంప్ చెయ్యండి. విఘ్నము రూపీ రాయిని పగలగొట్టడములో సమయాన్ని వృధా చేయకండి. జంప్ చెయ్యండి మరియు క్షణములో దాటి వేయండి. కొద్దిపాటి విస్మృతి కారణముగా సహజ మార్గాన్ని కష్టతరము చేసుకోకండి. తమ జీవితము యొక్క భవిష్య శ్రేష్ఠ గమ్యాన్ని స్పష్టముగా చూస్తూ తీవ్ర పురుషార్థీగా అవ్వండి. ఏ దృష్టితోనైతే బాప్ దాదా మరియు విశ్వము మిమ్మల్ని చూస్తూ ఉందో, ఆ శ్రేష్ఠ స్వరూపములోనే సదా స్థితులై ఉండండి.

స్లోగన్:-
సదా సంతోషముగా ఉండటము మరియు సంతోషాన్ని పంచటము - ఇదే అన్నింటికంటే గొప్ప కీర్తి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఇప్పుడు సంగఠిత రూపములో ఒకే ఒక్క శుద్ధ సంకల్పము చెయ్యండి అనగా ఏకరస స్థితిని తయారుచేసుకునే అభ్యాసము చెయ్యండి, అప్పుడే విశ్వములో శక్తి సైన్యము యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని ఆధారముగా తీసుకోండి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర ఆధారాన్ని వదిలి తమ అశరీరి స్వరూపములో స్థితులైపోండి. ఏ విధముగా శరీరాన్ని ధారణ చేసారో అదే విధముగా శరీరము నుండి అతీతమైపోవాలి, ఈ అనుభవమే అంతిమ పరీక్షలో ఫస్ట్ నంబర్ తీసుకునేందుకు ఆధారమవుతుంది.